కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లేఖనాలను చదివి, అన్వయించుట

లేఖనాలను చదివి, అన్వయించుట

పాఠ్యభాగం 25

లేఖనాలను చదివి, అన్వయించుట

1-3. ప్రసంగాలిచ్చేటప్పుడు మనం లేఖనాలను ఎలా చదవాలి?

1 మీరు వేదికనుండిగాని లేక మరెక్కడైనాగాని దేవుని సంకల్పాన్ని గూర్చి యితరులతో మాట్లాడుతున్నప్పుడు, బైబిలు నుండి చదివే లేఖనాలపై మీ చర్చ ఆధారపడి ఉంటుంది. గనుక ఆ లేఖనాలను చక్కగా చదవాలి. ఏదో చేస్తున్నాములే అన్నట్లు దాన్ని చేయకూడదు. బదులుగా, మీరు చదివేతీరు దాని సంకల్పాన్ని నెరవేర్చవలసివస్తే అది మీ ప్రసంగానికి మరింత పురికొల్పును తేవాలి. ఈ కారణము చేతనే, సమర్థవంతమైన పరిచారకులు కాదలచిన ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధనివ్వవలసిన అంశముగా “లేఖనములను నొక్కి చదువుట” అన్న విషయాన్ని ప్రసంగ సలహా పత్రం పేర్కొంటుంది.

2 లేఖనాలను భావగర్భితంగా చదవాలి, కాని దాన్ని అతిగా చేయకూడదు. బావ ప్రకటనను ఎంతగా చేయాలనేది లేఖనంపైనా, ప్రసంగంలో దాని స్థానంపైనా ఆధారపడి వుంటుంది. అది చర్చను ఔన్నత్య స్థాయికి తీసుకొని రావాలి, కాని చదివేతీరును ఆకర్షించేదిగా వుండకూడదు.

3 అంతేకాకుండా, మీరు చదివేతీరు మీ చర్చను బలపర్చే లేఖన భాగాన్ని సూటిగా చూపించేదైయుండాలి. ప్రేక్షకులను ఒప్పించేరీతిలో అది అంశాన్ని స్థిరపర్చాలి. ఆ విధంగా, సరియైన రీతిలో నొక్కిచదవడం మనోనిశ్చయతను కల్గిస్తుంది. అధికారపూర్వకంగా చదివేటట్లు చేస్తుంది.

4, 5. “సరియైన మాటలను నొక్కి పల్కుట” అంటే ఏమిటి? ఉదహరించండి.

4 సరియైన మాటలను నొక్కి పల్కుట. లేఖనాన్ని చదివే కారణాన్నిబట్టి దేనిని నొక్కి పల్కాలనే విషయం నిర్ణయింపబడాలి. లేఖనంలోని ప్రతి అంశాన్ని సరిసమానంగా ఉన్నతపరిస్తే, ఏదీ స్పష్టంగా ఉండదు, మీరు దేనిని గూర్చి తర్కిస్తున్నారో తెలియదు. గనుక మీరు నొక్కితెల్పదలచిన మాటలు మీరుపయోగిస్తున్న లేఖన అంశాన్ని అందజేస్తున్నవో లేదో నిశ్చయపర్చుకొనండి.

5 ఉదాహరణకు, పాపం మరణానికేగాని నిత్యబాధకు నడిపించదని నిరూపించడానికి మీరు యెహెజ్కేలు 18:4 ను ఉపయోగిస్తున్నట్లైతే, ఈవిధంగా చదవవచ్చు: “పాపము చేయు ఆత్మ (NW) మరణించును,” అని ఇటాలిక్స్‌లో ఉన్న మాటలను నొక్కిపల్కాలి. అయితే చనిపోయేది శరీరమే కాదు, అసలు ఆత్మే చనిపోతుందని మీరు నిరూపిస్తున్నట్లైతే, యిలా నొక్కి చదవాలి: “పాపము చేయు ఆత్మ మరణించును.” మీరా లేఖనాన్ని ఎందుకు చదువుతున్నారనే దాన్నిబట్టి దేనిని నొక్కిచెప్పాలనే విషయాన్ని నిర్ణయించాలి.

6-12. లేఖనములోని తలంపును అందజేసే మాటలను ఏయే విధాలుగా మనం నొక్కి పలుకవచ్చు?

6 నొక్కి తెల్పే ఉపయుక్తమైన పద్ధతి వాడబడింది. మీరు ఉన్నతపరచగోరిన ఉద్దేశాన్ని బయలు పరిచే మాటలను అనేక విధాలుగా నొక్కితెల్పవచ్చు, మరి మీరు ఉపయోగించే పద్ధతి లేఖనానికి, ప్రసంగ కూర్పునకు సరిపడునట్లు వుండాలి.

7 “లేఖనములను నొక్కి చదువుట” అనే ఈ లక్షణం సాధ్యమైనంతమేరకు గొంతు చించుకొని మాట్లాడమని చెప్పడం లేదు. భావాన్ని నొక్కి చెప్పుటను గూర్చి మీరు చదివేటప్పుడు ఈ వివరాలను మరింతగా నేర్చుకుంటారు. అయితే మీకున్న లేఖన భాగాలను సమర్థనీయంగా చదివే సామర్థ్యాన్ని పెంపొందించు కొనడానికి సహాయపడే కొన్ని పద్ధతులు ఇక్కడ యివ్వబడ్డాయి.

8 స్వరాన్ని నొక్కిపలుకుట. వాక్యభాగములో ఉద్దేశాన్ని బయలుపర్చే మాటలను మిగతా వాటికన్నా వ్యత్యాసంగా ఉండే విధంగా చేసేట్లు స్వర స్థాయి, వేగం, లేదా శక్తిలో మార్పు చేయడం యిందులో యిమిడివుంది.

9 వ్యవధి. మీ లేఖనములోని ముఖ్యభాగాన్ని చదువక ముందుగాని, చదివిన తరువాతగాని లేదా రెండు చోట్లకూడా దీనిని చేయవచ్చు. ఒక ప్రాముఖ్యమైన సంగతిని చదువక ముందు వ్యవధినిస్తే దానికొరకు ఎదురుచూచేటట్లు చేస్తుంది; చదివిన తరువాత యిచ్చే వ్యవధి తలంపు లోతుగా నాటుకొనేటట్లు చేస్తుంది.

10 పునరుచ్ఛారణ. ఒక నిర్దిష్ట విషయాన్ని నొక్కిచెప్పడానికి, మీరు ఒక క్షణం ఆగి ఆ మాటను లేదా పదభాగాన్ని మరలా చదువవచ్చు. దీనిని వివేకంగా చేయాలి.

11 అభినయాలు. ఒక మాట లేదా పదము వద్ద విరామమివ్వడానికి శరీర కదలిక, ముఖకవళిక తరచు సహాయపడగలవు.

12 స్వరము. పదాలు చదవబడేతీరు వాటి భావాన్ని తెల్పి, వాటిని ప్రత్యేకపర్చగలవు, అయితే, ఇక్కడ కూడా వివేకంగా వ్యవహరించాలి, ముఖ్యంగా పరిహాసపు మాటలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి.

13, 14. గృహస్థుడు లేఖనాన్ని చదివినప్పుడు అందలి కీలకమైన విషయాలను మనమెలా నొక్కి చెప్పగలము?

13 గృహస్థుడు చదివే లేఖనాలు. గృహస్థుడు ఒక లేఖనాన్ని చదివేటప్పుడు వేరే పదాలను నొక్కి చదువవచ్చు లేదా అసలు వేటినీ నొక్కి చదువక పోవచ్చు. అప్పుడు మీరేమి చేయవచ్చు? అలాంటి పరిస్థితిలో సాధారణంగా మీరు నొక్కితెల్పదలచిన విషయాలను ఉన్నతపర్చడానికి ఆ లేఖనాన్ని అన్వయించడానికి ప్రయత్నించడం మంచిది. అతడు చదవడం ముగించిన తరువాత, ఈ మాటలను మరలా ప్రస్తావించి లేదా ప్రశ్నలను అడిగి గృహస్థుని అవధానాన్ని రాబట్టవచ్చును.

14 దీనిని చేపట్టే మార్గం మరొకటుంది, అందుకు మెలకువ, వివేకం కావాలి. అతడు చదువుతుండగా సరియైన అంశంవద్ద ఆపి, అలా చేసినందుకు క్షమాపణ అడిగి, మీరు ఉన్నతపర్చదలచిన పదం లేదా వాక్యభాగానికి అవధానాన్ని మళ్లించండి. గృహస్థునికి ఇబ్బంది కల్గించకుండా లేదా కోపం పుట్టించకుండా దీన్ని చేయగల్గితే ఫలభరితంగా ఉంటుంది, అయితే అలా తరచుగా చేయకూడదు.

**********

15-17. లేఖన అన్వయింపును స్పష్టం చేయుట ఎందుకు ప్రాముఖ్యం?

15 మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సాధారణంగా లేఖనాన్ని చదివినా, నొక్కి చదివినా సరిపోదు. నిజమే, మీరు చర్చించదలచిన విషయాన్ని అన్వయించేందుకు అది అప్పుడప్పుడు ఉపయోగపడవచ్చు. కాని, ఎక్కువ భాగం లేఖనంలో ఉద్దేశాన్ని బలపరుస్తున్న మాటలకు అవధానాన్ని మళ్లించి, అవి చర్చకు ఎలా అన్వయించబడతాయో చూపడం అవసరం. దీనినే ప్రసంగ సలహా పత్రం “లేఖనముల అన్వయింపును స్పష్టపరచుట” అని పేర్కొంటుంది. సగటు వ్యక్తికి బైబిలుతో పరిచయం లేదని, ఒక్కసారి చదివినంత మాత్రాన అతడు మీ ఉద్దేశాన్ని గ్రహింపజాలడని జ్ఞాపకముంచుకొనండి. కీలకమైన మాటలను మరోసారి స్పష్టంచేసి, అన్వయిస్తే ఆ ఉద్దేశాలు లోతుగా నాటుకుంటాయి.

16 ఒక లేఖనాన్ని అన్వయించడం మీకు సాధ్యమయ్యేటట్లుంటే, అది మీ చర్చకు సరిపడేదైయుండాలి, సరియైన విధంగా పరిచయం చేయాలి. పిమ్మట, బోధించాలని మనస్సునందుంచుకొని, మీ అన్వయింపును సాధ్యమైనంత సరళంగా చేయగోరతారు.

17 అంతేకాకుండా, లేఖనాన్ని గూర్చిన స్పష్టమైన అవగాహన మీకుండాలి, మీ అన్వయింపు సరియైనదిగా వుండాలి. మీరా లేఖనాన్ని వుపయోగించే సందర్భంలో ఒకవేళ అవసరమైతే దాని సందర్భాన్ని, అందులో ఇమిడియున్న సూత్రాలను లేదా అందలి వ్యక్తులను పరిగణలోనికి తీసుకోండి. గ్రంథకర్త ఉద్దేశించిన దానికి అతీతంగా లేఖనాన్ని ఎన్నడు వుపయోగించకండి. అన్వయింపు కొరకు సొసైటీ ప్రచురణలపై ఆధారపడండి.

18. అన్వయించవలసిన కీలకమైన పదములను ఫలభరితంగా ఎలా ప్రత్యేక పరచవచ్చు?

18 అన్వయించవలసిన మాటలను ప్రత్యేకించాలి. లేఖనాన్ని అన్వయించే ముందుగాని, అన్వయించేటప్పుడుగాని సాధారణంగా కీలకమైన పదాలను తిరిగి ఉన్నతపర్చాల్సి వుంటుంది. లేఖనంలో మీ చర్చకు సంబంధంలేనిదంతా అంత అవశ్యమైనది కాదని లేదా ప్రాధాన్యత లేనిదని నిర్ధారించుకొనేందుకే యిలా చేయాలి. ఇలా చేయడానికి సాధారణంగా లేఖనంలోని మాటలనే తిరిగి ఉచ్ఛరిస్తున్నా, నిజానికి అలా చేయాల్సిన పనిలేదు. కాని కొన్ని సందర్భాలలో, చర్చించబడుతున్న వివిధ అంశాలపై మీ ప్రేక్షకుల అవధానాన్ని మరోరీతిలో సమర్థనీయంగా మళ్లించవచ్చు. మీరు దీన్ని చేయగల్గే ఒక మార్గమేమంటే, మీ ఉద్దేశాన్ని తిరిగి పేర్కొనేటప్పుడు పర్యాయ పదాలను వుపయోగించడమే. మరొకటేమంటే ప్రశ్నలు అడగడం. మీరొక గృహస్థునికే చెబుతూవుంటే, మీ ప్రశ్నలు ఆ వ్యక్తి నుండి కీలకమైన ఉద్దేశాలను రాబట్టే విధంగా ఉండాలి.

19-22. “ఉపోద్ఘాత అంశాన్ని మనస్సులో నాటుట” అనే దానిలో ఏమి చేయాలని పేర్కొనబడింది?

19 ఉపోద్ఘాత అంశాన్ని మనస్సులో నాటుట. అంటే లేఖనాన్ని ఉపయోగించుటలో మీకున్న ఉద్దేశాన్ని ప్రేక్షకులు స్పష్టంగా గ్రహించి, ప్రశంసించారా లేదాయని రూఢిపర్చుకొనడమే దాని అసలైన భావం. ఏదొక కారణంచేత లేఖనానికి ఉపోద్ఘాతం అవసరంలేదని లేదా కోరదగినది కాదని మీరు తలంచియుండవచ్చు. అలాగని లేఖన భావాన్ని మనస్సులో నాటవలసిన పనిలేదని కాదు. అయితే, లేఖనాన్ని చదువకముందు మీరు చేయాల్సిన చర్చను గూర్చి ఎంతోకొంత ముందుగానే కచ్చితంగా సిద్ధపడి వుంటారు. ఆ లేఖనాన్ని వుపయోగించుటలోని ఉద్దేశాన్ని కొంతమేరకు మీరిప్పుడు పూర్తిచేయాల్సి ఉంటుంది.

20 అన్వయింపును ఎంతమేరకు చేయాలనే దాన్ని మీ ప్రేక్షకులు, ప్రసంగమంతటిలో ఆ అంశానికున్న ప్రాముఖ్యత నిర్ణయించును. ఆ లేఖనాన్ని కేవలం చర్చిస్తే సరిపోదు. లేఖనంలో ఉన్నతపర్చబడిన ఉద్దేశాలను మీ ఉపోద్ఘాత చర్చకు సంబంధం కలపాలి. ఆ సంబంధమేమిటో కూడా మీరు స్పష్టంగా పేర్కోవాలి.

21 మీ అన్వయింపు సరళంగావుంటూ అది మీ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగితే, అది చక్కని ఫలితాన్నిస్తుంది. అందులో అనవసరమైన వివరాలు ఉండకూడదు. మీ చర్చను సాధ్యమైనంతమట్టుకు కొన్ని వాస్తవాలకే పరిమితం చేసి, వారు గ్రహించడానికి ఏమి అవసరమో దానినే అందులో చేర్చుట మూలంగా దీనిని సాధించవచ్చు. ఉపోద్ఘాతంలో ఏ ప్రశ్ననైనా సమాధానమివ్వకుండా విడిచివుంటే, యిప్పుడు మీ అన్వయింపు దానికి సమాధానమివ్వాలి.

22 ప్రసంగ శిక్షణా కార్యక్రమమందు అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో సరళత, సూటిగా మాట్లాడుట మీ గురియైయుండాలి. మీరు దాన్ని సాధించినప్పుడు, లేఖనాలను చదివి, అన్వయించుటలో నైపుణ్యంగల బోధకునిగా మీకున్న సామర్థ్యాన్ని అది ప్రతిబింబిస్తుంది.

[అధ్యయన ప్రశ్నలు]