కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విషయాంశాన్ని, ముఖ్యాంశాలను ఉన్నతపరచుట

విషయాంశాన్ని, ముఖ్యాంశాలను ఉన్నతపరచుట

పాఠ్యభాగం 27

విషయాంశాన్ని, ముఖ్యాంశాలను ఉన్నతపరచుట

1-4. ప్రసంగ విషయాంశమంటే ఏమిటో వివరించండి.

1 ప్రతి ప్రసంగము ఒక పంథాలో పయనించడానికి, అందలి భాగాలన్నింటిని చక్కగా అనుసంధానం చేయడానికి ఒక విషయాంశముండాలి. మీ విషయాంశం ఏమైయున్నను, ప్రసంగమంతటిలో దానికి ప్రవేశముండాలి. అదే మీ ప్రసంగ సారాంశము; దానిని ఒక వాక్యంలో వ్యక్తపర్చవచ్చును, అయితే ప్రసంగమందున్న ప్రతి ఆకృతి దానిలో యిమిడియుండాలి. విషయాంశం ప్రేక్షకులలో ప్రతిఒక్కరికి స్పష్టంకావాలి, మరి దానిని సరియైన రీతిలో నొక్కిచెబితే అది నిశ్చయంగా నెరవేరుతుంది.

2 ప్రసంగ విషయాంశమంటే “విశ్వాసము” వంటి విశాల భావమున్న పాఠ్యాంశం కాదు; పాఠ్యాంశం చర్చించబడే ఒక నిర్దిష్టమైన విషయం. ఉదాహరణకు, విషయాంశం “మీ విశ్వాసము—అది ఎంతమేరకు వెళ్తుంది?” లేదా “దేవున్ని ప్రీతిపర్చడానికి విశ్వాసం అవసరం” అని లేదా “మీ విశ్వాసము యొక్క పునాది” లేదా “విశ్వాసమందు ఎదుగుతూ ఉండండి” అని వుండవచ్చు. ఈ విషయాంశాలన్నీ విశ్వాసంపైనే కేంద్రీకృతమైనా, వాటిలో ప్రతిఒక్కటి పాఠ్యాంశాన్ని వివిధరీతులలో దృష్టిస్తాయి, మరి పూర్తిగా వ్యత్యాసమున్న వర్ణన వాటికి అవసరము.

3 కొన్నిసార్లు మీరు మీ విషయాంశాన్ని ఎంచుకొనకముందు సమాచారాన్ని కూడబెట్ట వలసివుంటుంది. అయితే ప్రసంగ సంక్షిప్తప్రతిని సిద్ధంచేయక ముందు లేదా ముఖ్యాంశాలను ఎన్నుకొనకముందే విషయాంశాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు, గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించిన ప్రతిసారి యెహోవాసాక్షుల సంస్థను గూర్చి చర్చించాలని మీరనుకోవచ్చు. అది చాలా పెద్ద విషయం. ఈ అంశాన్ని గూర్చి మీరేమి చెప్పాలో నిర్ణయించడానికి, మీ ప్రేక్షకులను, ప్రసంగ ఉద్దేశాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. దీని ఆధారంగా మీరు ఒక విషయాంశాన్ని ఎన్నుకుంటారు. ఒక క్రొత్త వ్యక్తిని మొదటిసారిగా సేవకు తీసుకువెళ్లాలని మీరు ప్రయత్నిస్తుంటే, ఇంటింట ప్రచారం చేయుటలో యెహోవాసాక్షులు యేసుక్రీస్తును అనుకరిస్తున్నట్లు చూపించాలని మీరు తీర్మానించుకొని యుండవచ్చు. అదే మీ విషయాంశం అవుతుంది. మీరు చెప్పేప్రతీది యెహోవాసాక్షులు అనే పెద్ద అంశాన్ని వివరించేదై యుంటుంది.

4 మీ ప్రసంగంలో విషయాంశాన్ని ఎలా నొక్కిచెప్పగలరు? మొదటిగా, మీ ఉద్దేశానికి సరిపడే ఒక సరియైన విషయాంశాన్ని మీరు ఎన్నుకోవాలి. దీనికి ముందుగా సిద్ధపడుట అవసరం. విషయాంశాన్ని ఎన్నుకున్న తరువాత దానిమీద ప్రసంగాన్ని వృద్ధిచేసి, మీరు సిద్ధపడిన సంక్షిప్త ప్రతి ఆధారంగా ప్రసంగిస్తే విషయాంశం దానంతటదే నొక్కితెల్పబడుతుంది. అయితే, ప్రసంగించేటప్పుడు, కీలకమైన మాటలను లేదా విషయాంశమందలి ముఖ్య తలంపును అప్పుడప్పుడు పునరుచ్చరించడం విషయాంశం జ్ఞాపకముండేలా చేస్తుంది.

5, 6. విషయాంశం సరియైనదా కాదా అని మీరెలా నిర్ణయిస్తారు?

5 తగిన విషయాంశము. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలనందు తగిన విషయాంశాన్ని కలిగియుండడం అంత సమస్యకాదు, ఎందుకంటే అనేక సందర్భాలలో మీకొక విషయాంశం యివ్వబడుతూ ఉంటుంది. కాని మిమ్మల్ని ప్రసంగించమని అడిగిన ప్రతి ప్రసంగానికి విషయాంశం ఉండకపోవచ్చు. గనుక విషయాంశానికి తగిన అవధానమివ్వడం జ్ఞానయుక్తము.

6 విషయాంశం సరియైనదో కాదో ఏది నిర్ణయిస్తుంది? అనేక విషయాలున్నాయి. మీ ప్రేక్షకులను, మీ ఉద్దేశాన్ని, ఒకవేళ మీకు కొంత సమాచారాన్నిచ్చి దానిమీద ప్రసంగించమంటే దానిని పరిగణలోనికి తీసుకోవాలి. విషయాంశం నొక్కితెల్పబడని ప్రసంగాలను మీరిస్తున్నట్లు మీకు అనిపిస్తుంటే, బహుశ మీరు ఏ ముఖ్యమైన తలంపుమీదా ప్రసంగించడం లేదన్నమాట. మీరు మీ ప్రసంగములో విషయాంశానికి ఏమాత్రం దోహదపడని అనేక విషయాలను ప్రస్తావిస్తుండవచ్చును.

7, 8. విషయాంశాన్ని ఉన్నతపర్చే మార్గాలను చూపండి.

7 విషయాంశపు మాటలు లేక తలంపు పునరుక్తించబడింది. ప్రసంగమందలి అన్నిభాగాలు విషయాంశాన్ని ఉన్నతపర్చగల్గే ఒక మార్గమేమంటే విషయాంశమందు పేర్కొన్న కీలకమైన మాటలను పునరుక్తించుట లేదా విషయాంశ ముఖ్య తలంపును పునరుక్తించుటే. సంగీతంలో, రచననంతటిని తరచూ వర్ణించడానికి పదేపదే పలికించే స్వరమాధుర్యమే విషయాంశం. నిజానికి, దాని సంఖ్యను గుర్తుపట్టడానికి కొన్ని లయలు సరిపోతాయి. స్వరమాధుర్యం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు శ్రావ్యగీత పదాలు కేవలం ఒకటి లేక రెండు రావచ్చు, అప్పుడప్పుడు విషయాంశముపై హెచ్చుతగ్గులు వాడబడతాయి, ఎలాగైతేనేమి సంగీతాన్ని కూర్చేవాడు దానినంతటిని రక్తికట్టించేందుకు స్వరమాధుర్యాన్ని నేర్పరితనంతో కూర్పుచేస్తాడు.

8 ప్రసంగ విషయాంశం కూడా అలాగే వుండాలి. కీలకమైన మాటలు లేదా విషయాంశపు తలంపు అనేది సంగీతంలో పదేపదే ఉపయోగించబడు శ్రావ్యగీతం వంటింది. ఈ మాటల పర్యాయపదాలు లేదా మరోరీతిగా పదకూర్పు చేసిన ముఖ్యాంశం, విషయాంశం వైవిధ్యంగా ఉండేటట్లు చేస్తాయి. ఇలా ఒకేరీతిగా ఉండకుండునట్లు వాటిని వివేకంగా ప్రయోగిస్తే, అప్పుడు విషయాంశం ప్రసంగమంతటి భావాన్ని వ్యక్తపర్చేదిగా చేస్తుంది, మీ ప్రేక్షకులు జ్ఞాపకముంచుకోబోయే ముఖ్యాంశం అదే.

**********

9-13. ప్రసంగములో ముఖ్యాంశాలంటే ఏమిటో వివరించండి.

9 ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు దాని విషయాంశాన్ని నిర్ణయించుకున్న అనంతరం ఇక దానిని వృద్ధిచేయడానికి మీరు వుపయోగించదలచిన ముఖ్యమైన అంశాలను ఎన్నుకోవడమే మీ సిద్ధపాటులో తరువాతి భాగం. ఇదే మీ ప్రసంగ సలహా పత్రంపై “ముఖ్యాంశాలను ఉన్నతపరచుట” అని పేర్కొనబడింది.

10 ప్రసంగంలో ముఖ్యాంశాలేమిటి? అవి కేవలం ఆసక్తిని కల్గించే తలంపులు లేదా మధ్యమధ్యలో క్లుప్తంగా పేర్కొనే విషయాలుకాదు. అవి ప్రసంగానికి ప్రధాన భాగాలు, ఒకే నిడివిలో వివరించబడే తలంపులు. ఒక కిరాణా షాపులో ఏ అరలో ఏమివుందో ఒకడు తెలుసుకొనేందుకు సహాయపడే అరలపై వ్రాసిన పేర్లు లేదా సూచనల వంటివే అవి, ఆ విభాగంలో ఏమి పెట్టవచ్చునో వేటిని తీసివేయవలెనో అవి చూపిస్తాయి. పప్పుదినుసులు అని వ్రాసివున్నచోట జామ్‌లు, జెల్లీలు ఉండవు, ఒకవేళ వుంటే అవి ప్రజలకు యిబ్బందిని కలిగిస్తాయి. కాఫీ, టీ అని వ్రాసివున్నచోట బియ్యం వుండవు. క్రిక్కిరిసి వున్నందున లేదా ఎక్కువగా పేర్చినందున అరలపైనున్న పేర్లు కనబడకపోతే, దేన్ని కనుగొందామన్నా కష్టంగానే వుంటుంది. అయితే, పేర్లు స్పష్టంగా కనబడుతుంటే, తన ముందున్నదేమిటో ఒక వ్యక్తి వెంటనే గుర్తుపట్టగలడు. మీ ప్రసంగ ముఖ్యాంశాల విషయములోను అంతే. మీ ప్రేక్షకులు వాటిని గ్రహించగల్గి, మనస్సునందుంచు కొనగల్గుతుంటే, మీరు ముగింపుకు వచ్చేలోగా వారు వ్రాసుకొనవలసిన విషయాలు కొన్నేవుంటాయి.

11 మరొక విషయము. ప్రేక్షకులనుబట్టి, ప్రసంగ ఉద్దేశాన్నిబట్టి ముఖ్యాంశాల ఎంపిక, వాటి వుపయోగం మారుతూ వుంటుంది. ఈ కారణంచేత, విద్యార్థి ముఖ్యాంశాలను వుపయోగించిన తీరునుబట్టి విద్యార్థి ఎంచుకొన్న ముఖ్యాంశాలను పాఠశాల అధ్యక్షుడు విశ్లేషించాలేగాని, సలహాదారుడు తాను ముందుగానే నిర్హేతుకంగా ఎంచుకున్న అంశాలనుబట్టి కాదు.

12 మీరు ఎంపిక చేసుకొనేటప్పుడు ప్రాముఖ్యమైన వాటిని ఎంచుకోండి. మరి ఒక అంశాన్ని ఏది ప్రాముఖ్యమైనదానిగా చేస్తుంది? అని ప్రశ్నించుకోండి. ఆ అంశాన్ని ప్రస్తావించకుండా మీ ప్రసంగ సంకల్పాన్ని మీరు నెరవేర్చలేకపోతే, అది ప్రాముఖ్యమైన అంశమే. ఉదాహరణకు, విమోచనను గూర్చి ఆ సిద్ధాంతాన్ని ఎరుగని వ్యక్తితో మీరు చర్చిస్తున్నట్లైతే, యేసు మానవునిగా భూమి మీద జీవించిన విషయాన్ని రుజువుపర్చడం అవసరం, లేకపోతే ఆయన త్యాగనిరతిని వివరించడం సాధ్యం కాదు. కావున చర్చించవలసిన ముఖ్యాంశాలలో దీనినొక దానిగా మీరు పరిగణించవచ్చును. అయితే త్రిత్వ సిద్ధాంతం అబద్ధమని మీరు ఈ వ్యక్తికి అప్పటికే నిరూపించియుంటే, యేసు మానవునిగా జీవించాడని మీరు చర్చించడం అంత ప్రాముఖ్యమేమీ కాదు, ఎందుకంటే అది అప్పటికే అంగీకరించబడింది. అందునుబట్టి యేసు అర్పించిన విమోచన విలువను గూర్చి చర్చించడం చాలా సులభమౌతుంది. అలాంటప్పుడు యేసు మానవ జీవితాన్ని గూర్చి చర్చించడం ప్రాముఖ్యం కాదు.

13 గనుక యిలా ప్రశ్నించుకోండి, నా ప్రేక్షకులకు ఏమి తెలుసు? నా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను ఏమి చెప్పాలి? మొదటి ప్రశ్నకు మీకు సమాధానం తెలిసుంటే, వారు ఎరిగియున్న విషయాలన్నింటిని తాత్కాలికంగా ప్రక్కకుపెట్టి, మిగిలిన విషయాలన్నింటిని సాధ్యమైనంత తక్కువ భాగాలుగా విభజించి సమాచారాన్ని సేకరించి ఆ రెండవ దానికి సమాధానమివ్వవచ్చు. ప్రేక్షకులకు మీరు ఎటువంటి ఆత్మీయాహారాన్ని అందిస్తున్నారనే దానికి ఈ విభాగాలన్నీ సూచనార్థక గురుతులుగా ఉంటాయి. ఈ పేర్లు లేదా ముఖ్యాంశాలను ఎన్నడూ కప్పివేయకూడదు లేదా దాచకూడదు. అవి మీరు స్పష్టంగా చూపించాల్సిన ముఖ్యాంశాలు.

14-17. అనేక ముఖ్యాంశాలను మనమెందుకు కలిగియుండకూడదో కారణాలను పేర్కొనండి.

14 ముఖ్యాంశాలు అధికంగా ఉండకూడదు. ఏ అంశానికైనా కొన్ని ముఖ్యాంశాలే వుంటాయి. అనేక సందర్భాల్లో వాటిని వ్రేళ్లమీద లెక్కించవచ్చు. వాటిని అందించడానికి మీకివ్వబడిన సమయం ఎంత ఉన్నప్పటికిని అది వాస్తవమే. అనేకమైన ముఖ్యాంశాలను చూపించడానికి ప్రయత్నించకండి. కిరాణా కొట్టు మరీ పెద్దదైపోతే, అనేక విభాగాలుంటే ఏది ఎక్కడుందో చూపించమని ఒకడు అడగవలసి వస్తుంది. మీ ప్రేక్షకులు ఒక్కసారిగా వివిధ తలంపులను మాత్రమే గ్రహించగల్గుతారు. మీ ప్రసంగం ఎంత పెద్దదైతే, అంత సూక్ష్మంగా దానిని తయారు చేయాలి, మరి మీరు ఉపయోగించే కీలకాంశాలు పటిష్ఠంగా మరింత పదునైన వర్ణనగలవిగా వుండాలి. మీ ప్రేక్షకులు అనేక విషయాలను జ్ఞాపకముంచుకొనేలా చేయడానికి ప్రయత్నించకండి. వారు కచ్చితంగా జ్ఞాపకముంచుకోవాలని మీరు భావించే విషయాలనే ఎంపిక చేసుకోండి, అటుపిమ్మట వాటిని ప్రస్తావించడానికే మీ సమయాన్నంతటిని వెచ్చించండి.

15 అంశాలు మరీ ఎక్కువగా ఉన్నాయా లేదా అని ఏది నిర్ణయిస్తుంది? ఒక్కమాటలో చెప్పాలంటే, ఏదైనా ఒక అంశం విడిచి పెట్టబడినప్పటికి ప్రసంగ ఉద్దేశం నెరవేర్చబడగల్గితే, అది ముఖ్యాంశం కాదన్నమాట. ప్రసంగాన్ని ముగించడానికి ఈ అంశాన్ని సంబంధం కలిపే దానిగా లేదా జ్ఞప్తికితెచ్చే దానిగా చేర్చడానికి మీరు నిర్ణయించుకొనవచ్చు, కాని విడిచిపెట్టకూడని వాటిని పేర్కొన్నంత ప్రాముఖ్యంగా దానిని ప్రస్తావించకూడదు.

16 మరో విషయమేమంటే, ప్రతి అంశాన్ని విజయవంతంగా, తేల్చిచెప్పేందుకు మీకు తగినంత సమయం వుండాలి. తక్కువ సమయంలో ఎక్కువ చెప్పాల్సివస్తే, సాధ్యమైనంతమట్టుకు ప్రేక్షకులకు ఆ విషయాలు బోధపడేలా చేయండి. పరిచయంలేని విషయాలను ప్రేక్షకులు మరువలేనంతగా వాటిని స్పష్టం చేసి, మిగతావాటన్నింటిని తొలగించండి.

17 చివరిగా, మీ ప్రసంగం సరళంగా ఉన్నదనే భావన కలగాలి. ఎంత సమాచారం అందించబడిందనే దానిపైనే ఇది ఎల్లప్పుడు ఆధారపడదు. బహుశ మీ అంశాలన్నీ సమీకరించబడినట్లుగా వుండవచ్చు. ఉదాహరణకు, వస్తువులన్నీ నేలమీద గది మధ్యలో కుప్పగా పోయబడిన దుకాణములోనికి మీరు వెళ్తే, చూడటానికి అవన్నీ గందరగోళంగా ఉంటాయి. ఏది ఎక్కడుందో కనుక్కోవాలంటే మీకు కష్టంగానే వుంటుంది. అయితే, ప్రతిదానిని చక్కగా అమర్చి, సంబంధిత వస్తువులన్నింటిని ఒక చోటపేర్చి, ఒక్కోభాగానికి పేరు వ్రాసిపెడితే చూడటానికి అందంగా వుంటుంది మరి ఏ వస్తువునైనా సులభంగా కనుక్కోవచ్చు. కేవలం కొన్ని ప్రధాన అంశాలను మాత్రమే చేర్చి మీ ఉద్దేశాలన్నింటిని సమకూర్చి మీ ప్రసంగాన్ని సులభతరం చేయండి.

18. ముఖ్యాంశాలను ఎలా వివరించవచ్చు?

18 ప్రధాన తలంపులు ప్రత్యేకంగా వివరించబడ్డాయి. ప్రతి ముఖ్య ఉద్దేశం ప్రత్యేకంగా కన్పించాలి. ప్రతి దానిని వేరువేరుగా వివరించాలి. ఇందుమూలంగా మీ ప్రసంగ ఉపోద్ఘాతంలో లేదా ముగింపులో ప్రధాన శీర్షికల సారాంశాన్ని చెప్పకుండా ఆపదు లేదా వాటిని క్లుప్తంగా పేర్కొనకుండా అది నిరోధించదు. అయితే, అలాంటి ముందు వెనుక ప్రస్తావనలను అవసరమైతే వాటిని కలపడానికి లేదా నొక్కిచెప్పడానికి మాత్రమే అనుమతిస్తూ, ప్రసంగం మధ్యలో ఒక్కొక్క ప్రధాన తలంపును ఒక్కొక్కసారి మాత్రమే మీరు ప్రస్తావించాలి. ప్రధాన అంశాలు ప్రత్యేకంగా వివరించబడ్డాయా లేదా అని నిర్ణయించుకొనేందుకు విషయ పట్టికను తయారుచేయడానికి నేర్చుకొనుటవల్ల అది మీకెంతో తోడ్పడగలదు.

19-21. స్వల్పాంశాలను ఎలా యిమడ్చవచ్చును?

19 స్వల్పాంశాలు ప్రధానాంశాలపై కేంద్రీకృతమౌతాయి. నిదర్శనాధారాలు, లేఖనాలు, లేదా అందించబడిన మరే యితర సమాచారమైనా ప్రధానాంశంపై అవధానాన్ని నిల్పి, దానిని ఉన్నతపర్చాలి.

20 సిద్ధపడేటప్పుడు అంత ప్రాధాన్యతలేని విషయాలన్నింటిని విశ్లేషించి ప్రధాన అంశాన్ని స్పష్టీకరించేందుకు, నిరూపించేందుకు లేదా ఉన్నతపర్చేందుకు సూటిగా దోహదపడే వాటినే అందులో చేర్చండి. సంబంధంలేని దేనినైనా విడిచిపెట్టండి. సంబంధం లేనిది సంక్షోభంలో పడవేస్తుంది.

21 ప్రధాన అంశానికి సంబంధమున్న ఏ విషయమైనా మీరు చెప్పే తీరునుబట్టి ఆ ఉద్దేశానికి నేరుగా సంబంధం కలపాలి. అన్వయించడానికి దానిని ప్రేక్షకులకు విడిచిపెట్టకండి. వాటికున్న సంబంధాన్ని స్పష్టీకరించండి. ఆ సంబంధమేమిటో తెలియజేయండి. చెప్పని విషయం సాధారణంగా అర్థంకాదు. ప్రధాన అంశాన్ని వ్యక్తపర్చే కీలకమైన మాటలను మరలా పేర్కొనడం లేదా ప్రధాన అంశము యొక్క ఉద్దేశాన్ని అప్పుడప్పుడు పేర్కొనడం మూలంగా దీనిని చేయవచ్చును. స్వల్పాంశాలన్నింటిని ప్రసంగ ప్రధాన అంశాలకు, ప్రతి ప్రధాన అంశాన్ని విషయాంశముతో సంబంధం కలపడంలో నైపుణ్యాన్ని సంపాదించినప్పుడు, మీ ప్రసంగాలు చక్కని సరళతను కలిగివుంటూ ప్రసంగించడానికి సులభమై, మరచిపోలేని విధంగా నాటుకొనేలా చేస్తాయి.

[అధ్యయన ప్రశ్నలు]