కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11వ సెక్షన్‌కు పరిచయం

11వ సెక్షన్‌కు పరిచయం

ఈ సెక్షన్‌తో క్రైస్తవ గ్రీకు లేఖనాలు మొదలౌతాయి. యేసు ఒక చిన్న పట్టణంలో సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఆయన వడ్రంగి అయిన తన తండ్రితో పని చేశాడు. మానవజాతిని రక్షించేది యేసే. యెహోవా ఆయనను పరలోక రాజ్యానికి రాజుగా నియమించాడు. యేసు ఏ కుటుంబంలో పుట్టాలో, ఎలాంటి వాతావరణంలో పెరగాలో యెహోవా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో మీకు పిల్లలుంటే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. యేసును హేరోదు చంపకుండా యెహోవా ఎలా కాపాడాడో వివరించండి. యెహోవా సంకల్పాన్ని ఏదీ ఆపలేదని కూడా వివరించండి. యేసు కోసం మార్గాన్ని సిద్ధం చేయడానికి యెహోవా యోహానును ఎలా నియమించాడో తెలుసుకోండి. యేసు చిన్న వయసు నుండే యెహోవా జ్ఞానాన్ని ప్రేమించాడని ఎలా చూపించాడో వివరించండి.

ఈ భాగంలో

లెసన్‌ 68

ఎలీసబెతుకు బాబు పుట్టాడు

బిడ్డ పుట్టే వరకు ఎలీసబెతు భర్త మాట్లాడలేడని దూత అతనికి ఎందుకు చెప్తాడు?

లెసన్‌ 69

మరియ దగ్గరకు వచ్చిన గబ్రియేలు

ఆమె జీవితాన్ని మార్చేసే సందేశాన్ని అతను ఇచ్చాడు

లెసన్‌ 70

యేసు పుట్టాడని దేవదూతలు ప్రకటించారు

ప్రకటన విన్న కాపరులు వెంటనే స్పందించారు.

లెసన్‌ 71

యెహోవా యేసును కాపాడాడు

యేసు చనిపోవాలని ఒక దుష్టరాజు అనుకున్నాడు.

లెసన్‌ 72

బాలుడైన యేసు

ఆలయంలో ఉన్న బోధకులు ఆయనను చూసి ఎందుకు ఆశ్చర్యపోయారు?

లెసన్‌ 73

యోహాను మెస్సీయ వస్తున్నాడని ప్రకటించాడు

యోహాను పెద్దయ్యాక ప్రవక్త అవుతాడు. ఆయన మెస్సీయ వస్తున్నాడని నేర్పించాడు. అప్పుడు ప్రజలు ఎలా స్పందించారు?