దుష్టాత్మలను ఎదిరించండి
అధ్యాయము 12
దుష్టాత్మలను ఎదిరించండి
1. యేసు దుష్టాత్మలను ఎదుర్కొన్నప్పుడు ఎలా ప్రతిస్పందించాడు?
యేసు క్రీస్తు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ప్రార్థించడానికి, ధ్యానించడానికి యూదయ అరణ్యానికి వెళ్లాడు. అక్కడ ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని మీరునట్లు చేయాలని అపవాదియగు సాతాను ప్రయత్నించాడు. అయితే, యేసు అపవాది శోధనను నిరాకరించి, అతని ఉరిలో పడలేదు. భూమిపై తన పరిచర్య కాలంలో యేసు ఇతర దుష్టాత్మలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ, అనేకసార్లు ఆయన వారిని గద్దించి, ఎదిరించాడు.—లూకా 4:1-13; 8:26-34; 9:37-43.
2. మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాము?
2 ఆ సంఘటనలను వర్ణించే బైబిలు వృత్తాంతాలు దుష్టాత్మలు ఉనికిలో ఉన్నారని మనల్ని ఒప్పించాలి. వాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తారు. అయితే, మనం ఈ దుష్టాత్మలను ఎదిరించవచ్చు. కాని దుష్టాత్మలు ఎక్కడి నుండి వచ్చారు? వాళ్లు మానవులను మోసగించాలని ఎందుకు ప్రయత్నిస్తారు? తమ లక్ష్యాలను సాధించేందుకు వాళ్లు ఏ పద్ధతులను ఉపయోగిస్తారు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడం దుష్టాత్మలను ఎదిరించేందుకు మీకు సహాయం చేస్తుంది.
దుష్టాత్మలు—వారి మూలం మరియు లక్ష్యం
3. అపవాదియగు సాతాను ఎలా ఉనికిలోకి వచ్చాడు?
3 మానవులను సృష్టించడానికి ఎంతో కాలం పూర్వం యెహోవా దేవుడు అనేకానేక ఆత్మలైన జీవులను సృష్టించాడు. (యోబు 38:4, 7) ఆరవ అధ్యాయంలో వివరించబడినట్లుగా, ఈ దేవదూతలలో ఒకరికి మానవులు యెహోవాను ఆరాధించే బదులు తనను ఆరాధించాలనే కోరిక కలిగింది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు, ఈ దుష్ట దేవదూత సృష్టికర్తను ఎదిరించి, కొండెములు చెప్పాడు, మొదటి స్త్రీకి దేవుడు అబద్ధికుడు అని కూడా సూచించాడు. అందుచేతనే, ఆ తర్వాత తిరుగుబాటు చేసిన ఈ ఆత్మగానున్న జీవి సాతాను (ఎదిరించువాడు) మరియు అపవాది (కొండెములు చెప్పువాడు) అని యుక్తంగా పిలువబడ్డాడు.—ఆదికాండము 3:1-5; యోబు 1:6.
4. నోవహు దినాల్లో కొంతమంది దేవదూతలు ఎలా పాపం చేశారు?
4 ఆ తర్వాత, ఇతర దేవదూతలు అపవాదియగు సాతాను పక్షాన చేరారు. నీతిమంతుడైన నోవహు దినములలో, వారిలో కొందరు పరలోకంలోని తమ సేవను విడిచిపెట్టి, భూమి పైనున్న స్త్రీలతో తమ లైంగిక సంబంధమైన కోరికలను తీర్చుకొనేందుకు భౌతిక శరీరాలు దాల్చారు. అవిధేయతాపూర్వకమైన ఆ చర్య గైకొనేందుకు నిస్సంశయంగా సాతాను ఆ దేవదూతలను ప్రభావితం చేశాడు. నెఫీలీములని పిలువబడుతూ, దౌర్జన్యకారులుగా తయారైన సంకరజాతి సంతానానికి వారు తండ్రులయ్యేందుకు అది నడిపించింది. యెహోవా గొప్ప జలప్రవాహం రప్పించినప్పుడు, అది దుష్ట మానవజాతిని, అవిధేయులైన దేవదూతల అసహజమైన సంతానాన్ని నాశనం చేసింది. తిరుగుబాటు చేసిన దూతలు తమ భౌతిక శరీరాలను విడిచిపెట్టి ఆత్మసా మాజ్యానికి తిరిగి వెళ్లడం ద్వారా నాశనాన్ని తప్పించుకున్నారు. కాని వారిని ఆత్మీయాంధకారంలో నివసించే వారిగా చేయడం ద్వారా దేవుడు ఈ దయ్యాలను అదుపు చేశాడు. (ఆదికాండము 6:1-7, 17; యూదా 6) “దయ్యములకు అధిపతి” అయిన సాతాను, అతని దుష్ట దూతలు తమ తిరుగుబాటును అలాగే కొనసాగించారు. (లూకా 11:15) వారి లక్ష్యమేమిటి?
5. సాతాను మరియు అతని దయ్యాలకు ఏ లక్ష్యం ఉంది, ప్రజలను ఉరిలో పడవేసేందుకు వాళ్లు దేన్ని ఉపయోగిస్తారు?
5 ప్రజలను యెహోవా దేవునికి వ్యతిరేకంగా త్రిప్పడమే సాతాను మరియు దయ్యాల యొక్క దుష్ట లక్ష్యమైయుంది. అందుకే, ఈ దుష్టులు మానవ చరిత్రంతటిలో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ, భయపెడుతూ, వారిపై దాడిచేస్తూ వస్తున్నారు. (ప్రకటన 12:9) దయ్యాల దాడి మునుపెన్నటి కంటే ఇప్పుడు మరింత దుర్మార్గంగా ఉందని ఆధునిక దిన ఉదాహరణలు ధ్రువీకరిస్తున్నాయి. ప్రజలను ఉరిలో పడవేసేందుకు దయ్యాలు తరచూ అభిచారానికి సంబంధించిన అన్ని పద్ధతులను ఉపయోగించుకుంటారు. దయ్యాలు ఈ శోధనను ఎలా ఉపయోగిస్తున్నారు, మిమ్మల్ని మీరెలా రక్షించుకోగలరు?
దుష్టాత్మలు మిమ్మల్నెలా మోసగించేందుకు ప్రయత్నిస్తారు
6. అభిచారం అంటే ఏమిటి, దానిలో కొన్ని రూపాలేవి?
6 అభిచారం అంటే ఏమిటి? అభిచారమంటే సూటిగానైనా లేక మానవ మాధ్యమం ద్వారానైనా దయ్యాలతో లేక దుష్టాత్మలతో సంభాషించడం మరియు సహకరించడం. వేటగాళ్లకు వల ఎటువంటిదో, దయ్యాలకు అభిచారం అటువంటిది: అది ఎరను ఆకర్షిస్తుంది. వేటగాడు జంతువులను తన వలలో చిక్కించుకోవడానికి ఎలాగైతే వివిధ రకాల ఎరలను ఉపయోగిస్తాడో, అలాగే దుష్టాత్మలు మానవులను తమ అధీనం చేసుకొనేందుకు వివిధ రకాల అభిచారాన్ని ప్రోత్సహిస్తారు. (కీర్తన 119:110 పోల్చండి.) ఈ రకాలలో కొన్ని సోదె, మంత్రము, శకునములు చూచుట, చిల్లంగితనము, మంత్రము, కర్ణపిశాచి గలవారిని సంప్రదించుట, మృతులతో సంభాషించుట వంటివి ఉన్నాయి.
7. అభిచారం ఎంతగా వ్యాప్తి చెందింది, క్రైస్తవ దేశాలని చెప్పబడే వాటిలో కూడా అది ఎందుకు వర్ధిల్లుతోంది?
7 ప్రపంచ నలుమూలలలోని ప్రజలను అభిచారం ఆకర్షిస్తుంది గనుక ఆ ఉరి విజయవంతమయ్యింది. ఆటవిక గ్రామాలలో నివసించేవారు మాంత్రికుల యొద్దకు వెళతారు, నగరంలోని ఉద్యోగస్థులు జ్యోతిష్కులను సంప్రదిస్తారు. క్రైస్తవ దేశాలని పిలువబడుతున్న వాటిలో కూడా అభిచారం వర్థిల్లుతోంది. కేవలం అమెరికాలోనే మొత్తం 1,00,00,000 కంటే ఎక్కువగా పంచిపెట్టబడే 30 పత్రికలు వివిధ రకాలైన అభిచారానికి ప్రత్యేకింపబడ్డాయని పరిశోధన సూచిస్తుంది. బ్రెజిల్ దేశస్థులు ప్రతి సంవత్సరం 50 కోట్ల కంటే ఎక్కువ డాలర్లను అభిచార సంబంధమైన వాటి కొరకు ఖర్చుపెడతారు. అయినప్పటికీ, ఆ దేశంలో అభిచార సంబంధమైన ఆరాధనా కేంద్రాలకు వెళ్లేవారిలో 80 శాతం మంది బాప్తిస్మం పొందిన కాథోలిక్కులే, వారు మాస్‌కు కూడా హాజరౌతారు. కొందరు మత నాయకులు అభిచారాన్ని అభ్యసిస్తారు, కాబట్టి దాన్ని ఆచరించడం దేవునికి అంగీకృతమేనని అనేకమంది మతసంబంధమైన ప్రజలు అనుకుంటారు. అయితే అది అంగీకృతమేనా?
అభిచారం అభ్యసించడాన్ని బైబిలు ఎందుకు ఖండిస్తుంది
8. అభిచారాన్ని గూర్చిన లేఖనాధార దృష్టి ఏమిటి?
8 కొన్ని విధాలైన అభిచారం మంచి ఆత్మలతో మాట్లాడడానికి మార్గమని మీకు లేవీయకాండము 19:31; 20:6, 27) “మాంత్రికులు . . . అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ [నిత్య] మరణము” అని బైబిలు పుస్తకమగు ప్రకటన గ్రంథం హెచ్చరిస్తోంది. (ప్రకటన 21:8; 22:15) అన్ని విధాలైన అభిచారములను యెహోవా నిరాకరిస్తాడు. (ద్వితీయోపదేశకాండము 18:10-12) ఎందుకలా?
బోధించబడి ఉంటే, అభిచారం గురించి బైబిలు ఏమి చెబుతుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. యెహోవా ప్రజలు ఇలా హెచ్చరింపబడ్డారు: “కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదెగాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.” (9. ఆత్మసామ్రాజ్యం నుండి నేడు వస్తున్న వర్తమానాలు యెహోవా నుండి వచ్చేవి కావని మనం ఎందుకు నిర్ధారించగలము?
9 బైబిలు వ్రాయడం పూర్తి కాకమునుపు కొంతమంది మానవులతో మాట్లాడడానికి యెహోవా మంచి ఆత్మలను, లేక నీతియుక్తమైన దేవదూతలను పంపించాడు. దేవుని వాక్యం వ్రాయబడడం పూర్తి అయినప్పటి నుండి, అది యెహోవాకు అంగీకృతమైన విధంగా ఆయనను సేవించేందుకు మానవులకు కావలసిన నడిపింపును అందజేస్తోంది. (2 తిమోతి 3:16, 17; హెబ్రీయులు 1:1, 2) మధ్యవర్తులకు వర్తమానాలు పంపించడం ద్వారా ఆయన తన పరిశుద్ధ వాక్యాన్ని అందజేయడం లేదు. నేడు ఆత్మసామ్రాజ్యం నుండి వచ్చే అలాంటి వర్తమానాలన్నీ దుష్టాత్మల నుండి వస్తున్నాయి. అభిచారాన్ని అభ్యసించడం దయ్యాల వలన హింసకు లేక దుష్టాత్మలు ఆవహించడానికి నడిపించగలదు. అందుకే ఎటువంటి అభిచార సంబంధమైన ఆచారాలలోను చేరి ఉండవద్దని దేవుడు మనల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 18:14; గలతీయులు 5:19-21) అంతేగాక, అభిచారం ఎడల యెహోవా దృష్టిని తెలుసుకున్న తర్వాత కూడా మనం దాన్ని అభ్యసించడం కొనసాగిస్తే, మనం తిరుగుబాటు చేసే దుష్టాత్మలతో చేరినవారమై దేవుని శత్రువులమౌతాము.—1 సమూయేలు 15:23; 1 దినవృత్తాంతములు 10:13, 14; కీర్తన 5:4.
10. సోదె చెప్పడం అంటే ఏమిటి, మనం దాన్ని ఎందుకు విసర్జించాలి?
10 పేరు పొందిన ఒక విధమైన అభిచారం ఏమిటంటే సోదె చెప్పుట—ఆత్మల సహాయంతో భవిష్యత్తు గురించి లేక తెలియని వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం. జ్యోతిష్యం, స్ఫటిక గోళం పరికించడం, దర్శనాల భావం చెప్పడం, హస్తసాముద్రికం, చిలుక జోస్యం వంటివి సోదె చెప్పుటలో కొన్ని రకాలు. సోదె అపొస్తలుల కార్యములు 16:16-19 తెలియజేస్తుంది. అయితే, దయ్యము వెళ్లగొట్టబడిన తర్వాత భవిష్యత్తు గురించి చెప్పే ఆమె సామర్థ్యం పోయింది. సోదె చెప్పుట, ప్రజలను తమ ఉరిలో చిక్కుకొనేలా చేసుకొనేందుకు దయ్యాలు ఉపయోగించే ఒక వల వంటిదన్నది స్పష్టం.
చెప్పుట అన్నది నిరపాయకరమైన తమాషా వంటిదని కొందరు భావిస్తారు, కాని భవిష్యత్తు చెప్పడానికి దుష్టాత్మలకు దగ్గరి సంబంధం ఉందని బైబిలు చూపిస్తుంది. ఉదాహరణకు, “దయ్యముపట్టినదై, సోదె చెప్పే” ఒక బాలికను గూర్చి11. మృతులతో మాట్లాడాలని ఒక వ్యక్తి చేసే ప్రయత్నాలు అతన్ని ఎలా ఉరిలో పడవేయగలవు?
11 మీ ప్రియమైన కుటుంబ సభ్యులొకరు లేక సన్నిహిత స్నేహితులలో ఒకరు మరణించినందున మీరు బాధ పడుతుంటే, మీరు మరో ఉరిలో సులభంగా చిక్కుకోగలుగుతారు. కర్ణపిశాచిగల వ్యక్తి మీకు ప్రత్యేకమైన సమాచారాన్ని ఇవ్వవచ్చు లేక మరణించిన వ్యక్తి స్వరంలా అనిపించే స్వరంతో మాట్లాడవచ్చు. జాగ్రత్త సుమా! మృతులతో మాట్లాడాలని చేసే ప్రయత్నాలు ఉరిలో చిక్కుకొనేలా చేస్తాయి. ఎందుకు? ఎందుకంటే మృతులు మాట్లాడలేరు. బహుశా మీకు జ్ఞాపకమున్నట్లుగా, మరణమందు ఒక వ్యక్తి ‘మంటి పాలగును; అతని సంకల్పములు నాడే నశించును’ అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మృతులు “ఏమియు ఎరుగరు.” (కీర్తన 146:4; ప్రసంగి 9:5, 10) అంతేగాక, మరణించిన వ్యక్తి స్వరాన్ని అనుకరించి, మరణించిన వ్యక్తిని గూర్చిన సమాచారాన్ని కర్ణపిశాచిగల వ్యక్తి ద్వారా అందజేసేది నిజానికి దయ్యాలే. (1 సమూయేలు 28:3-19) గనుక “దయ్యములయొద్ద విచారణ చేయు” వ్యక్తి దుష్టాత్మలచేత మోసగించబడి, యెహోవా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు.—ద్వితీయోపదేశకాండము 18:11, 12; యెషయా 8:19.
ఆకర్షించడం నుండి దాడి చేయడం వరకు
12, 13. ప్రజలను శోధించడంలోను, హింసించడంలోను దయ్యాలు పట్టుదల కలిగివుంటారనడానికి ఏ నిదర్శనం ఉంది?
12 అభిచారాన్ని గూర్చి దేవుని వాక్యం అందజేస్తున్న ఉపదేశాన్ని మీరు అన్వయించుకున్నప్పుడు, మీరు దయ్యాల ఉరిని తప్పించుకుంటారు. (కీర్తన 141:9, 10; రోమీయులు 12:9 పోల్చండి.) దుష్టాత్మలు మిమ్మల్ని వశపరచుకొనుటకు చేసే ప్రయత్నాలను మానుకుంటారని దీని భావమా? ఎంత మాత్రం కాదు! యేసును మూడుసార్లు శోధించిన తర్వాత, సాతాను “కొంతకాలము ఆయనను విడిచిపోయెను.” (లూకా 4:13) అలాగే, మొండి ఆత్మలు ప్రజలను ఆకర్షించడమే కాదు వారిపై దాడి చేస్తారు కూడా.
13 దేవుని సేవకుడైన యోబుపై సాతాను చేసిన దాడి గురించి మనం మునుపు పరిశీలించిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఆయన తన పశువులను పోగొట్టుకొనేలా, ఆయన అనేకమంది సేవకులు మరణించేలా చేశాడు. యోబు పిల్లలను కూడా సాతాను చంపేశాడు. ఆ తర్వాత, అతడు యోబుకు స్వయంగా బాధాకరమైన జబ్బు వచ్చేలా చేశాడు. అయినా యోబు దేవుని ఎడల తన యథార్థతను కాపాడుకొని బహుగా ఆశీర్వదించబడ్డాడు. (యోబు 1:7-19; 2:7, 8; 42:12) అప్పటి నుండి, దయ్యాలు కొంతమంది ప్రజలను మూగవారిని లేక గ్రుడ్డి వారిని చేశారు మరియు మానవులనుభవించే బాధలను చూసి తృప్తి పొందుతూనే ఉన్నారు. (మత్తయి 9:32, 33; 12:22; మార్కు 5:2-5) నేడు, దయ్యాలు కొంతమంది ప్రజలను లైంగికంగా హింసిస్తారని, ఇతరులను పిచ్చివారిని చేస్తారని నివేదికలు చూపిస్తున్నాయి. దేవుని దృష్టిలో పాపాలైన హత్య చేయడానికి లేక ఆత్మహత్య చేసుకోవడానికి మరితరులను వీరు పురికొల్పుతారు. (ద్వితీయోపదేశకాండము 5:17; 1 యోహాను 3:15) అంతేగాక, ఒకప్పుడు ఈ దుష్టాత్మల ఉరిలో చిక్కుకున్న వేలాదిమంది ప్రజలు తమను తాము స్వతంత్రులను చేసుకోగలిగారు. వారికిది ఎలా సాధ్యమయ్యింది? ప్రాముఖ్యమైన చర్యలు గైకొనడం ద్వారా వారలా చేయగలిగారు.
దుష్టాత్మలను ఎదిరించడమెలా
14. ఎఫెసునందలి మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరికి అనుగుణంగా, మీరు దుష్టాత్మలను ఎలా ఎదిరించగలరు?
14 దుష్టాత్మలను ఎదిరించి, మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక మార్గం ఏమిటి? విశ్వాసులు కాక మునుపు అభిచారాన్ని అభ్యసించిన ఎఫెసులోని మొదటి శతాబ్దపు క్రైస్తవులు తగిన చర్యలను గైకొన్నారు. “మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి” అని మనం చదువుతాము. (అపొస్తలుల కార్యములు 19:19) మీరు అభిచారాన్ని అభ్యసించకపోయినా, అభిచారసంబంధమైన ప్రయోగాలు లేక గుర్తులుగల దేని నుండైనా విముక్తులుకండి. వీటిలో పుస్తకాలు, పత్రికలు, వీడియోలు, పోస్టర్లు, సంగీత రికార్డింగులు మరియు అభిచారం కొరకు ఉపయోగించే వస్తువులు చేరివున్నాయి. విగ్రహాలు, తాయెత్తులు, రక్షరేకులు, ధరించే ఇతర వస్తువులు మరియు అభిచారాన్ని అభ్యసించే వారి నుండి పొందిన బహుమానాలు కూడా వాటిలో చేరివున్నాయి. (ద్వితీయోపదేశకాండము 7:25, 26; 1 కొరింథీయులు 10:21) ఉదాహరణకు: థాయిలాండ్‌లోని ఒక వివాహిత జంట ఎంతో కాలంగా దయ్యాలచేత హింసించబడ్డారు. ఆ తర్వాత వాళ్లు అభిచారానికి సంబంధించిన వస్తువుల నుండి విముక్తి పొందారు. ఫలితమేమైయుండెను? వాళ్లు దయ్యాల సంబంధమైన దాడులనుండి స్వాతంత్ర్యం పొంది ఆ తర్వాత నిజమైన ఆత్మీయాభివృద్ధిని సాధించారు.
15. దుష్టాత్మలను ఎదిరించడంలో అవసరమైన మరో చర్య ఏమిటి?
15 దుష్టాత్మలను ఎదిరించేందుకు మరో అవసరమైన చర్య ఏమిటంటే అపొస్తలుడైన పౌలు యొక్క ఉపదేశాన్ని అన్వయించుకొని, దేవుడిచ్చే ఆత్మీయ సర్వాంగ కవచమును ధరించాలి. (ఎఫెసీయులు 6:11-17) దుష్టాత్మలకు వ్యతిరేకంగా క్రైస్తవులు తమ రక్షణను బలపర్చుకోవాలి. ఆ చర్యలో ఏమి ఇమిడివుంది? పౌలు ఇలా చెప్పాడు: “ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.” వాస్తవానికి, మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటే, దుష్టాత్మలను ఎదిరించే మీ సామర్థ్యం అంత అధికంగా ఉంటుంది.—మత్తయి 17:14-20.
16. మీరు మీ విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోగలరు?
16 మీరు మీ విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోగలరు? బైబిలు పఠనాన్ని కొనసాగించడం ద్వారా మరియు దాని ఉపదేశాన్ని మీ జీవితంలో అన్వయించుకోవడం ద్వారా అలా చేయగలరు. ఒకరి విశ్వాసం యొక్క బలం ఎక్కువగా దాని ఆధారపు దృఢత్వంపై అంటే దేవుని గూర్చిన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. మీరు బైబిలు పఠనం చేస్తుండగా మీరు పొందిన, హృదయానికి తీసుకున్న కచ్చితమైన జ్ఞానం మీ విశ్వాసాన్ని బలపర్చిందని మీరు అంగీకరించరా? (రోమీయులు 10:10, 17) కాబట్టి మీరు ఈ పఠనాన్ని కొనసాగిస్తుండగా, యెహోవాసాక్షుల కూటాలకు హాజరు కావడాన్ని ఒక అలవాటుగా చేసుకోండి, నిశ్చయంగా మీ విశ్వాసం ఇంకా బలపర్చబడుతుంది. (రోమీయులు 1:11, 12; కొలొస్సయులు 2:6, 7) అది దయ్యాల దాడులకు వ్యతిరేకంగా మీకు ఒక బలమైన రక్షణగా ఉంటుంది.—1 యోహాను 5:5.
17. దుష్టాత్మలను ఎదిరించడంలో మరే ఇతర చర్యలు అవసరం కావచ్చు?
ఎఫెసీయులు 6:18) మనం దయ్యాల ప్రభావం అధికంగా ఉన్న లోకంలో నివసిస్తున్నాం గనుక, దుష్టాత్మలను ఎదిరించేందుకు దేవుని రక్షణ కొరకు ఎడతెగక ప్రార్థన చేయడం అవశ్యం. (మత్తయి 6:13) ఈ విషయంలో ఆత్మీయ సహాయం మరియు క్రైస్తవ సంఘంలోని నియమిత పెద్దల ప్రార్థనలు సహాయకరంగా ఉంటాయి.—యాకోబు 5:13-15.
17 దుష్టాత్మలను ఎదిరించాలని నిశ్చయించుకొన్న వ్యక్తి మరే ఇతర చర్యలను తీసుకోవచ్చు? ఎఫెసునందలి క్రైస్తవులకు రక్షణ అవసరమైయుండెను ఎందుకంటే వాళ్లు దయ్యాల విద్య ప్రభావం అధికంగావున్న నగరంలో నివసించారు. అందుకే పౌలు వారికిలా చెప్పాడు: ‘ఆత్మవలన ప్రతి సందర్భములోను ప్రార్థన చేయుచునుండుడి.’ (దుష్టాత్మలకు వ్యతిరేకంగా మీరు చేసే పోరాటాన్ని కొనసాగించండి
18, 19. దయ్యాలు ఒక వ్యక్తిని మళ్లీ బాధపెడితే ఏమి చేయవచ్చు?
18 అయితే ఈ ప్రాథమికమైన చర్యలు తీసుకొన్న తర్వాత కూడా కొంతమంది దుష్టాత్మలచేత హింసించబడ్డారు. ఉదాహరణకు, కోటి డి ఐవరి అనే దేశంలో ఒక వ్యక్తి యెహోవాసాక్షులతో బైబిలు పఠించి తన తాయెత్తులన్నిటినీ నాశనం చేశాడు. ఆ తర్వాత, ఆయన మంచి అభివృద్ధి సాధించి, తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాడు. కాని ఆయన బాప్తిస్మం తీసుకున్న ఒక వారానికి, దయ్యాలు మళ్లీ ఆయనను బాధపెట్టడం ప్రారంభించారు, ఆయన క్రొత్తగా కనుగొన్న సత్యాన్ని విడిచిపెట్టమని స్వరాలు ఆయనకు చెప్పాయి. మీకు ఇదే జరిగితే, మీరు యెహోవా రక్షణను కోల్పోయారని దీని భావమా? అలా కానే కాదు.
19 పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తుకు దైవిక భద్రత ఉన్నప్పటికీ, దుష్ట ఆత్మగానున్న అపవాదియగు సాతాను స్వరాన్ని ఆయన విన్నాడు. అలాంటి సందర్భంలో ఏమి చేయవచ్చో యేసు చూపించాడు. ఆయన అపవాదికిలా చెప్పాడు: “సాతానా, పొమ్ము!” (మత్తయి 4:3-10) అలాగే, ఆత్మసామ్రాజ్యం నుండి వచ్చే స్వరాలను వినడానికి మీరు కూడా నిరాకరించాలి. యెహోవా సహాయాన్ని కోరడం ద్వారా దుష్టాత్మలను ఎదిరించండి. అవును, దేవుని నామాన్ని ఉపయోగిస్తూ బిగ్గరగా ప్రార్థించండి. సామెతలు 18:10 ఇలా చెబుతుంది: “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.” కోటి డి ఐవరి అనే దేశంలోని క్రైస్తవ వ్యక్తి అదే చేశాడు, దుష్టాత్మలు ఆయనను హింసించడం మానివేశారు.—కీర్తన 124:8; 145:18.
20. సంక్షిప్తంగా, దుష్టాత్మలను ఎదిరించడానికి మీరు ఏమి చేయవచ్చు?
20 దుష్టాత్మలు ఉనికిలో ఉండడానికి యెహోవా అనుమతించాడు, కాని ప్రాముఖ్యంగా ఆయన తన ప్రజల ఎడల తన శక్తిని ప్రదర్శిస్తాడు, ఆయన నామము భూమియందంతట ప్రకటింపబడుతుంది. (నిర్గమకాండము 9:16) మీరు దేవునికి సన్నిహితులైతే, దుష్టాత్మలకు భయపడనక్కరలేదు. (సంఖ్యాకాండము 23:21, 23; యాకోబు 4:7, 8; 2 పేతురు 2:9) వారి శక్తి పరిమితమైనది. నోవహు దినాల్లో వాళ్లు శిక్షించబడ్డారు, ఇటీవలి కాలాల్లో పరలోకం నుండి పడద్రోయబడ్డారు, ఇప్పుడు అంతిమ తీర్పు కొరకు ఎదురుచూస్తున్నారు. (యూదా 6; ప్రకటన 12:9; 20:1-3, 7-10, 14) వాస్తవానికి, తమపైకి రానున్న నాశనాన్ని బట్టి వాళ్లు భయపడుతున్నారు. (యాకోబు 2:19) కాబట్టి దుష్టాత్మలు మిమ్మల్ని ఏదో విధమైన ఉరి ద్వారానైనా ఆకర్షిస్తే లేక మీపై ఏవిధంగానైనా దాడి చేస్తే, మీరు వారిని ఎదిరించవచ్చు. (2 కొరింథీయులు 2:11) ప్రతి విధమైన అభిచారాన్ని విసర్జించండి, దేవుని వాక్య ఉపదేశాన్ని అన్వయించుకోండి, యెహోవా అంగీకారం కొరకు ప్రయాసపడండి. ఆలస్యం చేయకుండా దీన్ని చేయండి, ఎందుకంటే మీరు దుష్టాత్మలను ఎదిరించడంపైనే మీ జీవితం ఆధారపడి ఉంది!
మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దుష్టాత్మలు ఎలా ప్రయత్నిస్తారు?
అభిచారాన్ని బైబిలు ఎందుకు ఖండిస్తుంది?
దుష్టాత్మల నుండి ఒక వ్యక్తి ఎలా స్వతంత్రుడు కాగలడు?
దుష్టాత్మలను మీరు ఎందుకు ఎదిరిస్తూనే ఉండాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[110వ పేజీలోని చిత్రం]
అనేక విధాలైన అభిచారాన్ని మీరెలా దృష్టిస్తారు?