దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు?
అధ్యాయము 8
దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు?
1, 2. మానవ బాధకు తరచూ ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారు?
ఆస్తిని నాశనం చేస్తూ, జీవితాలను బలిగొంటూ ఉపద్రవాలు వస్తే, అలాంటి భయంకరమైన సంఘటనలు ఎందుకు జరుగుతాయో అనేకులకు అర్థం కాదు. ఇతరులు క్రూరత్వం, అదుపులేని నేరం మరియు దౌర్జన్యాల విస్తారతను బట్టి కలత
చెందుతున్నారు. ‘దేవుడెందుకు బాధను అనుమతిస్తాడు?’ అని మీరు కూడా ఆలోచించి ఉండవచ్చు.2 అనేకులు ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాన్ని కనుగొనలేకపోయారు కాబట్టి, వాళ్లు దేవునియందు విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయన మానవజాతి ఎడల ఆసక్తి కలిగిలేడని వాళ్లు భావిస్తారు. బాధ జీవిత వాస్తవమని అంగీకరించే ఇతరులు వ్యసనపడి, మానవ సమాజంలో ఉన్న చెడునంతటిని బట్టి దేవున్ని నిందిస్తారు. మీకూ అలాంటి భావాలు ఉంటే, నిశ్చయంగా మీరు ఈ విషయాలపై బైబిలు ఇచ్చే వ్యాఖ్యానాలయందు ఎంతో ఆసక్తి కలిగివుంటారు.
బాధ దేవుని వలన కాదు
3, 4. కీడు మరియు బాధ యెహోవా నుండి రావడం లేదని మనం ఎందుకు నిశ్చయత కల్గివుండగలము?
3 మన చుట్టూ మనం చూస్తున్న బాధ యెహోవా దేవుని వల్ల కలిగేది కాదని బైబిలు మనకు అభయమిస్తుంది. ఉదాహరణకు, క్రైస్తవ శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” (యాకోబు 1:13) అలాంటప్పుడు, మానవజాతిని పీడిస్తున్న అసంఖ్యాకమైన కష్టాలను దేవుడు కలిగించి ఉండడు. ప్రజలు పరలోక జీవితానికి తగినవారయ్యే విధంగా చేయడానికి ఆయన వారిపైకి పరీక్షలను తీసుకురాడు, లేక వారు బహుశా పూర్వ జీవితంలో చేసివుండవచ్చని భావిస్తున్న చెడ్డ క్రియల నిమిత్తం ఆయన ప్రజలు బాధననుభవించేలా చేయడు.—రోమీయులు 6:7.
4 అంతేగాక, దేవుని పేరుమీద లేక క్రీస్తు పేరుమీద అనేక భయంకరమైన విషయాలు జరిగినప్పటికీ, అలాంటి విషయాలను వారిద్దరిలో ఎవరూ ఎప్పుడూ కూడా అంగీకరించినట్లుగా సూచించేది ఏదీ బైబిలులో లేదు. దేవున్ని, క్రీస్తును సేవిస్తున్నామని చెప్పుకుంటూ, మోసగిస్తూ, వంచిస్తూ, చంపుతూ, దోచుకొంటూ, మానవులకు బాధను కలిగించే ఇతర అనేకమైన వాటిని చేసేవారితో దేవునికి, క్రీస్తుకు ఏ భాగం లేదు. వాస్తవానికి, “భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము.” దేవుడు “భక్తిహీనులకు . . . దూరస్థుడు.”—సామెతలు 15:9, 29.
5. యెహోవా యొక్క కొన్ని లక్షణాలు ఏవి, ఆయన తన సృష్టిజీవుల గురించి ఎలా భావిస్తాడు?
యాకోబు 5:11) “యెహోవా న్యాయమును ప్రేమించువాడు” అని అది ప్రకటిస్తుంది. (కీర్తన 37:28; యెషయా 61:8) ఆయన ప్రతీకార స్వభావం గలవాడు కాదు. ఆయన తన సృష్టిజీవుల ఎడల వాత్సల్యపూరితమైన శ్రద్ధ కలిగివుండి, వారి క్షేమం కొరకు వారికి ఏది మంచిదో వారందరికీ అదే దయచేస్తాడు. (అపొస్తలుల కార్యములు 14:16, 17) భూమిపై జీవం ఆరంభమైనప్పటి నుండి యెహోవా అలా చేస్తూనే ఉన్నాడు.
5 యెహోవా “ఎంతో జాలియు కనికరమును గలవాడని” బైబిలు వర్ణిస్తుంది. (ఒక పరిపూర్ణమైన ఆరంభం
6. మానవజాతి తొలి చరిత్రను కొన్ని పురాణగాథలు ఎలా ప్రస్తావించాయి?
6 నొప్పి మరియు బాధలను చూడడానికి, అనుభవించడానికి మనమందరం అలవాటుపడ్డాము. కాబట్టి బాధ లేని సమయాన్ని ఊహించడం కష్టం కావచ్చు, కాని మానవ చరిత్రారంభంలో పరిస్థితులు అలాగే ఉండేవి. కొన్ని దేశాల పురాణగాథలు కూడా అలాంటి సంతోషకరమైన ఆరంభాన్ని పరోక్షంగా సూచిస్తున్నాయి. గ్రీకు పురాణంలో, “మానవుని ఐదు యుగాల్లో” మొదటిది “స్వర్ణ యుగం” అని పిలువబడింది. దానిలో మానవులు కష్టం, నొప్పి, వృద్ధాప్యపు వేదనలు లేకుండా సంతోషంగా జీవించారు. పౌరాణిక ఎల్లో చక్రవర్తి (హువాంగ్-టి) పరిపాలన కాలంలో ప్రజలు సమాధానంతో జీవించారని, పంచభూతాలతో మరియు క్రూరమృగాలతో సహితం సఖ్యత కలిగివున్నారని చైనీయులు చెబుతారు. పారసీకులు, ఐగుప్తీయులు, టిబెట్టువారు, పెరూవాసులు, మెక్సికో దేశీయులు వీరందరికీ కూడా మానవజాతి చరిత్రారంభంలో సంతోషం మరియు పరిపూర్ణత కలిగివున్న సమయాన్ని గూర్చిన పురాణగాథలు ఉన్నాయి.
7. దేవుడు భూమిని, మానవజాతిని ఎందుకు సృష్టించాడు?
7 జనాంగాల పురాణాలు ఎంతో పూర్వం వ్రాయబడిన మానవ చరిత్ర వృత్తాంతాన్ని అంటే బైబిలునే ప్రతిధ్వనింపజేస్తున్నాయి. దేవుడు మొదటి మానవజతయైన ఆదాము హవ్వలను ఏదెను తోట అని పిలువబడిన పరదైసులో ఉంచి, వారికిలా ఆజ్ఞాపించాడని అది మనకు తెలియజేస్తుంది: “ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:28) మన మొదటి తలిదండ్రులు పరిపూర్ణతను కలిగివుండి, నిత్య సమాధాన సంతోషాలతో నివసిస్తున్న పరిపూర్ణ మానవ కుటుంబంచేత ఆక్రమించబడిన ఒక పరదైసుగా భూమి అంతా మారడాన్ని చూసే ఉత్తరాపేక్షను కలిగివుండిరి. భూమిని, మానవజాతిని సృష్టించడంలో దేవుని సంకల్పం అదే.—యెషయా 45:18.
ఒక ద్వేషపూరితమైన సవాలు
8. ఆదాము హవ్వలు ఏ ఆజ్ఞకు విధేయులు కావలసి ఉండిరి, కాని ఏమి జరిగింది?
8 దేవుని అనుగ్రహంలో కొనసాగాలంటే, ఆదాము హవ్వలు “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను” తినకుండ ఉండాల్సింది. (ఆదికాండము 2:16, 17) వాళ్లు యెహోవా ఆజ్ఞకు విధేయులై ఉంటే, మానవ జీవితాన్ని పాడుచేసే బాధ ఉండేది కాదు. దేవుని ఆజ్ఞకు విధేయులవ్వడం ద్వారా, వాళ్లు తమకు యెహోవా ఎడల గల ప్రేమను, ఆయన ఎడల తమ యథార్థతను ప్రదర్శించివుండేవారే. (1 యోహాను 5:3) కాని మనం 6వ అధ్యాయంలో నేర్చుకొన్నట్లుగా, సంగతులు అలా జరుగలేదు. సాతాను పురికొల్పడంతో, హవ్వ ఆ వృక్ష ఫలాన్ని తిన్నది. ఆ తర్వాత, ఆ నిషేధింపబడిన ఫలాన్ని ఆదాము కూడా తిన్నాడు.
9. యెహోవా ఇమిడివున్న ఏ అంశాన్ని సాతాను లేవదీశాడు?
9 జరిగిన విషయం యొక్క గంభీరతను మీరు చూడగలుగుతున్నారా? సర్వోన్నతునిగా యెహోవా అధికారంపై సాతాను దాడిచేస్తున్నాడు. “మీరు చావనే చావరు” అని చెప్పడం ద్వారా అపవాది, ‘మీరు నిశ్చయముగా చచ్చెదరనే’ దేవుని మాటలతో వ్యతిరేకించాడు. మంచేదో చెడేదో నిర్ణయించడానికి యెహోవా అవసరం లేనివిధంగా వారు దేవునివలె కాగల సాధ్యతను ఆయన ఆదాము హవ్వల నుండి దాస్తున్నాడని సాతాను యొక్క ఆ తర్వాతి మాటలు సూచించాయి. కాబట్టి సాతాను సవాలు, విశ్వ సర్వాధిపతిగా యెహోవా హక్కును, అధికారాన్ని ప్రశ్నించింది.—ఆదికాండము 2:17; 3:1-6.
10. మానవుల గురించి సాతాను ఏ ఆరోపణలు చేశాడు?
10 దేవునికి విధేయత చూపించడం వారికి ప్రయోజనకరమైనంత వరకే ప్రజలు యెహోవాకు విధేయులై ఉంటారని కూడా అపవాదియగు సాతాను తప్పుడు భావంతో సూచించాడు. వేరే మాటల్లో చెప్పాలంటే, మానవ యథార్థత ప్రశ్నించబడింది. ఏ మానవుడు స్వచ్ఛందంగా దేవుని ఎడల యథార్థంగా ఉండలేడని సాతాను ఆరోపించాడు. సా.శ.పూ. 1600 సంవత్సరాలకు కొంతకాలం ముందు ఒక
గొప్ప పరీక్షకు గురైన యెహోవా యొక్క నమ్మకమైన సేవకుడగు యోబును గురించిన బైబిలు వృత్తాంతములో, సాతాను యొక్క ఈ ద్వేషపూరితమైన ఆరోపణ స్పష్టంగా బయల్పర్చబడింది. యోబు పుస్తకంలోని మొదటి రెండు అధ్యాయాలను మీరు చదివినప్పుడు, మానవ బాధకు కారణం మరియు దాన్ని దేవుడెందుకు అనుమతిస్తున్నాడు అనే వాటిని మీరు గ్రహించగలరు.11. యోబు ఎటువంటి మనిషి, కాని సాతాను ఏ ఆరోపణ చేశాడు?
11 ‘యథార్థవర్తనుడును న్యాయవంతుడునైన’ యోబు సాతాను దాడి క్రిందకు వచ్చాడు. మొదటగా, “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?” అని ప్రశ్నించడం ద్వారా సాతాను యోబుకు చెడ్డ ఉద్దేశాలను ఆపాదించాడు. ఆ తర్వాత, యెహోవా యోబును కాపాడి ఆశీర్వదించడం ద్వారా యోబు తన ఎడల యథార్థంగా ఉండేలా దేవుడు చేసుకున్నాడని చెబుతూ అపవాది దేవున్ని, యోబును కపట పన్నాగంతో నిందించాడు. “అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును” అని సాతాను యెహోవాను సవాలు చేశాడు.—యోబు 1:8-11.
12. (ఎ) సాతాను యోబును పరీక్షించేందుకు దేవుడు అనుమతిస్తే మాత్రమే ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడుతుంది? (బి) యోబు పరీక్షా ఫలితమేమిటి?
12 దేవుని నుండి తాను పొందిన మంచి అంతటిని బట్టి మాత్రమే యోబు యెహోవాను సేవిస్తున్నాడా? యోబు యొక్క యథార్థత పరీక్షను తట్టుకోగలిగిందా? తన సేవకుడు పరీక్షించబడడానికి అనుమతించేందుకు యెహోవాకు ఆయనయందు తగినంత నమ్మకం ఉందా? యోబుపైకి అత్యంత తీవ్రమైన పరీక్ష రావడానికి యెహోవా అనుమతిస్తే, ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. యోబు పుస్తకంలో వ్రాయబడివున్నట్లుగా, దేవుడు అనుమతించిన పరీక్ష క్రింద యోబు నమ్మకమైన ప్రవర్తన యెహోవా నీతిని మానవుని యథార్థతను చక్కగా నిరూపించింది.—యోబు 42:1, 2, 12.
13. ఏదెనునందు జరిగినదానిలోను యోబుకు జరిగినదానిలోను మనమెలా ఇమిడివున్నాము?
13 అయితే, ఏదెను తోటలో జరిగినదానికి, మానవుడైన యోబుకు జరిగినదానికి లోతైన భావం ఉంది. సాతాను లేవదీసిన అంశాలలో నేడు మనతో సహా,
మానవజాతి అంతా ఇమిడి ఉంది. దేవుని నామం దూషించబడింది, ఆయన సర్వోన్నతాధిపత్యం సవాలు చేయబడింది. దేవుని సృష్టియైన మానవుని యథార్థత ప్రశ్నించబడింది. ఈ అంశాలన్నీ పరిష్కరించబడాలి.వివాదాంశాలను ఎలా పరిష్కరించాలి
14. ద్వేషపూరితమైన సవాలును ఎదుర్కొన్నప్పుడు, నిందింపబడిన వ్యక్తి ఏమి చేస్తాడు?
14 ఉదాహరణ కొరకు, చాలామంది పిల్లలున్న సంతోషభరితమైన కుటుంబంలో మీరొక ప్రేమగల తల్లి లేక తండ్రి అని అనుకుందాము. మీరు చెడ్డ తల్లి లేక తండ్రి అని నిందిస్తూ మీ పొరుగువారిలో ఒకరు అబద్ధాలు వ్యాపింపజేస్తున్నారనుకోండి. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించడం లేదని, మరింత మంచి పరిస్థితి గురించి వాళ్లకు తెలియదు కాబట్టి మీతో ఉంటున్నారు కాని వాళ్లకు అవకాశం దొరికితే వాళ్లు వెళ్లిపోతారని మీ పొరుగువారు చెప్పారనుకోండి. ‘వింతే!’ అని మీరనవచ్చు. నిజమే, అయితే దాన్ని మీరెలా నిరూపిస్తారు? కొంతమంది తలిదండ్రులు కోపోద్రేకంతో
ప్రతిస్పందిస్తారు. అలాంటి దౌర్జన్యపూరితమైన ప్రతిస్పందన మరిన్ని సమస్యల్ని సృష్టించడమేగాక, అబద్ధాలకు ఆధారాన్నిచ్చినట్లు అవుతుంది. మిమ్మల్ని నిందించే వ్యక్తికి తన ఆరోపణను నిరూపించుకోవడానికి, మీ పిల్లలు మిమ్మల్ని యథార్థంగా ప్రేమిస్తున్నారో లేదో పరీక్షించుకోవడానికి అవకాశాన్ని అనుమతించడమే అలాంటి సమస్యతో వ్యవహరించడానికి ఒక సంతృప్తికరమైన మార్గం.15. యెహోవా సాతాను సవాలుతో ఎలా వ్యవహరించడానికి ఎన్నుకొన్నాడు?
15 యెహోవా ప్రేమగల తండ్రి వంటివాడు. ఆదాము హవ్వలను పిల్లలకు పోల్చవచ్చు, సాతాను అబద్ధం చెప్పే పొరుగువాని పాత్రకు సరిపోతాడు. దేవుడు జ్ఞానయుక్తంగా సాతానును ఆదాము హవ్వలను వెంటనే నాశనం చేయలేదు, కాని ఈ తప్పిదస్థులను కొంతకాలం జీవించడానికి అనుమతించాడు. మన మొదటి తలిదండ్రులు మానవ కుటుంబాన్ని ప్రారంభించడానికి ఇది అవకాశమిచ్చింది, వివాదాంశాలు పరిష్కరించబడేలా, తన ఆరోపణ నిజమైనదో కాదో నిరూపించుకోవడానికి ఇది అపవాదికి ఒక అవకాశాన్నిచ్చింది. అయితే, కొందరు మానవులు తన ఎడల యథార్థంగా ఉంటూ సాతాను అబద్ధికుడని నిరూపిస్తారని దేవునికి ప్రారంభం నుండే తెలుసు. ఆయనను ప్రేమించేవారిని యెహోవా ఆశీర్వదించడంలోను సహాయం చేయడంలోను కొనసాగుతుండడాన్నిబట్టి మనం ఎంత కృతజ్ఞత గలవారమై ఉండాలి!—2 దినవృత్తాంతములు 16:9; సామెతలు 15:3.
ఏమి నిరూపించబడింది?
16. లోకం సాతాను అధికారం క్రిందికి ఎలా వచ్చింది?
16 దాదాపు మానవ చరిత్రంతటిలో, మానవజాతిపై ఆధిపత్యం వహించేందుకు తన పథకాలను నెరవేర్చుకోవడానికి సాతానుకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వబడింది. ఇతర విషయాలేమిటంటే, అతడు రాజకీయ శక్తులపై ప్రభావాన్ని చూపగలిగాడు, యెహోవాకు కాకుండా యుక్తిగా తనకు ఆరాధనను చెల్లించే మతాలను వృద్ధిచేశాడు. ఆ విధంగా అపవాది “ఈ యుగసంబంధమైన దేవత” అయ్యాడు, “ఈ లోకాధికారి” అని పిలువబడ్డాడు. (2 కొరింథీయులు 4:4; యోహాను 12:31) వాస్తవానికి, ‘లోకమంతయు దుష్టునియందున్నది.’ (1 యోహాను 5:19) మానవజాతినంతటినీ యెహోవా దేవుని నుండి త్రిప్పివేయగలనని తాను చేసిన ఆరోపణను సాతాను నిరూపించాడని దీని భావమా? నిశ్చయంగా కాదు! సాతానును ఉనికిలో ఉండడానికి అనుమతిస్తూ, యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడంలో కొనసాగాడు. అయితే మరి, దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడాన్ని గూర్చి బైబిలు ఏమి బయల్పరుస్తుంది?
17. దుష్టత్వానికి, బాధకు గల కారణాన్ని గూర్చి మనం మనస్సులో ఏమి ఉంచుకోవాలి?
17దుష్టత్వం మరియు బాధ యెహోవా వల్ల కలిగినవి కావు. సాతాను ఈ లోకాధికారి, ఈ యుగ సంబంధమైన దేవత గనుక మానవజాతి యొక్క ప్రస్తుత పరిస్థితికి, మానవజాతి అనుభవించిన సమస్త వేదనకు అతడు, అతని మద్దతుదారులు బాధ్యులు. అలాంటి శ్రమలకు దేవుడు కారకుడని ఎవరూ కూడా న్యాయంగా చెప్పలేరు.—రోమీయులు 9:14.
18. యెహోవా దుష్టత్వాన్ని, బాధను అనుమతించడం దేవుని నుండి స్వతంత్రంగా ఉండడమనే తలంపుకు సంబంధించి దేన్ని నిరూపించింది?
18 దుష్టత్వాన్ని, బాధను యెహోవా అనుమతించడం మూలంగా, దేవుని నుండి వేరై స్వతంత్రంగా ఉండడం శ్రేష్ఠమైన లోకాన్ని తీసుకురాలేదనే విషయం నిరూపించబడింది. చరిత్రంతటిలో ఒక నాశనం తర్వాత మరొకటి జరిగాయన్నది వాస్తవం. దానికి కారణమేమిటంటే, మానవులు తమ స్వంత స్వతంత్ర విధానాన్ని వెంబడించడానికి ఎన్నుకున్నారు, దేవుని వాక్యం ఎడల, ఆయన చిత్తం ఎడల నిజమైన శ్రద్ధను కనబర్చలేదు. యెహోవా యొక్క ప్రాచీన ప్రజలు, వారి నాయకులు అవిశ్వాసంగా “తనకిష్టమైన మార్గమును” వెంబడించి, ఆయన వాక్యాన్ని నిరాకరించినప్పుడు, ఫలితాలు నాశనకరంగా ఉండెను. తన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా దేవుడు వారికిలా చెప్పాడు: “జ్ఞానులు అవమానము నొందినవారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?” (యిర్మీయా 8:5, 6, 9) యెహోవా ప్రమాణాలను అనుసరించడంలో విఫలమైన మానవజాతి, అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో చుక్కాని లేని ఓడ వలె అయ్యింది.
19. సాతాను మానవులందరినీ దేవునికి వ్యతిరేకంగా త్రిప్పివేయలేడనే దానికి రుజువేమిటి?
19 దేవుడు దుష్టత్వం మరియు బాధను అనుమతించడం సాతాను మానవజాతినంతటినీ యెహోవా నుండి త్రిప్పివేయలేకపోయాడని కూడా నిరూపించింది. వారిపైకి ఏ శోధనలు లేక బాధలు వచ్చినప్పటికీ దేవుని ఎడల నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడు ఉన్నారని చరిత్ర చూపిస్తుంది. శతాబ్దాలు గడుస్తుండగా, తన సేవకుల ఎడల యెహోవా శక్తి బయల్పర్చబడింది, ఆయన నామం భూమియందంతటా ప్రకటించబడింది. (నిర్గమకాండము 9:16; 1 సమూయేలు 12:22) హేబెలు, హనోకు, నోవహు, అబ్రాహాము, మోషేవంటి వారితోసహా విశ్వాసుల యొక్క పెద్ద గుంపును గురించి హెబ్రీయులు 11వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులు 12:1 వారిని ‘మేఘము వంటి సాక్షి సమూహము’ అని పిలుస్తుంది. వారు యెహోవా ఎడల అచంచలమైన విశ్వాసాన్ని చూపిన ఆదర్శప్రాయులు. ఆధునిక కాలాల్లో కూడా అనేకులు దేవుని ఎడల అవిచ్ఛిన్నమైన యథార్థత నిమిత్తం తమ జీవితాలను అర్పించారు. తమ విశ్వాస ప్రేమల ద్వారా అలాంటి వ్యక్తులు, సాతాను మానవులనందరినీ దేవునికి వ్యతిరేకంగా త్రిప్పలేడని నిస్సంశయంగా నిరూపించారు.
20. యెహోవా దుష్టత్వం మరియు బాధ కొనసాగడానికి అనుమతించడం ద్వారా, దేవుడు మరియు మానవజాతి విషయంలో ఏమి నిరూపించబడింది?
20 చివరిదిగా, దుష్టత్వం మరియు బాధ కొనసాగడాన్ని యెహోవా అనుమతించడమనేది, వారి నిత్య ఆశీర్వాద ఆనందాల కొరకు మానవజాతిపై పరిపాలించే సామర్థ్యం మరియు హక్కు సృష్టికర్తయైన యెహోవాకు మాత్రమే ఉన్నాయనే దానికి రుజువునిచ్చింది. శతాబ్దాలుగా, మానవజాతి అనేక రకాలైన ప్రభుత్వాలను ప్రయత్నించి చూసింది. కాని ఫలితమేమిటి? నేడు జనాంగాలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలు, సంకటములు బైబిలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నట్లు, నిజంగా ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుటకు’ తగిన నిదర్శనాలే. (ప్రసంగి 8:9) యెహోవా మాత్రమే మనల్ని కాపాడి, తన ఆది సంకల్పాన్ని నెరవేర్చగలడు. ఆయన దీన్ని ఎలా మరియు ఎప్పుడు చేస్తాడు?
21. సాతానుకు ఏమి జరుగుతుంది, దీన్ని చేయడానికి ఎవరు ఉపయోగించుకొనబడతారు?
21 ఆదాము హవ్వలు సాతాను కుతంత్రానికి లొంగిపోయిన వెంటనే, రక్షణ మార్గాన్ని గూర్చి దేవుడు తన సంకల్పాన్ని ప్రకటించాడు. సాతాను గురించి యెహోవా ఇలా ప్రకటించాడు: ‘నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువు.’ (ఆదికాండము 3:15) అపవాది తన దుష్ట క్రియలను నిరంతరం చేయడానికి అనుమతించబడడని ఆ ప్రకటన ధృవీకరించింది. మెస్సీయ రాజ్యానికి రాజుగా, వాగ్దానం చేయబడిన సంతానమైన యేసుక్రీస్తు ‘సాతాను తలను చితకకొడతాడు.’ అవును, తిరుగుబాటు చేసే సాతానును యేసు “శీఘ్రముగా” చితకత్రొక్కుతాడు!—రోమీయులు 16:20.
మీరేమి చేస్తారు?
22. (ఎ) మీరు ఏ ప్రశ్నలను ఎదుర్కోవాలి? (బి) దేవుని ఎడల నమ్మకంగా ఉండేవారిపై సాతాను తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కినప్పటికీ, వారు దేని గురించి నిశ్చయత కలిగివుండగలరు?
22 ఇమిడివున్న వివాదాంశాలను తెలుసుకొని, మీరు ఎవరి పక్షం వహిస్తారు? మీరు యెహోవా యొక్క యథార్థమైన మద్దతుదారులని మీ క్రియల ద్వారా నిరూపిస్తారా? తనకు సమయం కొంచెమే ఉందని సాతానుకు తెలుసు గనుక, దేవుని ఎడల యథార్థతను కాపాడుకోవాలనుకునే వారిపై తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కడానికి అతడు తాను చేయగలిగినదంతా చేస్తాడు. (ప్రకటన 12:12) అయితే మీరు సహాయం కొరకు దేవునివైపు చూడవచ్చు ఎందుకంటే, “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . ప్రభువు [“యెహోవా,” NW] సమర్థుడు.” (2 పేతురు 2:9) మీరు సహించగలిగినదాన్ని మించి మీరు శోధింపబడుటకు ఆయన అనుమతించడు, మీరు శోధనలను సహించగలిగేలా ఆయన మీకు మార్గాన్ని తెరుస్తాడు.—1 కొరింథీయులు 10:13.
23. మనం దేని కొరకు నమ్మకంగా ఎదురు చూడగలము?
23 రాజైన యేసుక్రీస్తు సాతానుకు, అతన్ని అనుసరించేవారికి వ్యతిరేకంగా చర్యగైకొనే సమయం కొరకు మనం నమ్మకంతో ఎదురుచూద్దాము. (ప్రకటన 20:1-3) మానవజాతి అనుభవించిన శ్రమలు, వేదనకు బాధ్యులైన వారినందరినీ యేసు నిర్మూలిస్తాడు. ఆ సమయం వరకు, మనమనుభవించే చాలా ప్రత్యేకమైన వేదనతో కూడిన బాధ ఒకటుంది, అదేమిటంటే మన ప్రియమైన వారిని మరణమందు కోల్పోవడం. వారికి ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి తర్వాతి అధ్యాయం చదవండి.
మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
యెహోవా మానవ బాధను కలిగించడని మనకెలా తెలుసు?
సాతాను ఏదెనులో ఏ అంశాలు లేవదీశాడు యోబు కాలంలో అవెలా పరిష్కరించబడ్డాయి?
దేవుడు బాధను అనుమతించడం దేన్ని నిరూపించింది?
[అధ్యయన ప్రశ్నలు]