దేవున్ని ఘనపర్చే కుటుంబాన్ని కట్టుట
అధ్యాయము 15
దేవున్ని ఘనపర్చే కుటుంబాన్ని కట్టుట
1-3. వివాహంలో, పితృత్వం మరియు మాతృత్వంలో సాధారణంగా వచ్చే సమస్యలను కొందరు ఎందుకు పరిష్కరించుకోలేక పోతున్నారు, అయితే బైబిలు ఎందుకు సహాయం చేయగలదు?
ఒకవేళ మీరు మీ స్వంత ఇంటిని కట్టుకోవడానికి పథకం వేశారనుకోండి. మొదట మీరు స్థలం కొంటారు. ఎంతో ఆసక్తితో, మీరు మీ క్రొత్త ఇంటిని మీ మనస్సులో ఊహించుకుంటారు. కాని మీ దగ్గర ఉపకరణాలు, నిర్మాణ నైపుణ్యాలు లేకపోతే అప్పుడేమిటి? మీ ప్రయాసలు ఎంత భంగం కలిగించేవిగా ఉంటాయి!
2 ఆనందభరితమైన కుటుంబాన్ని గూర్చి కలలుకంటూ అనేకమంది దంపతులు వివాహ జీవితాన్ని ప్రారంభిస్తారు, అయితే దాన్ని కట్టడానికి అవసరమైన ఉపకరణాలు, నైపుణ్యాలు వారి దగ్గర ఉండవు. వివాహమైన మర్నాటినుండే ప్రతికూల దృక్పథాలు ఉత్పన్నమౌతాయి. కొట్లాడుకోవడం, కీచులాడుకోవడం దినచర్య అవుతుంది. పిల్లలు పుట్టినప్పుడు, ఈ నూతన తలిదండ్రులు వివాహం విషయంలో ఎలా పూర్తిగా సంసిద్ధులుగా లేరో పితృత్వం, మాతృత్వం విషయంలో కూడా అలాగే తాము సంసిద్ధులుగా లేనట్లు కనుగొంటారు.
3 అయినా ఇందుకు బైబిలు సహాయం చేయగలదనుట సంతోషకరం. దాని సూత్రాలు ఆనందభరితమైన కుటుంబాన్ని కట్టడానికి సహాయపడే ఉపకరణాల వంటివి. (సామెతలు 24:3) అదెలాగో మనం చూద్దాము.
ఆనందభరితమైన వివాహాన్ని కట్టుటకు ఉపకరణాలు
4. వివాహంలో సమస్యలు వస్తాయని ఎందుకు ఎదురుచూడవచ్చు, బైబిలునందు ఏ ప్రమాణాలు ఇవ్వబడ్డాయి?
4 ఒక వివాహిత జంట ఎంత ఈడుజోడుగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, వారు భావోద్రేక విషయంలో బాల్య అనుభవాల్లో, కుటుంబ చరిత్ర విషయంలో భిన్నంగా
ఉంటారు. గనుక, వివాహం తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయని నిరీక్షించవలసిందే. వాటితో ఎలా వ్యవహారించవచ్చు? నిర్మాణకులు ఒక ఇంటిని కట్టేటప్పుడు, వారు నమూనాలను సంప్రదిస్తారు. ఇవే మార్గదర్శక సూత్రాలు. ఆనందభరితమైన కుటుంబాన్ని నిర్మించేందుకు బైబిలు నడిపింపునిచ్చే దేవుని సూత్రాలను అందజేస్తుంది. వీటిలో కొన్నింటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాము.5. వివాహమందు యథార్థంగా ఉండడంలోని ప్రాముఖ్యతను బైబిలు ఎలా నొక్కిజెబుతోంది?
5యథార్థత. “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని” యేసు చెప్పాడు. * (మత్తయి 19:6) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” (హెబ్రీయులు 13:4) గనుక వివాహితులు తమ జత ఎడల యథార్థంగా ఉండడం యెహోవా ఎదుట తమ బాధ్యతగా భావించాలి.—ఆదికాండము 39:7-9.
6. ఒక వివాహాన్ని కాపాడడానికి యథార్థత ఎలా సహాయపడుతుంది?
6 యథార్థత వివాహానికి ఘనతను భద్రతను చేకూరుస్తుంది. ఏది వచ్చినప్పటికీ తాము ఒకరికొకరు మద్దతునిచ్చుకుంటారని యథార్థతగల దంపతులకు తెలుసు. (ప్రసంగి 4:9-12) చిన్న సమస్య తలెత్తడంతోనే తమ వివాహాన్ని విడిచిపెట్టేవారి నుండి ఇదెంత భిన్నం! అలాంటి వ్యక్తులు వెంటనే తాము ‘తప్పు వ్యక్తిని ఎన్నుకున్నామని,’ ‘తామిక ఒకరినొకరు ఎంత మాత్రం ప్రేమించుకోవడం లేదని,’ క్రొత్త జతను వెతుక్కోవడమే పరిష్కారమని నిర్ధారించుకుంటారు. కాని ఈ నిర్ధారణ ఇద్దరికీ మానసికంగా ఎదిగే అవకాశాన్నివ్వదు. బదులుగా, యథార్థతలేని అలాంటి వారు అవే సమస్యలను క్రొత్త భాగస్వాముల వద్దకు తీసుకువెళ్లవచ్చు. ఒక వ్యక్తికి చక్కటి ఇల్లుండి, పైకప్పు కారుతుంటే, అతడు తప్పకుండా దాన్ని బాగుచేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతడు ఊరకనే మరో ఇంటికి మారడు. అలాగే, వేరే జతను తెచ్చుకోవడం వివాహ సంక్షోభానికి కారణమైన వివాదాంశాలను పరిష్కరించుకోవడానికి మార్గం కాదు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, వివాహంలో తెగతెంపులు చేసుకోవడానికి ప్రయత్నించకండి, కాని దాన్ని కాపాడుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి. అలాంటి యథార్థత వివాహాన్ని రక్షించుకొనదగినదిగా, కాపాడుకొనదగినదిగా, ఆనందించదగినదిగా చేస్తుంది.
7. వివాహ దంపతులకు సంభాషణ తరచూ ఎందుకు కష్టంగా ఉంటుంది, కాని “నవీన స్వభావాన్ని ధరించడం” ఎలా సహాయపడగలదు?
సామెతలు 15:22, NW) అయితే, కొంతమంది వివాహ దంపతులకు సంభాషించుకోవడం కష్టం. ఎందుకలా? ఎందుకంటే ప్రజలకు విభిన్న సంభాషణా విధానాలుంటాయి. ఇది తరచూ చెప్పుకోదగిన అపార్థానికి, నిరుత్సాహానికి దారితీసే ఒక వాస్తవం. దీనిలో పెంపకం కొంత పాత్ర వహించవచ్చు. ఉదాహరణకు, వాళ్ల తలిదండ్రులు ఎప్పుడూ కీచులాడుకునే వాతావరణంలో కొంతమంది పెంచబడి ఉండవచ్చు. ఇప్పుడు వివాహమైన పెద్దవారిగా, వారికి తమ జతతో దయగా, ప్రేమపూర్వకమైన విధంగా ఎలా మాట్లాడాలో తెలియకపోవచ్చు. అయినప్పటికీ, మీ గృహం ‘కలహముతో కూడియున్న ఇల్లు’ కానవసరంలేదు. (సామెతలు 17:1) “నవీనస్వభావమును” ధరించుకోవడాన్ని బైబిలు నొక్కి చెబుతోంది, ఆగ్రహంతో పెద్దగా అరవడాన్ని, దుర్భాషను అది అనుమతించదు.—ఎఫెసీయులు 4:22-24, 31.
7సంభాషణ. “సమాలోచన లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును” అని ఒక బైబిలు సామెత చెబుతుంది. (8. మీరు మీ జతతో ఏకీభవించనప్పుడు ఏది సహాయకరంగా ఉండగలదు?
సామెతలు 17:14 నందలి ఈ ఉపదేశాన్ని అనుసరించడం మంచిది: “వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.” అవును, తర్వాతి వరకు అంటే మీరు, మీ జత నిమ్మళించేవరకు మీరు చర్చను ఆపవచ్చు. (ప్రసంగి 3:1, 7) ఏమి జరిగినప్పటికీ, ‘వినుటకు వేగిరపడేవారిగా, మాటలాడుటకు నిదానించువారిగా, కోపించుటకు నిదానించేవారిగా’ ఉండడానికి ప్రయత్నించండి. (యాకోబు 1:19) పరిస్థితిని మెరుగుపర్చడమే మీ గమ్యమైయుండాలి కాని వాదం గెలవడం కాదు. (ఆదికాండము 13:8, 9) మిమ్మల్ని మీ జతను శాంతపర్చేలాంటి మాటలను, సంభాషణా విధానాన్ని ఎంపిక చేసుకోండి. (సామెతలు 12:18; 15:1, 4; 29:11) అన్నిటికంటే ముఖ్యంగా, కోపం రేపే స్థితిలోనే ఉండిపోకండి, ఇద్దరు కలిసి దేవునికి దీనంగా ప్రార్థన చేయడం ద్వారా సహాయం పొందడానికి ప్రయత్నించండి.—ఎఫెసీయులు 4:26, 27; 6:18.
8 అసమ్మతి చోటుచేసుకున్నప్పుడు మీరేమి చేయవచ్చు? మీరు మీ ఉద్రేకాన్ని అదుపు చేసుకోలేకపోతే, అప్పుడు మీరు9. సంభాషణ హృదయంలో నుండి ప్రారంభమౌతుందని ఎందుకు చెప్పవచ్చు?
9 బైబిలు సామెత ఒకటి ఇలా చెబుతుంది: “జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.” (సామెతలు 16:23) అయితే మరి, విజయవంతమైన సంభాషణకు కీలకం హృదయంలో ఉందికాని, నోట్లోకాదు. మీ జత ఎడల మీ దృక్పథం ఏమిటి? “ఒకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలు” పొందుడని బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. (1 పేతురు 3:8) మీ వివాహ జత దుఃఖకరమైన రీతిగా చింతిస్తుంటే మీరు ఇది చేయగలరా? అలాగైతే, ఎలా సమాధానమివ్వాలో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.—యెషయా 50:4.
10, 11. మొదటి పేతురు 3:7 యొక్క ఉపదేశాన్ని ఒక భర్త ఎలా అన్వయించుకోగలడు?
10సన్మానము మరియు గౌరవము. క్రైస్తవ భర్తలు “యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, . . . జ్ఞానము చొప్పున వారితో కాపురము” చేయాలని చెప్పబడ్డారు. (1 పేతురు 3:7) భార్యను సన్మానించడంలో ఆమె విలువను గుర్తించడం చేరివుంది. తన భార్యతో “జ్ఞానము చొప్పున” కాపురం చేసే భర్తకు ఆమె భావాలు, శక్తిసామర్థ్యాలు, జ్ఞానం మరియు గౌరవం ఎడల ఉన్నత భావం ఉంటుంది. యెహోవా స్త్రీలను ఎలా దృష్టిస్తాడో, వారినెలా చూడాలని ఆయన కోరుకుంటాడో తెలుసుకోవాలని కూడా అతడిష్టపడాలి.
11 మీ ఇంట్లో, ప్రాముఖ్యంగా సున్నితమైన ఎంతో ఉపయోగకరమైన పాత్ర ఒకటి మీ దగ్గర ఉందనుకుందాము. దాన్ని మీరు ఎంతో జాగ్రత్తతో చూసుకోరా? అలాగే, పేతురు అదే తీరులో “బలహీనమైన ఘటము” అనే పదాన్ని ఉపయోగించాడు, ఇది క్రైస్తవ భర్త తన ప్రియమైన భార్య ఎడల కనికరంతో కూడిన శ్రద్ధను కనబర్చేందుకు అతన్ని పురికొల్పాలి.
12. ఒక భార్య తాను తన భర్తను ఎంతో గౌరవిస్తున్నానని ఎలా చూపించగలదు?
12 అయితే బైబిలు భార్యకు ఏ ఉపదేశాన్నిస్తోంది? పౌలు ఇలా వ్రాశాడు: “భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసీయులు 5:33) భార్య ఎలాగైతే తన జతచేత సన్మానింపబడుతున్నానని, ప్రియంగా ప్రేమించబడుతున్నానని భావించడం అవసరమో, అలాగే ఒక భర్త తాను తన భార్యచే గౌరవించబడుతున్నానని భావించడం అవసరం. గౌరవనీయురాలైన భార్య తన భర్త క్రైస్తవుడైనప్పటికీ కాకపోయినప్పటికీ అతని పొరపాట్లను ఆలోచనారహితంగా అందరికీ ప్రచారం చేయదు. ఆమె, ఒంటరిగా ఉన్నప్పుడు గాని లేక బహిరంగంగా గాని అతన్ని విమర్శించడం మరియు హీనపర్చడం ద్వారా అతని గౌరవాన్ని తక్కువ చేయదు.—1 తిమోతి 3:11; 5:13.
13. సమాధానకరమైన విధంగా దృక్పథాలను ఎలా వ్యక్తపర్చవచ్చు?
13 అంటే దీని భావం భార్య తన అభిప్రాయాలను వ్యక్తపర్చకూడదని కాదు. ఆమెకు ఏదైనా బాధ కలిగితే, ఆమె దాన్ని గౌరవపూర్వకంగా వ్యక్తపర్చవచ్చు. (ఆదికాండము 21:9-12) ఆమె తన అభిప్రాయాన్ని తన భర్తకు చెప్పడాన్ని అతనివైపుకు ఒక బంతిని విసరడంతో పోల్చవచ్చు. అతడు దాన్ని సులభంగా అందుకోగలిగేలా సున్నితంగా ఆమె దాన్ని నెమ్మదిగా విసరగలదు లేదా అతన్ని గాయపర్చేంత బలంగా దాన్ని రువ్వగలదు. ఇరువురూ నిందలు విసురుకోవడం నివారించి, దానికి బదులుగా, దయాపూర్వకంగా సున్నితమైన రీతిలో మాట్లాడుకోవడం ఎంత శ్రేష్ఠం!—మత్తయి 7:12; కొలొస్సయులు 4:6; 1 పేతురు 3:3, 4.
14. వివాహంలో బైబిలు సూత్రాలను అన్వయించుకొనే విషయంలో మీ జత ఎక్కువ ఆసక్తి కనబర్చకపోతే మీరేమి చేయాలి?
14 మనం గమనించినట్లుగా, మీరు ఆనందభరితమైన వివాహాన్ని కట్టుటకు 1 పేతురు 3:1, 2) అయితే, బైబిలు ఎడల ఆసక్తి లేని భార్యవున్న భర్తకు కూడా ఇది వర్తిస్తుంది. మీ జత ఏమి చేయాలని ఎంపిక చేసుకున్నప్పటికీ, బైబిలు సూత్రాలు మిమ్మల్ని శ్రేష్ఠమైన భర్తను లేక భార్యను చేయనివ్వండి. దేవుని గూర్చిన జ్ఞానం మిమ్మల్ని శ్రేష్ఠమైన తల్లిని లేక తండ్రిని కూడా చేయగలదు.
బైబిలు సూత్రాలు మీకు సహాయం చేయగలవు. కాని బైబిలు చెప్పేదానియందు మీ జత ఎక్కువ ఆసక్తి చూపకపోతే అప్పుడేమిటి? దేవుని గూర్చిన జ్ఞానాన్ని మీ పాత్రకు అన్వయించుకుంటే ఇంకా ఎంతో సాధించవచ్చు. పేతురు ఇలా వ్రాశాడు: “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (దేవుని గూర్చిన జ్ఞానానికి అనుగుణంగా పిల్లలను పెంచడం
15. తప్పుడు పెంపకపు పద్ధతులు కొన్నిసార్లు ఎలా ఒకరి నుండి మరొకరికి అందజేయబడతాయి, కాని ఈ వలయాన్ని ఎలా చేధించవచ్చు?
15 కేవలం ఒక రంపమును లేక సుత్తిని కలిగివుండడం ఒక వ్యక్తిని నైపుణ్యంగల వడ్రంగిని చేయదు. అలాగే, కేవలం పిల్లలను కలిగివుండడం ఒకరిని నైపుణ్యంగల తల్లిని లేక తండ్రిని చేయదు. తెలిసో తెలియకో, తలిదండ్రులు తరచూ తాము పెంచబడిన విధంగానే తమ పిల్లలను పెంచుతారు. అలా పిల్లలను పెంచే లోపంగల విధానాలు కొన్నిసార్లు ఒక తరం నుండి మరో తరానికి మార్పు చేయబడతాయి. ఒక ప్రాచీన హెబ్రీ సామెత ఇలా చెబుతుంది: “తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెను.” అయితే, ఒక వ్యక్తి తన తలిదండ్రులు చూపించిన మాదిరినే అనుసరించవలసిన అవసరంలేదని లేఖనాలు చూపిస్తున్నాయి. అతడు యెహోవా ప్రమాణాలచే ప్రభావితం చేయబడిన వేరే మార్గాన్ని ఎన్నుకోవచ్చు.—యెహెజ్కేలు 18:2, 14, 17.
16. మీ కుటుంబాన్ని పోషించడం ఎందుకు ప్రాముఖ్యము, దానిలో ఏమి ఇమిడి ఉంది?
16 క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలకు సరైన నడిపింపును, శ్రద్ధను ఇవ్వాలని యెహోవా కోరుతున్నాడు. పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము 1 తిమోతి 5:8) ఎంత శక్తివంతమైన మాటలు! కుటుంబాన్ని పోషించవలసిన మీ బాధ్యతను నెరవేర్చడం దైవభక్తిగల వ్యక్తియొక్క ఆధిక్యత మరియు బాధ్యత, అందులో మీ పిల్లల శారీరక, ఆత్మీయ, మానసిక అవసరతల ఎడల శ్రద్ధ వహించడం చేరివుంది. తలిదండ్రులు తమ పిల్లల కొరకు ఆనందభరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయపడే సూత్రాలను బైబిలు అందజేస్తుంది. వీటిలో కొన్నింటిని పరిశీలించండి.
చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (17. మీ పిల్లలు తమ హృదయాల్లో దేవుని సూత్రాలను కలిగివుండాలంటే ఏమి అవసరము?
17మంచి మాదిరిని ఉంచండి. ఇశ్రాయేలు తలిదండ్రులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “నీవు నీ కుమారులకు వాటిని [“దేవుని మాటలను,” NW] అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” తలిదండ్రులు తమ పిల్లలకు దేవుని కట్టడలను బోధించవలసి ఉండిరి. ఈ బోధకు ముందు ఈ వ్యాఖ్యానం ఇవ్వబడింది: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:6, 7, ఐటాలిక్కులు మావి.) అవును, తలిదండ్రులు తమవద్ద లేనివాటిని పిల్లలకు ఇవ్వలేరు. దేవుని కట్టడలు మీ పిల్లల హృదయాలపై వ్రాయబడాలని మీరు కోరుకుంటే మొదట అవి మీ స్వంత హృదయాలపై ముద్రించబడాలి.—సామెతలు 20:7; లూకా 6:40 పోల్చండి.
18. ప్రేమను వ్యక్తం చేయడంలో యెహోవా తలిదండ్రుల కొరకు ఎలా ఒక శ్రేష్ఠమైన మాదిరినుంచాడు?
18మీ ప్రేమను గూర్చిన నిశ్చయతనివ్వండి. యేసు బాప్తిస్మం సమయంలో, యెహోవా ఇలా ప్రకటించాడు: ‘నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను.’ (లూకా 3:22) అలా యెహోవా తన కుమారున్ని బట్టి తాను ఆనందిస్తున్నట్లు వ్యక్తపరుస్తూ, తన ప్రేమ యొక్క నిశ్చయతనిస్తూ ఆయనను గుర్తించాడు. ఆ తర్వాత, యేసు తన తండ్రికి ఇలా చెప్పాడు: “జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.” (యోహాను 17:24) కాబట్టి, దైవభక్తిగల తలిదండ్రులుగా, వారి ఎడల మీకున్న ప్రేమను మాటల ద్వారా క్రియల ద్వారా వ్యక్తపర్చండి—తరచూ అలా చేయండి. “ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును” అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.—1 కొరింథీయులు 8:1.
19, 20. పిల్లలకు సరైన క్రమశిక్షణనివ్వడంలో ఏమి ఇమిడివుంది, యెహోవా మాదిరినుండి తలిదండ్రులు ఎలా ప్రయోజనం పొందగలరు?
సామెతలు 1:8) తమ పిల్లలకు నడిపింపునివ్వవలసిన తమ బాధ్యతను ఇప్పుడు తప్పించుకొనే తలిదండ్రులు, భవిష్యత్తులో తప్పకుండా బాధాకరమైన పరిణామాలను ఎదుర్కొంటారు. అయితే, తలిదండ్రులు మరీ విపరీతంగా ప్రవర్తించకుండ కూడా హెచ్చరింపబడ్డారు. పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) తలిదండ్రులు తమ పిల్లలను ఎక్కువగా తప్పులు దిద్దడం లేక వారి పొరపాట్ల గురించి తదేకంగా చీవాట్లు పెట్టడం, వారి ప్రయత్నాలను విమర్శించడం వంటివి చేయకూడదు.
19క్రమశిక్షణ. ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను బైబిలు నొక్కి చెబుతుంది. (20 మన పరలోక తండ్రియైన యెహోవా దేవుడు క్రమశిక్షణనివ్వడంలో మాదిరినుంచాడు. ఆయన తప్పు దిద్దడంలో ఎన్నడూ తీవ్రంగా ఉండలేదు. దేవుడు తన ప్రజలకిలా చెప్పాడు: “న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను.” (యిర్మీయా 46:28) ఈ విషయంలో తలిదండ్రులు యెహోవాను అనుకరించాలి. క్రమశిక్షణ సహేతుకమైన పరిధులను దాటితే లేక సరిదిద్దడం మరియు బోధించడం యొక్క ఉద్దేశించిన సంకల్పాన్ని దాటిపోతే నిజంగా అది వేదన కలిగించేదౌతుంది.
21. తమ క్రమశిక్షణ ప్రభావవంతంగా ఉందో లేదో తలిదండ్రులు ఎలా నిర్ధారించుకోగలరు?
21 తమ క్రమశిక్షణ ప్రభావవంతంగా ఉందో లేదో తలిదండ్రులు ఎలా నిర్ధారించుకోగలరు? వారు తమను తామిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నా క్రమశిక్షణ ఏమి సాధిస్తుంది?’ అది బోధించేదై ఉండాలి. క్రమశిక్షణ ఎందుకివ్వబడుతుందో మీ పిల్లవానికి అర్థం కావాలి. దిద్దుబాటు తర్వాత సంభవించే పరిణామాల గురించి కూడా తలిదండ్రులు శ్రద్ధ కలిగివుండాలి. నిజమే, మొదట పిల్లలందరూ క్రమశిక్షణ అంటే చిరాకు పడతారు. (హెబ్రీయులు 12:11) కాని క్రమశిక్షణ అనేది పిల్లవాడు భయపడేలా లేక విడిచిపెట్టబడినట్లు లేక తాను జన్మతః దుష్టుడినని భావించేలా చేయకూడదు. తన ప్రజలను సరిదిద్దే ముందు, యెహోవా ఇలా చెప్పాడు: “నేను నీకు తోడైయున్నాను భయపడకుము.” (యిర్మీయా 46:28) అవును, ప్రేమగల మరియు మద్దతునిచ్చే తలిదండ్రులుగా మీరు అతనితో లేక ఆమెతో ఉన్నారని భావించే విధంగా సరిదిద్దడం అన్నది జరగాలి.
“నీతి సూత్రములను” సంపాదించుకొనుట
22, 23. ఆనందభరితమైన కుటుంబాన్ని నిర్మించడానికి అవసరమైన నడిపింపును మీరెలా పొందగలరు?
22 ఆనందభరితమైన కుటుంబాన్ని కట్టుటకు మనకు అవసరమైన ఉపకరణాలను యెహోవా మనకిచ్చాడని మనం కృతజ్ఞత కలిగివుండవచ్చు. కాని కేవలం ఉపకరణాలను కలిగివుండడం మాత్రమే సరిపోదు. మనం వాటిని సరైన విధంగా ఉపయోగించడాన్ని అభ్యసించాలి. ఉదాహరణకు, ఒక నిర్మాణకుడు తాను ఉపకరణాలను ఉపయోగించే విషయంలో సరైన అలవాట్లను పెంపొందింపజేసుకోలేక పోవచ్చు. అతడు కొన్నింటిని పూర్తిగా తప్పుగానే ఉపయోగించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, అతడు ఉపయోగించే పద్ధతులు తప్పకుండా తక్కువ రకంవాటినే ఉత్పన్నం చేస్తాయి. అలాగే, మీ కుటుంబంలోకి మెల్లిగా ప్రవేశించిన అనారోగ్యకరమైన అలవాట్ల గురించి మీకు ఇప్పుడు తెలిసుండవచ్చు. వాటిలో కొన్ని బలంగా పాతుకుపోయి, మార్చడం కష్టం కావచ్చు. అయినా, బైబిలు యొక్క ఈ ఉపదేశాన్ని అనుసరించండి: “జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.”—సామెతలు 1:5.
23 దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందడంలో కొనసాగడం ద్వారా మీరు నీతి సూత్రాలను పొందవచ్చు. కుటుంబ జీవితానికి అన్వర్తించే బైబిలు సూత్రాలను తెలుసుకొని, అవసరమైన చోట మార్పులు చేసుకోండి. వివాహ దంపతులుగా, తలిదండ్రులుగా మంచి మాదిరిని ఉంచిన పరిపక్వత చెందిన క్రైస్తవులను గమనించండి. వారితో మాట్లాడండి. అన్నిటికంటే ముఖ్యంగా, మీ అవసరాలను ప్రార్థనలో యెహోవాకు తెలియజేయండి. (కీర్తన 55:22; ఫిలిప్పీయులు 4:6, 7) ఆయనను ఘనపర్చే ఆనందభరితమైన కుటుంబ జీవితాన్ని మీరు పొందడానికి ఆయన మీకు సహాయం చేయగలడు.
[అధస్సూచీలు]
^ పేరా 5 తిరిగి వివాహం చేసుకోవడాన్ని అనుమతించే ఏకైక లేఖనాధారం “వ్యభిచారం”—వివాహ బాంధవ్యానికి వెలుపల లైంగిక సంబంధాలు.—మత్తయి 19:9.
మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
ఆనందభరితమైన వివాహానికి యథార్థత, సంభాషణ, గౌరవమర్యాదలు ఎలా దోహదపడతాయి?
తమ ప్రేమ గురించి తలిదండ్రులు వారి పిల్లలకు ఏయే విధాలుగా నిశ్చయతను కలిగించగలరు?
సరైన క్రమశిక్షణలో ఏయే అంశాలు ఇమిడి ఉన్నాయి?
[అధ్యయన ప్రశ్నలు]
[147వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]