కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవున్ని నిరంతరం సేవించడమే మీ లక్ష్యంగా చేసుకోండి

దేవున్ని నిరంతరం సేవించడమే మీ లక్ష్యంగా చేసుకోండి

అధ్యాయము 18

దేవున్ని నిరంతరం సేవించడమే మీ లక్ష్యంగా చేసుకోండి

1, 2. దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందడమేగాక ఇంకా ఏది అవసరము?

గొప్ప ధనరాసులున్న గదికి తాళం పెట్టిన తలుపు ఎదుట మీరు నిలబడి ఉన్నారనుకోండి. అధికారం గల ఒక వ్యక్తి మీకు తాళం చెవి ఇచ్చి దాన్ని తెరిచి, అందులోని విలువైన వస్తువులు తీసుకోమని మీకు చెప్పాడని అనుకుందాము. మీరు ఆ తాళం చెవిని ఉపయోగించనిదే అది మీకు ఏ మంచిని చేయలేదు. అలాగే, మీకు జ్ఞానంవల్ల ప్రయోజనం కలగాలంటే మీరు దాన్ని ఉపయోగించాలి.

2 ప్రాముఖ్యంగా దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో ఇది నిజం. వాస్తవానికి, యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తులను గూర్చిన కచ్చితమైన జ్ఞానమంటే దాని భావం నిత్యజీవమే. (యోహాను 17:3) అయినా, కేవలం జ్ఞానాన్ని కలిగివుండడం ద్వారా మాత్రమే ఆ ఉత్తరాపేక్ష వాస్తవం కానేరదు. మీరు విలువైన తాళం చెవిని ఎలాగైతే ఉపయోగిస్తారో, అలాగే దేవుని గూర్చిన జ్ఞానాన్ని మీరు మీ జీవితంలో అన్వయించుకోవాలి. దేవుని చిత్తాన్ని చేసే వారు ‘రాజ్యములో ప్రవేశిస్తారు’ అని యేసు చెప్పాడు. అలాంటి వ్యక్తులు దేవున్ని నిరంతరం సేవించే అధిక్యతను పొందుతారు!—మత్తయి 7:21; 1 యోహాను 2:17.

3. మన ఎడల దేవుని చిత్తం ఏమైయుంది?

3 దేవుని చిత్తమేమిటో తెలుసుకున్న తర్వాత దాన్ని చేయడం ప్రాముఖ్యం. మీకొరకు దేవుని చిత్తం ఏమైయున్నదని మీరు భావిస్తున్నారు? దాన్ని ఈ మాటల్లో క్లుప్తీకరించవచ్చు: యేసును అనుకరించండి. “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను” అని 1 పేతురు 2:21 మనకు తెలియజేస్తుంది. గనుక, దేవుని చిత్తాన్ని చేయడానికి మీరు యేసు మాదిరిని వీలైనంత సన్నిహితంగా అనుసరించడం అవసరం. ఆ విధంగా మీరు దేవుని గూర్చిన జ్ఞానాన్ని అన్వయించుకుంటారు.

దేవుని గూర్చిన జ్ఞానాన్ని యేసు ఎలా ఉపయోగించుకున్నాడు

4. యేసుకు యెహోవా గురించి ఎక్కువగా ఎందుకు తెలుసు, ఆయన ఈ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాడు?

4 దేవుని గూర్చిన సన్నిహిత జ్ఞానం ఇతరుల కంటే యేసుక్రీస్తుకు ఎక్కువగా ఉంది. ఆయన భూమ్మీదికి రాకముందు యెహోవా దేవునితోపాటు యుగయుగాలు జీవించి, పనిచేశాడు. (కొలొస్సయులు 1:15, 16) ఆ జ్ఞానమంతటితో యేసు ఏమి చేశాడు? ఆయన కేవలం దాన్ని పొందడంతోనే తృప్తిపడలేదు. యేసు దానికి అనుగుణంగా జీవించాడు. అందుకే ఆయన తన తోటి మానవులతో వ్యవహరించేటప్పుడు అంత దయ, ఓర్పు, ప్రేమ కలిగివుండేవాడు. యేసు అలా తన పరలోక తండ్రిని అనుకరిస్తూ, యెహోవా మార్గాలను, వ్యక్తిత్వాన్ని గూర్చిన తన జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించేవాడు.—యోహాను 8:23, 28, 29, 38; 1 యోహాను 4:8.

5. యేసు ఎందుకు బాప్తిస్మం పొందాడు, ఆయన తన బాప్తిస్మం యొక్క అర్థానికి తగినట్లుగా ఎలా జీవించాడు?

5 యేసు కలిగివున్న జ్ఞానం ఆయన ఒక కష్టతరమైన చర్య గైకొనడానికి కూడా ఆయనను కదలించింది. ఆయన గలిలయ నుండి యొర్దాను నది వద్దకు వచ్చాడు, అక్కడ యోహాను ఆయనకు బాప్తిస్మమిచ్చాడు. (మత్తయి 3:13-15) యేసు బాప్తిస్మం దేన్ని సూచించింది? ఒక యూదునిగా, ఆయన దేవునికి సమర్పించబడిన జనాంగములో జన్మించాడు. గనుక, యేసు పుట్టుక నుండే సమర్పించుకున్నాడు. (నిర్గమకాండము 19:5, 6) బాప్తిస్మానికి సమర్పించుకోవడం ద్వారా, తాను ఆ సమయంలో చేయవలసిన దైవిక చిత్తాన్ని చేయడానికి ఆయన తనను తాను యెహోవాకు అందజేసుకుంటుండెను. (హెబ్రీయులు 10:5, 7) యేసు తన బాప్తిస్మానికి తగినట్లుగా జీవించాడు. ప్రతి అవకాశంలో దేవుని గూర్చిన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకుంటూ, ఆయన యెహోవా సేవలో ఎంతో శ్రమించాడు. దేవుని చిత్తాన్ని చేయడం తనకు ఆహారం వంటిదని కూడా చెబుతూ, యేసు దాన్ని చేయడంలో ఆనందాన్ని పొందాడు.—యోహాను 4:34.

6. యేసు ఏ విధంగా తనను తాను ఉపేక్షించుకున్నాడు?

6 యెహోవా చిత్తాన్ని చేయడమంటే తాను ఎంతో మూల్యం చెల్లించవలసి ఉంటుందని అంటే, తన జీవితాన్నే ధారపోయాల్సి ఉంటుందని యేసు పూర్తిగా గుర్తించాడు. అయినప్పటికీ, యేసు తన వ్యక్తిగత అవసరతలను రెండవ స్థానంలో ఉంచడం ద్వారా తనను తాను ఉపేక్షించుకున్నాడు. దేవుని చిత్తాన్ని చేయడం ఎప్పుడు మొదటి స్థానం వహించేది. ఈ విషయంలో, మనం యేసు పరిపూర్ణ మాదిరిని ఎలా అనుసరించగలము?

నిత్యజీవానికి నడిపే చర్యలు

7. బాప్తిస్మం కొరకు అర్హులు కావాలంటే ఒకరు తీసుకోవలసిన కొన్ని చర్యలు ఏవి?

7 యేసు వలె మనం పరిపూర్ణులం కాము, మనం కొన్ని ప్రాముఖ్యమైన చర్యలు గైకొన్న తర్వాత మాత్రమే బాప్తిస్మమనే మైలురాయిని చేరుకోగలం. యెహోవా దేవుడు, యేసుక్రీస్తులను గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని మన హృదయాల్లోకి తీసుకోవడం ద్వారా ఇది ప్రారంభమౌతుంది. దీన్ని చేయడం మూలాన అది మనం విశ్వాసముంచేలా, దేవుని ఎడల లోతైన ప్రేమను కలిగివుండేలా చేస్తుంది. (మత్తయి 22:37-40; రోమీయులు 10:17; హెబ్రీయులు 11:6) దేవుని ఆజ్ఞలు, సూత్రాలు, కట్టడలతో పొందిక కలిగి ఉండడం, మన గత పాపాల గురించి దైవిక చింతను వ్యక్తపరుస్తూ పశ్చాత్తాపపడేందుకు మనల్ని కదలించాలి. ఇది మార్పుకు నడిపిస్తుంది, అంటే, మనకు దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు మనం అనుసరించిన తప్పుడు ప్రవర్తనను విడిచిపెట్టి, మరలడానికి నడిపిస్తుంది. (అపొస్తలుల కార్యములు 3:19) సహజంగా, నీతియుక్తమైనది చేయడానికి బదులుగా మనం ఇప్పటికీ రహస్యంగా పాపం చేస్తున్నట్లైతే, మనం నిజంగా మారనట్లే, లేక దేవున్ని మోసగించనట్లే. యెహోవా వేషధారణనంతటినీ కనిపెట్టగలడు.—లూకా 12:2, 3.

8. రాజ్యప్రకటన పనిలో భాగం వహించాలని మీరు కోరుకుంటే మీరు ఏ చర్య గైకొనాలి?

8 ఇప్పుడు మీరు దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుతున్నారు గనుక, ఆత్మీయ విషయాలను వ్యక్తిగతమైన విధంగా పరిశీలించడం సరైనదికాదా? బహుశా మీరు నేర్చుకుంటున్నదాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చెప్పాలని మీకు ఆసక్తి ఉండవచ్చు. వాస్తవానికి, మీరు ఇప్పటికే ఈ పనిని చేస్తుండవచ్చు, యేసు కూడా అలాగే తటస్థంగా సువార్తను ఇతరులతో పంచుకున్నాడు. (లూకా 10:38, 39; యోహాను 4:6-15) ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఇష్టం ఉండవచ్చు. మీరు అర్హులేనా, యెహోవాసాక్షుల రాజ్యప్రకటన పనిలో మీరు కొంతవరకు భాగం వహించగలుగుతారా అనేవి నిర్ధారించడానికి మీతో మాట్లాడేందుకు క్రైస్తవ పెద్దలు సంతోషిస్తారు. మీరు అలా చేయగలిగితే, పరిచర్యలో మీరు ఒక సాక్షితో కలిసి వెళ్లేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తారు. తమ పరిచర్యను క్రమమైన విధంగా కొనసాగించేందుకు యేసు శిష్యులు ఆయన ఉపదేశాలను అనుసరించారు. (మార్కు 6:7, 30; లూకా 10:1) రాజ్య వర్తమానాన్ని ఇంటింటికి మరియు ఇతర విధాలలో వ్యాప్తి చేయడంలో మీరు భాగం వహిస్తుండగా, అలాంటి సహాయం నుండి మీరు ప్రయోజనం పొందుతారు.—అపొస్తలుల కార్యములు 20:20, 21.

9. ఒక వ్యక్తి దేవునికి ఎలా సమర్పించుకోగలడు, సమర్పణ ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

9 సంఘమునకివ్వబడిన ప్రాంతంలోని అన్ని రకాలైన ప్రజలకు సువార్తను ప్రకటించడం యథార్థపరులను కనుగొనడానికి ఒక మార్గం మరియు మీకు విశ్వాసముందని నిరూపించే మంచి పనులలో ఒకటి. (అపొస్తలుల కార్యములు 10:34, 35; యాకోబు 2:17, 18, 26) క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడం మరియు ప్రకటన పనిలో అర్థవంతమైన భాగాన్ని కలిగివుండడం, మీరు పశ్చాత్తాపపడి మారారని, ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానానికి అనుగుణంగా జీవించాలని నిశ్చయించుకున్నారని చూపించడానికి కూడా మార్గాలైయున్నాయి. సరే, ఇక తర్వాత న్యాయంగా చేయవలసిన పని ఏమిటి? అది, యెహోవా దేవునికి సమర్పించుకోవడం. మీరు ఇష్టపూర్వకంగా, పూర్ణహృదయంతో ఆయన చిత్తాన్ని చేయడానికి ఆయనకు మీ జీవితాన్ని ఇస్తున్నారని మీరు హృదయపూర్వకంగా ప్రార్థనలో దేవునికి చెప్పడమని దాని భావం. మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకోవడానికి, యేసుక్రీస్తు యొక్క సుళువైన కాడిని అంగీకరించడానికి ఇది మార్గం.—మత్తయి 11:29, 30.

బాప్తిస్మం—మీకు దాని భావం ఏమైయున్నది

10. మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్న తర్వాత మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి?

10 యేసు చెప్పినదాని ప్రకారం, ఆయన శిష్యులయ్యే వారందరు బాప్తిస్మం పొందాలి. (మత్తయి 28:19, 20) మీరు దేవునికి సమర్పించుకున్న తర్వాత ఇది ఎందుకు అవసరం? మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్నారు గనుక, మీరు ఆయనను ప్రేమిస్తున్నారని ఆయనకు తెలుసు. దేవుని ఎడల మీకున్న ప్రేమను ఇతరులు తెలుసుకోగలిగేలా ఇంకను చర్య తీసుకోవాలని మీరు నిస్సందేహంగా కోరుకుంటారు. అయితే, యెహోవా దేవునికి మీరు చేసుకున్న సమర్పణ బహిరంగంగా తెలియజేయడానికి బాప్తిస్మం మీకు ఒక అవకాశాన్నిస్తుంది.—రోమీయులు 10:9, 10.

11. బాప్తిస్మమంటే అర్థమేమిటి?

11 బాప్తిస్మంలో ఎంతో సూచనార్థక భావంకూడా ఉంది. మీరు పూర్తిగా మునిగినప్పుడు, లేక నీటిక్రింద “పాతిపెట్టబడి” నప్పుడు, మీరు మీ గత జీవిత విధానం విషయంలో మరణించినట్లు భావం. మీరు నీళ్లలో నుండిపైకి వచ్చినప్పుడు, మీరు క్రొత్త జీవితానికి అంటే మీ స్వంత ఇష్టంచేత గాక దేవుని చిత్తంచేత నడిపించబడే క్రొత్త జీవితానికి వస్తున్నారని భావం. అయితే, దాని భావం మీరు ఇక ఏ పొరపాట్లు చేయరని కాదు, ఎందుకంటే మనమందరం అపరిపూర్ణులం గనుక ప్రతిదినం మనం పాపం చేస్తాము. అయితే, యెహోవా యొక్క సమర్పిత, బాప్తిస్మం పొందిన సేవకులుగా మీరు ఆయనతో ఒక ప్రత్యేకమైన సంబంధంలోకి వస్తున్నారు. మీ పశ్చాత్తాపం మరియు బాప్తిస్మం పొందడానికి మీ దీనమైన విధేయత మూలంగా, యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవా మీ పాపాలను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా బాప్తిస్మం అనేది, దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షిని కలిగివుండేందుకు నడిపిస్తుంది.—1 పేతురు 3:21.

12. (ఎ) ‘తండ్రి నామమున,’ (బి) ‘కుమారుని నామమున,’ (సి) ‘పరిశుద్ధాత్మ నామమున’ బాప్తిస్మం పొందడమంటే దాని భావమేమిటి?

12 క్రొత్త శిష్యులకు “తండ్రి యొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తిస్మమివ్వండని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:19) యేసు భావమేమై ఉండెను? “తండ్రి . . . నామములో” బాప్తిస్మం పొందడమంటే, బాప్తిస్మం పొందే వ్యక్తి యెహోవా దేవున్ని సృష్టికర్తగా, విశ్వ సర్వాధిపతిగా పూర్ణహృదయంతో అంగీకరిస్తున్నాడని సూచిస్తుంది. (కీర్తన 36:9; 83:18; ప్రసంగి 12:1) ‘కుమారుని నామమున’ బాప్తిస్మం పొందడమంటే, యేసు క్రీస్తును—ప్రాముఖ్యంగా ఆయన విమోచన క్రయధన బలిని—దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక రక్షణ మార్గమని ఒక వ్యక్తి అంగీకరించడమని భావం. (అపొస్తలుల కార్యములు 4:12) ‘పరిశుద్ధాత్మ నామమున’ బాప్తిస్మం పొందడమంటే, తన సంకల్పాలు నెరవేర్చుకొనేందుకు మరియు ఆత్మచే నడిపింపబడే తన సంస్థతో కలిసి తన నీతియుక్తమైన చిత్తాన్ని చేయగలిగేలా తన సేవకులను బలపర్చేందుకు యెహోవా యొక్క పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి దేవుని ఉపకరణమని బాప్తిస్మం పొందే వ్యక్తి గుర్తించడాన్ని సూచిస్తుంది.—ఆదికాండము 1:2; కీర్తన 104:30; యోహాను 14:26; 2 పేతురు 1:21.

మీరు బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నారా?

13, 14. యెహోవా దేవున్ని సేవించేందుకు ఎన్నుకోవడానికి మనం ఎందుకు భయపడకూడదు?

13 బాప్తిస్మం ఎంతో అర్థవంతమైనది, ఒక వ్యక్తి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన మైలురాయి వంటిది గనుక, అది మీరు భయపడవలసిన చర్యయేనా? ఎంతమాత్రం కాదు! అయితే బాప్తిస్మం పొందాలని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం చులకనగా తీసుకోకూడదు. నిస్సంశయంగా అది మీరు తీసుకోగల అత్యంత జ్ఞానయుక్తమైన నిర్ణయం.

14 యెహోవా దేవున్ని సేవించడానికి మీరు చేసుకున్న ఎంపికకు బాప్తిస్మం ఒక నిదర్శనం. మీకు పరిచయమున్న ప్రజల గురించి ఆలోచించండి. వారిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఒక యజమానికి సేవచేయడం లేదా? కొందరు సంపదల కొరకు సేవచేస్తారు. (మత్తయి 6:24) ఇతరులు తమ ఉద్యోగాల కొరకు ఎంతో ప్రయాసపడతారు లేక తమ స్వంత కోరికలను తీర్చుకోవడమే జీవితంలో ప్రాముఖ్యమైనదిగా చేసుకోవడం ద్వారా తమను తాము సేవించుకుంటారు. మరి ఇతరులు అబద్ధ దేవుళ్లను సేవిస్తారు. కాని మీరు సత్య దేవుడైన యెహోవాను సేవించడానికి ఎన్నుకున్నారు. ఆయనంత దయను, వాత్సల్యాన్ని, ప్రేమను మన ఎడల మరెవ్వరూ చూపరు. వారిని రక్షణకు నడుపగల సంకల్పవంతమైన పనితో దేవుడు మానవులను ఘనపరుస్తాడు. ఆయన తన సేవకులకు నిత్యజీవమనే ప్రతిఫలమిస్తాడు. నిజంగా, యేసు మాదిరిని అనుసరించడం, మీ జీవితాన్ని యెహోవాకు ఇవ్వడం భయపడవలసిన విషయం కాదు. వాస్తవానికి, అది మాత్రమే దేవునికి ప్రీతికరమైనది, పూర్తిగా సహేతుకమైనది.—1 రాజులు 18:21.

15. బాప్తిస్మానికి కొన్ని సామాన్యమైన ఆటంకాలేవి?

15 అయితే, బాప్తిస్మమన్నది ఎవరో ఒత్తిడి చేయడం వల్ల తీసుకొనే చర్య కాదు. అది యెహోవాకు మీకు మధ్యనున్న వ్యక్తిగత విషయం. (గలతీయులు 6:4) మీరు ఆత్మీయాభివృద్ధి చెందుతారు గనుక మీరిలా తలంచి ఉండవచ్చు: “బాప్తిస్మము పొందకుండ నన్నేది అటంకపరుస్తుంది?” (అపొస్తలుల కార్యములు 8:35, 36, NW) మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవచ్చు, ‘కుటుంబ వ్యతిరేకత నన్ను ఆటంకపరుస్తోందా? నేను ఇప్పటికీ లేఖనరహితమైన పరిస్థితిలో లేక పాపభరితమైన అలవాటులో ఇమిడి ఉన్నానా? సమాజంలో అభిమానాన్ని కోల్పోతానని నేను భయపడుతున్నానా?’ ఇవి పరిశీలించవలసిన కొన్ని కారణాలు, అయితే వాటిని వాస్తవికంగా తూచిచూడండి.

16. యెహోవాను సేవించడం ద్వారా మీరెలా ప్రయోజనం పొందగలరు?

16 యెహోవాను సేవించడం వల్ల వచ్చే ప్రయోజనాలను పరిశీలించకుండా ప్రతికూల కారణాలనే తూచిచూడడం వాస్తవం కాదు. ఉదాహరణకు, కుటుంబ వ్యతిరేకతనుగూర్చి పరిశీలించండి. తన శిష్యులు ఆయనను వెంబడించినందున వారి బంధువులను పోగొట్టుకున్నప్పటికీ వారు బహు పెద్ద ఆత్మీయ కుటుంబాన్ని పొందుతారని యేసు వాగ్దానం చేశాడు. (మార్కు 10:29, 30) ఈ తోటి విశ్వాసులు మీ ఎడల సహోదర ప్రేమను చూపిస్తారు, హింసను సహించేందుకు మీకు సహాయం చేస్తారు, జీవానికి నడిపే మార్గంలో మీకు మద్దతునిస్తారు. (1 పేతురు 5:9) ప్రాముఖ్యంగా, సమస్యలను ఎదుర్కోవడానికి, ఇతర సవాళ్లను విజయవంతంగా అధిగమించడానికి సంఘ పెద్దలు మీకు సహాయం చేస్తారు. (యాకోబు 5:14-16) ఈ లోకంలో అభిమానాన్ని కోల్పోవడం విషయంలో మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవచ్చు, ‘విశ్వ సృష్టికర్త యొక్క అంగీకారం పొందడానికి, నేను ఎన్నుకొన్న జీవన విధానం ద్వారా ఆయనకు ఆనందం కలుగజేయడాన్ని దేనితో పోల్చగలము?’—సామెతలు 27:11.

మీ సమర్పణ మరియు బాప్తిస్మమునకు తగినట్లుగా జీవించడం

17. బాప్తిస్మమును ముగింపుకు బదులుగా ప్రారంభమని మీరెందుకు భావించాలి?

17 బాప్తిస్మమన్నది మీ ఆత్మీయాభివృద్ధికి ముగింపు కాదని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం. నియమిత సేవకునిగా, యెహోవాసాక్షులలో ఒకరిగా దేవునికి జీవితాంతం చేసే సేవ యొక్క ప్రారంభాన్ని అది సూచిస్తుంది. బాప్తిస్మమన్నది ఎంతో ప్రాముఖ్యమే అయినప్పటికీ, అది రక్షణకు హామీ కాదు. యేసు ‘బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారు’ అని చెప్పలేదు. బదులుగా ఆయనిలా చెప్పాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:13) గనుక, మీ జీవితంలో దేవుని రాజ్యాన్ని అత్యంత ప్రాముఖ్యమైనదిగా చేసుకోవడం ద్వారా మీరు దాన్ని మొదట వెదకడం ప్రాముఖ్యం.—మత్తయి 6:25-34.

18. బాప్తిస్మం తర్వాత, వెంబడించవలసిన లక్ష్యాలు కొన్ని ఏవి?

18 యెహోవాకు మీరు చేసే సేవలో కొనసాగేందుకు, ముందు మీరు మీ కొరకు ఆత్మీయ లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆయన వాక్యాన్ని క్రమంగా వ్యక్తిగతంగా పఠించడం ద్వారా దేవుని గూర్చిన జ్ఞానాన్ని అధికం చేసుకోవాలనుకోవడం ఒక శ్రేష్ఠమైన లక్ష్యం. బైబిలును ప్రతి దినం చదవడానికి పథకం వేసుకోండి. (కీర్తన 1:1, 2) క్రైస్తవకూటాలకు క్రమంగా హాజరుకండి, ఎందుకంటే అక్కడ మీరు కనుగొనే సహవాసం మీకు ఆత్మీయ బలాన్నివ్వడంలో సహాయం చేస్తుంది. వ్యక్తిగతంగా, సంఘ కూటాల్లో వ్యాఖ్యానించడం ద్వారా యెహోవాను స్తుతించి, ఇతరులను ప్రోత్సహించేందుకు ప్రయత్నించడాన్ని మీ లక్ష్యంగా ఎందుకు చేసుకోకూడదు. (రోమీయులు 1:11, 12) మన ప్రార్థనలను మెరుగుపర్చుకోవడం మరో గమ్యమైయుండగలదు.—లూకా 11:2-4.

19. ఏ లక్షణాలను కనబరచడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయగలదు?

19 మీరు మీ బాప్తిస్మం యొక్క అర్థానికి తగినట్లుగా జీవించాలనుకుంటే, పరిశుద్ధాత్మ మీలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి లక్షణాలను ఉత్పన్నం చేసేందుకు అనుమతిస్తూ, మీరు ఏమి చేస్తున్నారనే దానికి తదేకమైన శ్రద్ధనివ్వవలసి ఉంటుంది. (గలతీయులు 5:22, 23; 2 పేతురు 3:11) పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించేవారికందరికీ, ఆయన నమ్మకమైన సేవకులుగా ఆయనకు విధేయత చూపేవారికి యెహోవా తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని గుర్తుంచుకోండి. (లూకా 11:13; అపొస్తలుల కార్యములు 5:32) కాబట్టి ఆయన ఆత్మ కొరకు దేవునికి ప్రార్థించండి, ఆయనను ప్రీతిపర్చే లక్షణాలను కనుపర్చేందుకు ఆయన సహాయాన్ని కోరండి. మీరు దేవుని ఆత్మ యొక్క ప్రభావానికి ప్రతిస్పందిస్తే, అలాంటి లక్షణాలు మీ మాటల్లోను ప్రవర్తనలోను స్పష్టమౌతాయి. నిజమే, క్రీస్తువలె కావాలని క్రైస్తవ సంఘంలోని ప్రతి వ్యక్తి “నవీన స్వభావమును” వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. (కొలొస్సయులు 3:9-14) మనం ఆత్మీయాభివృద్ధి యొక్క వివిధ స్థాయిల్లో ఉన్నాము గనుక మనలో ప్రతి ఒక్కరం ఇది చేయడంలో విభిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటాము. మీరు అపరిపూర్ణులు గనుక క్రీస్తు వంటి వ్యక్తిత్వాన్ని కలిగివుండేందుకు మీరు కష్టపడవలసి ఉంటుంది. కాని ఈ విషయంలో ఎన్నడూ విచారపడకండి, ఎందుకంటే దేవుని సహాయంతో దాన్ని సాధించవచ్చు.

20. పరిచర్యలో మీరు ఏయే విధాలుగా యేసును అనుకరించగలరు?

20 యేసు యొక్క సంతోషభరితమైన మాదిరిని సన్నిహితంగా అనుకరించడం మీ ఆత్మీయ లక్ష్యాలలో ఒకటై ఉండాలి. (హెబ్రీయులు 12:1-3) ఆయన పరిచర్యను ప్రేమించాడు. రాజ్య ప్రకటన పనిలో భాగం వహించే ఆధిక్యత మీకుంటే, అది కేవలం ఏదో సాధారణమైన పనిగా అవ్వడానికి అనుమతించకండి. యేసు చేసినట్లుగా, ఇతరులకు దేవుని రాజ్యాన్ని గూర్చి బోధించడంలో సంతృప్తిని పొందడానికి ప్రయత్నించండి. బోధకునిగా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకొనేందుకు సంఘం ఇచ్చే ఉపదేశాన్ని ఉపయోగించుకోండి. మీ పరిచర్యను కొనసాగించడానికి కావలసిన బలాన్ని యెహోవా ఇవ్వగలడనే నిశ్చయత కలిగివుండండి.—1 కొరింథీయులు 9:19-23.

21. (ఎ) నమ్మకమైన బాప్తిస్మం పొందిన వ్యక్తులను యెహోవా సంపదగా ఎంచుతాడని మనకెలా తెలుసు? (బి) ఈ దుష్ట విధానంపై దేవుని తీర్పు అమలు జరిగేటప్పుడు మనం కాపాడబడేందుకు బాప్తిస్మం ప్రాముఖ్యమైనదని ఏది చూపిస్తుంది?

21 యేసును అనుసరించాలని నమ్మకంగా ప్రయత్నిస్తున్న సమర్పిత, బాప్తిస్మం పొందిన వ్యక్తి దేవుని దృష్టిలో విశేషమైనవ్యక్తి. యెహోవా వందలకోట్ల మానవ హృదయాలను పరీక్షించి, అలాంటి వ్యక్తులు ఎంత అరుదో తెలుసుకుంటాడు. ఆయన వారిని సంపదలుగా, “యిష్టవస్తువులు”గా పరిగణిస్తాడు. (హగ్గయి 2:7) దేవుడు అలాంటి వారిని, ఈ దుష్ట విధానంపైకి త్వరలోనే రానైయున్న దేవుని తీర్పు అమలు జరిగే సమయంలో కాపాడేందుకు గుర్తింపబడిన వారిగా దృష్టిస్తాడని బైబిలు ప్రవచనాలు చూపిస్తున్నాయి. (యెహెజ్కేలు 9:1-6; మలాకీ 3:16, 18) మీరు “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారా? (అపొస్తలుల కార్యములు 13:48) దేవున్ని సేవించేవారిగా గుర్తింపబడడం మీ హృదయపూర్వకమైన కోరికయేనా? సమర్పణ మరియు బాప్తిస్మం ఆ గుర్తింపులో భాగమే, కాపాడబడేందుకు అవి అవసరము.

22. “గొప్ప సమూహము” ఏ ఉత్తరాపేక్షల కొరకు ఎదురు చూడవచ్చు?

22 భూవ్యాప్తంగా వచ్చిన జలప్రళయం తర్వాత, నోవహు ఆయన కుటుంబం ఓడలో నుండి శుభ్రపరచబడిన భూమిపైకి వచ్చారు. అలాగే నేడు, దేవుని గూర్చిన జ్ఞానాన్ని తమ జీవితాలలో అన్వయించుకొని యెహోవా అంగీకారాన్ని పొందే “ఒక గొప్ప సమూహము”నకు ఈ దుష్ట విధానం యొక్క అంతాన్ని తప్పించుకొని, శాశ్వతంగా శుభ్రపరచబడిన భూమిపై నిత్యజీవాన్ని పొందే ఉత్తరాపేక్ష ఉంది. (ప్రకటన 7:9, 14) ఆ జీవితం ఎలా ఉంటుంది?

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

యెహోవాను గూర్చిన మీ జ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలని ఆయన కోరుతున్నాడు?

బాప్తిస్మమునకు నడిపే కొన్ని చర్యలు ఏవి?

బాప్తిస్మం ఎందుకు ముగింపు కాదు గాని ప్రారంభమైయుంది?

మనం మన సమర్పణ, బాప్తిస్మములకు తగినట్లుగా ఎలా జీవించగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[172వ పేజీలోని చిత్రం]

మీరు ప్రార్థనలో దేవునికి సమర్పించుకున్నారా?

[174వ పేజీలోని చిత్రాలు]

బాప్తిస్మం పొందకుండా ఏది మిమ్మల్ని ఆటంకపరుస్తుంది?