మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
అధ్యాయము 9
మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
1. ప్రియమైన వారు మరణించినప్పుడు ప్రజలు ఎలా భావిస్తారు?
“ప్రియమైనవారు మరణించినప్పుడు బాధ కలుగుతుంది, ఎందుకంటే మరణం ఊహకందని రీతిగా వారిని కోల్పోవునట్లు చేస్తుంది.” తన తండ్రి, ఆ తర్వాత త్వరలోనే తన తల్లి మరణించినప్పుడు ఒక కుమారుడు అలా చెప్పాడు. అతని బాధ, వారిని పొగొట్టుకున్నానన్న లోతైన ఆవేదన, అతడు “మానసికంగా కృంగిపోతున్నట్లు” భావించేలా చేశాయి. బహుశా మీరు కూడా అదేవిధంగా బాధపడి ఉండవచ్చు. మీ ప్రియమైనవారు ఎక్కడ ఉన్నారు, వారిని మళ్లీ ఎప్పుడైనా చూడగలనా అని మీరు తలంచి ఉండవచ్చు.
2. మరణాన్ని గూర్చి ఏ కలవరపర్చే ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి?
2 బాధపడుతున్న కొంతమంది తలిదండ్రులకు ఇలా చెప్పబడింది, “పరలోకంలో ఉండడానికి దేవుడు తన కొరకు అత్యంత అందమైన పువ్వులను ఏరుకుంటాడు.” అది నిజమా? మరణించిన మన ప్రియమైనవారు ఆత్మ సామ్రాజ్యంలోనికి వెళ్లారా? అన్ని బాధలు, కోరికల నుండి స్వాతంత్ర్యం పొందిన పరమానందకరమైన పరిస్థితిగా వర్ణించబడేది, కొందరు నిర్వాణం అని పిలిచేది అదేనా? మనం ప్రేమించేవారు పరదైసులో అమర్త్యమైన జీవిత ద్వారం గుండా వెళ్లారా? లేక ఇతరులు చెప్పే విధంగా, మరణం అంటే దేవున్ని వ్యతిరేకించిన వారు నిత్య హింసకు గురి కావడమా? మృతులు మన జీవితాలను ప్రభావితం చేయగలరా? అలాంటి ప్రశ్నలకు వాస్తవమైన సమాధానాలను పొందేందుకు, మనం దేవుని వాక్యమైన బైబిలును సంప్రదించాలి.
అసలు మనిషి అంటే ఎవరు?
3. మృతుల గురించి సోక్రటీసు, ప్లేటోలకు ఏ ఉద్దేశం ఉండేది, అది నేడు ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది?
3 ప్రాచీన గ్రీకు తత్వవేత్తలైన సోక్రటీసు, ప్లేటో స్త్రీ పురుషులలో వారసత్వంగా వచ్చే అమర్త్యమైనదేదో అంటే మరణాన్ని తప్పించుకొని, ఎన్నడూ నిజంగా మరణించని ఒక ఆత్మ ఉండివుండవచ్చునని తలంచారు. భూవ్యాప్తంగా, నేడు కోట్లాదిమంది దీన్ని నమ్ముతున్నారు. ఈ నమ్మకం మృతులను గూర్చిన భయాన్ని ఎంతగా కలుగజేస్తుందో, వారి క్షేమాన్ని గూర్చి అంతే శ్రద్ధను కలుగజేస్తుంది. మనిషి అంటే నిజానికి ఎవరు, మనిషి చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందనే విషయాల్ని గూర్చి బైబిలు మనకు పూర్తి భిన్నంగా బోధిస్తుంది.
4. (ఎ) మనిషి అంటే ఎవరని ఆదికాండము మనకు చెబుతుంది? (బి) ఆదామును సజీవునిగా చేయడానికి దేవుడు అతనిలో ఏమి ఉంచాడు?
4 మనిషి ఎలా చేయబడ్డాడో తెలియజేసే బైబిలు వివరణ ఎంతో సరళమైనది, అన్ని సందర్భాల్లోను ఒకే విధంగా ఉన్నది, మరియు చిక్కైన తత్వాలు మూఢనమ్మకాల ప్రమేయం లేనిదైయుంది. బైబిలు యొక్క మొట్టమొదటి పుస్తకములో, ఆదికాండము 2:7వ వచనంలో, ఇలా ఉంది: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు నెఫెష్ * [అక్షరార్థంగా హెబ్రీలో, “శ్వసించువాడు”] ఆయెను.” ఇక్కడ మానవునికి ఒక ఆత్మ ఇవ్వబడలేదని గమనించండి, బదులుగా శక్తి లేదా “జీవవాయువు” నిర్జీవశరీరంలోనికి ఊదబడింది, అప్పుడు ఆ శరీరం నరుడిగా అయ్యింది, అంటే జీవించే వ్యక్తిగా అయ్యింది. దీని నుండి స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే, సజీవంగా చైతన్యవంతంగా ఉండేందుకు మనిషి లోపల ఏదో ఆత్మ నివసించాల్సిన అవసరం లేదు. శ్వాసించడం ద్వారా ఆదాము జీవం నిలిచింది. దేవుడు ఆదాములోకి జీవవాయువును ఊదడంలో, మనిషి ఊపిరితిత్తులలోకి గాలిని ఊదడం కంటే ఎక్కువే ఇమిడివుంది. భూ సంబంధమైన సృష్టి జీవులలో ఉన్న “జీవశక్తిని” గూర్చి బైబిలు మాట్లాడుతుంది.—ఆదికాండము 7:22, NW.
5, 6. (ఎ) “జీవశక్తి” అంటే ఏమిటి? (బి) కీర్తన 146:4 నందు సూచించబడిన “ప్రాణము” శరీరాన్ని చైతన్యవంతం చేయడం మానినప్పుడు ఏమి జరుగుతుంది?
కీర్తన 146:4 నందు సూచించబడిన “ప్రాణము” ఏమిటి? ఆ వచనం మరణించే వ్యక్తి గురించి ఇలా చెబుతుంది: “వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును.” బైబిలు రచయితలు “ప్రాణము” అనే పదాన్ని ఈ విధంగా ఉపయోగించినప్పుడు శరీరం మరణించిన తర్వాత జీవాన్ని కొనసాగించే అశరీరమైన ఆత్మ వారి మనస్సులో లేదు.
5 “జీవశక్తి” అంటే ఏమిటి? అది ఆదాము యొక్క నిర్జీవ శరీరంలో దేవుడు ప్రవేశపెట్టిన జీవాన్నిచ్చే సూత్రం. ఈ శక్తి ఆ తర్వాత శ్వాస ప్రక్రియ ద్వారా కొనసాగింది. అయితే,6 మరణమందు మానవులనుండి వెడలిపోయే “ప్రాణము” అంటే మన సృష్టికర్త నుండి వచ్చిన జీవశక్తి. (కీర్తన 36:9; అపొస్తలుల కార్యములు 17:28) విద్యుచ్ఛక్తి దేనికి శక్తినిస్తుందో ఆ పరికరం యొక్క గుణలక్షణాలను ఎలాగైతే సంతరించుకోదో అలాగే తాను చైతన్యవంతం చేసే జీవి యొక్క ఏ లక్షణాలు ఈ జీవశక్తికి ఉండవు. విద్యుచ్ఛక్తిని నిలిపివేసినప్పుడు బల్బు ఎలా ఆరిపోతుందో అలానే, ఎవరైనా మరణించినప్పుడు “ప్రాణము” (జీవశక్తి) శరీర కణాలను చైతన్యవంతం చేయడం మానుతుంది. జీవశక్తి మానవ శరీరాన్ని పోషించడం మానుకున్నప్పుడు పూర్తి మనిషి మరణిస్తాడు.—కీర్తన 104:29.
“తిరిగి మన్నైపోదువు”
7. ఆదాము దేవునికి అవిధేయత చూపిస్తే అతనికేమి జరుగుతుంది?
7 పాపియైన ఆదాముకు మరణమంటే ఏమైవుంటుందో యెహోవా స్పష్టంగా వివరించాడు. దేవుడిలా చెప్పాడు: “నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు[వు].” (ఆదికాండము 3:19) ఆదాము తిరిగి ఎక్కడికి వెళతాడు? నేలకే, తాను దేని నుండి సృష్టించబడ్డాడో ఆ మంటికే తిరిగి చేరుతాడు. మరణమందు ఆదాము ఉనికిలో ఉండకుండా పోతాడంతే!
8. మానవులు ఏ విధంగా జంతువులకంటే ఉన్నతులు కారు?
8 ఈ విషయంలో, మానవ మరణం జంతు మరణానికి భిన్నంగా లేదు. అవి కూడా నెఫెష్‌లే, అదే “ప్రాణము” లేక జీవశక్తి వాటిని శక్తివంతం చేస్తుంది. (ఆదికాండము 1:24) ప్రసంగి 3:19, 20 నందు జ్ఞానియైన సొలొమోను మనకిలా చెబుతున్నాడు: “నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; . . . సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.” దేవుని స్వరూపమందు సృష్టించబడడంలో అంటే యెహోవా యొక్క లక్షణాలను ప్రతిబింబించడంలో మనిషి మృగాలకంటే ఉన్నతుడు. (ఆదికాండము 1:26, 27) అయినప్పటికీ, మరణమందు మానవులు జంతువులు ఒకేలా మంటికి తిరిగి చేరడం జరుగుతుంది.
9. మృతుల స్థితి ఏమిటి, వాళ్లు ఎక్కడికెళ్తారు?
9 సొలొమోను మరణమంటే ఏమిటో చెబుతూ ఇంకా ఇలా వివరించాడు: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” అవును, మృతులకేమీ తెలియదు. దీని దృష్ట్యా, సొలొమోను ఇలా కోరాడు: “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:5, 10) మృతులు ఎక్కడికి వెళతారు? షియోల్‌కు (హెబ్రీలో, షియోల్), మానవజాతి యొక్క సామాన్యమైన సమాధికి వెళతారు. మరణించిన మన ప్రియమైనవారికి ఏమి తెలియదు. వారు బాధపడడం లేదు, వాళ్లు మనల్ని ఏ విధంగాను ఏమీ చేయలేరు.
10. మరణమే ఓ ముగింపుగా ఉండనవసరం లేదని మనమెందుకు చెప్పవచ్చు?
10 మనమందరము మరియు మన ప్రియమైనవారు కేవలం కొన్ని సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత ఎన్నటికీ ఉనికిలో ఉండకుండా పోవాలా? బైబిలు ప్రకారం మాత్రం అలా కాదు. ఆదాము తిరుగుబాటు సమయంలో, మానవ పాపం యొక్క తీవ్ర పరిణామాలను త్రిప్పికొట్టేందుకు యెహోవా దేవుడు వెంటనే ఏర్పాట్లు చేశాడు. మానవజాతి కొరకైన దేవుని సంకల్పంలో మరణం ఒక భాగం కాదు. (యెహెజ్కేలు 33:11; 2 పేతురు 3:9) కాబట్టి, మనకు గాని మన ప్రియమైనవారికి గాని మరణమే ముగింపు కానవసరం లేదు.
“నిద్రించుచున్నాడు”
11. మరణించిన తన స్నేహితుడైన లాజరు స్థితిని యేసు ఎలా వర్ణించాడు?
11 ఆదామువల్ల వచ్చిన పాపం నుండి మనల్ని, మరణించిన మన ప్రియమైనవారిని కాపాడడమన్నది యెహోవా సంకల్పం. కాబట్టి, దేవుని వాక్యం మృతులు నిద్రిస్తున్నారని సూచిస్తుంది. ఉదాహరణకు, తన స్నేహితుడైన లాజరు మరణించాడని తెలుసుకొని, యేసుక్రీస్తు తన శిష్యులతో ఇలా చెప్పాడు: ‘మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నాను.’ ఈ వ్యాఖ్యానం యొక్క భావాన్ని శిష్యులు వెంటనే గ్రహించలేదు కాబట్టి, యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “లాజరు చనిపోయెను.” యోహాను 11:11, 14) ఆ తర్వాత యేసు, లాజరు సహోదరీలైన మార్తా మరియలు తమ సహోదరుని మరణం గురించి దుఃఖిస్తున్న బేతనియ గ్రామానికి వెళ్లాడు. యేసు మార్తతో “నీ సహోదరుడు మరల లేచునని” చెప్పినప్పుడు, మానవ కుటుంబంపై మరణ ప్రభావాలను త్రిప్పికొట్టే దేవుని సంకల్పమందు తనకు గల విశ్వాసాన్ని ఆమె వ్యక్తపర్చింది. ఆమె ఇలా చెప్పింది: ‘అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదును.’—యోహాను 11:23, 24.
(12. దుఃఖిస్తున్న మార్తకు మృతుల గురించి ఏ నిరీక్షణ ఉండెను?
12 మరణం తర్వాత మరెక్కడో జీవించే ఒక అమర్త్యమైన ఆత్మను గురించి మార్త ఏమి ప్రస్తావించలేదు. లాజరు ఏదో ఆత్మసామ్రాజ్యంలో జీవించడానికి వెళ్లిపోయాడని ఆమె నమ్మలేదు. మృతులలో నుండి పునరుత్థానం చేయబడే అద్భుతమైన నిరీక్షణయందు మార్తకు నమ్మకం ఉంది. లాజరు శరీరం నుండి ఒక అమర్త్యమైన ఆత్మ వెళ్లిపోయిందని కాదుగాని, మృతుడైన తన సహోదరుడు ఉనికిలో లేకుండా పోయాడని ఆమె అర్థం చేసుకుంది. ఆమె సహోదరుని పునరుత్థానమే దానికి పరిష్కారం.
13. యేసుకు దేవుడిచ్చిన ఏ అధికారం ఉంది, ఈ అధికారాన్ని ఆయన ఎలా ప్రదర్శించాడు?
13 మానవజాతిని విడిపించడానికి యెహోవా దేవుడు యేసుక్రీస్తుకు అధికారమిచ్చాడు. (హోషేయ 13:14) కాబట్టి, మార్త చెప్పినదానికి జవాబుగా, యేసు ఇలా చెప్పాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.” (యోహాను 11:25) నాలుగు రోజులుగా మరణించివున్న లాజరు సమాధి యొద్దకు వెళ్లి, ఆయనను తిరిగి బ్రతికించినప్పుడు, యేసు తనకు దేవుడిచ్చిన అధికారాన్ని ఈ విషయంలో ప్రదర్శించాడు. (యోహాను 11:38-44) ఈ పునరుత్థానాన్ని లేక యేసుక్రీస్తు చేసిన ఇతర వాటిని చూసిన వారి ఆనందాన్ని ఒక్కసారి ఊహించండి!—మార్కు 5:35-42; లూకా 7:12-16.
14. పునరుత్థానం మరియు అమర్త్యమైన ఆత్మను గూర్చిన ఆలోచన ఎందుకు పొసగనివి?
14 ఒకసారి ఈ విషయాన్ని పరిశీలించండి: ఒక అమర్త్యమైన ఆత్మ మనిషి మరణించిన తర్వాత కూడా జీవించివుంటే, ఇక ఎవరూ కూడా పునరుత్థానం పొందనవసరముండదు లేక తిరిగి జీవింపజేయబడే అవసరం ఉండదు. వాస్తవానికి, లాజరు వంటి ఒక వ్యక్తి ఒకవేళ అప్పటికే అద్భుతమైన పరలోక బహుమానానికి వెళ్లివుంటే ఇక ఈ భూమిపై అపరిపూర్ణ జీవానికై అతన్ని పునరుత్థానం చేయడం దయతో కూడినదై ఉండేది కాదు. అసలు, బైబిలు యెహెజ్కేలు 18:4, 20) కాబట్టి మరణానికి నిజమైన పరిష్కారం పునరుత్థాన ఏర్పాటేనని బైబిలు సూచిస్తుంది.
“అమర్త్యమైన ఆత్మ” అనే మాటనే అసలు ఉపయోగించడం లేదు. బదులుగా, పాపం చేసే మనిషి మరణిస్తాడని లేఖనాలు చెబుతున్నాయి. (“సమాధులలో ఉన్న వారందరు”
15. (ఎ) “పునరుత్థానం” అనే పదం యొక్క భావం ఏమిటి? (బి) పునరుత్థానం చేయడం యెహోవా దేవునికి ఎందుకు ఒక సమస్య కాదు?
15 “పునరుత్థానం” అని యేసు శిష్యులు ఉపయోగించిన పదానికి అక్షరార్థంగా “లేవడం” లేక “లేచి నిలవడం” అని భావం. మరణం యొక్క నిర్జీవ స్థితి నుండి లేవడం—అంటే మానవజాతి యొక్క సామాన్య సమాధిలో నుండి లేచి నిలవడం అని భావం. యెహోవా దేవుడు ఒక వ్యక్తిని సులభంగా పునరుత్థానం చేయగలడు. ఎందుకు? ఎందుకంటే యెహోవాయే జీవానికి మూలకర్త.
నేడు, మానవులు వీడియో టేపుల మీద స్త్రీ పురుషుల స్వరాలను రూపాలను రికార్డు చేసి, ఆ వ్యక్తులు మరణించిన తర్వాత ఈ రికార్డింగులను రీప్లే చేయగలరు. కాబట్టి, మన సర్వోన్నత సృష్టికర్త ఏ వ్యక్తిని గూర్చిన వివరాలనైనా రికార్డు చేసి, క్రొత్తగా రూపొందించబడిన శరీరాన్ని అతనికి లేక ఆమెకు ఇచ్చి, అదే వ్యక్తిని తప్పకుండా పునరుత్థానం చేయగలడు.16. (ఎ) యేసు సమాధులలో ఉన్న వారందరి గురించి ఏ వాగ్దానం చేశాడు? (బి) ఒక వ్యక్తి ఏ పునరుత్థానాన్ని పొందుతాడనేదాన్ని ఏది నిర్ణయిస్తుంది?
16 యేసు ఇలా చెప్పాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్న వారందరు ఆయన [యేసు] శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) యెహోవా జ్ఞాపకంలో ఉన్నవారందరూ పునరుత్థానం చేయబడి ఆయన మార్గాలలో ఉపదేశింపబడతారు. దేవుని గూర్చిన జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించే వారందరికీ, ఇది జీవపునరుత్థానమౌతుంది. అయితే, దేవుని బోధలను, పరిపాలనను నిరాకరించేవారికి ఇది శిక్షతో కూడిన తీర్పు పునరుత్థానమౌతుంది.
17. ఎవరు పునరుత్థానం చేయబడతారు?
17 సహజంగా, యెహోవా సేవకులుగా నీతియుక్తమైన విధానాన్ని అవలంబించిన వారందరూ పునరుత్థానం చేయబడతారు. వాస్తవానికి, పునరుత్థాన నిరీక్షణ అనేకులను బలపర్చింది, దౌర్జన్యపూరితమైన హింసకు సంబంధించిన విషయాల్లో కూడా మరణాన్ని ఎదుర్కొనేందుకు వారిని బలపర్చింది. దేవుడు వారిని జీవానికి తిరిగి తేగలడని వారికి తెలుసు. (మత్తయి 10:28) కాని దేవుని నీతియుక్తమైన ప్రమాణాలను అన్వయించుకుంటారో లేదో చూపించకుండానే కోట్లాదిమంది ప్రజలు మరణించారు. వారు కూడా పునరుత్థానం చేయబడతారు. ఈ విషయంలో యెహోవా యొక్క సంకల్పమందు నమ్మకం కలిగి, అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . నేను . . . దేవునియందు నిరీక్షణయుంచి” యున్నాను.—అపొస్తలుల కార్యములు 24:15.
18. (ఎ) అపొస్తలుడైన యోహాను పునరుత్థానాన్ని గూర్చిన ఏ దర్శనాన్ని పొందాడు? (బి) “అగ్నిగుండము”లో ఏమి నాశనం చేయబడుతుంది, ఈ “గుండము” దేన్ని సూచిస్తుంది?
18 పునరుత్థానం చేయబడి దేవుని సింహాసనం ఎదుట నిలువబడివున్న వారిని గూర్చిన ఉత్తేజకరమైన దర్శనాన్ని అపొస్తలుడైన యోహాను పొందాడు. తర్వాత యోహాను ఇలా వ్రాశాడు: “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న ప్రకటన 20:13, 14) దాని గురించి ఆలోచించండి! దేవుని జ్ఞాపకంలో ఉన్న మృతులందరికీ, మానవజాతి యొక్క సామాన్య సమాధియైన హేడిస్ (గ్రీకులో, హేడిస్), లేక షియోల్ నుండి విడుదల పొందే ఉత్తరాపేక్ష ఉంది. (కీర్తన 16:10; అపొస్తలుల కార్యములు 2:31) తాము దేవున్ని సేవిస్తామా లేదా అన్నది తమ క్రియల ద్వారా చూపించే అవకాశం వారికి లభిస్తుంది. ఆ తర్వాత “మరణమును మృతులలోకమును,” “గెహెన్నా” అనే పదం వలెనే సంపూర్ణ నాశనాన్ని సూచించే “అగ్నిగుండము” లోనికి పడవేయబడతాయి. (లూకా 12:5) మానవజాతి యొక్క సామాన్య సమాధి ఖాళీ చేయబడుతుంది, పునరుత్థానం ముగిసిన తర్వాత ఇక అది ఉనికిలో ఉండదు. దేవుడు ఎవరినీ హింసించడని బైబిలు నుండి నేర్చుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉంటుంది!—యిర్మీయా 7:30, 31.
మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను.” (ఎక్కడికి పునరుత్థానం చేయబడతారు?
19. మానవజాతిలోని కొంతమంది పరలోకానికి ఎందుకు పునరుత్థానం చేయబడతారు, దేవుడు వారికి ఏ విధమైన శరీరాన్నిస్తాడు?
19 పరిమితమైన సంఖ్యలో మాత్రమే స్త్రీ పురుషులు పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడతారు. వారు యేసుతోపాటు రాజులుగా, యాజకులుగా మొదటి మానవుడైన ఆదాము నుండి మానవజాతి సంతరించుకున్న మరణ ప్రభావాలను తీసివేయడంలో భాగం వహిస్తారు. (రోమీయులు 5:12; ప్రకటన 5:9, 10) క్రీస్తుతోపాటు పరిపాలించడానికి దేవుడు ఎంతమందిని పరలోకానికి తీసుకుంటాడు? బైబిలు ప్రకారం 1,44,000 మందిని మాత్రమే. (ప్రకటన 7:4; 14:1) వీరు పరలోకంలో జీవించగలిగేలా యెహోవా వీరిలో ప్రతి ఒక్కరికి ఆత్మ శరీరాన్నిస్తాడు.—1 కొరింథీయులు 15:35, 38, 42-45; 1 పేతురు 3:18.
20. పునరుత్థానం చేయబడిన వారితో సహా, విధేయులైన మానవజాతి దేన్ని అనుభవిస్తారు?
20 మరణించిన వారిలో అధికశాతంమంది భూపరదైసులోకి పునరుత్థానం చేయబడతారు. (కీర్తన 37:11, 29; మత్తయి 6:10) కొంతమందిని పరలోకానికి పునరుత్థానం చేయడానికి కొంతకారణమేమంటే, భూమి ఎడల దేవునికున్న సంకల్పాన్ని పూర్తిచేయడమే. పరలోకంలో యేసుక్రీస్తు మరియు 1,44,000 మంది, విధేయులైన మానవజాతిని మన మొదటి తలిదండ్రులు పోగొట్టుకున్న పరిపూర్ణతకు క్రమంగా తీసుకువస్తారు. వీరిలో, తన ప్రక్కన మ్రానుకు వ్రేలాడదీయబడిన మరణిస్తున్న మనిషితో యేసు ‘నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’ అని సూచించినట్లుగా, పునరుత్థానం చేయబడినవారును ఉంటారు.—లూకా 23:42, 43.
21. ప్రవక్తయైన యెషయా మరియు అపొస్తలుడైన యోహాను ప్రకారం, మరణానికి ఏమి సంభవిస్తుంది?
21 నేడు అలాంటి వ్యర్థతను కల్గించే మరణం పరదైసు భూమిపై నుండి తీసివేయబడుతుంది. (రోమీయులు 8:19-21) యెహోవా దేవుడు “మరెన్నడును ఉండకుండ మరణమును . . . మ్రింగివేయును” అని ప్రవక్తయైన యెషయా ప్రకటించాడు. (యెషయా 25:8) విధేయులైన మానవజాతి బాధ మరణాల నుండి స్వాతంత్ర్యాన్ని అనుభవించే సమయాన్ని గూర్చి అపొస్తలుడైన యోహానుకు ఒక దర్శనం ఇవ్వబడింది. అవును, ‘దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.’—ప్రకటన 21:1-4.
22. పునరుత్థానాన్ని గూర్చిన జ్ఞానం మీపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
22 బైబిలు యొక్క స్పష్టమైన బోధలు మృతులకు ఏమి సంభవిస్తుందనే దాన్ని గూర్చిన గందరగోళాన్ని తొలగిస్తాయి. మరణం నాశనం చేయబడే ‘కడపటి శత్రువని’ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. (1 కొరింథీయులు 15:26) పునరుత్థాన నిరీక్షణను గూర్చిన జ్ఞానం నుండి మనం ఎంతటి బలాన్ని, ఓదార్పును పొందగలము! దేవుని జ్ఞాపకంలో ఉన్న మరణించిన మన ప్రియమైనవారు మరణ నిద్ర నుండి మేల్కొని, తనను ప్రేమించేవారి కొరకు ఆయన భద్రపరచివుంచిన మంచి వాటన్నిటిన్నీ అనుభవిస్తారంటే మనమెంత ఆనందించగలమో కదా! (కీర్తన 145:16) దేవుని రాజ్యంద్వారా అలాంటి ఆశీర్వాదాలన్నీ నెరవేర్చబడతాయి. కాని దాని పరిపాలన ఎప్పుడు ప్రారంభమౌతుంది? మనం చూద్దాము.
[అధస్సూచి]
^ పేరా 4 హెబ్రీ పదమైన నెఫెష్, బైబిలులో 700 సార్లు కనిపిస్తుంది, అయితే అది ఏ ఒక్కసారి కూడా, మానవునిలోని వేరొక భాగమని, అశరీరమైన భాగమని సూచించడం లేదు. అదెల్లప్పుడు ముట్టగలిగే దాన్నే, శారీరకమైన దాన్నే సూచిస్తుంది.
మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
మానవులలో ఉండే ప్రాణము ఏమిటి?
మృతుల స్థితిని మీరెలా వివరిస్తారు?
ఎవరు పునరుత్థానం చేయబడతారు?
[అధ్యయన ప్రశ్నలు]
[85వ పేజీలోని చిత్రం]
యేసు లాజరును సమాధి నుండి పిలిచినట్లుగానే, లక్షలాదిమంది పునరుత్థానం చేయబడతారు
[86వ పేజీలోని చిత్రం]
‘దేవుడు మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మ్రింగివేసినప్పుడు’ ఆనందం వెల్లివిరుస్తుంది