మీరు ఎవరి అధికారాన్ని గుర్తించాలి?
అధ్యాయము 14
మీరు ఎవరి అధికారాన్ని గుర్తించాలి?
1, 2. అన్ని విధాలైన అధికారం హానికరమైనదేనా? వివరించండి.
“అధికారం” అనే పదం అనేకమంది ప్రజలకు అయిష్టాన్ని కలుగజేస్తుంది. ఇది అర్థం చేసుకొనదగినదే, ఎందుకంటే అధికారం తరచూ—ఉద్యోగస్థలంలోను కుటుంబంలోను ప్రభుత్వాలచేత దుర్వినియోగం చేయబడుతోంది. బైబిలు వాస్తవికంగానే ఇలా చెబుతోంది: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” (ప్రసంగి 8:9) అవును, అనేకులు నిరంకుశంగా స్వీయసేవ పొందే విధంగా ప్రవర్తించడం ద్వారా ఇతరులపై అధికారం చేశారు.
2 అయితే అధికారమంతా హానికరమైనదేమీ కాదు. ఉదాహరణకు, మన శరీరం మనపై అధికారం చేస్తుందని చెప్పవచ్చు. అది మనల్ని శ్వాసించమని, తినమని, త్రాగుమని, నిద్రించుమని “శాసిస్తుంది.” ఇది బాధపెట్టేదిగా ఉందా? లేదు. ఈ ఆజ్ఞలకు లోబడడం మన ప్రయోజనం కొరకే. మన శారీరక అవసరతలకు లోబడడం స్వచ్ఛందమైనది కాకపోయినప్పటికీ, మనం ఇష్టపూర్వకంగా లోబడవలసిన ఇతర రకాలైన అధికారాలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
సర్వోన్నతమైన అధికారం
3. యెహోవా “సర్వోన్నతమైన ప్రభువు” అని సరిగ్గానే ఎందుకు పిలువబడ్డాడు?
3 బైబిలునందు యెహోవా 300 కంటే ఎక్కువసార్లు “సర్వోన్నతమైన ప్రభువు” అని పిలువబడ్డాడు. సర్వోన్నతుడంటే సర్వోన్నతమైన అధికారం గలవాడు అని భావం. ఈ స్థానం వహించడానికి యెహోవాకు ఏది హక్కునిస్తుంది? ప్రకటన 4:11 దానికిలా సమాధానమిస్తుంది: ‘ప్రభువా [“యెహోవా,” NW], మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు.’
4. యెహోవా తన అధికారాన్ని ఎలా చూపడానికి ఎంపిక చేసుకున్నాడు?
4 మన సృష్టికర్తగా, తాను ఎంపిక చేసుకొనే విధంగా అధికారాన్ని వహించే హక్కు యెహోవాకు ఉంది. ప్రాముఖ్యంగా దేవునికి “అధికశక్తి” ఉందన్నట్లు మనం పరిగణించినప్పుడు, ఇది భయాన్ని కల్గించవచ్చు. ఆయన “సర్వశక్తిగల దేవుడు” అని పిలువబడ్డాడు—ఈ హెబ్రీ పదం అత్యధిక శక్తికలిగివుండడం అనే ఆలోచననిస్తుంది. (యెషయా 40:26; ఆదికాండము 17:1) అయినప్పటికీ, యెహోవా తన శక్తిని దయాపూర్వకమైన విధంగా చూపిస్తాడు, ఎందుకంటే ఆయన అత్యున్నత లక్షణం ప్రేమ.—1 యోహాను 4:16.
5. యెహోవా అధికారానికి లోబడడం ఎందుకు కష్టం కాదు?
5 పశ్చాత్తాపపడని తప్పిదస్థులపైకి శిక్ష తెస్తానని యెహోవా హెచ్చరించినప్పటికీ, ఆయన “తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును . . . నమ్మతగిన దేవుడుననియు” ముఖ్యంగా మోషేకు తెలుసు. (ద్వితీయోపదేశకాండము 7:9) ఒకసారి ఊహించండి! విశ్వానికి సర్వోన్నత అధికారి మనం ఆయనను సేవించాలని మనల్ని బలవంతపెట్టడం లేదు. బదులుగా, మనం ఆయన ప్రేమను బట్టి ఆయన వైపుకు ఆకర్షితులమౌతున్నాము. (రోమీయులు 2:4; 5:8) యెహోవా అధికారానికి లోబడడం కూడా ఒక ఆనందం, ఎందుకంటే ఆయన ఆజ్ఞలు చివరికి ఎల్లప్పుడూ మన ప్రయోజనానికే దారి తీస్తాయి.—కీర్తన 19:7, 8.
6. ఏదెను తోటలో అధికారాన్ని గూర్చిన వివాదం ఎలా వచ్చింది, దాని ఫలితమేమిటి?
6 మన మొదటి తలిదండ్రులు దేవుని సర్వాధిపత్యాన్ని నిరాకరించారు. తమకు మంచేదో చెడేదో తామే నిర్ణయించుకోవాలని వారు కోరుకున్నారు. (ఆదికాండము 3:4-6) తత్ఫలితంగా, వారు తమ పరదైసు గృహం నుండి వెళ్లగొట్టబడ్డారు. ఆ తర్వాత, అపరిపూర్ణ సమాజమే అయినప్పటికీ, వారు ఓ క్రమపద్ధతిలో జీవించడానికి వీలయ్యేలా మానవులు అధికార ఏర్పాటును సృష్టించుకోవడానికి యెహోవా అనుమతించాడు. ఈ అధికారాల్లో కొన్ని ఏవి, వాటికి మనం ఎంతమేరకు విధేయత చూపించాలని దేవుడు కోరుతున్నాడు?
‘పై అధికారులు’
7. ‘పై అధికారులు’ ఎవరు, వారి స్థానం దేవుని అధికారంతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంది?
7 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.” ఆ ‘పై అధికారులు’ ఎవరు? వారు మానవ ప్రభుత్వాధికారాలని తర్వాత వచనాలలోని పౌలు మాటలు చూపిస్తాయి. (రోమీయులు 13:1-7; తీతు 3:1) మానవుని ప్రభుత్వాధికారాలను యెహోవా రూపొందించలేదు కాని అవి ఆయన అనుమతితోనే ఉనికిలో ఉన్నాయి. అందుకే పౌలు ఇలా వ్రాయగలిగాడు: “ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.” అలాంటి భూ సంబంధిత అధికారాన్ని గూర్చి ఇది ఏమి సూచిస్తుంది? అది దేవుని అధికారం క్రిందిదని లేక అంతకంటే తక్కువైనదని సూచిస్తుంది. (యోహాను 19:10, 11) గనుక, మానవుని చట్టానికి దేవుని చట్టానికి మధ్య విభేదం ఏర్పడినప్పుడు, క్రైస్తవులు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షి నడిపింపునే అనుసరించాలి. వాళ్లు “మనుష్యులకు కాదు దేవునికే . . . లోబడవలెను.”—అపొస్తలుల కార్యములు 5:29.
8. పై అధికారులనుండి మీరెలా ప్రయోజనం పొందగలరు, వారికి మీ విధేయతను ఎలా చూపించగలరు?
రోమీయులు 13:4) ఏ యే విధాలుగా? సరే, పై అధికారులు అందజేసే తపాలా సౌకర్యం, పోలీసు మరియు అగ్నిమాపక భద్రత, పారిశుధ్యం, విద్య వంటి అనేక సేవల గురించి తలంచండి. “వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 13:6) పన్నులు లేక ఇతర చట్టబద్ధమైన బాధ్యతలకు సంబంధించి, మనం ‘అన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప’ వలెను.—హెబ్రీయులు 13:18.
8 అయితే, ఎక్కువసార్లు ప్రభుత్వ పై అధికారులు ‘మనకు మేలు కలుగుటకు దేవుని పరిచారకుల’ వలె ప్రవర్తిస్తారు. (9, 10. (ఎ) దేవుని ఏర్పాటులో పై అధికారులు ఎలా సరిపోతారు? (బి) పై అధికారులను ఎదిరించడం ఎందుకు తప్పు?
9 కొన్నిసార్లు పై అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. వారికి విధేయత చూపించవలసిన మన బాధ్యత నుండి ఇది మనల్ని స్వతంత్రులను చేస్తుందా? లేదు, అలా చేయదు. ఈ అధికారుల చెడు కార్యాలను యెహోవా చూస్తాడు. (సామెతలు 15:3) ఆయన మానవ పరిపాలనను అనుమతిస్తున్నాడంటే దాని భావం ఆయన దాని దుర్నీతిని చూడడని లేక మనం అలా చేయాలని ఆయన కోరుతున్నాడని కాదు. వాస్తవానికి, దేవుడు వాటి స్థానంలో తన స్వంత నీతియుక్తమైన ప్రభుత్వాన్ని ఉంచుతూ, త్వరలోనే ఈ “రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము” చేస్తాడు. (దానియేలు 2:44) అయితే ఇది జరిగే వరకు, ఈ పై అధికారులు ఒక ప్రయోజనకరమైన సంకల్పాన్ని నెరవేరుస్తారు.
10 పౌలు ఇలా వివరించాడు: “అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు.” (రోమీయులు 13:2) పై అధికారులు దేవుని “నియమము” గనుక వారు కొంతమేరకు శాంతిని కాపాడతారు, లేకపోతే గందరగోళం మరియు అరాచకత్వం ప్రబలి పోతాయి. వారిని వ్యతిరేకించడం లేఖనరహితం, అజ్ఞానం. ఉదాహరించేందుకు: మీరు శస్త్ర చికిత్స చేయించుకున్నారని, కుట్లు మీ గాయాన్ని కాపాడుతున్నాయని ఊహించండి. కుట్లు శరీరానికి పరాయివే అయినప్పటికీ, అవి పరిమిత సమయం వరకు ఒక సంకల్పాన్ని నెరవేరుస్తాయి. సమయం కాక ముందే వాటిని తీసివేయడం హాని కలిగించవచ్చు. అలాగే, మానవ ప్రభుత్వ అధికారులు దేవుని ఆది సంకల్పంలో భాగం కారు. అయితే, ఆయన రాజ్యం భూమిపై సంపూర్ణంగా పరిపాలించే వరకు, మానవ ప్రభుత్వాలు ప్రస్తుత సమయం కొరకు దేవుని చిత్తానికి సరిపోయే పనిని నెరవేరుస్తూ, సమాజాన్ని ఐక్యంగా ఉంచుతాయి. కాబట్టి మనం పై అధికారులకు లోబడివుంటూ, దేవుని చట్టానికి అధికారానికి ప్రాధాన్యతనివ్వాలి.
కుటుంబంలో అధికారం
11. శిరస్సత్వపు సూత్రాన్ని మీరెలా వివరిస్తారు?
11 మానవ సమాజంలో కుటుంబం ప్రాథమికమైన విభాగం. దానిలో భర్త, భార్య ప్రతిఫలదాయకమైన సహచర్యాన్ని పొందగలరు, పిల్లలు పెద్దవారవ్వడానికి క్షేమంగా కాపాడబడి, శిక్షణ పొందగలరు. (సామెతలు 5:15-21; ఎఫెసీయులు 6:1-4) అలాంటి శ్రేష్ఠమైన ఏర్పాటు, కుటుంబ సభ్యులు శాంతి సామరస్యాలతో జీవించేందుకు సహాయపడే విధంగా సంస్థీకరించబడవలసిన అవసరం ఉంది. దీన్ని యెహోవా శిరస్సత్వపు సూత్రం ద్వారా నెరవేరుస్తాడు, ఇది 1 కొరింథీయులు 11:3 నందు ఈ మాటల్లో సమీక్షించబడింది: ‘ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడు.’
12, 13. కుటుంబ శిరస్సు ఎవరు, యేసు శిరస్సత్వాన్ని కనబర్చే విధానం నుండి ఏమి నేర్చుకోవచ్చు?
ఎఫెసీయులు 5:25) యేసు సంఘంతో ఎల్లప్పుడూ వ్యవహరించినట్లుగానే భర్త తన భార్యతో వ్యవహరించినప్పుడు అతడు తాను క్రీస్తుకు లోబడినట్లుగా చూపిస్తాడు. (1 యోహాను 2:6) యేసుకు ఎంతో అధికారం ఇవ్వబడింది, కాని ఆయన దాన్ని అత్యంత దయ, ప్రేమ, సహేతుకతతో ఉపయోగిస్తాడు. (మత్తయి 20:25-28) మానవునిగా యేసు ఎన్నడూ తన స్థానం యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. ఆయన ‘సాత్వికుడు దీనమనస్సు గలవాడు,’ ఆయన తన అనుచరులను “దాసులు” అని పిలిచే బదులు “స్నేహితులు” అని పిలిచాడు. “నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని ఆయన వారికి వాగ్దానం చేశాడు, ఆయన అదే చేశాడు.—మత్తయి 11:28, 29; యోహాను 15:15.
12 భర్త కుటుంబానికి శిరస్సు. అయితే, ఆయనకుపైగా యేసుక్రీస్తు అనే శిరస్సు ఉన్నాడు. పౌలు ఇలా వ్రాశాడు: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.” (13 క్రైస్తవ శిరస్సత్వం కఠినమైన ఆధిపత్యం చేసే స్థానం కాదని యేసు ఉదాహరణ భర్తలకు బోధిస్తుంది. బదులుగా, అది గౌరవం మరియు స్వయంత్యాగ పూరితమైన ప్రేమ చూపించవలసిన స్థానమే. ఇది వివాహజతను శారీరకంగా లేక మౌఖికంగా బాధపెట్టడాన్ని స్పష్టంగా ఖండిస్తుంది. (ఎఫెసీయులు 4:29, 31, 32; 5:28, 29; కొలొస్సయులు 3:19) ఒకవేళ ఒక క్రైస్తవ పురుషుడు తన భార్యను బాధపెడితే అతని ఇతర మంచి కార్యాలు విలువలేనివవుతాయి, అతని ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతుంది.—1 కొరింథీయులు 13:1-3; 1 పేతురు 3:7.
14, 15. ఒక భార్య తన భర్తకు లోబడివుండడానికి దేవుని గూర్చిన జ్ఞానం ఆమెకెలా సహాయపడగలదు?
14 ఒక భర్త క్రీస్తు మాదిరిని అనుకరించినప్పుడు, ఎఫెసీయులు 5:22, 23 నందలి ఈ మాటలకు విధేయత చూపడం భార్యకు సులభమౌతుంది: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు.” భర్త ఏలాగైతే క్రీస్తుకు లోబడివుండాలో అలాగే భార్య తన భర్తకు లోబడివుండాలి. సమర్థవంతమైన భార్యలు తమ దైవిక జ్ఞానం, కృషిని బట్టి గౌరవం మరియు మెప్పుదల పొందనర్హులని కూడా బైబిలు స్పష్టం చేస్తుంది.—సామెతలు 31:10-31.
1 పేతురు 3:1-4) అవిశ్వాసియైన భార్యగల క్రైస్తవ పురుషుని విషయంలో కూడా ఇదే నిజమైయుండాలి. అతడు బైబిలు సూత్రాలకు కట్టుబడివుండడం అతన్ని శ్రేష్ఠమైన భర్తగా తయారు చేయాలి.
15 క్రైస్తవ భార్య తన భర్తకు చూపించే విధేయత పరిమితమైనదే. ఏదైనా ఒక విషయంలో విధేయత చూపడం దైవిక ఆజ్ఞను మీరేలా చేస్తుంటే, మనిషి కంటే దేవునికే విధేయత చూపించడమని దీని భావం. అయినప్పటికీ, భార్య యొక్క దృఢ నిశ్చయతకు ‘సాధువైనట్టియు, మృదువైనట్టియు గుణం’ జతచేయబడాలి. దేవుని గూర్చిన జ్ఞానం ఆమెను శ్రేష్ఠమైన భార్యగా చేసిందన్న విషయం స్పష్టం కావాలి. (16. యేసు బాలునిగా ఉన్నప్పుడు చూపించిన మాదిరిని పిల్లలు ఎలా అనుసరించవచ్చు?
16ఎఫెసీయులు 6:1 పిల్లల పాత్రను ఇలా తెలియజేస్తుంది: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.” తాను పెద్దవాడౌతుండగా తన తలిదండ్రులకు లోబడిన యేసు మాదిరిని క్రైస్తవ పిల్లలు అనుసరించాలి. విధేయుడైన బాలునిగా ఆయన “జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.”—లూకా 2:51, 52.
17. తలిదండ్రులు అధికారాన్ని ప్రదర్శించే విధానం పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపవచ్చు?
17 తలిదండ్రులు తమ బాధ్యతలను నిర్వహించే విధానం, పిల్లలు అధికారాన్ని గౌరవిస్తారా లేక దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారా అనే దానిపై ప్రభావాన్ని చూపుతుంది. (సామెతలు 22:6) కాబట్టి తలిదండ్రులు ‘నేను నా అధికారాన్ని ప్రేమగా చూపిస్తున్నానా లేక కఠినంగా చూపిస్తున్నానా? నేను స్వేచ్ఛనిస్తున్నానా?’ అని తమను తాము ప్రశ్నించుకోవడం మంచిది. దైవభక్తిగల తల్లి లేక తండ్రి ప్రేమగా, దయగా ఉండాలని, అయినప్పటికీ దైవిక సూత్రాలకు కట్టుబడి ఉండడంలో దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. తగినట్లుగానే, పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక [అక్షరార్థంగా, ‘ఆగ్రహం కలిగేలా వారిని రెచ్చగొట్టక’] ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”—ఎఫెసీయులు 6:4; కొలొస్సయులు 3:21.
18. తలిదండ్రులు క్రమశిక్షణను ఎలా ఇవ్వాలి?
18 ప్రాముఖ్యంగా పిల్లలు తమకు విధేయులై తద్వారా తమకు ఆనందం తీసుకురావాలని తలిదండ్రులు కోరుకుంటే వారు తమ శిక్షణా పద్ధతులను పరిశీలించుకోవాలి. (సామెతలు 23:24, 25) బైబిలునందు, శిక్షించడం ప్రాథమికంగా ఒకవిధమైన ఉపదేశం వంటిది. (సామెతలు 4:1; 8:23) అది ప్రేమ, సాత్వికాలకు జతచేయబడింది కాని కోపానికి, క్రూరత్వానికి కాదు. గనుక, క్రైస్తవ తలిదండ్రులు జ్ఞానంతో వ్యవహరిస్తూ, తమ పిల్లలను శిక్షించేటప్పుడు తమను తాము అదుపులో ఉంచుకోవలసిన అవసరముంది.—సామెతలు 1:7.
సంఘంలో అధికారం
19. క్రైస్తవ సంఘంలో మంచి క్రమపద్ధతి ఉండడానికి దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు?
19 యెహోవా ఒక క్రమంగల దేవుడు గనుక, ఆయన తన ప్రజలకు అధికారపూర్వకమైన, చక్కగా సంస్థీకరించబడిన నాయకత్వాన్ని అందజేయడం కారణసహితమే. అందుకే, ఆయన యేసును క్రైస్తవ సంఘ శిరస్సుగా నియమించాడు. (1 కొరింథీయులు 14:33, 40; ఎఫెసీయులు 1:20-23) క్రీస్తు అదృశ్య నాయకత్వం క్రింద, ప్రతి సంఘంలోను నియమిత పెద్దలు మందను ఇష్టపూర్వకంగా, సిద్ధమనస్సుతో, ప్రేమపూర్వకంగా కాసేలా దేవుడు ఒక ఏర్పాటును స్థాపించాడు. (1 పేతురు 5:2, 3) పరిచారకులు వారికి అనేక విధాలుగా సహాయం చేస్తూ, సంఘమందు విలువైన సేవను అందజేస్తారు.—ఫిలిప్పీయులు 1:1.
20. నియమిత క్రైస్తవ పెద్దలకు మనం ఎందుకు విధేయులమై ఉండాలి, ఇది ఎందుకు ప్రయోజనకరమైనది?
20 క్రైస్తవ పెద్దలకు సంబంధించి, పౌలు ఇలా వ్రాశాడు: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీయులు 13:17) జ్ఞానయుక్తంగా, సంఘంలో ఉండేవారి ఆత్మీయావసరతల గురించి శ్రద్ధ వహించే బాధ్యతను దేవుడు క్రైస్తవ అధ్యక్షులకు అప్పగించాడు. ఈ పెద్దలు మతనాయకుల తరగతికి చెందరు. వారు మన నాయకుడైన యేసుక్రీస్తు చేసినట్లుగానే తమతోటి ఆరాధికుల అవసరతలను చూసే దేవుని సేవకులు మరియు దాసులు. (యోహాను 10:14, 15) లేఖనాధారంగా అర్హులైన పురుషులు మన అభివృద్ధి మరియు ఆత్మీయ ఎదుగుదలలో శ్రద్ధ కలిగివున్నారనే విషయాన్ని తెలుసుకోవడం, మనం సహకరించేవారిగా, లోబడేవారిగా ఉండేందుకు మనల్ని ప్రోత్సహిస్తుంది.—1 కొరింథీయులు 16:16.
21. తోటి క్రైస్తవులకు ఆత్మీయంగా సహాయం చేసేందుకు నియమిత పెద్దలు ఎలా ప్రయత్నిస్తారు?
21 కొన్నిసార్లు, గొర్రెలు హానికరమైన లోక సంబంధులవల్ల దారి తప్పవచ్చు లేక ప్రమాదంలో పడవచ్చు. ప్రధాన గొర్రెల కాపరి నాయకత్వం క్రింద, పెద్దలు ఉపకాపరులవలె తమ కాపుదల క్రిందనున్న వారి అవసరతలను గూర్చి మెలకువ కలిగివుంటారు, 1 పేతురు 5:4) వారు సంఘ సభ్యులను దర్శించి, ప్రోత్సహిస్తారు. దేవుని ప్రజల శాంతిని పాడుచేయడానికి అపవాది ప్రయత్నిస్తాడని తెలుసుకుని, ఏ సమస్యతో వ్యవహరించినా పెద్దలు పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. (యాకోబు 3:17, 18) యేసు తానే ప్రార్థించినటువంటి, ఐక్యత మరియు విశ్వాసమందు ఏకతను కాపాడేందుకు వారు పట్టుదలతో పనిచేస్తారు.—యోహాను 17:20-22; 1 కొరింథీయులు 1:10.
ఎడతెగక వారి ఎడల వ్యక్తిగత శ్రద్ధ చూపుతారు. (22. తప్పు జరిగిన సందర్భాలలో పెద్దలు ఏ సహాయాన్ని అందజేస్తారు?
22 ఒక క్రైస్తవుడు ఏదైనా చెడును ఎదుర్కొంటే లేక పాపం చేయడం మూలంగా నిరుత్సాహపడితే అప్పుడేమిటి? ఓదార్పునిచ్చే బైబిలు ఉపదేశం మరియు అతని కొరకు పెద్దలు చేసే హృదయపూర్వక ప్రార్థనలు అతని ఆత్మీయ ఆరోగ్యాన్ని పునఃస్థాపించేందుకు సహాయపడగలవు. (యాకోబు 5:13-15) తప్పుచేసే ఎవరికైనా లేక సంఘం యొక్క ఆత్మీయ, నైతిక పవిత్రతకు ప్రమాదం కలుగజేసే వారికైనా క్రమశిక్షణ, గద్దింపులనిచ్చే అధికారం కూడా పరిశుద్ధాత్మచే నియమించబడిన ఈ పురుషులకు ఉంది. (అపొస్తలుల కార్యములు 20:28; తీతు 1:9; 2:15) సంఘాన్ని పవిత్రంగా ఉంచేందుకు, ఆయా వ్యక్తులు గంభీరమైన తప్పుల గురించి నివేదించడం అవసరం కావచ్చు. (లేవీయకాండము 5:1) తీవ్రమైన పాపం చేసిన ఒక క్రైస్తవుడు లేఖనాధార క్రమశిక్షణను గద్దింపును అంగీకరించి, నిజమైన పశ్చాత్తాపాన్ని గూర్చిన నిదర్శనాన్ని కనబరిస్తే, అతడు సహాయన్ని పొందగలడు. అయితే, ఎడతెగకుండా, పశ్చాత్తాప పడకుండా దేవుని సూత్రాలను మీరేవారు బహిష్కరించబడతారు.—1 కొరింథీయులు 5:9-13.
23. సంఘ క్షేమం కొరకు క్రైస్తవ అధ్యక్షులు ఏమి అందజేస్తారు?
23 యేసు క్రీస్తు రాజుగా ఉన్నప్పుడు ఆయన క్రింద దేవుని ప్రజలకు ఓదార్పు, భద్రత, విశ్రాంతి అందజేసేందుకు ఆత్మీయంగా పరిపక్వత చెందిన పురుషులు నియమించబడతారని బైబిలు ముందే తెలియజేసింది. (యెషయా 32:1, 2) వారు ఆత్మీయాభివృద్ధిని పెంచేందుకు సువార్తికులుగా, కాపరులుగా మరియు బోధకులుగా నాయకత్వం వహిస్తారు. (ఎఫెసీయులు 4:11, 12, 16) క్రైస్తవ అధ్యక్షులు కొన్నిసార్లు తోటి విశ్వాసులను గద్దించి, మందలించి, ఉద్బోధించినప్పటికీ, దేవుని వాక్యం ఆధారంగా ఆ పెద్దలు ఇచ్చే హితకరమైన బోధను అన్వయించుకోవడం అందరూ జీవ మార్గంలో ఉండడానికి సహాయపడుతుంది.—సామెతలు 3:11, 12; 6:23; తీతు 2:1.
అధికారాన్ని గూర్చి యెహోవాకున్న దృష్టిని అంగీకరించండి
24. మనం ప్రతి దినం ఏ వివాదాంశంపై పరీక్షించబడుతున్నాము?
24 అధికారానికి లోబడడం అనే అంశంపై మొదటి స్త్రీ పురుషులు పరీక్షించబడ్డారు. అలాంటి పరీక్షనే మనం ప్రతిదినం ఎదుర్కొనడంలో ఆశ్చర్యంలేదు. అపవాదియగు సాతాను మానవజాతి మధ్యన తిరుగుబాటు ధోరణిని పెంచుతున్నాడు. (ఎఫెసీయులు 2:2) లోబడడం కంటే స్వతంత్రంగా ఉండడమన్నదే చాలా ఉన్నతమైందిగా కనిపించేలా చేయబడింది.
25. లోకం యొక్క తిరుగుబాటు ధోరణిని నిరాకరించడం మరియు దేవుడు చూపే లేక అనుమతించే అధికారానికి లోబడడం వలన కలిగే ప్రయోజనాలు ఏవి?
25 అయితే, మనం లోక తిరుగుబాటు ధోరణిని నిరాకరించాలి. అలా చేయడంలో, దైవిక విధేయత గొప్ప ప్రతిఫలాలను తెస్తుందని మనం తెలుసుకుంటాము. ఉదాహరణకు, లోక అధికారులతో తిప్పలు తెచ్చుకొనే వారికి సర్వసాధారణంగా కలిగే చింతాచికాకులను మనం తప్పించుకుంటాము. అనేక కుటుంబాలలో ప్రబలివున్న సంఘర్షణను మనం తగ్గించుకుంటాము. మనం మన తోటి క్రైస్తవ విశ్వాసులతో స్నేహపూరితమైన, ప్రేమపూర్వకమైన సహవాసం యొక్క ప్రయోజనాలను పొందుతాము. అతి ప్రాముఖ్యంగా, మన దైవిక విధేయత సర్వోన్నత అధికారియైన యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండడానికి నడిపిస్తుంది.
మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
యెహోవా తన అధికారాన్ని ఎలా చూపుతాడు?
“పై అధికారులు” ఎవరు, మనం వారికి ఎలా విధేయులుగా ఉండగలం?
శిరస్సత్వపు సూత్రం కుటుంబంలోని ప్రతి సభ్యునిపై ఏ బాధ్యతను పెడుతుంది?
క్రైస్తవ సంఘంలో మనం విధేయతను ఎలా చూపించగలము?
[అధ్యయన ప్రశ్నలు]
[134వ పేజీలోని బాక్సు]
విధేయులేగాని విద్రోహులు కాదు
యెహోవాసాక్షులు తాము బహిరంగముగా చేసే ప్రకటన పని ద్వారా, దేవుని రాజ్యమే మానవజాతికి శాంతి భద్రతలను తెచ్చే ఏకైక నిరీక్షణయని సూచిస్తున్నారు. అయితే ఆసక్తిగల ఈ దేవుని రాజ్య ప్రచారకులు, తాము ఏ ప్రభుత్వాల క్రింద జీవిస్తున్నారో ఆ ప్రభుత్వాలను పడద్రోసేవారు ఎంతమాత్రం కాదు. దానికి వ్యతిరేకంగా, సాక్షులు ఎంతో గౌరవనీయులు మరియు చట్టానికి లోబడివుండే పౌరులు. ఆఫ్రికా దేశంలోని ఒక అధికారి ఇలా చెప్పాడు: “ఒకవేళ అన్ని మతవర్గాల వారు యెహోవాసాక్షుల వలె ఉంటే, మనకు హత్యలు, దోపిడీలు, నేరాలు, ఆటంబాంబులు ఉండేవికావు మరియు ఖైదీలు ఉండేవారు కాదు. తలుపులకు తాళాలు ఎప్పుడూ వేసి ఉండేవి కావు.”
దీన్ని గుర్తించి, అనేక దేశాల్లోని అధికారులు సాక్షుల ప్రకటన పనికి అడ్డంకులు లేకుండా కొనసాగించడానికి అనుమతించారు. ఇతర దేశాల్లో, యెహోవాసాక్షులు మంచి ప్రభావాన్ని కలుగజేసేవారని అధికారులు గుర్తించినప్పుడు నిషేధాలు లేదా నిర్బంధాలు తీసివేశారు. అది పై అధికారులకు లోబడడం గురించి అపొస్తలుడైన పౌలు చెప్పిన దాని వలెనే ఉంది: “మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు.”—రోమీయులు 13:1, 3.