సత్య దేవుడెవరు?
అధ్యాయము 3
సత్య దేవుడెవరు?
1. బైబిలు యొక్క ప్రారంభ మాటలతో అనేకులు ఎందుకు ఏకీభవిస్తారు?
ఒక నిర్మలమైన రాత్రి మీరు ఆకాశంవైపు చూసినప్పుడు, అన్ని నక్షత్రాలను చూసి మీరు ఆశ్చర్యపోరా? వాటి ఉనికిని మీరెలా వివరిస్తారు? భూమిపై ఉండే—రంగురంగుల పువ్వులు, ఆనందకరమైన గీతాలతో పక్షులు, మహాసముద్రంలో గంతులువేసే శక్తివంతమైన తిమింగిలాల వంటి అనేక జీవుల మాటేమిటి? ఆ పట్టిక అంతులేనిది. ఇవన్నీ కూడా వాటంతటవే వచ్చివుండవు. “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అనే బైబిలు యొక్క ప్రారంభ మాటలతో అనేకులు ఏకీభవించడంలో ఆశ్చర్యంలేదు!—ఆదికాండము 1:1.
2. దేవుని గురించి బైబిలు ఏమి చెబుతుంది, ఏమి చేయుమని అది మనల్ని ప్రోత్సహిస్తుంది?
2 దేవుని విషయంలో మానవజాతి ఎంతగానో విభాగింపబడింది. దేవుడు వ్యక్తికాని శక్తి అని కొందరు భావిస్తారు. దేవుడు చేరుకోలేనంత దూరంలో ఉన్నాడని విశ్వసిస్తూ, మరణించిన పూర్వికులను లక్షలాదిమంది ఆరాధిస్తారు. కాని సత్యదేవుడు మనలో ప్రతి ఒక్కరియందు వాత్సల్యపూరితమైన శ్రద్ధను చూపించే నిజమైన వ్యక్తియని బైబిలు తెలియజేస్తుంది. అందుకే అది “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అని చెబుతూ, ‘దేవున్ని వెదకమని’ మనల్ని ప్రోత్సహిస్తుంది.—అపొస్తలుల కార్యములు 17:27.
3. దేవుని ప్రతిమను చేయడం ఎందుకు అసాధ్యము?
3 దేవుడు ఎలా ఉంటాడు? ఆయన మహిమాన్విత ప్రత్యక్షతా దర్శనాలను ఆయన సేవకులు కొందరు చూశారు. వీటిలో ఆయన ఒక సింహాసనంపై ఆసీనుడైవున్నట్లు, ఆయన నుండి భీతిగొల్పే తేజస్సు వెలువడుతున్నట్లు సూచింపబడ్డాడు. అయితే, అలాంటి దర్శనాలను చూసినవారు ఎన్నడూ ఒక స్పష్టమైన ముఖాన్ని వర్ణించలేదు. (దానియేలు 7:9, 10; ప్రకటన 4:2, 3) అది ఎందుకంటే “దేవుడు ఆత్మ” గనుక; ఆయనకు భౌతికసంబంధమైన శరీరం ఉండదు. (యోహాను 4:24) వాస్తవానికి, మన సృష్టికర్త యొక్క కచ్చితమైన భౌతిక రూపాన్ని తయారుచేయడం అసాధ్యం, ఎందుకంటే “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు.” (యోహాను 1:18; నిర్గమకాండము 33:20) అయినప్పటికీ, దేవుని గురించి బైబిలు మనకెంతో బోధిస్తుంది.
సత్యదేవునికి ఒక నామం ఉంది
4. బైబిలులో దేవునికి అన్వయింపబడిన కొన్ని అర్థవంతమైన బిరుదులు ఏవి?
4 బైబిలులో, సత్య దేవుడు “సర్వశక్తిగల దేవుడు,” “మహోన్నతుడు,” “సృష్టికర్త” “మహోపదేశకుడు,” “నాథా,” “సకల యుగములలో రాజు” వంటి పదాలతో గుర్తించబడ్డాడు. (ఆదికాండము 17:1; కీర్తన 50:14; ప్రసంగి 12:2; యెషయా 30:20, NW; అపొస్తలుల కార్యములు 4:24; 1 తిమోతి 1:17) అలాంటి బిరుదుల గురించి ధ్యానించడం మనం దేవుని గూర్చిన జ్ఞానమందు ఎదగడానికి సహాయం చేయగలదు.
5. దేవుని నామమేమిటి, హెబ్రీ లేఖనాల్లో అది ఎంత తరచుగా కనిపిస్తుంది?
5 అయితే, హెబ్రీ లేఖనాలలో దాదాపు 7,000 సార్లు, అంటే ఆయన ఇతర బిరుదులకంటే ఎన్నో ఎక్కువసార్లు కనుగొనబడే విశేషమైన నామము దేవునికి ఉంది. ఇంచుమించు 1,900 సంవత్సరాల క్రితం, యూదులు దైవిక నామాన్ని ఉచ్చరించడాన్ని మూఢనమ్మకంతో మానుకున్నారు. బైబిలు సంబంధిత హెబ్రీ భాష అచ్చులు లేకుండా వ్రాయబడేది. కాబట్టి దైవిక నామాన్ని రూపొందించే నాలుగు హల్లులను (והוה) మోషే, దావీదు, లేక ప్రాచీన కాలం నాటి ఇతరులు ఎలా ఉచ్చరించేవారో కచ్చితంగా చెప్పడానికి మార్గంలేదు. కొందరు పండితులు దేవుని నామము “యహ్‌వహ్” అని ఉచ్చరించబడేదని చెబుతారు, కాని వాళ్లు చెప్పేది ప్రామాణికం కాకపోవచ్చు. తెలుగులో “యెహోవా” అనే ఉచ్చారణ శతాబ్దాలుగా వాడుకలో ఉంది, నేడు అనేక భాషల్లో దాని సమాంతర రూపం విస్తృతంగా అంగీకరించబడింది.—నిర్గమకాండము 6:3 మరియు యెషయా 26:4 చూడండి.
మీరు దేవుని నామాన్ని ఎందుకు ఉపయోగించాలి
6. కీర్తన 83:18 యెహోవా గురించి ఏమి చెబుతుంది, మనం ఆయన నామాన్ని ఎందుకు ఉపయోగించాలి?
6 దేవుని విశేషమైన నామమైన యెహోవా అనేది ఆయనను ఇతర దేవుళ్లందరినుండి ప్రత్యేకించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆ నామము బైబిలులో, ప్రత్యేకంగా దాని హెబ్రీ లేఖనాల్లో ఎంతో తరచుగా కనిపిస్తుంది. అనేకమంది అనువాదకులు దైవిక నామాన్ని ఉపయోగించడంలో విఫలమయ్యారు, కాని కీర్తన 83:18 స్పష్టంగా ఇలా తెలియజేస్తుంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.” కాబట్టి మనం దేవుని గురించి మాట్లాడేటప్పుడు, ఆయన వ్యక్తిగత నామమును ఉపయోగించడం సముచితము.
7. యెహోవా అనే పేరు యొక్క అర్థం దేవుని గురించి మనకు ఏమి బోధిస్తుంది?
7 యెహోవా అనే నామము “అవుతాడు” అనే భావంగల హెబ్రీ క్రియాపదం యొక్క ఒక రూపం. కాబట్టి, “తానే కర్త అవుతాడు” అనేది దేవుని నామ భావం. అలా, యెహోవా దేవుడు తనను తాను గొప్ప సంకల్పకర్తగా గుర్తించుకుంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ తన సంకల్పాలు నెరవేరేలా చేస్తాడు. కేవలం సత్య దేవుడు మాత్రమే కచ్చితంగా ఈ నామాన్ని కలిగివుండగలడు, ఎందుకంటే తమ పథకాలు సఫలం కాగలవని మానవులు ఎన్నడూ కచ్చితంగా చెప్పలేరు. (యాకోబు 4:13, 14) యెహోవా మాత్రమే ఇలా చెప్పగలడు: “ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును . . . అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును.”—యెషయా 55:10, 11.
8. యెహోవా మోషే ద్వారా ఏ సంకల్పాన్ని ప్రకటించాడు?
8 హెబ్రీ మూలపురుషులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురూ కూడ “యెహోవా నామమున ప్రార్థన” చేశారు, కాని వారికి దైవిక నామం యొక్క పూర్తి విశిష్టత తెలియదు. (ఆదికాండము 21:33; 26:25; 32:9; నిర్గమకాండము 6:3) యెహోవా ఆ తర్వాత, వారి వంశస్థులైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి, వారికి ‘పాలు తేనెలు ప్రవహించు దేశమును’ ఇస్తాననే తన సంకల్పాన్ని బయల్పర్చినప్పుడు, ఇది అసాధ్యమని వారికి అనిపించివుండవచ్చు. (నిర్గమకాండము 3:17) అయినప్పటికీ, తన ప్రవక్తయైన మోషేకు ఇలా చెప్పడం ద్వారా దేవుడు తన నామం యొక్క నిత్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు: “మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.”—నిర్గమకాండము 3:15.
9. ఫరో యెహోవాను ఎలా పరిగణించాడు?
9 అరణ్యంలో యెహోవాను ఆరాధించేందుకు ఇశ్రాయేలీయులను పంపించమని మోషే ఐగుప్తు రాజైన ఫరోను అడిగాడు. కాని, తానే దేవునిగా దృష్టించబడిన మరియు ఇతర ఐగుప్తు దేవుళ్లను ఆరాధించిన ఈ ఫరో, ఇలా సమాధానమిచ్చాడు: ‘నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను.’—నిర్గమకాండము 5:1, 2.
10. ప్రాచీన ఐగుప్తులో, ఇశ్రాయేలీయులు ఇమిడివున్న తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు యెహోవా ఏ చర్య గైకొన్నాడు?
10 అప్పుడు యెహోవా తన నామ భావానికి అనుగుణంగా వ్యవహరిస్తూ, తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు క్రమేణ చర్యగైకొన్నాడు. ఆయన ప్రాచీన ఐగుప్తీయులపై పది తెగుళ్లు తీసుకువచ్చాడు. చివరి తెగులు గర్విష్ఠివాడైన ఫరో కుమారునితోసహా ఐగుప్తీయుల మొదటి సంతానాన్నంతటినీ చంపింది. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లిపోవడం గురించి ఐగుప్తీయులు ఆతురపడ్డారు. అయితే, కొందరు ఐగుప్తీయులు యెహోవా శక్తిని బట్టి ఎంతగా ప్రభావితులయ్యారంటే, వాళ్లు ఐగుప్తును విడిచి ఇశ్రాయేలీయులతో కలిశారు.—11. ఎర్ర సముద్రం వద్ద యెహోవా ఏ అద్భుతం చేశాడు, ఆయన శత్రువులు ఏమి అంగీకరించేలా చేయబడ్డారు?
11 మొండివాడైన ఫరో మరియు అతని సైన్యం, 600 యుద్ధ రథాలతో తన దాసులను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు బయలుదేరారు. ఐగుప్తీయులు సమీపిస్తుండగా, ఇశ్రాయేలీయులు ఆరిననేలపై నడిచి వెళ్లగలిగేలా దేవుడు ఎర్ర సముద్రాన్ని అద్భుతరీతిలో రెండు పాయలుగా వేరుచేశాడు. వెంట తరుముతున్నవారు సముద్రపు నేలకు చేరగానే, యెహోవా “వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి.” ఐగుప్తు యోధులు ఇలా కేకలు వేశారు: “ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు.” కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. విస్తారమైన నీటి గోడలు క్రిందికి పొర్లి “రథములను రౌతులను . . . ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను.” (నిర్గమకాండము 14:22-25, 28) అలా యెహోవా తనకు తానే గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఆ సంఘటన నేటి వరకు మరువబడలేదు.—యెహోషువ 2:9-11.
12, 13. (ఎ) దేవుని నామం నేడు మనకు ఏ భావాన్ని కలిగివుంది? (బి) ప్రజలు అత్యవసరంగా ఏమి తెలుసుకోవలసి ఉంది, ఎందుకు?
12 దేవుడు తనకు తాను తెచ్చుకున్న పేరు నేడు మనకు ఎంతో భావాన్ని కలిగివుంది. యెహోవా అనే ఆయన నామము, తాను సంకల్పించినవాటినన్నిటినీ నిజమయ్యేలా చేస్తాడనడానికి ఒక హామీగా నిలుస్తుంది. మన భూమి పరదైసు కావాలనే ఆయన ఆది సంకల్పాన్ని నెరవేర్చడం కూడా అందులో ఇమిడి ఉంది. (ఆదికాండము 1:28; 2:8) అందుకొరకే, నేడు తన సర్వాధిపత్యాన్ని వ్యతిరేకించే వారినందరిని దేవుడు నిర్మూలిస్తాడు, ఎందుకంటే ఆయనిలా చెప్పాడు: ‘నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనవలెను.’ (యెహెజ్కేలు 38:23) అప్పుడు, నీతియుక్తమైన నూతన లోకంలోకి తన ఆరాధికులను కాపాడుతాననే తన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు.—2 పేతురు 3:13.
13 దేవుని అంగీకారం కావాలనుకొనే వారందరూ నమ్మకంతో ఆయన నామమున ప్రార్థించడం నేర్చుకోవాలి. బైబిలు ఇలా వాగ్దానం చేస్తుంది: “ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.” (రోమీయులు 10:13) అవును, యెహోవా అనే నామం ఎంతో అర్థవంతమైనది. మీ దేవునిగా, విమోచకునిగా యెహోవా నామమున ప్రార్థించడం మీకు నిత్య సంతోషాన్ని తీసుకురాగలదు.
సత్య దేవుని లక్షణాలు
14. దేవుని ఏ ప్రాథమిక లక్షణాలను బైబిలు ఉన్నతపరుస్తుంది?
14 ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచింపబడడాన్ని గూర్చిన అధ్యయనం, దేవుడు పరిపూర్ణ సమతూకంతో కలిగివున్న నాలుగు ప్రాథమిక లక్షణాలను ఉన్నతపరుస్తుంది. ఫరోతో ఆయన వ్యవహారాలు భీతిగొల్పే ఆయన శక్తిని తెలియజేశాయి. (నిర్గమకాండము 9:16) ఆ సంక్లిష్టమైన పరిస్థితిని దేవుడు నైపుణ్యంగా చేపట్టిన విధానం ఆయన సాటిలేని బుద్ధిని చూపించింది. (రోమీయులు 11:33) మొండి వ్యతిరేకులకు, తన ప్రజలను బాధించేవారికి శిక్ష విధించడంలో ఆయన తన న్యాయాన్ని బయల్పర్చాడు. (ద్వితీయోపదేశకాండము 32:4) దేవుని ప్రధాన లక్షణాల్లో ఒకటి ప్రేమ. అబ్రాహాము సంతతికి సంబంధించిన తన వాగ్దానాన్ని నెరవేర్చడం ద్వారా యెహోవా విశేషమైన ప్రేమను చూపించాడు. (ద్వితీయోపదేశకాండము 7:8) కొందరు ఐగుప్తీయులు అబద్ధ దేవుళ్లను విడిచిపెట్టి, అద్వితీయ సత్య దేవుని పక్షం వహించి ఎంతో ప్రయోజనం పొందేలా అనుమతించడం ద్వారా కూడా ఆయన ప్రేమ చూపించాడు.
15, 16. దేవుడు ఏయే మార్గాల్లో ప్రేమ చూపించాడు?
15 మీరు బైబిలు చదువుతుండగా, దేవుని అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం ప్రేమయని, ఆయన దాన్ని అనేక విధాలుగా ప్రదర్శిస్తాడని మీరు గమనిస్తారు. ఉదాహరణకు, ఆయన ప్రేమను బట్టే సృష్టికర్త అయ్యాడు మరియు జీవం యొక్క ఆనందాన్ని మొదట ఆత్మలుగానున్న జీవులతో పంచుకున్నాడు. ఆ వందలకోట్ల దేవదూతలు దేవున్ని ప్రేమించి ఆయనను స్తుతిస్తారు. (యోబు 38:4, 7; దానియేలు 7:10) భూమిని సృష్టించి, సంతోషభరితమైన మానవ జీవనం కొరకు దాన్ని సిద్ధంచేయడంలో కూడా దేవుడు ప్రేమను చూపించాడు.—ఆదికాండము 1:1, 26-28; కీర్తన 115:16.
కీర్తన 139:14) ఆయన “ఆకాశమునుండి . . . వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ [మన] హృదయములను నింపు”తుండడంలో ఆయన ప్రేమ చూపించబడింది. (అపొస్తలుల కార్యములు 14:17) దేవుడు “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:45) దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొంది, ఆయన సంతోషభరిత ఆరాధికులుగా ఆయనను సేవించడానికి మనకు సహాయం చేసేందుకు ప్రేమ మన సృష్టికర్తను కదలిస్తుంది. వాస్తవానికి, “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:8) అయితే ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
16 చెప్పలేనన్ని మార్గాల్లో మనం దేవుని ప్రేమ నుండి ప్రయోజనం పొందుతాము. ఒక విషయమేమిటంటే, మనం జీవాన్ని ఆనందించగలిగేలా దేవుడు ప్రేమపూర్వకంగా మన శరీరాలను అద్భుతమైన రీతిలో రూపొందించాడు. (‘కనికరము దయ గల దేవుడు’
17. నిర్గమకాండము 34:6, 7 నందు దేవుని గురించి మనమేమి తెలుసుకుంటాము?
17 ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటినతర్వాత కూడా వాళ్లు దేవుని గురించి ఇంకా తెలుసుకోవలసి ఉండిరి. మోషే ఈ అవసరతను గుర్తించి, ఇలా ప్రార్థించాడు: “నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును.” (నిర్గమకాండము 33:13) దేవుని యొక్క ఈ స్వంత ప్రకటనను విన్న తర్వాత మోషే దేవున్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోగలిగాడు: ‘యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు.’ (నిర్గమకాండము 34:6, 7) ఇష్టపూర్వకంగా పాపం చేసేవారిని తమ తప్పిదము యొక్క పర్యవసానాల నుండి కాపాడకుండా, దేవుడు తన ప్రేమను న్యాయంతో సమతూకం చేస్తాడు.
18. యెహోవా కనికరం గలవానిగా ఎలా నిరూపించబడ్డాడు?
18 మోషే నేర్చుకొన్నట్లుగా, యెహోవా కనికరం చూపిస్తాడు. కనికరం గల వ్యక్తికి బాధపడేవారి మీద జాలి ఉంటుంది, అతడు వారికి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తాడు. అలాగే బాధ, అనారోగ్యం, మరణం వంటివాటినుండి శాశ్వత ఉపశమనాన్ని ప్రకటన 21:3-5) ఈ దుష్టలోకంలోని పరిస్థితుల మూలంగా, లేక వారు మూర్ఖంగా ప్రవర్తించి కష్టాలు తెచ్చుకొన్నందువల్ల దేవుని ఆరాధికులు బాధలను ఎదుర్కొనవచ్చు. కాని వారు సహాయం కొరకు వినయంగా యెహోవావైపు తిరిగితే, ఆయన వారిని ఓదార్చి సహాయం చేస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన కనికరంతో తన ఆరాధికుల ఎడల వాత్సల్యపూరితమైన శ్రద్ధను కనబరుస్తాడు.—కీర్తన 86:15; 1 పేతురు 5:6, 7.
కలిగించే ఏర్పాటు చేయడం ద్వారా దేవుడు మానవజాతి ఎడల కనికరాన్ని చూపించాడు. (19. దేవుడు కనికరం గలవాడని మనం ఎందుకు చెప్పవచ్చు?
19 అధికారంలో ఉన్న అనేకమంది ప్రజలు ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు. దానికి భిన్నంగా, యెహోవా వినయంగల తన సేవకులతో ఎంత కనికరంతో వ్యవహరిస్తాడో కదా! ఆయన విశ్వంలో అత్యున్నత అధికారి అయినప్పటికీ, మానవజాతంతటికీ సాధారణమైన రీతిలో ఆయన విశేషమైన దయను చూపిస్తాడు. (కీర్తన 8:3, 4; లూకా 6:35) కృప కొరకైన వారి ప్రత్యేకమైన విజ్ఞాపనలకు సమాధానమిస్తూ కూడా వ్యక్తుల ఎడల యెహోవా కనికరం కలిగివున్నాడు. (నిర్గమకాండము 22:26, 27; లూకా 18:13, 14) నిజానికి, ఎవరికైనా దయను లేక కనికరాన్ని చూపించవలసిన బాధ్యత దేవునికేమి లేదు. (నిర్గమకాండము 33:19) కాబట్టి, మనం దేవుని దయాదాక్షిణ్యాల ఎడల లోతైన మెప్పు చూపించవలసిన అవసరత ఉంది.—కీర్తన 145:1, 8.
దీర్ఘశాంతము గలవాడు, నిష్పక్షపాతి, నీతిమంతుడు
20. యెహోవా దీర్ఘశాంతం గలవాడని, నిష్పక్షపాతియని ఏది చూపిస్తుంది?
20 యెహోవా దీర్ఘశాంతము గలవాడు. అయితే దీని భావం ఆయన చర్య గైకొనడని కాదు, ఎందుకంటే ఆయన గర్విష్టుడైన ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో నాశనం చేయడం ద్వారా చర్య గైకొన్నాడు. యెహోవా నిష్పక్షపాతి కూడా. అందుకే, ఆయన దయనొందిన ప్రజలైన ఇశ్రాయేలీయులు, తాము ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వల్ల చివరికి ఆయన దయను కోల్పోయారు. దేవుడు అన్ని జనాంగాలలోను తన నీతియుక్తమైన మార్గాలను అనుసరించే వారిని మాత్రమే తన ఆరాధికులుగా అంగీకరిస్తాడు.—అపొస్తలుల కార్యములు 10:34, 35.
21. (ఎ) ప్రకటన 15:3, 4 దేవుని గురించి మనకు ఏమి బోధిస్తుంది? (బి) దేవుడు సరైనదని చెప్పే దానిని మనం చేయడాన్ని ఏది మనకు సులభతరం చేస్తుంది?
21 దేవుని ‘న్యాయ విధుల’ గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథం ఉన్నతపరుస్తుంది. పరలోక జీవులు ఇలా పాడుతున్నారని అది మనకు తెలియజేస్తుంది: “ప్రభువా [“యెహోవా,” NW] దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు.” (ప్రకటన 15:3, 4) ఆయన సరైనదని చెప్పేదాన్ని అనుసరించడం ద్వారా, మనం యెహోవా ఎడల ఆరోగ్యకరమైన భయాన్ని లేక ఆయన ఎడల భయంతోకూడిన భక్తిని చూపిస్తాము. దేవుని జ్ఞానాన్ని, ప్రేమను మనకు మనం గుర్తుచేసుకోవడం ద్వారా ఇది సులభం చేయబడుతుంది. ఆయన ఆజ్ఞలన్ని మన మేలు కొరకే ఇవ్వబడ్డాయి.—యెషయా 48:17, 18.
“మన దేవుడైన యెహోవా అద్వితీయుడు”
22. బైబిలును అంగీకరించేవారు త్రిత్వాన్ని ఎందుకు ఆరాధించరు?
22 ప్రాచీన ఐగుప్తీయులు అనేకమంది దేవుళ్లను ఆరాధించారు, అయితే యెహోవా నిర్గమకాండము 20:5) “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అని మోషే ఇశ్రాయేలీయులకు గుర్తు చేశాడు. (ద్వితీయోపదేశకాండము 6:4, ఇటాలిక్కులు మావి.) యేసుక్రీస్తు ఆ మాటలను పునరుద్ఘాటించాడు. (మార్కు 12:28, 29) కాబట్టి బైబిలు దేవుని వాక్యమని అంగీకరించేవారు, ముగ్గురు వ్యక్తులు లేక దేవుళ్లు కలిసివున్న త్రిత్వాన్ని ఆరాధించరు. వాస్తవానికి, “త్రిత్వం” అనే పదం అసలు బైబిల్లోనే కనిపించదు. సత్యదేవుడు కేవలం ఒకేఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు నుండి వేరుగావున్నాడు. (యోహాను 14:28; 1 కొరింథీయులు 15:28) దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు. అది యెహోవా యొక్క చురుకైన శక్తి, సర్వశక్తిగలవాడు తన సంకల్పాలను నెరవేర్చేందుకు దాన్ని ఉపయోగిస్తాడు.—ఆదికాండము 1:2; అపొస్తలుల కార్యములు 2:1-4, 32, 33; 2 పేతురు 1:20, 21.
“రోషముగల దేవుడు.” (23. (ఎ) దేవుని ఎడల మీ ప్రేమ ఎలా అధికమౌతుంది? (బి) దేవున్ని ప్రేమించడాన్ని గూర్చి యేసు ఏమి చెప్పాడు, క్రీస్తు గురించి మనం ఏమి నేర్చుకోవలసి ఉంది?
23 యెహోవా ఎంతో అద్భుతమైనవాడని మీరు గమనించినప్పుడు, ఆయన మీ ఆరాధనను పొందేందుకు అర్హుడని మీరు అంగీకరించరా? ఆయన వాక్యమైన బైబిలును మీరు చదువుతుండగా, ఆయనను మీరు ఎక్కువగా తెలుసుకోగలుగుతారు, మీ నిత్య శ్రేయస్సు సంతోషాల కొరకు ఆయన మీ నుండి ఏమి కోరుతున్నాడో మీరు తెలుసుకుంటారు. (మత్తయి 5:3, 6) అంతేగాక, దేవుని ఎడల మీ ప్రేమ అధికమౌతుంది. అది తగినదే, ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణప్రాణముతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” (మార్కు 12:30, NW) స్పష్టంగా, యేసుకు దేవుని ఎడల అలాంటి ప్రేమ ఉండేది. కాని బైబిలు యేసుక్రీస్తు గురించి ఏమి తెల్పుతుంది? యెహోవా సంకల్పంలో ఆయన పాత్ర ఏమిటి?
మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
దేవుని నామమేమిటి, అది హెబ్రీ లేఖనాల్లో ఎంత తరచుగా ఉపయోగించబడింది?
మీరు దేవుని నామాన్ని ఎందుకు ఉపయోగించాలి?
యెహోవా దేవుని ఏ లక్షణాలు ప్రాముఖ్యంగా మీకు నచ్చాయి?
[అధ్యయన ప్రశ్నలు]
[29వ పేజీలోని చిత్రం]
విశ్వాన్నంతటినీ సృష్టించినవాని గురించి మీకు ఎంత బాగా తెలుసు?