కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తలిదండ్రులుగా మీ బాధ్యత

తలిదండ్రులుగా మీ బాధ్యత

అధ్యాయము 8

తలిదండ్రులుగా మీ బాధ్యత

1-3. (ఎ) శిశువు పుట్టుక తలిదండ్రులపై ఎలాంటి ప్రభావం కల్గివుండగలదు? (బి) తలిదండ్రులుగా, తల్లి, తండ్రి ఇద్దరూ వారి వారి స్థానాలను గుర్తెరుగుట ఎందుకు ముఖ్యం?

జీవితంలో అనేక సంఘటనలు మనకు కొద్దిపాటి ప్రభావమే చూపుతాయి. ఇతర సంఘటనలు ఎంతో గంభీరమై శాశ్వత ప్రభావాన్ని కల్గివుంటాయి. శిశువు పుట్టుక యీ రెండవ కోవకు చెందిన వాటిలో ఒకటి. శిశువు జన్మించిన అనంతరం భార్యాభర్తల జీవితం ఎన్నటికి ముందున్నట్లుగా ఉండదు. ఆ శిశువు పసికందు అయినప్పటికీ ఆ క్రొత్త వ్యక్తియొక్క స్వరం, ఇల్లంతా కలియ తిరుగుట మొదలగు సంఘటనలు మరువరానివి.

2 తలిదండ్రుల జీవితం ఘనంగాను, ఆనందంగాను వుండాలి. అయితే అదొక సవాలు విసురుతుంది, మరి శ్రేష్ఠమైన ఫలితాలకొరకు వారిద్దరు ఆ సవాలు నెదుర్కోవలసిన అగత్యతవుంది. మీరిరువురుకలిసి ఒక శిశువును తయారుచేశారు, మరి ఆ శిశువు జన్మించినప్పటినుండి దాని పెంపకంలో మీ ఇద్దరికీ ముఖ్యమైన బాధ్యతలున్నవి. మనఃపూర్వకమైన, ఐక్యతగల మరియు వినయంతో కూడిన సహకారంకంటె గొప్పదేమీలేదు.

3 తలిదండ్రులైన ప్రతివారు తమ స్థానాలను గుర్తెరిగి అవెట్లు ఒకదానికొకటి అనుబంధం కల్గియుండగలవో గ్రహించుటవలన నీ శిశువు అవసరాలను తీర్చుటలో ఎంతో సహాయపడి, మంచి ఫలితాలను పొందవచ్చును. వీటిలో నీకు స్థిరత్వం అవసరం. మనస్సు కారణసహితంగా వున్నప్పటికిని, ఆవేశాలు అనుకున్నవాటిని అదుపు తప్పేలా చేస్తాయి. మనం అదుపుతప్పి అతి చిన్న వాటినుండి ఎంతో గొప్పవాటి వరకు వెళ్ళి, మరల అతి చిన్నవాటికే దిగజారిపోయే అవకాశముండవచ్చును. తండ్రి తన శిరస్సత్వాన్ని నిర్వహించుట కోరదగిందే, కాని ఆయన దానిని అధికంగా అమలుపరిస్తే అది భరింపరానిదౌతుంది. తల్లి పిల్లలకు తర్ఫీదునిచ్చి శిక్షించుటలో భాగం వహించుట మంచిదేగానీ, తన భర్త బాధ్యతలను తాను తీసికొనుటవలన కుటుంబ నిర్మాణమే దెబ్బతింటుంది. మంచి మంచియేకానీ ఆ మంచి అదుపుతప్పితే అది చెడుగా మారుతుంది.—ఫిలిప్పీయులు 4:5.

తల్లి క్రియాశీలక పాత్ర

4. బిడ్డ తన తల్లినుండి కోరేదేమిటి?

4 క్రొత్తగా జన్మించిన శిశువు తనకప్పుడు కావలసిన వాటన్నిటి విషయంలో తన తల్లిపై పూర్తిగా ఆధారపడివుంటుంది. మరి తల్లి యీ అవసరతలన్నిటిని ప్రేమతో తీర్చినపుడు శిశువు తాను సురక్షితంగావున్నట్లు భావిస్తుంది. (కీర్తన 22:9, 10) శిశువును, బాగుగా పాలిచ్చి పోషిస్తూ, పరిశుభ్రంగానుంచి, వెచ్చదనం నివ్వాలి; కానీ శరీరావసరతలను తీర్చడం మాత్రమే చాలదు. మానసిక కోరికలను తీర్చుటకూడ అంతే అవసరం. శిశువును ప్రేమించకపోతే తాను సురక్షితంగా లేనట్లు భావిస్తుంది. తన పాప తనను ఎంతగా కోరుతుందో ఆ నిజమైన అవసరతను తెల్పడానికి తల్లి త్వరలోనే నేర్చుకుంటుంది. అయితే బిడ్డ ఏడ్పులను ఎల్లప్పుడూ అలక్ష్యపరిస్తే బిడ్డ బలహీనమౌతుంది. కొంతకాలం వరకు అది మానసికంగా మందగించేలా చేస్తే అది ఇక జీవితాంతం అదే మానసిక మాంద్యం అనుభవిస్తుంది.

5-7. ఇటీవలి పరిశోధన ప్రకారం శిశువుపై తన తల్లియొక్క ప్రేమ, మమకారముల ప్రభావమెలావుంటుంది?

5 వివిధ స్థలాలలో జరిపిన పరిశోధనలు యీ వాస్తవాన్ని స్థిరపరచినవి: మాటలు, స్పర్శ మెల్లగా తట్టుట ద్వారా, కౌగలించుకొని ముద్దాడుటవలన ప్రేమను కనబరచకపోతే శిశువులు రోగగ్రస్థులై చివరకు మరణించవచ్చు. (యెషయా 66:12; 1 థెస్సలొనీకయులు 2:7 పోల్చండి.) ఇతరులు వీటిని చేస్తే, తన కడుపున పుట్టిన బిడ్డను, జీవితంలోని తొలినెలల్లో తల్లియే అలా ప్రేమించుట భావ్యమనుటలో సందేహం లేదు. తల్లి పిల్లల మధ్య సహజంగా అనుబంధమేర్పడును. తన బిడ్డను దగ్గరకు తీసికొని ఆలింగనం చేసికొనవలెననే సహాజ కోరికకు, బిడ్డ తన తల్లి పాలకొరకు తడువులాడుటకు ఇది సరిపోతుంది.

6 పరిశోధన తెలియజేసేదేమంటే ఆ పసికందు మెదడు చురుకైంది మరి స్పర్శ, ఆలకించుట, తిలకించుట, వాసనచూచుట మొదలైన జ్ఞానేంద్రియాలు ఉత్తేజపరచబడినపుడు దానికి మానసిక అభివృద్ధి జరుగుతుంది. పసిపాప పాలు త్రాగేటప్పుడు అది తన తల్లి వెచ్చదనాన్ని, శరీర వాసనను గ్రహిస్తుంది. అది పాలు త్రాగుచూ తన తల్లి ముఖం వైపే చూస్తూవుంటుంది. తల్లి మాట్లాడినపుడు, పాడినపుడు ఆ శబ్దం వినడమేగాక తాను గర్భంలోనున్నపుడు తన తల్లి గుండెచప్పుడు విన్నట్లే ఇప్పుడూ వింటుంది. నార్వేదేశపు ప్రచురణలో, చిన్న పిల్లల మానసిక శాస్త్రజ్ఞుడైన ఏని-మారిట్‌ డూవె ఇలా అన్నాడు:

“చిన్న పిల్లలు చేసేపనులు, వారి వారి మానసిక చర్యయొక్క స్థాయిని స్పష్టంగా తెలియజేస్తున్నందువలన, చర్మతాకిడి అనగా ఇద్దరి మధ్యగల సంబంధమునకున్న అత్యున్నత స్థానం—పాలిచ్చుటలో గల సంబంధమేగాక మానసిక చర్యను వృద్ధిపరచి, వయోజనులైనప్పుడు అధికజ్ఞానం పొందుటకది తోడ్పడగలదని నమ్ముటకాధారముంది.”

7 కావున, తల్లి పాపను ఎత్తుకొని, కౌగలించి, లేక స్నానం చేయించి, తుడిచినపుడు ఆ శిశువు తల్లి స్పర్శవలన కలిగే అనుభూతి, దాని పెరుగుదలకు, తర్వాత జీవితంలో తాను జీవించే విధానం మీదను ప్రాముఖ్యమైన ప్రభావం కల్గివుంటుంది. రాత్రిపూట నిద్రలేక ఏడుస్తున్న పాపను ఊరడించుట అంతగా సంతోషం కల్గించకపోవచ్చును, కానీ భవిష్యత్తులో ప్రయోజనాలున్నాయని తెలిసికొనుటవలన అట్టి జాగరణకు సరిపోయే ప్రతిఫలాలు లభిస్తాయని నిరీక్షించగలము.

ప్రేమించబడుట ద్వారా ప్రేమించుట నేర్చుకొనుట

8-10. (ఎ) శిశువు తన తల్లి ప్రేమనుండి దేనిని నేర్చుకుంటుంది? (బి) ఇదెందుకు ప్రాముఖ్యమైంది?

8 శిశువు మానసికంగా అభివృద్ధి చెందడానికి దానిని ప్రేమించుట ప్రాముఖ్యం. అది ప్రేమింపబడుతు, ప్రేమకు ఆదర్శాలను గమనిస్తూ ప్రేమించుట నేర్చుకుంటుంది. దేవుని ప్రేమను గూర్చి ప్రస్తావిస్తూ 1 యోహాను 4:19 ఇలా చెబుతుంది: “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.” మొదటి ప్రేమ పాఠాల బాధ్యత తల్లిదే. తల్లిపడకలో తన పాపవైపు తిరిగి దాని ఎదపై తన చెయ్యి వేసి నెమ్మదిగా గిలిగింతలు పెడుతూ, తన ముఖాన్ని దాని ముఖానికి ఆన్చి, ‘నేను నిన్ను చూస్తున్నాను! నేను నిన్ను చూస్తున్నాను!’ అని అంటుంది. నిజమే, పాపకు ఆ మాటలేమీ తెలియవు (అవి అంత కారణసహితమైనవి కావనుకోండి). అయితే పాప మెలికలు తిరుగుతు, ఆనందంతో కేరింతలు కొడుతుంది, ఎందుకంటే ఆటలాడే ఆ చెయ్యి తన తల్లిచేసే శబ్దాన్ని, ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను! నేను నిన్ను ప్రేమిస్తున్నాను!‘ అనే దానికి రుజువని అది గ్రహిస్తుంది. తాను సురక్షితంగా వున్నట్లు భావించి, ధైర్యంగా వుంటుంది.

9 ప్రేమించబడే శిశువులు, చిన్నపిల్లలు దానిని గుణగ్రహిస్తారు, మరి ఆ ప్రేమను అనుకరిస్తూ వారు తల్లి మెడచుట్టూ, తమ బుల్లి చేతులువేసి తల్లిని ముద్దుపెట్టుకుంటూ ఆ ప్రేమను అభ్యసిస్తారు. తత్ఫలితంగా తల్లి పొందే హృదయపూర్వక అనుభూతిని చూచి వారు మురిసిపోతారు. ప్రేమను ఇచ్చి పుచ్చుకొనుటలోగల సంతోషాన్ని గూర్చి, ప్రేమను విత్తుటవల్ల మరల దాని పంటనే కోస్తారని నేర్చుకుంటారు. (అపొస్తలుల కార్యములు 20:35; లూకా 6:38) తల్లి తన బిడ్డతో సత్వరమే సంబంధాన్ని పెంచుకొనకపోతే, తదుపరి ఆ శిశువు ఇతరులతో ప్రగాఢమైన సంబంధాలను, అనుబంధాలను పెంచుకోవడానికి కష్టంగా వుంటుంది.

10 పుట్టుకతోనే పిల్లలు నేర్చుకొనుటకారంభిస్తారు గనుక, మొదటి కొన్ని సంవత్సరాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆ సంవత్సరములలోనే తల్లి ప్రేమ అతి క్రియాశీలకదశలో వుంటుంది. ప్రేమను చూపుటయందు ఉపదేశించుటయందు ఆమె విజయం సాధిస్తే—తాను యథేచ్చగా చేయకుండ వుంటే ఆమె శిశువు యొక్క శాశ్వతకాల ప్రయోజనానికి దోహదపడగలదు; ఇందులో అపజయమొందితే అది శిశువుకు శాశ్వతకాల హాని చేస్తుంది. ఉత్తమమైన తల్లిగా వుండడం, స్త్రీకుండవలసిన అత్యంత సవాలు పూర్వకమైన, దీవెననొందదగిన పనులలో ఒకటి. అందులో ఎన్ని సాధకబాధకాలున్ననూ తల్లికి అటువంటి ప్రాముఖ్యతగల, శాశ్వత సంతృప్తినిచ్చే మరే “పనినైననూ” లోకం దానికి సమానం చేయగలదా?

తండ్రియొక్క ప్రధాన పాత్ర

11. (ఎ) తండ్రి తన స్థానాన్ని బిడ్డ మనస్సులో ఎలా నాటగలడు? (బి) అది ఎందుకు ప్రాముఖ్యము?

11 బాల్యదశయందు శిశువు జీవితంలో తల్లి ప్రాముఖ్యపాత్ర వహించుట సహజమే. అయితే శిశువు జన్మించిన నాటినుండి తండ్రి కూడ ఆ బిడ్డ జీవితంలో ఒక ప్రముఖ పాత్ర వహించాలి. శిశువు పసికందుగా వున్నప్పటినుండి కూడ తండ్రి బిడ్డను పరామర్శిస్తూ, అప్పుడప్పుడు జాగ్రత్తగా చూస్తూ, ఆడుకుంటూ, ఏడ్చినపుడు ఊరడిస్తుండాలి. ఇలా తండ్రికూడ శిశువు మనస్సులో నాటుకొనిపోతాడు. కాలం గడచిన కొలది తండ్రిపాత్ర అంతకంతకు పెరిగి ప్రముఖస్థానం వహిస్తుంది. తన పాత్రను నిర్వహించుట కతడు జాప్యం చేస్తే అది సమస్యలకు నాందియౌతుంది. ముఖ్యంగా శిశువు పెరిగి యౌవనస్థుడయ్యే కొలది శిక్షణ ఇవ్వడం మరింత కష్టతరమౌతుంది. ప్రత్యేకంగా తండ్రి సహాయం అవసరమౌతుంది. అయితే అంతకుముందే వారిరువురి మధ్య మంచి సంబంధం స్థిరపడకపోతే కొన్ని సంవత్సరాలుగా ఏర్పడిన ఆ అగాధాన్ని కొన్ని వారాల్లో మూసివేయలేము.

12, 13. (ఎ) కుటుంబంలో తండ్రి పాత్ర ఏమిటి? (బి) తండ్రి తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించడంవల్ల అది తన పిల్లలు అధికారం ఎడల కనబరచే దృష్టిపై ఎలాంటి ప్రభావం కల్గివుండగలదు?

12 శిశువు బాలుడైననూ లేక బాలికైనను సరే తండ్రి లక్షణాలు, వారి వ్యక్తిత్వాన్ని సమతుల్యతతో పెంపొందించు కోవడానికెంతో బాగుగా తోడ్పడతాయి. తండ్రి కుటుంబ యజమానుడని బైబిలు తెల్పుతుంది. ఆయన వారి భౌతిక అవసరాలను తీర్చే బాధ్యత కల్గివున్నాడు. (1 కొరింథీయులు 11:3; 1 తిమోతి 5:8) అయినను, “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాటవలన నరులు బ్రదుకుదురు.” పిల్లల విషయంలోనైతే తండ్రికి యీ ఆజ్ఞ ఇవ్వబడింది, “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ద్వితీయోపదేశకాండము 8:3; ఎఫెసీయులు 6:4) తన పిల్లలపై తనకు సహజంగా వున్న మమకారం అతనినలాచేయడానికి పురికొల్పినను అంతకంటె ముఖ్యంగా సృష్టికర్త తనకిచ్చిన ఆజ్ఞను తన శక్తికొలది అమలుపరచుటయే తన బాధ్యతయని తండ్రి గుర్తెరుగును.

13 తల్లి మమకారం, అనురాగం, ఆప్యాయతతోపాటు తండ్రి కూడ పటిష్ఠమైన, తెలివైన నడిపింపుతో కూడిన స్థిరమైన ప్రభావాన్ని శిశువుయెడల చూపవచ్చును. తనకు దేవుడనుగ్రహించిన బాధ్యతను నిర్వహించే పద్ధతిని బట్టి పిల్లలు రాబోవు కాలంలో మానవ, దైవిక అధికారం యెడల కనబరచే స్వభావంపై ఎంతో ప్రాబల్యము కల్గియుండగలదు. అనగా అధికారానికి లోబడతారా లేదాయనే విషయముపైనను, ఇతరుల నడిపింపును త్రోసిపుచ్చకుండ లేక ధిక్కరించకుండ దానికి విధేయులై ఎలా పనిచేయగలరను దానిపైనను అది ప్రభావం కల్గివుంటుంది.

14. తండ్రి చూపే మంచి మాదిరి, తన కుమారునిపై లేదా కుమార్తెపై ఎటువంటి ప్రభావాన్ని కల్గివుండగలదు?

14 తనకు కుమారుడే వుంటే తండ్రి చూపే మాదిరిని బట్టి, చేసే క్రియలను బట్టి బాలుడు బలహీనుడు, చంచలస్వభావుడుగా తయారగునా లేక పౌరుషం, అచంచలత్వం, ధైర్యశాలి, బాధ్యతను చేపట్టగల అభీష్టాన్ని వ్యక్తపరచగల ధీరునిగా తయారగునాయని నిర్ణయించడానికి అదెంతగానో తోడ్పడగలదు. కుమారుడు చివరకు ఎలాంటి భర్తగా లేక తండ్రిగా తయారౌతాడు మొండివాడు, బుద్ధిహీనుడు, కఠినుడా లేక తుల్యశక్తిగల్గి, వివేచన, దయకనబరచువానిగా తయారౌతాడా అనే దానిపై ఇది ప్రాబల్యం కల్గియుండగలదు. కుటుంబంలో కుమార్తె ఉంటే తన తండ్రి ప్రాబల్యం, వారిద్దరి మధ్యగల అనురాగబంధం యొక్క ప్రభావం, తన పురుషుని ఎడల గల దృక్పథంలోను, తన వివాహ జీవితంలో జయాపజయాల మీదను పడుతుంది. ఈ పుట్టింటి ప్రభావము బాల్యము నుండే ప్రారంభమౌతుంది.

15, 16. (ఎ) ఉపదేశించే ఎటువంటి బాధ్యతను బైబిలు తండ్రిపై మోపుతుంది? (బి) ఈ బాధ్యత నెట్లు నిర్వహించాలి?

15 తండ్రి ఉపదేశించుటలోగల గొప్ప బాధ్యతను గూర్చి ద్వితీయోపదేశకాండము 6:6, 7 నందు దేవుడు తనప్రజల కిచ్చిన నియమావళి నందు పొందుపరచబడింది: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.”

16 దేవుని వాక్యమందున్న మాటలను మాత్రమేకాదు గానీ ఆ మాటలలో నిగూఢమైయున్న సమాచారాన్ని ప్రతిదినం శిశువు మనస్సులో నాటాలి. అవకాశాలెప్పుడూ లభ్యమౌతూనే ఉంటాయి. తోటలోని పుష్పాలు, గాలిలోని కీటకాలు, వృక్షాలపై ఉండే పక్షులు లేక ఉడుతలు, సముద్రపుగవ్వలు, పర్వతశ్రేణిలోని ఫలవృక్షాలు, రాత్రివేళ ఆకాశమందు మెరసే నక్షత్రాలు మున్నగు యీ అద్భుతాలన్నీ సృష్టికర్తను గూర్చి వివరిస్తున్నాయి. మరి నీవైతే వాటి భావాన్ని నీ పిల్లలకు విశదీకరించి చెప్పాలిగదా. కీర్తనల రచయిత ఇలా అంటున్నాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.” (కీర్తన 19:1, 2) నీతి సూత్రాలను వివరించి నొక్కి చెప్పడానికి, దేవుని ఉపదేశమందున్న జ్ఞానం దాని ప్రయోజనాన్ని గూర్చి తెలియజేయుటకై వీటిని వుపయోగించడానికి, ముఖ్యంగా దిన జీవితమందలి విషయాలను వారి దృష్టికి తేవడానికి అతడు చురుకుగా వుంటే అప్పుడు తండ్రి తన బిడ్డ భవిష్యత్తుకు అత్యవసరమైన ఆధారాన్ని శిశువు మనస్సులోను హృదయములోను నాటగలడు: అనగా దేవుడున్నాడనే దృఢనమ్మకాన్ని కల్గించుటయేగాక, ‘ఆయనను మనస్పూర్తిగా వెదకువారికి ఫలము దయచేయువాడనే’ విశ్వాసాన్ని కూడ కల్గించగలడు.—హెబ్రీయులు 11:6.

17, 18. (ఎ) తండ్రి తన పిల్లలనెలా శిక్షించాలి? (బి) అనేక ఆజ్ఞలు యిచ్చుటకన్నా ఉత్తమమైనదేది?

17 తండ్రి బాధ్యతలలో శిక్షించుట కూడ ఒకటి. “తండ్రి శిక్షింపని కుమారుడెవడు?” అని హెబ్రీయులు 12:7 నందు ప్రశ్నింపబడింది. అయితే తండ్రి అమితంగా శిక్షించ కూడదు, కోపం తెప్పించునంతగా మందలించకూడదు లేక బెదిరించకూడదు. దేవుని వాక్యం తండ్రులకిలా ఉపదేశిస్తుంది, “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) ఆంక్షలు విధించుట అవసరమే, అయితే అవి భారభరితమై, నిరుత్సాహపరచునంతగా మారునట్లు కొన్నిసార్లు మనమాజ్ఞలను పొడిగించి, పెంచే అవకాశముండవచ్చును.

18 పూర్వం పరిసయ్యులు ఆజ్ఞలను పాటించెడివారు; అట్టి వాటిని అత్యధికంగా సమకూర్చుకొని, వారు వేషధారులుగా తయారైరి. మరికొన్ని చట్టాలను చేసుకొనడం మూలంగా సమస్యలను సులభంగా చక్కపరచవచ్చని తలంచుట మానవ బలహీనతయే; కానీ జీవితానుభవాలు స్పష్టపరచేదేమంటే అవి హృదయంలోనికి చొచ్చుకొని పోవుటే అసలు కీలకం. కావున చట్టాలను ప్రక్కకు పెట్టి; వాటికి బదులుగా సూత్రప్రాయమైన నియమాలను నాటండి, దేవుడు చేసినట్లే నీవును చేయడానికి ప్రయత్నించు: “వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయములమీద వాటిని వ్రాయుదును.”—హెబ్రీయులు 8:10.

తలిదండ్రులిద్దరూ భాగస్వాములే

19. కుటుంబంలో మంచి సంభాషణ కొనసాగడానికి ఏం చేయవచ్చును?

19 తండ్రి సర్వసాధారణంగా కుటుంబాన్ని పోషిస్తాడు మరి ఆయన తన ఉద్యోగమునుండి ఇంటికి వచ్చినపుడు అలసిపోతాడు, తాను చేయవలసిన ఇతర పనులు కూడ ఉండవచ్చును. కానీ తనభార్య పిల్లలతో సమయాన్ని వెచ్చించుటకు వీలు కల్గించుకోవాలి. అతడు తన కుటుంబ సభ్యులతో సంభాషిస్తు, కుటుంబాన్ని గూర్చి, దాని పథకాలను గూర్చి, అంతాకలిసి వినోదం లేదా షికారుగా బయటికి వెళ్లడాన్ని గూర్చి చర్చించడానికి సమయాన్ని ప్రత్యేకించాలి. ఇలాచేయుట మూలంగా కుటుంబ ఐక్యత పెంపొంది, పరస్పరాధారం వృద్ధిచెందుతుంది. పిల్లలు పుట్టకమునుపు బహుశ తాను తన భార్య బయట ఎక్కువ సమయాన్ని గడపి యుండవచ్చు. ఇప్పుడు వారలా చేయడం, అటు ఇటు తిరగడం బహుశ ఆలస్యంగా రావడం తలిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించినట్లు కాదు. అలా చేస్తే పిల్లలకు అన్యాయం చేసినట్లే. ఇప్పుడుకాకపోయిననూ, తర్వాతనైనా తలిదండ్రులు వారి క్రమరాహిత్యానికి, బాధ్యతారాహిత్యానికి ప్రతిఫలము పొందుతారు. పెద్దలవలె పిల్లలు కూడ వారి జీవితాలు స్థిరపడి, ఒక క్రమానికి వచ్చినపుడు బాగుగా నడుచుకొంటారు; ఇందువలన వారి మానసిక, శారీరక భావోద్రేక పరిస్థితి సరియైనదిగా వుంటుంది. ప్రతిదిన జీవిత విధానానికి తలిదండ్రులు మరేమి చేర్చకుండానే దాని కుండవలసిన ఒడుదుడుకులు పూర్ణంగా ఉంటూనే వుంటాయి.—మత్తయి 6:34; కొలొస్సయులు 4:5 పోల్చండి.

20. పిల్లలను శిక్షించు విషయం వచ్చినపుడు, వారి ప్రయత్నాలలో వారు ఐక్యత కల్గియుండేలా తలిదండ్రులు ఏం చేయవచ్చును?

20 పిల్లలకు ఉపదేశించి, నియమాలు విధించి, శిక్షించి, ప్రేమించే విషయాల్లో తలిదండ్రులిద్దరు సహకరించుకోవాలి. ‘తనకు తానే విరోధముగా లేచిన ఏ ఇల్లును నిలువదు.’ (మార్కు 3:25) తలిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసిన శిక్షను గూర్చి నిశ్చయంగా చర్చించుకోవాలి; అప్పుడే శిక్ష విషయంలో తలిదండ్రులమధ్య ఏదో అనైక్యతవుందని పిల్లలు గ్రహించకుండా వుండటానికి వీలౌతుంది. అలా చేయకపోతే, ‘వేరుపరచి, గెలుపొందుడి’ అని పిల్లలతో చెప్పినట్లుంటుంది. నిజమే, తలిదండ్రులలో ఎవరోఒకరు ఒక్కొక్కసారి తొందరపడి చెయ్యి చేసుకోవచ్చును లేదా కోపంతో అధిక శిక్షను విధించవచ్చును. తలిదండ్రులుగా ఇద్దరూ యీ విషయాన్ని ఏకాంతముగా మాట్లాడుకున్న పిదప, తొందరపడిన వ్యక్తి వెళ్లి తనబిడ్డతో తన తొందరపాటును గూర్చి సమాలోచించి సరిదిద్దుకోవడానికి తీర్మానించుకోవచ్చు. లేక వారిద్దరు కలిసి ఏకాంతంగా మాట్లాడుకొనే అవకాశం లభించనపుడు, ఈ విషయంలో తన జతతో సహకరించడం, అన్యాయమును బలపరచినట్లవుతుందని భావించే వ్యక్తి ఇలా అనవచ్చును, ‘నీవెందుకు కోపపడ్డావో నాకు అర్థమైంది, నీ వెలా బాధపడుతున్నావో నేనూ ఆలాగే బాధపడుతున్నాను. అయితే నీవు గమనించనిది ఒకటుంది, అదేమంటే . . . ’ అని ఆ గమనించబడని దానిని గూర్చి చర్చించుకోవచ్చును. ఈ విధంగా చేస్తే అచ్చట ప్రశాంతత నెలకొని, శిక్షింపబడిన శిశువు ఎదుట ఎట్టి అనైక్యత లేక అసమ్మతి ధోరణి కనబడదు. ప్రేరేపిత సామెత యిలా తెల్పుతుంది: “గర్వమువలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.”—సామెతలు 13:10; ప్రసంగి 7:8 కూడ చూడండి.

21. శిక్షించు బాధ్యత ఒక్కరిదేనా? ఎందుకు లేక ఎందుకు కాదు?

21 పిల్లలను శిక్షించుట ఇద్దరి వంతు అని హెబ్రీ లేఖనాలు తెల్పుతున్నవి: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” క్రైస్తవ గ్రీకు లేఖనాలు కూడ ఆలాగే తెల్పుతున్నవి: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.” పిల్లలను శిక్షించుట తల్లి బాధ్యతేయని తండ్రి కొన్నిసార్లు అనుకుంటాడు లేక తల్లికూడ అదే భావనతో, తప్పుచేసిన పిల్లవాన్ని బెదిరిస్తూ ‘మీ నాన్నగారు వచ్చేంతవరకువుండు, అప్పుడు ఆయనే నీకు తగిన శాస్తి చేస్తాడు!’ అని అంతా తండ్రిమీద మోపి తాను ఊరుకుంటుంది. కుటుంబంలో సంతోషం వుండాలంటే, తలిదండ్రులిద్దరు పిల్లల ప్రేమను, మన్ననను పొందాలంటే, వారిని శిక్షించే బాధ్యతలో ఇద్దరూ భాగం వహించాలి.—సామెతలు 1:8; ఎఫెసీయులు 6:1.

22. శిశువుకుగల కోర్కెలను తీర్చే విషయంలో దేనిని విడనాడాలి, ఎందుకు?

22 ఈ విషయంలో తలిదండ్రులుచూపు ఐక్యతా సహకారాన్ని, తమ తమ బాధ్యతలను నిర్వర్తించుటలో ఇష్టాన్ని వ్యక్తపరస్తున్న విధానాన్ని పిల్లలు గమనించేలా చేయాలి. పిల్లవాడు అడిగినపుడెల్ల ‘మీ అమ్మను అడుగు, అని తండ్రి, లేక తల్లి అదంతా మీ నాన్నే చేస్తాడని మరల తండ్రికే ఆ బాధ్యతను త్రిప్పికొడితే అప్పుడిక తండ్రి (లేక ఆమె) “లేదు” అని సమాధానమివ్వడంలో విలన్‌ పాత్ర ధరించినట్లే వుంటుంది. నిజమే, ఒక్కొక్కసారి తండ్రి పిల్లవానితో ‘నీవు బయటకెళ్ళి కొంచెంసేపు ఆడుకో, కానీ ముందు మీ అమ్మ దగ్గరికెళ్లి రాత్రికి భోజనమెప్పుడు సిద్ధంగా వుంటుందో అడిగి మరీ వెళ్లు’ అని చెప్పవచ్చును. లేదా అప్పుడప్పుడు తల్లి తాను చెప్పడానికి ఆటంకమేమీలేని విషయాలను కూడ తన భర్తే చెబితే బాగుంటుందనుకోవచ్చు. అయితే, ఇద్దరు కలిసి పిల్లవాడు తన కోర్కెలను తీర్చుకోవడానికి ఒక్కొక్కరిని బుట్టలో వేసుకొనకుండ మీరు జాగ్రత్త పడాలి. తెలివిగల భార్య కూడ అధికారాన్ని పోటీగా చేజిక్కించుకోవాలని తన భర్త చేయవలసిన దానిని తానే చేస్తూ, పిల్లల అనురాగాన్ని అధికంగా సంపాదించడానికి ప్రయత్నించకుండ జాగ్రత్తపడుతుంది.

23. కుటుంబంలో నిర్ణయాలు చేయడం తండ్రికి మాత్రమే పరిమితమై యుండాలా?

23 నిజానికి, కుటుంబంలో చేసే నిర్ణయాలలో, అందులోని ప్రతివ్యక్తి చేసే నిర్ణయాన్ని ఏదొక సందర్భంలో పరిగణలోకి తీసుకునే అవకాశమున్నది. మొత్తం మీద కుటుంబ క్షేమాన్ని గూర్చి నిర్ణయాలు తీసుకొనే బాధ్యత ముఖ్యంగా తండ్రిదే. అయితే తాను తరచు ఇతరులను సంప్రదించి వారి ఇష్టాయిష్టాలను తెలిసికొనిన పిదప అలాంటి నిర్ణయాలు చేస్తాడు. తల్లి, వంటఇంటికి, ఇంటికి సంబంధించినవాటి విషయంలో నిర్ణయాలు తీసికొనవచ్చు. (సామెతలు 31:11, 27) పిల్లలు ఎదిగే కొలది వారు, తాము ఆడుకొను స్థలాలను గూర్చి, వారి దుస్తులు లేక కొన్ని వ్యక్తిగత విషయాల్లో వారే నిర్ణయాలు తీసుకొనేలా అనుమతించవచ్చును. అయితే కొన్ని నియమాలను అనుసరించేలా పిల్లల క్షేమానికి ముప్పుకలుగకుండ, ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండ తలిదండ్రులు వారిని ఒక కంట కనిపెడుతూనే వుండాలి. ఇలా చేయడంవల్ల పిల్లలు క్రమేణి నిర్ణయాలు చేసే వారౌతారు.

తలిదండ్రులైన మిమ్మల్ని సన్మానించుట సులభమేనా?

24. పిల్లలు వారి తండ్రిని, తల్లిని సన్మానించాలనే వాస్తవం తలిదండ్రులమీద ఎట్టి బాధ్యతను మోపుతుంది?

24 పిల్లలకు ఇలా తెలుపబడింది, “నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.” (ఎఫెసీయులు 6:2; నిర్గమకాండము 20:12) వారిలా చేయడంవల్ల దేవుని ఆజ్ఞను గౌరవించినట్లవుతుంది. వారు దాన్ని చేయడానికి సులభమయ్యేలా నీవు చేస్తావా? భార్యవైన నీవు నీ భర్తను సన్మానించి ప్రేమించాలి. గౌరవించాలని నీకు ఉపదేశింపబడింది. దేవుని వాక్యం చెప్పినట్లు చేయడంలో కొంతవరకు అతడు తప్పిపోయినప్పుడు లేక కొంచెమే నెరవేర్చితే, నీవు నీభర్తను గౌరవించి, సన్మానించుట కష్టమని నీకు తోచుటలేదా? భర్తవైన నీవు, నీ సహకారియైన నీ భార్యను సన్మానించి ప్రేమించాలి. ఆమె నీకు సహాయకారిగా నుండనప్పుడు, ఆమెను సన్మానించి, ప్రేమించుట కష్టమని నీవు తలంచవా? తలిదండ్రులను ప్రేమించాలియనే దైవాజ్ఞకు వారు విధేయులగునట్లు మీ పిల్లలకు సహాయపడండి. ఇంటిలో ప్రశాంత పరిస్థితిని కల్గించి, ఉత్కృష్టమైన నియమాలు ఏర్పరచి, ప్రవర్తనలో మంచి మాదిరిని కనబరస్తూ, మంచి ఉపదేశం, శిక్షణనిస్తూ, అవసరమైనపుడు ప్రేమపూర్వకమైన దండన విధించి, వారి మన్నన పొందండి.

25. పిల్లలకు తర్ఫీదునిచ్చే విషయంలో తలిదండ్రులలో ఐకమత్యం లేకపోతే ఏ సమస్యలు రాగలవు?

25 “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు” అని రాజైన సొలొమోను అన్నాడు. “ఎందుకనగా, ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును.” (ప్రసంగి 4:9) ఇద్దరు నడిచేటపుడు ఒకడు పడిపోతే ప్రక్కనున్న వాడు అతన్ని లేపుతాడు. అలాగే కుటుంబంలో కూడ భార్యాభర్తలు వారివారి బాధ్యతలను నిర్వర్తించుటలో ఒకరికొకరు మద్దతు నిచ్చుకుంటూ, ప్రోత్సహించుకొనుచుండ వచ్చును. అనేక సందర్భాలలో తలిదండ్రులిద్దరు వారి వారి బాధ్యతలను ఒకరివి మరొకరు నెరవేర్చుతూ వుండవచ్చును, ఇది కుటుంబ ఐక్యతకు మంచిదే. పిల్లలు, తలిదండ్రులను తమకు యింకా సన్నిహితులుగా చేసికొని, ఒకే విధమైన శిక్షణాపనిలో వారిని ఐక్యం చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు పిల్లవానికెలా తర్ఫీదునివ్వాలి ఎలా శిక్షించాలి అనేవాటిపై పరస్పర విరుద్ధతగల ప్రశ్నలు వీరికి పుట్టవచ్చు. కొన్నిసార్లు భార్య, బిడ్డపై ఎంతో మమకారం కనబర్చి, తన భార్య తనను అలక్ష్యపరస్తుందని, భర్త భావించునట్లు చేసి చివరకు కోపగించుకొనే స్థితికి తీసుకొనిరావచ్చు. అట్టిది పిల్లవాని విషయంలో అతని వైఖరిపై ప్రభావం చూపగలదు. బిడ్డపై అతను అనురాగాన్ని తగ్గించుకోవచ్చు లేదా అతడు బిడ్డపై మమకారం చూపి, భార్యపై అనురాగాన్ని తగ్గించుకోవచ్చు. భర్తగానీ భార్యగానీ అదుపు తప్పితే అది ఎంతో అనర్థానికి దారితీస్తుంది.

26. క్రొత్తగా జన్మించిన శిశువును పరామర్శించుటలో తల్లి ఎక్కువ సమయాన్ని గడుపుతుంటే పెద్దవాడు తనను అలక్ష్యపరస్తున్నారని ఈర్ష్యపడకుండ వుండడానికేమి చేయవచ్చును?

26 ఒక బిడ్డ ఉండగా, మరొక బిడ్డ పుడితే యింకో సమస్య రావచ్చు. క్రొత్తగా జన్మించిన శిశువుతో తల్లి ఎంతో సమయాన్ని గడుపవలసివుంటుంది. పెద్దవాడు అలక్ష్యపరచబడలేదని వాడు ఈర్ష్యపడకుండ వుండటానికి తండ్రి పెద్దవానిని ఎక్కువగా పరామర్శిస్తూవుండాలి.

27. దంపతులలో ఒకరు అవిశ్వాసియైతే, పిల్లలకు ఆత్మీయంగా ఎలా సహాయపడవచ్చును?

27 నిశ్చయంగా ఒకరికంటె ఇద్దరుండుట మేలే, కాని అసలు ఎవరూ లేకుండావుండేకన్న ఒకరైనా ఉండటం మంచిది. పరిస్థితిని బట్టి, తండ్రి సహాయం లేకుండ తల్లి పిల్లలను పెంచవలసివుంటుంది. లేదా తండ్రియే ఆలాగు చేయవలసి వుంటుంది. అనేక కుటుంబాలు మతపరంగా విభాగింపబడి, ఒకరు యెహోవా దేవుని సేవకునిగా బైబిలు ఉపదేశమునందు సంపూర్ణ విశ్వాసం కల్గివుంటే, మరొకరికి అట్టి విశ్వాసముండదు. సమర్పించుకున్న క్రైస్తవునిగా వున్న భర్త గృహంలో తాను కుటుంబ యజమానునిగా, పిల్లలను పెంచి తర్ఫీదునిచ్చి, శిక్షించు విషయంలో ఎక్కువ బాధ్యతను కల్గియున్నాడు. నిశ్చయంగా అతడు అధికసహనం, ఆశానిగ్రహం, ఓర్పును కనబరచాలి; ఏదైనా తీవ్రసమస్య వచ్చినపుడు తాను స్థిరుడై వుండాలి. అయితే విచక్షణా జ్ఞానాన్ని చూపుతు, కోపగించుకొను పరిస్థితులు వచ్చినను దయను కనబరచి, పరిస్థితులు అనుమతించినపుడు సర్దుబాటు చేసికోవాలి. భార్య విశ్వాసియైతే, ఆమె భర్తకు లోబడియుండుట, ఆమె నడుచుకొనే తీరు అధికంగా అతని వైఖరిపై ఆధారపడివుంటాయి. కేవలం బైబిలు అంటే మాత్రమే అతనికి ఇష్టంలేదా, లేక అతడు తన భార్య నమ్మకాలను, వాటిని తన పిల్లలకు బోధించుటకు ఆమె చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నాడా? అతడామెను వ్యతిరేకిస్తే ఆమె అపొస్తలుడు తెల్పిన పద్ధతిని అనుసరించాలి: భార్య తన ఆదర్శప్రాయమగు నడవడిని బట్టి, తన క్రియలు, మర్యాదతో కూడిన స్వభావాన్నిబట్టి ఆమె భర్త “వాక్యము లేకుండనే రాబట్టబడ వచ్చును.” అందుబాటులోనున్న అవకాశాలను అందుకొని తన పిల్లలకు బైబిలు సూత్రాల ప్రకారం తర్ఫీదు నివ్వడానికి కూడ ఆమె ప్రయత్నిస్తుంది.—1 పేతురు 3:1-4.

ఇంటి వాతావరణం

28, 29. ఇంటిలో ఎలాంటి వాతావరణం కోరదగింది, ఎందుచేత?

28 ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణాన్ని ఏర్పరచుట తలిదండ్రులిద్దరి బాధ్యత. ఇంటిలో ఇలాంటి పరిస్థితి వున్నట్లు పిల్లలు గమనిస్తే వారి అనుమానాలకు తావుండదు. లేక తాము తమ తలిదండ్రులకు చెప్పడానికి భయపడుటవలన పొరపాట్లు అలాగే పేరుకొనిపోవు వాటినిగూర్చి తలిదండ్రులతో యథేచ్చగా చెప్పవచ్చునని, తలిదండ్రులు వారిని అర్థం చేసికొంటారని, ప్రేమతో సమస్యలు తీర్చబడతాయనియు వారికి తెలుసు. (1 యోహాను 4:17-19; హెబ్రీయులు 4:15, 16 పోల్చండి.) గృహం ఒక తలదాచుకొనే స్థలం మాత్రమే కాదుగానీ అదొక ఆశ్రయం కూడ. తలిదండ్రుల మమతానురాగాలు, పిల్లల సద్గుణాలను పెంపొందించి వృద్ధిచేస్తాయి.

29 పుల్లని రసంలో స్పాంజిని వేసి నీటిని మాత్రమే అది పీల్చుకోవాలని నీవెదురు చూడవు. దానిచుట్టున్న దానిని మాత్రమే అది పీల్చుకోగలదు. దానిని నీళ్లలో ముంచినపుడే ఆ స్పాంజి నీటిని పీల్చుకుంటుంది. పిల్లలుకూడ వారి చుట్టూవున్న వాటిని తమలోనికి ఇముడ్చుకుంటారు. వారి చుట్టూవున్న వారి అభిప్రాయాలను, అలవాట్లను పసికట్టి, వారు స్పాంజివలె వాటిని పీల్చుకుంటారు. పిల్లలు, నీలోని భావాలను గమనిస్తారు, అనగా అవి కోపతాపముల వలన కలిగేవా లేక ప్రశాంత పరిస్థితులందు కలిగేవాని గ్రహిస్తారు. ఇంటి వాతావరణాన్ని అంటే విశ్వాసం, ప్రేమ, ఆత్మీయత అనే వాటిని పసివారు పసిగడతారు, మరియు వారికి యెహోవా దేవుని యందలి నమ్మకం అమూల్యమైనది.

30. వారి పిల్లలకు మంచి నడిపింపు నిస్తున్నారా లేదాయని నిశ్చయించుకోవడానికి తలిదండ్రులు తమకుతామే ఎలాంటి ప్రశ్నలువేసుకోవాలి?

30 నిన్ను నీవే ఇలా ప్రశ్నించుకో: నీ బిడ్డ ఎలాంటి నియమాలలో నడుచుకోవాలని నీవు కోరుకుంటావు? తలిదండ్రులైన మీరిద్దరు అలాంటి నియమాలను పాటిస్తున్నారా? నీ కుటుంబం దేనికి కట్టుబడియుంది? నీ పిల్లలకు నీవెట్టి మాదిరిని కనబరస్తున్నావు? నీవు ఫిర్యాదుచేస్తూ, తప్పులను చూపుతూ, ఇతరులను విమర్శిస్తూ, భిన్నాభిప్రాయాలనే కల్గియున్నావా? అటువంటి పిల్లలేనా నీకు కావలసింది? లేక, నీ కుటుంబం నిమిత్తం నీతినియమాలు కల్గియున్నావా, నీవు వాటిని పాటిస్తూ, నీ పిల్లలు కూడ ఆలాగే చేయాలని నీవనుకొనవా? తాము ఈ కుటుంబానికి చెందినవారై యుండాలంటే కొన్నింటిని చేయాలని, ఇలాంటి ప్రవర్తన అంగీకరింపబడుతుందని, వేరే క్రియలు, స్వభావాలు అంగీకరించబడవని పిల్లలు గ్రహిస్తున్నారా? పిల్లలు భద్రంగా వున్నారని భావించడానికి కోరుకుంటారు, కావున వారు కుటుంబ నియమాలను పాటించేటపుడు నీ ఆంగీకారం, సమ్మతి వుందని వారిని భావించనీయండి. ప్రజలు తాము చేయవలసినదానిని చేయడానికి వారికో జీవితపద్ధతి అంటూ ఒకటుంటుంది. నీ బిడ్డను చెడ్డవాడు అని నీవంటే, బహుశ నీవన్నదాన్నే వాడు నిజంచేస్తాడు. మంచినే ఎదురు చూడండి, ఆ మంచిని చేయడానికి అతన్ని ప్రోత్సహించండి.

31. తలిదండ్రుల నడిపింపు ఎల్లప్పుడు దేనితో బలపర్చబడాలి?

31 ప్రజలు, మాటలకంటె క్రియలవల్లనే వారెలాంటివారో తీర్చబడతారు. పిల్లలుకూడ క్రియలకంటె మాటలకెక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు మరియు తరచూ వారు ఇందులో ఏమైన వేషధారణవున్నదాయని నిఘావేసి గమనిస్తారు. పలుమారులు పలుకుమాటలవల్ల పిల్లలు తబ్బిబ్బవుతారు. నీ మాటలు నీ క్రియల మూలంగా వచ్చునవై యుండేటట్లు జాగ్రత్తపడుము.—1 యోహాను 3:18.

32. ఎల్లప్పుడు ఎవరిమాదిరిని అనుసరించాలి?

32 నీవు తండ్రివైననూ లేదా తల్లివైనను నీ స్థానము సవాలుతోకూడిందే. అయితే ప్రాణదాత ఇచ్చిన సలహాను పాటించుటవలన ఆ సవాలును సంతోషంతో ఎదిరించవచ్చును. నీ కప్పగించబడిన బాధ్యతను నీవు ఆయన కొరకే చేస్తున్నట్లు భావించి దానిని మనఃపూర్వకంగా నిర్వహించు. (కొలొస్సయులు 3:17) మితిమీరి పోవద్దు, నీ సమతుల్యతను కాపాడుకుంటూ, నీ పిల్లలతోపాటు “మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి.”—ఫిలిప్పీయులు 4:5.

[అధ్యయన ప్రశ్నలు]

[100వ పేజీలోని చిత్రం]

తల్లి కంటి చూపు, స్పర్శ, కంఠస్వరం, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని తన బిడ్డకు తెలియజేస్తాయి

[100వ పేజీలోని చిత్రం]

పిల్లలతో కలిసి పనులు చేయడానికి పథకం వేసుకుంటావా?