నిత్యభవిష్యత్ నిమిత్తం ఒక కుటుంబంగా వృద్ధిచెందుట
అధ్యాయము 14
నిత్యభవిష్యత్ నిమిత్తం ఒక కుటుంబంగా వృద్ధిచెందుట
1. కుటుంబ సంతోషాన్ని వృద్ధిచేయడంలో, భవిష్యత్తు గూర్చి తలంచుట ఎందుకు మంచిది?
కాలము గడచిపోతూనేవుంది. గతకాలపు మధురస్మృతులతో మన మనస్సులు నిండియుండ వచ్చును, కానీ మనం గతంలో జీవించలేం. గతంలో చేసిన తప్పులతో సహా గతంనుండి ఎంతో నేర్చుకోగలం, కానీ ప్రస్తుతకాలంలో మాత్రమే మనం జీవించగలం. అయినను, ప్రస్తుతం కుటుంబం ఆనందంగా జీవిస్తున్ననూ, ప్రస్తుతమనేది క్షణిక కాలమేననే సత్యం గుర్తించి, ఈ రోజు త్వరగా గతించి నిన్నటిగా మారుతుందని వర్తమానకాలం త్వరలో భూతకాలమౌతుందని తెలిసికోవాలి. కావున మనం భవిష్యత్తు కొరకు నిరీక్షిస్తూ దానికొరకు సిద్ధపడుతూ, పథకాలు వేసికోవడం కుటుంబ సంతోషానికి ప్రాముఖ్యం. మనకు మన సమీపస్తులకు ఆ భవిష్యత్తు ఎలా వుంటుందనేది, మనమిప్పుడు చేసే తీర్మానాలపై ఆధారపడివుంది.
2. (ఎ) కొందరెందుకు భవిష్యత్తును గూర్చి తలంచుట కిష్టపడరు? (బి) మనం సంతోషభరితమైన భవిష్యత్తును ఆశిస్తే, ఎవరి మాట వినాలి?
2 భవిష్యత్తులో ఏమి రానైయున్నవి? మానవుల్లో అనేకులకు భవిష్యత్తును గూర్చిన ఆలోచన, కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే పరిమితమై వుంటుంది. చాలా దూరం భవిష్యత్తులోనికి తొంగి చూడకూడదని అనేకుల అభిప్రాయం, ఎందుకంటే వారు ఎదురు చూచేదంతా, దుఃఖంతోకూడిన అంతమే, వారి కుటుంబమంతా మరణం మూలంగా విడిపోతారని మాత్రమే వారి నిరీక్షణ. అనేకులకు వారి ఆనందక్షణాలు, త్వరగా ఐహిక విచారాలలో ఎఫెసీయులు 3:14, 15.
కలిసి తెరమరుగౌతున్నాయి. అయితే “పరలోక మునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో,” ఆ తండ్రిమాట లక్ష్యపెట్టడంవల్ల ఇంతకంటె ఇంకా ఎక్కువ జీవితాన్ని కలిగియుండవచ్చును.—3. (ఎ) దేవుడు మొదటి దంపతులకు ఎలాంటి భవిష్యత్ నిరీక్షణను అనుగ్రహించాడు? (బి) అయితే సంగతులెందుకు తారుమారయ్యాయి?
3 మొదటి దంపతులు సృజింపబడినపుడు వారుగాని వారి సంతానంగాని కొద్ది సంవత్సరాలు మాత్రమే దుర్భరంగా జీవించి మరణించాలని దేవుడు సంకల్పించలేదు. ఆయన వారికి పరదైసువంటి గృహాన్నిచ్చి, అందులో అనంతమైన జీవితాన్ని అనుభవించే నిరీక్షణను అనుగ్రహించాడు. (ఆదికాండము 2:7-9, 15-17) అయితే వారు బుద్ధిపూర్వకంగా దైవాజ్ఞను మీరి, వారి జీవితం ఎవరిపై ఆధారపడియున్నదో ఆయన చట్టాన్ని అతిక్రమించి, వారికి, వారి సంతానానికి రాబోవు భవిష్యత్తు జీవితాన్ని పోగొట్టారు. బైబిలు దానిని ఇలా వివరిస్తుంది: “ఒక మనుష్యునిద్వారా [ఆదాము] పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.
4. యెహోవాదేవుడు, తొలుత మానవుని గూర్చి తాను సంకల్పించిన దానిని నెరవేర్చుటకై ఎలాంటి ఏర్పాట్లు చేశాడు?
4 అయినను, దేవుడు ప్రేమతో మానవ కుటుంబాన్ని విమోచించే ఏర్పాటు చేశాడు. తన స్వకీయకుమారుడైన యేసుక్రీస్తు, ఆదాము సంతానమంతటి నిమిత్తం తన పవిత్ర ప్రాణాన్ని అర్పించాడు. (1 తిమోతి 2:5, 6) అలా, ఆదాము పోగొట్టిన దానిని యేసు మరల కొన్నాడు లేక విడిపించాడు. మరియు ఈ ఏర్పాటునందు విశ్వసించే వారందరికి, తొలి మానవ దంపతుల ఎదుట దేవుడు వుంచిన జీవము కొరకైన అదే అవకాశాన్ని అందుకొనే మార్గం తెరువబడింది. ఈనాడు, తీవ్రమైన వ్యాధివలన లేక ఆకస్మిక సంఘటన వలన మరణించకపోతే మానవులు 70 నుండి 80 సంవత్సరాల వరకు, కొద్దిమందైతే మరింత ఎక్కువకాలం జీవిస్తున్నారు. “అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.”—రోమీయులు 6:23.
5-7. (ఎ) మనమిప్పుడు దేవుని చిత్తం జరిగిస్తే, భవిష్యత్తులో రానైయున్న దేనికొరకు నిరీక్షించవచ్చును? (బి) నీ కుటుంబానికి సహాయం చేయడాన్ని గూర్చి నీవు ఏ ప్రశ్న అడుగవచ్చును?
యోహాను 3:36) దేవుడు నిశ్చలమైన తన వాక్యమందు, యీ ప్రస్తుత దుష్టవిధానాన్ని తీసివేసి, తాను దయచేయనైయున్న పరిపూర్ణమైన, నీతియుక్తమగు ప్రభుత్వం మానవాళిని పరిపాలించునని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (దానియేలు 2:44) దీనిని గూర్చి తెల్పుతూ, “పరలోకంలో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని” దేవుడు సంకల్పించినట్లు ఆయన వాక్యం మనకు తెలియజేస్తుంది. (ఎఫెసీయులు 1:10) అవును, అప్పుడు విశ్వంలో అనుగుణ్యత వుంటుంది, మానవజాతియంతా, భూమియంతట ఐకమత్యంతో వుండి, కులాంతర పోరాటాలు, రాజకీయ విద్వేషాలు, ఘోరనేరాలు, మరియు యుద్ధానికి సంబంధించిన హింసాయుత చర్యలేమియు లేకుండా స్వేచ్ఛగా వుంటుంది. కుటుంబాలు నిర్భయంగా నివసిస్తాయి, ‘వారికి ఎవరి భయము ఉండదు.’ (కీర్తనలు 37:29, 34; మీకా 4:3, 4) ఎందుకలా జరుగుతుందంటే, అచ్చట జీవించేవారు, “ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి” నడుచుకొందురు, మరియు వారు “ప్రేమగలిగి నడుచుకొందురు.—ఎఫెసీయులు 5:1, 2.
5 ఇది నీ కుటుంబానికి ఏ భావము కలిగియుండగలదు? దేవుని ఆజ్ఞలను విని వాటిని చేసేవారికి అది నిత్యభవిష్యత్తు ననుగ్రహించగలదు. (6 దేవునిరాజ్య పరిపాలనక్రింద, దేవుడు సంకల్పించిన ప్రకారం అప్పుడు మానవ కుటుంబమంతా మానవజాతికంతటికి ఆహారాన్ని సమృద్థిగా అందించగల తోటవంటి గృహంగా, అంటే భూమిని పరదైసుగా మార్చే సంతోషకరమగు నిరీక్షణతో ఐక్యంగా కలిసి పని చేస్తారు. భూమిలోనున్న వివిధ పక్షులు, చేపలు మరియు జంతుజాలములన్నీ మానవాళి నడిపింపు క్రిందికి వచ్చి వారి ఆనందానికి దోహదపడ్డాయి, ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. (ఆదికాండము 2:9; 1:26-28) వ్యాధి, వేదన, వృద్ధాప్యం వలన కలుగు బాధలు, లేక మరణభయం అనేవి, మానవులు జీవితాన్ని అనుభవించడానికి ఇక అడ్డురావు. అప్పుడు జీవితాన్ననుభవించే మహిమగల అవకాశాలను పొందడానికి “సమాధులలో నున్నవారందు” సహితం లేపబడతారు.—యోహాను 5:28, 29; ప్రకటన 21:1-5.
7 ఈ భవిష్యత్ నిరీక్షణ నెరవేర్పును అనుభవించునట్లు నీవు నీ కుటుంబానికెలా సహాయపడగలవు?
మనమేమి చేయవలసి వుంటుంది?
8. దేవుని అంగీకారాన్ని పొందడానికి మనమేమి చేయాలి?
8 మనం “మంచి జీవితము” అని తలంచే జీవితాన్ని జీవించినంత మాత్రాన, దేవుని నూతన విధానంలో జీవంపొందేవారిలో మనం కూడ ఉంటామని అనుకోకూడదు సుమా. ఏ అర్హతలుండాలో తీర్మానించేది మనంకాదు; దేవుడే దాన్ని నిర్ణయిస్తాడు. ఒకరోజు యేసు యూదయ ప్రాంతంలో బోధిస్తుండగా ఒకడు ఆయన్నిలా అడిగాడు: “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను”? అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు: “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” (లూకా 10:25-28) మనం దేవునియందు విశ్వసిస్తున్నాం లేక బైబిలు చర్చింపబడే స్థలానికి అప్పుడప్పుడు వెళ్తున్నాం కొంతమందికి అప్పుడప్పుడు సహాయపడు చున్నామని ఊరకనే చెప్పినంత మాత్రాన అది చాలదు. అయితే, అంతకంటె అధికంగా ఇందులో ఇమిడివుందనుట స్పష్టమౌతుంది. మనకు గల విశ్వాసమనేది మనలోని ఆలోచనలు, వాంఛలు, క్రియలు మున్నగువాటిపై ప్రతిదినం, దినమంతా ప్రభావాన్ని కల్గివుండాలి.
9. దైనందిన జీవిత విషయాల్లో మనం సమదృష్టిని కల్గి వుండటానికి లేఖనాల్లోని ఏ సూత్రాలు మనకు సహాయపడతాయి?
9 దేవునితో మనకు గల సంబంధాన్ని కాపాడుకుంటూ, భద్రపరచు కుంటున్నట్లయితే అది మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి తోడ్పడి, ఆయన అంగీకారాన్ని, సహాయాన్ని పొందే నిశ్చయతను కల్గిస్తుంది. (సామెతలు 4:10) జీవితంలోని సమస్తక్రియలు ఆయనను ఆయన సంకల్పాలను తెలియజేస్తాయని మనమనుకుంటే, మన జీవితాలను గడిపే పద్ధతిలోనే మనం సమదృష్టిని కల్గియుండగలం. మన భౌతికావసరతలను తీర్చుకోవడానికి మనం తప్పక పనిచేయాలి. అయితే ఐహిక విచారం, ధనాపేక్షవల్ల మన జీవితాలను రవ్వంత కూడ పొడిగించలేమని; దేవునిరాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదికితే అది మన జీవితాలను శాశ్వతంగా పొడిగిస్తుందని దేవుని కుమారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. (మత్తయి 6:25-33; 1 తిమోతి 6:7-12; హెబ్రీయులు 13:5) మనం మన కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనే దేవుని సంకల్పం. అయినను, మనం కుటుంబ కార్యక్రమాలలో చిక్కుబడి, కుటుంబానికి వెలుపట నున్నవారి ఎడల నిజమైన ప్రేమను కనబరచలేకపోవుటవలన మనమే అపజయం పొందేలా చేసి అది మన కుటుంబానికి జీవితాన్ని గూర్చి సంకుచిత దృక్పథాన్ని కల్గించి, దేవుని దీవెనలు పొందకుండా చేస్తుంది. కుటుంబం కలసి సరదాగా మాట్లాడుకోవడంవల్ల, వినోదంవల్ల ఎంతో ఆనందం కలుగుతుంది, వీటిని హద్దుల్లో వుంచుకోవాలి, దేవుని ఎడల గల ప్రేమను వెనుకకు నెట్టివేసేలా ఎన్నటికి అనుమతించకూడదు. (1 కొరింథీయులు 7:29-31; 2 తిమోతి 3:4, 5) కుటుంబంగాకానీ, వ్యక్తులుగాకానీ దేవుని వాక్యంలోని నీతిసూక్తుల ప్రకారం సమస్తాన్ని జరిగిస్తే, మన జీవితం అపరిమితమైన సంతృప్తితో నిండివుంటుంది, నిజంగా కార్యసాధన చేసితిమనే దృక్పథం కల్గివుంటాం, మరియు మన నిత్య భవితవ్యానికి మంచి పునాదిని వేసుకుంటాం. కావున, “ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను . . . ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొస్సయులు 3:18-24.
ఒక కుటుంబంగా వృద్ధిచెందుట
10. కుటుంబంలో క్రమంగా బైబిలును చర్చించుట ఎంత ప్రాముఖ్యం?
10 కుటుంబ సభ్యులందరు అదే గమ్యములకొరకు కృషిచేయాలంటే, దేవుని వాక్యాన్ని ఇంటిలో చర్చించడం ఎంతో ప్రయోజనకరం, నిజంగా అవసరం. ఒకడు సృష్టికర్త సంకల్పాలను గూర్చి తాను చూచినవాటిని చేసినవాటిని గూర్చి తెలియజేయడానికి అతనికి ప్రతిరోజు అనేక అవకాశాలు దొరుకుతాయి. (ద్వితీయోపదేశకాండము 6:4-9) అందరు కలిసి బైబిలును చదివి, చర్చించడానికి క్రమంగా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది. బైబిలును వివరించే ప్రచురణలను బహుశ ఉపయోగించి చర్చించుకోవచ్చు. ఇలా చేయడంవల్ల, అది కుటుంబాన్ని ఐక్యపరుస్తుంది. అప్పుడు కుటుంబ సభ్యులు తలఎత్తే సమస్యలను తీర్చుకోవడంలో ఒకరికొకరు సహాయపడటానికి దేవుని వాక్యాన్ని వుపయోగించవచ్చు. తలిదండ్రులు మంచి మాదిరిని చూపిస్తూ, ఇతరమైనవాటివలన సులభంగా కుటుంబ బైబిలు చర్చలు కుంటుబడకుండ చూచుకుంటే పిల్లలకు దేవుని వాక్యం ఎడల ప్రగాఢ గౌరవం, అభినందన కల్గుతుంది. దేవుని కుమారుడు ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవునినోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.”—మత్తయి 4:4.
11. ఆత్మీయాభివృద్ధి మాట వచ్చినపుడు, కుటుంబంలో ఏ స్వభావాన్ని విడిచి పెట్టాలి?
11 ఒక శరీరంలో “వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించు” కోవాలి. (1 కొరింథీయులు 12:25) కుటుంబం అనబడే శరీరం విషయంలో కూడ అది సత్యమైయుండాలి. భర్త తన జ్ఞాన వివేకములు, తన ఆత్మీయాభివృద్ధి విషయంలోనే నిమగ్నుడై తన భార్య ఆత్మీయాభివృద్ధియెడల అశ్రద్ధ చూపకూడదు. ఉదాహరణకు భర్త తన భార్య ఆత్మీయ అవసరతల ఎడల శ్రద్ధ వహించకపోతే కొంతకాలానికి ఆమె, తన భర్త ఆత్మీయావసరతలో శ్రద్ధ చూపినట్లు తాను చూపించలేకపోవచ్చును. తలిదండ్రులు పిల్లల ఆత్మీయాభివృద్ధిలో శ్రద్ధవహించక, వారు దేవుని వాక్యమందలి సూత్రాలను వర్తింపజేసే పద్ధతిని, వాటివలన జీవితంలో సంతోషంపొందే విధానాన్ని గూర్చి నేర్పించకపోతే ఇక వారు తమ చుట్టున్న ప్రపంచంలోని ధనాపేక్షతో కూడిన స్వభావం మూలంగా తమ హృదయాలను, మనస్సులను ఆత్మీయతకు దూరం చేసికొంటారేమో. నీ కుటుంబమంతటి నిత్యాశీర్వాదం నిమిత్తం దేవుని వాక్యంనుండి జ్ఞానం సంపాదించుకొనుట, నీ కుటుంబ జీవితంలో క్రమమైన ప్రాముఖ్యమగు ఒక భాగంగా చేయండి.
12. ఎవరితో సహవాసం చేయడానికి నిర్లక్ష్యం చేయకూడదు?
12 వాస్తవంగా, ‘ప్రేమ ఇంటిలోనే’ ప్రారంభమైతే అది అక్కడే అంతం కాకూడదు. ఈ ప్రస్తుత దుష్టవిధానంలో కూడ దేవుని నిజమైన సేవకులు, సహోదర సహోదరీలతో కూడిన ఒక గొప్ప కుటుంబమౌతారని దేవుని వాక్యం ప్రవచించింది. ఆయన తెలియజేసేదేమంటే, “మనకు సమయము గలతీయులు 6:10; 1 పేతురు 5:9) కుటుంబ సమేతంగా, ఆ పెద్ద “కుటుంబముతో” కలిసి క్రమంగా కూటాలకు హాజరగుటలో ఆనందం వుంది. ఇతర కోరికల నిమిత్తం అలాంటి సహవాసాన్ని విడిచిపెట్టలేము—హెబ్రీయులు 10:23-25; లూకా 21:34-36.
దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను,” “లోకమందున్న [మన] మీ సహోదరులందరి యెడలను మేలుచేయుదము.” (13. క్రైస్తవసంఘానికి వెలుపటనున్నవారి విషయంలో మనకెలాంటి బాధ్యత వుంది?
13 అయితే మన ప్రేమ “దేవుని మందిరములో,” అనగా ఆయన సంఘంలో ఇదివరకే చేరియున్నవారికి మాత్రమే పరిమితమై వుండకూడదు. (1 తిమోతి 3:15) దేవుని కుమారుడు చెప్పినట్లు, మనలను ప్రేమించువారినే మనము ప్రేమిస్తే ‘మనమేమి ఘనకార్యము చేస్తున్నాము?’ మన పరలోకపు తండ్రివలె వుండాలంటే, మనం ముందడుగువేసి, హృదయపూర్వకంగా అందరిని సమీపించడానికి ప్రయత్నించి, ఎవరికైనను మరియు అందరికిని దయ చూపుతూ, సహాయపడుతూ, వారికి దేవుని రాజ్యసువార్త నందించాలి. మన కుటుంబమంతా ఈ విధమైన దైవప్రేమను వ్యక్తపరిస్తే, మన జీవితాలకు నిజమైన అర్థం, సంకల్పం ఉంటుంది. తలిదండ్రులు, పిల్లలు, మనమందరం దేవునివలె ప్రేమను ఎలా పూర్ణంగా చూపాలో అనుభవించిచూడాలి. (మత్తయి 5:43-48; 24:14) అలా హృదయపూర్వకంగా ఇచ్చుటలో వచ్చే సంపూర్ణ సంతోషమందు కూడ మనమందరం పాలుపొందుతాము.—అపొస్తలుల కార్యములు 20:35.
14. ఏ సలహాలను పాటించుటవలన సంతోషభరితమైన కుటుంబజీవితం వృద్ధియౌతుంది?
14 అలాంటి ప్రేమను కనబరచే కుటుంబాల నిమిత్తం ఎట్టి మహిమగల భవిష్యత్ ఉత్తరాపేక్షలు వేచివున్నాయి! వారి కుటుంబజీవితం సంతోషభరితంగా వుండటానికి దేవుని వాక్యంలోని సలహాను పాటించాలని వారు నేర్చుకున్నారు. జీవితంలో, అందరికి కలిగే ఒడుదుడుకులు వచ్చినను, అలాంటి కుటుంబములవారు పై విధంగా చేయడంవల్ల ఇప్పుడుకూడ శ్రేష్ఠమైన ఫలాలను అనుభవిస్తున్నారు. అయితే వారు వర్తమానకాలం దాటి యింకా రాబోవుకాలం కొరకు నిరీక్షిస్తున్నారు, మరియు సమస్తానికి అంతం తెచ్చేమరణానికి ముందు ఏ కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవిస్తామని
వారు అనుకోవడంలేదు. దేవుని వాగ్దానాలలో దృఢనమ్మకం కల్గియుండి, కుటుంబంలోని ప్రతి ఒక్కరు సంతోషంతో నిత్యభవిష్యత్తు నిమిత్తం కృషి చేస్తున్నారు.15. ఈ పుస్తకంలో ఇవ్వబడిన లేఖన నడిపింపు మూలంగా కలిగే ప్రయోజనాలను గూర్చి నీకై నీవు ఏ ప్రశ్నలను వేసుకోవచ్చును?
15 దేవుడు భూమిని సృజించడంలో గల సంకల్పం, దానిని మనుష్యులతో నింపుటయేనని యీ పుస్తకం బైబిల్లోనుండి తెలియపరచింది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన కుటుంబాన్ని స్థాపించాడు. యెహోవా దేవుడు తండ్రులకు, తల్లులకు పిల్లలకు సూచనలిచ్చాడు, మరియు ఇది పరిశీలింపబడింది. నీ కుటుంబంలో వీటిలో కొన్నింటిని నీవు అన్వర్తించగల్గియున్నవా? నీ కుటుంబ జీవితం సంతోషభరితమగునట్లు అవి నీకు సహాయపడియున్నవా? అలా సహాయపడ్డాయని మేము నమ్ముతున్నాం. అయితే నీకు, నీ కుటుంబానికి భవిష్యత్తు ఏమి కల్గియుంది?
16-18. యెహోవాదేవుడు యీ భూమి నిమిత్తం మహిమగల ఎట్టి పరిస్థితులను తెచ్చుటకు సంకల్పించియున్నాడు?
16 నీవు భూమిని సేద్యపరచుటలోను, దానినుండి అధిక దిగుబడిని పొందుటలోను, దాని ఎడారులు అధిక పంటనిచ్చుటకై దానికి నీవు తోడ్పడుట కిష్టపడతావా? ముళ్లతుప్పులు, గచ్ఛపొదలకు బదులు పండ్ల తోటలు, రమ్యమైన వనాలు తయారగుట చూచి ఆనందిస్తావా? నీవు నీ కుటుంబం, తుపాకులు, కొరడాలు, ఉక్కు చువ్వలతోగాక ప్రేమ, పరస్పర అనురాగాలతో జంతువులను మచ్చికచేసికొని వాటిపై అధికారం చేయడానికి ఉల్లసిస్తారా?
17 ఖడ్గాలు నాగటి నక్కులుగాను, ఈటెలు మచ్చుకత్తులుగాను సాగగొట్టే కాలంకొరకు, బాంబులు తయారుచేసేవారు లేక యుద్ధాన్ని రేపువారుండని కాలాన్ని చూడటానికి నీ హృదయం తహతహలాడుతుంటే, మరి యెహోవా నూతన విధానాన్ని చూచి నీవు ఆనందిస్తావు. దౌర్జన్యంతో కూడిన రాజకీయపాలన, వ్యాపార దురాశ, మతవేషధారణ గతించినవై వుంటాయి. ప్రతి కుటుంబం, తమ ద్రాక్షా చెట్టుక్రిందను అంజూరపు చెట్టుక్రిందను సమాధానంగా కూర్చుంటుంది. భూమి, పునరుత్థానులైన పిల్లల అరుపులతోను మీకా 4:1-4.
అనేక పక్షుల కిలకిలరవములతోను నిండి వుంటుంది. గాలి, పారిశ్రామిక కాలుష్యంతో దుర్వాసన కొట్టకుండ, పుష్పముల పరిమళ సువాసనతో ఆఘ్రాణించుటకు ఆహ్లాదకరంగా వుంటుంది.—18 కుంటివారు దుప్పివలె గంతులువేయడం, మూగవాని నాలుక పాడటం, గ్రుడ్డివారి కన్నులు తెరువబడటం, చెవిటివారి చెవులు విప్పబడటం, దుఃఖము రోదనలకు బదులు, ఉల్లాసం. కన్నీరు వేదనకు బదులు సంతోషానందాలు, బాధ మరణాలకు బదులు ఆరోగ్యం. నిత్యజీవం పొందడాన్ని నీవు చూడాలని హృదయపూర్వకంగా ఆపేక్షిస్తే, అలాంటి పరిస్థితులు నిత్యం వుండే యెహోవా యొక్క నూతన విధానంలో నిత్యం జీవించడానికి అవసరమైన సహాయాన్ని మీ కొరకు మీ కుటుంబం కొరకు చేయడానికి మీ శాయశక్తుల కృషిచేయండి.—ప్రకటన 21:1-4.
19. దేవుని నూతన విధానంలో దీవెనలు పొందేవారిలో నీవు నీ కుటుంబం ఎలా వుండగలదు?
19 భూమిని నిండించే ఆ సమూహాల్లో ఆనాడు మీ కుటుంబం కూడ వుంటుందా? అది మీ ఇష్టం. కుటుంబ జీవితం కొరకు యెహోవా ఉపదేశాలను అనుసరించండి. ఆ నూతన విధానమందలి జీవితానికి మీరు తగియున్నట్లు ఇప్పుడు రుజువు చేయడానికై ఒక కుటుంబంగా కలిసి కృషిచేయండి. దేవుని వాక్యాన్ని పఠించండి, మీ జీవితాల్లో దాన్ని అమలుపరచండి, మీ నిరీక్షణను గూర్చి ఇతరులకు తెలియజేయండి, అలా చేయడం ద్వారా, ఒక కుటుంబంగా మీరు దేవునితో ఒక “మంచి పేరును” సంపాదించుకుంటారు, “గొప్ప ఐశ్వర్యముకంటె మంచిపేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.” యెహోవా అలాంటి పేరును ఎన్నటికిని మరువడు. “నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును.” (సామెతలు 22:1, మార్జిన్; 10:7) యెహోవా కృపవలన నీవు నీ కుటుంబం అత్యానందభరితమగు నిరంతర భవిష్యత్తుతో దీవించబడవచ్చును.
[అధ్యయన ప్రశ్నలు]
[189వ పేజీలోని చిత్రం]