నీ వివాహానికి శ్రేష్ఠమైన పునాది వేసికొనుట
అధ్యాయము 2
నీ వివాహానికి శ్రేష్ఠమైన పునాది వేసికొనుట
1-3. మత్తయి 7:24-27 ప్రకారం, జీవితంలో వాస్తవమైన విజయం దేనిపై ఆధారపడివుంది?
గృహమైనా, జీవితమైనా, లేదా వివాహమైనా దానికి ఆధారమైయున్న పునాది మాదిరిగానే వుంటుంది. యేసు ఒక ఉపమానంలో ఇద్దరిని గూర్చి మాట్లాడుతూ—బుద్ధిగలవాడు తన ఇంటిని పెద్దబండ మీద కట్టెనని, బుద్ధిహీనుడు ఇసుకపై కట్టెనని అన్నాడు. తుఫాను, ప్రవాహ జలములు, గాలి వీచి ఆ ఇండ్లను కొట్టగా బండమీద కట్టిన ఇల్లు నిలిచింది గానీ ఇసుకపై కట్టిన ఇల్లు కుప్పకూలిపోయింది.
2 ప్రజలు ఇండ్లు నిర్మించుకొనే పద్ధతిని గూర్చి యేసు యిక్కడ బోధించడం లేదు. వారి జీవితాలు శ్రేష్ఠమైన పునాది మీద కట్టుకొనే అవసరతను గూర్చి ఆయన పునరుద్ఘాటించాడు. దేవుని రాయబారిగా ఆయన ఇలా అన్నాడు: “యీ నా మాటలు విని వాటిచొప్పున చేయుప్రతివాడును” పెద్ద బండమీద ఇల్లు కట్టిన వానిని పోలియున్నాడు. అయితే, “యీ మాటలు విని వాటి చొప్పున చేయనిప్రతివాడు” ఇసుకపై తన ఇల్లును కట్టిన వానిని పోలియున్నాడు.—మత్తయి 7:24-27
3 జ్ఞానయుక్తమైన సలహాను వినుట, చేయవలసిన దానిని ఎరిగియుండుట మాత్రమే సరిపోదని యేసు ఈ రెండు సందర్భాల్లోనూ తెల్పుతున్నట్లు గమనించండి. జయాపజయాల మధ్యగల తారతమ్యమేమంటే ఆ జ్ఞానయుక్తమైన సలహాను పాటించుటే. “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.”—యోహాను 13:17.
4. మొదటి మానవ దంపతుల వివాహం నుండి మనం నేర్చుకొనగల కొన్ని అంశాలేవి? (ఆదికాండము 2:22–3:19)
4 వివాహ విషయంలో నిశ్చయంగా ఇది వాస్తవం. మన వివాహాన్ని బండవంటి పునాదిపై కడితే అది జీవితపు ఒత్తిళ్లను తాళుకొంటుంది. అయితే ఇట్టి శ్రేష్ఠమైన పునాది ఎక్కడ లభ్యమౌతుంది? వివాహానికి కర్తయైన యెహోవాదేవుని నుండి అది లభిస్తుంది. ఆయన మొదటి మానవ జతను భార్య భర్తలుగా కలిపినపుడు, వివాహాన్ని ప్రారంభించాడు. ఆ పిదప ఆయన వారి శ్రేయస్సు నిమిత్తం వారికి జ్ఞానయుక్తమైన ఉపదేశాలిచ్చాడు. ఈ జ్ఞానయుక్తమగు ఉపదేశాలను అనుసరించుట, వారికి దివ్యమైన భవిష్యత్తు ఉందా లేక భవిష్యత్తే లేదాయనే దాన్ని నిర్ణయిస్తుంది. వారిద్దరు దేవుని కట్టడలు ఎరిగినవారే కానీ విచారకరమైన విషయమేమంటే వారా సూచనల ప్రకారం నడుచుకోకుండ తమ స్వార్థం తమ్మును ఆటంకపరచేలా అనుమతించారు. వారా హెచ్చరికను అలక్ష్య పెట్టడానికే ఇష్టపడ్డారు, తత్ఫలితంగా, ఇసుకపై కట్టబడిన ఇల్లు తుఫాను తాకిడికి కుప్ప కూలిపోయినట్లు వారి వివాహం, వారి జీవితాలు కూలిపోయాయి.
5, 6. వివాహితులకు, వివాహమాడదలచిన వారికి దేవుడెట్టి సహాయమందిస్తున్నాడు?
5 యెహోవా దేవుడు ఆ మొదటి జతను వివాహమందు ఒకటిగా చేశాడు, అయితే యీనాడు కాబోయే దంపతులకు ఆయన స్వయంగా వివాహ ఏర్పాట్లను చేయడం లేదు. అయినా, సంతోషభరితమైన వివాహాలను గూర్చి ఆయనిచ్చిన జ్ఞానయుక్తమగు సలహా ఇంకను అందుబాటులో ఉంది. ఈనాడు వివాహమాడదలచిన ప్రతివారు ఈ సలహాను పాటించవలెనా లేదాయని వారే తీర్మానించుకోవాలి. దేవుని వాక్యం ఇంకను తెల్పేదేమంటే కాబోవు జతను గూర్చి తెలివిగల తీర్మానం చేసికొనుటకు మనమాయన సహాయాన్ని అర్థించాలి.—యాకోబు 1:5, 6.
6 నిజమే, లోకంలోని వివిధ ప్రాంతములందున్న పరిస్థితులు వేర్వేరుగా వుంటాయి. ఈనాడు కొన్ని ప్రాంతాల్లో స్త్రీ పురుషులు వారి వివాహపు జతను స్వయంగా ఎన్నుకుంటారు. అయితే భూమిమీదనున్న జనాబాలో అనేకులు తమ తలిదండ్రుల ద్వారా, కొన్నిసార్లు “పెళ్లిళ్లరాయుళ్ళ” ద్వారా వివాహ ఏర్పాట్లు చేసికొంటారు. కొన్ని ప్రాంతాల్లో పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె తల్లిదండ్రులకు “ఓలి” ఇచ్చినపుడు మాత్రమే తాను భార్యను సంపాదించుకుంటాడు, ఆ ఓలి, తాను భరించలేనంత అంటే తన వివాహాన్నే మానుకోవలసినంత పెద్ద మొత్తమై యుండవచ్చు. పరిస్థితులెలావున్ననూ సరే వివాహం విజయవంతమయ్యేలా సహాయపడగల సలహాను బైబిలు అందిస్తుంది.
నిన్ను నీవే తెలిసికో
7-10. (ఎ) ఒకడు వివాహమాడదలచినపుడు తనను గూర్చి ఏమి తెలిసికోవలసిన అవసరముంది? దానినెలా తెలిసికోగలడు? (బి) వివాహమాడుటకు గల కారణాల్లోవున్న విలువలను గూర్చి బైబిలేమి తెల్పుతుంది?
7 వివాహం నుండి నీవు అపేక్షించేదేమిటి? శారీరకంగాను, భావోద్రేకంగాను, ఆత్మీయంగాను, నీకున్న అవసరతలేమిటి? వాటిని పొందడానికి నీ 1 కొరింథీయులు 4:4 నందు యీ విషయాన్ని యిలా సూచిస్తూ వ్రాశాడు: “నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.”
తలంపులు, లక్ష్యాలు, పద్ధతులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి నిన్ను నీవే తెలుసుకోవాలి. ఇది ఒకడు అనుకున్నంత సుళువేమీ కాదు. మనలను మనం పరిశీలించుకోవడానికి మానసిక పరిపక్వత అవసరం, అప్పటికి కూడ మనకు మనమే ప్రతి విషయంలోను వాస్తవంగా ఏమైయున్నామోనని పరిశీలించుకొనుట అసాధ్యం. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు8 ఒక సందర్భంలో, యోబు వివేచించలేని కొన్ని వాస్తవాలను అతడు గ్రహించాలని సృష్టికర్త కోరాడు. దేవుడాయనతో ఇలా అన్నాడు: “నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.” (యోబు 38:3) మనల్ని మనం తెలిసికోవడానికి, అభిప్రాయాలను కనిపెట్టడానికి ప్రశ్నలు తోడ్పడతాయి. కావున వివాహం యెడల నీ అభిలాషను గూర్చి నిన్ను నీవే ప్రశ్నించుకో.
9 భౌతికావసరతలగు—ఆహారం, వస్త్రాలు, నివాసం మున్నగు వాటిని తీర్చుకోవడానికి వివాహమాడ కోరుతున్నావా? బైబిలు తెల్పుతున్నట్లు మనందరికి అవి అవసరమే: “అన్న వస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తి పొందియుందము.” మరి లైంగిక తృష్ణ అవసరమేనా? అది కూడ సర్వసాధారణమైన అభిలాషయే. “కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.” (1 తిమోతి 6:8; 1 కొరింథీయులు 7:9) ఆ వివాహం సహవాసం నిమిత్తమా? ఆ ముఖ్యకారణం నిమిత్తమే దేవుడు వివాహాన్ని ఏర్పాటుచేశాడు. మరొక కారణం, వారిద్దరు కలిసి పనిలో సహకరించుకొనుటే. (ఆదికాండము 2:18; 1:26-28) ఉత్తమమైన పనిని నెరవేర్చుటలో సంతృప్తిని పొందుటకు ఆధారముంది, దానికి ప్రతి ఫలం ఉండాలి. “ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే.”—ప్రసంగి 3:13.
10 హృదయం వారి భావాలకు నెలవు అని ప్రేమికులు అనాదిగా భావిస్తూవున్నారు. అయితే బైబిలు హృదయాన్ని గూర్చి ఒక ఆందోళనకరమైన ప్రశ్నను వేస్తుంది: “దాని గ్రహింపగల వాడెవడు?” (యిర్మీయా 17:9) నీ హృదయంలో వున్నదేదో నీకు తెలుసని నీవు రూఢిగా చెప్పగలవా?
11. వివాహంలో ఏ ముఖ్య భావావేశ అవసరతలను తీర్చాలి?
1 యోహాను 3:17) నీ జతకు ఇవన్నీ నీవు ఇవ్వగలవా, మరి తాను వాటిని నీకు తిరిగి ఇచ్చునా?
11 తరచూ, శరీరసౌందర్యం ఇతర భావావేశ అవసరాలను గమనించకుండ మనకు గ్రుడ్డితనాన్ని కల్గిస్తుంది. జతను వెదకడంలో నీవు అవగాహనను, దయ, జాలి అను వాటిని పొందవలసిన అవసరముందని యుక్తంగా తలస్తున్నావా? మనందరికి సాధారణంగా, ఎవరో ఒకరు మనకు సన్నిహితంగా వుంటూ, ఆప్తులై, మనకు హాని కల్గుననే భయమేమి లేకుండా మన రహస్యాలను వారికి చెప్పినప్పుడు వినేవారు, మన ఎడల “కనికరము చూపే” వారు కావాలి. (12. సంతోషభరితమైన వివాహానికి, శారీరక మానసిక అవసరాలను మాత్రం తీర్చుట ఎందుకు సరిపోదు?
12 యేసు ఇలా అన్నాడు: “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు.” (మత్తయి 5:3, NW) నీ ఆత్మీయ అవసరత ఏమిటి? అది జీవనోపాధిని వెదకాలని తెల్పుతుందా? ఐశ్వర్యమా? వస్తుసంపాదనా? మరి ఇటువంటి తాపత్రయాలు నీకు ఆత్మసంతృప్తి నిస్తాయా? సాధారణంగా అవి యివ్వలేవు. సమస్త శారీరక అవసరతలు తీర్చుకొనిన తదుపరి కూడ అందరికి ఆత్మీయ ఆకలివుంటుందని మనం గ్రహించాలి. మన అంతరాత్మ—మన మెవరం, మనమేమైయున్నాం, మన మెందుకిచ్చట వున్నాం, మనమెచ్చటికెళ్తున్నామని తెలిసికొనుటకు, తహతహలాడుతుంది. ఈ ఆత్మీయావసరాలను తీర్చుకోవడానికి నీవు మెలకువగా ఉన్నావా?
సహజీవన సమర్థత
13. సంతోషభరితమైన వివాహంలో నీ అవసరతలే గాక మరి వేటిని కూడ నీవు వివేచించాలి?
13 నీవు యీ శారీరక, మానసిక, ఆత్మీయ అవసరతలన్నిటిని గ్రహించగల్గితే, కాబోయే నీ జీవితభాగస్వామి వాటిని గ్రహించునో లేదో నీకు తెలుసా? వివాహంలో సంతోషించడానికి ప్రత్యేకంగా నీ అవసరాలను గూర్చి నీవు తెలుసుకొనుటయే గాక నీ జీవిత భాగస్వామి అవసరాలను కూడ నీవు వివేచించాలి. నీ జత కూడ సంతోషించాలని నిశ్చయంగా నీవు కోరుకుంటావు.
ఒకరికి అసంతోషం కల్గితే ఇద్దరికి అసంతోషంగానే వుంటుందని దాని భావము.14. అనేక వివాహాల్లో, జీవితభాగస్వాములు తామెందుకు పొసగని వారని గ్రహిస్తున్నారు?
14 ఇద్దరికి పొసగనందువల్ల అనేక వివాహాలు అసంతోషంతో లేక విడాకులతో అంతమౌతున్నాయి. పొసగదు అనేపదం చాల పెద్దమాట అయితే వివాహంలో దాని ప్రాముఖ్యత అంతకంటె గొప్పదే. ఇద్దరు కలిసి జతగా జీవించలేకపొతే సహజీవనమే కష్టం. అలాంటి పరిస్థితి, మోషే ధర్మశాస్త్ర ఏర్పాటును జ్ఞాపకం చేస్తుంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారం, బలంలోను జాతిలోను తేడావున్న పశువులను కలిపి ఒకే కాడి క్రింద కట్టకూడదు. ఎందుకంటే మరొక జాతి జంతువు దీన్ని కష్టపెడుతుంది. (ద్వితీయోపదేశకాండము 22:10) అలాగే, ఒక పురుషునికి ఒక స్త్రీకి సరిగ్గా జత కుదరకపోయినను, వారిద్దరిని వివాహంలో జతచేస్తేకూడ అలాగే వుంటుంది. దంపతులలో ఒక్కొక్కరికి వారి వారి అభిలాషలు, స్నేహితుల విషయాల్లోను వినోద కార్యకలాపాల్లోను విభిన్న అభిరుచులు ఉంటాయి సర్వసాధారణంగా అందరికి వున్నట్లే కొన్ని విషయాల్లో మరొక విధమైన అభిరుచివున్నపుడు, వివాహ బంధాలు మిక్కిలి బాధకు గురౌతాయి.
15, 16. కాబోయే వివాహజతతో చర్చించవలసిన కొన్ని అంశాలేమిటి, వాటినెట్లు చర్చించుకోవాలి?
15 “ఆలోచన చెప్పువారు లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును,” అని బైబిలు మనకు తెల్పుతుంది. (సామెతలు 15:22) నీవు వివాహాన్ని గూర్చి తలంచేటప్పుడు ఆచరణాత్మకమైన విషయాల్ని చర్చించావా? పురుషుని ఉద్యోగం వివాహానికెలా సరిపడుతుంది? నీవెచ్చట నివసిస్తున్నావు, ఆచరణాత్మక అవసరతలను తీర్చుకోవడానికి ఎంత డబ్బు అవసరం అనే వాటిని అది నిర్ణయిస్తుంది. కుటుంబ ఆర్థిక పథకాలను చూసేదెవరు? భార్య ఉద్యోగం చేయవలసిన అవసరముందా, అది కోరదగిందేనా? అత్తింటివారితో, ముఖ్యంగా ఇరువైపులనున్న తలిదండ్రులతోగల బంధుత్వం విషయమేమిటి? దాంపత్య జీవితం, సంతానోత్పత్తి, పిల్లల తర్ఫీదు మున్నగు వాటిని గూర్చి ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయమేమిటి? ఒకరిపై ఒకరు అధికారం చెలాయిస్తున్నారా, లేక అనురాగ బంధం వారి బంధాన్ని ముడివేస్తుందా?
16 మీరిద్దరు సుఖంగా జీవించడానికి మీరీ ప్రశ్నలను, మరితర ప్రశ్నలను కూడ సావధానంగా, న్యాయబద్ధంగా చర్చించుకోగలరా? ఇద్దరు కలిసి, సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించుకుని, ఎల్లప్పుడు ఇద్దరు నిరాటంకంగా సంభాషించుకొనే పద్ధతిలో వుండగలరా? అదే జయప్రదమైన వివాహానికి జీవనరేఖ.
17-19. కుటుంబ పూర్వాపరాలు వివాహబంధంలోని సహజీవనం విషయంలో ఎందుకు ప్రభావం కల్గివున్నాయి?
17 సర్వసాధారణంగా ఒకే వంశానికి చెందిన వారిద్దరి మధ్య సహజీవనముంటుంది. ఎయిడ్ టు బైబిల్ అండర్‌స్టాండింగ్ అనే పుస్తకం 1114, పుటలో బైబిలు కాలమందు జరిగిన వివాహాన్ని గూర్చి ఇలా తెలుపుతుంది:
“ఆనాడు పురుషుడు తన కుటుంబ బంధువుల్లోనే లేక తన వంశములోనే భార్యను వెదకే ఆచారం పరిపాటిగా కనబడుచున్నది. ఈ ఆచారం, లాబాను యాకోబునకు తెల్పినదానియందు స్పష్టమౌతోంది: ‘ఆమెను [నా కుమార్తెను] అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు.’ (ఆది. 29:19) ఈ ఆచారం యెహోవా ఆరాధికులలో విశేషంగా కనబడుతోంది. అబ్రాహాము, ఇందుకు మాదిరి చూపాడు. ఆయన తన కుమారుడైన ఇస్సాకునకు భార్యను తన స్వదేశంలోని బంధువులలోనే వెదకవలెనని మనుష్యులను పంపాడేగాని. తాను నివసిస్తున్న కనానీయుల కుమార్తెలను తీసికొనలేదు. (ఆది. 24:3, 4)”
18 అయితే ఈనాడు తన అతిసమీప బంధువును వివాహమాడుట మంచిదని దీని భావం కాదు, ఎందుకంటే అలాచేస్తే బహుశ పారంపర్యంగా వచ్చు సమస్యల మూలంగా అంగవైకల్యతగల సంతానం కలుగవచ్చు. అయితే వంశావళికి సంబంధించిన విషయాలు ప్రజలకున్న ప్రయోజనాలతో ఎంతో సమన్వయ సంబంధం కలిగి ఉన్నాయి. బాల్యంలోను యౌవనదశలోను ఒక వ్యక్తి ప్రవర్తన, తలంపులపై కుటుంబ పరిస్థితుల ప్రభావం సహజంగా వుంటుంది. ఇద్దరి వంశముల క్రమపద్ధతుల్లో సారూప్యమున్నపుడు, వారు ‘అదే నేలపై పెరిగి అదే పరిస్థితులందు వర్థిల్లుట’ సర్వసాధారణంగా వారికి సులభంగా కనబడుతుంది. అయినను, వేర్వేరు వంశావళుల మూలములు కల్గియున్నవారు కూడ వివాహంలో మంచి సర్దుబాటు చేసికోగలరు. విశేషంగా ఇద్దరూ తమ భావోద్రేకాల విషయంలో పరిపక్వదశలో ఉన్నపుడు ఒకరికొకరు సర్దుకొనిపోగలరు.
19 నీకు కాబోవు జత యొక్క కుటుంబాన్ని గూర్చి కొంతమట్టుకైనా నీవు ఎరిగియుండుట నిజంగా ప్రయోజనకరం. అయితే తాను నీ కుటుంబంతో, అంటే నీ తలిదండ్రులతో, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రతో ఎలా మెలగునాయని పరిశీలించండి. అతడుగానీ, ఆమెగానీ వృద్ధులనెలా పరామర్శిస్తారు లేక చిన్న వారితో ఎలా మెలగుతారు?
20, 21. జంటను ఎన్నుకొనుటలో, వ్యక్తిగత పొరపాట్ల విషయంలో ఎట్టి అభిప్రాయముండాలి?
20 ముందు జాగ్రత్తలు తీసికొన్ననుసరే నీవు మాత్రం యీ విషయాన్ని జ్ఞాపకముంచుకోవాలి: ఇద్దరి మధ్య సహజీవనం ఎన్నటికి సంపూర్ణమైనదికాదు. ఇద్దరికి పొరపాట్లుంటాయి. కొందరు వీటిని వారి వివాహానికి ముందే గమనిస్తారు. మరి కొందరైతే అటుపిదప గమనిస్తారు. అప్పుడేలామరి?
21 పొరపాట్లవల్ల మాత్రమే వివాహం అపజయం కాదు కానీ ఆ పొరపాట్లను తన జత ఎలా భావించుననేదే అపజయానికి కారణం. మంచి అనేది పొరపాట్లకన్న మిన్నయైనదని నీవు గమనించగలవా, లేక చెడును చూచి దానినే రేపుతుంటావా? నీవు నీ లోపాలను కప్పిపుచ్చాలని కోరితే నీవును అట్టివాటిని సర్దుకొనిపోగలవా? అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “ప్రేమ అనేక పాపములను కప్పును.” (1 పేతురు 4:8) నీవు వివాహమాడదలచిన వ్యక్తి యెడల నీకిలాంటి ప్రేమ ఉందా? లేకపోతే, ఆ వ్యక్తిని వివాహమాడకుండుట మంచిది.
‘నేను ఆయనను మార్చగలను’
22-24. ఒకడు తన పద్ధతులను మార్చుకొంటాడని అతడు చేసిన వాగ్దానం మీద ఆధారపడి లేక ఆ వ్యక్తిని మార్చగలననే దృష్టితో వివాహమాడుట ఎందుకు అవివేకమైవుంది?
22 ఏది ఏమైననూ ‘నేను ఆయనను’ లేక ‘ఆమెను మార్చగలను’ అని నీవంటున్నావా? అయితే నీవెవరిని ప్రేమిస్తున్నావు? ఆ వ్యక్తినిబట్టి ప్రేమిస్తున్నావా లేక నీవు మార్చుటకు ప్రయత్నించే వ్యక్తిని ప్రేమిస్తున్నావా? మనలను మనం మార్చుకొనుటే కష్టం, మరి ఇతరులను మార్చుట ఇంకా కష్టమేగదా. అయినా, దేవుని వాక్యంలోని శక్తివంతమగు సత్యములు ఒక వ్యక్తి తానే మారేటట్లు చేయగలవు. ఒకడు తన “ప్రాచీన స్వభావమును వదలుకొని” తన చిత్తవృత్తియందు నూతన పరచబడగలడు. (ఎఫెసీయులు 4:22, 23) కాబోయే జత నిన్ను అకస్మాత్తుగా మార్చుననే ప్రమాణ విషయాన్ని మాత్రం నిశ్చయంగా నమ్మవద్దు! దురలవాట్లను సరిదిద్దుకొనగల్గినను లేదా మార్చుకొనగల్గినను అందుకు కొంతకాలము, బహుశా కొన్ని సంవత్సరములైనా పట్టవచ్చు. లేక మన పారంపర్య లక్షణాలు, పరిసర పరిస్థితులు మనం కొన్ని ప్రత్యేక ప్రవృత్తులను అలవర్చుకొనజేసి, మనం ప్రత్యేక వ్యక్తులుగా కనబడేలా మనల్ని మార్చిన వాస్తవాలను మనం త్రోసి పుచ్చలేము. నిజమైన ప్రేమ, ఒకరికొకరు సహాయపడుటకును, బలహీనతలను అధిగమించుటకును తోడ్పడుతుంది కానీ అతని లేక ఆమె వ్యక్తిత్వాన్ని చంపివేయగల క్రొత్త, అసహజమైన పద్ధతులలోనికి బలవంతంగా దిగునట్లు ప్రయత్నించుటకది మనలను పురికొల్పదు.
23 కొందరు తమ మనస్సులందు కల్పనా భావాన్ని నిలుపుకొని, ప్రతిచిన్న వ్యామోహాన్ని అందులో ఇమడ్చడానికి ప్రయత్నిస్తారు. నిజమే అసాధ్యమగు కలను ఎవరును నెరవేర్చలేరుగాని వ్యామోహాన్ని కల్గియున్నవారు మొండిపట్టుపట్టడానికి ఇతరులు తమ కోరికను తీర్చవలెనని బలవంతపెట్టడానికి యత్నిస్తారు. ఇది విఫలమైనప్పుడు వారు నిస్పృహ చెంది తన ఊహాగాన భావానికి తగిన వ్యక్తిని మరొకచోట వెదకుతారు. అయితే అట్టివారు తమకు తగిన వారిని కనుగొనలేరు. వారు ఊహకందని, ఉనికిలో లేని స్వప్న ప్రియులను వెదకుతారు. ఆ విధంగా తలంచే వారు మంచి వివాహపు జతకాదు.
24 బహుశా నీవును అలాంటి కలలు కనియుంటావు. మనలో అనేకులు కొన్ని సమయాల్లో అలాంటి కలలు కనియున్నాము; యౌవనస్థులనేకులు అట్టికలలే కంటారు. అయితే భావోద్రేక పరిపక్వత వృద్ధి అవుతుండగా అట్టి ఊహలు ఆచరణాత్మకం కావని వాటిని మనం ప్రక్కకు నెట్టివేయాలని గ్రహించాలి. వివాహంలో గమనించవలసినది నిజస్వరూపమేగానీ వట్టి ఊహాకల్పన కాదు.
25. నిజమైన ప్రేమకు, మోహానికి గల వ్యత్యాసమేమి?
25 అనేకులు అనుకున్నట్లు, నిజమైన ప్రేమ గ్రుడ్డిది కాదు. అది అనేక పొరపాట్లను కప్పుతుంది, అయితే నిజమైన ప్రేమ వారి స్మృతిపథంలో లేదు. అది మోహమేగానీ ప్రేమకాదు, అది గ్రుడ్డిది, ఇతరులు గమనించగల సమస్యలను పరిశీలించుటకది తిరస్కరిస్తుంది. దాని స్వంత కరుకైన అనుమానాలను 1 కొరింథీయులు 14:20 నందు ఇచ్చిన ఉపదేశం, జంటను ఎన్నుకొనుటలో కూడ వర్తిస్తుంది: “మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక . . . పెద్దవారలై యుండుడి.”
సహితం అది కప్పివేస్తుంది; అయితే తర్వాత అవి బయటపడుట ఖాయం. ఇద్దరూ కలిసి తిరిగేటప్పుడు ఎదురయ్యే అసంతోషకరమగు వాస్తవాలపై దృష్టినుంచవద్దు వివాహానంతరం నీవు వాటినెదుర్కొనవలసివస్తుంది. మనం మురిపించదలచిన వ్యక్తికి లేక ఆకర్షించదలచిన వ్యక్తికి ఎంతో అందంగా కనబడాలన్నది మన సహజకోరిక, కానీ సకాలంలో ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది. తానెటువంటి వ్యక్తి అని పరిశీలించడానికి నీవు ఆ సమయాన్ని వినియోగించు, నీవు నిజంగా ఎలాంటి వ్యక్తివో ఎదుటివారికి కనబరచుకో. అపొస్తలుడుపెళ్లినాటి ప్రమాణాలు
26. లేఖనాల ప్రకారం, వివాహబంధమెంతటి కట్టుబాటు కల్గివుంది? (రోమీయులు 7:2, 3)
26 ఒకడు తాను వివాహంలో చేసిన ప్రమాణాలను గూర్చి గంభీరంగా తలంచాలి. ఇద్దరిలో ఏ ఒక్కరి ప్రమాణం దృఢమైంది, స్థిరమైంది కాకపోతే, వివాహం అస్థిరమైన పునాదిపై నిలుస్తుంది. ఈనాడు లోకమందు అనేక ప్రాంతాల్లో వివాహాలు జరుగుచున్నాయి. కానీ వెంటనే విడిపోతున్నాయి. ఇందుకుగల కారణమేమంటే వివాహం చేసికొన్నవారు తమ ఒప్పందాన్ని బట్టి నైతికంగా దానికి బద్ధులైయున్నారని బహుశ వారు తలంచడంలేదు. దానికి బదులు వారు ‘ఆ ఒప్పందము ఫలించకపోతే, దాన్ని మానుకొంటాం’ అనే భావనలో వున్నారు. అట్టి భావన ఎక్కడ వుంటుందో ఆ వివాహం ప్రారంభదశ నుండే విచ్ఛిన్నమగుటకు దారితీసి, సంతోషాన్ని కల్గించేబదులు సాధారణంగా మనోవ్యాకులతను మాత్రమే కల్గిస్తుంది. అయితే దానికి బదులుగా, వివాహమనేది జీవితాంతపు బంధమని బైబిలు తెల్పుతుంది. దేవుడు మొదటి జంటతో, వారిద్దరు “ఏక శరీరమై” ఉంటారని తెల్పాడు. (ఆదికాండము 2:18, 23, 24) పురుషునికి వేరొక స్త్రీ లేదు, స్త్రీకి వేరొక పురుషుడు వుండడు. దేవుని కుమారుడు దీన్ని స్థిరపరుస్తూ ఇలా అన్నాడు: “వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” వివాహబంధాన్ని విడదీయుటకు వ్యభిచారము మాత్రమే న్యాయసమ్మతమైన ఆధారము.—మత్తయి 19:3-9.
27-29. (ఎ) స్త్రీ తనకు కాబోయే భర్త విషయంలో నిశ్చయంగా దేనిని గమనించాలి? (బి) పురుషుడు తనకు కాబోయే భార్య విషయంలో జ్ఞానయుక్తంగా దేనిని పరిశీలించాలి?
27 వివాహానికున్న ప్రాముఖ్యత దృష్ట్యా అందులో విజయం సాధించాలనే కోరికగల స్త్రీ, తాను గౌరవించగలవ్యక్తినే అనగా స్థిరత్వము, తుల్యశక్తి, మంచి పరిజ్ఞానము కల్గి, బాధ్యతలను చేపట్టగల సమర్థుడు, ప్రయోజనకరమగు విమర్శను అంగీకరించగల అనుభవమున్న వానినే పెండ్లిచేసుకుంటుంది. నిన్ను నీవే ఇలా ప్రశ్నించుకో: అతడు మంచి పోషణకర్తయగునా, బహుశ మాకు కలుగబోవు సంతానానికి ఉత్తముడైన తండ్రియగునా? మీరిద్దరు వివాహపు పాన్పును ఘనమైనదిగా, నిష్కల్మషమైనదిగా చేయడానికి, స్థిరమైన తీర్మానము చేయడానికి ఆయన ఉత్తమ నైతిక లక్షణాలను కల్గియున్నాడా? అతడు, వినయము నమ్రత కనబరచునా లేక అహంకారి, మొండివాడు, తన అధికారాన్ని డంబంగా చూపడానికి కోరేవాడా, తానే ఎప్పుడు సరియైన దాన్ని చేసేవాడని తలంచేవాడా, సంగతులను సమాలోచించుటకు యిష్టపడేవాడుకాడా? వివాహానికి ముందు అవసరమైనంత కాలము అతనితో సహవాసము చేయుట మూలంగా యీ విషయాలను గమనించవచ్చును, ప్రత్యేకముగా సరియైన తీర్మానమునకు వచ్చుటలో బైబిలు నియమాలను తు. చ. తప్పకుండ అమలు పరచినపుడు వాటిని పరిశీలించవచ్చు.
28 ఆలాగే, తన వివాహము విజయవంతం కావలెనని తీవ్రంగా తలంచే పురుషుడు, తన శరీరంవలె ప్రేమించగల భార్యను ఎన్నుకొంటాడు. ఆమె కుటుంబాన్ని బలపరచుటలో అతనికి సహాయకురాలై యుండాలి. (ఆదికాండము 2:18) ఉత్తమ గృహిణిగా ఆమెకు వివిధ బాధ్యతలుండడం తప్పనిసరియే అందులో వంట, ఇంటిని చక్కగా అమర్చుట, పొదుపుచేయుట మున్నగు వాటితో ఆమె తల్లిగా, ఉపాధ్యాయినిగా యింకెన్నెన్నో విషయాల్లో మంచి నైపుణ్యం కనబరచుటయే. తన స్థానంవలన ఆమె తన మేధాశక్తిని చూపి, ఇతరులను ఆకట్టుకొని, తన వ్యక్తిగత అభివృద్ధి కార్యసాధనకు అనేక అవకాశాలను అందుకొనుచుండవచ్చు. యోగ్యుడైన భర్తవలె, గుణవతియైన గృహిణి మంచి పనికత్తె: “ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.”—సామెతలు 31:27.
29 అవును, ఇద్దరూ వారేమి గమనిస్తున్నారో దానిని బాగుగా తలంచాలి—అనగా వ్యక్తిగత పరిశుభ్రత, ఓ క్రమపద్ధతి ఉన్నవా లేక అవిలేవా, చురుకైనవారా లేక సోమరులా, అహంకారం, డంబానికి బదులు వివేకం, దయాదాక్షిణ్యత గలవారా; పొదుపు వున్నదా లేక వృధాచేసేవారా, సంతోషభరితమగు సంభాషణకు ఆత్మీయాభివృద్ధికి దోహదపడగల ఆలోచనా శక్తివున్నదా, అలాగాక ప్రతిరోజు శరీరావసరతలను తీర్చుకొనుటలో మరి ఇతర క్రియలు చేయుటలో జీవితం యాంత్రికంగా సాగదీసే మానసిక సోమరితనానికి చిహ్నమైయున్నదాయని గమనించాలి.
30, 31. వివాహానికి ముందు కలిసి తిరిగేటపుడు అవినీతి ప్రవర్తనకు పాల్పడుటవలన ఆ వ్యక్తి మంచి వివాహజీవితాన్ని అనుభవించడానికి ఎందుకు ఆటంకంగా ఉంటుంది?
30 పరస్పరంగా, మనఃపూర్వకమైన గౌరవాన్ని కల్గియుండుట విజయవంతమగు వివాహానికి ముఖ్యసాధనం. జతగా ఇద్దరూ కలిసి తిరిగేటపుడు, అనురాగాన్ని వ్యక్తపరచుటలో కూడ ఇది వర్తిస్తుంది. అనవసరమైన అనుబంధం లేక హద్దులేని మోహం, వివాహం ప్రారంభం కాకముందే ఆ బాంధవ్యాన్ని సన్నగిల్లేటట్లు చేయగలదు. లైంగిక అవినీతి, వివాహారంభానికి మంచి పునాదికాదు. అట్టిక్రియ స్వార్థంతో కూడినదై ఎదుటి వ్యక్తియొక్క భవిష్యత్ సంతోషాన్ని లక్ష్యపెట్టదు. వీడని బంధాన్ని ఏర్పరచుననే తలంపును కల్గించు ఆ క్షణికమైన కామం సత్వరంగా చల్లబడిపోవచ్చును, కొన్ని వారములలోనే లేక కొన్ని రోజులలోనే ఆ వివాహము బూడిదపాలు కావచ్చును.—రెండవ సమూయేలు 13:1-19 నందు తెల్పబడిన అమ్నోను తామారు ఎడల చూపిన మోహపు వృత్తాంతాన్ని పోల్చండి.
31 స్నేహం చేసే సమయంలో చూపే మోహం అనుమానములను పుట్టించి, చివరకు ఆ వివాహమునకు గల వాస్తవిక ఉద్దేశమును గూర్చి అనిశ్చయతను కల్గిస్తుంది. కేవలం మోహాన్ని వ్యక్తపరచుకొనుటకేనా లేక ఓ వ్యక్తిగా ప్రేమను అభినందనను చూరగొనెడి వ్యక్తితో జీవితాన్ని పంచుకొనుటకా? వివాహానికి ముందు ఆశానిగ్రహం లేకపోతే తరచూ వివాహానంతరం కూడ అట్టి ఆశానిగ్రహాన్ని చూపలేక, తత్ఫలితంగా ద్రోహం చేయడానికి, అసంతోషానికి అది కారణమౌతుంది. (గలతీయులు 5:22, 23) వివాహానికి ముందు చేసిన అవినీతి క్రియల జ్ఞాపకాలమూలంగా వివాహపు తొలిదశలోనే భావోద్రేక విషయాల్లో సావధానంగా సాగిపోవుటకు ఆటంకమేర్పడును.
32. వివాహానికి ముందు ఇద్దరూ కలిసి తిరిగేటప్పుడు వారి అవినీతి ప్రవర్తన మూలంగా దేవునితో ఆ వ్యక్తికున్న సంబంధం ఎలా దెబ్బతింటుంది?
32 అంతకంటె తీవ్రమైనదేమంటే, మనకు ఎవరి సహాయం నిశ్చయంగా అవసరమో ఆ సృష్టికర్తతో మనకు గల సంబంధాన్ని అట్టి అవినీతి క్రియ పాడుచేస్తుంది. “మీరు పరిశుద్థులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. . . . ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి [లేక, న్యాయబద్ధంగా తన సహోదరికి] మోసము చేయకుండవలెను; . . . కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.”—బండమీద వేయబడిన పునాది
33, 34. వివాహ జతను ఎన్నుకొనుటలో శరీర సౌందర్యం కన్న ఎక్కువగా ఏ గుణములు ప్రాముఖ్యమని లేఖనాలు తెల్పుతున్నవి?
33 నీ గృహము, నీ కుటుంబం బండవంటి పునాదిపై కట్టబడుతుందా లేక ఇసుకమీద కట్టబడుతుందా? జతను ఎన్నుకొనుటలో చూపే వివేకాన్ని బట్టి అది కొంతవరకు ఆధారపడివుంది. సౌందర్యం, లైంగిక అనుభూతి మాత్రమే చాలవు. అవి మానసిక ఆత్మీయ విరుద్ధతను తొలగించలేవు, దేవుని వాక్యమందలి హెచ్చరికే వివాహానికి బండవంటి పునాదిని వేయగలదు.
34 శరీరసౌందర్యం కన్న అంతరంగ స్వభావమే అధిక ప్రాముఖ్యత కల్గివుందని బైబిలు తెల్పుచున్నది. “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును” అని ప్రేరేపిత సామెత తెల్పుతుంది. (సామెతలు 31:30) వివాహితుడైన, అపొస్తలుడగు పేతురు “అంతరంగ పురుషుడు,” “సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము,” “దేవుని దృష్టికి మిగుల విలువగలవని” అంటున్నాడు. (1 పేతురు 3:4) దేవుడు, ‘మనుష్యుని బాహ్యసౌందర్యమును లక్ష్యపెట్టడు,’ దీనిని మనం మాదిరిగా తీసికొని కాబోయే వివాహపు జత యొక్క శరీరసౌందర్యాన్ని మాత్రమే చూచి మోసపోకుండా జాగ్రత్తపడగలము.—1 సమూయేలు 16:7.
35, 36. (ఎ) దేవునియందు, ఆయన వాక్యమందు విశ్వాసమున్న వ్యక్తిని వివాహమాడుట ఎందుకు ముఖ్యం? (బి) నీకు కాబోయే జత అట్టి విశ్వాసాన్ని ఎంతగా కనబరచవలెనని నీవనుకొంటావు?
ప్రసంగి 12:13) దేవుని ధర్మశాస్త్రమునకు లోబడిన ప్రజలుగా, ఇశ్రాయేలీయులు తమ ఆరాధనలో పాలుపొందని వారితో వియ్యమందకూడదని ఆజ్ఞాపించబడ్డారు లేనియెడల అది వారిని సత్యదేవుని నుండి దూరం చేస్తుంది. “నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు.”—ద్వితీయోపదేశకాండము 7:3, 4.
35 జ్ఞానియైన సొలొమోనురాజు, జీవితాన్ని గూర్చి యోచించి యీ నిర్ణయానికి వచ్చాడు: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (36 ఇటువంటి కారణాల నిమిత్తమే, దేవుని “క్రొత్త నిబంధన” క్రిందనున్న క్రైస్తవ సంఘస్థులకు, “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెనని” హెచ్చరిక ఇవ్వబడింది. (యిర్మీయా 31:31-33; 1 కొరింథీయులు 7:39) మూఢ విశ్వాసాన్ని కనబరచే బదులు, ఇది జ్ఞానము ప్రేమవలన పురికొల్పబడుతుంది. ఇద్దరూ కలిసి సృష్టికర్తయెడల చూపే భక్తికన్న మరేది వారి వివాహబంధాన్ని అంత అధికంగా బలపరచలేదు. దేవునియందు ఆయన వాక్యమందు విశ్వాసముంచే వ్యక్తిని, నీవు గ్రహించినట్లే దానిని గ్రహించగల వ్యక్తిని నీవు వివాహమాడితే అప్పుడు హెచ్చరిక విషయంలో మీ ఇద్దరికి ఒకే అధికారమూలముంటుంది. ఇదంత ప్రాముఖ్యమైందికాదని నీవు తలంచవచ్చును, కానీ “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” (1 కొరింథీయులు 15:33) క్రైస్తవ సంఘంలో కూడ ఒక వ్యక్తి తనకు కాబోయే వివాహ జత నిజంగా పూర్ణహృదయంతో దేవుని సేవించే వ్యక్తియేనా లేక క్రైస్తవత్వం యొక్క అంచుపై నిలుచొని, ఇహలోక అలవాట్లు, ఆలోచనలవైపు అధికంగా మొగ్గియున్న వ్యక్తియాయని నిశ్చయంగా పరిశీలించాలి. నీవు దేవునితో నడుస్తూ, లోకంతో పరుగిడలేవు.—యాకోబు 4:4.
37, 38. (ఎ) వివాహం కాకమునుపు కలిసి తిరుగుటకు గానీ, వివాహమాడుటకు గానీ ఎందుకు తొందర పడకూడదు? (బి) వివాహమాడదలచినవారు ఎవరి సలహాను వినుట శ్రేయస్కరము?
లూకా 14:28, 29) ఆ సూత్రమే వివాహానికి కూడ వర్తించును. దేవుడు వివాహమును జీవితాంతముండే అనుబంధమని ఎంచుతున్నందువల్ల, జతను ఎన్నుకొనుటలో నిశ్చయంగా తొందరపడకూడదు. మరి నీవేమి ప్రారంభించావో దానిని తుదముట్టించడానికి నీవే జాగ్రత్తపడాలి. వివాహం కాకమునుపు ఇద్దరూ కలిసి తిరుగుట అనే క్రియను కూడ ఒక ఆటమాదిరి అంత తేలికగా తీసికొనకూడదు. మరొకరి అనురాగములతో ఆటలాడుట క్రూరమైన క్రీడ, మరి దీనివలన కలుగు మానసిక గాయాలు, భగ్నహృదయాలవంటివి శాశ్వతంగా నిలిచిపోగలవు.—సామెతలు 10:23; 13:12.
37 “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తనయొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేకపోవును” అని యేసు అన్నాడు. (38 వివాహమాడదలచిన, వివేకమున్న యువతీయువకులు, పెద్దల సలహాను, ముఖ్యంగా మీ క్షేమాన్ని కోరే వ్యక్తులేనని రుజువుపరచుకొన్న వారి మాటను వినుట శ్రేయస్కరం. యోబు 12:12 ఇలా ప్రశ్నిస్తూ, దీని విలువను మనకు జ్ఞాపకం చేస్తుంది: ‘వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుటలేదా?’ ఈ అనుభవంలో చెప్పబడిన ఈ మాటలను లక్ష్యపెట్టండి. అన్నింటికంటె ముఖ్యంగా, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక, నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:5, 6.
39. వివాహితులయినవారికి బైబిలెలా సహాయపడగలదు?
39 ఈ మాటలను చదివే అనేకులు ఇప్పటికే వివాహితులై యుండవచ్చును. ఇంతకు మునుపే మీ పునాది కొంత మట్టుకు వేయబడినను. అవసరమైనచోట్ల మార్పులు చేసికొనుటకు తద్వారా మంచి ఫలితములు పొందుటకు బైబిలు మీకు సహాయపడగలదు. మీ వివాహపుస్థితి ఎలావున్నాసరే, కుటుంబ సంతోషం నిమిత్తం సృష్టికర్త యిచ్చే సలహాను పాటించుటవలన ఆ స్థితిని యింకను మెరుగు పరచుకోవచ్చు.
[అధ్యయన ప్రశ్నలు]
[12వ పేజీలోని చిత్రం]
తుఫాను తాకిడి వంటి సమస్యలకు మీ వివాహం తాళుకొనగలదా?