పరస్పర సంభాషణ నిరాటంకముగా కొనసాగించుట
అధ్యాయము 11
పరస్పర సంభాషణ నిరాటంకముగా కొనసాగించుట
1, 2. సంభాషణ అంటే ఏమిటి, మరి అదెందుకు ప్రాముఖ్యం?
సంభాషణ అనేది కేవలం మాట్లాడటంకంటె ఎక్కువైనది. అపొస్తలుడైన పౌలు దాన్ని ఇలా తెల్పాడు: మీరు చెప్పేవాటిని వినేవారు గ్రహించకపోతే “మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు.” (1 కొరింథీయులు 14:9) నీవు చెప్పే విషయాన్ని పిల్లలు గ్రహిస్తున్నారా, వారు చెప్పే విషయాలను నీవు గ్రహిస్తున్నావా?
2 నిజమైన సంభాషణ జరగాలంటే, ఆలోచనలు భావాలు ఒకరి మనస్సులోనుండి మరొకరి మనస్సులోకి ప్రసరించాలి. ప్రేమను, సంతోషభరితమైన కుటుంబజీవితానికి గుండెయని పిలిస్తే, మరి సంభాషణను గుండెలోని ప్రాణముగల రక్తంతో సమానమని పిలువవచ్చు. దంపతుల మధ్య సంభాషణకు విఘాతమేర్పడితే అది అనర్థాలకు దారితీస్తుంది; మరి తలిదండ్రులు, పిల్లలమధ్య అలాంటి విఘాతాలు కల్గితే అంత ఎక్కువ తీవ్రమైనవి కాకపోయినను, వాటితో సమానమైన తీవ్రతను కల్గివున్నాయి.
దూరదృష్టిని కల్గియుండుట
3. పిల్లల జీవితాల్లోని ఏ దశలో సంభాషణకు సంబంధించిన సమస్యలు వస్తాయని తలిదండ్రులు నిరీక్షించాలి?
3 తలిదండ్రులు పిల్లల మధ్య సంభాషణకు సంబంధించిన అత్యంత తీవ్రతరమైన వత్తిళ్లు అనేవి, పిల్లలు బాల్యంలో ఉన్నపుడు రావు. కానీ యౌవనదశలో అంటే “పదమూడు నుండి పందొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు”లో వస్తాయి. ఇలా జరుగుతుందని తలిదండ్రులు గుర్తించాలి. పిల్లల బాల్యదశలో ఇటువంటి కష్టాలు అల్పమే గనుక రాబోవు సంవత్సరాలలో ప్రసంగి 7:8.
కూడ ఆలాగే వుంటాయని వారు తలంచడం అవివేకం. సమస్యలు నిశ్చయంగా వస్తాయి. వాటిని పరిష్కరించడానికి లేక తగ్గించడానికి స్పష్టమైన, ఫలవంతమైన సంభాషణ ఒక కీలకమై వుండగలదు. దీనిని గుర్తించి, ముందుగా ఆలోచించుట మంచిది, ఎందుకంటే, “కార్యారంభముకంటె కార్యాంతము మేలు.”—4. కుటుంబంలో సంభాషణ అనేది, పరస్పరంగా మాట్లాడుకొనే రూపంలోనే వుండవలెనా? విపులీకరించండి.
4 కుటుంబంలో సంభాషణ కొనసాగటానికి, దాన్ని ప్రారంభించి, స్థిరపరచి, కాపాడుటలో అనేక విషయాలు ఇమిడివున్నాయి. అనేక సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్యగల దృఢనమ్మకం, విశ్వాసం పరస్పర అవగాహనవలన వారి మధ్య మాటలు లేకుండానే—వట్టిచూపు, చిరునవ్వు లేక స్పర్శమూలంగా మాత్రమే సంభాషణను నెలకొల్పి, ఎంతో విస్తారమైన సంభాషణను వారి నిమిత్తం తయారుచేయగలరు. తమ పిల్లల మధ్య కూడ అట్టి సంభాషణకు సంబంధించిన గట్టి పునాదిని వేసే దృష్టిని వారు కల్గియుండాలి. శిశువు, భాషను అర్థం చేసికొనక పూర్వమే తలిదండ్రులు వాన్ని ప్రేమిస్తున్నట్లు, తాను క్షేమంగావున్నట్లు భావించేలాగున ఆ శిశువుతో సంభాషిస్తారు. మరి పిల్లలు పెరిగేకొలది, కుటుంబమంతా కలిసి పనిచేస్తూ, ఆటలాడుకుంటూ, అంతకంటె ముఖ్యంగా ఆరాధనలో పాల్గొంటూ వుంటే సంభాషణకు సంబంధించిన మార్గాలు పటిష్ఠమై, స్థిరపడతాయి. ఆ విధంగా, సంభాషణా మార్గాలను నిరాటంకంగా కొనసాగించడానికి నిజమైన ప్రయత్నం, జ్ఞానం అవసరమే.
తన భావాలను వ్యక్తపరచేలా నీ బిడ్డను ప్రోత్సహించండి
5-7. (ఎ) పిల్లవాడు మాట్లాడుచుండగా ఆపే విషయంలో తలిదండ్రులు జాగ్రత్తగా వుండడం ఎందుకు మంచిది? (బి) తలిదండ్రులు పిల్లలకు సభ్యత, మర్యాదలను గూర్చి ఎలా ఉపదేశించగలరు?
5 “పిల్లలు కనబడవలెనేగానీ వారి మాటలు వినబడకూడదు,” అనేది పాత సామెత. కొన్ని సందర్భాల్లో, ఇది నిజమే. దేవుని వాక్యం తెల్పుతున్నట్లు పిల్లలు, “మౌనముగా నుండుటకు మాటలాడుటకు” సమయము కలదు అనే విషయాన్ని నేర్చుకోవలసిన అవసరముంది. (ప్రసంగి 3:7) అయితే, పిల్లలు తాము చెప్పే విషయాన్ని ఇతరులు ఆలకించాలని ఎంతో ఉబలాట పడతారు, మరి తలిదండ్రులైతే వారిని స్వేచ్ఛగా చెప్పకుండ ఆటంకపరచే విషయంలో తగు జాగ్రత్త వహించాలి. అనుభవాలు చెప్పేటప్పుడు చిన్నపిల్లల ప్రతిస్పందన పెద్దలవలె ఉండాలని అనుకోవద్దు. ఒక సంఘటన, యీ సువిశాల జీవనపథంలో ఒక భాగమని పెద్దలు అనుకొంటారు. కానీ పిల్లలు అటువంటి సంఘటనల్లో శ్రద్ధ చూపి, ఎంతో మురిసిపోతున్నందున వారు ఇతర విషయాలను కూడ ఆ క్షణానికి మరచిపోవచ్చు. ఓ చిన్నబాలుడు, గదిలోనికి గంతులు వేసుకుంటూ వచ్చి వాళ్ల నాన్నతో లేక అమ్మతో ఏదో ఒక విషయాన్ని గూర్చి ఎంతో ఆనందంగా చెప్పడానికి ప్రారంభించవచ్చు. అప్పుడు తండ్రి “ఊరుకోవోయ్!” అనిగానీ లేక కోపంతో మరోమాటగాని అంటే పిల్లవాని ఉత్సాహమంతా సన్నగిల్లిపోవచ్చును. పిల్లవాని కిలకిలలు అంత అర్థవంతముగా వుండకపోవచ్చు. అయితే నీ పిల్లవాడు సహజంగా వ్యక్తపరచే దాన్ని ప్రోత్సహించడంవలన భవిష్యత్తులో నీవు కోరిన, నీవు తెలుసుకోవలసిన విషయాలు వారు దాచకుండ చెప్పడానికి వీలౌతుంది.
6 సభ్యత, మర్యాద అనేవి మంచి సంభాషణకు దోహదపడతాయి. పిల్లలు సభ్యత నేర్చుకోవాలి, మరి తలిదండ్రులు వారి పిల్లలతో సంభాషించేటపుడు మరితర విధాలుగా కూడ తన పిల్లలకు మాదిరి చూపాలి. గద్దింపు అవసరమే, అవసరమైనప్పుడు గట్టిగా బుద్ధి చెప్పవచ్చు. (సామెతలు 3:11,12: 15:31, 32; తీతు 1:13) అయినను పిల్లలను అలవాటు చొప్పున దూరంచేస్తే, ఎప్పుడూ వారిని తప్పుదిద్దుతూ ఉంటే లేదా అంతకంటె హీనంగా వారిని అవమానిస్తే, వారు మాట్లాడినపుడెల్ల తండ్రి వారిని హేళన చేస్తే, వారు ఇక దూరమైపోయే అవకాశముంది—లేదా వారు మాట్లాడాలని అనుకున్నపుడు మరొకరి యొద్దకు వెళ్లి వారితో మాట్లాడతారు. కుమారుడు లేక కుమార్తె పెరిగి పెద్దయ్యేటప్పుడు, యీ సమస్య ఇంకా అధికమౌతుంది. ఈ పని ఎందుకు చేయకూడదూ—అంటే ఈ రోజు సాయంకాలం నీ కుమారునితో నీ కుమార్తెతో సంభాషణను గూర్చి పునర్విమర్శ చేసి, తదుపరి నిన్ను నీవే ఇలా ప్రశ్నించుకో: అభినందన, ప్రోత్సాహం, మెప్పు లేక పొగడ్తలను నేనెన్నిసార్లు చెప్పాను? ‘వారిని’ అవమానపరచి, అసంతృప్తి, కోపం లేక విసుగుచెందిన రీతిగా నేనెన్నిసార్లు వారికి వ్యతిరేకంగా మాట్లాడాను? ఇలా నీవు గతాన్ని తలంచుకుంటే నీవే ఆశ్చర్యపడతావు.—సామెతలు 12:18.
7 తలిదండ్రులకు సహనం, నిగ్రహశక్తి సదా అవసరమే. యౌవనస్థులు ఊరకనే ఉద్రేకపడరు. అవసరమైతే పెద్దల సంభాషణను ఆపియైనా వారి మనస్సులో వున్నదాన్ని వెళ్లగ్రక్కుతారు. తండ్రి, యౌవనస్థుని మూర్ఖంగా దూషించగలడు. కాని కొన్నిసార్లు పిల్లవాడు చెప్పే విషయాన్ని మర్యాదగా వినడం తెలివైన పని, అలా చేసి ఆశానిగ్రహానికి మాదిరిచూపి, అటుపిమ్మట క్లుప్తంగా సమాధానం చెప్పిన తర్వాత పిల్లవానితో, అతను సభ్యతగా, గమనిస్తూ మాట్లాడవలసిన అవసరముందని నెమ్మదిగా జ్ఞాపకం చేయండి. కావున, యీ సందర్భంలో కూడ “వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను” అను సలహా వర్తిస్తుంది.—యాకోబు 1:19.
8. తమ పిల్లలు నడిపింపు కొరకు వారియొద్దకు వచ్చేలా తలిదండ్రులు వారినెలా ప్రోత్సహించవచ్చు?
8 పిల్లలకు సమస్యలున్నపుడు వారు నీ యొద్దకు వచ్చి నీ నడిపింపు తీసుకోవాలని నీవు కోరుకుంటావు. నీ జీవితంలో సమస్యలు వచ్చినపుడు నడిపింపుకొరకు నీవు మరొకరివైపు విధేయతతో ఎదురు చూస్తావని వారికి కనబరచడం ద్వారా వారును అలా చేయడానికి ప్రోత్సహించగలవు. తన పిల్లలు ఇంకను చిన్న వయస్సులో వున్నపుడే తాను మంచి సంభాషణా పద్ధతినెలా స్థిరపరచాడో వ్యాఖ్యానిస్తూ ఒక తండ్రి ఇలా తెలిపాడు:
“దాదాపు ప్రతిరోజు మేము రాత్రిపూట పడుకునే సమయంలో నేను నా పిల్లలతో కలిసి ప్రార్థించేవాడిని. సాధారణంగా వారువారి పడకలోనే వుండేవారు, నేను దాని ప్రక్కనే మోకాళ్లూని వారిని నా చేతుల్లోనికి తీసికొని ప్రార్థించేవాడిని, అటు తర్వాత వారు కూడ తరచూ ప్రార్థించేవారు. నన్ను ముద్దు పెట్టుకొని ‘నాన్నగారు, మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం’ అని చెప్పడం వారికి పరిపాటి, మరి అటు తర్వాత వారు వారి హృదయాలలో వున్నదేదో చెప్పేవారు. వారి పడకలోని ఉత్సాహాన్ని బట్టి, తండ్రి అప్యాయతలోని మధురానుభూతినిబట్టి వారు తీర్చుకోవలసిన వారి స్వంత సమస్యలనుగాని ప్రేమను వ్యక్తపరచాలనిగాని కొన్నింటిని చెప్పేవారు.”
భోజన సమయాల్లోను, ఇతర సమయాల్లోను నీ ప్రార్థన—అలవాటు చొప్పున చేసేదైవుండక—నీ హృదయంనుండి కృతజ్ఞతా పూర్వకంగా చేసే విన్నపమైతే, నీ పరలోకపు సృష్టికర్తయైన తండ్రితో నీకున్న నిజమైన వ్యక్తిగత బాంధవ్యాన్ని ప్రతిబింబించేదైతే అప్పుడు అది నీకును నీ 1 యోహాను 3:21; 4:17, 18.
సంతానానికి ఎనలేని పూర్ణానుబంధాన్ని కలిగిస్తుంది.—శరీరంలో మార్పులు వచ్చే వయస్సు
9. యౌవనస్థులకున్న సమస్యలు, అవసరాలను చిన్నపిల్లలకున్న వాటితో పోల్చినపుడు ఏమి చెప్పవచ్చు?
9 కౌమారదశ, శరీర మార్పులు కలిగే సమయం. ఇప్పుడు నీ కుమారుడు లేక కుమార్తె అటు పిల్లలు కాదు, ఇటు పెద్దలు కూడ కాలేదు. ఈ దశలో వారి శరీరాలు మార్పు చెందుతూవుంటాయి గనుక యీ మార్పులు వారి భావోద్రేకాలపై ప్రభావం కల్గివుంటాయి. ఈ కౌమారదశలో నున్నవారికి బాల్యదశలోనున్నవారికి, వారివారి సమస్యలు, అవసరతల విషయంలో తేడా వుంటుంది. కాబట్టి ఈ సమస్యలను, అవసరతలను తీర్చుటలో తలిదండ్రులు చేసే ప్రయత్నంలో మార్పుండాలి. ఎందుకంటే, బాల్యదశలో పని చేసినవి ఈ యౌవనదశలో పనిచేయవు. ఇప్పుడు అనేక కారణాలను తెలుపవలసి వుంటుంది. మరి దీనికి ఎక్కువ సంభాషణ అవసరమేగానీ తక్కువ మాత్రం కాదు.
10. (ఎ) యౌవనస్థులకు లైంగిక సంబంధమైన వాటిని గూర్చిన కొద్దిపాటి వివరాలెందుకు సరిపోవు? (బి) తలిదండ్రులు తమ పిల్లలతో లైంగిక సంబంధమైన చర్చనెలా ప్రారంభించవచ్చును?
10 చిన్నప్పుడు నీవు వారికి చెప్పిన లైంగిక సంబంధమైన వివరాలు ఇప్పుడు యౌవనస్థుల అవసరాలను తీర్చవు. వారి శరీరాలు లైంగిక కోరికలతో ఉరకలు వేస్తుంటాయి. అయితే భయంవలన వారి నాన్న లేక అమ్మదగ్గరకు వెళ్లి అడగలేరు. దీనికి తలిదండ్రులు చొరవ తీసుకోవాలి, మరి ఇదంత సులభమైందికాదు. తలిదండ్రులు, ముఖ్యంగా పిల్లలకు పనిలోను, ఆటపాటలలోను, స్నేహితులైయుండి వారిద్దరి మధ్య పరస్పర సంభాషణా సంబంధముంటేనే ఇది సాధ్యమౌతుంది. మగపిల్లవానికి వీర్యస్ఖలనాన్ని గూర్చి, ఆడపిల్లకు రుతుస్రావాన్ని గూర్చి ముందుగనే చెబితే వారు మానసిక స్థిమితం కల్గివుండగలరు. (లేవీయకాండము 15:16, 17; 18:19) ఎప్పుడైనా దారిలో నడిచేటప్పుడు తండ్రి తన కుమారునితో హస్తప్రయోగాన్ని గూర్చి మాట్లాడవచ్చు. చాలమంది యౌవనస్థులకు యీ విషయంలో ఏదో కొంతవరకైనా సమస్యవుంటుంది, మరి ‘ఈ విషయంలో నీవేమి చేస్తున్నావు?’ అనిగానీ ‘నీకది సమస్యగా వుందా?’ అనిగాని తండ్రి అతన్ని అడుగవచ్చును. కుటుంబ చర్చలలో కొన్నిసార్లు యౌవ్వనంలో వచ్చే సమస్యల గురించి మాట్లాడుతూ తలిదండ్రులిద్దరు తాపీగా, నిర్మొహమాటంగా వారితో చెప్పి, వారికి సలహా ఇవ్వడంలో తోడ్పడవచ్చును.
యౌవన దశలోనున్నవారి అవసరాలను అర్థం చేసికొనుట
11. యౌవనస్థులు ఏ విధంగా పెద్దలకు భిన్నంగా ఉంటారు?
11 “జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.” (సామెతలు 4:7) తలిదండ్రులుగా మీరు యౌవనస్థులైన మీ పిల్లల విషయంలో తెలివిగా మసలుకోండి; వారి మనోభావాల విషయంలో వివేచన కనబరచండి. మీరు యౌవనస్థులై యున్నపుడు మీకు ఆ దశ ఎలావుండెనో మరచిపోకండి. పెద్దవారైన ప్రతివారు ఒకనాడు యౌవనస్థులైయుండి, ఆ యౌవనమనగా ఏమిటో ఎరిగి యున్నందున, ఏ యౌవనస్థుడు కూడ ముందెప్పుడు ముసలివానిగా ఉండలేదని జ్ఞాపకముంచుకోండి. కౌమారదశలోని యౌవనస్థుడు పిల్లవానివలె చూడబడడం కోరుకొనడు; అయినను అతడు పెద్దవాడు కాదుగనుక పెద్దలకున్న ఆశలు అంతగా అతనికి వుండవు. అతనిలో ఇంకా ఆటలాడే స్వభావం ఎంతో వుంది, మరి దాన్ని తీర్చుకోవడానికి కొంత సమయం అవసరమేగదా.
12. యౌవనదశలోనున్నవారు, తమ తలిదండ్రులు వారినెలా చూడాలని కోరుకుంటారు?
12 జీవితంలో యీ దశలో, యౌవనస్థులు తమ తలిదండ్రుల నుండి ప్రత్యేకంగా ఆశించు కొన్ని సంగతులున్నాయి. వారిని తలిదండ్రులు అర్థం చేసికొనగోర్తారు. అన్నిటికంటే ముఖ్యంగా వారు వ్యక్తులుగా పరిగణింపబడాలని కోరుకుంటారు; తాము పెద్దవారుగా తయారు కావడానికవసరమగు మార్గదర్శకాలను నడిపింపును వారు కోరుకుంటారు. ఇతరులు, వారిని అవసరమైన వ్యక్తులని తలస్తూ, అభినందించాలని వారెంతో ఆశిస్తారు.
13. యౌవనదశలోనున్న పిల్లలు వారి తలిదండ్రులు పెట్టిన ఆంక్షలను ఎలా ఎదిరించవచ్చును, ఎందుచేత?
13 కౌమారదశలో, వారు నియమిత హద్దులు మీరుట కారంభిస్తారు గనుక తలిదండ్రులు దీనికి ఆశ్చర్యపడకూడదు. యౌవనస్థులు చివరకు
స్వతంత్రులై, వారి క్రియలలో అధికస్వేచ్ఛను కోరుకొనే కారణం వల్లనే వారలా హద్దులు ధిక్కరిస్తారు, నిస్సహాయులైన శిశువులకు తలిదండ్రుల నిత్యపరామర్శ అవసరం, చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా పరిరక్షించాలి. అయితే వారు ఎదిగేకొలది వారి పనులు అధికమౌతాయి, కుటుంబానికి వెలుపటి వారితో సంబంధం పెరిగి, బలపడుతుంది. కుమారుడు లేక కుమార్తె స్వతంత్రత కొరకు పోరాడడం కొంతవరకు కష్టతరంగా వుండవచ్చు. తలిదండ్రులు తమ అధికారాన్ని పిల్లలు అలక్ష్యపరచేలా గాని అధిగమించేలా గాని అనుమతించకూడదు—ఇది వారి పిల్లలకే క్షేమం, అయితే ఈ చెడు ప్రవర్తనకు నడిపేదేమిటో తలిదండ్రులు జ్ఞాపకముంచుకుంటే, వారు తెలివిగా ప్రవర్తించి, సంభాషణను కొనసాగించడానికి వీలౌతుంది.14. పిల్లవాడు అధిక స్వేచ్ఛను పొందాలనే కోరికతో తలిదండ్రులు ఎలా విజయవంతంగా వ్యవహరించగలరు?
14 వారి కుమారుడు లేక కుమార్తె యింకా అధికస్వేచ్ఛను కోరుతున్నట్లు గమనించినపుడు తలిదండ్రులేమి చేయాలి? వాంఛ అనేది చేతిలోనున్న ఒక స్ప్రింగును పోలియుంది. ఆ స్ప్రింగును ఒక్కసారే గట్టిగాలాగి వదలిపెడితే అదిపైకి ఎగిరి ఎక్కడో అనుకోని స్థలంలో పడిపోతుంది. అయితే దానిని గట్టిగా లాగి సాగదీయండి అప్పుడు నీవును అలసిపోతావు, దాని పటుత్వం తగ్గిపోతుంది. అయితే దాన్ని నిదానంగా లాగి వదలితే అది తిరిగి యథాస్థానానికి చేరుతుంది.
15. యేసు తాను పెద్దవానిగా పెరిగే దశవరకు తలిదండ్రుల నడిపింపు క్రింద వుండెనని ఏది చూపిస్తుంది?
15 స్వేచ్ఛకొరకు అదుపులో పెరిగిన అలాంటి మాదిరిని మనం బాలుడుగానున్న యేసునందు కనుగొంటాం. అతడు బాలుడైయుండగా, లూకా 2:40 నందున్న చారిత్రక వృత్తాంతం ప్రకారం, “బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.” తన తలిదండ్రులు ఆయన అభివృద్ధియందు ప్రముఖపాత్ర వహించారనుటలో సందేహం లేదు, ఎందుకంటే ఆయన పరిపూర్ణుడైనప్పటికిని జ్ఞానమనేది ఆయనకు దానంతటదే రాలేదు. ఆ వృత్తాంతమింకను తెల్పురీతిగా, వారాయనకు శిక్షణార్థమైన ఆత్మీయ వాతావరణాన్ని క్రమంగా ఏర్పాటు చేశారు. తన 12 ఏండ్ల ప్రాయంలో, ఆయన కుటుంబం యెరూషలేములో జరిగే పస్కాపండుగకు వెళ్లినపుడు, యేసు దేవాలయంలోనికి ప్రవేశించి అచ్చట మతబోధకులతో చర్చిస్తుండెను. తలిదండ్రులే, 12 ఏండ్లవయస్సున్న ఈయనను అలా స్వేచ్ఛగా వెళ్లటానికి అనుమతించారు. ఆయన బహుశ వచ్చిన స్నేహితులతో లేక బంధువులతో ఉన్నాడేమోనని తలంచిన కారణంగా, ఆయన విడువబడి ఉన్నాడన్న సంగతి గ్రహించకుండానే వారు యెరూషలేమునుండి బయలుదేరి వెళ్లిపోయారు. మూడు దినముల అనంతరం ఆయన దేవాలయంలో, పెద్దలకు బోధించడానికి ప్రయత్నించకుండ “వారి మాటలను ఆలకించుచు, వారిని ప్రశ్నలడుగుచుండగా” వారాయనను చూశారు. ఆయన తల్లి వారనుభవించిన మనోవేదనను గూర్చి తెల్పింది, మరి యేసు కూడ ఎట్టి అగౌరవాన్ని కనబరచకుండా, తాము తిరిగి వెళ్లడానికి సిద్ధపడినపుడు నిశ్చయంగా ఆయనను వారు వెదుకుతారనే దృష్టితో తానచ్చట ఉన్నానని ప్రత్యుత్తరమిచ్చాడు. ఆయన కొంతవరకు స్వేచ్ఛననుభవించినను, జరిగిన వృత్తాంతం తెలిపేదేమంటే, అప్పటినుండి యేసు “వారికి లోబడియుండి,” తాను యౌవనదశకు చేరుకొనబోవునపుడు వారి నడిపింపును అంగీకరించి, వారి ఆంక్షలకు అనుగుణంగా నడుచుకున్నాడు, మరియు ఆయన, “జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.”—లూకా 2:41-52.
16. కౌమారదశలోనున్న వారినుండి తలిదండ్రులు సమస్యలెదుర్కొన్నప్పుడు వారు దేనిని మనస్సునందుంచుకోవాలి?
16 ఆలాగే, తలిదండ్రులు కూడ యౌవనస్థులైన కుమారులు లేక కుమార్తెలకు కొంత స్వేచ్ఛనిస్తూ, వారు పెద్దవారయ్యేకొలది ఆ స్వేచ్ఛను క్రమేణి పెంచుతూ, తలిదండ్రుల నడిపింపు, తనిఖీ క్రిందవారు వారి స్వంత తీర్మానాలను క్రమేపి అభివృద్ధి చేసుకోవడానికి అనుమతించాలి. సమస్యలు వచ్చినపుడు, అవెందుకు వచ్చాయో గ్రహించుటవలన తలిదండ్రులు చిన్నవాటిని పెద్దవాటిగా చేయకుండ సహాయపడుతుంది. యౌవనస్థుడు బుద్ధిపూర్వకంగా అనేకమారులు ఎదురుతిరుగడు గానీ తన స్వేచ్ఛను వినియోగించే మార్గమేదో అతనికి తెలియక తన స్వేచ్ఛను స్థిరపరచుటకే ప్రయత్నిస్తాడు. తలిదండ్రులే బహుశ అసలైనవాటినిగాక వేరేవాటిని సమస్యలుగా మత్తయి 23:24.
మార్చి వారే పొరపాటు చేయవచ్చును. ఆ విషయం అంత తీవ్రమైంది కాకపోతే, దాన్ని ఆలాగే వదలివేయండి. అయితే అది తీవ్రమైనపుడు పట్టుదల వదలవద్దు. ‘దోమల్ని వడగట్టి, ఒంటెల్ని మ్రింగవద్దు.’—17. యౌవనస్థులైన పిల్లలపై ఆంక్షలు విధించేటపుడు తలిదండ్రులు ఏ విషయాన్ని లక్ష్యపెట్టాలి?
17 తలిదండ్రులు తాము నియమించిన ఆంక్షల యెడల సమదృష్టిని చూపుటమూలంగా వారు తమ యౌవనస్థులైన కుమారులు, కుమార్తెలతో శ్రేష్ఠమైన సంబంధాన్ని కలిగివుండటానికి తోడ్పడగలరు. “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది,” అయినను అది “మృదువైనది,” “కనికరముతో . . . నిండుకొనినది” మరియు ‘పక్షపాతము లేనిది,’ అని జ్ఞాపకముంచుకోండి. (యాకోబు 3:17) దొంగతనం, వ్యభిచారం, విగ్రహారాధన మరియు అలాంటి తీవ్రమైన తప్పులతో సహా పూర్తి అనంగీకారమైన కొన్ని క్రియలున్నాయని బైబిలు తెలియజేస్తుంది. (1 కొరింథీయులు. 6:9, 10) ఇతర అనేక విషయాలను పొందుపరచడంవలన, ఒక విషయం సరియైనదా కాదాయనుట, దానినెంతవరకు తీసుకొని వెళ్తున్నాము, లేక ఎలాదాన్ని పొడిగిస్తున్నామనే దానిపై ఆధారపడి వుంది. ఆహారం మంచిదేగానీ అధికంగా తింటే మనం తిండిబోతులమౌతాం. ఆలాగే కొన్ని వినోదాలు అనగా నాట్యం, ఆటలు, విందులు లేక ఇలాంటివి కూడ అంతే. అనేకసార్లు ఏమి జరిగిందని అనే బదులు అదేలా జరిగింది, ఎవరితో కలిసినపుడు జరిగిందని విచారించాలి. కావున, తిండిబోతు అన్నపుడు తినడాన్ని ఎలా ఖండించమో అలాగే తలిదండ్రులు, యౌవనస్థుల క్రియలు మితిమీరినప్పుడు లేక కొందరు హద్దు దాటినపుడు లేక కొన్ని అయిష్టమైన పరిస్థితులెదుర్కొన్నపుడు, వారు చేసిన వాటినన్నిటిని పూర్తిగా ఖండించడానికి కోరుకొనరు.—కొలొస్సయులు 2:23 పోల్చండి.
18. స్నేహితుల విషయంలో తలిదండ్రులు తమ పిల్లలకెలా హెచ్చరిక నివ్వవచ్చు?
18 యౌవనస్థులందరు స్నేహితులను కల్గియుండాలని ఆశిస్తారు. వారిలో కొందరే “తగినవారిగా” పరిగణింపబడ వచ్చును, కానీ నీ పిల్లలలో బలహీనతలు లేవా? కొందరు యౌవనస్థులు చెడ్డవారనే దృష్టితో వారి సామెతలు 13:20; 2 థెస్సలొనీకయులు 3:13, 14; 2 తిమోతి 2:20, 21) మిగతావారిలో నీకిష్టమైన క్రియలనుగాని నీకిష్టంలేని వాటినిగాని నీవు గమనించవచ్చు. కొన్ని లక్షణాలు కొరతగా వున్నందున ఒకరిని పూర్తిగా దూరం చేసేబదులు, నీ పిల్లల స్నేహితులకున్న సద్గుణాలను మెచ్చుకోండి. బలహీనమైనవాటిని చూపి వాటి విషయంలో జాగ్రత్తగా వుండాలని నీవు చెప్పవచ్చును. ఆ మంచి లక్షణాలను బలపరచే వ్యక్తులుగా నీ కుమారుడు లేక నీ కుమార్తె వారి స్నేహితుల నిత్యక్షేమంకై పాటుపడాలని వారిని ప్రోత్సహించవచ్చు.
స్నేహం చేయకుండ నీ పిల్లలను దూరంగా వుంచడానికి నీవు కోరుకోవచ్చు. (19. లూకా 12:48 నందలి సూత్రానికి అనుగుణంగా, పిల్లలు స్వేచ్ఛను గూర్చి సరియైన దృక్పథాన్ని కల్గివుండడానికి ఎలా సహాయపడాలి?
19 నీ యౌవన కుమారుడు లేక కుమార్తె వారికి పెరుగుతున్న స్వేచ్ఛ ఎడల సరియైన అభిప్రాయం కల్గియుండడానికి సహాయపడడంలో గల ఒక మార్గమేదనగా, ఆ స్వేచ్ఛతోపాటు వారికి బాధ్యత కూడ పెరుగుతుందని వారు గ్రహించేలా వారికి తోడ్పడటమే. “ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు.” (లూకా 12:48) పిల్లలు ఎంత ఎక్కువ బాధ్యత కనబరిచితే, తలిదండ్రులు వారిని అంత అధికంగా నమ్ముతారు.—గలతీయులు 5:13; 1 పేతురు 2:16.
సరిదిద్దుటను, సలహాను గూర్చి తెలియజేయుట
20. సంభాషణ సంబంధం విచ్ఛిన్నం కాకుండ ఆపడానికి అధికారం లేక శక్తితోపాటు మరేమి కూడ అవసరం?
20 నీ పరిస్థితిని అర్థము చేసికొనక ఒకడు నీకు సలహా ఇస్తే అతని సలహా నిష్ప్రయోజనమని నీవు భావిస్తావు. తాను చెప్పినట్లే చేయమని అతడు నిన్ను బలవంతపెడితే అది అన్యాయమని నీవు ఎదిరిస్తావు. తలిదండ్రులు జ్ఞాపకముంచు కోవలసిందేమంటే, “బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును” మరియు “తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.” (సామెతలు 15:14; 24:5) నీ పిల్లలపై నీకు అధికారముండవచ్చు, అయితే దాన్ని నీవు జ్ఞానంతో, వివేకంతో అమలు పరిస్తే, అంతకంటె యింకా, బాగుగా వారితో సంభాషించగలవు. యౌవనస్థులను సరిదిద్దేటపుడు వివేచన కనబరచకపోతే అది “వారిద్దరి మధ్య విఘాతమేర్పరచి” సంభాషణా సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.
21. తీవ్రమైన తప్పులలో చిక్కుకొనిన పిల్లలను తలిదండ్రులెలా చక్కదిద్దవలెను?
21 నీకు ఆశ్చర్యం గొలిపేరీతిగా నీ కుమారుడు ఇరుకులలో పడి, ఒక తీవ్రమైన పొరపాటు లేక ఏదొక తప్పుచేస్తే నీవేమి చేస్తావు? నీవు తప్పును మన్నించి ఊరుకోవు. (యెషయా 5:20; మలాకీ 2:17) ఇప్పుడే నీ కుమారునికి లేక నీ కుమార్తెకు గ్రహణశక్తి, సహాయం మరియు నేర్పుతోకూడిన నడిపింపు అవసరమని తెలిసికోండి. యెహోవా దేవుడు చెప్పినట్లే నీవును ఇలా అనవచ్చును, ‘రండి, మనము సంగతులను చక్కపెట్టుకుందాం; పరిస్థితి విషమించింది, అయినా మించిపోయిందేమీ లేదు.’ (యెషయా 1:18) కోపంతో పెడబొబ్బలు పెట్టడం లేక కఠినంగా ఖండించుట మొదలైనవి, ఇరువురి మధ్య సంభాషణా సంబంధాన్ని నిరోధించవచ్చును. తప్పులు చేసే యౌవనస్థులందరు ఇలా అన్నారు: ‘నేను నా తలిదండ్రులతో మాట్లాడలేకపోయాను—వారెంతో కోపపడియుండేవారు.’ ఎఫెసీయులు 4:26 ఇలా చెబుతుంది: “నీకు కోపము వస్తే, ఆ కోపం పాపం చేసేంతగా నిన్ను నడుపనీయవద్దు.” (న్యూ ఇంగ్లీష్ బైబిల్) నీ కుమారుడు లేక నీ కుమార్తె చెప్పే విషయాన్ని నీవు వినేటప్పుడు, నీలోని ఆవేశాలను అణుచుకోవాలి. అప్పుడు వారు నీవు సావధానంగా వినుటవల్లనే వారిని సరిదిద్దుతున్నావు గనుక వారు దాన్ని సులభంగా సమ్మతిస్తారు.
22. పిల్లలు, ఇక తాము విడువబడినవారమనే భావనను వారికెందుకు ఎన్నటికీ కల్గించకూడదు?
22 బహుశ ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాకపోవచ్చును కానీ దీర్ఘకాలంగా జరిగేది, ఏదో ఒక అవలక్షణం కనబరచేదై వుండవచ్చును. శిక్ష అవసరమైనను, మాటద్వారా గాని వారి ప్రవర్తనద్వారా గాని వారు ఇక ఎన్నటికి పిల్లవాని విషయం పట్టించుకోవడం లేదని కనబరచకూడదు. మీ దీర్ఘశాంతం మీకున్న ప్రగాఢ ప్రేమకు గుర్తు. (1 కొరింథీయులు 13:4) కీడును కీడుతో జయించక, మేలుతో జయించండి. (రోమీయులు 12:21) వాడు “సోమరి,” “తిరుగుబాటు చేసేవాడు,” “పనికిమాలినవాడు,” లేక “నిష్ప్రయోజకుడు” అని యౌవనస్థుని ఇతరుల ఎదుట అవమానిస్తే హాని తప్ప మరేమి ప్రయోజనం కలుగదు. ప్రేమ నిరీక్షించుట మానదు. (1 కొరింథీయులు 13:7) ఒక యౌవనుడు నేరాలు చేసేవాడిగా తయారై, ఇల్లు విడిచి వెళ్లిపోవచ్చు. ఈ క్రియను ఎటూ సమ్మతించక పోయినా వాడు ఇంటికి తిరిగివచ్చేలా తలిదండ్రులు వీలు కల్గించాలి. ఎలా? వారు అతని తప్పునే తిరస్కరిస్తున్నారు గానీ అతన్ని కాదని తెలుపుటద్వారానే ఇలా చేయవచ్చు. అతనిలో సద్గుణాలున్నాయని, అవి ఏనాటికైనా తన మంచికే పనిచేస్తాయనే తమ విశ్వాసాన్ని వారతనికి తెలుపవచ్చు. అదే నిజమైతే, అతడు యేసు చెప్పిన ఉపమానంలోని తప్పిపోయిన కుమారునివలె ఇంటికి తిరిగి రాగలడు. పశ్చాత్తాపపడి తాను ఇంటికివస్తే, తలిదండ్రులు అతన్ని కఠినంగా చూడరని లేక నిరుత్సాహంగా చూడరనే అభయంతో తిరిగి వస్తాడు.—లూకా 15:11-32.
తామూ యోగ్యులనే భావన
23. యౌవనస్థులు కుటుంబంలో తాము యోగ్యులైన సభ్యులని భావించుట ఎందుకు ముఖ్యం?
23 ప్రతి మానవుడు ఏదో ఒక రీతిగా గుర్తింపబడి, అంగీకరింపబడి, సమ్మతింపబడి, వారూ కావలసిన వారేనని భావించవలసిన అవసరముంది. అవసరమైన అంగీకారాన్ని, సమ్మతిని కల్గియుండటానికి ఒకడు పూర్తిగా స్వతంత్రుడుగాలేడు. తనకు సంబంధించిన గుంపువలన అంగీకరించబడిన ప్రవర్తనా హద్దుల్లోనే వుండాలి. యౌవనులైన యువతీయువకులు తాము కుటుంబానికి అవసరమైనవారమని అనుకుంటారు. వారు కుటుంబ వలయంలో యోగ్యులైన సభ్యులని, దాని క్షేమానికే దోహదకారులని వారు భావించేలా చేయడం, కుటుంబంలో వేసే కొన్ని పథకాలలోను తీర్మానాలు చేయుటలో వారికి భాగమునిస్తూ వుండుట మంచిది.
24. ఒకడు మరొక పిల్లవానినిబట్టి మత్సరపడకుండునట్లు తలిదండ్రులు ఏమిచేయుట మానుకోవాలి?
24 “ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు, వృథాగా అతిశయపడకయు ఉందము,” అని అపొస్తలుడు అంటున్నాడు. (గలతీయులు 5:26) తన కుమారుడు లేక కుమార్తె ఒక పనిని బాగా చేసినపుడు తండ్రి దాన్ని మెచ్చుకుంటే అది వారిలో పోటీ స్వభావాన్ని పెంచకుండ ఆపగలదు, అయితే తరచూ గొప్ప వాడని పొగడ్తలందుకునే పిల్లవానితో ఇతన్ని పోల్చితే యీ పిల్లవానికి ఈర్ష్య లేక అయిష్టత కలుగుతుంది. అపొస్తలుడు తెల్పినదేమంటే, ప్రతివాడును “తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును.” (గలతీయులు 6:4) తానేమైయున్నాడో తానెవరైయున్నాడో, తానేమి చేయగలడోననే విషయాన్ని గుర్తించాలని యౌవనస్థుడు కోరుకుంటూ, ఈ విషయాలనుబట్టి తలిదండ్రులు తనను ప్రేమించాలని కోరుకుంటాడు.
25. తమ పిల్లలు యోగ్యులని వారే భావించేలా తలిదండ్రులు వారికెలా సహాయపడవచ్చు?
25 తలిదండ్రులు తన కుమారునికి లేక కుమార్తెకు జీవితంలోని అన్ని రంగాల్లో బాధ్యత వహించేలా వారికి తోడ్పడవచ్చు. వారు, తమ పిల్లలకు బాల్యం నుండి యథార్థత, సత్యసంధత, మరియు ఇతరులను గౌరవించే విషయాల్లో తర్ఫీదునిస్తూ వచ్చారు; మరి యీ లక్షణాలను మానవ సమాజంలో ఎలా వర్తింపజేయాలో వారికి చూపిస్తూ గతంలోవేసిన యీ పునాది మీదనే వారిని వృద్ధిచేయాలి. ఉద్యోగ బాధ్యత నిర్వహించే పద్ధతి, దానిపై ఆధారపడవలసిన రీతి ఇందులో ఇమిడివున్నాయి. యేసు, ‘జ్ఞానమందు ఎదుగుచున్నపుడు,’ యౌవనస్థునిగా, తనను పెంచిన తండ్రియైన యోసేపునొద్ద వడ్రంగి పనిని నేర్చుకున్నాడు, ఎందుకంటే తాను 30 సంవత్సరాల వయస్సుగలవాడై తన రాజ్య పరిచర్యలో పాల్గొంటున్ననూ, ప్రజలు ఇంకను ఆయనను “వడ్లవాడు” అని సంబోధించారు. (మార్కు 6:3) యౌవనదశలో, ప్రత్యేకంగా మగపిల్లలు చిన్న చిన్న పనులైనా సరే, అప్పగించబడిన పనిచేయడానికి, యజమానునిగాని, కొనుగోలుదారునిగాని మెప్పించడానికి నేర్చుకోవాలి, వారు బాగుగా కష్టపడి పనిచేస్తూ నమ్మకమైన పనివారిగా వుండడంవలన వారు తమకు తాము ఆత్మగౌరవాన్ని, ఇతరుల మన్నన అభినందనలు పొందగలరని తలిదండ్రులు పిల్లలకు నేర్పవచ్చును; అలా వారు వారి కుటుంబానికి తలిదండ్రులకు ఘనత తెచ్చేవారేగాక “మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించు” వారౌతారు.—తీతు 2:6-10.
26. కుమార్తె కుటుంబంలో యోగ్యురాలని పూర్వమున్న ఏ ఆచారం ఒప్పుకుంటుంది?
ఆదికాండము 34:11, 12. నిర్గమకాండము 22:16.
26 కుమార్తెలు కూడ ఇంటిని అమర్చుటలోను, ఇంటి పనులలోను నేర్పరితనాన్ని సంపాదించి ఇంట, బయట మెప్పును ఘనతను పొందవచ్చును. బైబిలు కాలంలో, స్త్రీకి వివాహమైనపుడు లేక ఓలి తీసికొనునపుడు, ఆచారాన్నిబట్టి కుటుంబంలో ఆమె విలువ ఎంతో గుర్తింపబడేది. ఆమె కుటుంబానికి చేసినసేవ ఇక వారికి లభించదు గనుకనే ఆనాడు వారామె సేవకు బదులు ఓలిని స్వీకరించేవారు.—27 విద్యావకాశాలను మంచి ప్రయోజనముల నిమిత్తం ఎందుకు వినియోగించాలి?
27 ప్రస్తుత విధానమందు జీవితంలోవచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి వీలుగా విద్యావకాశాలను వారు సద్వినియోగం చేసికొనేలా వారికి సహాయపడాలి. అపొస్తలుడిచ్చిన ప్రోత్సాహంలో అలాంటి చిన్న వారు ఇమిడియున్నారు. “మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్ క్రియలను [యథార్థమైన ఉద్యోగం, న్యూ ఇంగ్లీష్ బైబిల్] శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.”—తీతు 3:14.
బైబిలు నీతి చట్టంవలన పరిరక్షణ
28, 29. (ఎ) బైబిలు, సహవాసాన్ని గూర్చి ఎటువంటి హెచ్చరిక ఇస్తుంది? (బి) ఈ హెచ్చరికను పిల్లలు లక్ష్యపెట్టేలా వారికి తలిదండ్రులు ఎలా సహాయపడగలరు?
28 పిల్లలు నివసించే ప్రాంతంలోని ఇరుగు పొరుగువారిలోగాని, లేదా వారు వెళ్లే పాఠశాలనందున్న వారిలోనేగానీ ఎవరైనా నేరస్థులై, స్వనాశనపరులైయున్న స్నేహితులు ఉంటే అలాంటి వారితో తమ పిల్లలుచేసే సహవాసం విషయంలో తలిదండ్రులెంతో జాగ్రత్త వహించవలసిన అవసరముంది. తలిదండ్రులు “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును,” అనే బైబిలు వాక్యంలోని వాస్తవాన్ని గుర్తెరుగుట మంచిదేమో. అందువల్ల వారు, ‘అందరు పిల్లలు అలా చేస్తున్నారుగదా నేనెందుకు చేయకూడదు?’ అని ఏదో సాకుచెప్పి వాదించే పిల్లవాని కోరికను సమ్మతించడానికి తలిదండ్రులు అయిష్టపడతారు. బహుశ అందరూ అలాగ చేయరు, ఒకవేళ చేస్తే, అది తప్పే అయితే లేక తెలివిమాలిన పనియైతే నీ పిల్లవాడు దాన్ని చేయడం మంచిదికాదు గదా. “దుర్జనులను [లేక చెడ్డ పిల్లలను] చూచి 1 కొరింథీయులు 15:33; సామెతలు 24:1-3.
మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును. జ్ఞానమువలన ఇల్లు కట్టబడును, వివేచనవలన అది స్థిరపరచబడును.”—29 పాఠశాలలోగాని జీవితంలోగాని నీ పిల్లలవెంట పరుగెత్తలేవు. అయినను, నీ కుటుంబాన్ని జ్ఞానం చొప్పున వృద్ధిచేస్తూ, శ్రేష్ఠమైన నైతికచట్టాన్ని, నడిపింపుకొరకు నీతి సూత్రాలను వారికి నీవు అందించగలవు. “జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలె” నున్నవి. (ప్రసంగి 12:11) పూర్వం యీ ములుకోలలు ఏమంటే, పెద్ద పొడవాటి కర్రకు సూదిమొనవంటి పదునైన కొనకల్గియున్న ముల్లు కర్రలు. పశువులు దారిలో తిన్నగా నడవడానికి వాటిని యీ ములుకోలలతో పొడిచేవారు. దేవుడు చెప్పే జ్ఞానయుక్తమైన మాటలు మనం సన్మార్గంలో నడవడానికి సహాయపడతాయి, ఒకవేళ మనం తప్పిపోతే మన మార్గాన్ని మనం మార్చుకోవడానికి మన మనస్సాక్షి మనలను గద్దించేలా అవి పురికొల్పుతాయి. నీ పిల్లల క్షేమం నిమిత్తం వారితో పాటు దీన్ని తీసికొనిపోయేలా వారికి జ్ఞానాన్ని అందించండి. దానిని నీ మాటల ద్వారాను మాదిరిద్వారాను వారికి తెలియపరచండి. వాస్తవ విలువలను వారిలో నెలకొల్పండి, అప్పుడు నీ పిల్లలు వారి స్నేహితులుగా కోరుకొను వ్యక్తులలో దాన్ని వెదకుతారు.—కీర్తన 119:9, 63.
30. తలిదండ్రులు వారి పిల్లలకు దేవుడిచ్చిన నైతిక చట్టాన్ని ఎలా ఏర్పాటు చేయగలరు?
30 ఆ సూత్రాలను గౌరవించి వాటిని పాటించే పరిస్థితి కుటుంబంలో వుండాలంటే అన్నిటికంటె ప్రాముఖ్యంగా నైతికవిలువలను వారిలో నాటాలనే సంగతి జ్ఞాపకముంచుకొనండి. నీ పిల్లల్లో ఎలాంటి స్వభావముండాలని నీవు కోరుకుంటావో అలాంటి స్వభావాన్ని నీవు కల్గియుండాలి. నీ స్వగృహంలో, నీ కుటుంబంలోని పెద్దవారు నీ పిల్లలను అర్థం చేసికొని, ప్రేమించి, క్షమించి, కొంతవరకు స్వేచ్ఛనిచ్చి, వారు అవసరమైనవారనే తలంపును కల్గియుండేలా వారిని తయారు చేయండి. ఈ మార్గముల చొప్పున నీవు వారికి దేవుడిచ్చిన నీతిచట్టాన్ని అందిస్తే కుటుంబ వలయాన్ని విడిచిపోయేటప్పుడు వారు వాటిని తమ వెంట కొనిపోతారు. నీవు అంతకంటె శ్రేష్ఠమైన స్వాస్థ్యమును వారికివ్వలేవు.—సామెతలు 20:7.
[అధ్యయన ప్రశ్నలు]