“పరిపూర్ణతకు అనుబంధమైన” ప్రేమ
అధ్యాయము 6
“పరిపూర్ణతకు అనుబంధమైన” ప్రేమ
1-6. (ఎ) వివాహదంపతులు వారి స్వంత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే ఏమి సంభవిస్తుంది? (బి) లేఖనములందలి ఏ సూత్రాలను లక్ష్యపెట్టడంవలన, తీవ్రమైన వాగ్వివాదాలను ఆపగలరు?
‘మనమెందుకు ఎప్పుడూ రాత్రిపూట సమయానికి భోంచేయము?’ అని అంటూ భర్త పళ్ళునూరుతున్నాడు, దినమంతా కష్టపడి పనిచేసి వచ్చిన తర్వాత చాలాసేపు వేచియుండే అలా అన్నాడు.
2 ‘ఎప్పుడూ నీకు సూటిపోటిమాటలే, అంతా తయారైంది’ అని భార్య వెంటనే అంది. ఆమెకు కూడ దినమంతా కష్టము లేకపోలేదు.
3 ‘కానీ నీవెప్పుడూ ఆలస్యమే చేస్తావుగదా, ఎప్పుడూ సమయాని కెందుకు చేయలేవు?’
4 ‘అది అబద్ధం!’ అని పెద్దగా అరచింది. ‘ఏదో ఒకనాడు నీవూ పిల్లలను చూస్తూ, యీ పనులన్నీ చేస్తే అప్పుడు నీవంత చిటపటలాడవు. వారు నీకు కూడ పిల్లలేగదా!’
5 ఈ విధముగా భార్య భర్తల మధ్య యీ చిన్నకొండ పెద్ద పర్వతంగా పెరిగి ఇరువురు కోపోద్రేకులై ఒకరితోనొకరు మాట్లాడుకోరు. ఇద్దరూ ఒకరినొకరు నిందించుకుంటూ చివరకు ఇద్దరూ బాధపడుతు, తిరస్కార భావంతో ఆ రాత్రిపూట భోజనం చేయకుండా అలా పాడుచేశారు. వారిద్దరిలో ఎవరో ఒకరు పరిస్థితిని అదుపులోపెట్టి యుండేవారే. ఇద్దరికిద్దరు వారివారి స్వంతభావాలను సమర్థించుకున్నారు. అరుపులతో ఘర్షణపడ్డారు.
మత్తయి 5:39 రోమీయులు 12:17, 21) దీనిని చేయాలంటే నిగ్రహశక్తి, పరిపక్వత అవసరం. దీనికి క్రైస్తవ ప్రేమ కావాలి.
6 అలాంటి సమస్యలు అనేక రూపాలలో రావచ్చు. డబ్బు విషయంలో కావచ్చు. లేదా తన భార్య తననెప్పుడూ అంటిపెట్టుకుంటూ ఇతరులతో స్నేహం చెయ్యనివ్వదని భర్త భావించవచ్చు. భార్యయైతే తన భర్త తనను లక్ష్యపెట్టడంలేదనే నిర్ణయానికి రావచ్చు. పెద్ద సమస్యవలన గాని అనేక చిన్న చిన్న వాటి వల్లగాని ఉద్రేకం కలుగవచ్చు, కారణమేదైననూసరే ప్రస్తుతం పరిస్థితినెలా చక్కబెట్టుకోవాలో మనమాలోచించాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు, తన ‘మరొక చెంపనుకూడ ఇటు త్రిప్పుటకు’ ఇష్టపడుటద్వారా, ‘కీడుకు ప్రతికీడు చేయకుండుటకు’ ఇష్టపడుటద్వారా మరియు ‘మంచివలన కీడును జయిస్తూ’ సమస్య పెద్దదికాకుండ చేయగలరు. (ప్రేమ అంటే నిజమైన భావమేమిటి?
7-9. (ఎ) మొదటి కొరింథీయులు 13:4-8 నందు ప్రేమ ఎలా వర్ణించబడింది? (బి) ఇది ఎటువంటి ప్రేమ?
7మొదటి కొరింథీయులు 13:4-8 లో యెహోవా దేవుడు ప్రేమ అనగా ఏమిటో, ఏమికాదో ప్రేమకు నిర్వచనాన్ని ప్రేరేపించి వ్రాయించాడు: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.”
8 ప్రేమ అనేక విషయములపై ఆధారపడి యుండవచ్చు—శరీర ఆకర్షణ, కుటుంబ బంధుత్వం లేదా ఇతరుల సహవాసం వలన కల్గిన పరస్పర అనుభవం మీద ఆధారపడవచ్చును. అయితే బైబిలు తెల్పేదేమంటే, దాని విలువను నిజంగా పొందాలంటే ప్రేమ అనేది అనురాగం లేక పరస్పర ఆకర్షణకంటె యింకా మించిపోయి, అది ప్రేమింపబడే వ్యక్తియొక్క శాశ్వత శ్రేయస్సు కొరకు వుపయోగపడాలి. అటువంటి ప్రేమ, తలిదండ్రులు పిల్లలను హెబ్రీయులు 12:6) నిజమే, బాధలు భావోద్రేకాలున్నాయి, కానీ అవి జ్ఞానయుక్తమగు తీర్పును లేక ఇతరులతో వ్యవహరించేటప్పుడు నీతి సూత్రాలను అధిగమించకూడదు. అట్టి ప్రేమ అందరిని జాలి, మర్యాద అనే శ్రేష్ఠమైన లక్షణములతో చూచేట్లు నడుపుతుంది.
లేదా యెహోవా దేవుడు తన ఆరాధికులను గద్దించునట్లు, లేదా శిక్షించురీతిగా కూడ చూపబడుతుంది. (9 అది మన కుటుంబ జీవితానికెలా అతిప్రయోజనకారి కాగలదో సంపూర్తిగా దాని విలువను గుణగ్రహించుటకు మనం 1 కొరింథీయులు 13:4-8 నందివ్వబడిన నిర్వచనాన్ని యింకా వివరంగా పరిశీలిద్దాం.
10, 11. దీర్ఘశాంతము, దయగల్గిన వివాహ జతనుండి మనమేమి అపేక్షిస్తాము?
10 “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును.” నీవు నీ జత ఎడల దీర్ఘశాంతం కల్గియున్నావా? కోపం కల్గించే పరిస్థితి రావచ్చు, బహుశ తగని అపనిందలు మోపవచ్చు, అప్పుడు నీవు నిగ్రహించుకొంటావా? యెహోవా దేవుడు మనందరి ఎడల దీర్ఘశాంతం కల్గియున్నాడు, మరియు ‘దేవుని అనుగ్రహం ప్రజలు మారుమనస్సు పొందేలా ప్రేరేపిస్తుంది.’ దీర్ఘశాంతం, దయ అను యీ రెండును దేవుని ఆత్మఫలములే.—రోమీయులు 2:4; గలతీయులు 5:22.
11 ప్రేమ తప్పును ప్రోత్సహించదు, అయితే అది తప్పును “బహిర్గతం” చేయదు. దానికి అసహనములేదు. అది దుర్భలమగు పరిస్థితులను గమనిస్తుంది. (1 పేతురు 4:8; కీర్తన 103:14; 130:3, 4) గొప్పతప్పులను కూడ క్షమించడానికి సిద్ధంగా ఉంటుంది. అపొస్తలుడైన పేతురు తాను యేసును యీ విధంగా అడిగినపుడు తాను దీర్ఘశాంతం కల్గియున్నట్లే భావించి యుండవచ్చు. “నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? ఏడుమారుల మట్టుకా?” అందుకు యేసు అతనితో, “ఏడుమారులు మట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని” అనెను. (మత్తయి 18:21, 22; లూకా 17:3, 4) ప్రేమ పలుమారులు మన్నించి, అనంతరం దయ చూపిస్తుంది. నీవునూ అలాగే చేస్తున్నావా?
12, 13. మత్సరమెలా బయటపడవచ్చు, దానిని ఒక కంట కనిపెట్టుటకు ఎందుకు ప్రయత్నించాలి?
12 “ప్రేమ మత్సరపడదు.” సరియైన కారణం లేకుండా మత్సరపడే జతతో కాపురంచేయుట కష్టమే. అట్టి మత్సరం అనుమానాస్పదమైంది, అమిత స్వార్థంతో కూడింది. అది ఆటకాయ పిల్లలవంటిది మరియు అది ఒకడు ఇతరులతో సహజంగా స్నేహభావంతో మెలగకుండ ఆటంకపరచేది. ఆనందం అనేది స్వేచ్ఛగా ఇచ్చుటలోనే గానీ మత్సరంతో కూడిన అధికారాన్ని చెలాయించుటలో కనబడదు.
13 “రోషము ఎదుట ఎవడునిలువగలడు?” అని బైబిలు అడుగుతుంది. అది అసంపూర్ణమైన శరీరక్రియలలో ఒకటి. (సామెతలు 27:4; గలతీయులు 5:19, 20) ఏ భద్రతలేదనే భావంతో ఊహించబడిన దాన్ని బట్టి కల్గిన యిలాంటి మత్సరం యొక్క గుర్తులేవైనా నీలో వున్నవేమో నిన్ను నీవు పరిశీలించుకొనియున్నావా? ఇతరుల తప్పులు గమనించడం అంత కష్టమేమీకాదు, గాని మనలను మనం పరీక్షించుకుంటే అది మనకు ఎక్కువ ప్రయోజనం కల్గిస్తుంది, “ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.” (యాకోబు 3:16) మత్సరం వివాహాన్ని విచ్ఛిన్నం చేయగలదు. మత్సరంతో కూడిన ఆంక్షలవల్ల నీ జతను అదుపులో పెట్టలేవుగాని ప్రేమతో కూడిన శ్రద్ధ, జాలి, నమ్మకముల మూలంగా అదుపులో పెట్టవచ్చును.
14, 15. (ఎ) డంబంగా ప్రవర్తించడం ఎలా ప్రేమలేనితనాన్ని కనబరుస్తుంది? (బి) తన జతను అవమానించే బదులు తానేమి చేయాలి?
14 ప్రేమ “డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు.” అనేకులు డంబాలు పలుకుట వాస్తవమేగానీ డంబాలను కొద్దిమంది మాత్రమే వినుట కిష్టపడతారు. నిజానికి, డంబాలు చెప్పుకొనేవారిని గూర్చి ఎరిగియున్న ఏవ్యక్తినైననూ అది కలవరపరచ వచ్చు. కొందరు తమను గూర్చి గొప్పగా చెప్పుకుంటూ డంబాలు పలికితే ఇతరులు దాన్నే మరో విధంగా చేస్తారు. వారు ఇతరులను విమర్శించి, హేళన చేస్తారు, ఇలాంటి క్రియ, వారు విమర్శించిన వారికంటె, వీరిని గొప్పచేసే అవకాశం కల్గిస్తుంది. కావున ఒకడు ఇతరులను హీనపరచుటద్వారా, తన్నుతాను హెచ్చించుకుంటాడు, జతను హీనపరచుట నిజంగా తన్నుతాను గొప్పగా చెప్పుకున్నట్లే అవుతుంది.
సామెతలు 27:2 నందున్న హెచ్చరికను పాటించు: “నీ నోరుకాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడనివ్వండి.”—రివైజ్‌డ్ స్టాండార్డ్ వర్షన్.
15 నీవెప్పుడైనా బహిరంగంగా అందరిలో నీజత చేసిన తప్పులను గూర్చి మాట్లాడావా? నీ జత ఏమనుకొనెనని నీవు తలస్తావు? నీతప్పులనే బయట పెడితే నీకెలా వుంటుంది? నీవేమనుకొని యుందువో? ప్రేమించబడినవనుకొంటావా? లేదుకదా, తనను గొప్పగా చేసికొనుటవల్ల గానీ ఇతరులను కించపరుచుటవల్ల గానీ ప్రేమ “డంబముగా ప్రవర్తింపదు.” నీ జతను గూర్చి మాట్లాడేటప్పుడు, క్షేమాభివృద్ధికరమగు వాటినే మాట్లాడు, అది మీ ఇరువురి మధ్యగల అనుబంధాన్ని పటిష్ఠం చేస్తుంది. నీ విషయంలోనైతే16. ప్రేమగల వ్యక్తి చేయకూడని అమర్యాదకరమైన కొన్ని క్రియలేవి?
16 ప్రేమ “అమర్యాదగా నడువదు.” నిశ్చయంగా అమర్యాదతో కూడినవి అనేకాలున్నవి అనగా, వ్యభిచారం, త్రాగుబోతుతనం కలహం మొదలైనవి. (రోమీయులు 13:13) ప్రేమతో పోల్చితే ఇవన్నీ వివాహ సంబంధాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగరుబోతుతనం, బూతులు, దుష్క్రియలు, శరీర శుభ్రతను అలక్ష్యం చేయడం, మొదలైనవన్నీ అమర్యాదను సూచిస్తాయి. ఈ విషయంలో నీ జతకు అభ్యంతరం కలుగకుండ చూచుకోవడానికి నీవెంత జాగ్రత్తపడుతున్నావు? అతనిని లేక ఆమెను దయతో, మంచి మర్యాదతో, గౌరవంతో చూస్తావా? ఇవన్నీ చేసినపుడు వివాహం సంతోషభరితంగాను, సహనంతో కూడిందిగాను తయారౌతుంది.
17. తన స్వప్రయోజనాన్ని చూచుకొనని వ్యక్తి ఎలా కలహాలు రాకుండ చేయవచ్చును?
17 ప్రేమ “స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు.” అది స్వప్రీతిగలది కాదు. ఈ అధ్యాయం మొదటి భాగంలో తెలుపబడిన దంపతులు అలావుంటే ఎంత బాగుంటుంది. రాత్రి భోజనం ఆలస్యమైనందుకే భర్త చిరచిరలాడి వుండేవాడుకాడు, భార్య తిరిగి సమాధాన మిచ్చివుండేది కాదు. ఆయన అలసిపోయినందుకే అంతకోపంతో వున్నాడని భార్య గ్రహించివుంటే, ఆమె ఆవేశపడే బదులు ఇలా సమాధానమిచ్చి యుండేది: ‘భోజనం దాదాపు తయారైందండీ. మీరీ రోజు చాలా కష్టపడి
యుండొచ్చు, తాగటానికి మీకు ఒక గ్లాసు చల్లని రసం ఇస్తాను. ఇంతలో బల్లమీద అన్నీ సిద్ధం చేసిపెడతాను.’ లేక భర్త, తన విషయమేగాక ఆమెను గూర్చి కూడ కొంతవరకు జాలికల్గియుంటే, సహాయం చేయగల్గినదేదైనా వున్నదాయని అడిగి యుండేవాడు.18. ఒకరు కోపపడకుండా ప్రేమ ఎలా అడ్డుపడగలదు?
18 నీ జత, చెప్పినదాన్నిబట్టిగానీ, చేసిన దాన్నిబట్టిగాని నీవు సులభంగా కోపపడతావా లేక తాను అన్న మాటలో లేక క్రియలో వున్న భావాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తావా? బహుశ అమాయకంగా, అనాలోచనగా అలా అని యుండవచ్చు, మరిక ఏతప్పు అందులో వుండకపోవచ్చు. నీకు ప్రేమ ఉంటే, ‘సూర్యుడస్తమించేవరకు నీ కోపం నిలిచివుండదు.’ (ఎఫెసీయులు 4:26) నీ జత విసుగుచెంది, బాధ కల్గించే మాట అనాలని లేక చేయాలని నిజంగా తలంచితే అప్పుడేమి చేస్తావు? కోపతాపాలు చల్లారేవరకు ఆగి అప్పుడు వాటిని గూర్చి చర్చించలేవా? ఇద్దరి క్షేమాన్ని దృష్టియందుంచుకొని పరిస్థితిని చక్కదిద్దుటకు ప్రయత్నించుటవల్ల నీవు సరియైన దానిని చెప్పుటకది సహాయపడుతుంది. “జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును.” “ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును,” ఇంకెక్కువ కలహాన్ని రేపడు. (సామెతలు 16:23; 17:9) వివాదాన్ని పెంచి, నీదే సరియైన భావమని రుజువు చేయడానికి యత్నించే స్వభావాన్ని ఎదిరించుట వలన నీవు ప్రేమ పక్షంగా విజయం సాధించగలవు.
19. (ఎ) ‘దుర్నీతి విషయమై సంతోషించుటలో’ ఏమి ఇమిడి యుండవచ్చు? (బి) దీనినెందుకు విసర్జించాలి?
19 నిజమైన ప్రేమ “దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.” ఒకని సమయాన్ని వ్యయపర్చడం, డబ్బు ఖర్చుపెట్టడం, లేక సహవాసుల విషయంలోగాని ఏ విషయంలోనైనా తన జతను మోసం చేయడం తెలివైన పనియని అది తలంచదు. నీతిపరులుగా కనబడటానికి సగం సత్యం మాత్రమే చెప్పదు. మోసం, నమ్మకత్వాన్ని నాశనంచేస్తుంది. ప్రేమ కావాలంటే, మీరిద్దరు సత్యాన్ని సంభాషించుకోవడంలో సంతోషించాలి.
నిజమైన ప్రేమకు బలం, సహనం ఉంది
20. ప్రేమ ఎలా (ఎ) ‘అన్నిటికి తాళుకొనును’? (బి) ‘అన్నిటిని నమ్మును’? (సి) ‘అన్నిటిని నిరీక్షించును’? (డి) ‘అన్నిటిని సహించును’?
20 “అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.” అది వివాహమందు వచ్చే ఇరుకులు ఇక్కట్లను తాళుకొంటుంది, ఇందువలన ఈ బాంధవ్యమందున్న ఇరువురును సర్దుబాటు చేసికొని ఒకరినొకరు అర్థము చేసికోవడానికి నేర్చుకుంటారు. దేవుని వాక్యమందు ఇవ్వబడిన సమస్త ఉపదేశాన్ని నమ్మి పరిస్థితులు అననుకూలంగా ఉన్నపుడు కూడ దాన్ని మనఃపూర్వకంగా అమలుపరుస్తారు. మోసంచేయడానికి ప్రయత్నించే వారిని తాను మోసపుచ్చకుండ వుంటూ, అనవసరంగా అనుమానపడదు. బదులుగా అది నమ్మకాన్ని కనబరస్తుంది. అంతేగాక, మంచి జరుగుతుందని అది నిరీక్షిస్తుంది. బైబిలును పాటించుటవల్ల సాధ్యమైనంతవరకు శ్రేష్ఠమైన ఫలితాలు లభిస్తాయనే దృఢనమ్మకంతో కూడిన అభయంపై అలాంటి నిరీక్షణ ఆధారపడియుంది. ఆ విధంగా ప్రేమ అనేది, సునిశ్చయమైంది, ఆశాజనకమైంది, నిరీక్షణతో కూడినదై వుండగలదు. అది అస్థిరమైంది, లేక అది ఉడుకు రక్తంతో పొంగు తాత్కాలిక మోహం కాదు. నిజమైన ప్రేమ, సమస్యలనెదిరించి, సహిస్తుంది. దానికి విలువగల శక్తివుంది. అది పటిష్ఠమైంది; అయితే దానికున్న సమస్తశక్తిలోను అది దయగలది. కోమలమైంది, మృదువైంది. ఇట్టి గుణాలతో సులభంగా కాపురం చేయవచ్చును.
21, 22. ప్రేమ శాశ్వతకాలముండునని వివరించే కొన్ని పరిస్థితులేవి?
21 అట్టి “ప్రేమ శాశ్వతకాలముండును.” దంపతులు ఆర్థిక సంక్షోభమువల్ల చిక్కుల్లోపడితే ఏమౌతుంది? మరొకచోట తేలికైన జీవిత పద్ధతిని వెదకేందుకై ఆలోచించేబదులు, అట్టి ప్రేమగల భార్య తన భర్తతోనే నమ్మకంగా వుంటూ, మితంగా గడపడానికి ప్రయత్నిస్తూ, వీలైతే భర్త ఆదాయానికి తోడుగా తాను కూడ సంపాదిస్తుంది. (సామెతలు 31:18, 24) అయితే భార్య దీర్ఘకాల వ్యాధితో సంవత్సరాల తరబడి బాధననుభవిస్తుంటే, అప్పుడెలామరి? ఇలాంటి ప్రేమగల భర్త, ఆమెను పరామర్శించడానికి అవసరమైన వాటినన్నిటిని, తాను చేయగల్గినంతవరకు ఏర్పాటుచేస్తాడు, అనగా ఆమె ఇప్పుడు చేయలేని పరిస్థితియందున్న ఇంటిపనులలో సహాయపడటం, నమ్మకంగా ఆమెతో కాపురం చేస్తాడని ఆమెకు అభయమివ్వడం మొదలైనవి. ఈ విషయంలో దేవుడు తానే మంచి మాదిరిని చూపుతున్నాడు. తన నమ్మకమైన సేవకులు ఎట్టి పరిస్థితులలోనికి వచ్చినను, ‘ఏదియు వారిని దేవుని ప్రేమనుండి ఎడబాపదు.’—రోమీయులు 8:38, 39.
22 అటువంటి ప్రేమ ఎదుట ఏ సమస్యలు నిలువగలవు? నీ వివాహంలో అట్టి ప్రేమ ఉందా? నీవు వ్యక్తిగతంగా దాన్ని అమలుపరుస్తున్నావా?
ప్రేమను వృద్ధిచేయుట
23. మనం ప్రేమగల క్రియ చేయబోతున్నామా లేదాయని ఏది తీర్మానిస్తుంది?
23 పనివలన కండరాలెలా పటిష్ఠమౌతాయో అలాగే ప్రేమ, క్రియవలన బలపడుతుంది. అయితే క్రియలులేని విశ్వాసమెలాగో, క్రియలు లేకపోతే ప్రేమకూడ మృతమే. మనలోని ప్రగాఢ కోరికలవలన కలిగే మాటలు క్రియలు, మనలోని కారకములకు స్థానమైన హృదయంలో నుండి వస్తాయి. “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును.” కానీ మనలో దురాలోచనలుంటే, “దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధసాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును.”—మత్తయి 12:34, 35; 15:19; యాకోబు 2:14-17.
24, 25. ప్రేమను చూపు అభిప్రాయాన్ని నీవెలా బలపరచగలవు?
24 నీ హృదయమందెటువంటి తలంపులను, ఆలోచనలను వృద్ధిచేసికుంటావు? దేవుడు తన ప్రేమను చూపిన విధానాన్ని నీవు ప్రతిదినం ధ్యానిస్తూ, ఆయన మాదిరిని అనుకరిస్తే, శ్రేష్ఠమైన తలంపులు బలపడతాయి. ఇట్టి ప్రేమను ఎంతగా కనబరిస్తే దానికనుగుణంగా మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ వుంటే, అంతగా అది నీ హృదయంలో నాటుకుంటుంది. చిన్న చిన్న విషయాల్లో ప్రతిదినం అలాంటి ప్రేమను కనబరిస్తే అది ఒక అలవాటుగా మారుతుంది. ఎప్పుడైనా పెద్దసమస్యలువస్తే అప్పుడు, యీ ప్రేమ, వాటినెదుర్కొనడంలో నీకు సహాయమందించడానికి సిద్ధపడి, నిన్ను పరిరక్షిస్తుంది.—లూకా 16:10.
25 నీవు మెచ్చుకొనే క్రియ ఏదైనా నీ జతచేయడాన్ని నీవు గమనించావా? దానిని మెచ్చుకో! ఒక దయగల క్రియ చేయాలనే కుతూహలం నీకుందా? ఆ కుతూహలానికి చెవియొగ్గండి! దాని ఫలితాన్ని పొందేలా మనం ప్రేమను విత్తాలి. వీటిని అభ్యసించడంవలన అవి మీ యిరువురిని యింకా సన్నిహితపరచి, మీ ఇద్దరిని ఒకటిగా చేసి, మీ ఇరువురి మధ్యగల ప్రేమను వృద్ధిపరుస్తాయి.
26, 27. ఇద్దరు కలిసి పనులు చేయడంవల్ల ప్రేమ ఎలా వృద్ధిచెందుతుంది?
26 ప్రేమను వృద్ధిచేయాలంటే ఇద్దరూ ఒకరికొరకు ప్రేమ చూపుకొనండి. మొదటి మానవుడగు ఆదాము పరదైసులో జీవించాడు. ఆయనకు కావలసిన భౌతిక అవసరాలన్నీ సమృద్ధిగావుండేవి. మొదటినుండి ఆయన చుట్టూ సహజ సౌందర్యముండేది. పచ్చిక బయళ్లు, పుష్పాలు, వనాలు మరియు నదులేగాక, భూమిని సేద్యపరచేవానిగా ఆయనకు సమస్త భూజంతువులు కూడ లోబడియుండేవి. అయినను ఇవన్నియు కలిసి ఒక్క అవసరతను మాత్రం తీర్చలేకపోయాయి: ఈ పరదైసు అందాన్ని పంచుకోడానికి ఒక మానవజత లేకపోయెను. నీవు సుందరమైన సూర్యాస్తమయాన్ని తిలకిస్తూ, ఇప్పుడు నాతోపాటు ఆనందించుటకు నాప్రక్కన ప్రియమైనవారెవరూ లేరేయని ఎప్పుడైనా ఆలోచించావా? లేక ఉల్లాసం కల్గించే సువార్త నీయొద్ద వున్నదిగానీ దానినిగూర్చి చెబితే వినేవారెవ్వరూ లేరన్న సమయముండెనా? ఆదాము అవసరతను యెహోవా గ్రహించాడు, మరియు ఆయన తన ఆలోచనలు, భావాలు తెలిపేందుకు ఆయనకొక జతను ఏర్పాటుచేశాడు. అందులో ఇద్దరు భాగం పంచుకొనుట వల్ల అది వారిద్దరిని దగ్గరికి చేర్చుతుంది, వారి ప్రేమ వేరుపారి వృద్ధిచెందేలా సహాయపడుతుంది.
27 వివాహమనేది ఇద్దరు పంచుకొనేదే. బహుశ ఇద్దరు కలిసి ఆప్యాయతతో గదివైపు చూడడం, పరస్పరంగా స్పర్శించుకోవడం, మృదువైన మాటచెప్పుకోవడం, ఇద్దరూ కలిసి మౌనంగా ప్రశాంతంగా కూర్చోవడానికి కావచ్చు. ప్రతిక్రియ ప్రేమను కనబరస్తుంది: పరుపువేయుట, వంటపాత్రలు శుభ్రం చేయుట, ఆర్థిక ఇబ్బంది దృష్ట్యా డబ్బును అడుగలేని స్థితిలోనున్నపుడు ఆమె కొనదలచినవస్తువును కొనడానికి డబ్బును పొదుపుచేయుట, అతడు లేక ఆమె పని చేయలేకపోయినపుడు సహాయపడడం మొదలైన
వాటిలో ప్రేమకనబరచవచ్చు. ప్రేమ అనగా ఆటపాటల్లో, కష్టసుఖాల్లో, జయాపజయాల్లో, మనోవాంఛల్లో మరియు హృదయాభిలాషల్లో పాలుపంచుకొనుటేయని అర్థం. లక్ష్యసాధనలో ఇరువురు భాగం వహించి, ఇద్దరూ కలిసివాటిని సాధించండి. ఇదే ఇద్దరిని ఒకటిగాచేస్తుంది; ఇదే ఇద్దరి ప్రేమను వృద్ధిపరుస్తుంది.28. తన జతకు సేవచేయడం ప్రేమనెలా వృద్ధిపరుస్తుంది?
28 నీ జతకు నీవు సేవచేయడంవల్ల అతనియెడల నీకున్న ప్రేమ పరిపక్వం చెందుతుంది. భార్య సర్వసాధారణంగా వంటపని చేస్తూ, పడకలు వేస్తూ, ఇల్లు శుభ్రంచేస్తూ, బట్టలు ఉతుకుతూ ఇంటి పనులన్నిటిని చూస్తూ సేవచేస్తుంది. భర్త తన భార్యవండే వంటకు, ఇంటికి, పరుపులకు, బట్టలకు కావలసిన సామానులు కొనితెచ్చి ఇవ్వడం ద్వారా తాను సేవచేస్తాడు. ఇట్టిసేవ, ఇచ్చి పుచ్చుకొనుటవల్లనే సంతోషం కల్గిస్తుంది, ప్రేమ వర్ధిల్లుతుంది. పుచ్చుకొనుటకన్న ఇచ్చుట ధన్యం అని యేసు చెప్పాడు. లేక, సేవచేయించు కొనుటకంటె, సేవచేయుటే ధన్యం. (అపొస్తలుల కార్యములు 20:35) ఆయన తన శిష్యులతో “మీలో గొప్పవాడు మీ సేవకుడై యుండవలెనని” అన్నాడు. (మత్తయి 23:11, న్యూ యింగ్లీష్ బైబిల్) అట్టి అభిప్రాయం పోటీస్వభావాన్ని పారద్రోలి ఆనందానికి నాందియౌతుంది. అవసరమని తలంచినపుడు సేవచేస్తే మనమొక సంకల్పాన్ని నెరవేర్చుతున్నాం. ఇది మనకు వ్యక్తిగత గౌరవాన్నందించి, సంతృప్తినిస్తుంది. భార్యాభర్తలిద్దరూ పరస్పరం సేవ చేసికోవడానికి, సంతృప్తిని పొందడానికి వివాహం ఎంతో మంచి అవకాశాన్నిస్తుంది, అలా వారి వివాహాన్ని ప్రేమతో మరింత పటిష్ఠం చేసుకుంటారు.
29. దేవుని సేవకులు కానివారికి కూడ ప్రేమ ఎందుకు ఆకర్షణీయంగా వుంటుంది?
29 అయితే వీరిలో ఒకరు బైబిలు నియమాలను అభ్యసించే దేవుని సేవకులైయుండి మరొకరు అవిశ్వాసియైయుంటే అప్పుడేమిటి? క్రైస్తవులు నడువవలసిన పద్ధతిమారుతుందా? ముఖ్య విషయాలలో ఏమార్పుండదు. క్రైస్తవుడైన వ్యక్తి దేవుని సంకల్పాలను గూర్చి ఎక్కువగా మాట్లాడే వీలుండకపోవచ్చునుగానీ, ప్రవర్తనైతే అదే వుండాలి. అవిశ్వాసి కూడ యెహోవా ఆరాధికునివలే అవే ముఖ్యావసరతలను కల్గివున్నాడు, కొన్ని సందర్భాల్లో రోమీయులు 2:14, 15 నందిలా వ్రాయబడింది: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు, లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.” మాదిరికరమైన క్రైస్తవ ప్రవర్తన, సాధారణంగా అభినందించ బడుతుంది, అది ప్రేమను వృద్ధిచేస్తుంది.
ఆ వ్యక్తివలెనే ప్రవర్తిస్తాడు. దీన్ని గూర్చి30. ఆకస్మిక పరిస్థితుల్లో మాత్రమే ప్రేమను కనబర్చాలా? నీవెందుకలా సమాధానమిస్తావు?
30 ప్రేమ బయలుపడటానికి ఆకస్మిక పరిస్థితులకొరకు వేచియుండదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ, దుస్తులవంటిది. నీ దుస్తులు వేటివలన నిలిచివున్నాయి? త్రాడుతో వేసిన పెద్దపెద్ద ముడులవల్లనా? లేక సన్నని దారముతో వేసిన వేలకొలది కుట్టులవల్లనా? వేలకొలది వేసిన ఆ చిన్న కుట్టులవల్లనేగదా. మనం శరీర సంబంధమైనవే గాని ఆత్మీయ సంబంధమైనవేగాని “దుస్తులను” గూర్చి మాట్లాడినపుడు అది వాస్తవమేగదా. ప్రతిరోజు ఎడతెగక వ్యక్తపరచే ఆ చిన్న మాటలు, క్రియల సముదాయమును బట్టియే మనం అంతర్గతంగా ఏమైయున్నామో బయల్పరచి మనలను “కప్పు” తుంది. ఆత్మీయమైన అట్టి “దుస్తులు” శరీర దుస్తులవలె చినిగిపోయి నిరుపయోగంకావు. బైబిలు తెల్పుతున్నట్లు అది “అక్షయాలంకారము.”—1 పేతురు 3:4.
31. కొలొస్సయులు 3:9, 10, 12, 14 నందు ప్రేమను గూర్చి ఎటువంటి శ్రేష్ఠమైన సలహా ఇవ్వబడింది?
31 నీ వివాహం ‘పరిపూర్ణ అనుబంధముతో’ ముడివేయబడాలని నీవు కోరుకుంటావా? ఆలాగైతే కొలొస్సయులు 3:9, 10 12, 14 నందు సిఫారసు చేయబడినట్లు చేయండి: “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, . . . నవీనస్వభావమును ధరించుకొని . . . జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి . . . పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”
[అధ్యయన ప్రశ్నలు]