ప్రేమతో శిక్షించడంవలన కలిగే ప్రయోజనం
అధ్యాయము 10
ప్రేమతో శిక్షించడంవలన కలిగే ప్రయోజనం
1. పిల్లలు విధేయులు కావాలంటే ఏమి అవసరమై వుంది?
పిల్లలు తమకుతామే విధేయత, ప్రేమ, మంచి మర్యాదగలవారిగా తయారుకాలేరు. మాదిరి, క్రమశిక్షణ ద్వారా వారు మలచబడి తయారౌతారు.
2. పిల్లల మనస్తత్వ శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు, బైబిలు సలహాతో ఎట్లు భిన్నమైయున్నవి?
2 చిన్నపిల్లల మనస్తత్వ శాస్త్రజ్ఞులనేకులు పిల్లలయెడల “చేతులు ముడుచుకొనే” స్వభావాన్ని సూచిస్తున్నారు. అలా చేసిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “తల్లులారా, మీ పిల్లలను కొట్టినప్పుడెల్ల మీరు వారిని ద్వేషిస్తున్నట్లేనని గ్రహిస్తున్నారా?” అయితే దేవుని వాక్యంలో దేవుడిలా చెబుతున్నాడు: “బెత్తము వాడనివాడు తన కుమారుని ద్వేషిస్తున్నాడు. కాని కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షిస్తాడు.” (సామెతలు 13:24, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్) కొన్ని దశాబ్దముల క్రితం ప్రత్యేకంగా పశ్చిమ దేశాల్లో, విచ్చలవిడితనాన్ని పురికొల్పే సిద్ధాంతాలున్న శిశు శిక్షణా పుస్తకాలు మార్కెట్టులోనికి కోకొల్లలుగా వచ్చాయి. శిక్షయనేది శిశువును మానసికంగా మందగింపజేసి, శిశువు అభివృద్ధిని అడ్డగిస్తుందని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పారు; కొట్టడం అనే ఆలోచనే వారికి భీతి కల్గిస్తుంటుందని వారన్నారు. వారి సిద్ధాంతాలు, యెహోవా దేవుని సలహాకు విరుద్ధంగా వున్నాయి. ఆయన వాక్యం తెలిపేదేమంటే, ‘నీవు విత్తుదాని పంటనే కొయుదువు.’ (గలతీయులు 6:7) కొన్ని దశాబ్దాలుగా విచ్చలవిడితనాన్ని విత్తగా వచ్చిన ఫలితమేమైయున్నదని రుజువైంది?
3, 4. ఇంటిలో సరియైన శిక్షణ లేనందున కల్గిన ఫలితమేమై యున్నది, గనుక అనేకులు ఇచ్చే సలహా ఏమిటి?
3 నేరం, బాల్యనేరముల సంఖ్య అమితంగా వుంది. అనేక పారిశ్రామిక దేశాల్లో తీవ్రనేరాల్లో 50 శాతం యౌవనస్థుల నేరాలే వున్నట్లు పరిగణించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో స్కూలు ఆవరణాలు, క్లాసులకు విఘాతం కల్గించడం, పోట్లాడుట, బూతులాడుకోవడం మరియు అసభ్యకరమైన క్రియలకు, ఆస్తినష్టం, దౌర్జన్యకాండ, దోపిడి, దహనకాండ, దొంగతనాలు, మానభంగాలు, మత్తు పదార్థాలు సేవించడం మరియు హత్యలకు నెలవైయున్నవి. ఒక పెద్ద దేశంలో, ఉపాధ్యాయుల ఫెడరేషన్ రాయబారి, పిల్లలకు మొదటినుండి సరియైన క్రమశిక్షణ లేకపోవడానికి గల కారణం పాఠశాలల వైఫల్యమేనని, తలిదండ్రులు వారి పిల్లలకు యోగ్యమైన నైతిక సూత్రాలను అందించుటలో వ్యక్తపరస్తున్న అయిష్టత, కుటుంబపతనం అట్టి నేరాలకు నడిపిందని నిందించాడు. ‘కుటుంబంలో కొందరు నేరస్థులై, మరి కొందరెందుకు నేరస్థులగుట లేదను’ ప్రశ్నను పరిశీలించడంలో, ది ఎన్ సైక్లోపీడియా బ్రిటానిక ఇలా తెల్పుతుంది: “కుటుంబ క్రమశిక్షణా నియమాలు మరీ పట్టుత్వములేనివి, అతి కఠినమైనవి లేక మరీ పొంతనలేనివై యుండవచ్చు. బహుశ సరియైన క్రమశిక్షణ లేని కారణంగా 70 శాతం పురుషులు నేరస్థులౌతున్నారని” అమెరికా పరిశోధన సూచించింది.
4 అనుభవించిన ఫలితాలను బట్టి అనేకులు వారి అభిప్రాయాలను మార్చుకొని మరల పిల్లల్ని శిక్షించుటకారంభించారు.
శిక్షాదండము
5. పిల్లలను కొట్టే విషయంలో బైబిలు ఉద్దేశమేమిటి?
5 పిల్లవానిని కొడితే అదివాని జీవానికి రక్షణ కావచ్చును, ఎందుకంటే దేవుని వాక్యమిలా తెల్పుతుంది: “నీ బాలురను శిక్షించుట మాను కొనకుము, బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.” మరియు, “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని దానిలోనుండి తోలివేయును.” (సామెతలు 23:13, 14; 22:15) తలిదండ్రులు, వారి పిల్లల జీవితాలను ప్రియమైన వాటిగా ఎంచితే, శిక్షించే పనిని వారు నెమ్మదిగా లేక అజాగ్రత్తగా జారవిడువరు. అవసరమైనపుడెల్ల, తెలివిగాను న్యాయంగాను శిక్షించడానికి వారి ఎడలగల ప్రేమయే తలిదండ్రులను పురికొల్పుతుంది.
6. క్రమశిక్షణలో ఏమి ఇమిడివుంది?
6 క్రమశిక్షణ అనగా శిక్షించుటయేకాదు. శిక్ష అనేపదం యొక్క మూలభావమేమంటే, ‘ఒక క్రమము లేక ఒక పద్ధతిలో బోధించుట, ఉపదేశించుట.’ అందుచేతనే సామెతలు 8:33, శిక్షను ‘అనుభవించుము’ అని చెప్పుట లేదు, గానీ ఉపదేశాన్ని నిరాకరింపక దాని “నవలంభించి జ్ఞానులై యుండుడి” అని చెబుతుంది. రెండవ తిమోతి 2:24, 25 ప్రకారం, క్రైస్తవుడు, “సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.” ఇచ్చట వ్రాయబడిన “శిక్షించుచు” అనే పదం గ్రీకులో క్రమశిక్షణ అనుభావమిచ్చే పదం నుండి అనువదించబడింది. అ పదమే హెబ్రీయులు 12:9 లో అదే భావంతో తర్జుమాచేయబడింది. “శరీరసంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగియున్నాం, అలాగయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి జీవించాలిగదా?”—న్యూ ఇంగ్లీష్ బైబిల్.
7. తలిదండ్రులు పిల్లలను శిక్షించుటవలన కలిగే ప్రయోజనాలేవి?
7 చెడుతనం విచ్చలవిడిగా కొనసాగడానికి పాలకులు అనుమతించినప్పుడు వారెలా ప్రజల గౌరవ మర్యాదలను చూరగొనలేరో అలాగే పిల్లవానిని శిక్షించని తండ్రికూడ వానినుండి ఎట్టి గౌరవాన్ని పొందలేడు. సరియైన రీతిగా ఇచ్చిన శిక్ష, తలిదండ్రులు వానిని లక్ష్యపెడుతున్నట్లు వానికొక నిదర్శనంగా వుంటుంది. అది కుటుంబం ప్రశాంత పరిస్థితిలో వుండటానికి దోహదపడుతుంది, “దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీయులు 12:11) అవిధేయత, దుష్ప్రవర్తన గల్గిన పిల్లలున్న ఇల్లు ఆవేశాలకు నిలయమౌతుంది, మరి అలాంటి పిల్లలు ఎన్నటికిని సంతోషంగా వుండరు, కనీసం వారికి వారైనా సంతోషించలేరు. “నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును.” (సామెతలు 29:17) నిశ్చలంగా, ప్రేమతో తప్పుదిద్దిన అనంతరం పిల్లవాడు ఒక క్రొత్తధోరణిలో, నూతన ప్రారంభదశకు రాగలడు తరచూ అది ఇంకా సంతోషభరిత సహవాసంగా మారుతుంది. శిక్ష, నిశ్చయంగా “సమాధానకరమైన ఫలమిచ్చును.”
8. తలిదండ్రులు ఎలా పిల్లలను ప్రేమతో శిక్షించగలరు?
8 ‘యెహోవా తాను ప్రేమించువారిని శిక్షించును.’ (హెబ్రీయులు 12:6) తన పిల్లల క్షేమాన్ని కోరుకొనే తండ్రి కూడ అలాగే చేస్తాడు. ప్రేమతో శిక్షించాలి. పిల్లవాడు చేసిన తప్పును చూచినపుడు సహజంగా కొంత వరకు కోపం రావచ్చుగానీ బైబిలు తెల్పేదేమంటే ఒకడు “కీడును సహించువాడుగాను ఉండవలెను.” (2 తిమోతి 2:26) కోపము చల్లారిపోయిన అనంతరం పిల్లవాని తప్పిదం అంత పెద్దదిగా కనబడదు: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” (సామెతలు 19:11; ప్రసంగి 7:8, 9 కూడ చూడండి.) దయాదాక్షిణ్యం కనబరచే పరిస్థితులుండవచ్చు: బహుశ పిల్లవాడు బాగుగా అలసిపోయివుంటాడు లేదా సుస్తిచేసియుండవచ్చు; తనకు చెప్పిన విషయాన్ని బహుశ అతడు మరచిపోయి వుండవచ్చు; పెద్దవారు కూడ మరచిపోతారు, కదా? తప్పును అలాగే వదలివేయకూడదని అనుకున్నా, అమితావేశముతో బాలుని శిక్షింపకూడదు లేక తండ్రి తన కోపాన్ని తీర్చుకోవడానికి కొట్టేదెబ్బవలె వుండకూడదు. శిక్షలో ఉపదేశం ఇమిడివుంది, మరి అలాంటి మహాకోపాన్ని చూచి పిల్లవాడు ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. అలాంటి గుణపాఠంలో ఆశానిగ్రహముందని కాదు గానీ ఆశానిగ్రహం లేనటువంటి క్రియ అని నేర్చుకుంటాడు. తనను లక్ష్యపెట్టడంలో అనుసరించే సక్రమమైన శిక్ష అచ్చట లోపించిందని పిల్లవాడు గ్రహిస్తాడు. ఇందులో సమదృష్టి అగత్యం, అది సమాధానాన్ని వృద్ధిచేస్తుంది.
స్థిరమైన హద్దులేర్పరచుట
9. సామెతలు 6:20-23 ప్రకారం, తలిదండ్రులు పిల్లలకు ఏమి ఏర్పాటు చేయాలి?
9 తలిదండ్రులు పిల్లలకు, వారు నడువవలసిన పద్ధతలను ఏర్పాటు చేయాలి: “నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి సామెతలు 6:20-23.
ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.” తలిదండ్రులిచ్చే యీ నీతిసూత్రాలు పిల్లవానిని నడిపి, పరిరక్షిస్తాయి, మరియు పిల్లవాని క్షేమం సంతోషం యెడల తలిదండ్రులకు శ్రద్ధగలదని అవి రుజువు చేస్తాయి.—10. తలిదండ్రులు వారి పిల్లలను శిక్షింపకపోతే ఏమి సంభవించవచ్చు?
10 ఇలా చేయని తండ్రి దానికి బాధ్యుడౌతాడు. ప్రాచీన ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడైన ఏలీ తన కుమారులను అత్యాశ, అమర్యాద, అవినీతి క్రియలకు పాల్పడేలా అనుమతించాడు. ఆయన వారినెదిరించి మాట్లాడాడే గానీ వారుచేసిన చెడు కార్యాలను ఆపడానికి అతడేలాంటి చర్యగైకొనలేదు. దేవుడిలా అన్నాడు: “తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతును.” (1 సమూయేలు 2:12-17, 22-25; 3:13) అలాగే తల్లి తన బాధ్యతలో విఫలమైతే ఆమె అవమానాన్ని భరించ వలసివుంటుంది: “బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు [లేక బాలిక] తన తల్లికి అవమానము తెచ్చును.”—సామెతలు 29:15.
11. పిల్లలకు ఎందుకు హద్దులు నియమించాలి?
11 పిల్లలకు హద్దులుండాలి. హద్దులు లేకపోతే వారు చెడిపోతారు. హద్దులుండి, వాటిని పాటిస్తే అవి, వారొక గుంపుకు చెందినవారని భావించేలా చేస్తాయి; వారా గుంపుకు సంబంధించినవారని మరియు దాని నియమాలను పాటిస్తున్నారు. గనుక వారు అంగీకరించబడుతున్నారని పిల్లలు గ్రహిస్తారు. అదుపులేనితనం యౌవనస్థులను చిందరవందర చేసి తమ్మునుతాము పొడుచుకొనేలా చేస్తుంది. ఫలితాలు తెలిపేదేమంటే, హద్దుల విషయంలో స్థిరమైన నమ్మకం కల్గి, వారిపై హద్దులుంచగల పెద్దలు వారికవసరం. లోకమందున్న ప్రతివారికి హద్దులున్నాయి, ఈ 1 థెస్సలొనీకయులు 4:6.
హద్దుల్లో వుంటే వారి వ్యక్తిగత సంతోషానికి వారి మంచికే అది నడిపిస్తుందని పిల్లలు గుర్తెరుగవలసిన అవసరముంది. మన స్వేచ్ఛకున్న స్థానాన్ని ఇతరులు గ్రహించి వారి స్వేచ్ఛాస్థానాన్ని మనం గుర్తించినపుడు మాత్రమే స్వేచ్ఛను అనుభవించగలం. సరియైన హద్దులను మీరుట అంటే, తప్పు చేసినవాడు ‘తన సహోదరుని హక్కులను నిశ్చయంగా తాను అన్యాయంగా తీసికొని, అతనికి హాని కల్గించినట్లే’యని భావము.—12. తనకుతాను శిక్షించుకొనుట ఎందుకు ముఖ్యం, దీన్ని అభివృద్థి చేసికొనుటకై తలిదండ్రులు పిల్లలకెలా సహాయపడగలరు?
12 సరియైన హద్దులు మీరుటవలన ఏదొక విధమైన శిక్ష వారికి విధించబడుతుందని పిల్లలు నేర్చుకున్నపుడు వారి స్వంత హద్దులను గుర్తిస్తారు మరియు తలిదండ్రుల స్థిరత్వం, వారి నడిపింపు మూలంగా పిల్లలు సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి అవసరమైన స్వయం శిక్షను అభివృద్ధి చేసుకుంటారు. మనలో మనం అంతర్గతంగా శిక్షించుకోవాలి లేదా బయటి మూలం ద్వారానైనా శిక్షింపబడాలి. (1 కొరింథీయులు 9:25, 27) అంతర్గతంగా శిక్షించుకొనుటకు మనం వృద్ధి చేసుకొని, మన పిల్లలు కూడ ఆలాగే చేసేటట్లు సహాయపడితే, మన జీవితాలు వారి జీవితాలు సంతోషభరితమై, బాధావేదనలకు దూరమౌతాయి.
13. వారి పిల్లలకు నియమాలను నియమించునపుడు తలిదండ్రులు మనస్సు నందుంచుకోవలసిన ముఖ్యాంశాలేవి?
13 పిల్లలకిచ్చే నియమాలు, హద్దులు వారికి స్పష్టంగాను, న్యాయంగాను, దయతో కూడినవై యుండాలి. అమితంగా కోరవద్దు. అతి తక్కువ కోరవద్దు. వారి వయస్సును జ్ఞాపకముంచుకోండి, అప్పుడే వారు వాటిని చేస్తారు. వారు చిన్నసైజులో వున్న పెద్దలని అనుకొనవద్దు. అపొస్తలుడు తాను చిన్న వాడైనపుడు చిన్నవారివలె ప్రవర్తించెనని చెప్పెను. (1 కొరింథీయులు 13:11) అయితే ఒకసారి కారణసహితమైన నియమాలు స్థిరపరచి, నీ పిల్లలు వాటిని గ్రహించిన తదుపరి నీవు వాటిని వెంటనే తగిన రీతిగా అమలుపర్చు. “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను.” (మత్తయి 5:37) మాట తప్పకుండ, స్థిరులై, కచ్చితంగా ఉండే తలిదండ్రులను పిల్లలు నిజంగా అభినందిస్తారు, ఎందుకంటే తలిదండ్రులు పోషించే శక్తిని కల్గియున్నారని, కష్టాలు వచ్చినప్పుడు, వారికి సహాయం అవసరమైనప్పుడు వారిపై ఆధారపడవచ్చని పిల్లలు గ్రహిస్తారు. తలిదండ్రులు తప్పు దిద్దుటలో న్యాయంగాను, సరియైన దృష్టిని కల్గియుంటే, పిల్లలు తాము క్షేమంగాను, నిశ్చలంగా వున్నామని భావిస్తారు. పిల్లలు, వారి స్థానమేమిటో తెలిసికొనగోరతారు, మరి అట్టి తలిదండ్రులుంటే దానిని గూర్చి తెలిసికుంటారు.
14. తలిదండ్రుల నడిపింపును పిల్లలు విననప్పుడు వారు స్థిరత్వం కనబరచుట ఎందుకు ముఖ్యం?
14 తలిదండ్రుల ఆనతి పిల్లవాడు వినకుండ తప్పించుకుంటున్నప్పుడు తలిదండ్రులు స్థిరత్వాన్ని చూపడానికి వారికి మనోనిశ్చలత అవసరం. అటువంటి సమయాల్లో కొందరు తలిదండ్రులు వారిని దండిస్తామని బెదిరించడం, పిల్లవానితో నిష్ప్రయోజనమైన వాదనను పెట్టుకోవడం లేదా, తాము చెప్పిన పనిని పిల్లవాడు చేసేలాగున వారికేదో రూపేణ లంచమిచ్చి పని చేయించుకోవాలని ప్రయత్నిస్తారు. తరచూ అవసరమయ్యేదేమంటే, తలిదండ్రులు ఎంతో ఖచ్చితంగా వుంటూ, పిల్లవానితో యీ పని తప్పక చేయాలి, ఇప్పుడే చేయాలని ఖండితంగా చెప్పాలి. ఎదుటినుండి వచ్చే కారు ముందుకు పిల్లవాడు దూసుకుపోతుంటే, ఏమిచేయాలో తలిదండ్రులు వానికి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంపై కొందరు పరిశోధకులు ఇలా తెలియజేశారు: “దాదాపు తలిదండ్రులందరు వారి పిల్లలు పాఠశాలకు వెళ్లాలని, . . . పళ్ళు తోముకోవాలని, ఇంటి పైకెక్కవద్దని, స్నానం చేయాలని, ఇంకా ఎన్నెన్నో చెప్తారు. పిల్లలు తరచూ వీటిని లక్ష్యపెట్టరు. అయితే కొన్నిసార్లు వారా పనులు చేస్తారు. ఎందుకంటే అలా చెప్పడం తలిదండ్రుల ధర్మమని వారికి తెలుసు.” నీవు వీటిని సరిగ్గా అమలులోనికి వచ్చేలా చూచినపుడు మాత్రమే నీ పిల్లలు ‘నీవిచ్చిన నియమాలను ఆజ్ఞలను వారి హృదయాలకు ఎల్లప్పుడు కట్టుకుంటారని’ నిరీక్షించగలవు.—సామెతలు 6:21.
15. తలిదండ్రులు నియమాలను అసంగతంగా అమలు చేస్తే అది పిల్లలపై ఎట్టి ప్రభావం కల్గివుంటుంది?
ప్రసంగి 8:11) కాబట్టి, నీవు చెప్పేదేదో దాన్ని నువ్వు చేయ్, చేసేదాన్ని చెప్పు. అప్పుడు బాలుడు ఇదీ అసలు విషయమని గ్రహిస్తాడు మరియు మూతిముడుపువలన, వాదనవలన లేక నీవు క్రూరుడవు, ప్రేమ లేనివాడవు అని అతడు తలస్తున్నట్లు నటించడంవల్ల ప్రయోజనం లేదని వాడు గ్రహిస్తాడు.
15 తలిదండ్రులు క్షణానికి వారిష్టమొచ్చినపుడు లేక ఆ క్షణానికి తగినట్లు అప్పుడప్పుడు మాత్రమే ఆ నియమాలను అమలు పెడితే లేదా అవిధేయతకు తగిన శిక్షను ఆలస్యం చేస్తే, పిల్లలు కొన్ని నియమాలను ఉల్లంఘించి, ఎంతవరకు అలా చేయగలరో, ఎన్నిసార్లు అలా తప్పించుకోగలరోనని దొరికిన అవకాశాలను వినియోగించుకొనడానికి ప్రయత్నిస్తారు. దండనలో జాప్యముందని గమనిస్తే, పిల్లలు పెద్దలవలె చేయడానికి సాహసిస్తారు. “దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయ పూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.” (16. నిర్హేతుకమైన ఆజ్ఞలివ్వకుండ వుండటానికి తలిదండ్రులేమి చేయాలి?
16 అందుకే మాట్లాడడానికి ముందు ఆలోచించడం అవసరం. తొందరపాటున చేసే కట్టడలు లేక ఆజ్ఞలు తరచు నిర్హేతుకమైనవిగా వుంటాయి. “వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” (యాకోబు 1:19) శిక్షాదండం న్యాయంగా, సహేతుకంగా లేకపోతే సహజంగా పిల్లల్లో న్యాయబుద్ధి దెబ్బతింటుంది, అయిష్టత నెలకొంటుంది.
వినోదాలను అదుపునందుంచుకోండి
17. పనిపాటలు, ఆటపాటల విషయంలో పిల్లలు ఎట్టి దృష్టిని కల్గియుండాలి?
17 ఆట, పిల్లవాని జీవితంలో స్వభావసిద్ధమైన భాగమే. (జెకర్యా 8:5) తలిదండ్రులు దీనిని గ్రహించాలి. మరి తలిదండ్రులు, పిల్లవానిలో క్రమేణి పనియెడల మెప్పును, బాధ్యతా భావాన్ని కల్గిస్తూ యీ విషయాన్ని గుర్తించాలి. అప్పుడు, పిల్లవానికిచ్చిన ఏ చిన్న చిన్న పనులైనను, మొదట బాగా చేస్తాడు; తర్వాతే ఆట్లాడుకుంటాడు.
18. సహవాసులు, పిల్లలపై ఎట్టి ప్రభావం చూపగలరు?
1 కొరింథీయులు 15:33) బయటివారితో గల సహవాసం కొంతవరకు మంచిదే, బయటి ప్రజలను అవగాహన చేసుకోవడానికి అది దోహదపడుతుంది. కాని అలాంటి సహవాసం మితిమీరితే లేక అదుపుతప్పితే కుటుంబ వలయం బలహీనమౌతుంది లేదా చిన్నాభిన్నమౌతుంది.
18 కొందరు పిల్లలు “బజారు పిల్లలౌతారు” లేదా వినోదం కొరకు వేరోచోట వెదకుచు తిరగడం వలన వారు ఇంటికి క్రొత్తవారివలె వుంటారు. సహవాసాలు హీనంగా వుంటే, వాటివలన కలిగే ఫలితాలు హీనంగానే వుంటాయి. (19. తలిదండ్రులు వారి పిల్లల నిమిత్తం గృహాన్ని ఆనందభరితంగా చేస్తున్నారా లేదాయని రూఢి చేసుకోవడానికి పునర్విమర్శ చేయవలసిన కొన్ని అంశాలేవి?
19 దీనిని సరిదిద్దుటకు వారిచ్చే దండనతోపాటు, కుటుంబాన్ని పిల్లలకొరకు సంతోషభరితం చేయడానికి తలిదండ్రులు ఏంచేయాలో తమను తామే ప్రశ్నించుకోవచ్చు, ఉపదేశించుటలో లేక శిక్షించుటలో మాత్రమే గాక, వారికి నిజమైన స్నేహితులుగా సహవాసులుగా వుండటంలో పిల్లలతో తగినంత సమయాన్ని తమ వ్యయపరుస్తున్నారా లేదాయని పరిశీలించుకోవాలి. నీ పిల్లలతో సమయాన్ని గడపడానికి వారితో ఆటలాడుకోవడానికి వీలులేనంతగా నీవెల్లప్పుడు “ఏమాత్రం తీరిక లేకుండ” వున్నావా? ఒకసారి తప్పిపోతే ఇక పిల్లలతోకలిసి ఆ పని చేయటానికి అవకాశాలు మరల చిక్కవు. కాలం ఒకే వైపునకు నడుస్తుంది, మరి చిన్నవాడు అలాగే వుండడు, పెరుగుతూ, మార్పు చెందుతూ వుంటాడు. కాలాలు గతించిపోతాయి, మీ బాబు నిన్న మొన్న నడవడాని కారంభించినట్లే వుంటుంది, ఇప్పుడు వాడు యౌవనస్థుడైనట్లు, మరి నీ చిన్నారి యౌవ్వనురాలైనట్లు అకస్మాత్తుగా గుర్తిస్తావు. నీ సమయాన్ని వ్యయపరచడంలో నీవు సమదృష్టిని కల్గి, నీకు నీవు క్రమశిక్షణను పాటిస్తేనే యీ ప్రశస్తమైన కాలం నీకందించే తరుణాలను జారవిడుచుకోకుండ కాపాడుకోగలవు లేక నీ పిల్లలు యింకా లేత వయస్సులో వున్నపుడే వారు నీ చేయిజారి పోకుండ నీవు ఆపగలవు.—సామెతలు 3:27.
20, 21. ఇంటిలో దూరదర్శిని ఉంటే తలిదండ్రులెలాంటి బాధ్యత వహించాలి, ఎందుకు?
20 దూరదర్శిని సర్వసాధారణంగా వినోదానికి ముఖ్యంగా మూలమైయున్నప్పుడు దానిని చూడ్డానికి హద్దులు నియమించవలసిన అవసరముంది. కొందరు తలిదండ్రులు, దూరదర్శిన్ని పిల్లల ఆటవస్తువుగా వుపయోగిస్తారు. అది సౌకర్యంగాను చౌకగాను వుండవచ్చును, గానీ వాస్తవానికి అదెంతో హానికరమైంది. దూరదర్శిని కార్యక్రమాలు తరచు దౌర్జన్యం, లైంగిక అవినీతితో నిండివుంటాయి. సమస్యలను తీర్చుకోవడానికి, దౌర్జన్యక్రియే సమ్మతింపబడిన మార్గమనేధోరణి లోకంలో వుంది; లైంగిక అవినీతి ప్రతిదిన జీవితంలో అంగీకరింపబడిన ఒక భాగమేననే అభిప్రాయముంది. అనేక పరిశోధనలు తెలిపేదేమంటే ఇది వ్యక్తిని, విశేషంగా యౌవనస్థులను అట్టి దురభ్యాసాల్లో పడవేస్తుంది. నీ పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసికోవాలని, కలుషితమైంది తీసికోకూడదనే గదా నీ కోరిక. వారి మనస్సుల్లో ఏది నిండిపోతుందో దాన్ని గూర్చి నీవు అంతకంటే ఎక్కువ శ్రద్ధ కల్గియుండాలి. యేసు తెల్పినట్లు ఆహారం మన హృదయంలోనికి పోదుగానీ మనం మన మనస్సులోనికి గ్రహించునదే మన హృదయాల్లో చేరుతుంది.—21 దూరదర్శినిలో తిలకించే కార్యక్రమాల్లోను, దానికి వ్యయపరచు సమయంలో మితం కల్గియుండడంవల్ల పిల్లవాని అభివృద్ధిలో ఎంతోతేడా కనబడుతుంది. దూరదర్శిని, కొంతవరకు సంతోషించే వినోదాన్ని, విద్యను సహితం అందించగలదు. అయితే అదుపు తప్పితే దానికి లోబడి ఎంతో సమయాన్ని దానికొరకు వినియోగించవలసి వుంటుంది. సమయం ప్రాణం వంటిది, ఆ సమయంలో కొంతవరకు, అంతకంటె ప్రయోజనకరమగు వాటి నిమిత్తం నిశ్చయంగా వ్యయపరచవచ్చును. ఎందుకంటే దూరదర్శిని వలన పనిచేసే బదులు, దాన్ని చూస్తుంటాం. శారీరకంగా పనిచేయడం మానుకోవడమే గాక దాని మూలంగా చదివేది, మాట్లాడేది కూడ మానుకుంటాం. కుటుంబంలో ఒకరితో ఒకరు సంభాషించుకొని, సన్నిహితంగా వుండుట అవసరం మరి దూరదర్శిని ముందు అందరు మౌనంగా కూర్చోవడంవల్ల ఆ అవసరం తీరదు. అధికంగా దూరదర్శిన్ని తిలకించు సమస్యవున్న కుటుంబంలో తలిదండ్రులు దూరదర్శినికి
బదులు వేరే పనులను అప్పగించి వారిలో వాటిఎడల అభినందనను కల్గించవచ్చు—అనగా మంచి మంచి ఆటలు, కుటుంబమంతా కలిసి చేసే పనులు ముఖ్యంగా తలిదండ్రులే అట్టివాటికి నాయకత్వం వహించి మంచి మాదిరిని చూపే పనులయందు వారికి ఆసక్తిని కల్గించవచ్చు.నీవు శిక్షించేటప్పుడు, మాట్లాడు!
22. పిల్లలు తమ తలిదండ్రులు చెప్పే మాటలను గ్రహించడం ఎందుకు ముఖ్యం?
22 ఒక తండ్రి యీ అనుభవాన్ని తెల్పుతున్నాడు:
“నా కుమారునికి మూడు సంవత్సరాల వయస్సున్నపుడు, అబద్ధమాడే విషయం మీద మాట్లాడుతూ అబద్ధికులను దేవుడెలా అసహ్యించుకుంటాడోనని సామెతలు 6:16-19 మరియు ఇతర లేఖనాలను ఉపయోగించి ఒక ప్రసంగం మాదిరి చెప్పాను. అతడు దాన్ని విని దానికి తగినట్లే చేస్తున్నట్లు నాకు కనబడినది. అయితే వాడు సరిగ్గా అర్థంచేసుకోలేదని నాకు అనుమానం కల్గింది కాబట్టి నేను వానితో ‘బాబు అబద్ధం అంటే నీకు తెలుసా?’ అని అడిగాను, అతడు ‘తెలియదన్నాడు.’ అప్పటి నుండి నేను, వాడు వినిన మాటల భావమేమిటి, వాన్నెందుకు శిక్షిస్తున్నాను అని వాడు తెలిసికొనేలా నేనెల్లప్పుడు జాగ్రత్తపడే వాన్ని.”
23. ఒకానొక చర్య న్యాయమైందని గ్రహించడానికి సహాయపడడంలో ఏమి ఇమిడివుంది?
23 పిల్లలు యింకా పసివారుగా వున్నపుడే తలిదండ్రులు వేడిగావున్న పొయ్యిని తాకవద్దని అన్నట్లే “వద్దు, పోవద్దు” అని మాత్రమే చెప్పగలరు. అయితే అలాంటి సులభమైన తొలి హెచ్చరికల విషయంలో కూడ కారణాలను వారికి తెలుపవచ్చు. పొయ్యి “వేడిగా!” వుందని లేదా దానిని తాకితే “కాలుతుంది!” అనిగానీ చిన్న మాటలతో చెప్పవచ్చు. అయినా మొదటినుండి ఇందులో ఇమిడియున్నవి తన మంచికొరకే అన్న విషయాన్ని పిల్లవానికి తెలియజేస్తూ వుండండి; తదుపరి దయ, జాలి, ప్రేమ అను కోరదగిన లక్షణాలను గూర్చి నొక్కి తెల్పండి. ఈ లక్షణాల్లో సమస్తమైన ఉత్తమక్రియలు లేక హద్దులు ఇమిడియున్నవని గుణగ్రహించేలా సహాయపడండి. మరియు ఒకానొక క్రియ కోరదగిన లక్షణాలను ఎందుకు బయలుపర్చునో లేక బయల్పరచదో నొక్కితెల్పండి. దీనిని మత్తయి 7:12; రోమీయులు 13:10.
న్యాయయుక్తంగా జరిగిస్తే నీవు నీ కుమారుని మనస్సులోనే కాదు వాని హృదయంలోను దానిని నాటుకొనేలా చేయగలవు.—24. బాలుడు అధికారాన్ని గౌరవించడం ఎందుకు ముఖ్యం?
24 అదేమాదిరి, అధికారం ఎడల విధేయత గౌరవంచూపే అవసరతను గూర్చి క్రమేణి అతనికి నేర్పించాలి. తొలిఏటనే శిశువు పెద్దలమాట వింటాడా లేదాయనే విషయం తేటపడుతుంది. శిశువు మానసిక స్థితి దీనికి అనుమతించిన వెంటనే, దేవుని యెడల తలిదండ్రులకున్న బాధ్యతను గుణగ్రహించేలా చేయాలి. అది పిల్లవాని ప్రతిస్పందనలో ఎంతోమార్పును తేగలదు. అలా చేయకపోతే, వారి తలిదండ్రులు వారికంటె పెద్దవారు, బలమైనవారు గనుకనే వారికి విధేయులై యుండాలనే దృష్టిని మాత్రమే వారు కల్గివుంటారు. తలిదండ్రులు వారి అభిప్రాయాలను కాదుగానీ సృష్టికర్త, ఆయన వాక్యం తెల్పేదానిని వారికి తెలియజేస్తున్నారని గ్రహించేలా పిల్లలకు వారు సహాయపడితే ఇది తలిదండ్రుల సలహాకు, నడిపింపునకు పటుత్వాన్నిస్తుంది. ఇక మరేదియు అట్టి పటుత్వాన్నివ్వలేదు. పిల్లవాని లేతవయస్సులో గడ్డు పరిస్థితులు ఎదురైతే అది వానికి అవసరమైన బలాన్నిస్తుంది. మరియు హింస లేక ఒత్తిడిలో సరియైన నియమాలకు కట్టుబడియుండుటలో కలిగే బాధను, వ్యధను పిల్లలు గుర్తించుట కారంభిస్తారు.—కీర్తన 119:109-111; సామెతలు 6:20-22.
25. సామెతలు 17:9 నందలి సలహా, తలిదండ్రులు పిల్లలను సరియైన రీతిగా శిక్షించుటకెలా సహాయపడగలదు?
25 “ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.” (సామెతలు 17:9) తండ్రి, కుమారుల మధ్య కూడ ఇది సత్యమే. ఒకసారి పిల్లవాడు తన తప్పును తెలిసికొని తానెందుకు శిక్షింపబడాలో ఎందుకు శిక్ష ఇవ్వబడిందో గ్రహించగల్గేలా చేస్తే, తండ్రి తనకున్న ప్రేమను బట్టి ఇక తాను ఆ తప్పును మాటి మాటికి ఎత్తడు. ఏ తప్పు చేసినను నీవు ద్వేషిస్తున్నది తాను చేసిన తప్పును మాత్రమేగాని నీ పిల్లవానిని కాదని అతనికి స్పష్టం చేయండి. (యూదా 23) పిల్లవాడు, తాను ‘మందు తీసుకున్నానని’ ఇక మరల దానిని గూర్చి మాటిమాటికి ప్రస్తావించడం తనను అనవసరంగా అవమానపరుస్తున్నారని తలంచవచ్చు. అలా చేస్తే అతడు తలిదండ్రులకు లేక కుటుంబములోని మిగతా పిల్లలకు దూరం కాగలడు. ఏదో పొరపాటు జరుగుతుందని తలిదండ్రులు గ్రహిస్తే ఆ విషయాన్ని తదుపది జరిగే కుటుంబ చర్చలో ప్రస్తావించవచ్చు. జరిగిన విషయాలను ఊరకనే తెలియజేసి, పునర్విమర్శించవద్దు, కాని అందులో ఇమిడియున్న సూత్రాలను, వాటిని అన్వర్తించే పద్ధతిని, నిత్యానందం కొరకు అవి ఎందుకు అంత ప్రాముఖ్యమైనవో చర్చించండి.
వివిధ పద్ధతులలో శిక్షించుట
26. అనుకున్న రీతిగా ఒకే విధమైన శిక్షకు పిల్లలందరు ఎందుకు లోబడరు?
26 “బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.” (సామెతలు 17:10) వివిధరకాలైన పిల్లలకు పలువిధాల క్రమశిక్షణలు ఇవ్వవలసి వుంటుంది. ప్రతిపిల్లవాని స్వభావాన్ని, వైఖరిని తప్పక గమనించాలి. ఒకడు అతిసున్నితంగా వుండవచ్చు, మరి అట్టివానికి శరీరసంబంధమైన శిక్ష, అనగా చేతితో కొట్టవలసిన అవసరమెప్పుడూ వుండదు. మరొకరికి దెబ్బలు అసలే పనికి రావు. లేదా ఒక పిల్లవాడు సామెతలు 29:19 నందు వర్ణించబడిన దాసునివలె వుంటాడు. “దాసుడు వాగ్దండనచేత గుణపడడు, తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు.” అట్టి పరిస్థితుల్లో పిల్లవానికి శరీర దండన అవసరమే.
27. ఒక తండ్రి తన బాబు గోడమీద గీతలు గీయకుండా ఎలా సహాయపడగలిగాడు?
27 ఒక తల్లి ఇలా చెబుతుంది:
“నా కుమారుడు రెండేండ్ల వయస్సులోనే గోడమీద క్రిందిబాగంలో ఎర్రని గీతలు గీసేవాడు. వాళ్ళ నాన్న వాన్ని పిలిచి వాటిని చూపి, ఎందుకలా గీసావని అడిగాడు. వాడు బదులేమీ చెప్పకుండ తనగ్రుడ్లు మిటకరించుకొని ఆలాగే చూస్తున్నాడు. చివరకు వాళ్ళ నాన్న వానితో ‘చూడు బాబు నేను నీ వయస్సులో వున్నప్పుడు నీలాగే గోడమీద గీతలు గీసాను. అదొక తమాషాకదా?’ అని అన్నాడు. అప్పుడా చిన్నవాడు కొంచెం తమాయించుకొని, చిరునవ్వు నవ్వుతూ గీయడం ఎంత తమాషాగా వుందో వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాళ్ళ నాన్న తాను
చెప్పినదాన్ని గ్రహించాడని వాడు తెలుసుకున్నాడు! ఆ పని తమాషా అయిననూ గోడల మీద గీతలు గీయకూడదు అని వాళ్ళనాన్న చెప్పాడు. ఇద్దరి మధ్య సంభాషణ స్థిరపడింది. మరి యీ బాబు విషయంలోనైతే, ఇంకా కొంచెం కారణసహితంగా వానితో మాట్లాడే అవసరమేర్పడింది.”28. తల్లి తన పిల్లలతో ఎట్లు వాదించకుండ వుండవచ్చును?
28 శిక్షించేటప్పుడు, బోధించడానికి ఉపదేశించడానికి గల కారణాలను తెలియజేయడం శ్రేష్ఠం, గానీ పిల్లవానితో వాదించుట అంత మంచిది కాదు. తనపాప ఒక పనిని చేసే విషయాన్ని గూర్చి వాదించినపుడు, ఒక తల్లి సున్నితంగా ఇలా అన్నది: “నీవాపని ముగిస్తే మనమందరం కలిసి పార్కుకు వెళ్లొచ్చు.” ఈ సంగతి ఆ పాపకు అప్పటికి ఆనందాన్ని కల్గించింది. ఆ పని ముగిసేవరకు ఆ సంతోషం రాదు లేక అలా బయటికి వెళ్ళడం జరగదు. తల్లి వచ్చి ఆ పని అయిపోయిందా లేదాయని చూచినపుడు ఇంకా ఆ పని కాకపోతే, “ఇంకా ఆ పని కాలేదా? ఈ పని అయిపోయిన తర్వాత మనం వెళ్దాం” అని అనేది. ఆమె వాదించేది కాదు, అయినను పనులు చేయించుకునేది.
29. తన తప్పుకు తగిన ప్రతిఫలాన్ని గూర్చి పిల్లవాడు తలంచేలా ఏమి చేయవచ్చు?
29 తప్పుడు పనులు చేసినందుకు వచ్చే ప్రతిఫలాలను గూర్చి తెలియజేయడం పిల్లలు నీతి సూత్రముల యందున్న జ్ఞానాన్ని నేర్చుకొనుటకు సహాయపడుతుంది. పిల్లవాడు మురికిచేశాడా? అయితే దాన్ని తానే శుభ్రంచేస్తే అది అతనికి దృఢమైన మంచి స్వభావాన్ని అనుగ్రహిస్తుంది. అతను నిజాయితీ లేనివాడు లేక ధిక్కరించేవానిగా ఉన్నాడా? క్షమాపణకోరడానికి నేర్చుకుంటే, తన తప్పును దిద్దుకోడానికి అదెంతగానో తోడ్పడవచ్చు. కోపంలో తానేదో ఒకదాన్ని పగలగొట్టి యుండవచ్చు. అతడు పెద్దవాడైతే ఆ వస్తువును మరల కొనడానికి డబ్బు సంపాదించవలసి వుంటుంది. కొందరు పిల్లలకు కొన్ని ఆధిక్యతలు కొంతకాలం వరకు యివ్వకపోతే వారు గుణపాఠం నేర్చుకొని చక్కబడతారు. క్రైస్తవ సంఘంలోనైతే స్నేహపూర్వకమైన సహవాసాన్ని మానుకుంటే, తప్పుచేసినవాడు సిగ్గుపడతాడు. (2 థెస్సలొనీకయులు 3:6, 14, 15) యౌవనస్థుల విషయంలోనైతే, తాత్కాలికంగా కుటుంబ సహవాసం నుండి దూరంచేస్తే, కొట్టేకన్న అదెక్కువగా పనిచేస్తుంది. పిల్లవాన్ని ఇంటిలోపెట్టి తాళంవేసే పనులు అమిత శిక్షగా పరిగణించబడి, ప్రేమ ఉపదేశించేదానికి మించిపోతుంది. నీవు ఏ పద్ధతి వుపయోగించినా సరే, వారి ప్రవర్తనకు తగిన ఫలాలను వారే భరించాలని పిల్లలకు తెలియపరచవలసిన అగత్యత వుంది. ఇది వారికి బాధ్యతను నేర్పిస్తుంది.
ప్రేమతో శిక్షించుట
30. తలిదండ్రులు, వారి పిల్లల నిమిత్తం నియమాల నేర్పరచే విషయంలో సమదృష్టి కల్గివుండడం ఎందుకు ముఖ్యం?
30 “శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు,” “పైనుండివచ్చు జ్ఞానము . . . మృదువైనది” అని జ్ఞాపకముంచుకోండి. (ఫిలిప్పీయులు 1:10; యాకోబు 3:17) చిన్న పిల్లలు, బహిర్గతమగు బలానికి సూచనయని వారు నేర్చుకోవడానికి, పరిశీలించడానికి, క్రొత్తవాటిని అన్వేషించాలని ప్రయత్నించుటలో తహతహలాడుచున్నారని జ్ఞాపకముంచుకోండి. హద్దులను, నియమాలను ఏర్పరచుటలో విచక్షణ, విశిష్టతను కనబరచండి. ఏది అగత్యమో ఏది అనవసరమో అనేవాటి మధ్య సమతూకముండాలి. హద్దులను తెలియపరచిన పిదప, ప్రతి సూక్ష్మాంశాన్ని పరిశీలించే బదులు, పిల్లవాడు ఆ హద్దులలోనే స్వేచ్ఛగా వుంటూ, దృఢసంకల్పంతో ఆనందించేలా అనుమతించండి. (సామెతలు 4:11, 12) లేకపోతే నీ పిల్లలు ‘విసుగుచెంది’ ‘క్రుంగిపోతారు,’ మరి నీవైతే నిజానికి ఏ ప్రాముఖ్యతలేని వాటిని తీవ్రమైన సమస్యలుగా మార్చినందుకు నిరుత్సాపడతావు.—కొలొస్సయులు 3:21.
31. శిక్షనిచ్చుటలో యెహోవా దేవుడు ఎటువంటి మాదిరిని కనుపరచాడు?
31 కావున, తండ్రులారా, “బుద్ధి వచ్చునని నీ కుమారుని [లేక కుమార్తెను] శిక్షింపుము,” గానీ ప్రేమతో దేవుని మార్గం ప్రకారం శిక్షించండి. ఆయనను అనుకరించండి: “తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.” గనుక నీ సృష్టికర్త మాదిరే నీవిచ్చే శిక్ష అటు ప్రయోజనకరమైనదిగాను ఇటు ప్రేమపూర్వకమైనదిగాను వుండనీయండి. ఎందుకంటే అట్టి “శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.”—సామెతలు 19:18; 3:12; 6:23.
[అధ్యయన ప్రశ్నలు]