మీ తలిదండ్రుల హృదయాలను ఉల్లసింపజేయుట
అధ్యాయము 12
మీ తలిదండ్రుల హృదయాలను ఉల్లసింపజేయుట
1. తలిదండ్రులను సన్మానించుట ఎందుకు న్యాయం?
మనమింకా చిన్నపిల్లలమైయున్నను, పెద్దవారమై ఎదుగుచున్నను, లేదా ఇప్పటికే పెద్దవారమైయున్న స్త్రీ పురుషులమైనను మనందరం మరొకరి పిల్లలమే. మన తలిదండ్రులు మనందరిని బాల్యంనుండి పెంచడానికి వారు ఇరవై సంవత్సరాలుగా పడిన కష్టం, చేసిన సేవ, వ్యయపరచిన ధనం, త్యాగశీలతతో కూడిన ప్రయత్నం మున్నగు వాటికి మనం విలువ కట్టలేం. నిజానికి మన తలిదండ్రులు, బహుశ మనం వారికి తిరిగి చెల్లించలేనంత సేవ మనకొరకు చేసియున్నారు. మనం వారికి మన ప్రస్తుత జీవితాన్నే రుణపడియున్నాము. వారే లేకపోతే మనం లేము. ఈ నగ్నసత్యమే మనం దైవాజ్ఞకు విధేయులం కావడానికి హేతువైయుంది: “నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.”—ఎఫెసీయులు 6:2, 3.
2. మన తలిదండ్రులకు మనము రుణపడి యున్నామని మనమెందుకు భావించాలి?
2 మొదట మనం సమస్తజీవానికి కారకుడైన సృష్టికర్తకు రుణపడియున్ననూ, మన తలిదండ్రులకు కూడ మనమెంతో రుణపడి యున్నామనే భావన కల్గియుండాలి. వారు మనకిచ్చిన వాటన్నిటికి మనం తిరిగి వారికేమి చెల్లించగలం? లోకంలో వున్న ధనమంతా ప్రాణాన్ని కొనజాలదని దేవుని కుమారుడు తెలిపాడు, ఎందుకంటే నీవు ప్రాణానికి విలువకట్టలేవు. మార్కు 8:36,37; కీర్తన 49:6-8) దేవుని వాక్యం మనకిలా తెల్పుతుంది: “ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు.” (రోమీయులు 13:8) మనము మన తలిదండ్రులు జీవించినంతకాలం ఒక ప్రత్యేకరూపంలో మనం వారికి రుణపడి యున్నామన్నట్లు వారి ఎడల మనం ప్రేమను కనబరుస్తునే యుండాలని తలంచాలి. వారు మనకు ప్రాణం పోసినట్లే మనం వారికి ప్రాణం పోయలేకపోయినను, వారు మంచి జీవితాన్ని గడపడానికి వారికి ఏదో రూపేణ మనం సహాయపడవచ్చును. వారి ఆనందం, ఆత్మ సంతృప్తి కొరకు మనం తోడ్పడవచ్చును. ఇతరులెవరునూ చేయలేని, ఒక ప్రత్యేక రూపంలో దాన్ని మనం చేయగలం, ఎందుకంటే మనం వారి పిల్లలము.
(3. సామెతలు 23:24, 25 ప్రకారం పిల్లవానిలోనున్న ఎలాంటి ప్రవర్తన తలిదండ్రులకు ఆనందం కల్గిస్తుంది?
3సామెతలు 23:24, 25 ఇలా అంటుంది: “నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.” వారి పిల్లలు చేసే క్రియలను చూచి తలిదండ్రులెంతో గర్వించి, ఆనందించుట వారికున్న సహజ కోరిక. మరి మన తలిదండ్రుల విషయంలో కూడ ఇది నిజమా?
4. కొలొస్సయులు 3:20, పిల్లలేమి చేయాలని ఉపదేశిస్తుంది?
4 మనం వారి స్థానాన్ని నిజంగా గౌరవించి వారి సలహాను పాటించుటపై ఇది ఎక్కువగా ఆధారపడివుంది. ఇంకను పసివారిగానే వున్నవారికి దేవుని హెచ్చరిక ఇలావుంది: “పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రులమాట వినుడి. ఇది; ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.” (కొలొస్సయులు 3:20) “అన్ని విషయములలో” అన్నపుడు దేవుని వాక్యానికి విరుద్ధమైనవాటిని చేయాలని తలిదండ్రులు కోరే అధికారం వారికుందని భావంకాదు, అయితే మనమింకను చిన్నవారమైయుండగనే, మనలను జీవితమందున్న అన్ని రంగాలలో నడిపించే బాధ్యత వారిపై వుందని అది తెల్పుతుంది.—సామెతలు 1:8.
5. యౌవనస్థుడు తాను పొందబోవు పిల్లలనుండి నిరీక్షించే దానిని గూర్చి తానేమి ప్రశ్నించుకోవాలి?
సామెతలు 17:25 తెల్పుతుంది: “బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెస్తాడు, తనను కనినదానికి అట్టి వాడు బాధ కలుగజేస్తాడు.” (ది బైబిల్ ఇన్ లివింగ్ ఇంగ్లీష్) నీ తలిదండ్రులను సంతోషపరచుటకు నీలో ప్రత్యేకమైన నేర్పరితనమున్నట్లే, ఇతరులకంటె నీవే తలిదండ్రులకు దుఃఖం, వేదన కల్గించవచ్చు. అది ఎలా వుంటుందో నీ ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
5 నీవిప్పుడు యౌవనస్థుడవా? ఒకనాటికి నీవు తండ్రివౌతావు. నిన్ను గౌరవించే పిల్లలు కావలెనా లేక నీకు ఎదురు తిరిగి, నీ ఎదుట నీ మాట వినేవారిగా కనబడి నీవు లేనప్పుడు నీ మాట లెక్క చేయని పిల్లలను కోరుకుంటావా? అప్పుడు అలాంటివారు నీకు ఆనందాన్ని కల్గించే బదులు, ఇలా జరుగుతుందనిజ్ఞానార్జనకు సమయం పడుతుంది
6. వయస్సుతోపాటు జ్ఞానం కల్గుతుందని ఏ ఉదాహరణ తెల్పుతోంది?
6 జ్ఞానార్జనకు వయస్సు అవసరమని యౌవనస్థులు గ్రహించుట మంచిది. నీకిప్పుడు 10 సంవత్సరాలున్నవా? నీకు 5 సంవత్సరాలున్నప్పటికంటె ఇప్పుడు నీకు ఎక్కువ తెలుసు కదా? నీకు 15 సంవత్సరాలున్నవా? నీకు 10 సంవత్సరాలున్నప్పటికంటె ఇప్పుడు నీకే ఎక్కువగా తెలుసు, అవునా? నీకు 20 సంవత్సరాలు వస్తున్నాయా? నీకు 15 సంవత్సరాలు ఉన్నప్పటికంటె ఇప్పుడే అధికంగా తెలుసునని నీవు గ్రహించాలి. వెనుదిరిగి గమనిస్తే వయస్సు నిన్ను జ్ఞానవంతుని చేస్తుందని తెలిసికొనడం సులభమే గాని, రాబోవు కాలం కొరకు ఎదురుచూచి యీ సత్యాన్నంగీకరించుట కష్టం. తానెంతో జ్ఞానవంతుడని యౌవనస్థుడు భావించిననూ, భవిష్యత్తు అతనికి లేక ఆమెకు అధికజ్ఞానాన్ని ఇవ్వగలదని, ఇస్తుందని గ్రహించాలి.
7. రాజగు రెహబామునకిచ్చిన హెచ్చరికనుండి జ్ఞానాన్ని గూర్చి మనమెలాంటి గుణపాఠాన్ని నేర్చుకోగలం?
7 దీని భావమేమిటి? అంటే నీ తలిదండ్రులు వయస్సులో నీకంటె పెద్దవారు, అనుభవంలో నీకంటె గొప్పవారు గనుక న్యాయంగా వారు నీ జీవిత సమస్యలను తీర్చుటలో కూడ జ్ఞానవంతులనుట సమంజసమే. యోబు 12:12; 1 రాజులు 12:1-16; 14:21.
అనేకమంది యౌవనస్థులకు దీనిని అంగీకరించడం కష్టమే. వారు పెద్దవారిని “పాతకాలం మనుష్యులని” అనవచ్చు. నిజమే కొందరు ఆలాగుండవచ్చునేమో గానీ అందరూ అలా వుండరు. కొందరు పిల్లలు బాధ్యతారహితులైననూ, అందరు యౌవనస్థులు బాధ్యతారహితులు ఎలా కారో అలాగే వీరు కూడ అందరూ పాతకాలపు మనుష్యులేమీ కాదు. పెద్దలకంటే వీరే జ్ఞానవంతులని యౌవనస్థులు తలంచడం అసాధారణమేమీ కాదు. ఇశ్రాయేలీయుల రాజు ఒకడు ఈ తెలివితక్కువ పనే చేసి దుష్ఫలితాలను తెచ్చుకున్నాడు. తన తండ్రియైన సొలొమోను అనంతరం 41 సంవత్సరాల వయస్సు గల రెహబాము రాజైనప్పుడు, ప్రజలు తమ భారములను తగ్గించమని అడిగారు. అప్పుడు రెహబాము పెద్దలను సంప్రదించాడు, వారు దయాదాక్షిణ్యం, జాలిని గూర్చిన సలహాల నిచ్చారు. అటుపిమ్మట ఆయన యౌవనస్థులను సంప్రదించాడు, వారు కఠినమైనవాటిని గూర్చి సలహా ఇచ్చారు. ఆయన వారి సలహా తీసికున్నాడు. తత్ఫలితమేమిటి? ఆ 12 గోత్రాలలో పది గోత్రాల వారు తిరుగుబాటు చేశారు, మరియు రెహబామునకు తన రాజ్యంలో ఆరవభాగం మాత్రమే మిగిలింది. యౌవనస్థులుకాదు పెద్దలే జ్ఞానయుక్తమైన సలహా ఇచ్చారు. “వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది.”—8. తలిదండ్రులతో సహా పెద్దల ఎడల ఎలాంటి స్వభావాన్ని కనబరచాలని బైబిలు ప్రోత్సహిస్తుంది?
8 నీ తలిదండ్రులు ఇక యౌవనస్థులేమీ కాదు గనుక వారి సలహా ప్రస్తుత కాలానికి పనికిరాదని అలక్ష్యపరచవద్దు. అయితే బైబిలు ఇలా తెల్పుతుంది: “నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.” వయస్సుకు గౌరవమీయాలి. “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.” నిజమే, అనేకమంది యౌవనస్థులు ఈ ఆజ్ఞలను అలక్ష్యం చేస్తున్నారు. అలా చేయడంవల్ల—వారికిగాని, నిశ్చయంగా వారి తలిదండ్రులకుగాని—ఎవరికీ సంతోషం తీసుకురాలేదు.—సామెతలు 23:22; లేవీయకాండము 19:32.
నీ విధిని నిర్వర్తించు
9. కుటుంబంలో ఒకరు అనవసరంగా ఫిర్యాదు చేస్తుంటే లేక ఎదురు తిరిగితే అది కుటుంబంపై ఎలాంటి ప్రభావం కల్గి వుంటుంది?
9 నీవు చేసేది ఇతరులపై ప్రభావం కల్గి వుంటుందనటానికి తిరుగేలేదు. కుటుంబంలో ఒకరు బాధపడితే అందరికి బాధకలుగుతుంది. మరి ఒకరు ఫిర్యాదులు చేస్తూ లేదా ఎదురు తిరుగుతూ ఉంటే, కుటుంబ సమాధానమంతా చెదిరిపోతుంది. సంతోషభరితమైన కుటుంబ జీవితం కలిగి వుండడానికి ప్రతి ఒక్కరు తమ వంతు నిర్వర్తించాలి.—1 కొరింథీయులు 12:26 పోల్చండి.
10. పిల్లలు మంచిపని చేయడానికి నేర్చుకొనుట ఎందుకు ప్రయోజనకరం?
10 నీవు చేయగల్గిన సునిశ్చితమైన పనులున్నాయి. తలిదండ్రులు కుటుంబ పోషణార్థం కష్టపడి పని చేస్తారు. నీవు చిన్నవాడవై ఇంటి దగ్గరే వుంటే నీవు కూడ వారికి సహాయపడవచ్చు. జీవితంలో అధిక భాగాన్ని మనం పనిలోనే గడుపుతాం. కొందరు దాని విషయంలో సణుగుతారు. అయితే నీవు మంచిపని చేయడానికి, దాన్ని సదభిప్రాయంతో చేయడానికి నేర్చుకుంటే ఇది నీకు నిజమైన సంతృప్తినిస్తుంది. కానీ తన విధిని నిర్వహించని వానికిని, తన కొరకు ఇతరులే ఆ పనులు చేయాలని తలంచేవానికిని అలాంటి సంతృప్తి ఎన్నటికీ దొరకదు. అలాంటివ్యక్తి ఇతరులను వేధించేవాడై, బైబిలు తెల్పేరీతిగా ‘కన్నులకు పొగవంటి వాడగును.’ (సామెతలు 10:26; ప్రసంగి 3:12, 13) కావున, నీకు యింట్లో కొన్ని పనులు అప్పగింపబడినపుడు వాటిని చెయ్, బాగా చెయ్. నీ తలిదండ్రులకు ఆనందాన్ని కలుగజేయాలని నీవు నిజంగా కోరితే, అడగకుండానే ఇంకా కొన్ని ఎక్కువ పనులు చెయ్. బహుశ ఆ పనిలో నీవు ఆనందాన్ని పొందవచ్చు, ఎందుకంటే వారికి ఆనందాన్ని కల్గించే అభిలాషతో నీవు హృదయ పూర్వకంగా ఆ పని చేశావుగదా.
11. పిల్లల మాటలు లేక క్రియలు ఎలా వారి తలిదండ్రులకు ఘనతను తెస్తాయి?
11 ప్రజలు, యౌవనస్థుని క్రియలనుబట్టి అతన్ని మెచ్చుకుంటే, అపుడు వారు ఆ పిల్లవాడు ఎవరి కుమారుడు లేదా ఆమె ఎవరి కుమార్తె అని కూడ తెలిసికొనగోరతారు. బాలుడైన దావీదు బహు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కనబరచినపుడు సౌలురాజు వెంటనే, “ఈ యౌవనుడు ఎవని కుమారుడని” 1 సమూయేలు 17:55-58) నీ కుటుంబం పేరు ప్రతిష్ఠలను నీవు భరిస్తున్నావు. నీవుచేసే పనులను బట్టి నీవెట్టి వ్యక్తివో దాన్నిబట్టి ప్రజలు ఆ పేరును పరిగణించే తీరుపైన దానిని నీకిచ్చిన నీ తలిదండ్రులపైన అది ప్రాబల్యము కల్గి వుంటుంది. ఇతరుల ఎడల దయచూపిస్తూ సహాయం చేస్తూ మర్యాదతో స్నేహపూర్వకంగా మెలగడంవల్ల నీ తలిదండ్రులకు, నీ ఇరుగుపొరుగులందు, నీ పాఠశాలయందు ఘనత తెచ్చే అవకాశాలెన్నో వున్నాయి. అలా చేయడంవల్ల నీ సృష్టికర్తను కూడ నీవు మహిమపరుస్తావు.—సామెతలు 20:11; హెబ్రీయులు 13:16.
అడిగాడు. (12. తలిదండ్రులు తర్ఫీదునివ్వడంలో పిల్లలు వారి తలిదండ్రులకు సహకరించుట ఎందుకు మంచిది?
12 నీ తలిదండ్రుల సంతోషము నీ సంతోషముతో ముడివేయబడినది. నిన్ను జీవమార్గములో, నీకు మంచి ప్రారంభదశనియ్య వలెననే దృష్టితోనే వారు నీకు తర్ఫీదు నిస్తున్నారు. నీవు వారితో సహకరించుము. అప్పుడు నీవు వారిని సంతోషపరచగలవు. ఏలయనగా వారు నీకు శ్రేష్ఠమైనది జరగాలని అపేక్షిస్తారు. ప్రేరేపితుడైన రచయిత ఇలా వ్యక్తపరచాడు: “నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.” (సామెతలు 23:15) నిన్ను నిజమైన జ్ఞానమందు నడుపవలెననే బాధ్యతను వారు దేవునివలన పొందియున్నారని గుర్తెరిగియున్నచో వారట్టి బాధ్యతను నమ్మకముగా నిర్వహించుటకు వారికి నీవు తోడ్పడుము. “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.”—సామెతలు 19:20.
13. తలిదండ్రులు విధించే ఆంక్షల విషయంలో పిల్లవాడు సరియైన దృష్టిని కల్గివుండేలా వానికి సహాయ పడేదేమిటి?
13 నీ తలిదండ్రులు నిన్ను ఎక్కువగా పనిచేయవలెనని కోరుచున్నట్లు లేదా వారు పెట్టిన ఆంక్షలు అనేకములని నీవు తలంచు సమయములుండవచ్చును. శిక్షాదండము విషయంలో సమతూకం కల్గియుండుట సులభమైన విషయం కాదు. ఏదొకనాడు నీవును నీ స్వంత కుటుంబాన్ని కల్గియున్నపుడు, నీవు కూడ అలాంటి సమస్యలనే ఎదుర్కొనెదవేమో. కొందరు యౌవనస్థులతో సహవాసము చేయకూడదని నీ తలిదండ్రులు నీపై ఆంక్షలు విధిస్తే లేక మత్తుపదార్థాలు సేవించకుండ ఆటంకము తెల్పితే సామెతలు 13:20; 3:31) వారి ఉపదేశములను లక్ష్యపెట్టుము. అప్పుడు నీకు ప్రయోజనము కల్గును, నీవు వారి హృదయములను సంతోషపెట్టగలవు.—సామెతలు 6:23; 13:1; 15:5; హెబ్రీయులు 12:7-11.
లేక స్త్రీ పురుషులతో సహవాసము విషయములో కొంత హద్దులుంచితే అప్పుడు నీవు కొంచెము ఆలోచించుము. ఏది మంచిది, వీటిని లెక్కచేయని వారా లేక క్రమశిక్షణనిచ్చే తలిదండ్రులేవుంటే మంచిదా! (14, 15. కుటుంబ సభ్యుల్లో సమస్యలు వచ్చునపుడు, బైబిలునందలి ఏ సూత్రాలను అమలుపరచుట ఇంటిలో ప్రశాంతపరిస్థితిని కాపాడడానికి పిల్లవానికి సహాయపడును?
14 నిజమే, కుటుంబంలో తలెత్తే అనేక సమస్యలు నీవలన వస్తాయని కాదు. కానీ నీ ప్రతిచర్య నీ కుటుంబ పరిస్థితిని ప్రభావితం చేయగలదు. బైబిలిలా హెచ్చరిస్తుంది: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” (రోమీయులు 12:18) ఇలా చేయుట ఎప్పుడూ అంత సులభమేమికాదు. మనందరం విభిన్న వ్యక్తులం; మన అభిప్రాయాలు అభిరుచులు కల్గివుండ వచ్చు, బహుశ నీ సోదరునితో గానీ నీ సోదరితో గాని నీకు భేదాభిప్రాయం ఉండవచ్చు. ఎదుటి వ్యక్తి స్వార్థప్రియుడని నీవు అనుకోవచ్చు. అప్పుడేమి చేస్తావు?
15 కొందరు పిల్లలు వెంటనే కేకలు వేసి నిందిస్తూ అమ్మానాన్న అందులో జోక్యం చేసుకోవాలని పట్టుపడతారు. లేదా వారే జోక్యం చేసుకొని ఓ దెబ్బకొట్టి వారనుకున్నదానిని సాధిస్తారు. అయితే ప్రేరేపిత సామెత ఇలా అంటుంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును.” (సామెతలు 19:11) ఏ విధంగా? ఆ పరిస్థితులలో అతడు తన్ను తాను తగ్గించుకొనునట్లు అది చేయవచ్చును. (బహుశ బుద్ధిపూర్వకంగా తప్పుచేసి వుండకపోవచ్చు.) తానే ఎన్నోసార్లు తప్పు చేసినట్లు అతడు జ్ఞాపకం తెచ్చుకొనేలా చేస్తుంది. (అప్పుడతన్ని దేవుడు క్షమించినందుకై అతడెంత కృతజ్ఞుడై యుంటాడో!) తన సోదరుడు లేక సోదరి తప్పు చేసిననూ, కుటుంబ ప్రశాంత పరిస్థితిని చెరపడంలో తనదే తప్పని అతడు గ్రహించేలా అది చేస్తుంది. అట్టి వివేచనగల వ్యక్తిని గూర్చి సామెత ఇంకా ఇలా తెల్పుతుంది: “తప్పులు క్షమించుట అట్టివానికి ఘనత నిచ్చును.”—కొలొస్సయులు 3:13, 14 కూడ చూడండి.
16. పిల్లలు ఎలాంటి ప్రవర్తన కల్గియుండడం మూలంగా దైవభయంగల తలిదండ్రులు ఆనందిస్తారు?
కీర్తన 78:36-41) యెహోవా దేవుని హృదయాన్ని ఎరుగని తలిదండ్రులు, వారి పిల్లలు యీ లోకంలో ప్రసిద్ధిచెందినపుడు, పేరుప్రతిష్ఠలు సంపాదించినపుడు, ఎంతో ధనార్జన చేసినపుడు, ఇంకా ఇటువంటి కార్యాలు చేసినపుడు ఉప్పొంగిపోవచ్చును. అయినను యెహోవాను తమకు దేవునిగా గల తలిదండ్రులు, యీ లోకం దాని నటన గతించిపోతుంది, “గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని ఎరిగియున్నారు. (1 యోహాను 2:15-17) కావున, నిజంగా వారిని సంతోషపరచేదేమంటే తమ పిల్లలు వారి సృష్టికర్తకు లోబడి, ఆయన చిత్తాన్ని నెరవేర్చి, ఆయన లక్షణాలను ప్రతిబింబించుటే. నిజమే, పిల్లలు పాఠశాలలో బాగా చదువుకుంటూవుంటే దైవభక్తిగల తలిదండ్రులు ఆనందిస్తారు. అయితే పాఠశాలలోను, ఇతర స్థలాల్లోను దేవుని కట్టడలకు నమ్మకత్వాన్ని కనబరస్తూ ఆయనను ప్రీతిపరుస్తున్నట్లు వారి ప్రవర్తనలో ప్రతిబింబించినప్పుడు వారు మరెక్కువగా సంతోషిస్తారు. పిల్లలు పెద్దవారయ్యేంతవరకు యెహోవా అడుగుజాడలలో నడుచుకోవడం చూచి వారు అత్యధికంగా సంతోషిస్తారు.
16 ముఖ్యంగా తలిదండ్రులను ఆనందపరచేదేమిటో అదే యెహోవా హృదయాన్ని ఆనందపరుస్తుంది. వారికి బాధ కల్గించేదేదో అది ఆయనకు కూడ బాధ కల్గిస్తుంది. (తలిదండ్రులను పోషించే బాధ్యత
17-19. పెద్దవారైన కుమారులు, కుమార్తెలు, వారి తలిదండ్రులకు ఎలా కృతజ్ఞత చూపగలరు?
17 మనం పెద్దవారమై తలిదండ్రుల నుండివేరై జీవిస్తున్నంత మాత్రాన వారి యెడల మన బాధ్యత తగ్గిపోకూడదు. తమ జీవితాంతం వారు ఆనందించాలని మన కోరిక. అనేక సంవత్సరాలుగా వారు మనలను పోషించి తరచూ త్యాగశీలతతో మనలను పరామర్శించారు. వారికి కృతజ్ఞులమై యున్నామని తెలపడానికి ఇప్పుడు మనమేమి చేయాలి?
18 మనం దైవాజ్ఞను మనస్సు నందుంచుకోవాలి: “తలిదండ్రులను సన్మానింపుము.” (మత్తయి 19:18) మనకు విరామం దొరక్కపోవచ్చు. అయితే మనం వారిని దర్శించి మనమేమో చెప్పాలని వారెంతో ఆశపడతారని మనం గుర్తించవలసిన అవసరముంది.
19 కాలం గడిచేకొలది, ఇతర విధాలుగా వారిని “సన్మానించ” వచ్చును. ధనసహాయం అవసరమైతే, నీకు చేసినదానికంతటికి కృతజ్ఞతగా ఇప్పుడు వారికి సహాయం చేయండి, అంతేగాక యెహోవా నీతియుక్తమైన కట్టడలకు అనుగుణంగా వారికి తోడ్పడండి. అపొస్తలుడైన పౌలు వృద్ధులను గూర్చి ఇలా వ్రాశాడు: “నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.”—1 తిమోతి 5:3, 4.
20, 21. (ఎ) మత్తయి 15:1-6 ప్రకారం, తలిదండ్రులను సన్మానించడంలో ఏమి ఇమిడివుంది? (బి) ఈ విధంగా తలిదండ్రులను సన్మానించడంలో సాకుచెప్పి తప్పించుకొనగలదేమైనా వుందా?
20 తలిదండ్రులను “సన్మానించుటలో” వారికి భౌతికంగా సహాయం చేయుట కూడ ఇమిడివుందని లేఖనాల్లో స్పష్టంగా తెలుపబడింది. ఒకసారి పరిసయ్యులు యేసును సమీపించి, ఆయన శిష్యులు పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారని నిందించారు. యేసు వారినిలా తిరిగి నిందించాడు: “మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?—తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే—ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి—నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.”—మత్తయి 15:1-6.
21 ఆనాడు వారికున్న ధనము లేక ఆస్తి “దేవార్పితమని” బహిరంగంగా తెలియజేయుట ద్వారా వారు, పారంపర్యాచారం ప్రకారం వారి తలిదండ్రులను పోషించే బాధ్యత వారికి లేదన్నట్లు తెలిపేవారు. కానీ యేసు దానికి అంగీకరించలేదు. మరి మనం కూడ యీనాడు దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.
నిజమే, కొన్ని దేశాలలో “సాంఘిక సంక్షేమం” అనే కార్యక్రమం వున్నందువల్ల వృద్ధులైనవారిని ఆ సంస్థలు పోషిస్తున్నాయి. అయితే ఆ సంస్థలిచ్చే పోషణ వారికి సరిపోతుందా? అవి చాలకపోతే, లేక అలాంటి ఏర్పాట్లు లేకపోతే, పిల్లలు తలిదండ్రులను సన్మానించి వారి అవసరాలను తీర్చడానికి వారి శాయశక్తుల కృషిచేస్తారు. సహాయం అవసరమైన వృద్ధ తలిదండ్రులను పోషించడం నిజంగా అపొస్తలుడైన పౌలు అన్నట్లు “దైవభక్తికి” రుజువును అంటే కుటుంబ ఏర్పాటునకు కర్తయైన యెహోవా దేవుని ఎడల భక్తిని కనబరచినట్లవుతుంది.22. మన తలిదండ్రులకు భౌతికావసరాలతోపాటు మరేమి కూడ ఇవ్వాలి?
22 మన తలిదండ్రులకు వారి వృద్ధాప్యంలో వారికి కావలసినంత ఆహారాన్ని, దుస్తులను, వసతిని ఏర్పాటు చేస్తే ఇక వారికి అంతకంటె కావలసిందేమిటి అని మనం ఎన్నటికి తలంచకూడదు. వారికి భావోద్రేక, ఆత్మీయ అవసరతలు కూడా ఉన్నాయి. వారి ఎడల ప్రేమ చూపిస్తూ, శ్రద్ధవహించుట అవసరం. అనేకసార్లు వారు ఇవి కావాలని వారు ఎంతగానో కోరుకుంటారు. మన జీవితమంతటిలో మనం తెలిసికోవలసిందేమంటే, ఎవరో మనయెడల ప్రేమను వ్యక్తపరుస్తున్నారని, మనం ఎవరికో సంబంధించిన వారమని, మనం ఒక్కరమే కాదని మనమెరుగవలసిన అవసరముంది. పిల్లలు వృద్ధ తలిదండ్రుల భౌతిక సంబంధమైన లేక మానసిక అవసరతలను తీర్చుటలో వెనుకంజ వేయకూడదు. “తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.”—సామెతలు 19:26.
23. పిల్లవాడు తన తలిదండ్రుల సంతోషానికెట్లు కారకుడు కాగలడు?
23 యౌవనదశనుండి వయోజన దశవరకు, పిల్లలు వారి తలిదండ్రుల జీవితాల్లో ప్రధాన స్థానం వహిస్తున్నారు. అనేకమంది పిల్లలు వారి తలిదండ్రుల దుఃఖం, మనోవేదనకు కారణమైయున్నారు. అయితే నీవు నీ తలిదండ్రుల స్థానానికి గౌరవమిచ్చి వారి హెచ్చరికను వింటే, నీవు వారి ఎడల నిజమైన ప్రేమను, కృతజ్ఞతను వెలిబుచ్చితే, నీవు వారి హృదయాలకెంతో ఆనందాన్నివ్వగలవు, అవును, “నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి.”—సామెతలు 23:25. న్యూ ఇంగ్లీష్ బైబిల్.
[అధ్యయన ప్రశ్నలు]