పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము
పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము
యేసు భూమిపై ఉన్నప్పుడు: “నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక,” అని దేవుని రాజ్యము కొరకు ప్రార్థించుమని తన అనుచరులకు చెప్పెను. (మత్తయి 6:9, 10) అంతేకాకుండా, ఆయన “రాజ్యసువార్తను” గూర్చి ఎడతెగక మాట్లాడెను. (మత్తయి 4:23) వాస్తవమునకు, ఆయన రాజ్యమును గూర్చి మాట్లాడి నంత ఎక్కువగా మరిదేనిని గూర్చియు మాట్లాడలేదు. ఎందుకు? ఎందుకనగా, ఈనాడు, జీవితమును ఇంతగా దుర్భరము చేయుచున్న సమస్యలను తీర్చుటకు ఒక సాధనముగా దేవుడు ఈ రాజ్యమును ఉపయోగించును. ఈ రాజ్యము ద్వారా దేవుడు అతిత్వరలోనే యుద్ధములను, కరవును, వ్యాధిని, నేరములను అంతమొందించి ఐక్యతను, సమాధానమును తెచ్చును.
అట్టి లోకములో జీవించుటకు మీరు ఇష్టపడుచున్నారా? అట్లయిన ఈ చిన్నపత్రికను మీరు చదువవలెను. ఆ రాజ్యము ఒక ప్రభుత్వమనియు, అయితే అది ఇప్పటివరకు మానవజాతిని పరిపాలించిన మరియేయితర ప్రభుత్వములకంటెను మేలైనదనియు, దీనియందు మీరు నేర్చుకొందురు. ఆ రాజ్యమునకు సంబంధించిన తన సంకల్పములను పులకరింత కలుగజేయు మార్గములో దేవుడు తన సేవకులకు క్రమేణి వివరించిన దానినికూడ చూడగలరు. అంతేకాకుండా, ఆ రాజ్యము ఈ దినమందును మీకెట్లు సహాయపడగలదో మీరు చూచెదరు.
వాస్తవమునకు, నీవు ఇప్పుడే దేవుని రాజ్యపౌరునిగా కాగలవు. అయితే, అలా ఎంపికచేసికొనుటకు ముందు, మీరు దానిని గూర్చి మరి ఎక్కువ తెలిసికొనుట అవసరము. కాబట్టి ఈ చిన్నపత్రికను మీరు పరిశీలించవలెనని మేము మిమ్మును ప్రోత్సహించుచున్నాము. ఆ రాజ్యమును గూర్చి ఇది తెలియజేయునదంతయు బైబిలునుండి తీసికొనబడినది.
అన్నింటికంటే ముందుగా, దేవుని రాజ్యము మనకెందుకంత అవసరమో చూద్దాము.
మానవచరిత్రారంభమున, దేవుడు మానవుని పరిపూర్ణునిగా చేసి పరదైసులోనుంచెను. ఆ సమయమున ఆ రాజ్యముయొక్క అవసరత లేకుండెను.
ఏదిఏమైనను, మనమొదటి తలిదండ్రులైన ఆదాము, హవ్వలు, తిరుగుబాటుదారుడైన ఒకదూత మాటను, అనగా సాతాను చెప్పినమాటను వినిరి. అతడు వారికి దేవునిగూర్చి అబద్ధములను చెప్పి వారును దేవునియెడల తిరుగుబాటుచేయునట్లుగా చేసెను. “పాపము వలన వచ్చు జీతము మరణము,” గనుక, ఆ విధముగా వారు మరణమునకు పాత్రులైరి.—రోమీయులు 6:23.
అపరిపూర్ణుడును, పాపియునైన నరుడు పరిపూర్ణులైన పిల్లలను కలిగియుండలేడు. కాబట్టి, ఆదామునకు కలిగిన పిల్లలందరు అపరిపూర్ణులుగాను, పాపులుగాను, మరణమునొందువారిగాను జన్మించిరి.—రోమీయులు 5:12.
అప్పటినుండి, మానవులకు పాప, మరణముల శాపమునుండి విడుదలపొందుటకు సహాయపడుటకుగాను దేవుని రాజ్యము కావలసివచ్చెను. అట్లే ఈ రాజ్యము, దేవుని నామమునకు విరుద్ధముగా సాతాను పలికిన అబద్ధములనుండి కూడా ఆ నామమును పవిత్రపరచును.
ఆదికాండము 3:15) ఈ సంతానము దేవునిరాజ్యమునకు రాజుగాయుండును.
మానవజాతిని పాపమునుండి విడుదల చేయుటకు ఒక ప్రత్యేక “సంతానము” జన్మించునని యెహోవా దేవుడు వాగ్దానము చేసెను. (ఆయన ఎవరైయుండును?
ఆదాము పాపముచేసిన షుమారు 2,000 వేల సంవత్సరముల తరువాత అబ్రాహాము అను బహువిశ్వాసముగల ఒకవ్యక్తి జీవించెను. తనస్వంత పట్టణమును విడిచివెళ్ళి పాలస్తీనా దేశములో గూడారములయందు నివసించుమని యెహోవా అబ్రాహాముతో చెప్పెను.
అతికష్టమైన ఒక పనితోసహా యెహోవా తనకు చెప్పిన ప్రకారము అబ్రాహాము యావత్తు చేసెను. ఒక బలిపీఠము మీద తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని యెహోవా ఆయనకు చెప్పెను.
నిజానికి యెహోవా మానవబలిని కోరలేదు. అయితే అబ్రాహాము తననెంతగా ప్రేమించెనో ఆయన తెలిసికొనగోరెను. అబ్రాహాము ఇస్సాకును చంపుటకు సిద్ధపడుచుండగా యెహోవా ఆయనను ఆపుజేసెను.
అబ్రాహామునకుగల గొప్పవిశ్వాసమునుబట్టి, పాలస్తీనా దేశమును అతని సంతానమునకిచ్చెదనని యెహోవా వాగ్దానము చేయుటయేగాక, ఆ వాగ్దత్త సంతానము ఆయనద్వారాను, ఆయన కుమారుడైన ఇస్సాకుద్వారాను వచ్చునని చెప్పెను.—ఆదికాండము 22:17, 18; 26:4, 5.
ఇస్సాకునకు ఏశావు, యాకోబు అను కవల కుమారులు కలిగిరి. వాగ్దానము చేయబడిన ఆ సంతానము యాకోబు ద్వారా వచ్చునని యెహోవా చెప్పెను.—ఇశ్రాయేలు అనికూడా యెహోవా పేరుపెట్టిన యాకోబునకు 12 మంది కుమారులు కల్గిరి, వారందరును పిమ్మట పిల్లలను కనిరి. కాగా అబ్రాహాము సంతానము వృద్ధియగుట ప్రారంభమాయెను.—ఆదికాండము 46:8-27.
ఆ ప్రాంతములో తీవ్రమైనకరవు ఏర్పడినప్పుడు, ఐగుప్తు పాలకుడైన ఫరో ఆహ్వానమునుబట్టి యాకోబు అతని కుటుంబము ఐగుప్తునకు కదలిపోయెను.—ఆదికాండము 45:16-20.
వాగ్దానము చేయబడిన ఆ సంతానము యాకోబు కుమారుడైన యూదా సంతతినుండి వచ్చునని ఐగుప్తునందు వెల్లడయ్యెను.—ఆదికాండము 49:10.
చివరకు, యాకోబు మరణించెను, అయితే, ఆయన సంతానము ఒక జనాంగమగునంతగా తయారగు పర్యంతము పెరిగెను. కాగా ఐగుప్తీయులు వారి విషయమై భయపడి వారిని బానిసలుగా చేసిరి.—నిర్గమకాండము 1:7-14.
ఆ తరువాత ఇశ్రాయేలు పిల్లలు స్వేచ్ఛగా వెళ్ళిపోవుటకు వారిని విడిచిపెట్టవలెనని యెహోవా ఫరోను గట్టిగా అడుగుటకు మిక్కిలి నమ్మకమైన మనిషిని, అనగా మోషేను పంపెను.—అందుకు ఫరో నిరాకరించెను, కాగా యెహోవా ఐగు ప్తుపై పది తెగుళ్ళను రప్పించెను. చివరితెగులుగా ఐగుప్తువారల జ్యేష్ఠకుమారులనందరిని హతమార్చుటకు ఆయన మరణము కలిగించు ఒక దూతను పంపెను.—నిర్గమకాండము, 7 నుండి 12 అధ్యాయములు.
వారి సాయంకాల భోజనముకొరకు ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తములో కొంతభాగమును వారి ద్వారబంధములపైన పూసినయెడల మరణమును కలిగించు దూత వారి గృహములను దాటివెళ్ళునని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పెను. అలా ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులు రక్షింపబడిరి.—నిర్గమకాండము 12:1-35.
దాని ఫలితముగా ఐగుప్తును విడిచివెళ్ళుమని ఫరో ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించెను. అయితే ఆ తరువాత అతడు తన మనస్సును మార్చుకొని వారిని మరలావెనుకకు తెచ్చుటకుగాను వారిని వెంటాడెను.
ఎర్ర సముద్రముగుండా తప్పించుకొనుటకు యెహోవా ఇశ్రాయేలీయులకు మార్గమేర్పరచెను. ఫరో, అతని సైన్యము వారిని వెన్నంటివెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు వారు దానిలో మునిగిపోయిరి.—నిర్గమకాండము 15:5-21.
ఆ అరణ్యములో సీనాయి అను పర్వతమునొద్దకు యెహోవా ఇశ్రాయేలీయుల కుమారులను నడిపించెను. అక్కడ ఆయన వారికి తన ధర్మశాస్త్రమునిచ్చి, దానిననుసరించిన యెడల వారు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధజనముగాను అగుదురని చెప్పెను. ఆ విధముగా కొంత కాలమునకు, ఇశ్రాయేలీయులు దేవుని రాజ్యము యొక్క ముఖ్యమైన భాగముగా అగుటకు వారికి అవకాశము లభించెను.—ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతము వద్ద దాదాపు ఒక సంవత్సరము గడిపిన పిమ్మట, యెహోవా వారి పితరుడైన అబ్రాహామునకు తాను వాగ్దానముచేసిన భూమికి అనగా పాలస్తీనా వైపునకు వారిని నడిపించెను.
ఆ తర్వాత పాలస్తీనాలో ఇశ్రాయేలీయులు రాజులద్వారా పరిపాలింపబడుటకు దేవుడు అనుమతించెను. అప్పుడు, దేవుడు భూమిమీద ఒక రాజ్యమును కలిగియుండెను.
యూదా సంతతివాడైన దావీదు ఇశ్రాయేలీయులమీద రెండవ రాజై యుండెను. దావీదు ఇశ్రాయేలీయుల శత్రువులనందరిని జయించి, జనాంగమునకు యెరూషలేమును రాజధానిగా చేసెను.
ఒక రాజునకు యెహోవా మద్దతునిచ్చినంత కాలము అతనిని ఏ భూపాలకుడును జయించలేడని దావీదు పరిపాలనలోని సంఘటనలు చూపించినవి.
వాగ్దత్త సంతానము దావీదు వంశస్థులలో ఒకడైయుండునని యెహోవా సెలవిచ్చెను.—1 దినవృత్తాంతములు 17:7, 11, 14.
దావీదు కుమారుడైన సొలొమోను ఆయన తర్వాత రాజ్యమేలెను. ఆయన జ్ఞానము గల రాజైయుండెను, కాగా ఆయన పాలనలో ఇశ్రాయేలీయులు వర్ధిల్లిరి.
సొలొమోను యెరూషలేములో యెహోవాకు ఒక చక్కని ఆలయమును కూడా నిర్మించెను. సొలొమోను పరిపాలనలోని ఇశ్రాయేలీయుల పరిస్థితులు, మానవజాతికి రానైయున్న దేవుని రాజ్యము తీసికొనివచ్చు కొన్ని ఆశీర్వాదములను, చూపించుచున్నవి.—1 రాజులు 4:24, 25.
అయినను, సొలొమోను తరువాత వచ్చిన రాజులలో అనేకమంది బహుగా నమ్మకద్రోహులైరి.
అయితే దావీదు వారసులింకను యెరూషలేములో పరిపాలించుచున్న కాలమునందే, నమ్మకముగా భూమినంతటిని పరిపాలించు దావీదుయొక్క ఒక బావికుమారుని గూర్చి తెలియజెప్పుటకు యెహోవా తన ప్రవక్తయగు యెషయాను ఉపయోగించెను. ఈయన వాగ్దత్త సంతానమై యుండును.—యెషయా 9:6, 7.
ఆయన పరిపాలన సొలొమోను పరిపాలనకంటే మరి ఎక్కువ మహిమగలదిగా యుండునని యెషయా ప్రవచించెను.—యెషయా, 11 మరియు 65 అధ్యాయములు.
కాగా, దేవునిసేవకులు ఆ సంతానము ఎవరైయుండునాయని క్రితమెన్నటికంటె ఎక్కువగా ఆశ్చర్యపడిరి.
ఆ సంతానము రాకమునుపే, ఇశ్రాయేలీయుల రాజులు ఎంతో భక్తిహీనులైరి. కాగా సా.శ.పూ. 607లో ఆ జనాంగము బబులోనీయులచే జయింపబడి అనేకులు బాబేలునకు చెరగా కొనిపోబడునట్లు యెహోవా అనుమతించెను. అయితే దేవుడు తనవాగ్దానమును మరువలేదు. ఆ సంతానము ఇంకను దావీదు వరుసలోనే ప్రత్యక్షమగును.—జ్ఞానియైన మరియు నమ్మకమైన మానవరాజు ఒకరు ప్రయోజనములను తేగల్గినను ఆ ప్రయోజనములు పరిమితమైయుండెనని ఇశ్రాయేలీయులకు సంభవించిన సంగతులు చూపించినవి. విశ్వాసపాత్రులు మరణింతురు, వారి వారసులు విశ్వాసపాత్రులుగా యుండకపోవచ్చును. మరి పరిష్కారమేమైయుండెను? వాగ్దత్తసంతానమే దానికి పరిష్కారము.
ఆ పిమ్మట, కొన్నివేల సంవత్సరముల తర్వాత ఆ సంతానము ప్రత్యక్షమయ్యెను. అతనెవరైయుండెను?
దేవుని యొద్దనుండి వచ్చిన ఒక దూత మరియ అను ఒక అవివాహితయైన ఇశ్రాయేలీయుల కన్యకు సమాధానమిచ్చెను. ఆమెకు ఒక కుమారుడు కలుగునని ఆయనకు యేసు అని పేరుపెట్టబడుననియు అతడు చెప్పెను.
ఆ దూత చెప్పిన విషయము ఇలా ఉన్నది: “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; యెహోవా దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.”—లూకా 1:32, 33 (NW)
కాబట్టి యేసు వాగ్దత్త సంతానముగాను, చివరకు దేవుని రాజ్యమునకు రాజుగాను కావలసియుండెను. కాని ముందు నివసించిన విశ్వాసపురుషులతో యేసు ఎందుకు వ్యత్యాసమును కల్గియుండెను?
యేసు అద్భుతరీతిగా జన్మించెను. ఆయన తల్లి ఒక కన్యకయైయుండెను మరియు ఆయనకు మానవ తండ్రి లేకుండెను. యేసు అంతకుపూర్వము పరలోకములో జీవించెను. కాగా దేవుని పరిశుద్ధాత్మ, లేక చురుకైనశక్తి యేసు జీవమును పరలోకమునుండి మరియ గర్భమునకు మార్చెను. కాబట్టి, ఆయన ఆదాము పాపమును స్వాస్థ్యముగా పొందలేదు. యేసు తన జీవితమందతటిలో పాపము చేయలేదు.—1 పేతురు 2:22.
30 సంవత్సరముల వయస్సులో యేసు బాప్తిస్మము తీసికొనెను.
దేవుని రాజ్యమును గూర్చి ఆయన ప్రజలతో చెప్పుచు, చివరకు ఆ రాజ్యమునకు రాజు తానేయని పరిచయము చేసికొనెను.—మత్తయి 4:23; 21:4-11.
ఆయన అనేక అద్భుతములను కూడా చేసెను.
ఆయన జబ్బుగల వారిని బాగుచేసెను.—మత్తయి 9:35.
ఆయన ఆకలిగొనియున్నవారికి అద్భుతరీతిలో భోజనము పెట్టెను.—మత్తయి 14:14-22.
ఆయన మరణించినవారిని సహితము లేపెను.—మత్తయి 9:18, 23-26.
దేవుని రాజ్యమునకు రాజుగా యేసు మానవజాతి కొరకు ఎట్టి క్రియలు చేయునో ఈ అద్భుతములు చూపించుచున్నవి.
యోహాను 18:36) అందుకే ఆ రాజ్యము “పరలోక యెరూషలేము” అని పిలువబడినది.—హెబ్రీయులు 12:22, 28.
రాజైన దావీదు తన రాజ్యమునకు యెరూషలేమును ఎట్లు రాజధానిగా చేసికొనెనో మీకు జ్ఞాపకమున్నదా? దేవుని రాజ్యము భూమిమీద కాదుగాని పరలోకములోనుండునని యేసు వివరించెను. (ఆ రాజ్య ప్రజలై యుండువారు లోబడవలసియున్న నియమములను యేసు వివరించెను. ఆ నియమములు బైబిలునందు ఇప్పుడు కలవు. అతి ప్రాముఖ్యమైన నియమములేవనగా ప్రజలు దేవుని ప్రేమింపవలెను మరియు ఒకరినొకరు ప్రేమింపవలెను.—మత్తయి 22:37-39.
రాజ్యమును పరిపాలించునది తాను ఒక్కడుమాత్రమే కాదని యేసు బయలుపరచెను. పరలోకమునకువెళ్ళి అక్కడ ఆయనతోపాటు పరిపాలించుటకై మనుష్యులు ఎంపికచేయబడుదురు. (లూకా 12:32; యోహాను 14:3) అక్కడ ఎంతమంది యుందురు? వారు 144,000 మందియని ప్రకటన 14:1 సమాధానమిచ్చుచున్నది.
యేసుతోబాటు పరిపాలించుటకు పరలోకమునకు వెళ్ళువారు కేవలము 144,000 మంది మాత్రమే అయినచో మరి మిగిలిన మానవులు దేనికొరకు నిరీక్షించగలరు?
బైబిలిట్లుచెప్పుచున్నది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు; వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.
భూమిమీద నిత్యము నివసించువారు, “వేరే గొర్రెలు” అని పిలువబడిరి.—యోహాను 10:16.
కాబట్టి రెండు నిరీక్షణలు కలవు. యేసుక్రీస్తుతోబాటు పరిపాలించుటకు యెహోవా దేవుడు పరలోకమునకు ఆహ్వానించిన 144,000 మంది కలరు. ఆలాగే ఆయన రాజ్యప్రజలుగా భూమిమీద నిత్యము జీవించు నిశ్చయమైన నిరీక్షణ కలిగిన ప్రజలును దశలక్షలసంఖ్యలో కలరు.—ప్రకటన 5:10.
సాతాను యేసును ద్వేషించి ఆయనను వ్యతిరేకించెను. యేసు మూడున్నర సంవత్సరములు సువార్తను ప్రకటించిన తరువాత, ఆయన బంధింపబడి ఒక నిలువుకొయ్యకు మేకులతో కొట్టబడుట ద్వారా చంపబడునట్లు సాతాను చేసెను. దేవుడు దీనిని ఎందుకు అనుమతించెను?
ఆదామునుండి వచ్చితిమి గనుక మనమందరము పాపము చేసి మరణమునకు పాత్రులమైతిమని గుర్తుంచుకొనుడి.—రోమీయులు 6:23.
అద్భుతరీతిలో జన్మించినందున యేసు పరిపూర్ణుడనియు, ఆలాగే ఆయన మరణమునకు పాత్రుడుకాడనియు గుర్తుంచుకొనుడి. ఏదిఏమైనను, ‘యేసు మడిమపై కాటు’ వేయుటకు అనగా చంపుటకు దేవుడు సాతానును, అనుమతించెను. అయితే దేవుడు ఆయనను అమర్త్యమైన ఆత్మగా జీవమునకు లేపెను. ఆయనకు ఇంకను పరిపూర్ణమైన మానవజీవముపైహక్కు ఉండెను గనుక, ఆయన ఇప్పుడు దానిని, మానవులమైన మనలను పాపమునుండి విమోచించుటకు క్రయధనముగా ఉపయోగించగల్గును.—ఆదికాండము 3:15; రోమీయులు 5:12, 21; మత్తయి 20:28.
యేసు అర్పించిన బలియొక్క భావము ఏమిటో మనము పూర్తిగా అర్థముచేసికొనుటకు సహాయకరముగా, బైబిలు ప్రవచన మాదిరుల ద్వారా దానిని గూర్చి మాట్లాడుచున్నది.
ఉదాహరణకు, ప్రేమవిషయమైన పరీక్షయందు తన కుమారుని బలి ఇవ్వమని యెహోవా అబ్రాహామునకు చెప్పిన విషయము మీకు గుర్తున్నదా?
ఇది యేసు బలికి సంబంధించిన ఒక ప్రవచన మాదిరియై యున్నది. మనము జీవము కలిగియుండు నిమిత్తము తనకుమారుడైన యేసు మనకొరకు చనిపోవునట్లు అనుమతించుటలో మానవజాతికొరకు యెహోవా కలిగియున్న మహాగొప్ప ప్రేమను అది చూపించినది.—యోహాను 3:16.
ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి యెహోవా కాపాడిన విధమును, మరణము కలుగజేయు దూత వారిని దాటిపోవునట్లుచేయుటద్వారా వారి జ్యేష్ఠసంతానము రక్షించిన విధమును మీరు గుర్తు చేసికొనగలరా?—నిర్గమకాండము 12:12, 13.
ఇది ఒక ప్రవచన మాదిరియై యుండెను. ఇశ్రాయేలీయుల జ్యేష్ఠసంతానమునకు ఆ గొర్రెపిల్లయొక్క రక్తము ఎట్లు జీవమైయుండెనో, అట్లే యేసునందు విశ్వాసముంచు వారికి ఆయన చిందించిన రక్తము జీవమని అర్థమై యున్నది. ఆలాగే ఆ రాత్రి జరిగిన సంఘటనలు ఇశ్రాయేలీయులకు ఎట్లు విడుదలగా యుండెనో, ఆలాగే యేసు మరణము మానవజాతికి పాప, మరణముల నుండి విడుదలను కలుగజేయునను భావమును కలిగియున్నది.
అందుకే యేసు, “లోక పాపమును మోసికొనుపోవు దేవుని గొర్రెపిల్ల” అని పిలువబడెను.—యోహాను 1:29.
ఏదిఏమైనను, యేసు ఈ భూమిపైనున్నప్పుడు శిష్యులను సమకూర్చి తన మరణము తరువాత కూడా రాజ్యసువార్తను ప్రకటించునట్లువారికి తర్ఫీదునిచ్చెను.—వీరు యేసుతోబాటు ఆయన రాజ్యములో పరిపాలించుటకు దేవుడు ఎన్నిక చేసిన తొలి మానవులైయున్నారు.—లూకా 12:32.
తన ధర్మశాస్త్రమును అనుసరించినయెడల యూదులు “యాజకరూపమైన ఒక రాజ్యమగుదురని” దేవుడు చేసిన వాగ్దానము మీకు గుర్తున్నదా? యేసును అంగీకరించినయెడల, దేవుని రాజ్యముయొక్క భాగమైయుండి పరలోక యాజకులుగా సేవచేయు అవకాశము వారికుండెను. అయితే వారిలో అనేకమంది యేసును నిరాకరించిరి.
కాగా, అప్పటినుండి యూదులు, దేవుడు ఏర్పరచుకొనిన జనాంగముగాలేరు; ఆలాగే వారికి పాలస్తీనాకూడా వాగ్దానదేశముగా లేదు.—మత్తయి 21:43; 23:37, 38.
యేసు భూమిపైనుండిన కాలమునుండి మనకాలము వరకు యేసుతోపాటు పరలోకములో పరిపాలించువారిని యెహోవా సమకూర్చుచుండెను. ఇంకను భూమిమీద ఈనాడు వారిలో కొన్ని వేలమంది మాత్రమే ఉన్నారు. వారిని మనము అభిషక్త శేషము అని పిలుతుము.—ప్రకటన 12:17.
దేవునిరాజ్యమనగా ఏమైయున్నదో మీరు ఇప్పుడు చూడ మొదలు పెట్టుచున్నారు. అది పరలోక ప్రభుత్వము, దాని రాజు యేసుక్రీస్తు, మరియు భూమి మీదనుండి 144,000 మంది వచ్చి ఆయనతో చేరుదురు. భూమిమీదగల విశ్వాసమానవ జాతిపై అది ప్రభుత్వము చేయును మరియు ఈ భూమిపై సమాధానమును తెచ్చు శక్తి కలిగియుండును.
మరణము తర్వాత యేసు పునరుత్థానుడై పరలోకమునకు వెళ్ళెను. అచ్చట ఆయన దేవుని రాజ్యమునకు రాజుగా పరిపాలన ప్రారంభించుమని దేవుడు చెప్పు సమయము వరకు వేచియుండెను. (కీర్తన 110:1) అది ఎప్పుడైయుండును?
తన రాజ్యమును గూర్చి ప్రజలకు తెలుపుటకు యెహోవా కొన్ని సార్లు స్వప్నములను కలుగజేసెను.
దానియేలు కాలములో యెహోవా అట్టి స్వప్నమునొకదానిని బబులోను రాజగు నెబుకద్నేజరునకు కలుగజేసెను. అది ఒక మహావృక్షమునుగూర్చిన స్వప్నమైయుండెను.—దానియేలు 4:10-37.
ఆ వృక్షము నరకబడి దాని కాండమునకు కట్లుకట్టబడి ఏడు సంవత్సరముల వరకు విడిచిపెట్టబడెను.
ఆ వృక్షము నెబుకద్నేజరుకు సూచనగానున్నది. ఆ మొద్దుకు ఏడు సంవత్సరములు కట్లుకట్టబడి విడిచిపెట్టబడినట్లు నెబుకద్నేజరు ఏడు సంవత్సరములు మానవ మనస్సును పోగొట్టుకొనెను. ఆ తరువాత అతనికి మానవ మనస్సు తిరిగి లభించెను.
ఇదంతయు ప్రవచన మాదిరియై యుండెను. నెబుకద్నేజరు ప్రపంచవ్యాప్త యెహోవా పరిపాలనకు చిత్రీకరణయై యుండెను. మొదట ఆ పరిపాలనను దావీదు వంశస్థులు యెరూషలేములో సాగించిరి. సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును జయించినప్పుడు ఆ రాజ వంశక్రమమునకు భంగము కలిగెను. “దాని స్వాస్థ్యకర్త వచ్చుపర్యంతము” దావీదు వంశములో వేరొకరాజు ఉండకపోవును. (యెహెజ్కేలు 21:27.) ఆ స్వాస్థ్యకర్త యేసు క్రీస్తుయైయుండెను.
సా.శ.పూ. 607 నుండి యేసు ఏలనారంభించు వరకు, అది ఎంతకాలమై యుండవచ్చును? అవి ఏడు ప్రవచనార్థక సంవత్సరములు. అనగా 2,520 సంవత్సరములు. (ప్రకటన 12:6, 14) ఈ 2,520 సంవత్సరములు సా.శ.పూ. 607 నుండి మనలను సా.శ. 1914 నకు తెచ్చుచున్నవి.
కాబట్టి యేసు 1914 లో పరలోకమందు పరిపాలించుటకు ప్రారంభించెను. దాని భావమేమైయున్నది?
అపొస్తలుడైన యోహాను చూసిన దర్శనము ద్వారా బైబిలు దానిని మనకు చెప్పుచున్నది.
పరలోకములో స్త్రీ ఒక మగశిశువును కనుటను ఆయన చూచెను.—ప్రకటన 12:1-12.
ఆ స్త్రీ పరలోకములో దేవునిసేవచేయు దూతలందరు చేరియున్న దేవుని పరలోక సంస్థకు చిత్రీకరణయైయున్నది. ఆ మగశిశువు దేవుని రాజ్యమునకు చిత్రీకరణయైయున్నాడు. ఆ శిశువు 1914లో “జన్మించెను.”
తరువాత ఏమి జరిగినది? రాజుగా యేసు మొదట సాతానును, అతనితోబాటు ఎదురుతిరిగిన దూతలను పరలోకమునుండి భూమికి పడద్రోసెను.—ప్రకటన 12:7.
దాని ఫలితమును బైబిలు మనకు ఇట్లు తెలియజేయుచున్నది: “అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమి, సముద్రమా మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధముగలవాడై మీయొద్దకు దిగి వచ్చియున్నాడు.”—ప్రకటన 12:12.
కాబట్టి పరలోకములో యేసు ఏలనారంభించినప్పుడు భూమిపైన ఆయన శత్రువులు చురుకుగా పనిచేయ ప్రారంభించిరి. బైబిలు ముందేచెప్పినట్లు, ఆయన తన శత్రువుల మధ్యను పరిపాలనను ప్రారంభించెను.—కీర్తన 110:1, 2.
ఇది మానవులకు ఏ అర్థమునిచ్చును?
యేసు మనకు ఇలా చెప్పెను: “యుద్ధములు, కరవులు, వ్యాధులు, మరియు భూకంపములు.”—మత్తయి 24:7, 8; లూకా 21:10, 11.
రాజ్యపాలన అప్పుడు మొదలయ్యెనని మనము తెలిసికొనుటకు మరియొక కారణమేమనగా, 1914 నుండి ఆ సంగతులు జరుగుచుండుటను మనము చూచియున్నాము.
అంతేకాకుండా “కలవరపడిన జనములకు శ్రమయు కలుగును . . . రాబోవుచున్నవాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుటయు,” జరుగును. (లూకా 21:25, 26.) వాటిని కూడా మనము 1914 నుండి చూచుచున్నాము.
అపొస్తలుడైన పౌలుకూడా ఇట్లుచెప్పెను: “ప్రజలు స్వార్థప్రియులు, ధనాపేక్షులు,. . .తలిదండ్రులకు అవిధేయులు, . . . అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులునై యుందురు.”—2 తిమోతి 3:1-5.
ఈనాడు జీవితము ఎందుకింత కష్టతరముగా యున్నదో ఇప్పుడు మీకు తెలిసియున్నది. సాతాను చాలా చురుకుగా పనిచేయుచున్నాడు. అయితే దేవుని రాజ్యము కూడా చాలా చురుకుగా పనిచేయుచున్నది.
యేసుతోబాటు పరలోకములో పరిపాలించు నిరీక్షణగల వారిలో శేషించినవారు, దేవుని రాజ్యము స్థాపించబడినదను సువార్తను 1914 తర్వాత, వెంటనే ప్రకటించుటను ప్రారంభించిరి. యేసుచెప్పినట్లుగానే ఈపని ఇప్పుడు భూవ్యాప్తముగా విస్తరించినది.—ఈ ప్రకటించు పనియొక్క ఉద్దేశ్యమేమై యున్నది?
మొదట, దేవునిరాజ్యమును గూర్చి ప్రజలకు తెలియజేయుట.
రెండవది, ఆ రాజ్య ప్రజలుగా యుండుటకు ఇష్టపడుదురేమో నిర్ణయించుకొనుటలో వారికి సహాయపడుటయై యున్నది.
మనకాలములో ప్రజలందరు గొర్రెలవంటి వారు మరియు మేకలవంటి వారు వేరుచేయబడుదురని యేసు చెప్పెను.—మత్తయి 25:31-46.
ఆయనను ఆయన సహోదరులను ప్రేమించువారు “గొర్రెల” వంటి వారిగాను. అట్లుచేయని వారు “మేకల”వంటివారిగాను ఉందురు.
“గొర్రెల”వంటివారు నిత్యజీవమును పొందుదురు, అయితే “మేకల” వంటివారు పొందరు.
రాజ్యసువార్తను ప్రకటించుటద్వారా ఈ వేరుచేయు పని నెరవేర్చబడుచున్నది.
యెషయా పలికిన ప్రవచనమొకటి ఇక్కడ కలదు.
“అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటే ఎత్తుగా ఎత్తబడును; ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.”—యెషయా 2:2.
మానవజాతి ఇప్పుడు “అంత్యదినముల” నెదుర్కొనుచున్నది.
యెహోవా ఆరాధనా “మందిరము” అబద్ధమతములకంటే “ఎత్తుగా ఎత్తబడినది.”
“జనములు గుంపులు గుంపులుగా వచ్చి: ‘యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము’ అని చెప్పుకొందురు.”—యెషయా 2:3.
కాబట్టి, అన్ని జనములనుండి యెహోవాను ఆరాధించుటకు అనేక మంది వచ్చి, తమతోబాటు చేతులుకలుపుటకు వారు ఇతరులనాహ్వానించెదరు. యెహోవా కోరికచొప్పున ప్రవర్తించుటకు వారు నేర్చుకొనెదరు.
“వారు తమ ఖడ్గములను నాగటినక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:4.
యెహోవాను ఆరాధించువారు ఐక్యతగలవారిగాను మరియు సమాధానపరులుగాను యున్నారు.
దేవుని రాజ్యము యొక్క ఈపని ఫలితముగా ఇప్పుడు దేవునిరాజ్యమునకు ప్రపంచవ్యాప్తముగా దాదాపు అనేక లక్షల మంది ప్రజలున్నారు.
పరలోకమునకు వెళ్ళి యేసుతోబాటు పరిపాలించు నిరీక్షణ గల శేషించినవారిచుట్టు వారు సమకూర్చబడియున్నారు.
వారు దేవునిసంస్థ ద్వారా ఆత్మీయాహారమును పొందుచున్నారు.—మత్తయి 24:45-47.
వారు ఒకరినొకరు నిజముగా ప్రేమించుకొను, అంతర్జాతీయ క్రైస్తవ సహోదరత్వమును కలిగియున్నారు.—యోహాను 13:35.
వారు మనశ్శాంతిని, భవిష్యత్ నిరీక్షణను అనుభవించుచున్నారు.—ఫిలిప్పీయులు 4:7.
త్వరలోనే సువార్త ప్రకటించుట పూర్తియగును. ఆలాగే “గొర్రెలు” సమకూర్చబడుటయు పూర్తియగును. ఆ పిమ్మట రాజ్యము ఏమి చేయును?
దేవుని ప్రజల శత్రువులనందరిని నమ్మకమైన దావీదు రాజు జయించెనను విషయము మీకు గుర్తున్నదా? అవును, రాజైన యేసుకూడా అట్లేచేయును.
తన కాలమునుండి మన కాలము వరకు లోకాధిపత్యము వహించిన సామ్రాజ్యములను సూచించు ఒక గొప్ప ప్రతిమను రాజైన నెబుకద్నేజరు స్వప్నమందు చూచెను.
మరియు పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమను తుత్తినియలుగా విరుగగొట్టినట్టు కూడా ఆయన చూచెను. ఆ రాయి దేవునిరాజ్యమునకు ప్రాతినిధ్యమైయున్నది.
అనగా ఇప్పటి దుష్టవిధానముయొక్క నాశనమని దీని అర్థము.—దానియేలు 2:44.
ఆ రాజ్యము తల్లక్రిందులు చేయు కొన్ని సంగతులు ఇచ్చట ఉన్నవి.
సముద్రములోని విసరివేయబడిన తిరుగటి రాయివలె అబద్ధమతము అదృశ్యమగును.—ప్రకటన 18:21.
అందుకనే దేవుని ప్రేమించువారందరు ఇప్పుడే అబద్ధమతమునుండి బయటకు రావలసిందిగా ప్రోత్సహించబడుచున్నారు.—ప్రకటన 18:4.
తరువాత రాజైన యేసు “జనములను కొట్టును . . . యినుప దండముతో వారిని ఏలును.”—ప్రకటన 19:15.
అందువలననే, యెహోవా సాక్షులు పన్నులు చెల్లించినను ఆయాదేశముల నియమములకు లోబడినను, వారు రాజకీయములలో పాలుపంచుకొనరు
చివరకు, ఆ “ఘటసర్పము” అయిన సాతాను అగాధములోనికి పడద్రోయబడును.—ప్రకటన 20:2, 3.
రాజైన యేసునకు లోబడు “గొర్రె” వంటివారు మాత్రమే ఈ శ్రమలను తప్పించుకొని జీవించెదరు.—మత్తయి 25: 31-34, 41, 46.
శ్రమలను తప్పించుకొను “గొర్రెల”ను గూర్చిన దర్శనమునొకదానిని అపొస్తలుడైన యోహాను చూచెను.
“అటు తరువాత నేనుచూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలోనుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలోనుండియు వచ్చిన, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖరర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి.”—ప్రకటన 7:9.
సువార్త ప్రకటనను విని సుముఖతను చూపిన వారిచేత ఈ “గొప్పసమూహము” తయారగును.
వారు “మహాశ్రమలనుండి తప్పించుకొనివచ్చెదరు.”—ప్రకటన 7:14.
వారు యేసును తమరాజుగా ఆహ్వానించుచున్నారని “ఖరర్జూరపు మట్టలు” సూచించుచున్నవి.
వారు యేసు బలియందు విశ్వాసముంచిరని వారు “తెల్లని వస్త్రములు” ధరించుకొనుట సూచించుచున్నది.
ఆ “గొర్రెపిల్ల” యేసుక్రీస్తు.
వారు ఆ పిమ్మట ఎట్టి ఆశీర్వాదములను అనుభవింతురు? నమ్మకమైన రాజగు సొలొమోను పరిపాలనలో ఇశ్రాయేలీయులు పొందిన ఆనందము మీకు గుర్తున్నదా? రాజైన యేసు అధికారము క్రిందనున్న భూమిపై ఉండు సంతోషమును అది తక్కువ పరిమాణములో చూపినది.
యెషయా తెల్పినట్లు మనుష్యుల మధ్య జంతువుల మధ్య అక్షరార్థమైన సమాధానముండును.—కీర్తన 46:9; యెషయా 11:6-9.
తాను భూమిమీద ఉన్నప్పుడు యేసు రోగులను స్వస్థపరచినట్లు ఆయన మనుష్యులందరినుండి రోగమును తీసివేయును.—యెషయా 33:24.
అతడు అనేక మందికి భోజనము పెట్టినట్లు మానవులందరినుండి ఆయన ఆహారకొరతను తీసివేయును.—కీర్తన 72:16.
చనిపోయినవారిని ఆయన లేపినట్లు, దేవునిరాజ్యమునకు విధేయులగుటకు అవకాశము పూర్తిగా లభించక చనిపోయిన వారిని ఆయన లేపును.—యోహాను 5:28, 29.
క్రమేణి ఆయన మానవులనందరిని, ఆదాము పోగొట్టుకొనిన పరిపూర్ణతకు తిరిగి తెచ్చును.
అది ఒక అద్భుతమైన భవిష్యత్తు కాదా? దానిని చూడ నీవు ఇష్టపడుచున్నావా? అట్లయిన, ఇప్పుడే దేవునిరాజ్యమునకు లోబడి, “గొర్రెల”లో ఒకనిగా అగుటకు కృషిచేయుము.
బైబిలును పఠించి యెహోవాదేవుని, మరియు యేసుక్రీస్తును ఎరుగుము.—యోహాను 17:3.
ఆ రాజ్యమునకు ప్రజలైన వారితోకూడా సహవాసము చేయుము.—హెబ్రీయులు 10:25.
ఆ రాజ్యముయొక్క చట్టములను నేర్చుకొని వాటికి లోబడుము.—యెషయా 2:3, 4.
యెహోవాను సేవించుటకు నీ జీవితమును సమర్పించుకొని, బాప్తిస్మము తీసికొనుము.—మత్తయి 28:19, 20.
యెహోవాదేవునికి అయిష్టమైన దొంగతనము, అబద్ధములు చెప్పుట, లైంగికదుర్నీతి, త్రాగుబోతుతనము వంటి చెడు అలవాట్లను విసర్జించుము.—1 కొరింథీయులు 6:9-11.
రాజ్యసువార్తను ప్రకటించుపనిలో భాగము వహించుము.—మత్తయి 24:14.
ఆ తరువాత, ఆదాము తనవారసులకొరకు పోగొట్టుకొనిన పరదైసు దేవుని సహాయముతో పునరుద్ధరింపబడుటను మీరు చూచెదరు. ఆలాగే ఈ వాగ్దానము నెరవేరుటను కూడా మీరు చూచెదరు: “అప్పుడు ‘ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానేవారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారికన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను’ అని సింహాసనములోనుండి వచ్చిన గొప్పస్వరము చెప్పుట వింటిని.”—[20వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
సా.శ.పూ. 607 1914 సా.శ.
సా.శ.పూ. సా.శ.
500 1,000 1,500 2,000 2,520
[11వ పేజీలోని చిత్రం]
అబ్రాహాము
ఇస్సాకు
యాకోబు
యూదా
దావీదు
[14వ పేజీలోని చిత్రం]
144,000
[16వ పేజీలోని చిత్రం]
ఆదాము
యేసు