కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చిత్రాల పట్టిక

చిత్రాల పట్టిక

పేజీ నంబరు ప్రకారం

  • కవరు పేజీలు పౌలు, తబితా, గల్లియోను, లూకా, అపొస్తలులతో పాటు ఆలయ అధికారి, సద్దూకయ్యుడు, పౌలును బందోబస్తుతో కైసరయకు తీసుకెళ్లడం. సౌండ్‌ కారుతో, ఫోనోగ్రాఫ్‌తో మనకాలంలో సాక్షమివ్వడం.

  • 1వ పేజీ: పౌలు, లూకా రోముకు వెళ్తున్న సరుకుల ఓడలో ఉన్నారు. పౌలు చేతులకు సంకెళ్లు ఉన్నాయి.

  • 2, 3 పేజీలు: పరిపాలక సభలో సేవచేసిన బ్రదర్‌ జె. ఇ. బార్‌, బ్రదర్‌ టి. జారస్‌ వరల్డ్‌ మ్యాప్‌ చూస్తున్నారు.

  • 11వ పేజీ: యేసు తన 11 మంది నమ్మకమైన అపొస్తలులకు, ఇతర శిష్యులకు గలిలయ కొండ మీద ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు.

  • 14వ పేజీ: యేసు ఆకాశంలోకి వెళ్తున్నాడు. అపొస్తలులు ఆయన్నే చూస్తున్నారు.

  • 20వ పేజీ: పెంతెకొస్తు రోజున, యెరూషలేముకు వచ్చిన ప్రజల మాతృభాషల్లో అపొస్తలులు మాట్లాడుతున్నారు.

  • 36వ పేజీ: కోపంతో ఊగిపోతున్న కయప ముందు అపొస్తలులు నిలబడ్డారు. మహాసభ ఆజ్ఞాపిస్తే, బంధించడానికి ఆలయ అధికారులు సిద్ధంగా ఉన్నారు.

  • 44వ పేజీ: కింద: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు జర్మనీలోని కోర్టు, యెహోవాసాక్షులు అమెరికా గూడఛారులు అనే తప్పుడు తీర్పు ఇచ్చింది.—Neue Berliner Illustrierte పత్రిక, అక్టోబరు 3, 1950.

  • 46వ పేజీ: స్తెఫను మహాసభ ముందు నిందితుడిలా నిల్చున్నాడు. ఒకవైపు బాగా డబ్బున్న సద్దూకయ్యులు ఉన్నారు, ఇంకోవైపు ఆచారాల్ని పట్టుకువేలాడే పరిసయ్యులు ఉన్నారు.

  • 54వ పేజీ: పేతురు ఒక కొత్త శిష్యుడి మీద చేతులు ఉంచాడు; సీమోను అనే అతను చేతిలో డబ్బు సంచి పట్టుకుని ఉన్నాడు.

  • 75వ పేజీ: పేతురు, ఆయనతో పాటు వచ్చినవాళ్లు కొర్నేలి ఇంట్లో అడుగు పెడుతున్నారు. శతాధిపతిగా తన స్థానాన్ని సూచించే ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని కొర్నేలి తన ఎడమ భుజం వైపు ధరించాడు.

  • 83వ పేజీ: దేవదూత పేతురును బయటికి తీసుకొస్తున్నాడు; పేతురును బహుశా అంటోనియా కోటలో బంధించి ఉంటారు.

  • 84వ పేజీ: కింద: 1945, క్విబెక్‌లోని మాంట్రియల్‌ దగ్గర్లో అల్లరిమూక దాడి.—Weekend Magazine పత్రిక, జూలై 1956.

  • 91వ పేజీ: పౌలు, బర్నబాలను పిసిదియలోని అంతియొకయ నుండి ప్రజలు వెళ్లగొట్టారు. వెనకాల, ఆ నగరంలో కొత్తగా కట్టిన నీటి కాలువ (ఆక్వెడక్ట్‌) కనిపిస్తుంది; బహుశా క్రీస్తు శకం మొదటి శతాబ్దం తొలినాళ్లలో దాన్ని కట్టి ఉంటారు.

  • 94వ పేజీ: పౌలు, బర్నబా తమను పూజించవద్దని లుస్త్ర ప్రజలకు గొంతు చించుకొని మరీ చెప్తున్నారు. ప్రజలంతా కలిసి బలి ఇస్తున్నప్పుడు రంగులతో, మేళ-తాళాలతో కోలాహలంగా ఉంటుంది.

  • 100వ పేజీ: పైన: సిరియాలోని అంతియొకయలో ఉన్న సంఘాన్ని సీల, యూదా ప్రోత్సహిస్తున్నారు. (అపొ. 15:30-32) కింద: ఉగాండాలోని ఒక సంఘంలో ప్రాంతీయ పర్యవేక్షకుడు ప్రసంగిస్తున్నాడు.

  • 107వ పేజీ: యెరూషలేము సంఘం ఒకరి ఇంట్లో కలుసుకుంది.

  • 124వ పేజీ: పౌలు, తిమోతి రోమా వ్యాపార నౌక ఎక్కి వేరే దేశానికి వెళ్తున్నట్టు చిత్రంలో ఉంది. దూరంలో లైట్‌ హౌస్‌ కనిపిస్తుంది.

  • 139వ పేజీ: కోపంతో ఊగిపోతున్న అల్లరిమూక నుండి తప్పించుకోవడానికి పౌలు, సీల గేటు వేసి ఉన్న ఒక ప్రాంగణం లోపల నుండి వెళ్లిపోతున్నారు.

  • 155వ పేజీ: పౌలు మీద ఆరోపణ చేసిన వాళ్లను గల్లియోను చెదరగొడుతున్నాడు. ఆయన తన అధికారానికి గుర్తుగా ఉండే ఊదా రంగు అంచు ఉన్న తెల్లని వస్త్రాన్ని వేసుకున్నాడు, క్యాల్సియై అనే ఒకరకమైన షూ వేసుకున్నాడు.

  • 158వ పేజీ: ఎఫెసులో వెండి పనులు చేసే షాపులో పని చేస్తున్న వాళ్లతో దేమేత్రి మాట్లాడుతున్నాడు. వెండితో చేసిన అర్తెమి ఆలయ బొమ్మల్ని జ్ఞాపికలా అమ్ముతారు.

  • 171వ పేజీ: పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు ఓడ ఎక్కుతున్నారు. వెనకాల, క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో కట్టిన గ్రేట్‌ హార్బర్‌ మాన్యుమెంట్‌ కనిపిస్తుంది.

  • 180వ పేజీ: కింద: 1940లలో, కెనడాలో మన ప్రచురణల మీద నిషేధం ఉన్నప్పుడు సాక్షి అయిన ఒక అబ్బాయి బైబిలు ప్రచురణల్ని రహస్యంగా అందజేస్తున్నాడు. (పునర్నటన.)

  • 182వ పేజీ: పెద్దలు చెప్పినదానికి పౌలు తలొంచాడు. విరాళాల్ని అందజేయడంలో సహాయంగా వచ్చిన లూకా, తిమోతి వెనక కూర్చుని ఉన్నారు.

  • 190వ పేజీ: పౌలు మేనల్లుడు ఆంటోనియా కోటలో క్లౌదియ లూసియతో మాట్లాడుతున్నాడు. పౌలును ఉంచింది బహుశా అక్కడే కావచ్చు. వెనకాల, యెరూషలేములోని ఆలయం కనిపిస్తుంది.

  • 206వ పేజీ: ఓడలో సరుకులు ఉంచే చోట, అలసిపోయిన ప్రయాణికుల కోసం పౌలు ప్రార్థిస్తున్నాడు.

  • 222వ పేజీ: ఖైదీగా ఉన్న పౌలు రోము నగరాన్ని చూస్తున్నాడు, ఆయనకు-సైనికుడికి మధ్య గొలుసు కట్టేసివుంది.