కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన తీర్పులనుబట్టి యెహోవాను స్తుతించుడి!

ఆయన తీర్పులనుబట్టి యెహోవాను స్తుతించుడి!

అధ్యాయం 38

ఆయన తీర్పులనుబట్టి యెహోవాను స్తుతించుడి!

1. “బహుజనుల శబ్దమువంటి గొప్పస్వరము” ద్వారా యోహాను ఏ మాటలు వింటున్నాడు?

మహాబబులోను యిక లేదు! ఇది నిజంగా సంతోషకరమైన వార్తే. యోహాను పరలోకమందు ఆనంద స్తుతి ఆలాపనలను చేస్తున్నట్టు వినడంలో ఆశ్చర్యం లేదు! “అటుతర్వాత బహు జనుల శబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని—ప్రభువును (హల్లెలూయ NW) స్తుతించుడి, * రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారు—ప్రభువును (హల్లెలూయ NW) * స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.”—ప్రకటన 19:1-3.

2. (ఎ) “హల్లెలూయ” అనే మాటకు అర్థమేమి, యోహాను యీ సందర్భంలో రెండుమారులు అలా వినడం దేన్ని సూచిస్తుంది? (బి) మహాబబులోనును నాశనం చేసినందుకు ఎవరికి మహిమ కలుగుతుంది? వివరించండి.

2 నిజంగా హల్లెలూయ! ఆ పదానికి ‘ప్రజలారా, జా-ను స్తుతించుడి,’ అని అర్థం, ‘జా’ అనే ఆంగ్లపదం యెహోవా అనే దైవనామానికి క్లుప్తరూపం. మనకిక్కడ కీర్తనల రచయిత ఉపదేశం జ్ఞాపకం చేయబడుతుంది: “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి.” (కీర్తన 150:6) ప్రకటనలో యిక్కడ “హల్లెలూయ” అని రెండుసార్లు పరలోకంలో ఆనందంతోకూడిన బృందగానాన్ని యోహాను వినడమనే విషయం, దైవ ప్రకటనాసత్యం ఎడతెరపిలేకుండా వస్తుందనే విషయాన్ని కనబరుస్తోంది. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని దేవుడు, అంతకుమునుపు హెబ్రీలేఖనాలలో తెలుపబడిన దేవుడే, ఆయన పేరు యెహోవా. ప్రాచీన బబులోనును కూలద్రోసిన దేవుడే యిప్పుడు మహాబబులోనుకు తీర్పుతీర్చి నాశనం చేసాడు. ఆ సాహసకార్యానికై ఆయనకు సమస్తమహిమను చెల్లించండి. ఆ శక్తి దాన్ని నిర్మూలం చేయడానికి ఆయన ఉపకరణాలుగా ఉపయోగించుకున్న రాజ్యాలదికాదు గాని దాన్ని పడగొట్టిన ఆయనదే. యెహోవాకు మాత్రమే రక్షణార్థమై మనం స్తుతులు చెల్లించాలి.—యెషయా 12:2; ప్రకటన 4:11; 7:10, 12.

3. మహావేశ్య ఎందుకు అంతటి తీర్పుకు తగియున్నది?

3 మహావేశ్య ఎందుకింతటి తీర్పును పొందదగింది? యెహోవా నోవహుకును ఆయన ద్వారా మానవులందరికీ యిచ్చిన చట్టం, బుద్ధిపూర్వకంగా చిందించిన రక్తానికి మరణశిక్ష విధించాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు యిచ్చిన ధర్మశాస్త్రంలో ఇది మరల తెలుపబడింది. (ఆదికాండము 9:6; సంఖ్యాకాండము 35:20, 21) అంతేగాక, శారీరక మరియు ఆత్మీయసంబంధమైన వ్యభిచారాలు రెండూ మరణపాత్రమై యుండెను. (లేవీయకాండము 20:10; ద్వితీయోపదేశకాండము 13:1-5) వేలాది సంవత్సరాలనుండి మహాబబులోను రక్తాపరాధి, అది మహావేశ్య. ఉదాహరణకు రోమన్‌ కాథోలిక్‌ చర్చి తన మతగురువులను వివాహమాడకూడదని నిషేధించడంవల్ల వారిలో అనేకులు వ్యభిచారం చేయడానికది దారితీసింది, యిప్పుడు వారిలో అనేకులకు ఎయిడ్స్‌ వ్యాధి సోకుతోంది. (1 కొరింథీయులు 6:9, 10; 1 తిమోతి 4:1-3) అయితే దాని గొప్పపాపములు ‘ఆకాశాన్నంటే పాపములు’ దాని ఆత్మీయ వ్యభిచారానికి ఘోరమైన క్రియారూపములు—యివి అబద్ధ బోధలు, భ్రష్టరాజకీయ నాయకులతో మైత్రివల్ల కల్గినవే. (ప్రకటన 18:5) అది చివరకు శిక్షింపబడినందున, పరలోక సమూహమిప్పుడు రెండవమారు హల్లెలూయ అని ప్రతిధ్వనింప జేస్తుంది.

4. మహాబబులోనునుండి పొగ “యుగయుగములు పైకి లేచుచున్నది” అనేది దేన్ని సూచిస్తుంది?

4 మహాబబులోను పట్టబడిన పట్టణంవలె దహించబడుతోంది, దాని పొగ “యుగయుగములు పైకిలేచుచున్నది.” విజయభేరి మ్రోగించే సైన్యం, అది పట్టుకునే అక్షరార్థమైన పట్టణాన్ని కాల్చితే దాని బూడిద వేడిగా ఉన్నంతవరకు పొగరాజుకువస్తూనే వుంటుంది. పొగ రాజుకువస్తున్నంత సేపు ఎవరైనా దానిని పునర్నిర్మించాలనుకుంటే నివురుగప్పిన శిథిలాలు వాళ్లను కాల్చివేస్తాయి. మహాబబులోను పొగ దాని అంతిమ తీర్పుకు గుర్తుగా “యుగయుగములు” లేస్తుంది గనుక ఆ నేరంచేసిన ఆ పట్టణాన్ని ఎవ్వరును ఎన్నటికినీ పునరుద్ధరించలేరు. అబద్ధమతం నిరంతరం లేకుండా పోయింది, నిజంగా హల్లెలూయ!—యెషయా 34:5, 9, 10 పోల్చండి.

5. (ఎ) ఆ 24గురు పెద్దలు, నాలుగు జీవులు ఏమి చేస్తున్నారు, చెబుతున్నారు? (బి) ఈ హల్లెలూయ బృందగానం క్రైస్తవమత సామ్రాజ్యంలో పాడే హల్లెలూయ గానంకంటె ఎందుకంత శ్రావ్యంగావుంది?

5 అంతకు ముందటి దర్శనంలో, యోహాను సింహాసనం చుట్టూ మహిమగల తమ పరలోక స్థానాల్లోనున్న రాజ్యవారసులను సూచించే 24మంది పెద్దలతోపాటు నాలుగు జీవులున్నట్లు చూశాడు. (ప్రకటన 4:8-11) ఇప్పుడు వారు మహాబబులోను నాశనం విషయంలో మూడవమారు హల్లెలూయ అని బిగ్గరగా అన్నప్పుడు ఆయన మరల వారిని చూస్తున్నాడు: “అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి—ఆమేన్‌, ప్రభువును స్తుతించుడి (హల్లెలూయ NW) * అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.” (ప్రకటన 19:4) గనుక ఈ గొప్ప హల్లెలూయ బృందగానం గొఱ్ఱెపిల్లను స్తుతించడానికి పాడిన “క్రొత్తకీర్తన”కు అదనంగా ఉన్నది. (ప్రకటన 5:8, 9) వారిప్పుడు మహిమాన్విత విజయోత్సాహపు కీర్తన పాడుతున్నారు, మహావేశ్యయగు మహాబబులోనుపై సర్వోన్నతుడైన ప్రభువగు యెహోవా తన నిర్ణయాత్మక విజయం సాధించినందుకు సమస్త ఘనతను చెల్లిస్తున్నారు. ఈ హల్లెలూయలు, జా లేక యెహోవాను అగౌరవపరస్తున్న, ద్వేషిస్తున్న చర్చీలలో పాడే హల్లెలూయలకంటె ఎంతో శ్రవణానందంగా ఉన్నాయి. యెహోవా నామమునకు అవమానం తెచ్చే అటువంటి వేషధారణతోకూడిన కీర్తన యిక ఎన్నటికి లేకుండా తీసివేయబడింది!

6. ఎవరి “స్వరము” వినబడుతోంది, అదేమని చెబుతోంది, దానికెవరు స్పందించి పాలుపంచుకుంటున్నారు?

6 యెహోవా 1918నుండి ‘తనకు భయపడే అల్పులను ఘనులను’ దీవించడాని కారంభించాడు, వీరిలో విశ్వాసంతో మరణించి ఆయనచేత పునరుత్థానులుగా చేయబడి పరలోకమందు 24మంది పెద్దల స్థానంలో ఉంచబడిన అభిషక్త క్రైస్తవులు మొదటివారున్నారు. (ప్రకటన 11:18) ఇతరులు వీరితోకలిసి హల్లెలూయ పాడుటలో శృతికలుపుతున్నారు, అందుకే యోహానిలా తెల్పుతున్నాడు: “మరియు—మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.” (ప్రకటన 19:5) ఇది “సింహాసనం మధ్యన” నిల్చున్న యెహోవా ప్రతినిధియైన తన కుమారుడగు యేసుక్రీస్తు స్వరం. (ప్రకటన 5:6) పరలోకంలోనేగాక యీ భూమ్మీద కూడ “దేవుని దాసులు,” అభిషక్తులైన యోహాను తరగతికి చెందినవారు భూమ్మీద నాయకత్వం వహిస్తూవుండగా, వారితోకలిసి కీర్తన పాడుతున్నారు. “మన దేవుని స్తుతించుడి” అనే ఆజ్ఞకు విధేయులగుటలో వీరెంత ఆనందంగా పాల్గొంటున్నారోగదా!

7. మహాబబులోను నాశనమైన తర్వాత, యెహోవాను ఎవరు స్తుతిస్తారు?

7 అవును, గొప్పసమూహానికి సంబంధించిన వారుకూడ యీ దాసుల్లో లెక్కించబడుతున్నారు. వీరు 1935నుండి మహాబబులోను నుండి బయటికి వస్తూ, “పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును” అనే దేవుని వాగ్దాన నెరవేర్పును అనుభవిస్తున్నారు. (కీర్తన 115:13) వేశ్యవంటి బబులోను నాశనం చేయబడినప్పుడు, పరలోక సైన్యమంతటితోనూ, యోహాను తరగతితోనూ “మన దేవుని స్తుతించుట”లో భాగంవహిస్తారు. తర్వాత భూమ్మీద పునరుత్థానులయ్యేవారు, అంతకు మునుపు ప్రఖ్యాతిగాంచిన వారైనా, గొప్పవారైనా కాకపోయినా, బబులోను యిక శాశ్వతంగా లేకుండా పోయిందని తెలుసుకుని యింకా హల్లెలూయలు నిశ్చయంగా పాడతారు. (ప్రకటన 20:12, 15) అనాదిగా వస్తున్న వేశ్యపై ఘన విజయం సాధించినందుకై యెహోవాకు సమస్త స్తుతులు చెల్లునుగాక!

8. మహాబబులోను నాశనంకాకముందు, యోహాను వినిన పరలోక స్తుతిగీతం యిప్పుడు మనకెటువంటి ప్రోత్సాహాన్నివ్వాలి?

8 ఈనాడు దేవుని సేవలో సంపూర్ణంగా పాల్గొనడానికి యిదంతా మనకెంతటి ప్రోత్సాహాన్నిస్తుందో గదా! బబులోను పడద్రోయబడి నాశనం కాకమునుపు మహిమాన్విత రాజ్యనిరీక్షణతోపాటు దేవుని తీర్పులను ప్రకటించడానికి యిప్పుడు యెహోవా సేవకులంతా వారి హృదయాలను ఆత్మలను సమర్పించుకొందురుగాక.—యెషయా 61:1-3; 1 కొరింథీయులు 15:58.

‘హల్లెలూయ—యెహోవాయే రాజు!‘

9. ఆఖరి హల్లెలూయ ఎందుకంత గొప్ప శ్రవణానందకరమైన స్వరంతో కూడినదై యున్నది?

9 యోహాను మనకు తెల్పుతున్నట్లు, ఆనందానికి యింకా కారణాలున్నాయి: “అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలినయొక స్వరము—సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి (హల్లెలూయ NW).” * (ప్రకటన 19:6) ఈ చివరి హల్లెలూయ ఆ ప్రకటన నలుదిశల లేక అన్నివైపులా మారుమ్రోగునట్లు చేస్తుంది. అది ఏ మానవ బృందగానంకంటెను, భూలోకమందలి ఏ జలపాతపు గలగలశబ్దంకంటెను, ఆకాశమందలి ఏ ఉరుము శబ్దంకంటెను గొప్ప పరలోక శబ్దమైయున్నది. ‘సర్వాధికారియైన మన దేవుడగు యెహోవా రాజై ఏలుతున్నాడని’ కోట్లాది పరలోక స్వరాలు ఉత్సహిస్తున్నాయి

10. మహాబబులోను సమూలనాశనం తర్వాత యెహోవా ఏలుట కారంభించాడని ఏ భావంలో చెప్పవచ్చును?

10 మరైతే, యెహోవా ఎలా ఏలడం ప్రారంభిస్తున్నాడు? “పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజైయున్నాడు” అని కీర్తనల రచయిత చెప్పి వేలసంవత్సరాలు గతించాయి. (కీర్తన 74:12) యెహోవాపాలన అప్పుడుకూడ పురాతనమైనదే, మరి ‘యెహోవా . . .రాజై ఏలడం ప్రారంభిస్తున్నాడు,’ అని సర్వలోకంలో బృందగానమెలా పాడగలరు? అంటే మహాబబులోను నాశనం చేయబడినప్పుడు, తన విశ్వసర్వాధిపతిగా ఆయనకు విధేయత చూపకుండా ప్రక్కకు మళ్లించే ఆ అహంకారియగు ప్రత్యర్థి యిక యెహోవా కల్గియుండడు గనుక ఆయన రాజ్యమేలుతున్నాడని అర్థం. ఇక అబద్ధమతం లోకపాలకులు ఆయనకు ఎదురు తిరిగేలా వారిని పురికొల్పదు. ప్రాచీన బబులోను ప్రపంచాధిపత్యపు స్థానాన్నికోల్పోయినప్పుడు, “నీ దేవుడు ఏలుచున్నాడు” అనే విజయోత్సాహపు ప్రకటనను సీయోను విన్నది. (యెషయా 52:7) రాజ్యస్థాపన 1914 లో జరిగిన తర్వాత, “దేవుడవైన ప్రభువా, . . . నీవు మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము,” అని ఆ 24 మంది పెద్దలు ప్రకటించారు. (ప్రకటన 11:17) ఇప్పుడు, మహాబబులోను నిర్మూలమైన తర్వాత మరల ఆ కేక వినవస్తోంది: ‘యెహోవా . . . ఏలనారంభించాడు” ఏ మానవ నిర్మిత దేవుడును సత్యదేవుడైన యెహోవా సర్వాధిపత్యాన్ని పోటీ చేయడానికి నిలువడు!

గొఱ్ఱెపిల్ల వివాహము సమీపించింది!

11, 12. (ఎ) ప్రాచీన యెరూషలేము ప్రాచీన బబులోనును ఏలా సంబోధించింది, నూతన యెరూషలేమునకు మహాబబులోనుకు ఏ మాదిరిని చూపింది? (బి) మహాబబులోనుపై విజయకేతనం ఎగురవేసినందుకు పరలోక సమూహాలు ఏమని పాడుతున్నాయి, ప్రకటిస్తున్నాయి?

11 “నా శత్రువా”! (శత్రువురాలా NW) యెహోవా ఆరాధనా మందిరమైన యెరూషలేము విగ్రహారాధికురాలైన బబులోనును అదిగో అలా పిలుస్తోంది. (మీకా 7:8) అలాగే, 144,000మంది సభ్యులుగల “పరిశుద్ధపట్టణమైన నూతన యెరూషలేము,” మహాబబులోనును తన శత్రువని పిలవడానికి మంచికారణమే ఉన్నది. (ప్రకటన 21:2) అయితే చివరకు ఆ మహావేశ్య వ్యతిరేకతను, విపత్తును, నాశనాన్ని అనుభవించింది. దయ్యములకు సంబంధించిన అలవాట్లు, జ్యోతిష్కులు దాన్ని కాపాడలేకపోయారు. (యెషయా 47:1, 11-13 పోల్చండి.) సత్యారాధనకు నిజంగా గొప్ప విజయమే!

12 ఏహ్యమైన వేశ్యతో, మహాబబులోను ఇకలేకుండా పోవడంలో యిప్పుడు గొఱ్ఱెపిల్లయొక్క పవిత్రమైన కన్య వైపు ధ్యానాన్ని మళ్లించవచ్చును! అందుకే పరలోక సమూహం ఆనందంతో యెహోవాను స్తుతిస్తూ యిలా పాడుతున్నారు: “గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది; ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము . . . మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.”—ప్రకటన 19:7, 8.

13. గొఱ్ఱెపిల్ల వివాహానికి శతాబ్దాలనుండి ఏమి ఏర్పాట్లు జరుగుతున్నాయి?

13 శతాబ్దాల తరబడి యేసు యీ పరలోక వివాహానికి ప్రేమపూర్వకమైన ఏర్పాటు చేసియున్నాడు. (మత్తయి 28:20; 2 కొరింథీయులు 11:2) ఆయన, ఆ 1,44,000 మంది ఆత్మీయ ఇశ్రాయేలీయులును “కళంకమైనను, ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని” దానిని పరిశుభ్రపరస్తూ వస్తున్నాడు. (ఎఫెసీయులు 5:25-27) “దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము” పొందే దృష్టితో, ప్రతి అభిషక్త క్రైస్తవుడు ప్రాచీన స్వభావమును దాని క్రియలతోకూడ పరిత్యజించి, నూతన స్వభావాన్ని ధరించుకొని, “ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా” నీతిక్రియలను చేయాలి.—ఫిలిప్పీయులు 3:8, 13, 14; కొలొస్సయులు 3:9, 10, 23.

14. గొఱ్ఱెపిల్ల భార్యగా కాబోయే సభ్యులను అపవిత్రపరచడానికి సాతానెలా ప్రయత్నించాడు?

14 సా.శ. 33 పెంతెకొస్తునుండి, సాతాను మహాబబులోనును ఉపయోగించుకొని గొఱ్ఱెపిల్లకు పెండ్లికుమార్తెగా కాబోయే సభ్యులను అపవిత్రపర్చాలని ప్రయత్నించాడు. మొదటి శతాబ్దాంతానికి అతడు సంఘంలో బబులోను మతవిత్తనాలను నాటాడు. (1 కొరింథీయులు 15:12; 2 తిమోతి 2:18; ప్రకటన 2:6, 14, 20) అపొస్తలుడైన పౌలు విశ్వాసాన్ని వక్రమార్గంలో త్రిప్పేవారిని గూర్చి యీ మాటల్లో చెబుతున్నాడు: “ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు.” (2 కొరింథీయులు 11:13, 14) ఆ తర్వాతి శతాబ్దాల్లో, భ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యం, బబులోనులోని మిగతా భాగంవలె, “ధూమ్రరక్తవర్ణముగల . . . బంగారముతోను రత్నములతోను ముత్యములతోను,” అలంకరింపబడిన ఐశ్వర్యము, హోదాయనే వస్త్రాలను ధరించుకున్నది. (ప్రకటన 17:4) దాని మతగురువులు, పోపులు కాన్‌స్టాన్‌టైన్‌, షార్లిమాన్‌వంటి రక్తపిపాసులగు చక్రవర్తులతో చెలిమిచేశారు. అదెన్నడూ “పరిశుద్ధుల నీతిక్రియలను” ధరించుకోలేదు. మోసకారియైన పెండ్లికుమార్తెగా అది సాతాను మోసానికి నిజంగా ప్రతిరూపమై యుండెను. చివరికది శాశ్వతంగా లేకుండాపోయింది!

గొఱ్ఱెపిల్లభార్య తన్నుతాను సిద్ధం చేసుకున్నది

15. ముద్రించబడేది ఎలా జరుగుతుంది, మరి అభిషక్త క్రైస్తవుడేమి చేయాలి?

15 గనుక యిప్పుడు, దాదాపు 2,000 సంవత్సరాల తర్వాత పెండ్లికుమార్తెకు సంబంధించిన 1,44,000 మందిలోని అందరూ తమ్మునుతాము సిద్ధపర్చుకొనియున్నారు. అయితే ఎప్పటినుండి ‘గొఱ్ఱెపిల్ల భార్య తన్నుతాను సిద్ధపర్చుకొనివుందని’ చెప్పవచ్చును? సా.శ. 33 పెంతెకొస్తునాటినుండి విశ్వాసులైన అభిషక్త క్రైస్తవులు క్రమేపి ‘వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి,’ ఇది “విమోచన దినమును” దృష్టిలోవుంచుకొని జరిగింది. అపొస్తలుడైన పౌలు వ్యక్తపరచినట్లు, దేవుడు “మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.” (ఎఫెసీయులు 1:13; 4:30; 2 కొరింథీయులు 1:22) ప్రతి అభిషక్త క్రైస్తవుడు “పిలువబడిన, యేర్పరచబడిన” వాడు, మరియు “నమ్మకమైన” వానిగా రుజువు చేసుకొని యున్నాడు.—ప్రకటన 17:14.

16. (ఎ) అపొస్తలుడైన పౌలు ముద్రించబడడమెప్పుడు ముగిసింది, అది మనకెలా తెలుసు? (బి) గొఱ్ఱెపిల్ల భార్య ఎప్పుడు పూర్తిగా “తన్నుతాను సిద్ధపరచు” కుంటుంది?

16 దశాబ్దాలు పరీక్షించుకొనిన మీదట పౌలు తానే యిలా అనగల్గాడు: “మంచిపోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకుమాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.” (2 తిమోతి 4:7, 8) ఆయనింకను శరీరముతో ఉంటూ, హతసాక్షి కాబోతున్ననూ, ఆ అపొస్తలుడు ముద్రించబడడం జరిగిపోయినట్లు కనిపిస్తోంది. అలాగే, 1,44,000 మందికి సంబంధించిన వారిలో భూమ్మీద శేషించిన వారందరు యెహోవాకుచెందిన వారని వ్యక్తిగతంగా ముద్రించబడడానికి సమయం రావాలి. (2 తిమోతి 2:19) గొఱ్ఱెపిల్ల భార్య తనకుతాను పూర్తిగా సిద్ధపడినప్పుడు—అంటే 1,44,000 మందిలో అనేకులు యిప్పటికే పరలోక బహుమతి నందుకొనగా, భూమ్మీద శేషించబడినవారు చివరకు అంగీకరించబడి నమ్మకమైనవారుగా ముద్రింప బడినప్పుడు యిది వస్తుంది.

17. గొఱ్ఱెపిల్ల వివాహం ఎప్పుడు జరుగవచ్చు?

17 యెహోవా కాలమానం ప్రకారం, 1,44,000 మందిని ముద్రించడం సంపూర్తియైన తర్వాత, దూతలు మహాశ్రమల యొక్క నాలుగు వాయువులను విడుదల చేస్తారు. (ప్రకటన 7:1-3) మొదట, వేశ్యవంటి మహాబబులోనుకు తీర్పుజరుగుతుంది. తదుపరి విజేతయగు క్రీస్తు భూమ్మీదనున్న సాతాను సంస్థను నాశనం చేయడానికి, తుదకు సాతానును అతని దయ్యాలను అగాధంలో బంధించడానికి తక్షణం అర్మగిద్దోనువైపు మరలుతున్నాడు. (ప్రకటన 19:11–20:3) నిశ్చయంగా, భూమ్మీద తప్పించుకున్న అభిషక్తులు పెండ్లికుమార్తె తరగతి సభ్యులతో కలుసుకోవడానికి త్వరలో తమ పరలోక బహుమానమును పొందుతారు. తదుపరి, విశ్వశాంతిని నెలకొల్పే నేపథ్యంలో గొఱ్ఱెపిల్ల వివాహము జరగగలదు!

18. గొఱ్ఱెపిల్ల వివాహపు సంఘటనల పరంపరను కీర్తన 45 ఎలా స్థిరపరస్తుంది?

18కీర్తన 45 లోని ప్రవచనార్థక వివరణ ఆ క్రమపద్ధతిని స్థిరపరుస్తుంది. మొదట సింహాసనాసీనుడైన రాజు తన శత్రువులను జయించడానికి బయలుదేరుతాడు. (1-7 వచనాలు) తదుపరి, పరలోక పెండ్లికుమార్తె, భూమ్మీద గొప్పసమూహమనే కన్యకతోడురాగా హాజరయ్యే వివాహం జరుగుతుంది. (8-15 వచనాలు) ఆ పిదప పునరుత్థానులైన మానవులు ‘భూమియంతటనున్న అధికారుల’ ఆధ్వర్యాన పరిపూర్ణస్థితికి తేబడినప్పుడు వివాహం ఫలవంతమౌతుంది. (16, 17 వచనాలు) గొఱ్ఱెపిల్ల వివాహం ఎంతటి దీవెనలు తెస్తాయోగదా!

ఆహ్వానింపబడిన వారు ధన్యులు

19. ప్రకటనలోని ఏడు ధన్యతలలో నాల్గవదేమిటి, ఈ ప్రత్యేకమైన ఆనందంలో పాలుపంచుకునేదెవరు?

19 యోహానిప్పుడు ప్రకటనలోని ఏడు ధన్యతలను గూర్చి వ్రాయడం ఆరంభించాడు: “మరియు అతడు [యోహానుకు యీ విషయాలను చూపే దూత] నాతో ఈలాగు చెప్పెను—గొఱ్ఱెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.” (ప్రకటన 19:9) * “గొఱ్ఱెపిల్ల వివాహపు విందుకు” పిలువబడినవారు పెండ్లికుమార్తె తరగతికి చెందినవారు. (మత్తయి 22:1-14 పోల్చండి.) అభిషక్తులైన పెండ్లికుమార్తెకు సంబంధించిన వారంతా యీ ఆహ్వానాన్నందుకునే ఆనందంలో పాలుపంచుకుంటారు. ఆహ్వానితులలో అనేకులు వివాహవిందు జరిగే స్థలమైన పరలోకానికి యిప్పటికే వెళ్లారు. ఇంకా భూమ్మీదనున్న వారు కూడ వారికి ఆహ్వానమున్నదని ఆనందిస్తున్నారు. వివాహపు విందులో వారి స్థానం పదిలమే. (యోహాను 14:1-3; 1 పేతురు 1:3-9) వారు పరలోకానికి పునరుత్థానులైనప్పుడు, అప్పుడు ఐకమత్యంగానున్న మొత్తం పెండ్లికూతురు గొఱ్ఱెపిల్లతోపాటు ఆ సర్వోన్నత వివాహ సంతోషంలో పాల్గొంటారు.

20. (ఎ) “ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు” అనే పదాల ప్రాముఖ్యతేమి? (బి) దూత మాటలవల్ల యోహానెలా ప్రభావితుడయ్యాడు, మరి దూత స్పందనేమిటి?

20 “ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు” అని కూడ దూత చెబుతున్నాడు. “యథార్థమైన” అనే యీ పదం గ్రీకులో అలెతినోస్‌ అంటే “వాస్తవమైన,” “నమ్మదగిన” అని అర్థమిచ్చే దానినుండి అనువదించబడింది. ఈ మాటలు నిజంగా యెహోవానుండే వస్తున్నందున అవి విశ్వసింపదగినవి, నమ్మదగినవి. (1 యోహాను 4:1-3; ప్రకటన 21:5; 22:6 పోల్చండి.) ఆ వివాహవిందుకు ఆహ్వానితునిగా యోహాను ఆ విషయం విని, పెండ్లికుమార్తె తరగతికి వేచియున్న ఆశీర్వాదాలను తలపోస్తూ ఆనందంతో నిండిపోయి ఉండొచ్చు. ఆయన ఎంతో పొంగిపోయినందున, దూత ఆయననిలా హెచ్చరించవలసి వచ్చింది, యోహానిలా చెబుతున్నాడు: “అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదములయెదుట సాగిలపడగా అతడు—వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము.”—ప్రకటన 19:10ఎ.

21. దూతలనుగూర్చి ప్రకటన ఏమని బయల్పరుస్తుంది? (బి) క్రైస్తవులు దూతలయెడల ఎటువంటి మనోభావం కల్గివుండాలి?

21 ప్రకటన అంతటనూ దూతల నమ్మకత్వాన్ని పట్టుదలనుగూర్చి అద్భుతమైన సాక్ష్యమివ్వబడింది. సత్యాన్ని బయలుపర్చే విషయంలో వారు వారధులు. (ప్రకటన 1:1) సువార్త ప్రకటించడంలోను, సాదృశ్యమైన తెగుళ్లను కుమ్మరించడంలోను వారు మానవులతో కలిసి పనిచేస్తారు. (ప్రకటన 14:6, 7; 16:1) సాతానును అతని దూతలను పరలోకంనుండి పడద్రోయడంలో వారు యేసుతో కలిసి యుద్ధం చేశారు, మరియు వారు అర్మగిద్దోనులో ఆయనతోపాటు యుద్ధం చేస్తారు. (ప్రకటన 12:7; 19:11-14) వాస్తవానికి, వారు యెహోవాను నేరుగా సమీపించగలరు. (మత్తయి 18:10; ప్రకటన 15:6) అయిననూ, వారు వినయస్థులైన దేవుని దాసులే. పవిత్రారాధనలో దూతలను ఆరాధించడానికి గాని సాపేక్షారాధనకు గాని, ఏదొక “సెయింట్‌” లేక దూతద్వారా దేవున్ని ఆరాధించే అవకాశమేలేదు. (కొలొస్సయులు 2:18) క్రైస్తవులు యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు, యేసు నామమున వారాయనకు విన్నపములు చేస్తారు.—యోహాను 14:12, 13.

ప్రవచనంలో యేసు పాత్ర

22. దూత యోహానుకు ఏమి చెబుతున్నాడు, ఆ మాటల భావమేమి?

22 దేవదూత యింకా యిలా చెబుతున్నాడు: “యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారము.” (ప్రకటన 19:10బి) అదెలాగు? అంటే ప్రవచనమంతా యేసునుబట్టి, ఆయన యెహోవా సంకల్పంలో నిర్వహించే పాత్రనుబట్టి కలుగుతుంది. బైబిల్లోని మొట్టమొదటి ప్రవచనం రాబోవు సంతానాన్నిగూర్చి వాగ్దానం చేసింది. (ఆదికాండము 3:15) యేసే ఆ సంతానమయ్యాడు. ఈ మొదటి వాగ్దానం మీదనే తదుపరి బయల్పర్చబడిన సంగతులు ప్రవచనార్థక సత్యంయొక్క ఓ పెద్ద నిర్మాణాన్ని చేపట్టాయి. అపొస్తలుడైన పేతురు విశ్వాసియైన అన్యుడగు కొర్నేలీతో యిలా అన్నాడు: “ప్రవక్తలందరు ఆయనను [యేసును] గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు.” (అపొస్తలుల కార్యములు 10:43) సుమారు 20 సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు యిలా అన్నాడు: “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తు [యేసు] నందు అవునన్నట్టుగానే యున్నవి.” (2 కొరింథీయులు 1:20) మరో 43 సంవత్సరాల తర్వాత యోహానే మనకిలా జ్ఞాపకం చేస్తున్నాడు: “సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను.”—యోహాను 1:17.

23. యేసుకున్న ఉన్నతాధికారం, స్థానం మనం యెహోవాకు చెల్లించే ఆరాధననుండి ఎందుకు వేరుచేయదు?

23 మనం యెహోవాకు చెల్లించే ఆరాధననుండి యిది మనల్ని ఏవిధంగానైనా వేరుచేస్తుందా? లేదు. “దేవునికే నమస్కారము చేయుము.” అని చెప్పిన దూత హెచ్చరికను జ్ఞాపకం చేసుకొనండి. యేసు యెహోవాకు వ్యతిరేకంగా తిరగడానికి ఎన్నటికీ ప్రయత్నించడు. (ఫిలిప్పీయులు 2:6) నిజమే, దూతలందరూ “ఆయనకు [యేసుకు] నమస్కారము చేయవలెనని” తెల్పబడ్డారు, “ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు” సమస్త సృష్టి ఆయన ఉన్నత స్థానాన్ని గుర్తించాలి. కానీ గమనించండి, దీన్ని “తండ్రి మహిమార్థమై,” ఆయన ఆజ్ఞమేరకు చేయాలి. (హెబ్రీయులు 1:6; ఫిలిప్పీయులు 2:9-11) యెహోవా యేసుకు తన ఉన్నత స్థానాన్ని అనుగ్రహించాడు, మరి ఆ అధికారాన్ని ఒప్పుకొని మనం దేవునికి మహిమ చెల్లిస్తాము. మనం యేసు పరిపాలనకు విధేయులమగుటకు తిరస్కరిస్తే, అది యెహోవానే తిరస్కరించిన దానితో సమానమౌతుంది.—కీర్తన 2:11, 12.

24. ఏ రెండు ఆశ్చర్యంగొల్పే సంఘటనలను గూర్చి మనం ధ్యానిస్తూ ఉండాలి, అందుచేత ఏ మాటల్ని మనం మారుమ్రోగిస్తుండాలి?

24 గనుక మనం కీర్తనలు 146 నుండి 150 వరకున్న “యెహోవాను స్తుతించుడి” అనే మొదటి మాటలను ఐక్యంగా పలుకుదాము. బబులోను యొక్క ప్రపంచ అబద్ధమతంపై యెహోవా విజయోత్సవాన్ని నిరీక్షిస్తూ హల్లెలూయ అనే బృందగానాన్ని మారుమ్రోగిద్దాం! మరియు గొఱ్ఱెపిల్ల వివాహము సమీపిస్తుండగా ఆనందం పొంగిపొరలును గాక!

[అధస్సూచీలు]

^ పేరా 1 న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి.

^ పేరా 1 న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి.

^ పేరా 5 న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి.

^ పేరా 9 న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి. [This footnote is not in vernacular]

[అధ్యయన ప్రశ్నలు]

[273వ పేజీలోని బాక్సు]

“సొదొమ గొమొర్రాలకు పత్రిక”

ఈ ముఖశీర్షిక క్రింద, లండన్‌ డైలీ టెలిగ్రాఫ్‌, నవంబరు 12,1987న చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ యొక్క జనరల్‌ సభ యెదుటనున్న ఒక తీర్మానాన్నిగూర్చి నివేదించింది. దీని ప్రకారం పురుషసంయోగులైన “క్రైస్తవులను” చర్చినుండి వెలివేయాలని కోరింది. పత్రికా వ్యాసరచయిత కాడ్‌ప్రె బార్కర్‌ యిలా అన్నాడు: “కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ నిన్న తన అభిప్రాయాన్ని సూచనప్రాయంగా యిలా వెలిబుచ్చాడు: ‘చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కే సెయింట్‌పాల్‌ పత్రిక వ్రాయవలసివుంటే, అదెటువంటి పత్రికై వుంటుందోనని మనమడుగవలసి వుంటుంది.’” బార్కర్‌గారు స్వయంగా యిలా అన్నాడు: “సొదొమ గొమొర్రాలకు వ్రాస్తున్న పత్రికయనే సమాధాన ముంటుందని” అంటూ “డా. రూన్సి [ఆర్చ్‌బిషప్‌] దాన్ని రోమీయులు 1వ అధ్యాయం అని చదవాలని చమత్కరించాడు,” అని కూడ అన్నాడు.

ఆ రచయిత పౌలు మాటలను రోమీయులు 1:26-32 నుండి ఎత్తి చెప్పాడు: “అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను . .  పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు . . . ఇట్టికార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.” ఆయన యిలా ముగించాడు: “సెయింట్‌ పాల్‌ ఆలయ ఆవరణంలోవున్న మనుష్యులనుగూర్చి చింతించి ఉండొచ్చు, డా. రూన్సి వేదికలమీదనున్న మనుష్యులనుగూర్చి సమస్యను కల్గివున్నాడు.”

ఆర్చిబిషప్‌కు అటువంటి సమస్య ఎందుకున్నది? అక్టోబరు 22, 1987, లండన్‌ డైలీ మెయిల్‌ పత్రిక పెద్దక్షరాల్లో యిలా ప్రకటించింది: “ప్రతి ముగ్గురు మత గురువులలో ఒక్కరు సలింగ సంయోగి . . . పురుషగాములను పారద్రోలాలని ప్రచారం చేస్తే ‘చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ మూతబడుతుంది.’” స్త్రీగాములు పురుషగాముల క్రైస్తవదళం యొక్క “రెవరెండ్‌” జనరల్‌ సెక్రటరీ చెప్పిన విషయాన్ని యిలా నివేదిస్తుంది: “ఈ తీర్మానాన్ని అంగీకరిస్తే అది చర్చిని ముక్కలు చేస్తుంది. ఆ సంగతి ఆర్చ్‌బిషప్‌కు తెలుసు. సాధారణంగా, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌లోని మతగురువుల్లో 30 నుండి 40 శాతం మంది పురుషగాములని మనం నమ్ముతాం. మరి వారే చర్చిలో చురుకుగా పరిచర్యచేసేవారు.” చర్చికివెళ్లే సభ్యుల సంఖ్య తగ్గిపోవడానికి యీ తుచ్ఛమైన పురుషగాముల పరిచర్యయెడల అసహ్యతే నిస్సందేహంగా కొంతమట్టుకు కారణమైవుంది.

మరి చర్చి సభ ఏమని తీర్మానించింది? దాని 388 సభ్యుల్లో అత్యధికులు (95 శాతం మతగురువులు) ఆ బలహీనపడిన తీర్మానానికి అనుకూలంగా ఓటుచేశారు. దీన్నిగూర్చి ది ఎకానమిస్ట్‌ పత్రిక నవంబరు 14, 1987న యిలా నివేదించింది: “చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ పురుషగాముల క్రియలకు వ్యతిరేకమే గాని అంతెక్కువగా కాదు, సాధారణ సభ, అంటే చర్చి పార్లమెంట్‌, పురుషగాములను దృష్టిలోపెట్టుకొని, వ్యభిచారం జారత్వముల మాదిరి పురుషగాముల క్రియలు పాపం కాదని యీ వారం తీర్మానించింది: శాశ్వత వివాహబంధంలోనే లైంగిక సంయోగం సరియైన చర్యయని వారు తెలుసుకోలేక పోతున్నారంతే.” అపొస్తలుడైన పౌలు రోమీయులు 1:26, 27 నందు నిక్కచ్చిగా చెప్పిన మాటలతో కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ అభిప్రాయాన్ని పోల్చిచెబుతూ, ది ఎకానమిస్ట్‌ పత్రిక “సెంట్‌ పాల్‌కు తన తలంపేమిటో తనకు తెలుసు,” అనే పైవిలాసం మీద పౌలు మాటలను ఎత్తి వ్రాసింది.

యేసుకుకూడ ఆయన తలంచిందేదో ఆయనకు తెలుసు దాన్ని ఆయన సవివరంగా తెల్పాడు. తన వర్తమానాన్ని తృణీకరించిన మతనాయకుల కంటె “విమర్శ దినమున సొదొమ దేశపువారి గతి ఓర్వదగినదని” ఆయన అన్నాడు. (మత్తయి 11:23, 24) దేవుని కుమారుని ఆయన బోధలను తిరస్కరించిన మతనాయకులు సొదొమవారికంటె నిందాసహితులని యేసు యిక్కడ అతిశయోక్తిగా చెబుతున్నాడు. యూదా 7వ వచనం సొదొమవారు “నిత్యాగ్నిదండన” అంటే నిత్యనాశనం పొందారని తెల్పుతోంది. (మత్తయి 25:41, 46) గనుక, క్రైస్తవనాయకులని పిలువబడేవారు గ్రుడ్డిగా తమ గ్రుడ్డిమందలను దేవుని రాజ్యంయొక్క ఉన్నతమైన నైతిక నియమాలనుండి తొలగించి లోకసంబంధమైన స్వేచ్ఛాయుత, విచ్చలవిడితనానికి నడిపిస్తూవుంటే మరి వారెంతటి కఠినమైన తీర్పుకు గురౌతారో గదా? (మత్తయి 15:14) అబద్ధమతాన్ని, అంటే మహాబబులోనును గూర్చి పరలోకమునుండి వచ్చిన స్వరం అత్యవసరంగా యిలా చెబుతోంది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలికాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.”—ప్రకటన 18:2, 4.

[275వ పేజీలోని చిత్రం]

మహాబబులోనుపై యెహోవా అంతిమ విజయాన్ని పురస్కరించుకుని పరలోకం నాలుగు హల్లెలూయలతో మారుమ్రోగుతోంది