కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవమత సామ్రాజ్యం మీద యెహోవా తెగుళ్లు

క్రైస్తవమత సామ్రాజ్యం మీద యెహోవా తెగుళ్లు

అధ్యాయం 21

క్రైస్తవమత సామ్రాజ్యం మీద యెహోవా తెగుళ్లు

దర్శనము 5—ప్రకటన 8:1–9:21

అంశం: ఏడుబూరలలో ఆరింటిని ఊదుట

నెరవేర్పు కాలం: క్రీస్తు యేసు 1914 లో సింహాసనా సీనుడైనప్పటినుండి మహాశ్రమలవరకు

1. గొఱ్ఱెపిల్ల ఏడవముద్రను విప్పినప్పుడు ఏమౌతుంది?

ఆ 1,44,000 మంది ఆత్మీయ ఇశ్రాయేలీయులు ముద్రింప బడి, గొప్పసమూహం తప్పించుకోవడానికి అంగీకరించబడేవరకు ఆ “నాలుగు దిక్కుల వాయువులు” వదలిపెట్టబడలేదు. (ప్రకటన 7:1-4, 9) అయిననూ, భూమ్మీదికి ఆ పెనుతుపాను విరుచుకు పడకముందే సాతాను లోకం మీదకు వచ్చే యెహోవా ప్రతికూల తీర్పులుకూడ ప్రకటింపబడాలి. గొఱ్ఱెపిల్ల చివరిదైన ఏడవ ముద్రను విప్పుటకు ఉపక్రమించినప్పుడు ఏమి బయలు పడుతుందోనని యోహాను ఎంతో ఆశతో పరిశీలిస్తుండవచ్చును. ఇప్పుడాయన తన అనుభవాన్ని యిలా మనతో పంచుకుంటున్నాడు: “ఆయన [గొఱ్ఱెపిల్ల] యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతట నేను దేవుని యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.”—ప్రకటన 8:1, 2.

పట్టుదలతో ప్రార్థించవలసిన సమయం

2. పరలోకంలో ఓ అలంకారికమైన అరగంట నిశ్శబ్దం కలిగినప్పుడు ఏం జరుగుతుంది?

2 ఇదెంతో ప్రాముఖ్యమైన నిశ్శబ్దం! ఏదో జరగాలని నీవు అనుకున్నప్పుడు అరగంట వేచి ఉండడమంటే ఎంతో దీర్ఘకాలమనిపిస్తుంది. ఇప్పుడైతే ఎడతెగక ఉండే పరలోక స్తుతిగీతంకూడ యిక వినిపించడం లేదు. (ప్రకటన 4:8) ఎందుకు? దీనికిగల కారణాన్ని యోహాను దర్శనంలో యిలా చూస్తున్నాడు: “మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.”—ప్రకటన 8:3, 4.

3. (ఎ) ధూపం వేయడం మనకు దేనిని జ్ఞాపకం చేస్తుంది? (బి) పరలోకంలో అరగంటసేపున్న నిశ్శబ్దపు ఉద్దేశమేమిటి?

3 యూదామత విధానం ప్రకారం గుడారంలోను, తర్వాతి సంవత్సరాల్లో యెరూషలేము దేవాలయంలోను ప్రతిదినం ధూపం వేయబడేదన్న సంగతిని యిది మనకు జ్ఞాపకం చేస్తుంది. (నిర్గమకాండము 30:1-8) అలా ధూపంవేసే సమయంలో, యాజకులుకాని ఇశ్రాయేలీయులు పరిశుద్ధస్థలం బయట వేచివుంటూ—ఆ ధూపం వేయబడేవానికి—నిశ్చయంగా తమ హృదయాల్లో మౌనంగా ప్రార్థిస్తూంటారు. (లూకా 1:10) పరలోకంలో కూడ అటువంటిదేదో జరుగుతున్నట్లు యోహాను యిప్పుడు చూస్తున్నాడు. ఆ దూత వేసే ధూపం “పరిశుద్ధుల ప్రార్థనలకు” సంబంధం కల్గివుంది. వాస్తవానికి, ముందివ్వబడిన దర్శనంలో ధూపం అటువంటి ప్రార్థనలను సూచించినట్లు చెప్పబడింది. (ప్రకటన 5:8; కీర్తన 141:1, 2) గనుక, పరలోకమందలి సాదృశ్యమైన ఆ నిశ్శబ్దానికిగల కారణం భూలోకమందలి పరిశుద్ధులు చేసేప్రార్థనలు వినడానికి వీలు కల్పించేందుకేనన్న విషయం విశదమౌతుంది.

4, 5. అలంకారికమైన అర్థగంట నిశ్శబ్దానికి సరిపడు కాలాన్ని నిర్థారించడానికి ఏ చారిత్రాత్మిక సంఘటనలు మనకు సహాయం చేస్తాయి?

4 ఇదెప్పుడు జరిగిందో మనం నిర్ణయించి చెప్పగలమా? అవును, ప్రభువు దినములో తొలిభాగమందు జరిగిన చారిత్రాత్మక సంఘటనలతోపాటు దాని సందర్భాన్ని పరిశీలించడంద్వారా మనం చెప్పవచ్చు. (ప్రకటన 1:10) భూమ్మీద 1918, 1919 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు, ప్రకటన 8:1-4 లో వర్ణించబడిన దృశ్యానికి చాలా అనుగుణ్యంగా ఉన్నవి. బైబిలు విద్యార్థులు—యెహోవాసాక్షులు ఆనాడు అలా పిలువబడ్డారు—1914నకు 40 సంవత్సరాల ముందే, ఆ సంవత్సరంలో అన్యరాజుల కాలములు అంతమైపోతాయని ధైర్యంగా ప్రకటిస్తూ వచ్చారు. వారు చెప్పింది యథార్థమేనని 1914 లో జరిగిన దుఃఖకరమైన సంఘటనలు రుజువుచేశాయి. (లూకా 21:24, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌; మత్తయి 24:3, 7, 8) అయితే అనేకులు తాము 1914 లో భూలోకంనుండి తమ పరలోక స్వాస్థ్యమునకు కొనిపోబడతామని కూడ విశ్వసించారు. అది జరగలేదు. దానికి బదులు, వారు మొదటి ప్రపంచ యుద్ధకాలంలో కఠినహింసలను సహించవలసి వచ్చింది. అక్టోబరు 31, 1916 లో వాచ్‌టవర్‌ సొసైటి మొదటి అధ్యక్షుడు, చార్లెస్‌ టి. రస్సెల్‌ చనిపోయారు. తర్వాత, జూలై 4, 1918 లో తప్పుడు నేరారోపణపై అనేక సంవత్సరాలు శిక్ష అనుభవించడానికి, నూతన అధ్యక్షుడు, జోసఫ్‌ యఫ్‌. రూథర్‌ఫర్డ్‌, సొసైటి యితర ఏడుగురు ప్రతినిధులు జార్జియాలోని అట్లాంటా జైలుకు తరలించబడ్డారు.

5 యోహాను తరగతికి చెందిన యథార్థ క్రైస్తవులు కలవరపడ్డారు. తదుపరి వారేం చేయాలని దేవుని అభీష్టం? వారెప్పుడు పరలోకానికి తీసుకొనిపోబడాలి? ది వాచ్‌టవర్‌ 1919, మే 1వ సంచికలో “ది హార్వెస్ట్‌ ఎన్‌డెడ్‌—వాట్‌ షల్‌ ఫాలో?” అనే శీర్షిక వెలువడింది. ఆ అనిశ్చయతా పరిస్థితిని జ్ఞాపకంచేస్తూ నమ్మకమైన వారినది సహించుడని ప్రోత్సహించింది, యింకా యిలా తెల్పింది: “రాజ్యతరగతి సమకూర్పు అనేది నెరవేరిన వాస్తవమని యిప్పుడు చెప్పడంలోని సత్యాన్ని మేము నమ్ముతున్నాం, అటువంటివారంతా కచ్చితంగా ముద్రించబడియున్నారు, మరి ద్వారం మూయబడింది.” ఈ క్లిష్ట సమయంలోనే, యోహాను తరగతి చేసిన పట్టుదలతోకూడిన ప్రార్థనలు విస్తారమైన ధూపపు పొగవలె, పైకెగసి వెళ్లాయి. మరి వారి ప్రార్థనలు ఆలకించబడ్డాయి!

నిప్పును భూమ్మీద పడవేయుట

6. పరలోకమందు నిశ్శబ్దం ముగిసిన తదుపరి ఏం జరుగుతుంది, ఇది దేనికి ప్రత్యుత్తరముగా జరుగుతుంది?

6 యోహాను మనకిలా చెబుతున్నాడు: “ఆ దూత ధూపార్తిని తీసికొని, బలిపీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.” (ప్రకటన 8:5) నిశ్శబ్దం తర్వాత ఆకస్మికంగా గొప్పపని ప్రారంభమైంది! ఇది స్పష్టంగా, పరిశుద్ధుల ప్రార్థనలకు ప్రత్యుత్తరంగా జరిగే పనియే, ఎందుకంటే, యిది బలిపీఠంనుండి తీసికొనబడిన నిప్పునుండి కల్గినదే. సా.శ.పూ. 1513 లో సీనాయి పర్వతంమీద మెరుపులు, ఉరుములు, అగ్ని, పర్వతం కంపించడం వంటివి యెహోవా తన ప్రజలవైపు తన అవధానాన్ని మళ్లించాడని సూచించాయి. (నిర్గమకాండము 19:16-20) అలాగే, యోహాను తెలిపిన ఆ మాదిరి సంఘటనలు భూమ్మీదనున్న తన సేవకులవైపు యెహోవా తన అవధానాన్ని నిలుపుతున్నాడనే విషయాన్ని సూచిస్తున్నాయి. అయితే యోహాను గమనించేదంతా సూచనల రూపంలో యివ్వబడింది. (ప్రకటన 1:1) మరైతే సాదృశ్యమైన అగ్ని, ఉరుములు, శబ్దములు, మెరుపులు, మరియు భూకంపములు అంటే యీనాడు ఏమైయున్నవని అర్థంచేసుకోవాలి?

7. (ఎ) యేసుక్రీస్తు తన భూలోక పరిచర్య కాలంలో ఎటువంటి అలంకారికమైన అగ్నిని రగిల్చాడు? (బి) యేసు ఆత్మీయ సహోదరులు క్రైస్తవమత సామ్రాజ్యంలో ఎలా నిప్పుపెట్టారు?

7 ఒక సందర్భంలో, యేసు తన శిష్యులతో యిలా చెప్పాడు: “నేను భూమిమీద అగ్నివేయవచ్చితిని.” (లూకా 12:49) నిజంగా ఆయన అగ్ని వేశాడు. ఆయన తన ప్రచారంద్వారా, యేసు యూదుల యెదుట దేవునిరాజ్యమే ప్రాముఖ్యమైన అంశంగా ఉంచాడు, ఇదే ఆ జనాంగమంతటిలోను వివాదాగ్ని రగిల్చింది. (మత్తయి 4:17, 25; 10:5-7, 17, 18) మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఎదుర్కొన్న శ్రమలను తప్పించుకున్న ఓ చిన్న అభిషక్త క్రైస్తవులగుంపు, అంటే 1919 లో భూమ్మీదనున్న యేసు ఆత్మీయ సహోదరులు, క్రైస్తవమత సామ్రాజ్యంలో అటువంటి అగ్నినే రగిల్చారు. ఆ సంవత్సరం సెప్టెంబరులో అమెరికాలోని ఓహాయోనందలి సీడార్‌పాయింట్‌లో, సమీప సుదూర ప్రాంతాలనుండివచ్చి సమావేశమైన తన నమ్మకస్థులైన సాక్షులమీద యెహోవా ఆత్మ బహుస్పష్టంగా కనిపించింది. అప్పుడే విడుదలై, త్వరలోనే పూర్తిగా నిర్దోషియని నిరూపించబడనైయున్న జె. యఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఆ సమావేశములో బహు ధైర్యంగా యిలా ప్రసంగించాడు: “మన యజమానునికి విధేయులు కావడం, మరియు ప్రజలను దీర్ఘకాలంగా బందీలనుచేసిన తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడడంలో మన ఆధిక్యతలను హక్కులను గుర్తెరగడం, రానైయున్న మెస్సీయ మహిమాన్విత రాజ్యాన్ని ప్రకటించడమే మన పనియై యుండెను, ఇప్పుడూ అలాగే ఉన్నది.” అదే ప్రాథమిక వివాదాంశం—దేవుని రాజ్యము!

8, 9. (ఎ) సొసైటి అధ్యక్షుడు కఠినమైన యుద్ధకాలంలో దేవుని ప్రజల దృక్పథాలను కోరికలను ఎలా వర్ణించాడు? (బి) అగ్ని భూమిమీదకు ఎలా పడవేయబడింది? (సి) ఉరుములు, శబ్దములు, మెరుపులు, మరియు భూకంపములు ఎలా కలిగాయి?

8 అప్పుడే దేవుని ప్రజల చేదు అనుభవాలనుగూర్చి తెల్పుతూ ప్రసంగీకుడు యిలా అన్నాడు: “శత్రువు దాడి ఎంత తీవ్రంగా ఉందంటే, ప్రభువు తన చిత్తాన్ని బయలు పర్చవలెనని ప్రార్థిస్తూ, నిరీక్షిస్తూ, ప్రభువు ప్రియమైన మందలోని అనేకులు దిగ్భ్రమచెంది, ఆశ్చర్యచకితులైరి. . . . అయితే క్షణభంగురమైన నిరుత్సాహాన్ని లెక్కచేయకుండా, రాజ్యవర్తమానాన్ని ప్రకటించే తీక్షణమైన కోరిక ఉండెను.”—సెప్టెంబరు 15, 1919, ది వాచ్‌టవర్‌, 280వ పేజి చూడండి.

9 ఆ కోరిక 1919 లో తీర్చబడింది. చిన్నదైననూ, చురుకైన యీ క్రైస్తవగుంపు, ఆత్మీయ దృష్టితోచెబితే, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రచారాన్ని ప్రారంభించడానికి అగ్నితో రగల్చబడింది. (1 థెస్సలొనీకయులు 5:19 పోల్చండి.) అగ్ని భూమ్మీదకు వేయబడిందంటే దేవుని రాజ్యం తీక్షణమైన వివాదాంశంగా చేయబడిందన్నమాట, అదింకా అలాగే కొనసాగుతుంది! నిశ్శబ్దాన్ని ఛేదించి, రాజ్యవర్తమానాన్ని స్పష్టంగా చెబుతూన్న గొప్పశబ్దాలు వెలువడ్డాయి. బైబిలు నుండి ఉరుములవంటి తుపాను హెచ్చరికలు దూసుకు వచ్చాయి. మెరుపులు మెరిసినట్లే, యెహోవా ప్రవచనార్థక వాక్యంనుండి సత్యంయొక్క మెరుపు కిరణాలు మెరిశాయి, మరియు పెద్ద భూకంపం వలె మతసామ్రాజ్యం పునాదులతోసహా వణికింది. ఇంకను చేయవలసిన పని వుందని యోహాను తరగతి గ్రహించింది. మరి యీనాటివరకు, భూదిగంతములవరకు ఆ పని మహిమాయుక్తంగా వృద్ధి అవుతూనేవుంది.—రోమీయులు 10:18.

బూరలు ఊదుటకు సిద్ధపడుట

10. ఏడుగురు దూతలు ఏంచేయడానికి సిద్ధపడుతున్నారు, ఎందుకు?

10 యోహాను యింకనూ యిలా తెల్పుతున్నాడు: “అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.” (ప్రకటన 8:6) ఆ బూరలు ఊదడమంటే అర్థమేమిటి? ఇశ్రాయేలీయుల కాలంలో, ప్రాముఖ్యమైన దినములను లేక సంఘటనలను సూచించడానికి బూరలు ఊదేవారు. (లేవీయకాండము 23:24; 2 రాజులు 11:14) అదేమాదిరి, యోహాను విననైయున్న బూరల శబ్దాలు జీవన్మరణ ప్రాముఖ్యతగల విషయాలవైపు అవధానాన్ని మళ్లిస్తాయి.

11. యోహాను తరగతి 1919 నుండి 1922 వరకు భూమ్మీద ఏ పనిని సిద్ధంచేయడానికి పనిరద్దీలో ఉండెను?

11 దేవదూతలు ఆ బూరలను ఊదడానికి సిద్ధపడుతుండగా, వారు భూమ్మీద సిద్ధపాటు పని విషయంలోకూడ నడిపింపునిస్తూ ఉండిరి. పునఃశక్తినొందిన యోహాను తరగతి 1919 నుండి 1922 వరకు బహిరంగ పరిచర్యను పునఃస్థాపించడంలోను, ప్రచురణ ఏర్పాట్లను చేయడంలోను నిమగ్నమైవుండెను. ఇప్పుడు తేజరిల్లు! అని పిలువబడుతున్న ది గోల్డన్‌ ఏజ్‌, అను పత్రిక 1919 లో—అబద్ధమతం రాజకీయాల్లో తలదూర్చే విషయాలను బట్టబయలు చేయడంలో ప్రముఖపాత్ర వహించబోవు బూరవంటి ఉపకరణంగా పనిచేయడానికి—“సత్యం, నిరీక్షణ మరియు నమ్మకంతోకూడిన పత్రికగా” ప్రారంభించబడింది.

12. ప్రతీ బూర ఊదినప్పుడు ఏం ప్రకటింపబడింది, మోషే కాలంనాటి దేనినది మనకు జ్ఞాపకం చేసింది?

12 మనమిప్పుడు గమనించబోతున్నట్లు, బూరధ్వనుల్లో ప్రతీది, భూభాగాలను తగిలే భయంకరమైన తెగుళ్లతోకూడిన దృశ్యాన్ని చూపిస్తుంది. వీటిలో కొన్ని మోషేకాలంలో ఐగుప్తీయులను శిక్షించడానికి యెహోవా పంపిన తెగుళ్లను మనకు జ్ఞాపకం చేస్తాయి. (నిర్గమకాండము 7:19–12:32) ఇవి ఆ జనాంగంమీద బయల్పరచిన యెహోవా తీర్పులు, అవి దేవుని ప్రజలు దాస్యంనుండి తప్పించుకోవడానికి మార్గాన్ని తెరిచాయి. యోహాను చూచే దర్శనంలోనివి అటువంటి వాటినే నెరవేరుస్తాయి. అయిననూ, అవి అక్షరార్థమైన తెగుళ్లుకావు. అవి యెహోవా నీతియుక్తమైన తీర్పులను సూచించే సూచనలు.—ప్రకటన 1:1.

“మూడవ భాగమును” గుర్తించుట

13. మొదటి నాలుగు బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుంది, దీనివల్ల ఏ ప్రశ్న వస్తుంది?

13 మనం గమనించబోతున్నట్లు, మొదటి నాలుగు బూరలు ఊదినప్పుడు, ఆ తెగుళ్లు భూమి సముద్రం, నదులు, నీటిబుగ్గలు, మరియు భూమిపై వెలుగునకు ఆధారభూతమైన వాటి యొక్క “మూడవ భాగము”నకు హానిని కల్గిస్తాయి. (ప్రకటన 8:7-12) మూడవ భాగమంటే ఒకదానిలో ఓ మోస్తరు భాగమే గానీ మొత్తం కాదు. (యెషయా 19:24; యెహెజ్కేలు 5:2; జెకర్యా 13:8, 9 పోల్చండి.) మరైతే ఏ “మూడవ భాగము” ఈ తెగుళ్లను పొందే సరియైన అర్హత కల్గివుంది? సాతాను అతని సంతానం, మానవజాతిలో అత్యధికులను గ్రుడ్డివారిగాచేసి పాడుచేశారు. (ఆదికాండము 3:15; 2 కొరింథీయులు 4:4) ఈ పరిస్థితి దావీదు వర్ణించినట్లేవుంది: “వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు.” (కీర్తన 14:3) అవును, మానవజాతియంతా ప్రతికూల తీర్పుపొందే అపాయంలోవుంది. అయితే అందులో ముఖ్యంగా ఒక భాగం నేరస్థులైవున్నారు. ఒక భాగం—“మూడవభాగము” అనేది బాగా తెలిసిందే అయివుండాలి! ఏమిటా “మూడవభాగము”?

14. యెహోవానుండి తెగులుతో కూడిన వర్తమానాలను అందుకునే సాదృశ్యమైన ఆ మూడవ భాగమేమిటి?

14 అదే క్రైస్తవమత సామ్రాజ్యము! అది 1920నాటికి మానవజాతిలో మూడవభాగాన్ని ఆక్రమించుకుంది. దాని మతం నిజమైన క్రైస్తవత్వం నుండి వేరైన గొప్పభ్రష్టత్వపు ఫలమే—అంటే యేసు, తన అపొస్తలులు ప్రవచించిన మతభ్రష్టత్వమే. (మత్తయి 13:24-30; అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 థెస్సలొనీకయులు 2:3; 2 పేతురు 2:1-3) క్రైస్తవమత సామ్రాజ్యపు మతగురువులు దేవుని ఆలయంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు, మరి వారే క్రైస్తవత్వానికి బోధకులుగా ప్రాతినిథ్యం వహించారు. అయితే వారి సిద్ధాంతాలు బైబిలు సత్యాలకు సుదూరంగా ఉన్నాయి, మరి వారు దేవుని నామాన్ని అపకీర్తిపాలు చేస్తూనేవున్నారు. మూడవ భాగమని సాదృశ్యరీతిలో యుక్తంగానే పిలువబడుతూ, క్రైస్తమత సామ్రాజ్యము యెహోవా నుండి సూచనార్థకమైన, తెగుళ్లతోకూడిన వర్తమానములను అందుకుంటుంది. మానవజాతిలోని ఆ మూడవభాగం ఏ విధమైన దైవానుగ్రహానికి అర్హమైంది కాదు!

15. (ఎ) బూరల్లో ప్రతీది ఒక ప్రత్యేక సంవత్సరానికి పరిమితమై ఉందా? వివరించండి. (బి) యెహోవా తీర్పులను ప్రకటించడానికి యోహాను తరగతితోపాటు ఎవరి స్వరంకూడ కలుపబడింది?

15 వరుసగా బూరలు ఊదబడతాయనే దానికనుగుణంగా, 1922 నుండి 1928వరకు జరిగిన యేడు సమావేశాలలో ప్రత్యేక తీర్మానాలు చేయబడ్డాయి. అయితే బూరలు ఊదడం ఆ సంవత్సరాలకే పరిమితమై యుండలేదు. ప్రభువు దినము కొనసాగేకొలది, క్రైస్తవమత సామ్రాజ్యపు దుష్టమార్గాలను గట్టిగా బహిర్గతం చేయడం కొనసాగుతూనేవుంది. అంతర్జాతీయ విద్వేషాలు, హింసలున్ననూ, అన్ని జనాంగములకు యెహోవా తీర్పులు ప్రపంచమంతా ప్రకటింపబడాలి. అప్పుడు మాత్రమే సాతాను విధానానికి అంతమొస్తుంది. (మార్కు 13:10, 13) సంతోషకర మైనదేమంటే, ప్రపంచ ప్రాముఖ్యతగల ఆ ఉరుమువంటి ప్రకటనలు చేయడంలో గొప్పసమూహం యిప్పుడు యోహాను తరగతితో తన స్వరాన్ని కలిపింది.

భూమిలో మూడవ భాగం కాలిపోయింది

16. మొదటి దూత తన బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది?

16 దూతలను గూర్చిచెబుతూ యోహాను యిలా వ్రాస్తున్నాడు: “మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.” (ప్రకటన 8:7) ఇది ఐగుప్తుమీదికి వచ్చిన యేడవ తెగులు వంటిదే, గానీ మన 20వ శతాబ్దానికి దాని భావమేమిటి?—నిర్గమకాండము 9:24.

17. (ఎ) ప్రకటన 8:7 నందలి “భూమి” అనేపదం దేన్ని సూచిస్తుంది? (బి) క్రైస్తవమత సామ్రాజ్యపు భూమి మూడవభాగమెలా కాలిపోతుంది?

17 బైబిలునందు “భూమి” అని వాడబడిన మాట తరచూ మానవజాతిని సూచిస్తుంది. (ఆదికాండము 11:1; కీర్తన 96:1) రెండవ తెగులు సముద్రం మీద అంటే మానవజాతికి కూడా సంబంధించిన దానిమీదనే కుమ్మరించ బడుతుంది గనుక, “భూమి” అనగా సాతానుచే నిర్మించబడి నాశనంకానైయున్న స్థిరమైందిగా కన్పించే మానవ సమాజాన్ని సూచించాలి. (2 పేతురు 3:7; ప్రకటన 21:1) లోకమందున్న క్రైస్తవమత సామ్రాజ్యమైన యీ మూడవభాగం యెహోవా అనంగీకారమనే తీక్షణమైన వేడిమికి గురౌతుందని తెగులు అనే దృశ్యం తెలుపుతుంది. దాని ప్రముఖులు—అందులో వృక్షాలవలె నిల్చున్నవారు—యెహోవా ప్రతికూల తీర్పు ప్రకటనవల్ల కాలిపోతున్నారు. దాని కోట్లాదిమంది చర్చిసభ్యులు, క్రైస్తవమత సామ్రాజ్యపు మతానికి మద్దతునిస్తూనే ఉంటే, గడ్డివలె మలమల మాడిపోతారు, దేవుని దృష్టిలో ఆత్మీయంగా ఎండిపోతారు.—కీర్తన 37:1, 2. పోల్చండి. *

18. యెహోవాతీర్పు సమాచారమెలా 1922 సీడార్‌ పాయింట్‌ సమావేశములో ప్రకటించబడింది?

18 ఈ తీర్పు సమాచారమెలా అందించబడింది? సాధారణంగా, లోకంలో భాగమై, తరచూ దేవుని “దాసుని” నిందించే యీ లోకంలోని వార్తాసంస్థలద్వారా కాదు. (మత్తయి 24:45) సెప్టెంబరు 10, 1922 లో ఓహయో నందలి, సీడార్‌ పాయింట్‌లో జరిగిన, దేవుని ప్రజల రెండవ చారిత్రాత్మకమైన సమావేశంలో ఓ ప్రత్యేక పద్ధతిలో అది ప్రకటించబడింది. వీరు ఏకగ్రీవంగాను, ఉత్సాహకరంగాను “ఎ ఛాలెంజ్‌ టు వరల్డ్‌ లీడర్స్‌” అనే తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానం కఠిన పదజాలంతోనే, ఆధునిక సాదృశ్యమైన భూమిని ఏకరువు పెడుతూ యిలా అన్నది: “తాము భూమికి శాంతి సౌభాగ్యాన్ని నెలకొల్పగలరేమో, ప్రజలకు సంతోషాన్ని తేగలరేమోనని వారికున్న స్థానాన్నిబట్టి రుజువు చేయండని భూలోక జనములను, దాని పరిపాలకులను, నాయకులను, భూమ్మీదనున్న చర్చిశాఖల మతగురువులను, వారి అనుచరులను మిత్రులను, ప్రసిద్ధిచెందిన వాణిజ్యవేత్తలను ప్రఖ్యాతిగాంచిన రాజకీయ నాయకులను కోరుతున్నాం; మరి వారు యిందులో విఫలులైతే, ప్రభువుకు సాక్షులముగా మేమందిస్తున్న సాక్ష్యానికి చెవియొగ్గాలని వారిని కోరుతున్నాం, అటు పిమ్మట మా సాక్ష్యం సత్యమో అసత్యమో చెప్పమని కోరుతున్నాము.”

19. దేవుని ప్రజలు క్రైస్తవమత సామ్రాజ్యానికి దేవుని రాజ్యాన్ని గూర్చి ఏం సాక్ష్యమిచ్చారు?

19 ఈ క్రైస్తవులు ఏ సాక్ష్యాన్ని అందించారు? ఇదే: “మెస్సీయ రాజ్యమే మానవజాతి సమస్త సమస్యలకు పరిష్కారమార్గము, అది భూమికి శాంతిని, సమస్తజనులు కోరే సౌశీల్యతను తెస్తుంది; ఇప్పుడారంభమైన ఆయన నీతియుక్తమైన పాలనకు తమ్మునుతాము ఇష్టపూర్వకంగా లోబరచుకునే వారు శాశ్వతశాంతిని, జీవితాన్ని, విడుదలను మరియు అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారని మేము విశ్వసిస్తున్నాము, ప్రకటిస్తున్నాము.” ఈ దుష్టకాలంలో, మానవుడేర్పరచుకున్న ప్రభుత్వాలు, ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్య పరిధిలోనున్న ప్రభుత్వాలు, ప్రపంచ సమస్యలను పరిష్కరించలేక పోతున్నప్పుడు, ఆ బూరలశబ్దం 1922 కన్నా యింకెక్కువ శక్తితో మ్రోగుతుంది. జయశాలి క్రీస్తు పాలించే దేవుని రాజ్యమే మానవజాతి ఏకైక నిరీక్షణయని అనడమెంత సత్యమోగదా!

20. (ఎ) అభిషక్త క్రైస్తవసంఘం 1922 లోను అటు తర్వాతను తీర్పు సమాచారములను వేటిద్వారా ప్రకటించారు? (బి) మొదటి బూర ఊదినప్పుడు క్రైస్తవమత సామ్రాజ్యంలో ఏం సంభవించింది?

20 అభిషక్త క్రైస్తవుల సంఘంద్వారా, తీర్మానాలు, కరపత్రాలు, చిన్నపుస్తకాలు, పుస్తకాలు, పత్రికలు, మరియు ప్రసంగాల మూలంగా అప్పుడును ఆ తర్వాతను చేసిన ప్రకటనలద్వారా బూరలు ఊదబడినవి. మొదటి బూర ఫలితంగా, ఘనీభవించిన నీటి వడగండ్ల తాకిడి తగిలినట్లే, క్రైస్తవమత సామ్రాజ్యం దెబ్బలు తిన్నది. ఈ 20శతాబ్దపు యుద్ధాలమూలంగా మూటగట్టుకున్న దాని రక్తాపరాధం, బట్టబయలు చేయబడింది, అది యెహోవా ఉగ్రతయొక్క తీక్షణమైన తీర్పుకు అర్హమైందని చూపించబడింది. యోహాను తరగతి, తర్వాత గొప్పసమూహము మద్దతుతో, క్రైస్తవమత సామ్రాజ్యం నాశనపాత్రమైందనే యెహోవా ఉద్దేశం వైపు అవధానాన్ని మళ్లిస్తూ మొదటి బూరను ప్రతిధ్వనింపజేస్తూనే ఉంది.—ప్రకటన 7:9, 15.

అగ్నిచేత మండుచున్న పెద్దకొండ వంటిది

21. రెండవ దూత తనబూరను ఊదినప్పుడు ఏం జరుగుతుంది?

21రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశనమాయెను.” (ప్రకటన 8:8, 9) ఈ భయంకరమైన దృశ్యం దేన్ని సూచిస్తుంది?

22, 23. (ఎ) రెండవ బూర ఊదిన ఫలితంగా ఏ తీర్మానం నిశ్చయంగా చేయబడింది? (బి) “సముద్రములో మూడవభాగము” దేన్ని సూచిస్తుంది?

22 అమెరికాలోని కాలిఫోర్నియానందలి లాస్‌ఏంజిల్స్‌లో 1923, ఆగష్టు 18-26 వరకు జరిగిన యెహోవాప్రజల సమావేశం ఆధారంగా మనం దీన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. వాచ్‌టవర్‌ సొసైటి అధ్యక్షుడు శనివారం మధ్యాహ్నము “గొఱ్ఱెలు, మేకలు” అనే అంశంపై ప్రసంగించారు. “గొఱ్ఱెలు” అంటే దేవుని భూలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనే యథార్థవంతులని స్పష్టంగా గుర్తించబడ్డారు. ఆ పిదప తీసుకున్న తీర్మానము, “మతభ్రష్టులైన మతగురువులు, ‘వారి మందలోని ప్రముఖులు’ అంటే మంచి ఆర్థిక, రాజకీయబలంగల ప్రాపంచిక వ్యక్తుల వేషధారణను” బయల్పరచింది. “ప్రభువు ‘బబులోను’ అని పిలిచిన అవినీతికరమగు క్రైస్తవపౌరోహిత (పాదిరి) పద్ధతులను విడిచి “దేవుని రాజ్యాశీర్వాదాలను అందుకోవడానికి” సిద్ధపడాలని . . . చర్చిశాఖలనుండి సమాధానాన్ని క్రమశిక్షణను ప్రేమించే లక్షలాదిమందిని” పిలిచింది.

23 నిశ్చయంగా, రెండవ బూర ఊదినప్పుడే ఈ తీర్మానం చేయబడింది. సకాలంలో ఆ వర్తమానానికి స్పందించినవారు యెషయా యీ మాటల్లో వర్ణించిన మేకలాంటి గుంపునుండి వేరౌతారు: “భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటి వారు. అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును.” (యెషయా 57:20; 17:12, 13) ఆ విధంగా, “సముద్రము” అంటే అలజడిని, తిరుగుబాటును ప్రేరేపించే నిమ్మళింపని, స్థిరత్వంలేని తిరుగుబాటు మానవజాతిని సూచిస్తుంది. (ప్రకటన 13:1 పోల్చండి.) ఆ “సముద్రము” యిక ఉండని కాలమొస్తుంది. (ప్రకటన 21:1) ఈలోగా, రెండవబూర ఊదడం ద్వారా, యెహోవా అందులోని మూడవ భాగముపై—క్రైస్తవమత సామ్రాజ్యంలోని అల్లరి జనాంగంపై తీర్పుతీర్చుతాడు.

24. సముద్రంలో పడవేయబడిన మండుచున్న కొండ దేనికి సూచనయైయున్నది?

24 అగ్నితో మండుచున్న కొండవంటిదొకటి యీ “సముద్రము”లో పడవేయబడింది. బైబిల్లో పర్వతములు తరచూ ప్రభుత్వాలను సూచిస్తాయి. ఉదాహరణకు, దేవుని రాజ్యం పర్వతంగా చిత్రీకరించబడింది. (దానియేలు 2:35, 44) శిథిలమైన బబులోను “చిచ్చుపెట్టినకొండ” అయింది. (యిర్మీయా 51:25) అయితే, యోహాను చూస్తున్న కొండ యింకా మండుతూనే ఉంది. అది సముద్రముపై పడవేయబడిందంటే, అది మొదటి రెండు ప్రపంచయుద్ధాల్లో ప్రభుత్వం అనేది మానవుల్లో, ముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యంలో ఎలా ఒక వివాదాంశమైందో కచ్చితంగా సూచిస్తుంది. ఇటలీలో ముస్సోలిని ఫాసిజాన్ని ప్రవేశపెట్టాడు. జర్మనీ, హిట్లర్‌ నాసిజమును చేపట్టింది, మరితర దేశాలు వివిధరకాల సోషలిజాన్ని ప్రయత్నించాయి. రష్యాలో త్వరితగతిని మార్పుజరిగి బోల్షివిక్‌ విప్లవం మూలంగా మొట్టమొదటి కమ్యూనిష్టు దేశం తయారయింది, తత్ఫలితంగా ఒకనాడు క్రైస్తవమత సామ్రాజ్యపు మతగురువులు పట్టుకొమ్మలుగానున్న తమ అధికార ప్రభావాలను పోగొట్టుకున్నారు.

25. ప్రభుత్వం అనేది రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఎలా తీక్షణమైన వివాదాంశంగా తయారైంది?

25 ఫాసిస్ట్‌, నాజీ పాలనలు రెండోప్రపంచ యుద్ధంతో తుడుచుకుపోయాయి, గానీ ప్రభుత్వం అనేది తీవ్ర వివాదాంశంగానే ఉండిపోయింది, మరియు మానవ సముద్రం చెలరేగుతూ, క్రొత్తక్రొత్త విప్లవాత్మక ప్రభుత్వాలను రేపింది. చైనా, వియత్నాం, క్యూబా, మరియు నికారాగ్వా లాంటి అనేక దేశాల్లో 1945 నుండి ఆరంభమైన దశాబ్దాల్లో ఇటువంటి ప్రభుత్వాలు స్థాపించబడ్డాయి. గ్రీసులో మిలిటరీ పరిపాలన ప్రారంభించాలనే పథకం విఫలమైంది. కంపూచియాలో (కంబోడియా) ఫండమెంటల్‌ కమ్యూనిజాన్ని ప్రయత్నించడంవల్ల అది ఇరవైలక్షలకంటె ఎక్కువ మరణాలకు దారితీసింది.

26. “మండుచున్న పెద్దకొండ” మానవ సముద్రంమీద యింకనూ ఎలా జ్వాలను విసురుతునే వుంది?

26 ఆ “అగ్నితో మండుతున్న కొండ” మానవజాతి అనే సముద్రంమీదికి జ్వాలలను పంపుతూనే వుంది. ప్రభుత్వ పోరాటాలను గూర్చి అమెరికా, ఆసియా, మరియు పసిఫిక్‌ ద్వీపాలనుండి వార్తలొస్తున్నాయి. ఈ పోరాటాలలో అనేకం, క్రైస్తవమత సామ్రాజ్యంయొక్క మిషనరీలు చురుకైన మద్దతుదారులుగా ఉన్నచోట లేక క్రైస్తవమత సామ్రాజ్య ప్రభుత్వాలున్నచోట జరుగుతున్నాయి. రోమన్‌ కాథోలిక్‌ మతగురువులు కమ్యూనిష్టు గెరిల్లా ముఠాలలో సభ్యులుగా కలిసి, పోరాటంలో సహితం పాల్గొన్నారు. అదే సమయంలో, ప్రొటస్టెంట్‌ సువార్తికుల గుంపులు, సెంట్రల్‌ అమెరికాలో, “అధికార దాహం కొరకు చేస్తున్న దుష్ట, నిరంతర పోరాటం” అని తాము కమ్యూనిస్టులను పిలిచే ఉద్యమాన్ని ఎదుర్కొనడానికి పోరాడారు. అయితే మానవజాతి అనే సముద్రంలోని యిటువంటి అలజడులలో ఏదియు శాంతిభద్రతలను తేలేదు.—యెషయా 25:10-12; 1 థెస్సలొనీకయులు 5:3 పోల్చండి.

27. (ఎ) “సముద్రములో మూడవ భాగము” ఎలా రక్తంగా మారింది? (బి) ‘సముద్రంలోని ప్రాణులలో మూడవభాగం’ ఎలా చచ్చాయి, మరి “ఓడలలో మూడవ భాగము” ఎలా నాశనమౌతాయి?

27 దేవునిరాజ్యానికి లోబడేబదులు విప్లవాత్మక పోరాటాలలో తలదూర్చిన మానవులు రక్తాపరాధులేనని రెండవబూర ధ్వని తెల్పుతుంది. విశేషంగా క్రైస్తవమత సామ్రాజ్యపు “సముద్రములో మూడవభాగము” రక్తంవలె అయింది. అందులోని జీవముగల ప్రాణులన్నీ దేవుని దృష్టిలో మృతులే. సముద్రంలోని ఆ మూడవ భాగంలో పడవలా నీళ్లపై తేలియాడే యీ విప్లవసంస్థలలో ఏదియు చివరకు ఓడ బద్దలవడాన్ని తప్పించుకోలేదు. సంకుచిత దృష్టిగల జాతీయతలోను ఆ సముద్రపు రక్తాపరాధంలోను యింకనూ ఈదులాడుతున్న వారినుండి వేరైయుండాలన్న బూరవంటి పిలుపును యిప్పుడు లక్షలాదిమంది గొఱ్ఱెవంటి ప్రజలు లక్ష్యపెట్టడం మనకెంతటి సంతోషాన్ని కల్గిస్తుందోగదా!

ఒక నక్షత్రము ఆకాశంనుండి రాలుట

28. మూడవ దూత తన బూర ఊదినప్పుడు ఏమౌతుంది?

28“మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగముమీదను నీటిబుగ్గలమీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రియాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.” (ప్రకటన 8:10, 11) ఈ లేఖనం ప్రభువు దినంలో ఎలా అన్వయించ బడుతుందో మనం తెలుసుకోవడానికి బైబిల్లోని యితర భాగాలు మరోసారి సహాయం చేస్తాయి.

29. “దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము” అనే దాని సూచనను ఏది నెరవేరుస్తుంది, ఎందుకు?

29 యేసు ఏడు సంఘాలకిచ్చిన వర్తమానములలో నక్షత్రాన్ని గూర్చిన సూచనార్థక భావాన్ని మనమిదివరకే గమనించాము, అందులో ఆ ఏడు నక్షత్రాలు పెద్దలను సూచిస్తున్నాయి. * (ప్రకటన 1:20) అభిషక్తులైన “నక్షత్రాలు,” మిగిలిన అభిషక్తులందరితోపాటు, వారి పరలోక స్వాస్థ్యమునకు గుర్తుగా పరిశుద్ధాత్మచే ముద్రింప బడినప్పటినుండి ఆత్మీయార్థంలో పరలోక స్థలాలను స్వతంత్రించుకుంటారు. (ఎఫెసీయులు 2:6, 7) అయిననూ, అటువంటి నక్షత్రాల్లాంటి వారిలోనుండే మందను తప్పుదారికి మళ్లించే మతభ్రష్టులు, విమతస్థులు బయల్దేరుతారని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (అపొస్తలుల కార్యములు 20:29, 30) అట్టి అవిశ్వాస్యత మూలంగా గొప్ప మతభ్రష్టత సంభవిస్తుంది, యీ పడిపోయిన పెద్దలంతా కలిసికట్టుగా ధర్మవిరోధి అవుతారు, అతడు మానవజాతిలో తననుతాను దేవునిగా చేసుకుంటాడు. (2 థెస్సలొనీకయులు 2:3, 4) క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు ప్రపంచ రంగంమీద దర్శనమిచ్చినప్పుడు పౌలు హెచ్చరికలు నేరవేరాయి. ఈ గుంపు “దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము” అనే గుర్తుతో సరిగ్గానే సూచించబడింది.

30. (ఎ) బబులోను రాజు ఆకాశమునుండి పడిపోయాడు అంటే అర్థమేమిటి? (బి) ఆకాశంనుండి పడిపోవడం దేన్ని సూచించగలదు?

30 యోహాను ప్రత్యేకంగా యీ నక్షత్రం పరలోకం నుండి పడిపోవడం చూస్తున్నాడు. ఎలా? దీన్ని అర్థంచేసుకోవడానికి ఒక ప్రాచీన రాజు అనుభవాలు మనకు సహాయం చేస్తాయి. బబులోను రాజుతో మాట్లాడుతూ యెషయా యిలా అన్నాడు: “తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?” (యెషయా 14:12) కోరెషురాజు సైన్యం చేతిలో బబులోను కూలిపోయినప్పుడు, దాని రాజు ఆకస్మికంగా ప్రపంచాధిపత్యంనుండి అవమానకరమైన ఓటమి పాలైనప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. అలా, ఆకాశంనుండి పడిపోవడమనేది ఉన్నతస్థానంనుండి పడిపోవడాన్ని, అవమానం పాలుకావడాన్ని సూచించగలదు.

31. (ఎ) క్రైస్తవమతగురువులు ఎప్పుడు “ఆకాశము” లాంటి స్థానం నుండి పడ్డారు? (బి) మతగురువులిచ్చిన నీళ్లు ఎలా “మాచిపత్రి”గా మారాయి, తత్ఫలితంగా అనేకులకేమైంది?

31 క్రైస్తవమత సామ్రాజ్యపు మతగురువులు నిజమైన క్రైస్తవత్వంనుండి పడిపోయినప్పుడు, వారు పౌలు ఎఫెసీయులు 2:6, 7 నందు వివరించిన ఎత్తైన “ఆకాశము” లాంటి స్థానం నుండి పడ్డారు. సత్యమనే తాజానీళ్లు యిచ్చేబదులు, వారు “మాచిపత్రి”ని, అంటే నరకాగ్ని, పాపవిమోచనలోకం, త్రిత్వం, కర్మసిద్ధాంతం వంటి పచ్చి అబద్ధాలను పంచారు; మరియు జనములను దేవుని నీతిసేవకులుగా తయారుచేసే బదులు వారిని యుద్ధానికి నడిపించారు. తత్ఫలితమేమిటి? అబద్ధాలను నమ్మినవారు ఆత్మీయ విషాన్ని తీసుకున్నారు. వీరి పరిస్థితి యిర్మీయా కాలంలో యెహోవా యిలా తెల్పిన ద్రోహులైన ఇశ్రాయేలీయుల వలెనేవుంది: “యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను.”—యిర్మీయా 9:15; 23:15.

32. క్రైస్తవమత సామ్రాజ్యం ఆత్మీయాకాశంనుండి రాలిన సంగతి ఎప్పుడు స్పష్టమైంది, అదెలా ప్రదర్శించబడింది?

32 ఇలా ఆత్మీయాకాశం నుండి రాలిపోవడమనేది 1919నుండి స్పష్టంగా కనబడుతోంది, అప్పుడు రాజ్యసంబంధమైన కార్యములమీద క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులుగాక, అభిషక్త క్రైస్తవులలో శేషించిన ఒక చిన్నగుంపు నియమించబడింది. (మత్తయి 24:45-47) ఈ క్రైస్తవగుంపు క్రైస్తవమతసామ్రాజ్య మతగురువుల వైఫల్యాలను నిర్మొహమాటంగా బహిర్గతం చేయడానికి పునఃప్రారంభించినపుడు అలా రాలిపోయిన విషయం 1922నుండి ప్రదర్శింపబడింది.

33. అమెరికాలోని ఓహాయోనందలి కొలంబస్‌నందు 1924 లో జరిగిన సమావేశమందు క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులను ఏవిధంగా ఏకరువుపెట్టారు?

33 ఈ సందర్భంలో ఒక విశేషత ఏమంటే, “ఇటీవలి కాలాల్లో జరిగిన బైబిలు విద్యార్థుల బ్రహ్మాండమైన సమావేశము” అని ది గోల్డన్‌ ఏజ్‌ పత్రిక వర్ణించిన సమావేశంలో చేయబడిన ప్రకటనే. ఈ సమావేశం 1924, జూలై 20-27 వరకు ఓహయోలోని కొలంబస్‌నందు జరిగింది. నిస్సందేహంగా ఆ మూడవ బూర ఊదిన దూత నడిపింపు క్రింద అక్కడ ఒక శక్తివంతమైన తీర్మానం చేయబడింది, తర్వాత ఓ కరపత్రరూపంలో 5 కోట్ల కాపీలు అందించబడ్డాయి. ఎక్లీజియాస్టిక్స్‌ ఇన్‌డిక్టెడ్‌ అనే పేరుతో అది ప్రచురింపబడింది. అందులోని ఉపశీర్షికలో, “వాగ్దాన సంతానమునకు సర్ప సంతానమునకు పోటీ.” అనే అంశం ప్రస్తావించబడింది. ఆ కరపత్రం, క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులను ఏకరువు పెట్టింది, అంటే వారు మతపరమైన గొప్ప బిరుదులు తీసుకోవడం, వాణిజ్యలాభార్జన, వారిమందలోనే వారు ప్రముఖ వృత్తిపరమైన రాజకీయ నాయకులు కావడం, మనుష్యులయెదుట గొప్పవారిగా వెలుగొందడానికి కోరుకోవడం, మెస్సీయ రాజ్యసమాచారాన్ని ప్రజలకు ప్రకటించకుండ తిరస్కరించడం మొదలైన వాటినిగూర్చి బహిర్గతంచేసింది. సమర్పించుకున్న ప్రతిక్రైస్తవుడు “మన దేవుని ప్రతీకార దినమును ప్రకటించడానికి; దుఃఖించు వారందరిని ఓదార్చడానికి” దేవునిచే ఆజ్ఞాపించబడి యున్నాడని అది నొక్కితెల్పింది.—యెషయా 61:2, కేజె.

34, 35. (ఎ) మూడవదూత తన బూరను ఊదడానికి ప్రారంభించి నప్పటినుండి మతగురువుల అధికారానికి, ప్రాబల్యానికి ఏమైంది? (బి) క్రైస్తవమత సామ్రాజ్య మతగురువుల భవితవ్యమేమిటి?

34 మూడవదూత బూర ఊదడానికి ఆరంభించగా, మానవ జాతిలో మతగురువుల ప్రాబల్యం క్షీణిస్తూవస్తుంది, వారిలో ఏ కొద్దిమందో గత శతాబ్దాలలో వారనుభవించిన దేవునిలాంటి అధికారాలను యినాడు, యీ శతాబ్దంలో అనుభవిస్తున్నారు. యెహోవాసాక్షుల ప్రచారం మూలంగా, అనేకమంది ప్రజలు, మతగురువులు బోధించే అనేక సిద్ధాంతాలు ఆత్మీయ విషంతోకూడినవని—“మాచిపత్రి”యని గ్రహించారు. ఇంకనూ, ఉత్తర ఐరోపాలో మతగురువుల ప్రాబల్యం దాదాపు హరించుకు పోయింది, కొన్ని యితర దేశాల్లో ప్రభుత్వం వారి ప్రభావాన్ని ఖండితంగా తగ్గించింది. కాథోలిక్కులున్న ఐరోపా, అమెరికా దేశాల్లో ఆర్థిక, రాజకీయ, నైతికరంగాల్లో మతగురువుల ప్రవర్తన వారి ప్రతిష్టను దెబ్బతీసింది. ఇప్పటినుండి వారిపరిస్థితి మరీ అధ్వానమౌతుంది, ఎందుకంటే, త్వరలో యితర అబద్ధమతస్థులు అనుభవించ బోయేదే వీరును అనుభవిస్తారు.—ప్రకటన 18:21; 19:2.

35 క్రైస్తవమత సామ్రాజ్యాన్ని యెహోవా తెగులుతో బాధించేది యింకను పూర్తికాలేదు. నాల్గవ బూర ఊదినప్పుడేమి సంభవిస్తుందో పరిశీలించండి.

చీకటి!

36. నాలుగవ దూత తన బూర ఊదినప్పుడు ఏం సంభవిస్తుంది?

36“నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.” (ప్రకటన 8:12) ఐగుప్తు మీదికి వచ్చిన తొమ్మిదవ తెగులు అక్షరార్థమైందే. (నిర్గమకాండము 10:21-29) అయితే మన యీ 20వ శతాబ్దంలో మానవులను బాధించడానికి వచ్చే యీ సాదృశ్యమైన చీకటి ఏమిటి?

37. అపొస్తలులైన పేతురు, పౌలు క్రైస్తవసంఘానికి వెలుపలనున్న వారి ఆత్మీయస్థితిని ఎలా వర్ణించారు?

37 తాము క్రైస్తవులు కాకమునుపు, ఆత్మీయ దృష్టిలో వారు చీకటిలో ఉన్నారని అపొస్తలుడైన పేతురు తోటి విశ్వాసులతో అన్నాడు. (1 పేతురు 2:9) పౌలుకూడ క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్నవారి ఆత్మీయ పరిస్థితినిగూర్చి మాట్లాడుతూ “చీకటి” అనే మాటనుపయోగించాడు. (ఎఫెసీయులు 5:8; 6:12; కొలొస్సయులు 1:13; 1 థెస్సలొనీకయులు 5:4, 5) అయితే తాము దేవున్ని నమ్ముతున్నామంటూ, యేసును తమ స్వరక్షకునిగా ఒప్పకుంటున్నామని చెప్పుకునే క్రైస్తవమత సామ్రాజ్యంలోని వారి సంగతేమిటి?

38. నాలుగవ దూత క్రైస్తవమత సామ్రాజ్యపు “వెలుగు”ను గూర్చి ఏ వాస్తవాన్ని తెల్పుతుంది?

38 నిజమైన క్రైస్తవులను వారి ఫలములనుబట్టి గుర్తించవచ్చునని, తన అనుచరులని చెప్పుకొను అనేకులు “అక్రమము చేయువారని” యేసు చెప్పాడు. (మత్తయి 7:15-23) ప్రపంచాన్ని ఆక్రమించుకున్న క్రైస్తవమత సామ్రాజ్యపు మూడవభాగం యొక్క ఫలాలను చూస్తున్న ఏ ఒక్కరుకూడ అది ఆత్మీయ గాఢాంధకారంలో తడవులాడుతుందనే విషయాన్ని కాదనలేరు. (2 కొరింథీయులు 4:4) అది నిందాయోగ్యురాలు, ఎందుకంటే అది క్రైస్తవురాలినని చెప్పుకుంటుంది. గనుక, ఆ నాలుగవ దూత, క్రైస్తవమత సామ్రాజ్యపు “వెలుగు” వాస్తవానికి చీకటేనని, దాని “వెలుగు”నకు ఆధారం, బబులోను—క్రైస్తవేతర మతాలేనని బూర ఊది చెప్పడం సబబే.—మార్కు 13:22, 23; 2 తిమోతి 4:3, 4.

39. (ఎ) క్రైస్తవమతసామ్రాజ్యపు బూటకపు వెలుగును 1925 లో జరిగిన సమావేశంలో తీసుకున్న తీర్మానం ఎలా వర్ణించింది? (బి) ఇంకా 1955 లో ఏం బహిర్గతం చేయబడింది?

39 ఆ పరలోక ప్రకటనను అనుసరించి, 1925, ఆగష్టు 29న అమెరికాలోని ఇండియానా నందలి ఇండియానాపొలిస్‌లో దేవుని ప్రజలు తండోపతండాలుగా సమావేశానికి హాజరయ్యారు, మరియు వారు “నిరీక్షణా సమాచారం” అనే పేరుగల తీర్మానాన్ని చేసి ప్రచురణగా ఆమోదించారు. మరల, అనేకభాషల్లో 5 కోట్ల కాపీలు పంచిపెట్టబడ్డాయి. వాణిజ్యవేత్తలు, రాజకీయనాయకులు, మత గురువులు అంతాకలిసి చూపే బూటకపు వెలుగును యిది వర్ణించింది, దానిఫలితంగానే “ప్రజలు చీకటిలో పడిపోయారు.” మరియు అది “శాంతి, సమృద్ధి, ఆరోగ్యం, జీవం, స్వేచ్ఛ మరి నిత్యసంతోషం” పొందడానికి నిజమైన నిరీక్షణ దేవుని రాజ్యమేనని చూపింది. ఆ చిన్న అభిషక్త క్రైస్తవులు అటువంటి వర్తమానాలను క్రైస్తవమత సామ్రాజ్యమను పెద్దసంస్థకు వ్యతిరేకంగా ప్రకటించాలంటే వారికి ధైర్యం అవసరమైంది. అయితే 1920వ దశాబ్దపు ప్రారంభంనుండి యీనాటివరకు ఏకరీతిగా వారలా ప్రకటిస్తూనేవున్నారు. ఇటీవలికాలంలో, 1955 లో క్రైస్తవమత సామ్రాజ్యమా లేక క్రైస్తవత్వమా ఏది “లోకమునకు వెలుగైయున్నది”? అనే చిన్నపుస్తకం ప్రపంచమంతా అనేకభాషల్లో పంచిపెట్టబడి, మతగురువుల గుట్టురట్టుచేసింది. ప్రపంచంలో అనేకులు స్వయంగా చూడగలిగే రీతిలో ఈనాడు క్రైస్తవమత సామ్రాజ్యపు వేషధారణ ఎంతో స్పష్టంగా కనబడుతుంది. అయితే యెహోవా ప్రజలు మాత్రం దాని అసలు రంగును: అది అంధకార సామ్రాజ్యమనే విషయాన్ని బయటపెట్టడం మానుకోవడంలేదు.

ఎగురుతున్న పక్షిరాజు

40. నాలుగు బూరలు క్రైస్తవమత సామ్రాజ్యం ఏమైవుందని చూపిస్తున్నాయి?

40 ఈ మొదటి నాలుగు బూరలు నిజంగా క్రైస్తవమత సామ్రాజ్యపు నాశనకరమైన, మరణకరమగు పరిస్థితిని బయల్పర్చాయి. దాని “భూ” భాగం యెహోవా తీర్పుకు అర్హమైందని బయల్పర్చబడింది. దానిలోను యితరచోట్లను బయలుదేరే విప్లవాత్మక ప్రభుత్వాలు ఆత్మీయజీవానికి శత్రువులని చూపించబడ్డాయి. దాని మతగురువుల పరిస్థితి బట్టబయలు చేయబడింది, మరి దాని ఆత్మీయపరిస్థితి యొక్క సాధారణ అంధకారాన్ని అందరూ చూసేలాగున అది బయటపెట్టబడింది. క్రైస్తవమత సామ్రాజ్యం సాతాను పరిపాలనా విధానంలో అత్యంత నిందాభరితమైన భాగమైవుంది.

41. బూరలు ఊదడానికి స్వల్పవ్యవధి యివ్వబడినప్పుడు యోహాను ఏమి చూస్తున్నాడు, ఏమి వింటున్నాడు?

41 బయల్పరచడానికి యింకేమైనా మిగిలివుందా? ఈ ప్రశ్నకు సమాధానం మనం తీసుకునేముందు బూరలు ఊదడంలో స్వల్ప వ్యవధిని గమనిద్దాము. తర్వాత తానేమిచూస్తున్నాడో యోహాను వర్ణిస్తున్నాడు: “మరియు నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు—బూరలు ఊదబోవుచున్న ముగ్గురుదూతల బూరల శబ్దములనుబట్టి భూనివాసులకు అయ్యో, (శ్రమ) అయ్యో, (శ్రమ) అయ్యో, (శ్రమ) అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.”—ప్రకటన 8:13, NW. 

42. ఎగురుచున్న పక్షిరాజు దేనిని సూచించవచ్చు, దాని వర్తమానమేమిటి?

42 విశాలంగానున్న ప్రదేశంలోని ప్రజలు చూడగల్గేలాగున పక్షిరాజు ఆకాశమధ్యన ఎగురుతోంది. దానికి విశేష దృష్టివుంది మరి అది సుదూరంగా చూడగలదు. (యోబు 39:29) యెహోవా సింహాసనము చుట్టున్న నాలుగు కెరూబులనబడే జీవులలో ఒకటి పక్షిరాజును పోలియున్నది. (ప్రకటన 4:6, 7) అది యీ కెరూబే కానివ్వండి లేక దీర్ఘదృష్టిగల దేవుని మరోదాసుడే కానివ్వండి, అది బలమైన వర్తమానాన్ని బిగ్గరగా యిలా ప్రకటిస్తుంది: “అయ్యో (శ్రమ), అయ్యో (శ్రమ), అయ్యో (శ్రమ) (NW).” మిగిలిన బూరలు ఊదినప్పుడు, ప్రతిదీ యీ శ్రమలలో ఒకదానితో సంబంధం కల్గివున్నందున భూనివాసులారా వీటిని గమనించండి.

[అధస్సూచీలు]

^ పేరా 17 బదులుగా, గొప్పసమూహము యెహోవా అనంగీకారమనే అగ్నిని అనుభవించరని ప్రకటన 7:16 చూపిస్తుంది.

^ పేరా 29 యేసు కుడిచేతిలోని ఏడు నక్షత్రాలు క్రైస్తవసంఘంలోని అభిషక్త అధ్యక్షులను సూచిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 73,000 కంటె ఎక్కువ సంఘాలలోని పెద్దలలో ఎక్కువమంది గొప్పసమూహములోని వారే. (ప్రకటన 1:16; 7:9) వారి స్థానమేమిటి? వారు అభిషక్తులైన నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని తరగతినుండి వారి నియామకములను పొందుతున్నందున, వీరు యేసు కుడిచేయి అధీనంలో ఉన్నారని చెప్పవచ్చు, ఎందుకంటే, వారుకూడా ఆయన ఉపకాపరులే. (యెషయా 61:5, 6; అపొస్తలుల కార్యములు 20:28) అర్హతగల, అభిషక్త సహోదరులు లేనిచోట సేవచేయడంద్వారా వారు “ఏడు” నక్షత్రాలకు మద్దతునిస్తారు.

[అధ్యయన ప్రశ్నలు]

[139వ పేజీలోని చిత్రం]

క్రైస్తవమత సామ్రాజ్యపు నీళ్లు చేదని బయల్పర్చబడ్డాయి

క్రైస్తవమత సామ్రాజ్యపు నమ్మకాలు, బైబిలు నిజంగా ఏమి చెబుతుంది

అభిప్రాయాలు

దేవుని స్వంత నామము దేవుని నామము పరిశుద్ధపరచ బడాలని

ప్రాముఖ్యం కాదు: “ఒకే ఒక, ఏకైక యేసు ప్రార్థించాడు. పేతురు ఇట్లన్నాడు:

దేవుని స్వంత నామమును ఉపయోగించడం “ప్రభువు (యెహోవా, NW.)

. . . క్రైస్తవ చర్చి ప్రపంచవ్యాప్త నామమును బట్టి ప్రార్థనచేయువాడెవడో

విశ్వాసానికి పూర్తిగా అయుక్తం.” వాడే రక్షింపబడును.” (అపొస్తలు

(రివైజ్‌డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ తొలిపలుకులు) కార్యములు 2:21; యోవేలు 2:32;

మత్తయి 6:9; నిర్గమకాండము 6:3;

ప్రకటన 4:11; 15:3; 19:6)

దేవుడు ఒక త్రిత్వం: “తండ్రి దేవుడే, బైబిలు చెప్పేదేమంటే యెహోవా

కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మయు దేవుడే, యేసుకంటె గొప్పవాడు,

అయినా వారు ముగ్గురు దేవుళ్లు ఆయనే దేవుడు, క్రీస్తుకు శిరస్సు.

కాదు ఒకే దేవుడు.” (ది కాథోలిక్‌ (యోహాను 14:28; 20:17;

ఎన్‌సైక్లోపీడియా, 1912 సంపుటి) 1 కొరింథీయులు 11:3)

పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తి.

(మత్తయి 3:11; లూకా 1:41;

అపొస్తలుల కార్యములు 2:4)

మానవాత్మ అమర్త్యమైంది: మానవుడే ఒక ఆత్మ. మరణమప్పుడు

“మానవుడు చనిపోయినప్పుడు ఆత్మ ఆలోచించడానికి లేక తలంచడానికి

అతని ఆత్మ, శరీరం వేరైపోతాయి. ఆగిపోతుంది మరియు అది తీయబడిన

అతని శరీరం . . . చచ్చిపోతుంది మట్టికే మరల చేరుతుంది.

. . . మానవాత్మ మాత్రం చావదు.” (ఆదికాండము 2:7; 3:19; కీర్తన 146:3, 4;

(వాట్‌ హాపెన్స్‌ ఆఫ్‌టర్‌ డెత్‌, ప్రసంగి 3:19, 20; 9:5, 10;

రోమన్‌ కాథోలిక్‌ ప్రచురణ) యెహెజ్కేలు 18:4, 20)

దుష్టులు శిక్షింపబడతారు పాపము వలన వచ్చు జీతము మరణము.

నరకంలో మరణానంతరం: నరకయాతన జీవితంకాదు.

“పారంపర్యంగా వస్తున్న క్రైస్తవ (రోమీయులు 6:23) మృతులు పునరుత్థాన

విశ్వాసం ప్రకారం నరకం అనేది నిరీక్షణతో నరకంలో (హేడీస్‌, షియోల్‌)

అంతులేని వేదనకు, బాధకు స్థలం.” స్పృహలేకుండ ఉంటారు. (కీర్తన 89:48;

(ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా, 1987 సంచిక) యోహాను 5:28, 29; 11:24, 25;

ప్రకటన 20:13, 14)

“మధ్యవర్తిని అనే బిరుదు ఒకే మధ్యవర్తి యేసే దేవునికి

[స్త్రీ మధ్యవర్తి] మన లేడీకి నరులకు మధ్యవర్తి. (యోహాను 14:6;

(అంటే మరియకు) వర్తిస్తుంది.” 1 తిమోతి 2:5;

(న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లోపీడియా, హెబ్రీయులు 9:15; 12:24)

1967 సంచిక)

శిశువులకు బాప్తిస్మం యివ్వాలి: బాప్తిస్మం ఎవరికంటే యేసుకు శిష్యులై,

“మొదటినుండి చర్చి శిశువులకు ఆయన ఆజ్ఞల్ని అనుసరించడానికి

బాప్తిస్మపు ఆచరణను నిర్వహించేది, బోధించబడిన వారికే. ఒకరు బాప్తిస్మమునకు

ఈ అలవాటు న్యాయపరమైనదే కాకుండ, అర్హతపొందాలంటే ఆ వ్యక్తి దేవుని

రక్షణకది తప్పనిసరిగా అవసరమనికూడ వాక్యాన్ని అర్థంచేసుకోవాలి, దాన్ని

ఉపదేశింపబడింది.” (న్యూ కాథోలిక్‌ విశ్వసించాలి. (మత్తయి 28:19, 20;

ఎన్‌సైపీడియా 1967 సంచిక) లూకా 3:21-23;

అపొస్తలుల కార్యములు 8:35, 36)

అనేక చర్చీలు సాధారణ ప్రజల మొదటి శతాబ్దపు క్రైస్తవులంతా పరిచారకులే

తరగతి మరియు గురువుల గనుక సువార్త ప్రకటనాపనిలో భాగంవహించారు.

తరగతియని విభాగించబడ్డాయి, (అపొస్తలుల కార్యములు 2:17, 18;

గురువులు సాధారణ ప్రజలకు రోమీయులు 10:10-13; 16:1)

పరిచర్య చేస్తుంటారు. మతగురువులకు ఒక క్రైస్తవుడు సువార్తను “ఉచితంగా

సర్వసాధారణంగా వారి పరిచర్య ఇవ్వవలెను,” జీతం కొరకు కాదు.

నిమిత్తం జీతమిస్తారు, “రెవరెండ్‌,” (మత్తయి 10:7, 8)

“ఫాదర్‌,” లేక “ఘనతవహించినవాడు” యేసు మతపరమైన బిరుదులను

అనే బిరుదులతో మామూలు ప్రజలకంటె నిర్ద్వందంగా ఖండించాడు.

ఉన్నతంగా ఎత్తబడుతున్నారు.” (మత్తయి 6:2; 23:2-12; 1 పేతురు 5:1-3)

విగ్రహాలు, ప్రతిమలు, మరియు క్రైస్తవులు వీటికి దూరంగా ఉండాలి

సిలువలు ఆరాధనలో అంటే ప్రతివిధమైన విగ్రహారాధనకు,

ఉపయోగింపబడుతున్నాయి: పరిమిత ఆరాధన అనేదానికికూడ

“క్రీస్తు, కన్యయైన దేవుని తల్లి, దూరంగా ఉండాలి. (నిర్గమకాండము 20:4, 5;

మరియు యితర పరిశుద్ధుల 1 కొరింథీయులు 10:14; 1 యోహాను 5:21)

. . విగ్రహాలను చర్చీలలోపెట్టి వారు దేవుని వెలిచూపువలనగాక

వాటికి తగిన గౌరవమర్యాదలను యివ్వాలి.” ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు.

(డిక్లరేషన్‌ ఆఫ్‌ ది కౌన్సిల్‌ (యోహాను 4:23, 24;

ఆఫ్‌ ట్రెన్‌ట్‌ [1545-63]) 2 కొరింథీయులు 5:7)

చర్చి సభ్యులకు రాజకీయాలద్వారా యేసు దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు,

దేవుని సంకల్పాలు నెరవేరుతాయని ఏదోక రాజకీయ విధానం

బోధిస్తున్నారు. కీర్తిశేషులు, కార్డినల్‌ మానవజాతికి నిరీక్షణకాదు.

స్పెల్‌మన్‌ యిట్లన్నాడు: (మత్తయి 4:23; 6:9, 10)

“శాంతికి ఒకే మార్గమున్నది రాజకీయాల్లో తలదూర్చడానికి

. . . పెద్ద ప్రజామార్గం.” ఆయన తిరస్కరించాడు.

మతం ప్రపంచ రాజకీయాల్లో (యోహాను 6:14, 15)

(తిరుగుబాట్లలో సహితం) పాల్గొంటున్నట్లు, ఆయన రాజ్యం ఇహసంబంధమై

ఐక్యరాజ్య సమితే “శాంతి ఐక్యతలకు యుండలేదు, గనుక ఆయన అనుచరులును

చివరి నిరీక్షణ”యని దానికి మద్దతు యీ లోకసంబంధులై యుండలేదు.

నివ్వడాన్ని గూర్చిన వార్తలొస్తున్నాయి. (యోహాను 18:36; 17:16)

యాకోబు లోక స్నేహాన్నిగూర్చి హెచ్చరించాడు.

(యాకోబు 4:4)

[132వ పేజీలోని చిత్రం]

ఏడు ముద్రలు విప్పడం, ఏడుబూరలు ఊదడానికి నడిపిస్తుంది

[140వ పేజీలోని చిత్రం]

“ఎ ఛాలెంజ్‌ టు వరల్డ్‌ లీడర్స్‌.” (1922) ఈ తీర్మానం “భూమిపై” యెహోవా తెగుళ్లను ప్రకటించడానికి సహాయపడింది

“ఎ వార్నింగ్‌ టు ఆల్‌ క్రిష్టియన్స్‌.” (1923) ఈ తీర్మానం మూలంగా “సముద్రములో మూడవభాగము” మీద యెహోవా తీర్పులు అంతటా ప్రకటించబడ్డాయి

[141వ పేజీలోని చిత్రం]

“ఎక్లీజియాస్టిక్స్‌ ఇన్‌డిక్టెడ్‌.” (1924) ఈ కరపత్రము విరివిగా పంచిపెట్ట బడినందున క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులనే “నక్షత్రము” రాలిపోయిందని ప్రజలు తెలుసుకొనడానికి సహాయపడింది

“మెసేజ్‌ ఆఫ్‌ హోప్‌” (1925) నిర్మొహమాటమైన యీ తీర్మానం క్రైస్తవమత సామ్రాజ్యపు వెలుగుగా పరిగణించబడేది నిజానికి అంధకారమని బయలు పర్చడానికి ఉపయోగించబడింది