కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

త్వరలో సంభవింపనైయున్న సంగతులు

త్వరలో సంభవింపనైయున్న సంగతులు

అధ్యాయం 3

త్వరలో సంభవింపనైయున్న సంగతులు

1. ఈ లోకం మీదికి రాబోవు దేవుని తీర్పునుండి మీరెలా తప్పించుకోగలరు?

ఈనాడు లోకంలో జరిగే సంఘటనల విషయంలో మీరెంతో శ్రద్ధకల్గివుంటారు. ఎందుకు? ఎందుకంటే యీ లోకం దేవుని తీర్పును తప్పించుకోలేదు. గాని మీరు తప్పించుకోగలరు. నాశనం కానైయున్న యీ “లోకసంబంధివి” కాకుండుటద్వారా మీరలా తప్పించుకోగలరు. అంటే బైరాగిలాగ, సన్యాసి జీవితాన్ని గడపాలని దీనర్థంకాదు. అంటే, అర్థవంతమైన, మంచి జీవితాన్ని జీవిస్తూనే మీరు అవినీతికర, దుష్ట ప్రవర్తనను విసర్జించడంతోపాటు రాజకీయ అవినీతి నుండి, వ్యాపార దురాశనుండి, దేవున్ని అగౌరపర్చే మతం నుండి వేరైయుండాలని అర్థం. మరి అలాగే, మీరు ప్రవర్తన విషయంలో దేవుని ఉన్నత ప్రమాణాలను అనుసరిస్తూ, ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నించాలి. (యోహాను 17:14-16; జెఫన్యా 2:2, 3; ప్రకటన 21:8) ఈ విషయాలను మీరు వర్తింపజేసుకొని, మీ జీవితాల్లో అవసరమైన మార్పులు చేసికొనుటెంత ప్రాముఖ్యమో బైబిల్లోని ప్రకటన గ్రంథం చూపిస్తుంది.

2. ప్రకటనలోని ప్రవచనాన్ని అపొస్తలుడైన యోహాను ఎలా పరిచయం చేస్తున్నాడు, మరి యీ గంభీరమైన వర్తమానాన్ని దేవుడెవరికిస్తున్నాడు?

2 అపొస్తలుడైన యోహాను యీ గొప్ప ప్రవచనాన్ని యీ మాటలతో పరిచయం చేస్తున్నాడు: “యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి.” (ప్రకటన 1:1ఎ) కాబట్టి పునరుత్థానుడైన యేసుక్రీస్తే దేవుని నుండి యీ గంభీరమైన సమాచారాన్నందుకున్నాడు. త్రిత్వమర్మములో భాగమైయుండక, యేసు యిక్కడ తన తండ్రికి లోబడి ఉన్నట్లు చూపబడింది. అదేమాదిరి, క్రైస్తవ సంఘసభ్యులయ్యే “దాసులు” యేసుక్రీస్తుకు లోబడివుంటారు, అలా వారు ‘ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనను వెంబడిస్తారు.’ (ప్రకటన 14:4; ఎఫెసీయులు 5:24) మరైతే యీనాడు నిజంగా దేవుని “దాసులు” ఎవరు, ప్రకటన వారికెలా ప్రయోజనకరంగావున్నది?

3. (ఎ) యేసుక్రీస్తుకు లోబడివుండే “దాసులు” ఎవరు? (బి) దేవదూతల నడిపింపు క్రింద నమ్మకస్థులైన “దాసులు” ఏ పని చేస్తున్నారు?

3 ప్రకటన వ్రాసిన అపొస్తలుడైన యోహాను తాను అటువంటి దాసుడేనని వివరిస్తున్నాడు. బ్రతికియుండిన అపొస్తలులలో ఆయనే ఆఖరివాడు, పరలోకంలో అమర్త్యమైన జీవాన్నిపొందే “దాసులు” అనబడే ఆత్మాభిషక్త గుంపులో ఒకడు. ఈనాడు, వీరిలో కొన్నివేలమంది మాత్రమే భూమ్మీద ఉన్నారు. దేవునికి యితర దాసులు కూడ ఉన్నారు, వారు పురుషులు, స్త్రీలు, పిల్లలతో కూడిన గొప్ప సమూహంగా యిప్పుడు లక్షల సంఖ్యలో ఉన్నారు. దేవదూతల నడిపింపు క్రింద వీరు అభిషక్త “దాసుల”తో కలిసి మానవులందరికి సువార్తను ప్రకటించుటలో భాగం వహిస్తున్నారు. అవును, భూమి మీద సాత్వికులైనవారు రక్షణ పొందునట్లు సహాయం చేయుటకు యీ “దాసులు” అంతా కలిసి ఎలా సమయాన్ని వెచ్చిస్తున్నారోగదా! (మత్తయి 24:14; ప్రకటన 7:9, 14; 14:6) సంతోషం కల్గించే సువార్తనుండి ప్రయోజనం పొందడానికి మీరేమి చేయాలో ప్రకటన గ్రంథం తెల్పుతుంది.

4. (ఎ) యోహాను ప్రకటనను దాదాపు 1,900 సంవత్సరాల క్రితం వ్రాసినందున “త్వరలో సంభవింపనైయున్న” సంగతులు అని ఆయనెలా చెప్పగల్గాడు? (బి) ప్రవచింపబడిన వాటివిషయంలో యిప్పుడున్న రుజువేమి తెలియజేస్తుంది?

4 మరైతే, యీ “దాసులకు” “త్వరలో సంభవింపనైయున్న” సంగతులు చూపించబడునని యోహాను ఎలా చెప్పగలిగాడు? ఆ మాటలు దాదాపు 1,900 సంవత్సరాల క్రితం చెప్పబడలేదా? వెయ్యేండ్లంటే “నిన్నటివలె” నున్న యెహోవా దృష్టికి, మానవ నివాసంకొరకు భూమిని సృజించి, తయారు చేయడానికి ఆయన తీసుకున్న యుగాలతో పోలిస్తే, 1,900 సంవత్సరాలు చాలాకొద్ది సమయమే. (కీర్తన 90:4) అపొస్తలుడైన పౌలు స్వయంగా తాను “మిగుల అపేక్షించుచు, నిరీక్షించుచున్న” విషయాన్ని గూర్చి రాశాడు, ఎందుకంటే, ఆయన బహుమానం ఆయనకు అతిసమీపంగా ఉన్నట్లుండెను. (ఫిలిప్పీయులు 1:20) అయిననూ, ప్రవచింపబడినవి అన్నియు నిర్ణీత సమయంలోనే నెరవేరుతాయనే దానికి ఈనాడు కొండంత రుజువున్నది. చరిత్రలో ఎన్నడూ మానవుని మనుగడకు యిప్పుడున్నంత ముప్పురాలేదు. దేవుడే దీనికి పరిష్కారమార్గం కల్గివున్నాడు!—యెషయా 45:21.

సమాచారమందించే మార్గం

5. ప్రకటన గ్రంథం అపొస్తలుడైన యోహానుకును, తదుపరి సంఘాలకును ఎలా అందించబడింది?

5ప్రకటన 1:1బి, 2 ఇంకా యిలా చెబుతోంది: “ఆయన [యేసు] తనదూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని [ప్రకటనను] సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంతమట్టుకు సాక్ష్యమిచ్చెను.” అలా, యోహాను దూతద్వారా ప్రేరేపిత వర్తమానాన్ని పొందాడు. ఆయన దాన్ని ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి, తన కాలంలోనున్న సంఘాలకు పంపాడు. మనకు సంతోషమేమంటే, యినాడు లోకమంతటనున్న సుమారు 73,000 సంఘాల్లో ఐక్యమైయున్న తన సేవకుల ప్రోత్సాహం నిమిత్తం దేవుడు దాన్ని భద్రపరచాడు.

6. యేసు తన ‘దాసులకు’ ఈనాడు ఆత్మీయాహారాన్ని అందజేయడానికి ఉపయోగించుకొనే మార్గాన్నెలా సూచించాడు?

6 యోహాను కాలంలో ప్రకటన ఇవ్వడానికి దేవునికి ఒక మార్గమున్నది, మరి ఆ మార్గానికి యోహాను ఒక భాగం. అలాగే, యీనాడు తన ‘దాసులకు’ ఆత్మీయాహారాన్ని యివ్వడానికి దేవునికి ఒక మార్గముంది. ఈ విధానాంతాన్ని గూర్చిన తన గొప్ప ప్రవచనంలో, భూసంబంధమైన యీ మార్గాన్ని యేసు గుర్తించాడు, అతడే “యజమానుడు తనయింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు.” (మత్తయి 24:3, 45-47) ఆ ప్రవచనాన్ని విప్పడానికి ఆయన యీ యోహాను తరగతినే ఉపయోగిస్తున్నాడు.

7. (ఎ) ప్రకటనలోని సూచనలు మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపాలి? (బి) యోహాను తరగతిలోని కొందరు ఎంతకాలం నుండి ప్రకటనలోని దర్శనాల నెరవేర్పునందు భాగం వహిస్తున్నారు?

7 యేసు ప్రకటనను “సూచనలు” లేక గుర్తులద్వారా యిచ్చాడని యోహాను వ్రాస్తున్నాడు. వీటిని పరిశీలించుటకివి స్పష్టంగాను, పులకరింతగాను ఉన్నాయి. అవి సాహసోపేత కార్యాన్ని వివరిస్తున్నాయి, మరి ప్రవచనాన్ని దాని భావాన్ని యితరులకు తెల్పడంలో ఆసక్తితోకూడిన ప్రయత్నం చేయడానికవి మనల్ని పురికొల్పాలి ప్రకటన మనకు ఎంతో పురికొల్పునిచ్చే అనేక దర్శనాలను అందిస్తుంది, వీటిలో యోహాను చురుకుగా పాల్గొనైనా ఉంటాడు లేదా గమనించే వానిగానైనా ఉండి ఉంటాడు. యోహాను తరగతికి చెందినవారు, యీ ప్రవచనాల నెరవేర్పులో 70 కంటే ఎక్కువ సంవత్సరాలు భాగం వహించిన కొందరు, తాము యితరులకు వీటిని వివరించగలుగునట్లు దేవుని ఆత్మ వాటి అర్థాన్ని బయల్పర్చినందుకు సంతోషిస్తున్నారు.

8. (ఎ) ప్రకటనలోని ప్రతీ దర్శనం యొక్క ప్రాముఖ్యతేమిటి? (బి) ప్రకటనలోని మృగాలేమిటో గ్రహించుటకై దానియేలు ప్రవచనమెలా సహాయపడుతుంది?

8 ప్రకటనలోని యీ దర్శనాలు వరుస క్రమంలో ఇవ్వబడలేదు. ప్రతిదానికి దానిదాని నెరవేర్పు కాలమున్నది. అనేక దర్శనాలు, వాటి అర్థాన్ని తెలుసుకోగల కీలకాన్ని యిచ్చే ముందటి ప్రవచనాల్లోని మాటలనే ప్రతిధ్వనిస్తున్నాయి. ఉదాహరణకు, దానియేలు ప్రవచనం నాలుగు భయంకరమైన క్రూరమృగాలను గూర్చి వర్ణించింది, ఇవి భూమిమీద పరిపాలనాధిపత్యాలను సూచిస్తాయని వివరించింది. కావున, ప్రకటనలోని క్రూరమృగాలు యిప్పుడున్న వాటితోసహా రాజకీయ పరిపాలనలను సూచిస్తున్నట్లు మనం గ్రహించుటకు సహాయం లభించింది.—దానియేలు 7:1-8, 17; ప్రకటన 13:2, 11-13; 17:3.

9. (ఎ) యోహానువలె, యోహాను తరగతి వారెలాంటి దృక్పథాన్ని కనబరచారు? (బి) మనం సంతోషంగా ఉండడానికి యోహాను మార్గమెలా చూపిస్తున్నాడు?

9 దేవుడు యేసుక్రీస్తుద్వారా ఇచ్చిన వర్తమానాన్నిగూర్చి సాక్ష్యమివ్వడంలో యోహాను నమ్మకంగానే ఉన్నాడు. “తాను చూచినదంతా” ఆయన వివరంగా వర్ణించాడు. ప్రవచనాన్ని పూర్తిగా అర్థం చేసుకొనుటకును, దాని శ్రేష్ఠమైన అంశాలను దేవుడు, ప్రజలకు తెల్పుటకును యోహాను తరగతి దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి నడిపింపును మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అభిషక్త సంఘం నిమిత్తం (అలాగే మహాశ్రమల నుండి దేవుడు తప్పించబోయే గొప్ప అంతర్జాతీయ సమూహం కొరకు కూడా) యోహాను యిలా రాస్తున్నాడు: “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.”—ప్రకటన 1:3.

10. సంతోషం పొందడానికి ప్రకటననుగూర్చి మనమేమి చేయాలి?

10 ప్రకటన గ్రంథాన్ని చదివితే మీకెంతో ప్రయోజనం కల్గుతుంది, అందులో వ్రాయబడిన వాటిని అనుసరించుటవల్ల యింకా మేలుపొందుతారు. యోహాను తన పత్రికలలో ఒకదాని యందు యిలా వివరించాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.” (1 యోహాను 5:3, 4) అటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించి మీరెంతో సంతోషభరితులు కాగలరు!

11. (ఎ) ప్రవచన వాక్యాలను మనం గైకొనడమెందుకు అత్యవసరం? (బి) ఏ సమయం యిప్పుడు ముంచుకొస్తుంది?

11 “సమయము సమీపించినది” గనుక ప్రవచన వాక్యమును గైకొనడం మనకు అత్యవసరం. దేనికి సమయం సమీపించింది? దేవుని తీర్పులతోపాటు ప్రకటన గ్రంథంలోని ప్రవచనాల నెరవేర్పు సమీపించింది. దేవుడు, యేసుక్రీస్తు సాతాను లోకంమీదికి అంతిమ తీర్పుతెచ్చే సమయం ఆసన్నమైంది. యేసు భూమ్మీదనున్నప్పుడు, “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు” తన తండ్రికి మాత్రమే తెలుసునన్నాడు. లోకంలో మొదటి ప్రపంచ యుద్ధం నుండి విస్తరించబోయే శ్రమలను ముందే ఎదురుచూస్తూ, యేసు యింకా యిలా అన్నాడు: “ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదు.” గనుక దేవుడు తీర్పుతీర్చేకాలం ముంచుకొస్తుంది. (మార్కు 13:8, 30-32) హబక్కూకు 2:3 తెల్పుతున్నట్లు: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” మహాశ్రమల్లో మనం తప్పించుకునేది, దేవుని ప్రవచన వాక్యాలను గైకొను దానిపైనే ఆధారపడివుంది.—మత్తయి 24:20-22.

[అధ్యయన ప్రశ్నలు]

[-15వ పేజీలోని బాక్సు]

ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోడానికి మనం

• యెహోవా ఆత్మసహాయాన్ని పొందాలి

• ప్రభువు దినమెప్పుడు ప్రారంభమైందో తెలుసు కోవాలి

• ఈనాడు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవరో గుర్తించాలి