కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకటన—దాని సంతోషకరమైన ముగింపు!

ప్రకటన—దాని సంతోషకరమైన ముగింపు!

అధ్యాయం 1

ప్రకటన—దాని సంతోషకరమైన ముగింపు!

1. మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడని మనకెలా తెలుసు?

యోహానుకివ్వబడిన ప్రకటన—బైబిలు నందలి యీ అద్భుత పుస్తకం దైవవృత్తాంతాన్ని సంతోషకరమైన ముగింపుకు తెస్తుంది. “సంతోషకర”మని మనమెందుకు చెబుతున్నాము? ఎందుకంటే తనను ప్రేమించేవారికి తన “మహిమగల సువార్త” సేవను అప్పగించే బైబిలు గ్రంథకర్త “సంతోషకరమైన దేవుడని” వర్ణించబడ్డాడు. మనం కూడ సంతోషంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుచేతనే, ప్రకటన ఆరంభంలోనే మనకిలా అభయమిస్తుంది: “ఈ ప్రవచన వాక్యములను చదువువాడు . . . ధన్యుడు.” ఆఖరి అధ్యాయంలో మనకిలా తెల్పబడింది: “ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు.”—1 తిమోతి 1:11, NW; ప్రకటన 1:3; 22:7.

2. ప్రకటన గ్రంథంనుండి సంతోషం పొందడానికి మనమేమి చేయాలి?

2 ప్రకటన గ్రంథంద్వారా మనం సంతోషాన్ని ఎలా పొందగలం? అందులోని వివిధ సూచనల, లేదా సూచనార్థక గుర్తుల అర్థాన్ని అన్వేషిస్తూ దాని ప్రకారం చేయడం వల్ల మనం సంతోషాన్ని పొందగలం. దేవుడు, యేసుక్రీస్తు యీనాటి దుష్ట విధానాన్ని నాశనంచేసి దానికి బదులుగా “మరణము ఇక ఉండని” ఒక “క్రొత్త ఆకాశమును క్రొత్తభూమిని” తెచ్చినప్పుడు మానవుల సంక్షోభ చరిత్ర త్వరలో ఓ విపత్కర ముగింపుకొస్తుంది. (ప్రకటన 21:1, 4) అటువంటి నూతన లోకంలో, నిజమైన శాంతి భద్రతలతో జీవించుటకు మనందరం ఇష్టపడమా? ప్రకటనలోని పురికొల్పే ప్రవచనంతోపాటు దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా విశ్వాసాన్ని పెంచుకోగల్గితే మనం అందులో జీవించగలము.

అపోకలిప్స్‌—అంటే ఏమిటి?

3. అపోకలిప్స్‌ మరియు అర్మగిద్దోను అంటే అర్థమేమిటని అనేకులు అనుకుంటున్నారు?

3 ప్రకటన, అపోకలిప్స్‌ అనికూడా పిలవబడడం లేదా? “ప్రకటన” అనే పదం అపోకలిప్స్‌ అనే గ్రీకు పదంనుండి వచ్చింది గనుక అది అలా పిలువబడింది. అపోకలిప్స్‌ అంటే అణుయుద్ధంతో జరిగే లోకనాశనమేనని అనేకులనుకుంటున్నారు. అణ్వాయుధాలు అపరిమితంగా తయారౌతున్న అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో మత నమ్మకం గలవారు, “మేమే మొదట నాశనమయ్యేవారం” అని చెప్పుకుంటున్నారు. ఆ ప్రాంతంలో మతగురువులు, “అర్మగిద్దోను నిశ్చయంగా రావడమే గాకుండ, అది సమీపించిందని, మంచికి దుష్టశక్తులకు, దేవునికి సాతానుకు మధ్య జరిగే అంతిమ పోరాటమని అది అణుయుద్ధంతో జరుగనై ఉందని నమ్ముతున్నట్లు” వార్తలొస్తున్నాయి. *

4. “అపోకలిప్స్‌” అనే మాటకున్న మూలార్థమేమిటి, బైబిలు చివరి పుస్తకం “ప్రకటన” అని ఎందుకు యుక్తంగా పిలువబడింది?

4 కాని నిజానికి అపోకలిప్స్‌ అంటే ఏమిటి? నిఘంటువులు దీన్ని “ముంచుకు రానైయున్న జగద్వినాశనం” అనే పదజాలాన్ని ఉపయోగించి నిర్వచిస్తున్నప్పటికిని గ్రీకులో అపోకలిప్సిస్‌ అంటే ప్రాథమికంగా, “బయల్పరచడం” లేక “బహిర్గతంచేయడం” అని దాని అర్థం. అందుచేతనే బైబిలు చివరి పుస్తకం “ప్రకటన” అని యుక్తంగా పిలువబడుతుంది. ఇక్కడ మనం లోకనాశనాన్ని గూర్చిన వినాశకర వార్తను మాత్రమేగాక, మన హృదయాంతరాల్లో తేజోవంతమైన నిరీక్షణను నిశ్చలమైన విశ్వాసాన్ని పెంచుకునే దైవసత్యాలకు సంబంధించిన వాటిని బహిరంగంచేసే విషయాన్ని గమనిస్తాము.

5. (ఎ) అర్మగిద్దోనులో ఎవరు నాశనమౌతారు, ఎవరు తప్పించుకుంటారు? (బి) అర్మగిద్దోను తప్పించుకున్నవారికి ఎటువంటి ఉజ్వల భవిష్యత్తున్నది?

5 నిజమే, బైబిల్లోని చివరి పుస్తకంలో అర్మగిద్దోను అంటే “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” అని వివరించబడింది. (ప్రకటన 16:14, 16) అయితే అది అణుయుద్ధం మూలంగా వచ్చే వినాశనానికి ఎంతో విభిన్నంగా ఉంటుంది! అటువంటి వినాశనమంటే బహుశ భూమిపైనున్న సమస్త జీవకోటి సమూలంగా నాశనమౌతుందనే అర్థం కావచ్చు. అలాకాకుండ, దైవనడిపింపు క్రిందనుండే సైన్యం—దేవుని దుష్టశత్రువులను మాత్రమే నాశనం చేస్తుందని దేవునివాక్యం అభయమిస్తుంది. (కీర్తన 37:9, 10; 145:20) సకల జనములనుండి వచ్చిన ఒక గొప్పసమూహం అర్మగిద్దోనులో దేవుని అంతిమ తీర్పును తప్పించుకుంటుంది. అప్పుడు క్రీస్తుయేసు వారిని పరదైసు భూమిలో నిత్యజీవానికి నడిపిస్తాడు. మీరు వారిలో ఒకరైయుండ గోరరా? అవును, మీరును అందులో ఉండవచ్చునని ప్రకటన చూపుతున్నది!—ప్రకటన 7:9, 14, 17.

దైవ మర్మాలను అన్వేషించుట

6. గత సంవత్సరాల్లో ప్రకటనను వివరించే ఏయే పుస్తకాలను వాచ్‌టవర్‌ సొసైటి ప్రచురించింది?

6 వాచ్‌టవర్‌ సొసైటి 1917 ప్రథమార్థంలో ది ఫినిష్డ్‌ మిస్టరి అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఇది బైబిల్లోని ప్రకటన, యెహెజ్కేలు పుస్తకాల్లోని ప్రతి వచనాన్ని చర్చించింది. అటుతర్వాత, బైబిలు ప్రవచనాల ప్రకారం లోకసంఘటనలు సంభవించడాని కారంభించినపుడు, ఆ కాలానికి తగినట్టు లైట్‌ అనే రెండు సంపుటల గ్రంథమొకటి సిద్ధం చేయబడి, 1930 లో విడుదల గావించబడింది. ఇది ప్రకటననుగూర్చి తాజాసమాచారాన్ని అందించింది. ‘నీతిమంతుల కొరకు వెలుగు’ ప్రకాశిస్తూనే వచ్చింది, గనుకనే 1963 లో సొసైటి 704 పేజీలుగల ‘‘బాబిలోన్‌ ద గ్రేట్‌ హేజ్‌ ఫాలెన్‌!” “గాడ్స్‌ కింగ్‌డం రూల్స్‌!” అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఇది, ప్రపంచ అబద్ధ మతసామ్రాజ్యమైన మహాబబులోనును గూర్చి ఎంతో వివరణనిచ్చింది, మరి ప్రకటనలోని చివరి తొమ్మిది అధ్యాయాల చర్చతో అది ముగిసింది. ‘నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతూ ఉండగా’ మరి ముఖ్యంగా సంఘ సంబంధమైన విషయంలో, ఆ వెంటనే 1969 లో ప్రకటన మొదటి 13 అధ్యాయాలను చర్చించిన, “దెన్‌ ఈజ్‌ ఫినిష్డ్‌ ద మిష్టరీ ఆఫ్‌ గాడ్‌” అనే 384 పేజీలుగల పుస్తకం వచ్చింది.—కీర్తన 97:11; సామెతలు 4:18.

7. (ఎ) సొసైటి, ప్రకటన గ్రంథంపై ఈ పుస్తకాన్నెందుకు ప్రచురించింది? (బి) పాఠకుల ప్రయోజనార్థం ఆ పుస్తకంలో ఏ బోధనోపకరణాలు యివ్వబడ్డాయి?

7 మరిప్పుడు ప్రకటనపై మరో పుస్తకమెందుకు ప్రచురింపబడాలి? యిప్పటికే ప్రచురించబడిన సమాచారం చాలా మట్టుకు ఎంతో వివరణతో కూడినదైయుండెను, మరి దాన్ని ప్రపంచమందున్న అనేక భాషల్లోకి తర్జుమాచేసి ప్రచురించడం సాధ్యంకాలేదు. అందుచేత, ప్రకటనపై ఒకే పుస్తకాన్ని అందించి, వెంటనే దాన్ని అనేకభాషల్లోనికి అనువదించడం సమంజసమనిపించింది. అంతేగాక, ఈ అద్భుతమైన ప్రవచన ప్రాముఖ్యతను స్పష్టంగా గ్రహించేలా పాఠకులకు సహాయపడే చిత్రాలు, చార్టులు, సంక్షిప్త సమాచారాలవంటి బోధనోపకరణాలు యీ పుస్తకంలో ఉన్నాయి.

8. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ఇంతకంటే మరో బలమైన కారణమేమిటి?

8 ఈ పుస్తకాన్ని ప్రచురించడంలోగల మరో ఉద్దేశం, సత్యాన్ని గూర్చిన ఇప్పటి భావాన్నందించుటే. యెహోవా తన వాక్యాన్ని గూర్చి అధిక వివరణ నిస్తున్నాడు, మరి మనం మహాశ్రమలను సమీపిస్తుండగా, ఇతర ప్రవచనాలతోపాటు ప్రకటనను అర్థం చేసికొనుట మెరుగౌతుందని మనం నిరీక్షించగలం. (మత్తయి 24:21; ప్రకటన 7:14) మనకు అధిక సమాచారం లభించుట ప్రాముఖ్యం. అపొస్తలుడైన పేతురు దేవుని ప్రవచనాన్నిగూర్చి యిలా రాశాడు: “తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దాని యందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.”—2 పేతురు 1:19.

9. (ఎ) ఇతర ప్రవచనాలతోపాటు, దేవుడు చేయనైయున్న దేనిని గూర్చికూడ ప్రకటన చూపిస్తుంది? (బి) కొత్త లోకమంటే ఏమిటి, నీవందులోనికెలా ప్రవేశించగలవు?

9 ప్రకటన గ్రంథం బైబిల్లోని యితర ప్రవచనాలను గూర్చి సాక్ష్యమిస్తూ, యెహోవా దేవుడు ఒక కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టిస్తాడని తెల్పుతుంది. (యెషయా 65:17; 66:22; 2 పేతురు 3:13; ప్రకటన 21:1-5) ముఖ్యంగా ఇది, తనతోపాటు కొత్త ఆకాశంలో సహపరిపాలకులుగా ఉండడానికై యేసు తన స్వరక్తంతో కొన్నవారిని, అంటే అభిషక్త క్రైస్తవులనుద్దేశించి వ్రాయబడిందే. (ప్రకటన 5:9, 10) అయిననూ, క్రీస్తు రాజ్యంలో నిత్యజీవం కొరకు నిరీక్షించేవారి విశ్వాసాన్ని కూడ ఈ సువార్త బలపరుస్తుంది. నీవునూ వీరిలో ఒకడవా? నిత్యం నిండుగా ఉండు దేవుని దీవెనలతోను, సంపూర్ణ సుఖశాంతులతోను, మంచి ఆరోగ్యంతోను కొత్తభూమిలో ఒక భాగమైన పరదైసునందు జీవించే నీ నిరీక్షణను ప్రకటన బలపరచును. (కీర్తన 37:11, 29, 34; 72:1, 7, 8, 16) నీవా నూతన లోకంలో జీవించాలనుకుంటే, ప్రస్తుతం సమీపంచనైయున్న ప్రకటన ముగింపునుగూర్చిన సవివరణకు మీరు సరైన ధ్యానమివ్వాల్సిన అగత్యత, అవును ప్రాముఖ్యత ఉంది.—జెఫన్యా 2:3; యోహాను 13:17.

[అధస్సూచీలు]

^ పేరా 3 సూడెట్‌షె జైటంగ్‌, మ్యూనిచ్‌, జర్మనీ, జనవరి 24, 1987.

[అధ్యయన ప్రశ్నలు]

7వ పేజీలోని చిత్రం]