కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముదటి శ్రమ—మిడతలు

ముదటి శ్రమ—మిడతలు

అధ్యాయం 22

ముదటి శ్రమ—మిడతలు

1. దూతలు బూరల శబ్దాలు చేసినప్పుడెవరు వాటిననుసరించారు, మరియు ఐదవ బూరశబ్దం దేనిని ప్రకటించింది?

ఐదవ దూత తన బూర ఊదడానికి ఉపక్రమిస్తాడు. ఇప్పటికే నాలుగు పరలోక బూరలు ఊదబడ్డాయి, మరి ఆ నాలుగు తెగుళ్లు భూమ్మీద మూడవభాగమును, అనగా అత్యంత నిందార్హమని యెహోవా పరిగణిస్తున్న—క్రైస్తవమత సామ్రాజ్యంపై కుమ్మరింపబడ్డాయి. దాని మరణకరమగు రోగపరిస్థితి బయలు పర్చబడింది. దూతలు బూరలు ఊదుతూవుంటే, వాటివెంట మానవ ప్రకటనలు భూమ్మీద కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఐదవదూత బూర మొదటి శ్రమను ప్రకటించనై యున్నాడు, యిది ముందువచ్చిన దానికంటె భయంకరమైంది. ఇది భయంకరమైన మిడతల తెగులుకు సంబంధించింది. అయినను, మొదట ఈ తెగులును యింకా బాగుగా అర్థంచేసుకోవడానికి మనం యితర లేఖనాలను పరిశీలిద్దాము.

2. యోహాను చూచిన మిడతల తెగులులాంటి దానిని బైబిల్లోని ఏ పుస్తకం వర్ణిస్తుంది, ప్రాచీన ఇశ్రాయేలీయులలో దాని ప్రభావమెలా ఉండెను?

2 సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో వ్రాయబడిన బైబిలు పుస్తకమగు యోవేలు, యోహాను చూస్తున్నటువంటి మిడతలుకూడ యిమిడియున్న పురుగుల తెగులునుగూర్చి వర్ణిస్తుంది. (యోవేలు 2:1-11, 25) * భ్రష్టులైన ఇశ్రాయేలీయులకు గొప్ప అసౌకర్యాన్ని కల్గించనైయుండెను గాని యెహోవా అనుగ్రహం కొరకు యూదులు వ్యక్తిగతంగా మారుమనస్సునొంది ఆయనవైపు తిరగడానికి కూడ దోహదపడనైయుండెను. (యోవేలు 2:6, 12-14) ఆ సమయం వచ్చినప్పుడు యెహోవా “సర్వజనులమీద” తన ఆత్మను కుమ్మరిస్తాడు, “యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినమునకు” ముందు భయంకరమైన సూచనలును, మహత్కార్యములును కలుగుతాయి.—యోవేలు 2:11, 28-32.

మొదటి శతాబ్దపు తెగులు

3, 4. (ఎ) యోవేలు 2వ అధ్యాయం ఎప్పుడు, ఎలా నెరవేరింది? (బి) సా.శ. మొదటి శతాబ్దంలో ఎలా మిడతల దండువంటి తెగులు వచ్చింది, ఎంతకాలం ఆ తెగులు కొనసాగింది?

3 మొదటి శతాబ్దంలో యోవేలు 2వ అధ్యాయం నెరవేరింది. అది సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి, మొదటి శతాబ్దపు క్రైస్తవులను అభిషేకించి, అనేక భాషల్లో “దేవుని గొప్పకార్యములను” మాట్లాడే శక్తినిచ్చింది. తత్ఫలితంగా, అక్కడ పెద్దగుంపు కూడింది. అపొస్తలుడైన పేతురు ఆశ్చర్యంతో చూస్తున్న వారినుద్దేశించి, యోవేలు 2:28, 29 వచనాలను ఎత్తిచెబుతూ, వారు దాని నెరవేర్పుకు సాక్షులని వివరించాడు. (అపొస్తలుల కార్యములు 2:1-21) అయితే కొందరికి అసౌకర్యం కల్గించి, కొందరిని మారుమనస్సుకు నడిపించిన అక్షరార్థమైన పురుగుల తెగులు ఆ సమయంలో సంభవించిన దాఖలాలేమీ లేవు.

4 మరి ఆ కాలంలో అలంకారిక తెగులేదైనా సంభవించిందా? అవును, నిశ్చయంగా సంభవించింది! అది క్రొత్తగా అభిషక్తులైన క్రైస్తవుల అవిశ్రాంత సువార్త ప్రకటనా ఫలితమే. * వారిద్వారా, మారుమనస్సు పొంది తన దీవెన లందుకోండని యెహోవా యూదులను ఆహ్వానించాడు. (అపొస్తలుల కార్యములు 2:38-40; 3:19) అందుకు స్పందించిన వ్యక్తులు ఆయన అనుగ్రహాన్ని చాలావరకు పొందారు. అయితే ఆహ్వానాన్ని తిరస్కరించిన వారికి మొదటి శతాబ్దపు క్రైస్తవులు నాశనం కల్గించే మిడతల దండువలె ఉండిరి. యెరూషలేములో ఆరంభించి యూదయ సమరయ అంతట చుట్టివచ్చారు. త్వరలోనే వారు ప్రతిచోటికి ప్రాకిపోయారు, దీని నెరవేర్పు ప్రకారం యేసు పునరుత్థానాన్నిగూర్చి బహిరంగంగా ప్రకటిస్తూ, నమ్మని యూదులను బాధిస్తుండిరి. (అపొస్తలుల కార్యములు 1:8; 4:18-20; 5:17-21, 28, 29, 40-42; 17:5, 6; 21:27-30) ఆ తెగులు “భయంకరమైన ఆ మహాదినము” వరకు అనగా సా.శ. 70 లో యెహోవా యెరూషలేమును నాశనం చేయడానికి రోమా సైన్యాలను దానిమీదికి రప్పించే వరకు కొనసాగింది. విశ్వాసంతో యెహోవా నామమునుబట్టి ప్రార్థించిన క్రైస్తవులు మాత్రమే రక్షింపబడ్డారు.—యోవేలు 2:32; అపొస్తలుల కార్యములు 2:20, 21; సామెతలు 18:10.

ఇరవయ్యో శతాబ్దపు తెగులు

5. యోవేలు ప్రవచనం 1919 నుండి ఎలా నెరవేరుతుంది?

5 కారణసహితంగా, యోవేలు ప్రవచనం అంత్యకాలంలోను అంతిమ నెరవేర్పును కల్గివుంటుందని అనుకోవచ్చు. ఇది అలా నెరవేరడమెంత వాస్తవమోగదా! సెప్టెంబరు 1-8, 1919న అమెరికాలోని ఓహాయోనందలి సీడార్‌పాయింట్‌లో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశంలో బహుగా కుమ్మరించబడిన యెహోవా ఆత్మ, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటనను సంస్థీకరించులాగున తన ప్రజల్ని పునరుజ్జీవింప జేసింది. క్రైస్తవులమని చెప్పుకొనెడి వారందరిలోను, వీరు మాత్రమే, యేసు పరలోక రాజుగా సింహాసనాసీను డయ్యాడని గుర్తిస్తున్నారు, ఆ సువార్తను లోకమంతట ప్రకటించడానికి పూనుకున్నారు. ఆ ప్రవచన నెరవేర్పు ప్రకారం వారిచ్చే అవిశ్రాంత సాక్ష్యం భ్రష్టులైన క్రైస్తవమత సామ్రాజ్యానికి వేదనకరమైన తెగులైంది.—మత్తయి 24:3-8, 14; అపొస్తలుల కార్యములు 1:8.

6. (ఎ) ఐదవదూత తన బూర ఊదినప్పుడు యోహాను ఏం చూశాడు? (బి) ఈ “నక్షత్రము” ఎవరిని సూచిస్తుంది, ఎందుకు?

6 యెరూషలేము నాశనమైన సుమారు 26 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన ప్రకటన, ఆ తెగులును కూడ వర్ణిస్తుంది. యోవేలు వర్ణనకది యింకా ఏమి జోడిస్తుంది? యోహాను తెల్పిన ప్రకారం ఆ వృత్తాంతాన్ని పరిశీలిద్దాం: “అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.” (ప్రకటన 9:1) ఈ “నక్షత్రము,” యోహాను ప్రకటన 8:10 లో రాలిపోతున్నట్లు చూసినదానికి భిన్నంగావుంది. ఆయన “భూమిమీద రాలిన నక్షత్రమును” చూశానంటున్నాడు, దానికి యీ భూమివిషయంలో యిప్పుడు పనికల్గివుంది. ఇదొక ఆత్మీయ వ్యక్తియా లేక మానవుడా? “అగాధము యొక్క తాళపుచెవి” కల్గియున్న యీ వ్యక్తి సాతానును “అగాధములో” పడవేసినట్లు అటుతర్వాత వర్ణించబడ్డాడు. (ప్రకటన 20:1-3) గనుక ఆయన గొప్ప ఆత్మీయవ్యక్తి అయ్యుంటాడు. మిడతలకు “పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు,” అని ప్రకటన 9:11 లో యోహాను చెబుతున్నాడు. ఈ రెండు లేఖనాలు ఒకే వ్యక్తినిగూర్చి తెల్పుతుండవచ్చు, ఎందుకంటె, అగాధపు తాళపుచెవిని కల్గియున్న దూత న్యాయసమ్మతంగా అగాధముయొక్క దూతయే. మరి ఆ నక్షత్రము యెహోవా నియమించిన రాజును సూచించాలి, ఎందుకంటే, అభిషక్త క్రైస్తవులు ఒకే దూతయగు ఆ రాజును, అంటే యేసుక్రీస్తును అంగీకరిస్తారు.—కొలొస్సయులు 1:13; 1 కొరింథీయులు 15:25.

7. (ఎ) “అగాధము” తెరువబడినప్పుడు ఏం జరుగుతుంది? (బి) “అగాధము” అంటే ఏమిటి, అందులో ఎవరు కొంతకాలమున్నారు?

7 ఆ వృత్తాంతం యింకా యిలా అంటుంది: “అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలోనుండి మిడతలు భూమిమీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.” (ప్రకటన 9:2, 3) లేఖనాల ప్రకారం, “అగాధము” నిష్క్రియా స్థలం, మరణస్థలం కూడ. (రోమీయులు 10:7; ప్రకటన 17:8; 20:1, 3 పోల్చండి.) యేసు సహోదరుల చిన్నగుంపు మొదటి ప్రపంచ యుద్ధాంతమున (1918-19) అటువంటి “అగాధము”లో స్వల్పకాలం గడిపారు. అయితే పశ్చాత్తాప పడిన సేవకులమీద 1919 లో యెహోవా తన ఆత్మను కుమ్మరించినప్పుడు, వారెదుటవున్న పనినెదుర్కోవడానికి వారు దండువలె బయలుదేరారు.

8. మిడతల విడుదలతోపాటు వాటివెంట దట్టమైనపొగ ఎలావచ్చింది?

8 యోహాను చూస్తున్నరీతిగా, మిడతలవెంట “పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి” విస్తారమైన పొగ వస్తుంది. * మరి 1919 లో అలాగే జరిగింది. క్రైస్తవమత సామ్రాజ్యానికి, ప్రజలకు పరిస్థితి అంధకారమైంది. (యోవేలు 2:30, 31 పోల్చండి.) ఆ మిడతలు, అంటే యోహాను తరగతి విడుదల క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులకు నిజంగా ఓటమే, వారు కుట్రపన్ని మంచికొరకున్న రాజ్యసువార్త సేవను అంతమొందించాలని పథకంవేశారు, మరిప్పుడు దేవుని రాజ్యాన్నే తిరస్కరించారు. ఆ మిడతల దండు దైవాధికారంపొంది, బలమైన తీర్పు వర్తమానాల్ని ప్రకటించడానికి ఆ అధికారాన్ని ఉపయోగించినప్పుడు, భ్రష్టులైన క్రైస్తవమత సామ్రాజ్యం మీదకు అసహ్యం కల్గించే పొగ కమ్ముకున్న ఆధారం కనబడింది. క్రైస్తవమత సామ్రాజ్యపు ‘సూర్యునికి’—దాని జ్ఞానోదయపు బాటకు—గ్రహణంపట్టింది, మరి యీ లోకపు “వాయుమండల సంబంధమైన అధిపతి,” క్రైస్తవమత సామ్రాజ్యపు దేవుడని దైవతీర్పు ప్రకటనలు వెలువడగా దాని “వాయుమండలము” దట్టంగా మారింది.—ఎఫెసీయులు 2:2; యోహాను 12:31; 1 యోహాను 5:19.

బాధించే ఆ మిడతలు!

9. మిడతలు యుద్ధానికి సంబంధించిన ఎటువంటి ఆజ్ఞలను అందుకున్నాయి?

9 యుద్ధాన్ని గూర్చిన ఏ ఆజ్ఞలు యీ మిడతలకు జారీ చేయబడ్డాయి? యోహానిలా నివేదిస్తున్నాడు: “మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలన కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.”—ప్రకటన 9:4-6.

10. (ఎ) తెగులు ముఖ్యంగా ఎవరికి ఉద్దేశించబడింది, వారిపై దాని ప్రభావమెలా వుంది? (బి) ఎటువంటి బాధ అందులో యిమిడివుంది? (అథఃస్సూచి కూడా చూడండి.)

10 గమనించండి, యీ తెగులు మొదట, ‘మొక్కలకైనను, వృక్షమునకైనను’ అంటే ప్రజలు లేక ప్రముఖులకు హాని చేయడానికి ఆజ్ఞ పొందలేదు. (ప్రకటన 8:7 పోల్చండి.) మిడతలు, వారి నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకు, అంటే ముద్రించబడ్డామని చెప్పుకుంటారే గాని వారి క్రియలవల్ల అలా రుజువు చేయలేని క్రైస్తవమత సామ్రాజ్యంలోని వారికే హాని చేయవలసి ఉన్నాయి. (ఎఫెసీయులు 1:13, 14) ఆవిధంగా, ఈ ఆధునిక-కాల మిడతలు బాధించే వర్తమానాలు మొదట క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకుల నుద్దేశించి చెప్పబడ్డాయి. వారు తమ మందను పరలోకానికి నడిపించలేరు సరికదా, అసలు తామే అందులో ప్రవేశింపజాలరని బహిరంగంగా ప్రకటించ బడినప్పుడు విని యీ అహంకారులైన మనుష్యులెంత బాధపడ్డారో గదా! * నిజంగా, అది ‘గుడ్డివాన్ని గుడ్డివాడే నడిపించిన” రీతిగా వుంటుంది.—మత్తయి 15:14.

11. (ఎ) మిడతలు ఎంతకాలం దేవుని శత్రువులను బాధిస్తూ ఉండాలి, మరి అదెందుకంత తక్కువ కాలమేమీ కాదు? (బి) ఆ బాధ ఎంత తీవ్రమైంది?

11 ఆ బాధ ఐదునెలల వరకూ ఉంటుంది. అదంత తక్కువ సమయమేనా? నిజమైన మిడతల విషయంలోమాత్రం కాదు. ఐదు నెలలంటే సాధారణంగా యీ ప్రాణులు జీవించే కాలమన్నమాట. అందుచేత, ఆధునిక మిడతలు జీవించినంతకాలం దేవుని శత్రువులను బాధిస్తూ ఉంటాయని అర్థం. అంతేగాక, బాధ ఎంత విపరీతంగా ఉంటుందంటే మనుష్యులు చావాలనుకుంటారు. నిజమే, మిడతలు కుట్టిన వారెవరన్నా చావడానికి ప్రయత్నించినట్లు మనకు దాఖలాలేమీ లేవు. అయితే ఆ మాటమాత్రం వాటివల్ల కల్గేబాధ ఎంతతీవ్రమైందో—తేలు కుట్టినంత బాధాకరమైన పోటువంటిదని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అది, బబులోనీయులచేత తరుమబడి, బ్రతకడంకన్నా మరణమే మంచిదనుకునే భ్రష్టులైన ఇశ్రాయేలీయులకు సంభవింపబోవు బాధను యిర్మీయా ముందే ఊహించిన మాదిరిగానే ఉంది.—యిర్మీయా 8:3; ప్రసంగి 4:2, 3 కూడ చూడండి.

12. ఆ మిడతలు క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులను ఆత్మీయార్థంలో చంపడానికి కాకుండ ఎందుకు బాధించడానికే అనుమతించ బడ్డాయి?

12 ఆత్మీయభావంలో, వీరిని చంపకుండా బాధించే అనుమతి ఎందుకీయబడింది? ఇది క్రైస్తవమత సామ్రాజ్యపు అబద్ధాలను, దాని వైఫల్యాలను బహిర్గతంచేసే మొదటి శ్రమ మాత్రమే, గాని ప్రభువు దినము కొనసాగేకొలది, అప్పుడు మాత్రమే దాని మరణకరమైన ఆత్మీయ స్థితి పూర్తిగా ప్రచారం చేయబడుతుంది. రెండవ శ్రమకాలంలోనే మనుష్యులలో మూడవభాగం చంపబడతారు.—ప్రకటన 1:10; 9:12, 18; 11:14.

మిడతలు యుద్ధానికి సర్వసన్నద్ధమే

13. మిడతలకు ఎటువంటి ఆకారమున్నది?

13 ఆ మిడతలకు ఎంత గంభీరమైన ఆకారమున్నదో! యోహానిలా వర్ణిస్తున్నాడు: “ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలియున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్యముఖముల వంటివి; స్త్రీల తల వెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.”—ప్రకటన 9:7-9.

14. మిడతలనుగూర్చి యోహాను యిచ్చిన వర్ణన ఎందుకు 1919 లో పునరుజ్జీవింప జేయబడిన క్రైస్తవులకు సరిపోతుంది?

14 ఇది 1919 లో పునరుజ్జీవింప జేయబడిన రాజరికపు క్రైస్తవులగుంపు యొక్క పరిస్థితిని వివరిస్తుంది. గుఱ్ఱాలవలె వారు, యుద్ధానికి సన్నద్ధులై, అపొస్తలుడైన పౌలు వర్ణించిన మాదిరి సత్యంకొరకు పోరాడాలని మిక్కిలి ఆశతో యుండిరి. (ఎఫెసీయులు 6:11-13; 2 కొరింథీయులు 10:4) వారి తలలమీద యోహాను బంగారు కిరీటముల వంటివి చూస్తున్నాడు. వారింకా భూమ్మీదే ఉన్నారు గనుక వారు నిజమైన కిరీటాలు ధరించడం యుక్తం కాదు. (1 కొరింథీయులు 4:8; ప్రకటన 20:4) అయితే 1919 లో వారు రాజరికంలో వున్నట్లే కనబడ్డారు. వారు రాజుకు సహోదరులు గనుక వారు అంతంవరకు నమ్మకంగావుంటే వారి పరలోక కిరీటం వారికొరకు భద్రం చేయబడుతుంది.—2 తిమోతి 4:8; 1 పేతురు 5:4.

15. మిడతలకున్న (ఎ) ఇనుప మైమరువు (బి) మనుష్యుని ముఖము (సి) స్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు (డి) సింహము వంటి కోరలు (ఇ) విస్తారమైన ధ్వని దేనిని సూచిస్తున్నాయి?

15 మిడతలు అవిచ్ఛిన్నమైన నీతిగలవారని సూచించే ఇనుప మైమరువులు తొడుగుకొనియున్నట్లు దర్శనంలో కనబడింది. (ఎఫెసీయులు 6:14-18) వాటికి మానవముఖం ఉన్నది, యిది ప్రేమ అనే లక్షణాన్ని సూచిస్తుంది, ఎందుకంటే మానవుడు ప్రేమగల దేవుని పోలికగా సృజింపబడ్డాడు. (ఆదికాండము 1:26; 1 యోహాను 4:16) వాటి వెండ్రుకలు స్త్రీల తల వెండ్రుకలవలె ఉన్నాయి, అంటే అగాధపు దూతయైన తమరాజుకు లోబడివున్నారనే విషయాన్నది సూచిస్తుంది. మరి వాటిపండ్లు సింహపు కోరలవలె ఉన్నాయి. సింహం మాంసాన్ని చీల్చడానికి దాని కోరల నుపయోగిస్తుంది. యోహాను తరగతి 1919 నుండి బలమైన ఆత్మీయాహారాన్ని, ముఖ్యంగా “యూదా కొదమసింహము” అయిన యేసుక్రీస్తు పాలించే దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యాలను మరల తీసుకోగల్గుతుంది. సింహం ధైర్యానికి సూచనగా వున్నట్లే, బలంగా తగిలే యీ సమాచారాన్ని జీర్ణింపజేసుకుని, ప్రచురణలలో ప్రచురించి, భూలోకమంతా పంచిపెట్టడానికి ధైర్యం అవసరమైవుంది. ఆ సాదృశ్యమైన మిడతలు పెద్దశబ్దం, “యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె” శబ్దాన్ని చేశాయి. మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరి వీరును మౌనంగా ఉండదలచుకోలేదు.—1 కొరింథీయులు 11:7-15; ప్రకటన 5:5.

16. మిడతలకు “తేళ్లతోకలవంటి తోకలును, కొండ్లును” ఉన్నాయనడంలోగల ప్రాముఖ్యత ఏమిటి?

16 ఈ ప్రచారంలో మామూలు సమాచారం కంటె ఎక్కువే యిమిడివుంది! “తేళ్ల తోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.” (ప్రకటన 9:10) దీని భావమేమైయుండొచ్చు? యెహోవాసాక్షులు రాజ్యప్రచారానికి వెళ్లేటప్పుడు వారు ప్రచురణలను—పుస్తకములు, పత్రికలు, బ్రోషూర్లు, సమయానుకూలమైన కరపత్రాలను యిచ్చివెళ్తారు. ప్రజలు వారియిండ్లలో చదువుకోవడానికి దేవుని వాక్యంమీద ఆధారపడిన అధికారపూర్వక వివరణలు అందులో ఉంటాయి, అవి రాబోవు యెహోవా ఉగ్రత దినాన్నిగూర్చి హెచ్చరిస్తాయి గనుక వాటికి తేలువంటి కొండ్లున్నాయి. (యెషయా 61:2) ప్రస్తుత ఆత్మీయ మిడతల తరంయొక్క జీవితకాలం గడిచిపోకముందే, యెహోవా తీర్పులు ప్రకటించే దైవనియమిత పని—అహంకార దూషకులను బాధించే నిమిత్తం—పూర్తవుతుంది.

17. (ఎ) బైబిలు విద్యార్థులు వారి సాక్ష్యమును తీవ్రతరం చేయడానికి వారి 1919వ సంవత్సరపు సమావేశంలో ఏం ప్రకటించబడింది? (బి) మతగురువులెలా బాధించబడియున్నారు, మరి దానికి జవాబుగా వారెలా స్పందించారు?

17 ఆ మిడతలదండు, 1919 లో జరిగిన వారి సమావేశంలో ది గోల్డన్‌ ఏజ్‌ అనే పత్రిక విడుదలైనప్పుడు అమితానందం పొందింది. అది పక్షపత్రిక, వారి సాక్ష్యపు పని ముమ్మరం చేయడానికి తయారు చేయబడింది. * దాని 27వ సంచిక అంటే 1920, సెప్టెంబరు 29వ సంచిక, 1918-19 మధ్యకాలంలో అమెరికాలో బైబిలు విద్యార్థులను హింసించడంలో మతగురువుల మోసాన్ని బైటపెట్టింది. ది గోల్డన్‌ ఏజ్‌ పత్రిక, 1920 మరియు 1930 దశాబ్దాలలో మతగురువులు రాజకీయాల్లో కుయుక్తిగా పాల్గొనడాన్ని, మరీముఖ్యంగా, కాథోలిక్‌ మత పీఠాధిపతులు ఫాసిస్ట్‌, నాజీ నియంతలతో చేసుకున్న ఒప్పందాలను శీర్షికలు, కార్టూనులద్వారా బహిర్గతంచేసి మతగురువులను యింకా కుట్టింది. దీనికి జవాబుగా, మతగురువులు దేవుని ప్రజలకు ‘చట్టంద్వారా కీడుకల్పించే’ ఉద్దేశముతో ఒక పథకం ప్రకారం మూకుమ్మడి హింస కల్గించారు.—కీర్తన 94:20, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌.

లోకపాలకులు గమనించవలసి యుండెను

18. మిడతలు ఏం పని చేయవలసి యుండెను, ఐదవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది?

18 ఆధునిక మిడతలు పని కల్గివుండెను. రాజ్యసువార్త ప్రకటింప బడవలసియుండెను. తప్పులు బయటపెట్ట వలసియుండెను. తప్పిపోయిన గొఱ్ఱెను వెదకవలసి యుండెను. మిడతలు యీ పనులు చేస్తుండగా లోకం యిదంతా మౌనంగా గమనిస్తూ ఉండవలసివచ్చింది. దూతల బూరల శబ్దానికి లోబడి యోహాను తరగతి, క్రైస్తవమత సామ్రాజ్యం యెహోవా ప్రతికూల తీర్పులకు అర్హమైందని బహిరంగపరుస్తూనే వచ్చింది. ఐదవదూత బూరకు అనుగుణంగా, ఇంగ్లాండునందలి లండన్‌లో మే 25-31, 1926 లో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశమందు యీ తీర్పులకు సంబంధించిన ఒక ప్రత్యేక విషయం నొక్కిచెప్పబడింది. ఇందులో “ఎ టెస్టిమొని టు ది రూలర్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌” అనే తీర్మానం చేయబడింది, మరియు ది రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌నందు “వై వరల్డ్‌ పవర్స్‌ ఆర్‌ టోటరింగ్‌—ది రెమెడి,” అనే బహిరంగ ప్రసంగం యివ్వబడింది, మరి యీ రెండింటిని ఆ మర్నాడు లండన్‌లోని ప్రముఖ వార్తాపత్రికలు వాటి పూర్తిపాఠాన్ని ప్రచురించాయి. ఆ పిదప యీ మిడతల దండు ఆ తీర్మానాన్ని కరపత్రరూపంలో ముద్రించి—క్రైస్తవమత సామ్రాజ్యానికి నిజంగా కుట్టినట్లే—5 కోట్ల కాపీలను పంచి పెట్టాయి. అనేక సంవత్సరాల తర్వాతకూడ లండన్‌లో ప్రజలు యీ బహిర్గతంచేసే బాధాకరమైన విషయాన్ని గూర్చి మాట్లాడుకున్నారు.

19. సాదృశ్యమైన మిడతలు యింకా ఎటువంటి యుద్ధోపకరణాన్ని అందుకున్నాయి, లండన్‌ మానిఫెస్టోను గూర్చి అవేమి చెప్పాయి?

19 ఈ సమావేశంలోనే, ఆ సాదృశ్యమైన మిడతలు యుద్ధోపకరణాన్ని, ముఖ్యంగా డెలివరెన్స్‌ అనే పుస్తకాన్ని అందుకున్నాయి. అందులో, ‘మగశిశువు’ ప్రభుత్వం, అంటే క్రీస్తు పరలోకరాజ్యం 1914 లో ప్రారంభమైందని లేఖనానుసారమైన వివరణకూడ చర్చించబడింది. (మత్తయి 24:3-14; లూకా 21:24-26; ప్రకటన 12:1-10) అటుతర్వాత, 1917 లో లండన్‌నందు ప్రచురించబడి, “ప్రపంచంలోకెల్ల మహాగొప్ప ప్రసంగీకులని” వర్ణించబడిన ఎనిమిది మంది మతగురువులు సంతకాలు చేసిన ఒక మానిఫెస్టోను ఎత్తి చూపింది. వారు ప్రసిద్ధిచెందిన ప్రోటస్టెంట్‌ శాఖలు అంటే, బాప్టిస్టు, కాంగ్రిగేషనల్‌, ప్రెస్బిటేరియన్‌, ఎపిస్కోపాలియన్‌, మరియు మెథడిస్ట్‌లకు సంబంధించినవారు. ఈ మానిఫెస్టో ప్రకటించిందేమంటే, “అన్యరాజుల కాలములు గతించనైయున్నవని ప్రస్తుత పరిస్థితి సూచిస్తుంది,” మరియు “ప్రభువు రాకడ ఏక్షణంలోనైనా రావచ్చు.” అవును, ఆ మతగురువులు యేసు ప్రత్యక్షతను గుర్తించారు! కానీ దీన్నిగూర్చి వారేమైన చేయదలచారా? డెలివరెన్స్‌ అనే పుస్తకం మనకిలా తెలుపుతుంది: “ఈ విషయంలో బాగా గమనించ వలసిందేమంటే ఆ మానిఫెస్టోపై సంతకం చేసినవారే ఆ తర్వాత దాన్ని ఖండించి, మనమీ లోకాంతంలో ఉన్నామని, ప్రభువు రెండవ ప్రత్యక్షతా కాలంలో ఉన్నామని రుజువుచేసే సాక్ష్యాధారాన్ని తిరస్కరించారు.”

20. (ఎ) మతగురువులు మిడతలదండు వాటి రాజునుగూర్చి ఎటువంటి ఎంపిక చేసుకున్నారు? (బి) మిడతల దండు నాయకుడెవరని యోహాను చెబుతున్నాడు, మరి ఆయన పేరేమిటి?

20 రానైయున్న దేవునిరాజ్యాన్ని గూర్చి ప్రకటించకుండా క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు సాతాను లోకంతోనే ఉండడానికి ఎన్నుకున్నారు. వారు మిడతల దండుతోను వారి రాజుతోను ఎటువంటి పొత్తుపెట్టుకో దలంచలేదు, వారినిగూర్చి యోహానిలా చెబుతున్నాడు: “పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీ భాషలో వానికి అబద్దోనని [అంటే “నాశనం”] పేరు, గ్రీకుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను [అంటే “నాశనం చేయువాడు”].” (ప్రకటన 9:11) “పాతాళపు దూత” గాను “నాశనము చేయు”వానిగాను యేసు నిజంగా క్రైస్తవమత సామ్రాజ్యంమీదికి బాధాకరమైన తెగులును పంపించాడు. అయితే జరుగవలసింది యింకా ఉన్నది!

[అధస్సూచీలు]

^ పేరా 2 యోవేలు 2:4, 5, 7ను (యిక్కడ పురుగులు గుఱ్ఱములు, ప్రజలు, మరియు మనుష్యులతో పోల్చి అవి రథములవలె శబ్దంచేస్తున్నట్లు వర్ణించబడ్డాయి) ప్రకటన 9:7-9తో పోల్చండి; మరియు యోవేలు 2:6, 10 వచనాలను (పురుగుల తెగులువల్ల కలిగేబాధను వర్ణిస్తుంది) ప్రకటన 9:2, 5లతో పోల్చండి.

^ పేరా 4 డిశంబరు 1, 1961, ది వాచ్‌టవర్‌ సంచికలోని “యునైటెడ్‌ అగెనెస్ట్‌ నేషన్స్‌ ఇన్‌ ది వ్యాలీ ఆఫ్‌ డెసిషన్‌” అనే శీర్షికను చూడండి

^ పేరా 8 అగాధమొక అగ్నిగుండమన్నట్లు, అగాధంలో అగ్నివుందని రుజువుచేయడానికి యీ లేఖనాన్ని ఉపయోగించ లేమని గమనించండి. ఆయన పెద్ద కొలిమినుండి వస్తున్న పొగను పోలినది లేక పొగ“వంటిది” చూచినట్లు యోహాను చెబుతున్నాడు. (ప్రకటన 9:2) అగాధంలో అసలైన అగ్నిమంటలను చూచినట్లు ఆయన చెప్పడంలేదు.

^ పేరా 10 ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం బాసానిజో అనే మూలపదం నుండి వచ్చింది, ఆ మాటను నిజమైన బాధను తెల్పడానికి కొన్నిసార్లు ఉపయోగించారు; అయినను, దాన్ని మానసిక బాధను సూచించడానికి కూడ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, 2 పేతురు 2:8 లో మనం లోతు తాను సొదొమలో చూచిన చెడునుబట్టి “తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను” అని చదువుతాము. నిజానికి, మరో కారాణాన్నిబట్టి, అపొస్తలుల కాలంలోని మతనాయకులు మానసిక బాధననుభవించారు.

^ పేరా 17 ప్రస్తుతం పక్షపత్రికగా ప్రచురించబడే యీపత్రిక 1937 లో కన్‌సొలేషన్‌ అని 1946 లో అవేక్‌! అని పేరు మార్చబడింది.

[అధ్యయన ప్రశ్నలు]

[143వ పేజీలోని చిత్రం]

ఐదవబూర ఊదడంద్వారా మూడు శ్రమలలో మొదటిది పరిచయం చేయబడుతుంది

[146వ పేజీలోని చిత్రం]

బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. (కీర్తన 45:5) ఇటువంటి పదాలతో కనబడుతూ, 1930వ దశాబ్దకాలంలో ప్రచురింపబడిన అనేక కార్టూనులలో పైనున్న దొకటి, అది “దేవుని ముద్రలేని మనుష్యులను” కుట్టింది

[147వ పేజీలోని చిత్రం]

రాయల్‌ ఆల్‌బర్ట్‌ హాల్‌, అక్కడ డెలివరెన్స్‌ పుస్తకం విడుదలైంది, మరి “ఎ టెస్టిమొని టుది రూలర్స్‌ ఆఫ్‌ది వరల్డ్‌” అనే తీర్మానపత్రం విడుదల చేయబడింది