కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యుద్ధశూరుడగు రాజు అర్మగిద్దోనులో విజయమొందుచున్నాడు

యుద్ధశూరుడగు రాజు అర్మగిద్దోనులో విజయమొందుచున్నాడు

అధ్యాయం 39

యుద్ధశూరుడగు రాజు అర్మగిద్దోనులో విజయమొందుచున్నాడు

దర్శనము 13—ప్రకటన 19:11-21

అంశం: సాతాను విధానాన్ని నాశనం చేయడానికి యేసు పరలోక సైన్యాలను నడిపిస్తాడు

నెరవేర్పుకాలం: మహాబబులోను నాశనం తర్వాత

1. అర్మగిద్దోను అంటే ఏమిటి, దానికేది నడిపిస్తుంది?

అర్మగిద్దోను అనేది అనేకులను హడలెత్తించే మాటే! అయితే నీతిని ప్రేమించే వారికది, యెహోవా చివరిసారిగా జనాంగములకు తీర్పుతీర్చే దీర్ఘకాల నిరీక్షణా దినమును సూచిస్తుంది. అది మానవుని యుద్ధంకాదు గానీ లోక పరిపాలకులకు ప్రతీకారంచేసే ఆయన దినమైన—“సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము.” (ప్రకటన 16:14, 16; యెహెజ్కేలు 25:17) మహాబబులోను నిర్మూలనతో మహాశ్రమలు అప్పుడే ఆరంభమౌతాయి. తదుపరి, సాతాను అభ్యర్థన మేరకు ఎఱ్ఱని క్రూరమృగము దాని పదికొమ్ములు యెహోవా ప్రజలపై దాడిచేసే ధ్యాసలో ఉంటాయి. అపవాది, దేవుని స్త్రీవంటి సంస్థపై మరెక్కువ ఆగ్రహం గలవాడై, ఆమె సంతానంలో శేషించినవారిని మట్టుపెట్టాలని తన కింకరులను ఉపయోగించి యుద్ధం చేయడానికి తీర్మానించుకుంటాడు. (ప్రకటన 12:17) సాతానుకిదే ఆఖరి అవకాశము!

2. మాగోగువాడైన గోగు ఎవరు, యెహోవా తన ప్రజలనే అతడు ముట్టడించేలా ఎలా చేస్తాడు?

2 అపవాది దుర్మార్గపు ముట్టడి యెహెజ్కేలు 38 లో సవివరంగా వర్ణించబడింది. అందులో అథోఃస్థానానికి త్రోయబడిన సాతాను “మాగోగు దేశపువాడగు గోగు” అని పిలువబడ్డాడు. యెహోవా గోగునకు, అతని అసంఖ్యాకమైన సైనికశక్తి ముక్కులకు అలంకారిక కొక్కెం తగిలించి ముట్టడికి నడిపిస్తాడు. ఆయన దీన్నెలా చేస్తాడు? “ఆయా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు” ప్రజలవలె తన సాక్షులు నిస్సహాయులని గోగునకు కనబరచడం ద్వారా ఆయనలా చేస్తాడు. వీరు క్రూరమృగమునైననూ దాని ప్రతిమనైననూ ఆరాధించని ప్రజలుగా భూమ్మీద పేరెన్నికగలవారు. వారి ఆత్మీయ ఐశ్వర్యం, బలం గోగునకు ఆగ్రహం తెప్పిస్తాయి. గనుక గోగు, అతని విస్తారమైన సైన్యం, సముద్రంనుండి పైకివచ్చే క్రూరమృగంతోసహా, సంహారానికి సంసిద్ధమౌతాయి. అయితే మహాబబులోనువలె గాక దేవుని పరిశుద్ధ ప్రజలు దైవరక్షణ ననుభవిస్తారు.—యెహెజ్కేలు 38:1, 4, 11, 12, 15; ప్రకటన 13:1.

3. యెహోవా గోగు సైన్యాన్ని ఎలా చీల్చిచెండాడుతాడు?

3 యెహోవా ఎలా గోగును అతని మూకను చీల్చిచెండాడుతాడు? వినండి! “నా పర్వతములన్నిటిలో అతనిమీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.” ఆ యుద్ధంలో అణ్వాయుధాలుగానీ, మారణాయుధాలుగానీ పనిచేయవు, ఎందుకంటే యెహోవా యిలా ప్రకటిస్తున్నాడు: “తెగులుపంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారిమీదను అతనితోకూడిన జనము లనేకము మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును. నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.”—యెహెజ్కేలు 38:21-23; 39:11; యెహోషువ 10:8-14; న్యాయాధిపతులు 7:19-22; 2 దినవృత్తాంతములు 20:15, 22-24 యోబు 38:22, 23 పోల్చండి.

“నమ్మకమైనవాడును సత్యవంతుడును” అను నామముగలవాడు

4. యోహాను యుద్ధశూరుడైన యేసుక్రీస్తును ఎలా వర్ణిస్తున్నాడు?

4 యెహోవా ఖడ్గాన్ని రప్పిస్తున్నాడు. ఈ ఖడ్గాన్ని ధరించే వ్యక్తెవరు? ప్రకటనకు తిరిగివస్తే మరో గగుర్పాటు కల్గించే దర్శనంలో దానికి సమాధానం దొరుకుతుంది. యోహాను కళ్లెదుటే పరలోకం తెరువబడి నిజంగా ఆశ్చర్యంలో ముంచెత్తే విషయం బయల్పడుతుంది—యేసుక్రీస్తే స్వయంగా యుద్ధానికి సర్వసన్నద్ధమయ్యాడు! యోహాను మనకిలా తెల్పుతున్నాడు: “మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను, దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామముగలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను.”—ప్రకటన 19:11, 12ఎ.

5, 6. (ఎ) “తెల్లని గుఱ్ఱము” (బి) “నమ్మకమైనవాడును సత్యవంతుడును” అను నామము (సి) నేత్రములు “అగ్నిజ్వాలవంటివి” (డి) “అనేక కిరీటములు” అనేవి దేన్ని సూచిస్తాయి?

5 నలుగురు గుఱ్ఱపురౌతులున్నట్లు ముందుచూపిన దర్శనంలోవలె, ఈ “తెల్లని గుఱ్ఱము,” నీతియుక్తమైన యుద్ధానికి తగిన సూచనే. (ప్రకటన 6:2) ఈ యుద్ధశూరుడు తప్ప దేవునికుమారులలో మరెవరు యింతకంటె నీతిమంతునిగా ఉండగలరు? “నమ్మకమైనవాడును సత్యవంతుడును” అయిన యీయన తప్పకుండా “నమ్మకమైన సత్యసాక్షి”యగు యేసుక్రీస్తే అయ్యుంటాడు. (ప్రకటన 3:14) ఆయన యెహోవా నీతి తీర్పులను తీర్చడానికి యుద్ధం జరిగిస్తాడు. ఆ విధంగా, ఆయన యెహోవా నియమిత న్యాయాధిపతిగా, “బలవంతుడగు దేవుని”గా తన స్థానాన్ని నిర్వహిస్తున్నాడు. (యెషయా 9:6) ఆయన నేత్రాలు “అగ్ని జ్వాల”వలె భయంకరమై తన విరోధులను దహించివేసేంత తీక్షణంగా ఉన్నాయి.

6 ఈ యుద్ధశూరుడైన రాజు శిరస్సుపై కిరీటములున్నవి. యోహాను చూస్తుండగా సముద్రంలోనుండి పైకివచ్చిన క్రూరమృగానికి, భూమ్మీద తాత్కాలిక పరిపాలనేవుందని సూచించడానికి పది కిరీటాలున్నాయి. (ప్రకటన 13:1) అయితే యేసుకు “అనేక కిరీటములుండెను”. ఆయన “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అయ్యున్నందున ఆయన మహిమగల పరిపాలన సాటిలేనిది.—1 తిమోతి 6:15.

7. యేసుకున్న వ్రాయబడిన నామము ఏమిటి?

7 యోహాను వర్ణన యింకా యిలా కొనసాగుతోంది: “వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు.” (ప్రకటన 19:12బి) బైబిలు యిప్పటికే దేవుని కుమారుని యేసు, ఇమ్మానుయేలు, మిఖాయేలు అనే పేర్లతో పిలుస్తోంది. అయితే తెలియబడని యీ “నామము” ప్రభువు దినములో యేసు కల్గియుండబోయే స్థానానికి, ఆధిక్యతకు సూచనగా ఉన్నట్లు కనబడుతోంది. (ప్రకటన 2:17 పోల్చండి.) యేసు 1914నుండి కల్గివుండే స్థానాన్ని యెషయా వర్ణిస్తూ యిలా చెబుతున్నాడు: ఆయన “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి.” (యెషయా 9:6) అపొస్తలుడైన పౌలు యిలా వ్రాసినప్పుడు యేసు నామమును ఆయనకున్న ఉన్నత సేవాధిక్యతలకు ముడిపెడుతున్నాడు: “ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును . . . దేవుడు ఆయనను [యేసును] అధికముగా హెచ్చించి, ప్రతినామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”—ఫిలిప్పీయులు 2:9, 10.

8. వ్రాయబడిన నామము యేసుకు మాత్రమే ఎందుకు తెలుసు, ఆయన తనకున్న కొన్ని గొప్ప ఆధిక్యతలను ఎవరితో పంచుకుంటాడు?

8 యేసు ఆధిక్యతలు అసమానములు. అటువంటి ఉన్నత స్థానం కల్గివుండడమంటే ఏమిటో యెహోవాతోపాటు యేసు మాత్రమే అర్థం చేసుకోగలడు. (మత్తయి 11:27 పోల్చండి.) అందుచేత, దేవుని సృష్టియంతటిలో, యేసు మాత్రమే యీ నామాన్ని పూర్తిగా గుణగ్రహించగలడు. అయిననూ, యేసు యీ ఆధిక్యతలలో కొన్నింటిని తన పెండ్లికుమార్తెకు పంచివ్వగలడు: అందుకే ఆయన యీ వాగ్దానం చేస్తున్నాడు: ‘జయించువానికి . . . నా క్రొత్తపేరును వానిమీద వ్రాసెదను.’—ప్రకటన 3:12.

9. (ఎ) యేసు “రక్తములో ముంచబడిన వస్త్రమును ధరించుకొని యుండెను” అంటే ఏమిటి? (బి) “దేవుని వాక్యము” అనే నామముతో పిలువబడడం దేన్ని సూచిస్తుంది?

9 యోహాను యింకా యిలా చెబుతున్నాడు: “రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.” (ప్రకటన 19:13) ఇదెవరి రక్తం? మానవాళి నిమిత్తం అర్పించబడిన యేసు ప్రాణరక్తమై వుంటుంది. (ప్రకటన 1:5) అయితే యీ సందర్భంలో, అది బహుశ యెహోవా తీర్పులు తీర్చినప్పుడు చిందిన యేసు శత్రువుల రక్తాన్ని సూచిస్తుండవచ్చును. ముందివ్వబడిన దర్శనంలో దేవుని కోపముతోకూడిన ఉగ్రతయను ద్రాక్షతొట్టిలో భూమిలోని ద్రాక్షలను తొక్కినట్లు, అప్పుడా రక్తం “గుఱ్ఱముల కళ్లెముమట్టుకు” ప్రవహించింది—అంటే దేవుని శత్రువులపై ఘనవిజయం సాధించినట్లు సూచిస్తున్నట్లు మనకు తెల్పబడింది. (ప్రకటన 14:18-20) అదే విధంగా, యేసు పైవస్త్రంమీద చిందినరక్తం ఆయన తీర్మానపూర్వక, సంపూర్ణ విజయాన్ని స్థిరపరుస్తుంది. (యెషయా 63:1-6 పోల్చండి.) యేసు ఒక పేరుతో పిలువబడుతున్నట్లు యోహానిప్పుడు మరల చెబుతున్నాడు. ఈసారి అది బాగా తెలిసిన నామమే—“దేవుని వాక్యము”—యీ యుద్ధశూరుడు యెహోవా ముఖ్యప్రతినిధి, సత్యానికి విజేతయని గుర్తిస్తుంది.—యోహాను 1:1; ప్రకటన 1:1.

యేసు తోటి యుద్ధశూరులు

10, 11. (ఎ) యుద్ధంలో యేసు ఒంటరిగా లేడని యోహాను ఎలా చూపిస్తున్నాడు? (బి) గుఱ్ఱాలు తెల్లగా ఉండడం, రౌతులు “శుభ్రమైన తెల్లని సన్ననినారపు” దుస్తులు ధరించుకోవడం దేన్ని సూచిస్తుంది? (సి) పరలోక “సైన్యము”లో ఎవరు చేరియున్నారు?

10 యేసు మాత్రమే యీ యుద్ధం చేయడంలేదు. యోహాను మనకిలా తెల్పుతున్నాడు: “పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.” (ప్రకటన 19:14) గుఱ్ఱాలు “తెల్లని”వి అంటే అది నీతియుక్తమైన యుద్ధాన్ని సూచిస్తుంది. “నారబట్టలు” రాజు యొక్క రౌతులకు తగినవే, వాటి మెరుపు, శుభ్రమైన తెలుపు యెహోవా ఎదుట నిర్మలంగా, నీతిగా ఉన్నారనే దాన్ని సూచిస్తుంది. మరైతే యీ “సేనలు” ఎవరు? నిస్సందేహంగా, వారిలో పరిశుద్ధ దూతలును చేరియున్నారు. ప్రభువు దినపు తొలిభాగంలోనే మిఖాయేలు అతని దూతలు సాతానును అతని దయ్యాలను పరలోకంనుండి పడద్రోశారు. (ప్రకటన 12:7-9) అంతేగాక, యేసు తన మహిమగల సింహాసనంపై కూర్చొని జనములకు భూమ్మీదనున్న ప్రజలకు తీర్పుతీర్చేటప్పుడు “దూతలందరూ” ఆయనతోపాటు వుంటారు. (మత్తయి 25:31, 32) నిశ్చయంగా, తీర్మానపూర్వక యుద్ధంలో దేవుని తీర్పులు పూర్తిగా జరిగినప్పుడు యేసు మరల తన దూతలతోపాటు వస్తాడు.

11 ఇతరులు కూడ యిందులో భాగంవహిస్తారు. తుయతైర సంఘానికి తన వర్తమానాన్ని పంపిస్తూ, యేసు యిలా వాగ్దానం చేశాడు. “నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు.” (ప్రకటన 2:26, 27) సమయం వచ్చినప్పుడు నిశ్చయంగా, యిప్పటికే పరలోకములో ఉన్న క్రీస్తు సహోదరులు ఆ యినుప దండంతో ప్రజలను జనాంగములను కాయడంలో భాగం కల్గివుంటారు.

12. (ఎ) భూమ్మీదనున్న దేవుని సేవకులు అర్మగిద్దోను యుద్ధంలో పాల్గొంటారా? (బి) భూమ్మీదనున్న యెహోవా ప్రజలు అర్మగిద్దోనులో ఎలా యిమిడియున్నారు?

12 అలాగైతే, భూమ్మీదనున్న దేవుని సేవకుల సంగతేమిటి? యోహాను తరగతికి చెందినవారు అర్మగిద్దోను యుద్ధంలో పాల్గొనరు; యెహోవా ఆత్మీయ ఆరాధనలోనికి సమస్త జనములనుండి గుంపులుగా వస్తున్న వారి నమ్మకమైన సహవాసులకును అందులో భాగముండదు. శాంతియుతులైన యీ ప్రజలు యిప్పటికే ఖడ్గాలను నాగటినక్కులుగా సాగగొట్టారు. (యెషయా 2:2-4) అయిననూ, వారెంతో యిమిడియున్నారు. మనం ముందే గమనించినట్లు, నిరాధారులవలె కనబడుతున్న యెహోవా ప్రజలను గోగు అతని అనుచర బృందం భయంకరంగా ముట్టడిస్తారు. పరలోకసైన్యపు మద్దతుతో యెహోవా యుద్ధశూరుడగు రాజు ఆ రాజ్యాలను నిర్మూలించే యుద్ధాన్ని ప్రారంభించడానికి అదే గుర్తు. (యెహెజ్కేలు 39:6, 7, 11; దానియేలు 11:44–12:1 పోల్చండి.) ప్రేక్షకులుగా, భూమ్మీదనున్న దేవుని ప్రజలీవిషయంలో అత్యంత శ్రద్ధను కల్గియున్నారు. అర్మగిద్దోనంటే వారికి రక్షణయని అర్థం, మరి యెహోవాకు మహిమనుతెచ్చే ఆ మహా యుద్ధానికి ప్రత్యక్షసాక్షులై వారు నిరంతరం జీవిస్తారు.

13. యెహోవాసాక్షులు అన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకులుకారని మనకెలా తెలుసు?

13 యెహోవాసాక్షులు అన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకులని దీనర్థమా? కానేకాదు! వారు అపొస్తలుడైన పౌలు సలహాకు విధేయులౌతారు: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను.” ప్రస్తుత విధానం కొనసాగినంత కాలం మానవ సమాజంలో కొంతమేరకు క్రమపద్ధతి ఉండడానికి యెహోవా అనుమతివల్ల అవి కొనసాగుతున్నాయని వారు గుర్తిస్తారు. అందుకే యెహోవాసాక్షులు పన్నులు చెల్లిస్తూ, చట్టాలకు విధేయులై, ట్రాఫిక్‌ నిబంధనలను గౌరవిస్తూ, రిజిస్ట్రేషన్‌ తదితరమైన వాటిని చేస్తున్నారు. (రోమీయులు 13:1, 6, 7) ఇంకనూ, వారు సత్యంగా యథార్థంగా ఉండడంలోను; ఇరుగుపొరుగువారిని ప్రేమించడంలోను; బలమైన నైతిక కుటుంబాన్ని తయారు చేయడంలోను; తమ పిల్లలకు మాదిరికరమైన పౌరులుగా శిక్షణనివ్వడంలోను బైబిలు సూత్రాలను పాటిస్తారు. ఈ విధంగా వారు “కైసరువి కైసరుకును దేవునివి దేవునికి” చెల్లిస్తారు. (లూకా 20:25; 1 పేతురు 2:13-17) ఈ లోక ప్రభుత్వాధికారాలు తాత్కాలికమేనని దేవుని వాక్యం చెబుతున్నందున, క్రీస్తురాజ్యపాలన క్రింద త్వరలో సంపూర్ణజీవాన్ని, వాస్తవజీవాన్ని పొందడానికి యెహోవాసాక్షులు యిప్పుడు సంసిద్ధులౌతున్నారు. (1 తిమోతి 6:17-19) ఈ లోక అధికారాలను కూలద్రోయడంలో వారికెటువంటి భాగం లేకపోయిననూ, అర్మగిద్దోనులో యెహోవా తీర్చనైయున్న తీర్పునుగూర్చి దేవుని ప్రేరేపిత వాక్యం, పరిశుద్ధ గ్రంథమగు బైబిలు తెల్పే విషయం యెడల సాక్షులు భక్తిపూర్వకమైన విస్మయాన్ని వెలిబుచ్చుతారు.—యెషయా 26:20, 21; హెబ్రీయులు 12:28, 29.

అంతిమ పోరాటానికి!

14. యేసు నోటనుండి వచ్చే “వాడిగల ఖడ్గము” దేన్ని సూచిస్తుంది?

14 యేసు ఏ అధికారంతో తన విజయాన్ని పూర్తిచేస్తాడు? యోహాను మనకిలా చెబుతున్నాడు: “జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును.” (ప్రకటన 19:15ఎ) ఆ వాడిగల ఖడ్గము, దేవుని రాజ్యానికి మద్దతు నివ్వకుండా వ్యతిరేకించే వారందరిని వధించేలా ఆజ్ఞలు జారీచేయడానికి దేవుడు యేసుకిచ్చిన అధికారాన్ని సూచిస్తుంది. (ప్రకటన 1:16; 2:16) ఈ వివరణాత్మక అలంకారరూపం యెషయా మాటలకు సమాంతరంగా ఉన్నది: “నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన [యెహోవా] చేసియున్నాడు. తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి”యున్నాడు. (యెషయా 49:2) ఇక్కడ యెషయా, గురితప్పని అంబులా అమలుపర్చే దేవుని తీర్పులను ప్రకటించి, వాటిని తీర్చే యేసును సూచిస్తున్నాడు.

15. ఈ సమయంలో, ఏది ఆరంభమైందని గుర్తించడానికి ఎవరు యిప్పటికే బయల్పర్చబడ్డారు, తీర్పుతీర్చబడ్డారు?

15 ఈ సమయానికల్లా, యేసు పౌలు మాటల నెరవేర్పు ప్రకారం చర్యగైకొనేవుంటాడు: “అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.” అవును ధర్మవిరోధిని అంటే క్రైస్తవమత సామ్రాజ్యాన్ని బయల్పరచి, తీర్పుతీర్చడంద్వారా, 1914నుండి యేసు ప్రత్యక్షత (గ్రీకులో పరౌసియా) ప్రస్ఫుటపర్చబడుతోంది. ఆ ప్రత్యక్షత, ఎఱ్ఱని క్రూరమృగముయొక్క పదికొమ్ములు మహాబబులోను లోని మిగతావాటితోపాటు క్రైస్తవమత సామ్రాజ్యానికి తీర్పుతీర్చి సర్వనాశనం చేసినప్పుడు ఆ ప్రత్యక్షత మరింత తేటగా కనపర్చబడుతుంది. (2 థెస్సలొనీకయులు 2:1-3, 8) అదే మహాశ్రమలకు ఆరంభం! దానితర్వాత, యీ ప్రవచనం ప్రకారం యేసు సాతాను సంస్థలో మిగిలిన వాటివైపు తన అవధానాన్ని మళ్లిస్తాడు: “తన వాగ్దండముచేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును.”—యెషయా 11:4.

16. యెహోవా నియమించిన యుద్ధశూరుడగు రాజు నిర్వహించే పాత్రనుగూర్చి కీర్తనలు, యిర్మీయా ఎలా వర్ణిస్తున్నాయి?

16 యుద్ధశూరుడగు రాజు, యెహోవా నియమిత వ్యక్తిగా, తప్పించుకునే వారెవరో నాశనమయ్యే వారెవరో తీర్మానిస్తాడు. యెహోవా యీ దైవకుమారునితో ప్రవచనార్థకంగా మాట్లాడుతూ యిలా చెబుతున్నాడు: “ఇనుప దండముతో నీవు వారిని [భూపాలకులను] నలుగ గొట్టెదవు. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు.” మరి యిర్మీయా అటువంటి భ్రష్ట ప్రభుత్వ నాయకులను, వారి సేవకులను సంబోధిస్తూ యిలా చెబుతున్నాడు: “మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణము నొందుటకై దినములు పూర్తియాయెను. నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రలవలె మీరు పడుదురు.” ఆ పరిపాలకులు దుష్టలోకానికెంత రమ్యంగా కనబడినా, ఒక రమ్యమైన పాత్రను కొట్టినట్లు, రాజ దండం ఒక్క దెబ్బతో వారిని చెదరగొడుతుంది. అది ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి దావీదు ప్రవచించినట్లే ఉన్నది: “యెహోవా నీ పరిపాలనా దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.”—కీర్తన 2:9, 12; 83:17, 18; 110:1, 2, 5, 6; యిర్మీయా 25:34.

17. (ఎ) యుద్ధశూరుడగు రాజు చేసే నాశన చర్యనుగూర్చి యోహాను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) దేవుని ఉగ్రత దినం జనాంగములకు ఎంత విపత్కరంగా ఉంటుందో చూపించే కొన్ని ప్రవచనాలను తెల్పండి.

17 ఈ మహాగొప్ప యుద్ధశూరుడగు రాజు దర్శనంలోని తర్వాతి దృశ్యములో మరల కనబడతాడు: “ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.” (ప్రకటన 19:15బి) ముందివ్వబడిన దర్శనంలో “దేవుని ఉగ్రతయను ద్రాక్షతొట్టిని” త్రొక్కుటను యోహాను అప్పటికే చూశాడు. (ప్రకటన 14:18-20) యెషయా కూడ నాశనమనే ద్రాక్షతొట్టి తొక్కబడే విషయాన్ని వర్ణిస్తున్నాడు, మరియు జనములన్నింటికి దేవుని ఉగ్రత దినమెంత విపత్కరంగా ఉంటుందో యితర ప్రవక్తలుకూడ చెబుతున్నారు.—యెషయా 24:1-6; 63:1-4; యిర్మీయా 25:30-33; దానియేలు 2:44; జెఫన్యా 3:8; జెకర్యా 14:3, 12, 13; ప్రకటన 6:15-17.

18. యెహోవా జనాంగములకు తీర్పుతీర్చే విషయాన్నిగూర్చి యోవేలు ప్రవక్త ఏమని తెల్పుచున్నాడు?

18 యోవేలు ప్రవక్త ద్రాక్షాతొట్టిని, “నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్పుటకై” యెహోవా వస్తున్నాడనే దానికి ముడిపెడుతున్నాడు. మరి యెహోవాయే నిశ్చయంగా తన సహ న్యాయాధిపతి యేసుకు ఆయన పరలోక సైన్యాలకు యిలా ఆజ్ఞ జారీచేస్తాడు: “పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయెను, మీరు దిగి రండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చేయున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి. నక్షత్రములు కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులోనుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అన్యులికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనై యెహోవాను నేనే, . . . నని మీరు తెలిసికొందురు.”—యోవేలు 3:12-17.

19. (ఎ) ఎలా 1 పేతురు 4:17 నందు వేయబడిన ప్రశ్నకు సమాధాన మీయబడుతుంది? (బి) యేసు వస్త్రంపై ఏ నామం వ్రాయబడింది, అదెందుకు యుక్తమని రుజువైంది?

19 అది అవిధేయులైన జనాంగములకు మానవులకు నిజంగా నాశనదినమే కాని యెహోవాను, ఆయన యుద్ధశూరుడగు రాజును ఆశ్రయముగా చేసుకున్నవారికి అది విడుదలరోజు! (2 థెస్సలొనీకయులు 1:6-9) దేవుని గృహముతో 1918 లో ఆరంభమైన ఆ తీర్పు, “దేవుని సువార్తకు లోబడనివారి గతి యేమవును” అనే 1 పేతురు 4:17నందలి ప్రశ్నకు ప్రత్యుత్తరమిస్తూ ముగింపుకు చేరుకుంటుంది. ఆ మహిమగల విజేత ద్రాక్షతొట్టిని పూర్తిగా తొక్కుతాడు, ఉన్నతస్థానం పొందినవాడని యోహాను చెబుతున్న వ్యక్తి తానేనని ఆయన ప్రదర్శిస్తాడు: “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది.” (ప్రకటన 19:16) ఆయన భూపాలకునికన్నా, మానవరాజు లేక ప్రభువుకన్నా ఎంతో ఎంతో గొప్పవాడని నిరూపించుకున్నాడు. ఆయన హోదా, వైభవం మహోన్నతమైనది. ఆయన “సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు” బయలుదేరాడు, శాశ్వత విజయాన్ని సాధించాడు. (కీర్తన 45:4) తానెవరికి నిరూపణ కర్తయైయున్నాడో ఆ సర్వాధిపతి, ప్రభువగు యెహోవా అనుగ్రహించిన నామము ఆయన రక్తముతోనిండిన వస్త్రములమీద వ్రాయబడి యున్నది.

దేవుని గొప్ప విందు

20. యోహాను “దేవుని గొప్ప విందు”ను గూర్చి ఎలా వర్ణిస్తున్నాడు, ముందివ్వబడిన ఇటువంటి ఏ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు?

20 యెహెజ్కేలు దర్శనంలో గోగు సైన్యం నాశనమైన తర్వాత పక్షులు క్రూరజంతువులు విందుకు ఆహ్వానించబడతాయి! అవి యెహోవా విరోధుల కళేబరాలను తిని ఆ ప్రదేశాన్ని శుభ్రంచేశాయి. (యెహెజ్కేలు 39:11, 17-20) యోహాను చెప్పే తదుపరి మాటలు ముందివ్వబడిన ఆ దర్శనాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తాయి: “మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి—రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్టుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.”—ప్రకటన 19:17, 18.

21. (ఎ) దూత “సూర్యబింబంలో నిలిచియుండుట” (బి) మృతులు అలాగే నేలమీద పడియుంటారనే వాస్తవం (సి) నేలపైనే విడిచిపెట్టబడే వారి శవాల జాబితా (డి) ‘దేవుని గొప్ప విందు’ అనేమాట దేన్ని సూచిస్తున్నాయి?

21 దూత “సూర్యబింబములో” నిలుచున్నాడు, పక్షులను ఆహ్వానించడానికది అనువైన స్థానం. యుద్ధశూరుడు ఆయన పరలోక సైన్యం హతమార్చనైయున్న వారి మాంసాన్ని భక్షించడానికి సిద్ధంగా ఉండండని వాటిని ఆహ్వానిస్తున్నాడు. మృతులు నేలమీద విడిచివేయబడతారనే వాస్తవం, వారు అవమానకరమైన చావు చస్తారని తెల్పుతుంది. ప్రాచీన కాలంలో యెజెబెలు మాదిరే వారు ఘనంగా పాతిపెట్టబడరు. (2 రాజులు 9:36, 37) అక్కడ విడిచిపెట్టబడే వారి శవముల జాబితా ఆ నాశనం ఎంత విస్తారంగా ఉంటుందో చూపిస్తుంది: అందులో రాజులు, సహస్రాధిపతులు, బలిష్టులు, స్వతంత్రులు, దాసులు ఉన్నారు. మినహాయింపేమీ లేదు. తిరుగుబాటు ప్రపంచంలో యెహోవాకు విరోధంగానున్న ప్రతిఒక్కటి లేకుండా నిర్మూలించ బడుతుంది. దీని తర్వాత గందరగోళంతో కూడిన మానవసమాజం అనబడే నిమ్మళించని సముద్రమిక ఉండదు. (ప్రకటన 21:1) యెహోవాయే పక్షులను తినడానికి ఆహ్వానిస్తున్నందున యిది “దేవుని గొప్ప విందే.”

22. యోహాను చివరి యుద్ధాన్ని ఎలా క్లుప్తంగా వర్ణిస్తున్నాడు?

22 యోహాను అంతిమ యుద్ధాన్నిగూర్చి క్లుప్తంగా యిలా చెబుతున్నాడు: “మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచకక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.”—ప్రకటన 19:19-21.

23. (ఎ) “సర్వాధికారియైన దేవుని మహా దినమున జరుగు యుద్ధం” ఏ భావంలో “అర్మగిద్దోను”నందు జరుగుతుంది? (బి) “భూరాజులు” ఏ హెచ్చరికను అలక్ష్యం చేశారు, దాని ఫలితమేమిటి?

23 యెహోవా కోపంతోనిండిన ఆరవ పాత్రను కుమ్మరించినప్పుడు, “లోకమందంతటనున్న రాజులు” దయ్యాల ప్రచారంద్వారా “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు” పోగు చేయబడ్డారని యోహాను తెల్పాడు. ఇది అర్మగిద్దోనులో జరిగే యుద్ధం—అయితే యిదొక అక్షరార్థమైన స్థలమేమీ కాదు గానీ యెహోవా తీర్పును తీర్చడానికి ఒక భూవ్యాప్త పరిస్థితై ఉన్నది. (ప్రకటన 16:12, 14, 16) యోహానిప్పుడు యుద్ధపంక్తులను చూస్తున్నాడు. అక్కడ, “లోకమందంతటనున్న రాజులందరు” దేవునికి విరోధముగా బారులు తీరియున్నారు. వారంతా యెహోవా యొక్క రాజుకు లోబడకుండా మొండిగా తిరస్కరించారు. ఆయన వారికి ప్రేరేపిత వర్తమానంలో యిలా మంచి హెచ్చరిక చేశాడు: “కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన [యెహోవా] కోపించును. అప్పుడు మీరు త్రోవతప్పి నశించెదరు.” క్రీస్తు పరిపాలనకు లోబడనందుకు వారు మరణించవలసిందే.—కీర్తన 2:12.

24. (ఎ) క్రూరమృగానికి, అబద్ధప్రవక్తకు ఏ తీర్పు తీర్చబడింది, అవి ఏ భావంలో యింకనూ “ప్రాణముతోనే” ఉన్నాయి? (బి) “అగ్నిగుండము” ఎందుకు సాదృశ్యమైనదై యున్నది?

24 సాతాను సంస్థను సూచిస్తూ సముద్రమునుండి వచ్చిన ఏడుతలలు పదికొమ్ములుగల క్రూరమృగము మరువబడుతుంది, దానితోపాటు అబద్ధప్రవక్తయగు ఏడవప్రపంచ ఆధిపత్యానికి అదే గతిపడుతుంది. (ప్రకటన 13:1, 11-13; 16:13) భూమ్మీద దేవుని ప్రజలకు విరోధంగా యింకనూ ఐక్యంగా పనిచేస్తూ లేక “బ్రతికి”వుంటూనే, వారు “అగ్నిగుండములో” పడవేయబడతారు. ఇది నిజమైన అగ్నిగుండమా? కాదు, క్రూరమృగము, అబద్ధప్రవక్త ఎలా నిజమైన జంతువులుకావో ఇదికూడ అంతే. అయితే అది తిరిగి రానటువంటి, చివరి, పూర్తి నాశనాన్ని సూచిస్తుంది. తర్వాత యిక్కడే మరణం, మృతులలోకం, (హేడీస్‌ NW) అలాగే అపవాదియు త్రోయబడతారు. (ప్రకటన 20:10, 14) అది నిశ్చయంగా దుష్టులను నిత్యం బాధించే నరకలోకంకాదు, ఎందుకంటే అటువంటి స్థలమును గూర్చిన తలంపంటేనే యెహోవాకు అసహ్యము.—యిర్మీయా 19:5; 32:35; 1 యోహాను 4:8, 16.

25. (ఎ) “గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిన” వారెవరు? (బి) “వధింపబడిన” వారెవరైనా పునరుత్థానులౌతారని మనం నిరీక్షించవలెనా?

25 ప్రభుత్వంలో నేరుగా భాగస్థులుకాకుండా, యీ దుష్టమానవ లోకంలో మార్పుచెందని భాగమైన మిగతావారంతా అలాగే “గుఱ్ఱముమీద కూర్చున్నవాని నోటనుండి వచ్చిన వాడిగల ఖడ్గముచేత చంపబడిరి.” వారు మరణానికి అర్హులని యేసు ప్రకటిస్తాడు. వారి విషయంలో అగ్నిగుండంయొక్క ప్రస్తావన రాలేదు గనుక, వారికి పునరుత్థాన ముంటుందని మనమనుకోవాలా? ఆ కాలంలో యెహోవా యొక్క న్యాయాధిపతిచేత హతులైనవారు పునరుత్థానులౌతారని మనకెక్కడా చెప్పబడలేదు. యేసు తెల్పినట్లు, “గొఱ్ఱెలు” కానటువంటి వారంతా “అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి” అనగా “నిత్యనాశనమునకు” పోతారు. (మత్తయి 25:33, 41, 46) “భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము”నకు యిదే ముగింపు.—2 పేతురు 3:7; నహూము 1:2, 7-9; మలాకీ 4:1.

26. అర్మగిద్దోను ఫలితాన్నిగూర్చి క్లుప్తంగా తెల్పండి?

26 ఈ విధంగా, సాతాను భూసంబంధమైన సంస్థ అంతా అంతమౌతుంది. “మొదటి ఆకాశము” అనే రాజకీయ పరిపాలన గతించిపోతుంది. శాశ్వత విధానమన్నట్లు కనబడేలా, అనేక శతాబ్దాలనుండి సాతాను కట్టిన “భూమి” యిప్పుడు సమూల నాశనమైంది. యెహోవాను వ్యతిరేకించే “సముద్రము” అనే దుష్టమానవజాతి యికలేదు. (ప్రకటన 21:1; 2 పేతురు 3:10) మరైతే యెహోవా సాతాను కొరకేమి భద్రపర్చియున్నాడు? యోహాను మనకింకా చెబుతున్నాడు.

[అధ్యయన ప్రశ్నలు]