కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రెండవ శ్రమ—గుఱ్ఱపురౌతుల సైన్యములు

రెండవ శ్రమ—గుఱ్ఱపురౌతుల సైన్యములు

అధ్యాయం 23

రెండవ శ్రమ—గుఱ్ఱపురౌతుల సైన్యములు

1. మతగురువులు మిడతలను మట్టుపెట్టాలని ప్రయత్నించిననూ, ఏమి జరిగింది, మరియు రానైయున్న యింకా రెండు శ్రమలు దేనిని సూచిస్తాయి?

సాదృశ్యమైన మిడతలు, 1919నుండి క్రైస్తవమత సామ్రాజ్యంపై చేసేదాడి మతగురువులకు చాలా అసౌకర్యం కల్గించింది. వారు మిడతలను తొక్కివేయాలని ప్రయత్నించారు, గాని యివి మొదటివాటికన్నా యింకా బలంగా తయారౌతున్నాయి. (ప్రకటన 9:7) మరి అంతమాత్రమే కాదు. యోహాను యిలా వ్రాస్తున్నాడు: “మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండుశ్రమలు ఇటుతరువాత వచ్చును.” (ప్రకటన 9:12) క్రైస్తవమత సామ్రాజ్యం కొరకు బాధాకరమైన తెగుళ్లు యింకను వేచి ఉన్నాయి.

2. (ఎ) ఆరవదూత తన బూరను ఊదినప్పుడు ఏమౌతుంది? (బి) ‘సువర్ణ బలిపీఠమునుండి యొక స్వరము’ దేనిని సూచిస్తుంది? (సి) ఎందుకు నలుగురు దూతలు అని చెప్పబడింది?

2 రెండవ శ్రమకు మూలమేమిటి? యోహాను యిలా వ్రాస్తున్నాడు: “ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము—యూఫ్రటీసు అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొనియున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని.” (ప్రకటన 9:1314) సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ములనుండి వస్తున్న శబ్దానికి జవాబుగానే దూతలను విడుదల చేయడం జరుగుతుంది. ఇది సువర్ణ ధూపబలిపీఠం, మరి ఇంతకుమునుపు రెండుసార్లు, యీ బలిపీఠంలోని సువర్ణ పాత్రలనుండి వచ్చిన ధూపం పరిశుద్ధుల ప్రార్థనలకు సంబంధించి యున్నది. (ప్రకటన 5:8; 8:3, 4) గనుక, యీ శబ్దం భూలోకంలోని పరిశుద్ధులు ఐక్యంగా చేసే ప్రార్థనలను సూచిస్తుంది. తాము యెహోవా “వార్తాహరులుగా” యింకా శక్తివంతమైన సేవచేయడానికి వారిని విడుదల చేయాలన్నట్లు వారర్థిస్తున్నారు. “దూతలు” అని అనువదించబడిన గ్రీకు పదంయొక్క మూలభావమిదే. అక్కడ నలుగురు దూతలెందుకున్నారు? భూమిని సంపూర్తిగా చుట్టివచ్చే దృష్టితో వారంతగా సంస్థీకరించబడ్డారని యీ సాదృశ్యమైన సంఖ్య సూచిస్తున్నట్లుంది.—ప్రకటన 7:1; 20:8 పోల్చండి.

3. నలుగురు దూతలు ఎలా “యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడ్డారు”?

3 ఆ దూతలెలా “యూఫ్రటీసు అను మహానది యొద్ద” బంధింపబడ్డారు? ప్రాచీనకాలంలో యూఫ్రటీసు నది యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేశానికి ఈశాన్యదిశలో ఉండేది. (ఆదికాండము 15:18; ద్వితీయోపదేశకాండము 11:24) వాస్తవానికి, దూతలు దేవుడు వారికిచ్చిన ప్రాంతానికే లేక భూసంబంధమైన కార్యం యొక్క హద్దులోనే ఉంచబడ్డారు, యెహోవా వారికొరకు సిద్ధపరచియుంచిన సేవలో పూర్తిగా ప్రవేశించకుండ ఆపివేయబడ్డారు. యూఫ్రటీసు ప్రాముఖ్యంగా బబులోను పట్టణానికి కూడ సంబంధం కల్గివుంది, సా.శ.పూ 607 లో యెరూషలేము ముట్టడించబడిన తర్వాత శరీరసంబంధులైన ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు అక్కడ “యూఫ్రటీసు అను మహానది యొద్ద” బంధింపబడిరి. (కీర్తన 137:1) ఆత్మీయ ఇశ్రాయేలీయులు కూడ 1919 లో అదే పద్ధతిలో బంధింపబడి ఉండి, ఖిన్నులై నడిపింపుకొరకు యెహోవాను వేడుకొను చుండిరి.

4. ఆ నలుగురు దూతలకు ఏపని అప్పగింపబడింది, దాన్నెలా నెరవేర్చాయి?

4 యోహాను యిలా నివేదించగల్గుట, సంతోషకరమే: “మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి.” (ప్రకటన 9:15) యెహోవా కచ్చితమైన సయమాన్ని పాటిస్తాడు. ఆయన దగ్గర కాలనిర్ణయ పట్టిక ఉంది, ఆయన దాన్ని పాటిస్తున్నాడు. కాబట్టి, యీ వార్తాహరులు తాము చేయవలసిన పనిని నెరవేర్చడానికి కచ్చితంగా ఆ సమయానికి, కాలనిర్ణయపట్టిక ప్రకారం విడుదల చేయబడుతున్నారు. వారు 1919 లో విడుదలై వచ్చినప్పుడు, సేవనిమిత్తం సిద్ధపడుతూ, వారెంత ఆనందించారో ఊహించండి! బాధించడమేగాక వారు “మనుష్యులలో మూడవ భాగమును సంహరించు” అధికారాన్ని కూడ కల్గియున్నారు. ఇది మొదటి నాలుగు బూరలు పంపిన తెగుళ్లకు సంబంధం కల్గివుంది, వాటివలన భూమిలోని మూడవభాగము, సముద్రము, సముద్రములోని జీవరాసులు నదులు నీటిబుగ్గలు, మరియు ఆకాశమందలి జ్యోతులు దెబ్బతిన్నాయి. (ప్రకటన 8:7-12) ఆ నలుగురు దూతలు యింకా ముందుకెళ్తారు. వారు “చంపుతారు,” అంటే క్రైస్తవమత సామ్రాజ్యపు ఆత్మీయ మరణకరమైన స్థితిని పూర్తిగా బయలుపరుస్తారు. బూరల ప్రకటనలు, 1922నుండి యిప్పటివరకు చేయబడుతున్న ప్రకటనలు దీనిని నెరవేర్చాయి.

5. క్రైస్తవమత సామ్రాజ్య విషయంలో, ఆరవబూర శబ్దమెలా 1927 లో మారుమ్రోగింది?

5 జ్ఞాపకముంచుకొనండి, పరలోకదూత యిప్పుడే ఆరవబూరను ఊదాడు. దానికి స్పందిస్తూ, బైబిలు విద్యార్థుల వార్షిక అంతర్జాతీయ సమావేశాలలో ఆరవది కెనడాలోని ఓంటోరియోనందలి టోరంటొలో జరిగింది. అక్కడ ఆదివారం, జూలై 24, 1927 లో జరిగిన కార్యక్రమాన్ని అప్పటికి అతిపెద్ద రేడియో నెట్‌వర్క్‌గల 53 రేడియో స్టేషన్లద్వారా ప్రసారం చేశారు. ప్రసంగరూపంలోని ఆ సమాచారం బహుశ కొన్ని లక్షలమంది వినియుండవచ్చును. మొదట, ప్రవేశపెట్టబడిన ఒక గట్టి తీర్మానం క్రైస్తవమతసామ్రాజ్యం ఆత్మీయంగా మృతమైయుందని బహిరంగపర్చింది, తదుపరి యిలాంటి ఆహ్వానమిచ్చింది: “ఈ గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు క్రైస్తవమత సామ్రాజ్యాన్ని, లేక ‘సంస్థీకరించబడిన క్రైస్తవత్వాన్ని’ వదలాలని, శాశ్వతంగా విడనాడి రావాలని, దానినుండి పూర్తిగా తెగతెంపులు చేసికోవాలని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు . . . ప్రజలు వారి హృదయపూర్వక ఆరాధనను భక్తిని యెహోవా దేవునికి ఆయన రాజుకు రాజ్యానికి యివ్వనివ్వండి.” అటుతర్వాత “ఫ్రీడమ్‌ ఫర్‌ ది పీపుల్స్‌” అనే బహిరంగ ప్రసంగం ఇవ్వబడింది. యోహాను ఆ పిదప దర్శనంలో చూస్తున్న “అగ్ని ధూమగంధకములకు” తగినట్లుగా వాచ్‌టవర్‌ సొసైటి అధ్యక్షుడు, జె.యఫ్‌.రూథర్‌ఫర్డ్‌, దీన్ని తనదైన గంభీర శైలిలో ప్రసంగించారు.

6. యోహాను తాను తదుపరి చూసే గుఱ్ఱపు రౌతుల సైన్యాలను ఎలా వర్ణిస్తున్నాడు?

6“గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువది కోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటిమీద కూర్చుండియున్న వారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరవులుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను. ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను.”—ప్రకటన 9:16-18.

7, 8. (ఎ) ఎవరి నడిపింపుక్రింద గుఱ్ఱపు రౌతుల సైన్యం కదం త్రొక్కుతుంది? (బి) గుఱ్ఱపు రౌతుల సైన్యం ఏయే విషయాల్లో ముందువచ్చిన మిడతలను పోలివుంది?

7 ఈ గుఱ్ఱపురౌతుల సైన్యం నలుగురు దూతల నడిపింపులో కదనరంగంలో కదంద్రొక్కుతుంది. ఎంతటి భయానక దృశ్యమోగదా! నీవు అటువంటి గుఱ్ఱపు డెక్కల దెబ్బలకు గురైతే నీ స్పందన ఎలావుంటుందో ఊహించుకో! ఆ సైన్యాన్ని చూస్తేనే నీ గుండెలవిసి పోతాయి. అయినా, దీనికి ముందువెళ్లిన మిడతలవలె యీ సైన్యం ఉండడం గమనించావా? మిడతలు గుఱ్ఱాల వలె ఉండెను; ఆ రౌతులసైన్యంలో గుఱ్ఱాలు ఉన్నాయి. ఇవి రెండును ఆత్మీయ యుద్ధంలో పాల్గొంటున్నవి. (సామెతలు 21:31) మిడతలకు సింహంవంటి పండ్లుండెను; ఆ సైన్యంలోని గుఱ్ఱాలకు సింహంవంటి తలలున్నాయి. గనుక, ఇవి రెండును వాటి నాయకుడు, సైన్యాధిపతి, మరియు మాదిరికర్తయగు ధైర్యశాలియు యూదా కొదమసింహమైన, యేసుక్రీస్తుతో ముడిపడివున్నాయి.—ప్రకటన 5:5; సామెతలు 28:1.

8 మిడతలు, గుఱ్ఱపురౌతుల సైన్యం యెహోవా తీర్పుపనిలో భాగం వహిస్తున్నాయి. పొగలోనుండి మిడతలు రావడం క్రైస్తవమత సామ్రాజ్యానికి శ్రమను నాశనాన్ని గుర్తిస్తున్నాయి; గుఱ్ఱాల నోళ్లలోనుండి అగ్ని, ధూమ గంధకములు బయలు వెళ్తాయి. వాటికి నీతివిషయంలో అనంతభక్తి వుందని సూచించే ఇనుప మైమరువులు మిడతలకు ఉండేవి; గుఱ్ఱపురౌతులు ఎరుపు, నీలము, పసుపు రంగులు అంటే గుఱ్ఱాలనోటనుండి వేగంగా వెలువడే అపాయకరమైన తీర్పు ప్రకటనలకు సంబంధించిన అగ్ని, ధూమ గంధకములను సూచించే మైమరువులను తొడుక్కొన్నారు. (ఆదికాండము 19:24, 28; లూకా 17:29, 30 పోల్చండి.) మిడతలకు తేళ్లవంటి బాధించే కొండ్లున్నాయి; గుఱ్ఱాలకు, చంపడానికి సర్పాలవంటి తోకలున్నాయి! మిడతలు ప్రారంభించిన దాన్ని గుఱ్ఱపురౌతుల సైన్యం సంపూర్తి చేయాలన్నట్లు కనబడుతోంది.

9. గుఱ్ఱపు రౌతుల సైన్యం దేన్ని సూచిస్తుంది?

9 గనుక, ఈ గుఱ్ఱపురౌతుల సైన్యం దేన్ని సూచిస్తుంది? అభిషక్తులైన యోహాను తరగతి క్రైస్తవమత సామ్రాజ్యంపై ‘అధికారంతో కుట్టి బాధకల్గించే దేవుని ప్రతీకార తీర్పునుగూర్చిన బూరవంటి ప్రకటనలు చేయడానికి ఆరంభించినట్లే, అదే జీవించే గుంపును “చంపుటకు” ఉపయోగిస్తాడని అంటే క్రైస్తవమత సామ్రాజ్యం దాని మతగురువులు ఆత్మీయంగా పూర్తిగా చనిపోయారని, యెహోవావల్ల తృణీకరించబడి, “అగ్నిగుండం” అనే నిత్యనాశనానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తారని మనంకూడ ఎదురుచూద్దాం. వాస్తవానికి, బబులోనంతా నిశ్చయంగా నాశనంకావాలి. (ప్రకటన 9:5, 10; 18:2, 8; మత్తయి 13:41-43) అయితే, దాని నాశనానికి ముందు క్రైస్తవ మత సామ్రాజ్యపు మరణకరమైన పరిస్థితిని బహిర్గతం చేయడంలో యోహాను తరగతి “దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును” ఉపయోగిస్తుంది. నలుగురు దూతలు, గుఱ్ఱపురౌతులు యీ మనుష్యులలో “మూడవభాగమును” అలంకార రూపంలో చంపడానికి నడిపింపు యిస్తున్నారు. (ఎఫెసీయులు 6:17; ప్రకటన 9:15, 18) ఈ మహాగొప్ప రాజ్యప్రచారకుల గుంపు యుద్ధానికి ముందుకు సాగేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆధ్వర్యంలో సరియైన సంస్థీకరణ, దైవిక నడిపింపు ఉండాలనే విషయాన్నిది చూపిస్తోంది.

ఇరవై కోట్లు

10. ఇరవైకోట్ల గుఱ్ఱపురౌతుల సైన్యం ఏ భావంలో ఉందని చెప్పవచ్చును?

10 ఈ సైన్యం ఎలా యిరవై కోట్లు (రెండు మిరియడ్ల మిరియడ్లు, NW.) అవుతుంది? ఒక మిరియడ్‌ అంటే అక్షరార్థంగా 10,000. గనుక రెండు మిరియడ్ల మిరియడ్లు అంటే 20 కోట్లవుతుంది. * సంతోషకరమైందేమంటే, యిప్పుడు రాజ్యప్రచారకులు లక్షలసంఖ్యలో ఉన్నారు, అయితే వారిసంఖ్య కోట్లతో పోలిస్తే బహుతక్కువ! గానీ సంఖ్యాకాండము 10:36 లోని మోషేమాటల్ని జ్ఞాపకముంచుకోండి: “యెహోవా, ఇశ్రాయేలు వేవేలమంది (లక్షలాది, NW.) యొద్దకు మరల రమ్ము.” (ఆదికాండము 24:60 పోల్చండి.) అనగా ‘లక్షలాదిగా ఉన్న ఇశ్రాయేలీయుల తట్టు తిరుగుము’ అని దాని అక్షరార్థభావం. అయినా, మోషే కాలంలో ఇశ్రాయేలీయులు 20-30 లక్షలమందే ఉంటారు. మరైతే మోషే దేనినిగూర్చి చెబుతున్నట్లు? అంటే ఇశ్రాయేలీయులు లెక్కించబడేదానికన్నా “ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీరపు యిసుకవలెను” అసంఖ్యాకములుగా ఉండాలని నిశ్చయంగా ఆయన మనస్సులో ఉండెను. (ఆదికాండము 22:17; 1 దినవృత్తాంతములు 27:23) గనుక ఆయన యీ మిరియడ్స్‌ అనే పదాన్ని అనిర్ధిష్ట సంఖ్యను సూచించడానికే ఉపయోగించాడు. అందుకే ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌ యీ వచనాన్నిలా అనువదించింది: “ప్రభువా, వేలాది అసంఖ్యాకులైన ఇశ్రాయేలీయుల దగ్గరికి దిగిరమ్ము,” ఇది, “మిరియడ్స్‌” అనే పదానికి గ్రీకు హెబ్రీ డిక్షనరీలలో యివ్వబడిన నిర్వచనానికి అంటే “అసంఖ్యాక సమూహం,” ఒక “సమూహం” అనే వాటికి సరిపోతుంది.—ది న్యూ థేయర్స్‌ గ్రీక్‌-ఇంగ్లీష్‌ లెక్సికన్‌ ఆఫ్‌ ది న్యూ టెస్టమెంట్‌; జీనియస్‌ రచించిన ఎ హీబ్రూ అండ్‌ ఇంగ్లీష్‌ లెక్సికన్‌ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్టమెంట్‌, ఎడ్వర్డ్‌ రాబిన్‌సన్‌ అనువదించింది.

11. యోహాను తరగతి అలంకారార్థంలోనైనా కోట్లసంఖ్యగా తయారుకావాలంటే ఏమి అవసరమై ఉంది?

11 అయిననూ, భూమ్మీద యింకను మిగిలియున్న యోహాను తరగతి సభ్యులు 10,000 కంటె తక్కువే— అక్షరార్థంగా ఒక మిరియడ్‌కన్నా తక్కువే. మరి వారెలా అసంఖ్యాకులైన గుఱ్ఱపురౌతుల సైన్యముతో పోల్చబడగలరు? సాదృశ్యమైన భావంలో మిరియడ్‌ కావాలన్నా, వాటికి అదనపు సైనిక బలగముల అవసరంలేదా? అదే వారికి అవసరమైంది, మరి యెహోవా కృపవల్ల వారికదే దొరికింది! ఇవెక్కడనుండి వచ్చాయి?

12, 13. అదనపు సైనికబలగము సరఫరా మూలమును గూర్చి 1918 నుండి 1935 వరకు జరిగిన ఏ చారిత్రాత్మక సంఘటనలు సూచించాయి?

12 యోహాను తరగతి 1918 నుండి 1922 వరకు “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది యిక ఎన్నటికీ మరణించరు” అనే ఆనందదాయక నిరీక్షణను దుర్దశలోనున్న మానవజాతికి బయల్పర్చింది. మరి 1923 లో మత్తయి 25:31-34 నందలి గొఱ్ఱెలు దేవునిరాజ్యం క్రిందవుండే భూమిపై నిత్యజీవాన్ని పొందుతారని కూడ ప్రకటించారు. అటువంటి నిరీక్షణే 1927 లో అంతర్జాతీయ సమావేశంలో విడుదలైన ఫ్రీడమ్‌ ఫర్‌ ది పీపుల్స్‌ అనే చిన్నపుస్తకంలో వెల్లడించబడింది. యథార్థపరులైన యెహోనాదాబు తరగతి మరియు క్రైస్తవమత సామ్రాజ్యపు ఆత్మీయ దుస్థితినిచూచి ‘ప్రలాపించు మనుష్యులు,’ భూనిరీక్షణగల సాదృశ్యమైన గొఱ్ఱెలని 1930వ దశాబ్దపు తొలిభాగంలో గుర్తించబడ్డారు. (యెహెజ్కేలు 9:4; 2 రాజులు 10:15, 16) అటువంటి వారిని ఆధునిక “ఆశ్రయపురములకు” ఆహ్వానిస్తూ, ది వాచ్‌టవర్‌ ఆగష్టు 15, 1934, యిలా తెల్పింది: “యెహోనాదాబు తరగతికి చెందినవారు దేవునిబూరను వినియున్నారు, దేవుని సంస్థలోనికి వచ్చి దేవుని ప్రజలతో సహవసిస్తూ, దానిని హత్తుకొనివుండాలనే హెచ్చరికను లక్ష్యపెట్టియున్నారు.”—సంఖ్యాకాండము 35:6.

13 ఆ యెహోనాదాబు తరగతి 1935 లో అమెరికాలోని వాషింగ్‌టన్‌ డి.సి. నందు జరిగిన యెహోవాసాక్షుల సమావేశానికి హాజరుకావాలని ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. అక్కడ, శుక్రవారం, మే 31, జె.ఎఫ్‌.రూథర్‌ఫర్డ్‌ “ది గ్రేట్‌ మల్టిట్యూడ్‌” అనే తన సుప్రసిద్ధ ప్రసంగాన్నిచ్చారు, అందులో ఆయన ప్రకటన 7:9 లోని యీ గుంపు మత్తయి 25:33 లోని గొఱ్ఱెల గుంపు—భూనిరీక్షణగల సమర్పితగుంపు ఒకటేనని స్పష్టంగా చూపించారు. రాబోవుదానికి గుర్తుగా, ఆ సమావేశంలో 840 మంది క్రొత్తసాక్షులు బాప్తిస్మం తీసుకున్నారు, వారిలో అనేకులు గొప్పసమూహానికి చెందినవారే. *

14. గుఱ్ఱపురౌతుల సైన్యపు దాడిలో గొప్పసమూహానికి భాగముండెనా, మరి 1963 లో ఏ తీర్మానము చేయబడింది?

14 ఈ గొప్పసమూహానికి, 1922 లో గుఱ్ఱపురౌతుల సైన్యపుదాడి ప్రారంభమై, 1927 లో టోరంటొ సమావేశంలో విశేష అవసరతను అందుకున్నదాడిలో భాగముండెనా? నలుగురు దూతల నడిపింపుక్రింద అభిషక్త యోహాను తరగతికి నిశ్చయంగా భాగముండెను! ప్రపంచాన్ని చుట్టివచ్చే “ఎవర్‌లాస్టింగ్‌ గుడ్‌న్యూస్‌” అనే 1963 అంతర్జాతీయ సమావేశంలో అది ఒక ఉత్తేజకరమైన తీర్మానాన్ని చేయడంలో యోహాను తరగతితో చేరింది. ఈ తీర్మానం తెల్పిందేమనగా, ప్రపంచం “దానికి ముందెన్నడు తెలియని భూకంపాన్ని ఎదుర్కొంటుంది. దాని రాజకీయ సంస్థలన్నీ, దాని ఆధునిక మతసంబంధమైన బబులోను ముక్కచెక్కలవుతాయి.” “మేము ప్రజలందరికి దేవుని మెస్సీయ రాజ్యాన్ని, ఆయన తీర్పులను అనగా ఆయన శత్రువుకు తెగుళ్లవలెను, సృష్టికర్తయైన దేవుని అంగీకారయోగ్యంగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి కోరుకునే వారందరికి విడుదలను అనుగ్రహించే ‘నిత్యసువార్తను’ నిష్పక్షపాతంగా ప్రకటిస్తాము” అని ఆ తీర్మానము తెల్పింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 24 సమావేశాలకు హాజరైన మొత్తం 4,54,977 సభికులు, వారిలో 95 శాతం గొప్పసమూహానికి సంబంధించినవారే, ఉత్సాహంగా యీ తీర్మానాన్ని స్వీకరించారు.

15. (ఎ) యెహోవా ఉపయోగించుకునే సేవాశక్తిలో 1988వ సంవత్సరంలో, గొప్పసమూహం ఎంత శాతముండెను? (బి) యేసు, యోహాను 17:20, 21 నందు చేసిన ప్రార్థన ఎలా గొప్పసమూహము యోహాను తరగతితో ఐకమత్యం కల్గియున్నారనే విషయాన్ని తెల్పుతుంది?

15 క్రైస్తవమత సామ్రాజ్యంమీద తెగుళ్లను కుమ్మరించడంలో యోహాను తరగతికి గొప్పసమూహం తమ సంపూర్ణ ఐక్యతను ప్రకటిస్తూనే ఉన్నారు. యెహోవా తన సేవలో ఉపయోగించుకుంటున్న వారిలో 1988 లో 99.7 శాతం ఈ గొప్పసమూహంవారే. దాని సభ్యులు హృదయపూర్వకంగా యోహాను తరగతితో సహకరిస్తున్నారు, వీరినిగూర్చి యేసు యోహాను 17:20, 21 నందున్నట్లు యిలా ప్రార్థించాడు: “నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమై యుండవలెనని వారికొరకు మాత్రము ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.” అభిషక్త యోహాను తరగతి యేసు నడిపింపు క్రింద మానవచరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన గుఱ్ఱపురౌతుల సైన్యపు దాడిని నిర్వహిస్తుండగా గొప్పసమూహము వారితో చేతులు కలుపుతుంది. *

16. (ఎ) సాదృశ్యమైన గుఱ్ఱాలకున్న నోళ్లు, తోకలనుగూర్చి యోహాను ఎలా వివరిస్తున్నాడు? (బి) యెహోవా ప్రజల నోళ్లు ఎలా సేవనిమిత్తం సిద్ధంగా ఉన్నాయి? (సి) వాటి “తోకలు పాములవలె ఉన్నాయి” అంటే అర్థమేమిటి?

16 ఆ సైన్యానికి యుద్ధాయుధాలు అవసరమే. మరి యెహోవా ఎంత అద్భుతంగా వాటిని సమకూర్చాడోగదా! యోహానిలా వివరిస్తున్నాడు: “ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హానిచేయును.” (ప్రకటన 9:19) యెహోవా తన సమర్పిత, బాప్తిస్మంపొందిన సేవకులను యీ పనికి నియమించాడు. దైవపరిపాలనా పాఠశాల, సంఘంలోని యితరకూటాలు, పాఠశాలల ద్వారా వారు “శిష్యునికి తగిన నోటి”తో అధికారపూర్వకంగా మాట్లాడేలా ఆయన వారికి వాక్యాన్ని ప్రకటించే పద్ధతిని బోధించాడు. ఆయన తన మాటలను వారినోటవుంచి, “బహిరంగముగాను యింటింటను” తన తీర్పులను ప్రకటించడానికి వారిని పంపించాడు. (2 తిమోతి 4:2; యెషయా 50:4; 61:2; యిర్మీయా 1:9, 10; అపొస్తలుల కార్యములు 20:20) యోహాను తరగతి, మరియు గొప్పసమూహము అనేకసంవత్సరాలుగా “తోకలవలె” ఉండి బాధించే వర్తమానములను అంటే కోట్లాది బైబిళ్లు, పుస్తకాలు, బ్రోషూర్లు, మరియు పత్రికలను, పంచిపెట్టారు. యెహోవానుండి “హాని” కలుగుతుందని హెచ్చరింపబడుతున్న వారి శత్రువులకు యీ సైన్యాలు నిజంగా రెండుకోట్ల సైన్యంవలె కనబడుతున్నారు.—యోవేలు 2:4-6 పోల్చండి.

17. సేవ నిషేధించబడి, సాహిత్యాలు పంచిపెట్టే అవకాశంలేని దేశాల్లో యెహోవాసాక్షులకు గుఱ్ఱపురౌతుల సైన్యపుదాడిలో ఏమైనా భాగముందా? వివరించండి.

17 ఈ సైన్యంలోని అత్యంత ఆసక్తిగల భాగం యెహోవాసాక్షుల సేవ నిషేధించబడియున్న దేశాలలోనున్న సహోదరుల బృందమే. తోడేళ్లమధ్యనున్న గొఱ్ఱెలవలె వీరు “పాములవలె వివేకులును, పావురములవలె నిష్కపటులునై” ఉండాలి. యెహోవాకు విధేయులుగా వారు వినినవాటిని చూచినవాటిని చెప్పకుండా ఉండలేరు. (మత్తయి 10:16; అపొస్తలుల కార్యములు 4:19, 20; 5:28, 29, 32) బహిరంగంగా పంచడానికి వారియొద్ద సాహిత్యాలు కొంచెంగా ఉండవచ్చు లేదా అసలే లేకపోవచ్చు, మరి అంతమాత్రాన వారికి గుఱ్ఱపురౌతుల సైన్యంలో భాగంలేదంటామా? అలా అననే అనం! బైబిలు సత్యాలు ప్రకటించడానికి యెహోవా వారికిచ్చిన నోళ్లు, అధికారం ఉన్నాయి. దీన్ని వారు తటస్థసాక్ష్యంద్వారాను, ఒప్పించడంద్వారాను చేస్తూ, బైబిలు పఠనాలు ఏర్పాటుచేస్తూ “అనేకులను నీతిమార్గమునకు త్రిప్పుతున్నారు.” (దానియేలు 12:3) గట్టిగా బాధించే సాహిత్యాలను పంచిపెట్టే భావములో వారు వారి తోకలతో కుట్టకపోవచ్చునేమో గాని, వారు రానైయున్న యెహోవా ఉగ్రతదినాన్నిగూర్చి యుక్తితో, వివేకంతో సాక్ష్యమిస్తున్నప్పుడు వారి నోటనుండి అగ్ని, ధూమగంధకములు బయలు వెళ్తాయి.

18. ఈ గుఱ్ఱపురౌతుల సైన్యం ఎన్నిభాషల్లో, ఎంత సంఖ్యలో యీ తెగులు సమాచారాన్ని సాహిత్యాల రూపంలో పంచిపెట్టింది?

18 ఇతరచోట్ల, రాజ్యసంబంధమైన సాహిత్యాలింకను, క్రైస్తవమత సామ్రాజ్యపు బబులోను మతాచారాలను సిద్ధాంతాలను బహిర్గతం చేస్తున్నాయి, అలంకార రూపంలో దానికి కలుగబోవు హానిని తెస్తున్నాయి. ఆధునిక అచ్చుయంత్ర పద్ధతుల నుపయోగిస్తూ 1987వ సంవత్సరానికి ముందు 50 యేండ్లలో యీ అసంఖ్యాక సైన్యం లోకంలోని 200 కంటె ఎక్కువ భాషల్లో బైబిళ్లు, పుస్తకాలు, పత్రికలు, మరియు బ్రోషూర్లను అమోఘంగా 782,10,78,415 కాపీలను—అక్షరార్థమైన రెండుకోట్లకంటె ఎన్నో ఎన్నోరెట్లు ఎక్కువ పంచిపెట్టగలిగారు. ఆ తోకలు ఎంత బాధించాయో గదా!

19, 20. (ఎ) తెగులు సమాచారం ముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ఉద్దేశించి చెప్పబడుతున్నప్పటికీ, క్రైస్తవమత సామ్రాజ్యము వెలుపటి దేశాల్లో కొన్ని ఎలా స్పందించాయి? (బి) సాధారణ ప్రజల ప్రతిస్పందనను యోహాను ఎలా వర్ణిస్తున్నాడు?

19 ఈ తెగులు సమాచారం “మనుష్యులలో మూడవ భాగము”ను చంపాలని యెహోవా సంకల్పించాడు. అయితే ఆ సమాచారం ముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యం వైపే గురిపెట్టబడింది. ఈ సమాచారం క్రైస్తవేతర దేశాలకు, అంటే క్రైస్తవమత సామ్రాజ్య శాఖల వేషధారణ గూర్చి బాగా ఎరిగియున్న దేశాలకు చేరింది. ఈ భ్రష్ట మతసంస్థ తెగులుకు గురౌతున్నట్లు గమనిస్తున్నందువల్ల, యీ దేశాల్లోని ప్రజలు యెహోవాకు దగ్గరౌతున్నారా? చాలామంది దగ్గరౌతున్నారు! క్రైస్తవమత సామ్రాజ్య ప్రాబల్యమునకు దూరంగా జీవిస్తున్న దేశాల్లోని దీనులు, స్నేహశీలురనుండి మంచి తక్షణ స్పందన వస్తుంది. అయితే సాధారణ ప్రజానీకం విషయంలో వారి స్పందనను యోహానిలా తెల్పుతున్నాడు: “ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు.” (ప్రకటన 9:20, 21) పశ్చాత్తాపపడని వారిని మార్పుచేసే ప్రసక్తేలేదు. వారి దుష్‌క్రియలలో కొనసాగేవారు యెహోవా ఉగ్రత దినమున ఆయన ప్రతికూలతీర్పును పొందితీరవలసిందే. అయితే “యెహోవా నామమున ప్రార్థించు వారందరును రక్షింపబడుదురు.”—యోవేలు 2:32; కీర్తన 145:20; అపొస్తలుల కార్యములు 2:20, 21.

20 మనమిప్పుడు చర్చించింది రెండవ శ్రమలో ఒక భాగమే. రాబోయే అధ్యాయాల్లో మనము చూడబోతున్నట్లు, యీ శ్రమ అంతం కాకముందు యింకెంతో జరుగవలసివుంది.

[అధస్సూచీలు]

^ పేరా 10 కామెంటరీ ఆన్‌ రెవలేషన్‌, పుస్తకంలో హెన్రీ బార్‌క్లే స్వెటి, “టూ మిరియడ్స్‌ ఆఫ్‌ మిరియడ్స్‌” అనే సంఖ్యనుగూర్చి యిలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ఈ పెద్దసంఖ్యలు మనం వీటిని అక్షరార్థంగా తీసుకోకుండా అడ్డగిస్తున్నాయి, యీ తుదినిర్ణయాన్ని దీని తర్వాత యివ్వబడిన వివరణ బలపరుస్తుంది.”

^ పేరా 13 ముందున్న 119-26 పేజీలను చూడండి, మరియు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి 1932 లో ప్రచురించిన విండికేషన్‌ అనే పుస్తకంలోని మూడవ సంపుటి 83-4 పేజీలను చూడండి.

^ పేరా 15 మిడతలవలెగాక, యోహాను పంపే యీ గుఱ్ఱపు రౌతుల సైన్యాలు “సువర్ణ కిరీటములు” ధరించుకోవడం లేదు. (ప్రకటన 9:7) ఈనాడు సైన్యంలో అధికభాగంగావున్న గొప్పసమూహం, దేవునిపరలోక రాజ్యంలో పాలించే నిరీక్షణ కల్గిలేరన్న వాస్తవంతో యిది పొందికగా ఉంది.

[అధ్యయన ప్రశ్నలు]

[149వ పేజీలోని చిత్రం]

ఆరవ బూర ఊదుటతో రెండవ శ్రమ ఆరంభమౌతుంది

[150, 151వ పేజీలోని చిత్రం]

నలుగురు దూతలు చరిత్రయంతటిలోను మహాగొప్ప గుఱ్ఱపురౌతుల సైన్యాన్ని నడిపిస్తున్నారు

[153వ పేజీలోని చిత్రం]

అసంఖ్యాక సైన్యం అనేకానేక లక్షల బైబిలు ఆధారిత సాహిత్యాలను పంచిపెట్టింది

[154వ పేజీలోని చిత్రం]

మిగిలిన జనులు మారుమనస్సు పొందలేదు