కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విజయులగుటకు పోరాడుట

విజయులగుటకు పోరాడుట

అధ్యాయం 8

విజయులగుటకు పోరాడుట

స్ముర్న

1. (ఎ) మహిమనొందిన యేసుక్రీస్తు నుండి తర్వాత ఏ సంఘం వర్తమానాన్ని అందుకుంటుంది? (బి) తాను “మొదటివాడను కడపటివాడను,” అని చెప్పుకొనుట ద్వారా యేసు ఆ సంఘానికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు?

ఈనాడు, పురాతన ఎఫెసు శిథిలావస్థలోవుంది. అయినా, యేసు రెండో వర్తమానం సందడిగల ఆ పట్టణంలో యింకను చోటు చేసుకుంటూనే వుంది. ఎఫెసు శిథిలాలకు 35 కిలోమీటర్ల దూరంలో ఐజ్‌మిర్‌ అనే టర్కీ పట్టణముంది, అందులో యీనాడు కూడ ఆసక్తిగల యెహోవాసాక్షుల సంఘమొకటుంది. ఇక్కడే మొదటి శతాబ్దంలో స్ముర్న ఉండేది. ఇప్పుడు, యేసు తదుపరి మాటల్ని గమనించండి: “స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము—మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులు.” (ప్రకటన 2:8) స్ముర్నలోనున్న ఆ క్రైస్తవులకు యిలా చెప్పడంద్వారా, యథార్థత కనబరచిన వారిలో యెహోవా స్వయంగా అమర్త్యమైన జీవానికి పునరుత్థానం చేసినవారిలో తాను మొదటివాడని, కడపటివాడని యేసు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతర అభిషక్త క్రైస్తవులందర్ని యేసే స్వయంగా లేపుతాడు. ఆయనలా, తనతోపాటు పరలోక జీవాన్ని పొందే నిరీక్షణగల తన సహోదరులకు సలహాయిచ్చే మంచి అర్హత కల్గివున్నాడు.

2. “మృతుడై బ్రదికిన” వాని మాటల నుండి ఎందుకు క్రైస్తవులంతా ప్రయోజనం పొందగలరు?

2 నీతినిమిత్తం హింసను సహించుటలో యేసు మాదిరి చూపాడు, తగిన ప్రతిఫలం పొందాడు. ఆయన మరణం వరకు నమ్మకత్వాన్ని కనబరచడం, పునరుత్థానం కావడం, క్రైస్తవులందరి నిరీక్షణ కాధారం. (అపొస్తలుల కార్యములు 17:31) యేసు “మృతుడై మరల బ్రదికిన” వాస్తవం రుజువు చేసేదేమంటే, సత్యంకొరకు దేన్ని సహించినా అది వ్యర్థంకాదు. ముఖ్యంగా వారి విశ్వాసం నిమిత్తం చనిపోవలసి వచ్చినప్పుడు, యేసు పునరుత్థానం క్రైస్తవులందరికి ఎంతోగట్టి ప్రోత్సాహానికి మూలమైవుంది. మీ పరిస్థితికూడ యిదేనా? అలాగైతే, యేసు స్ముర్న సంఘానికి తదుపరి చెప్పిన మాటలనుండి మీరు ధైర్యం తెచ్చుకోవచ్చు:

3. (ఎ) యేసు స్ముర్న సంఘస్థులకు ఎటువంటి ప్రోత్సాహమిస్తున్నాడు? (బి) స్ముర్న సంఘస్థులు పేదవారైనప్పటికి, యేసు ఎందుకు వారిని “ధనవంతులు” అని పిలుస్తున్నాడు?

3“నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును.” (ప్రకటన 2:9) యేసు స్ముర్నలోనున్న తన సహోదరులను విమర్శించడం లేదు గాని బాగా మెచ్చుకుంటున్నాడు. వారి విశ్వాసాన్నిబట్టి వారెంతో శ్రమననుభవించారు. బహుశ వారి విశ్వాస్యతనుబట్టి వారు పేదవారైయుండవచ్చు. (హెబ్రీయులు 10:34) అయినా, వారి ముఖ్యశ్రద్ధ ఆత్మీయ విషయాలమీదనే ఉన్నది, మరి యేసు సలహా ప్రకారం వారు పరలోకమందు ధనాన్ని సమకూర్చుకున్నారు. (మత్తయి 6:19, 20) అందుకే, ప్రధాన కాపరి వారిని “ధనవంతులు”గా పరిగణిస్తున్నాడు.—యాకోబు 2:5 పోల్చండి.

4. స్ముర్నలోని క్రైస్తవులు ముఖ్యంగా ఎవరినుండి వ్యతిరేకత నెదుర్కొన్నారు, యేసు ఆ వ్యతిరేకులను ఎలా దృష్టించాడు?

4 స్ముర్నలోని క్రైస్తవులు సహజ యూదులవల్ల కల్గిన వ్యతిరేకతను ఎంతగానో సహించారని యేసు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాడు. అంతకుముందు, యీ మతస్థులనేకులు క్రైస్తవత్వం వ్యాప్తిచెందకుండ గట్టిగా వ్యతిరేకించారు. (అపొస్తలుల కార్యములు 13:44, 45; 14:19) ఇప్పుడు, యెరూషలేము నాశనమైన కొన్ని దశాబ్దాలకు, స్ముర్నలోని యూదులు యింకా సాతాను స్వభావాన్నే కనబరుస్తున్నారు. మరి యేసు వారిని “సాతాను సమాజము” అని పిలవడంలో ఆశ్చర్యంలేదు! *

5. స్ముర్నలోని క్రైస్తవుల కెటువంటి శ్రమలు రానైయుండెను?

5 అటువంటి ద్వేషాన్నెదుర్కొన్న స్ముర్న క్రైస్తవులను యేసు యిలా ఓదార్చుతున్నాడు: “నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమకలుగును; మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.” (ప్రకటన 2:9బి, 10) గ్రీకుభాషలో “మీరు” అనే బహువచనాన్ని యేసు ఇక్కడ మూడుసార్లు వాడుతున్నాడు, అలా తనమాటలు సంఘమంతటికి వర్తిస్తాయని చూపిస్తున్నాడు. స్ముర్నలోని క్రైస్తవుల శోధనలు వెంటనే సమసి పోతాయని యేసు వాగ్దానం చేయలేడు. “పది దినములు” వారికి శ్రమలుంటాయి. పది అనే సంఖ్య భూసంబంధిత సంపూర్ణతకు లేదా మొత్తానికి సూచన. ఆత్మీయంగా ఎంతో యథార్థతను కల్గివున్నవారు కూడ శరీరంతోవున్నప్పుడు సంపూర్ణంగా పరీక్షింపబడతారు.

6. (ఎ) స్ముర్నలోని క్రైస్తవులెందుకు భయపడనక్కర్లేదు? (బి) స్ముర్న సంఘానికిచ్చిన వర్తమానాన్ని యేసు ఎలా ముగించాడు?

6 అయిననూ, స్ముర్నలోని క్రైస్తవులు భయపడకూడదు లేక రాజీపడకూడదు. వారు అంతంవరకు నమ్మకంగావుంటే, వారికొరకు “జీవకిరీటము,” వీరి విషయంలోనైతే పరలోకమందు అమర్త్యజీవం వేచివుంది. (1 కొరింథీయులు 9:25; 2 తిమోతి 4:6-8) అపొస్తలుడైన పౌలు యీ ప్రశస్తమైన బహుమానం, సమస్తం త్యాగం చేయుటకన్న, చివరకు తన భూజీవితంకన్నా మిన్నగా ఎంచాడు. (ఫిలిప్పీయులు 3:8) స్పష్టంగా, స్ముర్నలోని నమ్మకమైనవారు అలాగే భావించారు. యేసు తన వర్తమానాన్ని యిలా ముగిస్తున్నాడు. “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియు చెందడు.” (ప్రకటన 2:11) జయించేవారు మరణం ప్రభావాన్ని చూపజాలని అమర్త్య జీవాన్ని పరమందు నిశ్చయంగా పొందుతారు.—1 కొరింథీయులు 15:53, 54.

“పది దినములు శ్రమ కలుగును”

7, 8. స్ముర్నలోని సంఘంవలె, 1918 లో క్రైస్తవ సంఘమెలా ‘సంపూర్ణంగా పరీక్షింప’ బడింది?

7 స్ముర్న సంఘంలోని క్రైస్తవులవలె, యోహాను తరగతి వారి సహవాసులు యీనాడు ‘సంపూర్తిగా పరీక్షింప’ బడుతూనే ఉన్నారు. శ్రమలందు వారుచూపే నమ్మకత్వం వారు దేవుని ప్రజలని గుర్తిస్తుంది. (మార్కు 13:9, 10) ప్రభువు దినము ఆరంభమైన వెంటనే యెహోవా ప్రజలైన చిన్న అంతర్జాతీయ గుంపుకు స్ముర్నలోని క్రైస్తవులకు యేసు చెప్పిన మాటలు నిజమైన ఓదార్పు నిచ్చాయి. (ప్రకటన 1:10) మరి 1879 నుండి వారితరులకు ఉచితంగా తెల్పిన ఆత్మీయ ధనాన్ని దేవుని వాక్యంలోనుండి త్రవ్వి తీస్తూనేవచ్చారు. గాని మొదటి ప్రపంచ యుద్ధకాలంలో, ఒకటి యుద్ధంలో పాల్గొననందుకు, మరొకటి క్రైస్తవమత సామ్రాజ్యపు తప్పులను నిర్భయంగా బయట పెడుతున్నందుకు వారు తీవ్రమైన వ్యతిరేకతను, ద్వేషాన్ని ఎదుర్కొన్నారు. క్రైస్తవమత సామ్రాజ్య మందలి కొందరు నాయకుల పురికొల్పువల్ల వచ్చిన హింస 1918 లో తారాస్థాయికి చేరుకుంది, మరి దీన్ని యూదా సమాజంవల్ల స్ముర్నలోని క్రైస్తవులకు వచ్చిన హింసతో పోల్చవచ్చును.

8 జూన్‌ 22, 1918, లో వాచ్‌టవర్‌ సొసైటీ నూతన అధ్యక్షుడు జోసఫ్‌ యఫ్‌. రూథర్‌ఫర్డ్‌ను, యింకా ఏడుగురు తోటిసహవాసులను జైల్లో వేసినప్పుడు, వారిలో చాలామందికి 20 సంవత్సరాల కంటే ఎక్కువే శిక్ష పడ్డప్పుడు అమెరికాలో హింస అగ్రస్థాయిలో చెలరేగింది. వారు తొమ్మిది నెలలతర్వాత బెయిలుమీద విడుదల చేయబడ్డారు. మే 14, 1919 లో అప్పీలు కోర్టు వారిపై మోపబడిన తప్పుడు ఆరోపణలను తొలగించింది; విచారణలో 125 తప్పులున్నట్లు తేలింది. ఈ క్రైస్తవులకు బెయిలు యివ్వడానికి నిరాకరించిన సెంట్‌. గ్రెగరి ది గ్రేట్‌ అధికారుల్లో ఒకరైన రోమన్‌ కాథోలిక్‌ జడ్జి మాన్‌టన్‌ లంచాలడుగుతున్నాడని, తీసుకుంటున్నాడని వచ్చిన ఆరోపణలవల్ల ఆ తర్వాత అంటే 1939 లో ఆయనకు రెండేండ్ల జైలు శిక్షతోపాటు, 10,000 డాలర్లు జరిమానా కూడ విధించారు.

9. నాజీజర్మనీలో హిట్లర్‌ యెహోవా సాక్షుల నెలా చూశాడు, మరి మత గురువుల ప్రతిస్పందన ఎలావుంది?

9 నాజీ పాలనా కాలంలో జర్మనీలో హిట్లర్‌ యెహోవా సాక్షుల సువార్త పనిని పూర్తిగా నిషేధించాడు. చాలా సంవత్సరాలు, వేలాదిమంది సాక్షులు క్రూరంగా కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో నిర్భంధించబడ్డారు, అక్కడ అనేకులు చనిపోయారు, హిట్లర్‌ సైన్యంలోచేరి యుద్ధంచేయడానికి నిరాకరించిన వేలాదిమంది యువకులు ఉరితీయబడ్డారు. దీనికి మతగురువుల మద్దతున్నదనడానికి, మే 29, 1938న ది జర్మన్‌ అనే పత్రికలో ప్రచురించబడిన ఓ కాథోలిక్‌ మతగురువు మాటలే నిదర్శనం. ఆయన అన్నవాటిలో కొన్నిలా ఉన్నాయి: “భూమ్మీద యిప్పుడు ఒకే ఒక దేశంలో . . . బైబిలు విద్యార్థులు [యెహోవాసాక్షులు] నిషేధించడ్డారు. అదే జర్మనీ దేశం! . . . అడాల్ఫ్‌ హిట్లర్‌ అధికారానికి వచ్చినప్పుడు, జర్మన్‌ కాథోలిక్‌ బిషప్పుల సమాఖ్య మరల విన్నవించు కున్నందుకు, హిట్లర్‌ యిలా అన్నాడు: ‘ఎర్నెస్ట్‌ బైబిల్‌ స్టూడెంట్స్‌ అని చెప్పుకుంటున్న వీరు [యెహోవాసాక్షులు] అల్లరివాళ్లు, . . . వట్టి బూటకం మనుష్యులు; ఈ అమెరికా జడ్జి రూథర్‌ఫర్డ్‌ జర్మనీ కాథోలిక్కులను మలినపరచడం నేను సహించను; నేను వారిని [యెహోవాసాక్షులను] జర్మనీలోలేకుండా నిర్మూలిస్తాను,” దీనికి ఆ మతగురువు “శభాష్‌!” అని వంతపాడాడు.

10. (ఎ) ప్రభువు దినము కొనసాగేకొలది యెహోవాసాక్షులు ఎటువంటి హింసల నెదుర్కొన్నారు? (బి) క్రైస్తవులు మతస్వాతంత్ర్యం కొరకు కోర్టుల్లో పోరాడినప్పుడు తరచూ ఏ ఫలితం లభించింది?

10 ప్రభువు దినము కొనసాగేకొలది సర్పం అతని సంతానం, అభిషక్త క్రైస్తవులతోను వారి సహవాసులతోను పోరాడకుండా ఊరుకోవడంలేదు. వారిలో అనేకులు జైల్లో వేయబడి క్రూరంగా హింసింపబడ్డారు. (ప్రకటన 12:17) ఆ శత్రువులు ‘కట్టడవలన కీడుకల్పించు’టకు ప్రయత్నిస్తూనే వున్నారు, గాని యెహోవా ప్రజలు పట్టుదలతో యిలా అంటున్నారు: “దేవునికే మేము లోబడవలెను గదా.” (కీర్తన 94:20; అపొస్తలుల కార్యములు 5:29) ది వాచ్‌టవర్‌ పత్రిక 1954 లో యిలా నివేదించింది: “గత నలభైయేండ్లలో డెభ్బైకంటె ఎక్కువ దేశాలు ఏదొకసమయంలో యెహోవాసాక్షులను హింసించాయి, వారిపై ఆక్షేపణాజ్ఞలను జారీచేశాయి.” మతస్వేచ్ఛ కొరకు న్యాయస్థానాల్లో పోరాడే అవకాశమున్నచోట యీ క్రైస్తవులు అలాగే చేస్తున్నారు, మరి అనేక దేశాల్లో గొప్ప విజయాలను సాధించారు. అమెరికాలోని సుప్రీంకోర్టులోనే యెహోవాసాక్షులు 23 కేసులను గెలిచారు.

11. యేసు ప్రత్యక్షతను గూర్చిన ఏ ప్రవచనం ప్రభువు దినములో యెహోవాసాక్షులపై నెరవేరింది?

11 కైసరువి కైసరుకు చెల్లించుడని యేసు యిచ్చిన ఆజ్ఞను మరే యితర గుంపుకూడ యింత కచ్చితంగా పాటించడంలేదు. (లూకా 20:25; రోమీయులు 13:1, 7) అయినా, మరేగుంపు సభ్యులుకూడ వీరివలె పలుదేశాల్లో, పలురకాల ప్రభుత్వాల మూలంగా జైలుపాలుకాలేదు, మరిప్పటికీ అమెరికాలో, ఐరోపాలో, ఆఫ్రికా, ఆసియాదేశాల్లో యిది కొనసాగుతునేవుంది. తన ప్రత్యక్షతను గూర్చి యేసు యిచ్చిన గొప్ప ప్రవచనంలో యీమాటలు చేరివున్నాయి: “అప్పుడు జనులు మిమ్ము శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 24:3, 9) ప్రభువు దినములో నిశ్చయంగా యిది క్రైస్తవ యెహోవాసాక్షులపై నెరవేరింది.

12. యోహాను తరగతి, హింసను సహించుటకెలా క్రైస్తవులను బలపర్చింది?

12 శ్రమలలో దేవుని ప్రజలను బలపరచుటకై, యేసు స్ముర్నలోని క్రైస్తవులకు చెప్పిన మాటల సారాంశాన్ని యోహాను తరగతి తదేకంగా వారికి జ్ఞాపకం చేస్తూనే వచ్చింది. ఉదాహరణకు మత్తయి 10:26-33ను చర్చించిన “ఫియర్‌ దెమ్‌ నాట్‌,” దానియేలు 3:17, 18పై ఆధారపడిన “ది క్రూసిబుల్‌,” మరియు దానియేలు 6:22 కీలక వచనంగా “లయన్స్‌ మౌత్స్‌” అనే శీర్షికలను 1933, 1934 సంవత్సరాల్లో ది వాచ్‌టవర్‌ నందు వెలువడ్డాయి. యెహోవాసాక్షులు 40 కంటే ఎక్కువ దేశాల్లో క్రూరంగా హింస ననుభవించిన 1980వ దశాబ్దంలో, “హేపీ దో పర్సిక్యూటెడ్‌,” “క్రిష్టియన్స్‌ మీట్‌ పర్సిక్యూషన్‌ విత్‌ ఎండ్యూరెన్స్‌,” వంటి శీర్షికలతో ది వాచ్‌టవర్‌ దేవుని ప్రజలను బలపర్చింది. *

13. స్ముర్నలోని క్రైస్తవులవలె, క్రైస్తవ యెహోవాసాక్షులెందుకు హింసంటే భయపడకూడదు?

13 నిజంగా, క్రైస్తవ యెహోవాసాక్షులు అలంకారిక పది రోజులు శారీరక హింసను, యితర శోధనలను అనుభవిస్తున్నారు. ఆనాటి స్ముర్నలోని క్రైస్తవులవలె, వీరు భయపడటంలేదు, భూమ్మీద కష్టాలు ముమ్మరమైనపుడు మనలో ఎవరూ భయపడ నవసరంలేదు. శ్రమల్లో సహించడానికి మనం సిద్ధపడేవున్నాం, ‘ఆస్తిని కోల్పోవడానికి’ సహితం సంతోషిస్తాం. (హెబ్రీయులు 10:32-34) దేవుని వాక్యాన్ని పఠిస్తూ, దాన్ని మన సొంతం చేసుకుంటూ వుండడంవల్ల, మనం విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి సంసిద్ధులమౌతాము. మీ యథార్థత విషయంలో యెహోవా మిమ్మును కాపాడి, సంరక్షించగలడనే నిశ్చయత కల్గివుండండి. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతయావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:6-11.

[అధస్సూచీలు]

^ పేరా 4 యోహాను చనిపోయిన సుమారు 60 సంవత్సరాలకు యేసు నందు తనకున్న విశ్వాసాన్ని త్యజించనందుకు 86 సంవత్సరాల వయస్సున్న పోలికార్ప్‌ అనేవ్యక్తిని స్ముర్నలో కాల్చిచంపారు. ఈ సంఘటన కాలంలోనే తయారైందని విశ్వసింపబడుతున్న ది మార్టిర్డం ఆఫ్‌ పోలికార్‌ అనే పుస్తకం చెప్పేదేమంటే, చంపడమనేది “మహా సబ్బాతు దినమున” జరిగినప్పటికీ, కాల్చడానికి కలప సమకూర్చేందుకు “సహాయం చేయడానికి యూదులు వారి అలవాటు ప్రకారం ఎంతో ఆసక్తిని కనబర్చారు.”

^ పేరా 12 నవంబరు 1, 1933; అక్టోబరు 1 మరియు 15, డిశంబరు 1 మరియు 15, 1934; మే 1, 1983 ది వాచ్‌టవర్‌లను చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[39వ పేజీలోని చిత్రం/బాక్సు]

సుమారు 50 సంవత్సరాలనుండి, జర్మనీలోని యెహోవాసాక్షులు నాజీ పరిపాలనలో చూపిన యథార్థతకు చరిత్రకారులు సాక్ష్యమిస్తూనే వున్నారు. చరిత్రకారుడైన క్లాడియ కూన్‌జ్‌, 1986 లో ప్రచురించిన మదర్స్‌ యిన్‌ ది ఫాదర్‌ లాండ్‌ అనే పుస్తకం యిలా చెబుతోంది: “నాజీయేతరులైన జర్మన్లలో చాలామంది వారు ద్వేషించిన దేశంలో జీవించవలసి వచ్చింది. . . . ఓ వ్యక్తి సంఖ్యాపరంగాను, భావరూప్యంగాను చూచినట్లయితే అటువైపున 20,000 మంది యెహోవాసాక్షులున్నారు, వారు నాజీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవిధమైన విధేయత చూపడానికి ససేమిరా సమ్మతించలేదు. . . . మతసంబంధంగా అత్యంత పట్టుదలగల గుంపు. మొదటినుండి యెహోవాసాక్షులు నాజీప్రభుత్వ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు. నాజీపోలీస్‌ దళం ఆ దేశంలో ఉన్న వారి కేంద్రకార్యాలయాన్ని 1933 లో ధ్వంసం చేసినప్పటికి, ఆ తెగను 1935 లో నిషేధించినను, వారు ‘హెయిల్‌ హిట్లర్‌,’ అనికూడ అనడానికి తిరస్కరించారు. యెహోవాసాక్షుల్లో సగంమంది (ఎక్కువగా పురుషులే) కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లోకి త్రోయబడ్డారు, వారిలో మరో వేయిమంది చంపబడ్డారు, 1933-1945 మధ్యకాలంలో మరో వెయ్యిమంది చనిపోయారు. . . . మతగురువులు తమను హిట్లర్‌తో సహకరించండని ఉపదేశిస్తూండగా కాథోలిక్కులు ప్రొటెస్టెంటులు దాన్ని గైకొన్నారు. వారలా చేయలేదంటే అది చర్చి, ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించినట్లే.”