కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“సాతాను యొక్క గూఢమైన సంగతులను” అసహ్యించుకొనుట

“సాతాను యొక్క గూఢమైన సంగతులను” అసహ్యించుకొనుట

అధ్యాయం 10

“సాతాను యొక్క గూఢమైన సంగతులను” అసహ్యించుకొనుట

తుయతైర

1. తుయతైరకు యితర సంఘాలకు ఎటువంటి సంబంధం ఉంది, ఎటువంటి మతసంబంధమైన పరిస్థితివుంది?

సుమారు 40 మైళ్ల దూరంలో బెర్గమకు (పెర్గము) ఆగ్నేయదిశగా టర్కీలో వృద్ధిచెందుతున్న ఆఖిసార్‌ అనే పట్టణముంది. ఈ పట్టణమే 1,900 సంవత్సరాల క్రితం తుయతైర ప్రాంతం. ఓ ప్రయాణకాపరి పెర్గము లోపలి రోడ్డుగుండా తుయతైరను అవలీలగా చేరుకొని, ప్రకటన 3వ అధ్యాయంలో తెలుపబడిన—సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే మిగతా సంఘాలను చుట్టుకొని రావచ్చు. పెర్గమువలెగాక, తుయతైర, చక్రవర్తి ఆరాధనకు ప్రముఖ కేంద్రమైనట్లు మాత్రం కనిపించడంలేదు, గాని అందులో అన్యదేవతలకు అర్పితమైన మఠాలు, దేవాలయాలుండేవి. తుయతైర వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది.

2, 3. (ఎ) క్రైస్తవుడైన ఒక తుయతైర వ్యక్తినిగూర్చి ముందుగానే ఏమి వ్రాయబడింది? (బి) యేసు “దేవుని కుమారుడు,” “ఆయన అగ్ని జ్వాలవంటి కన్నులు,” గలవాడనే విషయం తుయతైరలోని క్రైస్తవులకు ఏ ప్రాముఖ్యత కల్గివుంది?

2 పౌలు మాసిదోనియాలో సువార్త ప్రకటిస్తుండగా, ఊదారంగు పొడిని అమ్మే లూదియ అనే స్త్రీ ఆయనకు తారసపడింది. పౌలు ప్రకటించే సువార్తను లూదియ ఆమె కుటుంబీకులంతా ఆనందంగా అంగీకరించారు, అసాధారణ ఆతిధ్యమిచ్చారు. (అపొస్తలుల కార్యములు 16:14, 15) క్రైస్తవత్వాన్ని స్వీకరించిన తుయతైర స్త్రీలలో ఆమె మొదటిదిగా చరిత్ర పుటలకెక్కింది. కొంతకాలానికి ఆ పట్టణంలోనే ఓ క్రైస్తవ సంఘం తయారయింది. యేసు తన అత్యంత నిడివిగల వర్తమానాన్ని వారినుద్దేశించే చెబుతాడు: “తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము—అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులివి.”—ప్రకటన 2:18.

3 ఇతరచోట్ల యేసు యెహోవాను “నా తండ్రి” యని సంబోధించినప్పటికి ప్రకటనలో ఈ ఒక్కచోట మాత్రమే “దేవుని కుమారుడు” అన్నమాట కనబడుతోంది. (ప్రకటన 2:27; 3:5, 21) ఇక్కడ బిరుదు నుపయోగించుట వలన యేసుకు యెహోవాతోగల సాన్నిహిత్యాన్ని గూర్చి తుయతైరలోని క్రైస్తవులకు బహుశ జ్ఞాపకం చేస్తుండవచ్చును. ఈ కుమారునికి “అగ్నిజ్వాలవంటి కన్నులు” ఉన్నాయంటే, సంఘంలో మలినం కల్గించే దేనినైనా తానుచూస్తే తన తీర్పు తీక్షణంగా ఉంటుందని తుయతైర క్రైస్తవులకు ఓ హెచ్చరిక అన్నట్లే. అపరంజిని పోలిన పాదములని రెండవమారు తెలియ జేయడంలో తాను యీ భూమ్మీద నడిచినపుడు నమ్మకత్వానికి ఆయనెలా మంచి మాదిరికరంగా ఉండెనో తాను నొక్కితెల్పుతున్నాడు. తుయతైరలోని క్రైస్తవులు నిశ్చయంగా ఆయన సలహాను లక్ష్యపెట్టారు, గనుక అలాగే మనమీనాడు లక్ష్యపెట్టాలి!—1 పేతురు 2:21.

4, 5. (ఎ) యేసు తుయతైర క్రైస్తవులను ఎందుకు అభినందిస్తున్నాడు? (బి) తుయతైర సంఘమెలా యీనాడున్న 73,000 యెహోవా సాక్షుల సంఘాలకు సారూప్యతకల్గివుంది?

4 అందుకే, యేసు తుయతైర వారిని అభినందించగలడు. ఆయనిలా అంటున్నాడు: “నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.” (ప్రకటన 2:19) ఎఫెసీయులవలెగాక, అక్కడున్న అభిషక్త క్రైస్తవులు యెహోవా యెడల తమకున్న తొలిప్రేమను పోగొట్టుకొనలేదు. వారి విశ్వాసం గట్టిది. అంతేగాక, వారి క్రియలు ముందటి కన్న ఎక్కువే, మరి ముందు పేర్కొన్న మూడు సంఘాలవలె, తుయతైరలోని క్రైస్తవులు సహనంగలవారే. ఈనాడు లోకమందంతట 73,000 కంటె అధికంగావున్న సంఘాల్లోని యెహోవాసాక్షులెంతటి సారూప్యత గల్గియున్నారు! సంస్థలో పరిచర్యాసక్తి పరవళ్లుతొక్కుతూ చిన్నల్ని పెద్దల్ని పురికొల్పుతూ ఉండగా, యెహోవా ఎడలగల ప్రేమ ప్రకాశిస్తోంది. అధికసంఖ్యలో పయినీర్లు తమ సమయాన్ని వ్యయపరస్తూ వున్నారు, అలా వారు రానైయున్న దేవుని రాజ్యసువార్త యొక్క మహిమాయుత నిరీక్షణను చాటించడానికి యింకా మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు.—మత్తయి 24:14; మార్కు 13:10.

5 దశాబ్దాలుగా, అభిషక్తశేషం, గొప్పసముహములోని అనేకమంది నమ్మకస్థులు, తమ చుట్టువున్న లోకం నిరీక్షణలేని అంధకార అగాధంలో యింకనూ మునిగిపోతూవుంటే, వీరు దేవుని సేవలో మాదిరికరమైన సహనాన్ని కనబరస్తున్నారు. అయితే మనం మంచి ధైర్యంగల్గి ఉందాం. ప్రకటన దేవుని పూర్వమున్న ప్రవక్తల సాక్ష్యాన్ని స్థిరపరచి చెబుతోంది. “యెహోవా మహాదినం సమీపమాయెను, యెహోవా దినము సమీపమై, అతి శీఘ్రముగా వచ్చుచున్నది.”—జెఫన్యా 1:14; యోవేలు 2:1; హబక్కూకు 2:3; ప్రకటన 7:9; 22:12, 13.

“యెజెబెలను స్త్రీ”

6. అభినందించదగిన అనేక క్రియలున్నప్పటికిని, తుయతైర సంఘంలో తక్షణ అవధాన మీయవలసిన ఏ సమస్యను యేసు గమనించాడు? (బి) యెజెబెలు ఎవరు, ఆమెకు ఓ ప్రవక్త్రినని చెప్పుకునే సరియైన అర్హతవుందా?

6 యేసు అగ్నిజ్వాలవంటి కళ్లు యింకా తీక్షణంగా చూస్తున్నాయి. తక్షణ అవధానం నిల్పవలసిన దేన్నో ఆయన గమనిస్తున్నాడు. తుయతైరలోని క్రైస్తవులకు ఆయనిలా చెబుతున్నాడు: “అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.” (ప్రకటన 2:20) సా.శ.పూ. పదవశతాబ్దంలో బయలు దేవతారాధికుడైన ఇశ్రాయేలురాజగు ఆహాబు భార్య యెజెబెలు రాణి, తన హత్యాయుత, వేశ్యాయుత, అహంపూరిత ప్రవర్తనా సరళికి ప్రసిద్ధిచెందింది. యెహూ, యెహోవా అభిషక్తునిగా, ఆమెను హతమార్చాడు. (1 రాజులు 16:31; 18:4; 21:1-16; 2 రాజులు 9:1-7, 22, 30, 33) విగ్రహారాధికురాలైన యెజెబెలుకు ప్రవక్త్రినిగా చెప్పుకొనే హక్కేలేదు. ఇశ్రాయేలులో నమ్మకంగా ప్రవక్త్రినులుగా సేవచేసిన మిర్యాము, దెబోరా వంటిదికాదామె. (నిర్గమకాండము 15:20, 21; న్యాయాధిపతులు 4:4; 5:1-31) మరి సువార్తికుడైన ఫిలిప్పు నలుగురు కుమార్తెలు, వృద్ధురాలైన అన్నాను నడిపించినట్లే, యెహోవా ఆత్మ ఆమెను నడిపించలేదు.—లూకా 2:36-38; అపొస్తలుల కార్యములు 21:9.

7. (ఎ) ఆ “యెజెబెలను స్త్రీ,” అని చెప్పడంలో, యేసు నిజానికి ఏ ప్రభావాన్ని గూర్చి తెల్పుతున్నాడు? (బి) సంఘ సహవాసం కల్గివున్న కొందరు స్త్రీలు వారి స్వబుద్ధి ననుసరించిన ప్రవర్తనను ఎలా సమర్థించుకున్నారు?

7 గనుక, తుయతైరలో ప్రవక్త్రినని చెప్పుకుంటున్న “యెజెబెలు అను స్త్రీ” ఓ మోసకారిణి. ఆమెకు యెహోవా ఆత్మ సహాయం లేదు. మరి ఎవరామె? బహుశా, సంఘంలో సిగ్గుమాలిన దుష్ప్రభావం కల్గించే స్త్రీ లేక స్త్రీలే కావచ్చు. కొందరు స్త్రీలు లేఖనాలను తప్పుగా అన్వర్తిస్తూ, స్వయిష్టాన్ని ధైర్యంగా సమర్థించుకుంటూ, సంఘ సభ్యులను అవినీతిలోనికి దింపవచ్చు. నిశ్చయంగా యిది తప్పుడు ప్రవచనమే! వారితరులను తమ పద్ధతిలోనికి అంటే, “జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనయైన ధనాపేక్ష”లోనికి నడిపిస్తారు. (కొలొస్సయులు 3:5) ఈనాడు క్రైస్తవమత సామ్రాజ్య శాఖల్లో ఆమోదించబడుతున్న లేక చూచిచూడనట్లున్న స్వప్రీతికరమైన జీవనశైలిని, అవినీతికర ప్రవర్తన కల్గివుండేలా సంఘస్థులను అట్టి వారు నడిపించవచ్చును.

8. (ఎ) తుయతైరలోనున్న “యెజెబెలు”నుగూర్చి యేసు ఏమంటున్నాడు? (బి) ఈకాలంలో అయుక్తమైన స్త్రీ ప్రభామెలా కనబడుతోంది?

8 యేసు తుయతైర సంఘపెద్దలకు యింకా యిలా చెబుతున్నాడు: “మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయ మిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించువారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనేగాని వారిని బహు శ్రమలపాలు చేతును.” (ప్రకటన 2:21, 22) అసలు యెజెబెలు నిజంగా ఆహాబుపై అధికారం చెలాయించి, యెహోవా నియమిత దండనాధికారిని ధిక్కరించినట్లే, యీ స్త్రీ ప్రభావం భర్తలను, పెద్దలను నేర్పుగా తమవైపు త్రిప్పుకోవాలని ప్రయత్నిస్తూండవచ్చు. తుయతైర సంఘపెద్దలు యీ అవినీతికర యెజెబెలు ప్రభావాన్ని సహిస్తూన్నట్లు కనబడుతోంది. వారికిని, యీనాడు భూలోకమంతటనున్న యెహోవా ప్రజలకును యేసు యిక్కడ గట్టి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ నవయుగంలో, అటువంటి మొండి పట్టుగల కొందరు స్త్రీలు తమ భర్తలు మతభ్రష్టులయ్యేలా, మరియు యెహోవా నమ్మకమైన సేవకులకు వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పువచ్చేలా పురికొల్పారు.—యూదా 5-8 పోల్చండి.

9. (ఎ) యేసు యెజెబెలును గూర్చి చెప్పినవి ఎందుకు సంఘంలోని స్త్రీలందరిపై ప్రతికూల ధోరణిని కల్గించవు? (బి) ఎప్పుడు మాత్రమే యెజెబెలు ప్రభావం ఉత్పన్నమౌతుంది?

9 ఇది ఏ విధంగాకూడ క్రైస్తవ సంఘంలోని నమ్మకమైన స్త్రీలను అవమాన పరచినట్లుకాదు. ఈనాడు నమ్మకమైన సహోదరీలు చాలావరకు సాక్ష్యపుపనిలో భాగం వహిస్తున్నారు; వారు నిర్వహించే బైబిలు పఠనాలద్వారా సంఘంలోనికి చాలామంది కొత్తవారిని తెస్తున్నారు. కీర్తన 68:11 లో తెల్పబడినట్లు, దేవుడే దీనిని దీవిస్తున్నాడు: “దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.” “దేవుని దృష్టికి మిగుల విలువగల,” తమ భార్యల మృదువైన, మర్యాదగల ప్రవర్తనద్వారా భర్తలు మంచిని చేయడానికి పురికొల్పబడుతుండవచ్చు. (1 పేతురు 3:1-4) లెమూయేలు రాజు సమర్థవంతమైన, శ్రమించే స్త్రీని పొగడుతున్నాడు. (సామెతలు 31:10-31) స్త్రీలు పురుషులను మోసగించి, లేదా శిరస్సత్వాన్ని సవాలుచేసి లేక నిర్లక్ష్యం చేసినప్పుడే యెజెబెలు ప్రభావం ఉత్పన్నమౌతుంది.—ఎఫెసీయులు 5:22, 23; 1 కొరింథీయులు 11:3.

10. (ఎ) యెజెబెలు దాని పిల్లలు ఎందుకు తీర్పు పొందుతారు? (బి) యెజెబెలు పిల్లలైన వారెంత అపాయస్థితిలో ఉన్నారు, అలాంటి వారేమి చేయాలి?

10 ఆ “యెజెబెలు,” స్త్రీనిగూర్చి తెల్పుతు యేసు యింకా యిలా అంటున్నాడు: “దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.” (ప్రకటన 2:23) యేసు యెజెబెలుకు దానిపిల్లలకు మారు మనస్సు పొందడానికి సమయమిచ్చాడు, గాని వారు తమ అవినీతి మార్గాల్లోనే నడుచుకుంటున్నారు, గనుక వారికి తీర్పు జరగవలసిందే. ఇక్కడ, యీనాటి క్రైస్తవులకొక శక్తివంతమైన సమాచారముంది. పురుషులైనా, స్త్రీలైనా, యెజెబెలును అనుకరిస్తూ, శిరస్సత్వం నైతికవిషయాల్లో బైబిలు సూత్రాలను అతిక్రమిస్తూ, లేక దైవీక యేర్పాటును అలక్ష్యంచేయడానికి అహం భావం చూపుతూ దాని పిల్లలుగా మారితే అట్టివారు ఆత్మీయంగా చాలా అపాయకరమైన రోగస్థితిలో ఉన్నారు. నిజమే, అట్టివాడు తనకొరకు ప్రార్థించాలని సంఘపెద్దల్ని సమీపిస్తే,—ఆ వ్యక్తి ఆ ప్రార్థనలకు తగినట్లు నడుచుకుంటే “విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును.” అయితే తన అవినీతిక్రియలను దాచుకొనుటకు ప్రయత్నించుటద్వారా లేక ఆసక్తితో సేవచేస్తున్నట్లు పైపైకి చూపించడానికి అతడు (లేక ఆమె) ప్రయత్నించి దేవుని లేక క్రీస్తును మోసగించగలనని అనుకోకూడదు.—యాకోబు 5:14, 15.

11. న్యాయబద్ధంకాని స్త్రీ ప్రభావం చొరబడకుండ సంఘాలీనాడు ఎలా సహాయం పొందుతున్నాయి?

11 సంతోషకరమైన విషయమేమంటే, యెహోవాసాక్షుల అనేక సంఘాలు యీనాడు యీ అపాయం విషయంలో మెలకువగా ఉన్నాయి. పెద్దలు దైవ విరుద్ధమైన స్వభావాలు, చెడుక్రియలవైపు మొగ్గుచూపే వారి విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. అపాయకర మార్గంలోనున్న స్త్రీపురుషులను, ఆలస్యంకాక మునుపే సరిదిద్దడానికి, ఆత్మీయంగా వృద్ధిచెందునట్లు వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. (గలతీయులు. 5:16; 6:1) స్త్రీ విమోచనంవంటి కిటుకులతోచేసే కుట్రల ఎటువంటి మహిళా ప్రయత్నాన్నైనా యీ క్రైస్తవ అధ్యక్షులు ప్రేమపూర్వకంగాను, స్థిరంగాను అడ్డుకుంటారు. అంతేగాక, వాచ్‌టవర్‌ సొసైటి ప్రచురణలలో అప్పుడప్పుడు సమయానుకూలమైన సలహా యివ్వ బడుతోంది. *

12. యోహాను తరగతి యీనాడు ఏవిధంగా యెహూ వంటి ఆసక్తిని కనబరుస్తున్నారు?

12 అయిననూ, విపరీతమైన అవినీతి, విశేషంగా యిదెక్కడ అలవాటుగా మారుతుందో, అక్కడ మారుమనస్సునొందని పాపులను బహిష్కరించాలి. ఇశ్రాయేలీయులలో యెజెబెలు ప్రభావపు జాడలనన్నింటిని తీసివేయడానికి యెహూ చూపిన ఆసక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే, యోహాను తరగతి యీనాడు, పటిష్ఠమైన చర్యతీసుకుంటారు, వారి “యెహోనాదాబు” సహచరులకు మాదిరిచూపుతూ, క్రైస్తవమత సామ్రాజ్యపు విచ్చలవిడితనంగల పరిచారకులకంటె చాలా భేదంగా ఉన్నారని చూపిస్తున్నారు.—2 రాజులు 9:22, 30-37; 10:12-17.

13. స్త్రీ తప్పుడు ప్రభావానికి లొంగిపోయే వారికేమౌతుంది?

13 యెహోవా దూతగాను న్యాయాధిపతిగాను, దేవుని కుమారుడు, ఆధునిక యెజెబెలును గుర్తించడానికి, దాన్ని రోగశయ్యమీద పడవేయడానికి తగినరీతిగా పని చేస్తాడు. ఎందుకంటే, దాని ఆత్మీయరోగం నిజంగా దీర్ఘకాలంగా వుంది. (మలాకీ 3:1, 5) ఈ తప్పుడు స్త్రీ ప్రభావానికి గురైన వారుకూడా మహాశ్రమలలో బాధననుభవిస్తారు—బహిష్కరించబడ్డామనే దిగులుతో, మరణించినట్లే క్రైస్తవ సంఘంనుండి తెగిపోయినట్లు విచారపడతారు. వీరు మారుమనస్సు పొంది, యీ తట్టుతిరిగి, సంఘంలోనికి మరలా చేర్చుకొనబడితే తప్ప వీరుకూడా “మరణకరమైన తెగులు,”—అంటే కనీసం మహాశ్రమల కాలంలోనైనా నిజంగా మరణిస్తారు. ఈమధ్యలో, వారు మారుమనస్సుకు తగిన క్రియలు కనబరిస్తే పునరుద్ధరణ సాధ్యమే.—మత్తయి 24:21, 22; 2 కొరింథీయులు 7:10.

14. (ఎ) యెజెబెలు ప్రభావంవంటి సమస్యలను తీర్చడానికి యేసు ఎలా పెద్దల నుపయోగించు కుంటున్నాడు? (బి) అటువంటి సమస్యలను తీర్చునప్పుడు సంఘంమెలా పెద్దలకు మద్దతునివ్వాలి?

14 యేసు “అంతరింద్రియములను,” అంటే అత్యంత లోతైన భావోద్రేకాలను, “హృదయమును,” అంటే ప్రాముఖ్యమైన భావాలతోపాటు, ఆంతరంగిక వ్యక్తిని పరిశీలిస్తాడని “సంఘములన్నియు,” నిశ్చయంగా తెలుసుకోవాలి. దీనికొరకు, ఆయన యెజెబెలు ప్రభావం వంటిదేదైనా వుంటే అటువంటి కొన్నిసమస్యల్ని చక్కదిద్దడానికి నక్షత్రాలను, లేక పెద్దల నుపయోగించుకుంటాడు. (ప్రకటన 1:20) ఈ పెద్దలు యిలాంటి విషయాన్ని పూర్తిగా పరిశీలించి, తీర్పు చెప్పిన తర్వాత యిక ఎందుకు, ఎలా అలా చేశారని ఎవరూ ఆరా తీయకూడదు. పెద్దలు సమస్యలను సరిదిద్దే తీర్మానాలను అందరూ వినయంతో సమ్మతించి, సంఘంలోని యీ నక్షత్రాలకు మద్దతు నివ్వడంలో కొనసాగుతునే వుండాలి. యెహోవాకు, ఆయన సంస్థీకరణా ఏర్పాట్లకు యథార్థత చూపుటవల్ల దీవెనలు లభిస్తాయి. (కీర్తన 37:27-29; హెబ్రీయులు 13:7, 17) మీ విషయంలోనైతే, యేసు ప్రతివానికి వాని వాని క్రియలకు తగిన ప్రతిఫలమిచ్చినప్పుడు మీరును ఆశీర్వదించబడుదురు గాక.—గలతీయులు 5:19-24; 6:7-9, కూడా చూడండి.

“మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి”

15. (ఎ) యెజెబెలు చేత మలినం కానటువంటి వారినిగూర్చి యేసు ఏమి చెప్పవలసి వచ్చింది? (బి) మతభ్రష్టులైన క్రైస్తవమత సామ్రాజ్యం వలన 1918వ సంవత్సరంలో క్రైస్తవులమని చెప్పుకున్నవారంతా మలినంకాలేదని ఏది చూపిస్తుంది?

15 యేసు తదుపరి చెప్పేమాటలు ఓదార్పునిచ్చేవి: “తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.” (ప్రకటన 2:24, 25) యెజెబెలు ప్రభావంసోకని నమ్మకస్థులు తుయతైరలో ఉన్నారు. అలాగే, 1918వ సంవత్సరానికి 40 ఏండ్ల ముందునుండి, ఆ తర్వాతను క్రైస్తవమత సామ్రాజ్యంలో క్రైస్తవులమని చెప్పుకున్న వారంతా దాని అవినీతికర, దుష్ప్రవర్తనను సహించలేదు. ప్రస్తుతం యెహోవాసాక్షులని పిలువబడుతున్న యీ చిన్నగుంపు, అంటే క్రైస్తవమత సామ్రాజ్యపు సిద్ధాంతాలలో చాలావరకు క్రైస్తవేతర మూలాన్ని కల్గివున్నవని చర్చిసభ్యులకు తెలియ చెప్పాలని ప్రయత్నం చేసిన వీరు మతభ్రష్టులైన క్రైస్తవమత సామ్రాజ్యంనుండి తీసుకున్న బబులోను విశ్వాసాలను, ఆచారాలను తొలగించుకోవాలని ప్రయత్నించారు. ఇందులో “యెజెబెలు” యొక్క దుర్బోధకూడా యిమిడివుంది.

16. యేసు, తొలిశతాబ్దపు క్రైస్తవ పరిపాలకసభ ఎందుకు మరే యితర భారంమోపలేదు, వేటిని విడనాడాలి?

16 యోహాను తరగతి, వారి సహవాసులైన గొప్పసమూహాన్ని, లోకంలోని హీనమైన వినోదంవంటి అవినీతికర ప్రభావాలకు లొంగిపోకుండ జాగ్రత్త వహించేలా కూడా ప్రోత్సాహిస్తున్నారు. దేనిని విడిచిపెట్టాలని తెలుసుకోవడానికి గాని కుతూహలంతో అవినీతిని అనుభవించి లేదా పరిశీలించి చూద్దామని అను కోనవసరంలేదు. “సాతాను యొక్క గూఢమైన సంగతుల,” నుండి దూరంగా వుండడమే జ్ఞానయుక్తం. యేసు యిలా తెల్పుతున్నాడు: “మీపైని మరి ఏ భారమును పెట్టను.” ఇది మనకు మొదటి శతాబ్దపు క్రైస్తవ పరిపాలకసభ పంపిన ఓ తీర్మానాన్ని జ్ఞాపకం చేస్తుంది: “విగ్రహములకు అర్పించినవాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీమీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి మీరు దూరముగా వుండుటకు ప్రయత్నించితిరా మీకు మేలు. మీకు క్షేమము కలుగునుగాక.” (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఆత్మీయాభివృద్ధి కొరకు అబద్ధమతాన్ని, రక్తాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి మొదలైన కార్యాలను విసర్జించండి! మరి మీ శరీర ఆరోగ్యం సురక్షితంగా ఉండవచ్చు.

17. (ఎ) సాతాను ఈనాడెలా తన “గూఢమైన సంగతుల”తో ప్రజలను శోధిస్తున్నాడు? (బి) సాతాను మోసపూరిత ప్రపంచం యొక్క “గూఢమైన సంగతుల” విషయంలో మన అభిప్రాయమేమై ఉండాలి?

17 సాతాను కీనాడు, మేధావి వర్గాన్ని బుట్టలోవేసే చిక్కైన ఊహాలోకాలు, తత్వాలు మొదలైన “గూఢమైన సంగతులు” ఉన్నాయి. ఇందులో అవినీతికర, దురాలోచనలతోపాటు, అభిచారం, పరిణామ సిద్ధాంతం యిమిడివున్నాయి. మరి సర్వజ్ఞానియగు సృష్టికర్త యీ “గూఢమైన సంగతులను,” ఎలా పరిగణిస్తాడు? ఆయన తెల్పిన విషయాన్ని పౌలు యిలా ఎత్తి చెబుతున్నాడు: “జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును.” దానికి భిన్నంగా దేవుని విషయాలు సాధారణమైనవి, నిర్మలమైనవి, మనోరంజితమైనవి. తెలివిగల క్రైస్తవులు సాతాను వక్రలోకంలోని “గూఢమైన సంగతులను” విడనాడాలి. జ్ఞాపకముంచుకోండి “లోకము దాని ఆశయు గతించిపోవు చున్నవి గా,ని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 కొరింథీయులు 1:19; 2:10; 1 యోహాను 2:17.

18. అంతంవరకు నమ్మకంగావున్న అభిషక్త క్రైస్తవులకు యేసు ఏ దీవెనలను వాగ్దానం చేస్తున్నాడు, మరి పునరుత్థానులైన వీరు అర్మగిద్దోనులో ఏ ఆధిక్యత పొందుతారు?

18 తుయతైరలోనున్న క్రైస్తవులకు యేసు ఇప్పుడు ఉత్తేజపూరితమైన మాటలను చెబుతున్నాడు ఈనాడు అభిషక్త క్రైస్తవులను సహితం అవి ప్రోత్సహిస్తున్నాయి: “నేను నాతండ్రివలన అధికారము పొంది నట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరివాని పాత్రలవలె పగులగొట్టబడుదురు.” (ప్రకటన 2:26, 27) నిజంగా యిదెంతో ఆశ్చర్యకరమైన ఆధిక్యత! అభిషక్త విజయులు వారి పునరుత్థాన సమయంలో పొందబోయే యీ అధికారమేమంటే, అర్మగిద్దోనులో తిరుగుబాటు చేసిన రాజ్యాలను నాశనమనే “యినుప దండమును,” ఉపయోగించునప్పుడు యేసుతోపాటు అందులోభాగం వహించుటే. తుదకు, ఆయన మట్టికుండల్ని పగులగొట్టినట్లే, క్రీస్తు తన శత్రువులపై విరుచుకు పడినపుడు, ఆ రాజ్యాల అణుశక్తియంతా తడిసిన టపాసుల్లా తుస్సుమంటాయి.—కీర్తన 2:8, 9; ప్రకటన 16:14, 16; 19:11-13, 15.

19. (ఎ) “వేకువ చుక్క” ఎవరు, మరి తానెలా జయించువారికి యిస్తాడు? (బి) గొప్పసమూహానికి ఏ ప్రోత్సాహ మియ్యబడింది?

19 యేసు యింకా యిలా అంటున్నాడు: “అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.” (ప్రకటన 2:28) ఈ చుక్కంటే యేసు తానే తర్వాత యిలా వివరిస్తున్నాడు: “నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.” (ప్రకటన 22:16) అవును, యెహోవా బిలాము నోటనుండి బలవంతంగా పలికించిన ప్రవచనాన్ని నెరవేర్చనైవున్నది యేసే: “నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును.” (సంఖ్యాకాండము 24:17) యేసు జయించువారికి “వేకువ చుక్కను,” ఎలా యిస్తాడు? ఆయన వారికి అందుబాటులో వుండడంవల్ల, వారిని తనతో అత్యంత సన్నిహితులుగా, అతిదగ్గరి సంబంధంలోనికి తీసుకొనుటద్వారా అలా చేస్తాడు. (యోహాను 14:2, 3) నిశ్చయంగా, సహించుటకిది శక్తివంతమైన ఆకర్షణే! ఆ “వేకువ చుక్క” యీ భూమిని పరదైసుగా మార్చుటకు త్వరలో తన రాజ్యాధికారాన్ని ఉపయోగిస్తాడని గొప్పసమూహం తెలుసుకొనుట కూడ పురికొల్పుతో కూడినదే!

యథార్థతను కాపాడుకోండి

20. క్రైస్తవమత సామ్రాజ్యంలోవున్న ఏ పరిస్థితులు తుయతైర సంఘంలోని బలహీనతలను మనకు జ్ఞాపకం చేస్తాయి?

20 ఈ వర్తమానం తుయతైరలోని క్రైస్తవులను బహుగా ప్రోత్సహించి యుండవచ్చును. కొంచెం ఊహించండి—పరలోకంలో మహిమనొందిన దేవుని కుమారుడు స్వయంగా తుయతైరలోని క్రైస్తవులకు వారికున్న ఏవో సమస్యలను గూర్చి మాట్లాడాడు! నిశ్చయంగా, సంఘంలో కొద్దిమందైనా అటువంటి ప్రేమపూర్వకమైన కాపుదలకు స్పందించి వుంటారు. ఏడింటిలోను అతిపెద్దదైన యీ వర్తమానం, యీనాడు క్రైస్తవ సంఘాన్ని గుర్తించడానికి కూడా సహాయపడుతుంది. యేసు 1918 లో తీర్పుతీర్చడానికి యెహోవా మందిరానికి వచ్చినప్పుడు, క్రైస్తవులమని చెప్పుకునే చాలా సంస్థలు విగ్రహారాధనలో, ఆత్మీయ అవినీతిలో కూరుకుపోయి వున్నాయి. (యాకోబు 4:4) కొన్ని 19 వ శతాబ్దపు స్వబుద్ధిగల స్త్రీలు అంటే సెవెన్‌త్‌ డే అడ్వంటిస్ట్‌కు చెందిన ఎలెన్‌ వైట్‌, క్రిష్టియన్‌ సైంటిస్ట్‌కు చెందిన మేరీ బేకర్‌ ఎడీ వంటివారి బోధలమీద ఆధారపడివుండేవి, ఇటీవలి కాలంలోనైతే, అనేకమంది స్త్రీలు వేదిక మీదనుండే ప్రసంగిస్తున్నారు. (1 తిమోతి 2:11, 12 పోల్చండి) కాథోలిక్కుల్లోని వివిధ శాఖలవారు తరచూ మరియమ్మను దేవునికంటె, క్రీస్తుకంటె ఎక్కువ గౌరవిస్తారు, ఆరాధిస్తారు. యేసు ఆమెనలా గౌరవించలేదు. (యోహాను 2:4: 19:26) అలా న్యాయవిరుద్ధమైన స్త్రీ ప్రభావాన్ని అనుమతించేవి నిజంగా క్రైస్తవ సంస్థలుగా అంగీకరించ బడగలవా?

21. యేసు వర్తమానంలో తుయతైరలోని ప్రతివ్యక్తికి ఏ గుణపాఠాలున్నవి?

21 యోహాను తరగతివారైనా, వేరేగొర్రెలకు సంబంధించిన ఏ క్రైస్తవుడైనా, యీ వర్తమానాన్ని తప్పక పరిశీలించాలి. (యోహాను 10:16) తుయతైరలోని యెజెబెలు శిష్యులు చేసినట్లే కొందరు సుళువైన మార్గాన్ని అవలంభించడానికి శోధించబడవచ్చు. రాజీపడే శోధనకూడా వుంది. ఈనాడు, రక్తం మిళితమైయున్న పదార్థాలను తినడం, లేక రక్తాన్ని ఎక్కించుకునే వివాదాంశాల నెదుర్కోవలసి వుంటుంది. ప్రాంతీయ సేవలో చురుకుగావుంటూ లేదా ప్రసంగాలిస్తుంటే చాలు, వారు ఇతర వాటికి అంత ప్రాముఖ్యత యివ్వనక్కర్లేదనుకుంటారు అంటే, అతిగా మత్తుపానీయం సేవించడం, హింస దౌర్జన్యమున్న సినిమాలను చూడవచ్చని అనుకుంటారు. తుయతైరలోని క్రైస్తవులకు యేసు యిచ్చిన హెచ్చరిక మనమలాంటి స్వేచ్ఛను తీసుకోకూడదని తెల్పుతుంది. తుయతైరలోని అనేకమంది క్రైస్తవులవలె మనం విభాగింపబడకుండ, నిర్మలంగా, పూర్ణాత్మతో ఉండాలని యెహోవా మనల్ని కోరుతున్నాడు.

22. వినే కోరిక గల్గివుండడంలోగల ప్రాముఖ్యతనెలా యేసు నొక్కి చెబుతున్నాడు?

22 చివరగా యేసు యిలా ప్రకటిస్తున్నాడు: “సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.” (ప్రకటన 2:29) నాల్గవసారి యేసు యిక్కడ యీ ఉత్తేజపూరిత పిలుపును మరలా యిస్తున్నాడు, అది యింకను రానైయున్న వర్తమానములను అలాగే ముగిస్తుంది. వినగల చెవులు మీకున్నాయా? అలాగైతే, దేవుడు తన మధ్యవర్తిద్వారా, తన పరిశుద్ధాత్మ వలన యిస్తూనేవున్న సలహాను శ్రద్ధగా వింటూనే వుండండి.

[అధస్సూచీలు]

^ పేరా 11 ఉదాహరణకు, అవేక్‌! మే 22, 1978 లో “ఉమెన్స్‌ రోల్‌ ఇన్‌ ది ఫస్ట్‌ సెంచరీ కాంగ్రిగేషన్‌” అనే శీర్షికను చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[51వ పేజీలోని చిత్రం]

ఈనాడు నమ్మకస్థులైన సహోదరీలు దైవీక అధికారానికి తగురీతిగా మద్దతు నివ్వడంద్వారా సాక్ష్యమిచ్చే పనిలో చాలా భాగం నెరవేర్చ బడుతోంది