అనుబంధం A
మనం బోధించడానికి ఇష్టపడే సత్యాలు
యథార్థ హృదయంగల వాళ్లు సత్యాన్ని విన్నప్పుడు దాన్ని గుర్తుపడతారని యేసు చెప్పాడు. (యోహా. 10:4, 27) కాబట్టి మనం ఇతరులతో మాట్లాడినప్పుడు చిన్నచిన్న బైబిలు సత్యాల్ని చెప్పాలనుకుంటాం. ఏదైనా బైబిలు సత్యాన్ని ఇలా పరిచయం చేసి చూడండి: “మీకు ఇది తెలుసా?” లేదా “మీరు ఎప్పుడైనా ఇది విన్నారా?” తర్వాత దానికి సంబంధించిన లేఖనాల్ని చూపించి వివరించండి. మనం కేవలం ఒక చిన్న బైబిలు సత్యాన్ని పంచుకుంటే చాలు, వాళ్ల హృదయంలో సత్యపు విత్తనాల్ని నాటినవాళ్లమౌతాం. అప్పుడు దేవుడు దాన్ని పెరిగేలా చేయగలడు! —1 కొరిం. 3:6, 7.
భవిష్యత్తు
-
1. ప్రస్తుత సంఘటనల్ని, మనుషుల స్వభావాన్ని చూస్తే త్వరలోనే ఒక మార్పు రాబోతుందని అర్థమౌతుంది.—మత్త. 24:3, 7, 8; లూకా 21:10, 11; 2 తిమో. 3:1-5.
-
2. భూమి ఎప్పటికీ నాశనం కాదు.—కీర్త. 104:5; ప్రసం. 1:4.
-
3. కాలుష్యం లేకుండా పోతుంది, భూమి అందమైన తోటలా మారుతుంది.—యెష. 35:1, 2; ప్రక. 11:18.
-
4. మనుషులంతా ఎప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉంటారు.—యెష. 33:24; 35:5, 6.
-
5. మీరు ఈ భూమ్మీద శాశ్వతంగా జీవించవచ్చు.—కీర్త. 37:29; మత్త. 5:5.
కుటుంబం
-
6. భర్త “తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి.”—ఎఫె. 5:33; కొలొ. 3:19.
-
7. భార్యకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.—ఎఫె. 5:33; కొలొ. 3:18.
-
8. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి.—మలా. 2:16; మత్త. 19:4-6, 9; హెబ్రీ. 13:4.
-
9. అమ్మానాన్నల మాట వింటూ, వాళ్లను గౌరవించే పిల్లలు విజయం సాధిస్తారు. —సామె. 1:8, 9; ఎఫె. 6:1-3.
దేవుడు
-
10. దేవునికి ఒక పేరు ఉంది.—కీర్త. 83:18; యిర్మీ. 10:10.
-
11. దేవుడు తన ఆలోచనల్ని మనకు తెలియజేస్తున్నాడు.—2 తిమో. 3:16, 17; 2 పేతు. 1:20, 21.
-
12. దేవుడు న్యాయవంతుడు, ఆయనకు పక్షపాతం లేదు.—ద్వితీ. 10:17; అపొ. 10:34, 35.
-
13. దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు.—కీర్త. 46:1; 145:18, 19.
ప్రార్థన
-
14. మనం తనకు ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు.—కీర్త. 62:8; 65:2; 1 పేతు. 5:7.
-
15. మనం ఎలా ప్రార్థించాలో బైబిలు నేర్పిస్తుంది.—మత్త. 6:7-13; లూకా 11:1-4.
-
16. మనం వీలైనన్నిసార్లు ప్రార్థించాలి. —మత్త. 7:7, 8; 1 థెస్స. 5:17.
యేసు
-
17. యేసు గొప్ప బోధకుడు, ఆయన ఇచ్చిన సలహాలు మనకు ఇప్పటికీ ఎంతో ఉపయోగపడతాయి.—మత్త. 6:14, 15, 34; 7:12.
-
18. నేడు మనం చూస్తున్న సంఘటనల గురించి యేసు ముందే చెప్పాడు.—మత్త. 24:3, 7, 8, 14; లూకా 21:10, 11.
-
19. యేసు దేవుని కుమారుడు.—మత్త. 16:16; యోహా. 3:16; 1 యోహా. 4:15.
-
20. యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు కాదు.—యోహా. 14:28; 1 కొరిం. 11:3.
దేవుని రాజ్యం
-
21. దేవుని రాజ్యం పరలోకంలో ఉన్న నిజమైన ప్రభుత్వం.—దాని. 2:44; 7:13, 14; మత్త. 6:9, 10; ప్రక. 11:15.
-
22. దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసి, వాటి స్థానంలోకి వస్తుంది. —కీర్త. 2:7-9; దాని. 2:44.
-
23. మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలకు దేవుని రాజ్యం ఒక్కటే పరిష్కారం. —కీర్త. 37:10, 11; 46:9; యెష. 65:21-23.
బాధలు
-
24. దేవుడు మన బాధలకు కారణం కాదు.—ద్వితీ. 32:4; యాకో. 1:13.
-
25. లోకాన్ని పరిపాలిస్తున్నది సాతాను.—లూకా 4:5, 6; 1 యోహా. 5:19.
-
26. దేవుడు మన బాధల్ని చూస్తున్నాడు, మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు.—కీర్త. 34:17-19; యెష. 41:10, 13.
-
27. దేవుడు త్వరలోనే ఈ బాధలన్నిటినీ తీసివేస్తాడు.—యెష. 65:17; ప్రక. 21:3, 4.
మరణం
-
28. చనిపోయిన వాళ్లకు ఏమీ తెలియదు; వాళ్లు ఎక్కడా, ఏ బాధా అనుభవించట్లేదు.—ప్రసం. 9:5; యోహా. 11:11-14.
-
29. చనిపోయిన వాళ్లు మనకు సహాయం గానీ, హాని గానీ చేయలేరు.—కీర్త. 146:4; ప్రసం. 9:6, 10.
-
30. చనిపోయిన మనవాళ్లు బ్రతికించబడతారు.—యోబు 14:13-15; యోహా. 5:28, 29; అపొ. 24:15.
-
31. “మరణం ఇక ఉండదు.”—ప్రక. 21:3, 4; యెష. 25:8.
మతం
-
32. మతాలన్నీ దేవున్ని సంతోషపెట్టవు.—యిర్మీ. 7:11; మత్త. 7:13, 14, 21-23.
-
33. పైకి ఒకలా లోపల ఒకలా ఉండేవాళ్లంటే దేవునికి అసహ్యం.—యెష. 29:13; మీకా 3:11; మార్కు 7:6-8.
-
34. స్వార్థంలేని ప్రేమను బట్టి నిజమైన మతాన్ని గుర్తుపట్టవచ్చు.—మీకా 4:3; యోహా. 13:34, 35.