శిష్యుల్ని చేసేటప్పుడు
పాఠం 12
నిర్మొహమాటంగా మాట్లాడండి
సూత్రం: “నూనె, ధూపం హృదయాన్ని సంతోషపెట్టినట్టే నిజాయితీతో ఇచ్చిన సలహా నుండి చిగురించే తియ్యని స్నేహం హృదయాన్ని సంతోషపెడుతుంది.”—సామె. 27:9.
యేసు ఏం చేశాడు?
1. వీడియో చూడండి, లేదా మార్కు 10:17-22 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
2. మన విద్యార్థులు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలంటే వాళ్లు ఏమేం చేయాలో ప్రేమగా చెప్తూనే నిర్మొహమాటంగా కూడా మాట్లాడాలి.
యేసులా ఉందాం
3. మీ విద్యార్థి లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకునేలా సహాయం చేయండి.
-
ఎ. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ప్రతీ పాఠంలో ఉన్న “ఇలా చేసి చూడండి” అనే భాగాన్ని ఉపయోగించండి.
-
బి. మీ విద్యార్థి చిన్నచిన్న లక్ష్యాలు అలాగే పెద్ద లక్ష్యాలు చేరుకోవడానికి ఏమేం చేయాలో తెలుసుకునేలా సహాయం చేయండి.
-
సి. మీ విద్యార్థి సాధిస్తున్న ప్రగతిని బట్టి ఆయన్ని మెచ్చుకుంటూ ఉండండి.
4. మీ విద్యార్థి ఎదుర్కొంటున్న ఆటంకాలు గుర్తించి, వాటిని అధిగమించేలా ఆయనకు సహాయం చేయండి.
-
-
‘బాప్తిస్మం వైపుగా ప్రగతి సాధించకుండా నా విద్యార్థిని ఏది ఆపుతుంది?’
-
‘ఆయనకు నేను ఎలా సహాయం చేయగలను?’
-
-
బి. మీ విద్యార్థి ఏమేం చేయాలో ప్రేమగా చెప్తూనే, నిర్మొహమాటంగా కూడా మాట్లాడే ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించండి.
5. ప్రగతి సాధించని స్టడీలను ఆపేయండి.
-
ఎ. మీ విద్యార్థి ప్రగతి సాధిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి ఇలా ప్రశ్నించుకోండి:
-
‘నా విద్యార్థి నేర్చుకున్న వాటిని పాటిస్తున్నాడా?’
-
‘మీటింగ్స్కు వస్తూ, నేర్చుకున్న సత్యాల్ని ఇతరులతో పంచుకుంటున్నాడా?’
-
‘చాలా కాలంగా స్టడీ జరుగుతున్నట్లయితే, ఆయన ఒక యెహోవాసాక్షి అవ్వడానికి ఇష్టపడుతున్నాడా?’
-
-
బి. ఒకవేళ మీ బైబిలు విద్యార్థి ప్రగతి సాధించడానికి ఇష్టపడకపోతే:
-
ప్రగతి సాధించకుండా ఆయన్ని ఏది ఆపుతుందో ఆలోచించమనండి.
-
మీరు స్టడీని ఎందుకు ఆపేస్తున్నారో దయగా వివరించండి.
-
మళ్లీ స్టడీ మొదలుపెట్టాలంటే ఆయన ఏమేం చేయాలో చెప్పండి.
-