కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మళ్లీ కలిసినప్పుడు

పాఠం 8

ఓర్పు చూపించండి

ఓర్పు చూపించండి

సూత్రం: ‘ప్రేమ ఓర్పు చూపిస్తుంది.’—1 కొరిం. 13:4.

యేసు ఏం చేశాడు?

1. వీడియో చూడండి, లేదా యోహాను 7:3-5 అలాగే 1 కొరింథీయులు 15:3, 4, 7 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1.   ఎ. మొదట్లో యేసు తమ్ముళ్లు ఆయన చెప్పిన దానికి ఎలా స్పందించారు?

  2.  బి. తన తమ్ముడైన యాకోబు మీద యేసు ఆశను వదులుకోలేదని ఎందుకు చెప్పవచ్చు?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. కొంతమంది మంచివార్తను అంగీకరించడానికి ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి మనం ఓర్పు చూపించాలి.

యేసులా ఉందాం

3. వేరేలా ప్రయత్నించి చూడండి. ఒకవేళ ఆ వ్యక్తి బైబిలు స్టడీకి వెంటనే ఒప్పుకోకపోతే బలవంతపెట్టకండి. సందర్భానికి తగ్గట్టు వీడియోల్ని లేదా ఆర్టికల్స్‌ని చూపించి బైబిలు స్టడీ అంటే ఏంటో, బైబిలు స్టడీ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి.

4. ఇతరులతో పోల్చకండి. అందరూ ఒకేలా ఉండరు. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు లేదా రిటన్‌ విజిట్‌వాళ్లు బైబిలు స్టడీకి ఒప్పుకోకపోతే లేదా ఏదైనా బైబిలు సత్యాన్ని అంగీకరించకపోతే, దానికి కారణం ఏమై ఉంటుందో ఆలోచించండి. బలంగా పాతుకుపోయిన నమ్మకాలు ఆయన్ని ఆపుతున్నాయా? ఆయన బంధువుల నుండి లేదా చుట్టూ ఉన్న వాళ్ల నుండి ఏదైనా ఒత్తిడిని ఎదుర్కుంటున్నాడా? మీరు చెప్పిన దాని గురించి ఆలోచించేలా, బైబిలుకున్న విలువను గుర్తించేలా ఆయనకు కొంచెం టైం ఇవ్వండి.

5. ఆసక్తి చూపించిన వ్యక్తి గురించి ప్రార్థించండి. ఆశ వదులుకోకుండా ఉండేలా, నేర్పుగా మాట్లాడేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. అంతగా ఆసక్తిలేని వాళ్లు ఎవరో, వాళ్లను కలవడం ఎప్పుడు ఆపేయాలో గుర్తించేలా వివేచనను ఇవ్వమని ప్రార్థించండి.—1 కొరిం. 9:26.