కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2022 గణాంకాలు

2022 గణాంకాలు
  • యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలు: 86

  • రిపోర్టు చేసిన దేశాల సంఖ్య: 239

  • మొత్తం సంఘాలు: 1,17,960

  • ప్రపంచవ్యాప్త జ్ఞాపకార్థ ఆచరణ హాజరు: 1,97,21,672

  • ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించిన వాళ్ల సంఖ్య: 21,150

  • ప్రచారకుల a శిఖరాగ్ర సంఖ్య: 86,99,048

  • ప్రతీనెల ప్రకటనా పని చేస్తున్న సగటు ప్రచారకుల సంఖ్య: 85,14,983

  • 2021 కంటే పెరుగుదల శాతం: 0.4

  • బాప్తిస్మం b తీసుకున్న వాళ్ల మొత్తం సంఖ్య: 1,45,552

  • ప్రతీనెల సగటు పయినీరు c ప్రచారకుల సంఖ్య: 14,89,252

  • ప్రతీనెల సగటు సహాయ పయినీరు ప్రచారకుల సంఖ్య: 3,81,310

  • పరిచర్యలో గడిపిన మొత్తం గంటలు: 1,50,17,97,703

  • ప్రతీనెల సగటు బైబిలు అధ్యయనాల d సంఖ్య: 56,66,996

2022 సేవా సంవత్సరంలో, e క్షేత్ర సేవ నియామకాల్లో సేవచేస్తున్న ప్రత్యేక పయినీర్లను, మిషనరీలను, ప్రాంతీయ పర్యవేక్షకులను చూసుకోవడానికి యెహోవాసాక్షులు 242 మిలియన్‌ డాలర్లు వెచ్చించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రాంచి కార్యాలయాల్లో మొత్తం 21,629 మంది నియమిత సేవకులు పనిచేస్తున్నారు. వీళ్లంతా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త ప్రత్యేక పూర్తికాల సేవకుల బృందానికి చెందినవాళ్లే.

a ప్రచారకుడు అనే పదం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను చురుగ్గా చాటే లేదా ప్రకటించే వ్యక్తిని సూచిస్తుంది. (మత్తయి 24:14) ఈ సంఖ్యను ఎలా లెక్కిస్తామో తెలుసుకోవడానికి, jw.org వెబ్‌సైట్‌లో “ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు?” అనే ఆర్టికల్‌ చూడండి.

b ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి jw.org వెబ్‌సైట్‌లో “నేను ఓ యెహోవాసాక్షి అవ్వాలంటే ఏం చేయాలి?” అనే ఆర్టికల్‌ చూడండి.

c పయినీరు అనే పదం, బాప్తిస్మం తీసుకొని ఆదర్శంగా ఉంటూ మంచివార్త ప్రకటించడానికి స్వచ్ఛందంగా ప్రతీనెల నిర్దిష్టమైన గంటలు వెచ్చించే ఓ యెహోవాసాక్షిని సూచిస్తుంది.

d మరింత సమాచారం కోసం jw.org వెబ్‌సైట్‌లో “యెహోవాసాక్షులు అందించే బైబిలు స్టడీ కోర్సు అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

e 2021, సెప్టెంబరు 1 నుండి 2022, ఆగస్టు 31 వరకున్న సమయాన్ని 2022 సేవా సంవత్సరం అంటారు.