నా బైబిలు కథల పుస్తకము

బైబిలు నుండి తయారు చేసిన 116 కథలను చదివి ఆనందించండి. ఈ కథలు ఖచ్చితమైనవి, తేలిగ్గా అర్థమౌతాయి, కథలను అందంగా వివరించారు.

ముందుమాట

ప్రపంచంలోనే గొప్పదైన పుస్తకం బైబిలు, అందులోనుండి తీసిన నిజమైన కథలు. సృష్టి మొదలైనప్పటి నుండి ప్రపంచ చరిత్ర అంతటిని గురించి ఈ కథలు వివరిస్తాయి.

1వ కథ

దేవుడు సృష్టిని ప్రారంభించడం

ఆదికాండములో ఉన్న సృష్టి కథ, పెద్ద పిల్లలతో పాటు చిన్న పిల్లలకు కూడా త్వరగా అర్థమవుతుంది. చాలా నచ్చుతుంది.

2వ కథ

ఒక అందమైన తోట

ఆదికాండము ప్రకారం దేవుడు ఏదెను తోటను చాలా ప్రత్యేకమైనదానిగా చేశాడు. ఆ అందమైన తోటలాగే భూమంతా అందంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు.

3వ కథ

మొదటి పురుషుడు, స్త్రీ

దేవుడు ఆదాము హవ్వను చేసి ఏదెను తోటలో ఉంచాడు. వాళ్లే లోకంలో మొదట పెళ్లైన వాళ్లు.

4వ కథ

వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం

మొదట్లో ఉన్న పరదైసు ఎలా పోయిందో, బైబిలు పుస్తకమైన ఆదికాండములో ఉంది.

5వ కథ

కష్టమైన జీవితం మొదలవడం

ఏదెను తోట బయట ఆదాము హవ్వలకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. వాళ్లు దేవునికి విధేయత చూపించివుంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు సంతోషంగా జీవించేవారు.

6వ కథ

మంచి కుమారుడు, చెడ్డ కుమారుడు

ఆదికాండములో ఉన్న కయీను హేబెలు కథ నుండి మనం దేవునికి ఇష్టమైన వాళ్లుగా ఉండాలంటే ఎలా ఉండాలో, పరిస్థితులు మారిపోకముందే మనం ఎలా ఉండడం మానుకోవాలో తెలుస్తుంది.

7వ కథ

ఒక ధైర్యవంతుడు

చుట్టూవున్న ప్రజలు చెడ్డ పనులు చేస్తున్నా మనం మాత్రం మంచి పనులు చేయవచ్చని హనోకును చూసి నేర్చుకోవచ్చు.

8వ కథ

భూమిపై రాక్షసులు

ఆదికాండము 6వ అధ్యాయం ప్రజల్ని ఏడిపించిన రాక్షసుల గురించి చెప్తుంది. ఆ రాక్షసులను నెఫీలులు అని పిలిచేవాళ్లు. వాళ్ళ తండ్రులు పరలోకంనుండి కిందికి వచ్చి మనుషుల్లా జీవించిన దేవదూతలు.

9వ కథ

నోవహు ఓడను నిర్మించడం

వేరేవాళ్లు వినకపోయినా నోవహు ఆయన కుటుంబం దేవుని మాట విన్నారు కాబట్టి జలప్రవయంలో చనిపోకుండా బ్రతికారు.

10వ కథ

గొప్ప జలప్రవయం

జలప్రవయం వస్తుందని నోవహు చెప్పినప్పుడు ప్రజలు నవ్వారు. కానీ ఆకాశం నుండి వర్షం కురవడం మొదలైనప్పుడు ఇంక అలా నవ్వలేకపోయారు. నోవహు ఓడ నోవహును, ఆయన కుటుంబాన్ని, చాలా జంతువుల్ని ఎలా కాపాడిందో తెలుసుకోండి.

11వ కథ

మొదటి వర్షధనుస్సు

మీరు వర్షధనుస్సును చూసినప్పుడు దేనిని జ్ఞాపకం చేసుకోవాలి?

12వ కథ

ప్రజలు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం

దేవునికి నచ్చలేదు, ఆయన ఇచ్చిన శిక్ష ప్రజలు ఇంకా అనుభవిస్తున్నారు.

13వ కథ

అబ్రాహాము—దేవుని స్నేహితుడు

అబ్రాహాము ఎందుకు ఊరులోవున్న సౌకర్యవంతమైన ఇంటిని విడిచిపెట్టి తన మిగిలిన జీవితమంతా గుడారాల్లో నివసించాడు?

14వ కథ

దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం

దేవుడు అబ్రాహామును తన కొడుకు ఇస్సాకును బలివ్వమని ఎందుకు అడిగాడు?

15వ కథ

లోతు భార్య వెనక్కి చూడడం

ఆమె చేసిన దాని నుండి మనకొక విలువైన పాఠం ఉంది.

16వ కథ

ఇస్సాకుకు మంచి భార్య లభించడం

రిబ్కాను మంచి భార్యగా చేసింది ఏమిటి? ఆమె అందమా లేదా వేరే ఏదైనానా?

17వ కథ

భిన్నమైన కవల పిల్లలు

యాకోబు ఏశావుల నాన్న ఇస్సాకు ఏశావును ఎక్కువ ప్రేమించాడు, కానీ వాళ్ల అమ్మ రిబ్కా యాకోబును ఎక్కువ ప్రేమించింది.

18వ కథ

యాకోబు హారానుకు వెళ్ళడం

యాకోబు రాహేలును ప్రేమించినా ముందు లేయాను పెళ్లి చేసుకున్నాడు.

19వ కథ

యాకోబు పెద్ద కుటుంబం

ఇశ్రాయేలు 12 గోత్రాలు యాకోబు 12 మంది కుమారుల పేర్లమీద వచ్చాయా??

20వ కథ

దీనా కష్టాల్లో చిక్కుకోవడం

చెడ్డ స్నేహితులవల్ల ఇదంతా జరిగింది.

21వ కథ

యోసేపు సహోదరులు ఆయనను ద్వేషించడం

యోసేపు అన్నలు ఎందుకు సొంత తమ్నున్ని చంపాలనుకుంటారు?

22వ కథ

యోసేపు చెరసాలలో వేయబడడం

ఆయన అక్కడికి తప్పు చేసి వెళ్లలేదు, కానీ సరైనది చేసినందుకే వెళ్లాడు.

23వ కథ

ఫరో కలలు

ఏడు ఆవుల, ఏడు వెన్నుల కలల భావం ఒక్కటే.

24వ కథ

యోసేపు తన సహోదరులను పరీక్షించడం

ఆయన్ని దాసుడిగా అమ్మేసినప్పటి నుండి వాళ్లు మారారో లేదో ఆయన ఎలా తెలుసుకుంటాడు?

25వ కథ

కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళడం

యాకోబు కుటుంబ సభ్యుల్ని యాకోబీయులు అని పిలవకుండా ఇశ్రాయేలీయులు అని ఎందుకు పిలుస్తున్నారు?

26వ కథ

యోబు దేవునికి నమ్మకంగా ఉండడం

యోబు ఆస్తి, ఆరోగ్యం, పిల్లలు అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడు యోబును శిక్షిస్తున్నాడా?

27 కథ

ఒక చెడ్డరాజు ఐగుప్తును పరిపాలించడం

ఆయన హెబ్రీయుల మగపిల్లలనందరినీ చంపేయమని ఆయన ప్రజలతో ఎందుకు చెప్తాడు?

28వ కథ

పసివాడైన మోషే రక్షించబడడం

అతని తల్లి ఇశ్రాయేలీయుల మగ పిల్లలనందరినీ చంపేయాలనే ఆజ్ఞనుండి తప్పించుకునే మార్గాన్ని చూసుకుంది.

29వ కథ

మోషే పారిపోవడానికిగల కారణం

మోషేకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు అతను ఇశ్రాయేలీయులను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడనుకున్నాడు, కానీ అతను సిద్ధం కాదు.

30వ కథ

మండుతున్న పొద

ఒకదాని తర్వాత ఒకటి చాలా అధ్భుతాలతో, దేవుడు మోషేతో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తునుండి విడిపించడానికి మోషేకు సమయం వచ్చిందని చెప్తాడు.

31వ కథ

మోషే అహరోనులు ఫరోను కలవడం

మోషే మాట విని ఫరో ఇశ్రాయేలీయులను ఎందుకు వదిలేయలేదు?

32వ కథ

పది తెగుళ్ళు

దేవుడు ఐగుప్తు మీదికి పది తెగుళ్ళు తెప్పించాడు, ఇదంతా ఫరో ఇశ్రాయేలీయుల్ని పోనీకుండా ఉన్నందువల్లే ఇలా జరిగింది.

33వ కథ

ఎర్ర సముద్రాన్ని దాటడం

దేవుని శక్తితో మోషే ఎర్ర సముద్రం విడిపోయేలా చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద నడిచి అవతలికి వెళ్తున్నారు.

34వ కథ

ఒక క్రొత్త రకమైన ఆహారం

ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని దేవుడు పరలోకం నుండి ఇచ్చాడు.

35వ కథ

యెహోవా తన నియమాలను ఇవ్వడం

పది ఆజ్ఞలకన్నా ఏ రెండు ఆజ్ఞలు గొప్పవి?

36వ కథ

బంగారు దూడ

చెవులకున్న పోగులను కరిగించి చేసిన విగ్రహానికి ప్రజలు ఎందుకు మ్రొక్కుతారు?

37వ కథ

ఆరాధన కోసం ఒక గుడారం

గుడారంలో చిన్న గదిలో నిబంధన మందసం ఉండేది, పెద్ద గదిలో దీపాలు, బలిపీఠము ఉండేవి.

38వ కథ

పన్నెండు మంది వేగులవారు

వేగు చూడడానికి వెళ్లినవాళ్లలో 10మంది ఒక రకమైన సమాచారాన్ని ఇస్తే మిగిలిన ఇద్దరు వేరేలా ఇస్తారు. మరి ఇశ్రాయేలీయులు దేన్ని నమ్ముతారు?

39వ కథ

అహరోను కర్రకు పువ్వులు పూయడం

ఎండిపోయిన కర్రకు రాత్రికిరాత్రే పువ్వులు, బాదం పండ్లు ఎలా కాస్తాయి?

40వ కథ

మోషే బండను కొట్టడం

మోషేకు ఫలితం వచ్చింది కానీ ఆయన యెహోవాకు కోపం కూడా తెప్పించాడు.

41వ కథ

ఇత్తడి పాము

ఇశ్రాయేలీయుల్ని కాటేయడానికి యెహోవా విషపూరితమైన పాములను ఎందుకు పంపాడు?

42వ కథ

గాడిద మాట్లాడడం

బిలాము చూడలేకపోయిన ఒకదాన్ని ఆయన గాడిద చూసింది.

43వ కథ

యెహోషువ నాయకుడు కావడం

మోషే ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు, మరి ఆయన స్థానంలో దేవుడు యెహోషువను ఎందుకు నియమించాడు?

44వ కథ

రాహాబు వేగులవాళ్లను దాచిపెట్టడం

రాహాబు ఇద్దరు వ్యక్తులకు ఎలా సహాయం చేస్తుంది? ఆమె వాళ్లను తిరిగి ఏ సహాయం అడుగుతుంది?

45వ కథ

యోర్దాను నది దాటడం

యాజకులు నీటిలోకి దిగగానే ఓ అద్భుతం జరిగింది.

46వ కథ

యెరికో గోడలు

గోడ కూలిపోకుండా ఓ తాడు ఎలా ఆపగలదు?

47వ కథ

ఇశ్రాయేలులో దొంగ

కేవలం ఒక్క చెడ్డ వ్యక్తి పూర్తి జనాంగానికి ఇబ్బందులు తీసుకురాగలడా?

48వ కథ

తెలివైన గిబియోనీయులు

యెహోషువను, ఇతర ఇశ్రాయేలీయులను తెలివిగా మభ్యపెట్టి వాళ్లతో ప్రమాణం చేయించుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు తమ మాటను నిలబెట్టుకున్నారు.

49వ కథ

సూర్యుడు అలాగే నిలిచిపోవడం

యెహోవా ఇంతకుముందున్నెడూ చేయనిదాన్ని యెహోషువ కోసం చేశాడు.

50వ కథ

ధైర్యంగల ఇద్దరు స్త్రీలు

ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించింది బారాకు అయితే యాయేలు ఎందుకు ఘనత పొందింది?

51వ కథ

రూతు, నయోమి

రూతు తిరిగివెళ్లకుండా నయోమితో ఉండిపోయి యెహోవాను సేవిస్తుంది.

52వ కథ

గిద్యోను, అతని 300 మంది పురుషులు

దేవుడు ఓ అసాధారణమైన పరీక్షను పెట్టి కొంతమంది సైనికుల్ని ఎంచుకున్నాడు.

53వ కథ

యెఫ్తా వాగ్దానం

యెఫ్తా యెహోవాకు ఇచ్చిన మాటలో ఆయనే కాదు ఆయన కూతురు కూడా ఇమిడి ఉంది.

54వ కథ

గొప్ప బలంగల వ్యక్తి

సమ్సోను బలం వెనుక ఉన్న కారణం దెలీలాకు ఎలా తెలుస్తుంది?

55వ కథ

చిన్నపిల్లవాడు దేవుణ్ణి సేవించడం

ప్రధాన యాజకుడైన ఏలీకి బాధకలిగించే ఓ విషయాన్ని చెప్పడానికి దేవుడు చిన్నవాడైన సమూయేలు ఉపయోగించుకుంటాడు.

56వ కథ

సౌలు—ఇశ్రాయేలు మొదటి రాజు

దేవుడు, ముందు ఎంచుకొని ఆ తర్వాత తిరస్కరించిన సౌలు నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు?

57వ కథ

దేవుడు దావీదును ఎన్నుకోవడం

దేవుడు దావీదులో చూసిన ఏ విషయాన్ని సమూయేలు ప్రవక్త చూడలేదు?

58వ కథ

దావీదు, గొల్యాతు

కేవలం వడిసెలతో కాదుగానీ అంతకన్నా శక్తిమంతమైన అయుధంతో దావీదు గొల్యాతుతో యుద్ధం చేశాడు.

59వ కథ

దావీదు ఎందుకు పారిపోవలసి వచ్చింది

సౌలు ముందు దావీదును చూసి సంతోషించాడు, కానీ తర్వాత అతన్ని చంపేయాలన్నంత అసూయ అతనిపై పెంచుకున్నాడు. ఎందుకు?

60వ కథ

అబీగయీలు, దావీదు

అబీగయీలు తన భర్తను బుద్ధహీనుడని పిలిచినా అది అతని ప్రాణాన్ని తాత్కాలికంగా కాపాడుతుంది.

61వ కథ

దావీదు రాజుగా చేయబడడం

తాను చేసిన పనిని బట్టి అలాగే తాను చేయడానికి నిరాకరించిన పనిని బట్టి తాను ఇశ్రాయేలుకు రాజు అవ్వడానికి అర్హుడనని దావీదు నిరూపించుకుంటాడు.

62వ కథ

దావీదు ఇంట్లో శ్రమ

ఒక్క చెడ్డ పని చేసి, దావీదు తనూ తన కుటుంబసభ్యలూ కొన్ని సంవత్సరాలు శ్రమ అనుభవించేలా చేసుకున్నాడు

63వ కథ

జ్ఞానియైన సొలొమోను రాజు

అతను నిజంగా బిడ్డను రెండు ముక్కలు చేస్తాడా?

64వ కథ

సొలొమోను ఆలయాన్ని నిర్మించడం

ఎంతో తెలివైనవాడైనప్పటికీ, సొలొమోను తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుని తప్పులు చేశాడు

65వ కథ

రాజ్యం విభాగించబడడం

యరొబాము పరిపాలన మొదలైన వెంటనే, ప్రజలు దేవుని నియమాల్ని మీరేలా చేశాడు.

66వ కథ

యెజెబెలు—ఒక దుష్ట రాణి

తనకు కావాల్సింది దక్కించుకోవడానకి ఆమె ఏమి చేయడానికైనా వెనకాడదు.

67వ కథ

యెహోషాపాతు యెహోవాపై నమ్మకం ఉంచడం

ఆయుధాలు లేని గాయకులను ముందు నిలువబెట్టి యుద్ధానికి ఎందుకు వెళ్తారు?

68వ కథ

తిరిగి బ్రతికిన ఇద్దరు అబ్బాయిలు

చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించడం వీలౌతుందా? కానీ ఒకప్పుడు అది జరిగింది.

69వ కథ

ఒక బాలిక శక్తిమంతుడైన వ్యక్తికి సహాయం చేయడం

ఆ అమ్మాయికి మాట్లాడే ధైర్యం ఉంది. దానివల్ల ఓ అద్భుతం జరిగింది.

70వ కథ

యోనా, పెద్ద చేప

యెహోవా చెప్పిన పని చేయాలనే ఒక ముఖ్యమైన పాఠాన్ని యోనా నేర్చుకున్నాడు.

71వ కథ

దేవుడు ఒక పరదైసును వాగ్దానం చేయడం

మొదట్లో భూమిలో కొంతభాగం మాత్రమే పరదైసుగా ఉండేది. కానీ త్వరలో భూమంతా పరదైసుగా మారుతుంది.

72వ కథ

హిజ్కియా రాజుకు దేవుడు సహయం చేయడం

దేవదూత ఒక్క రాత్రిలోనే 1,85,000 మంది అష్షూరు సైనికులను చంపేశాడు.

73వ కథ

ఇశ్రాయేలీయుల చివరి మంచి రాజు

చిన్నవాడైన యోషీయా ధైర్యంగా ఓ పని చేశాడు.

74వ కథ

భయపడని వ్యక్తి

ప్రవక్తగా ఉండడానికి తాను బాలుడినేనని యిర్మియా అనుకున్నాడు. కానీ ఆయన ఆ పనిని చేయగలడని యెహోవాకు తెలుసు.

75వ కథ

బబులోనులో నలుగురు యువకులు

వాళ్లు కుటుంబం నుంచి వేరుగా ఉన్నప్పటికీ వాళ్ల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు.

76వ కథ

యెరూషలేము నాశనం కావడం

ఇశ్రాయేలీయుల శత్రువులైన బబులోనీయులు, యోరూషలేమును నాశనం చేసేలా ఎందుకు అనుమతించాడు?

77వ కథ

వాళ్లు సాగిలపడలేదు

విధేయులైన ఈ ముగ్గురు హెబ్రీ యువకుల్ని, ముండుతున్న అగ్నిగుండం నుండి దేవుడు కాపాడతాడా?

78వ కథ

గోడమీద చేతివ్రాత

దానియేలు ప్రవక్త నాలుగు వింత పదాల అర్థాన్ని వివరించాడు.

79వ కథ

సింహాల బోనులో దానియేలు

దానియేలుకు మరణశిక్షగురించి తెలిసినప్పుడు, ప్రార్థన చేయడం ఆపేయాలనుకున్నాడా?

80వ కథ

దేవుని ప్రజలు బబులోనును విడిచి వెళ్లడం

పారసీక రాజు కోరేషు, బబులోనును స్వాధీనం చేసుకున్నప్పుడు ఒక ప్రవచనం నెరవేరింది, అలాగే ఇప్పుడు ఆయన మరో ప్రవచనాన్ని నెరవేరుస్తాడు.

81వ కథ

దేవుని సహాయంపై నమ్మకం ఉంచడం

ఇశ్రాయేలీయులు మానవుల చట్టాలను ఎదిరించి దేవునికి లోబడ్డారు. దేవుడు వాళ్లను ఆశీర్వదించాడా?

82వ కథ

మొర్దెకై, ఎస్తేరు

రాణి వష్తి ఎంతో అందమైనది అయినప్పటికి, రాజైనా అహష్వేరేషు ఆమె స్థానాన్ని ఎస్తేరుకు ఇచ్చాడు ఎందుకు?

83వ కథ

యెరూషలేము గోడలు

గోడలను తిరిగి నిర్మిస్తున్నప్పుడు, అక్కడ పనిచేసేవాళ్లు తమ కత్తులను, ఈటెలను తప్పకుండా వాళ్ల దగ్గర పగలు, రాత్రి ఉంచుకోవాలి.

84వ కథ

ఒక దూత మరియను దర్శించడం

ఆయన దేవుని నుండి ఓ వార్తను తెస్తాడు. యుగయుగాలకు రాజుగా ఉండే ఓ శిశువును మరియ కంటుందనేదే ఆ వార్త.

85వ కథ

యేసు పశువుల కొట్టంలో జన్మించడం

భవిష్యత్తులో రాజు కాబోయే వ్యక్తి పశువుల కొట్టంలో ఎందుకు పుట్టాడు?

86వ కథ

నక్షత్రం ద్వారా నడిపించబడిన మనుష్యులు

జ్యోతిష్కుల్ని యేసు ఉండే చోటుకు ఎవరు నడిపించారు? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

87వ కథ

దేవాలయంలో బాల యేసు

దేవాలయంలో బోధించే పెద్దవాళ్లు కూడా ఆశ్చర్యపోయే విషయాలు యేసుకు తెలుసు.

88వ కథ

యోహాను యేసుకు బాప్తిస్మమివ్వడం

యోహాను బాప్తిస్మం ఇస్తున్నాది పాపులకు? అయితే యేసు ఎప్పుడూ పాపం చేయలేదు. మరి యోహాను ఆయనకు ఎందుకు బాప్తిస్మం ఇచ్చాడు?

89వ కథ

యేసు దేవాలయాన్ని శుభ్రపరచడం

యేసుకు ఉన్న ప్రేమ ఆయనను కోప్పడేలా చేసింది.

90వ కథ

బావి దగ్గర స్త్రీతో మాట్లాడడం

యేసు ఇచ్చే నీళ్లు తాగితే ఆమెకు ఎందుకు ఎప్పటికీ దాహమేయదు?

91వ కథ

యేసు కొండమీద బోధించడం

యేసు ఇచ్చిన కొండమీద ప్రసంగం విని ఎప్పటికీ ఉపయోగపడే జ్ఞానాన్ని సంపాదించుకోండి.

92వ కథ

యేసు మృతులను లేపడం

దేవుని శక్తిని ఉపయోగిస్తూ, తేలికైన రెండు మాటలు ఉపయోగించి యేసు యాయారు కూతున్ని పునరుత్థానం చేశాడు.

93వ కథ

యేసు అనేకమందికి ఆహారం పెట్టడం

యేసు అనేకమందికి ఆహారం పెట్టడం

94వ కథ

ఆయన చిన్న పిల్లలను ప్రేమించడం

యేసు అపోస్తలులులకు చిన్నపిల్లలనుంచి మాత్రమే కాదు పిల్లల నుండి కూడా నేర్చుకోవాలని చెప్పాడు.

95వ కథ

యేసు బోధించే విధానం

యేసు ఎక్కువగా ఉపయోగించే బోధనా విధానికి ఆయన చెప్పిన పొరుగువాడైన సమరయుడి ఉపమానం ఒక ఉదాహరణ.

96వ కథ

యేసు రోగులను స్వస్థపరచడం

యేసు తాను చేసిన అద్భుతాలవల్ల ఏమి సాధించాడు?

97వ కథ

యేసు రాజుగా రావడం

పెద్ద గుంపు ఆయన్ని ఆహ్వానించింది, కానీ అందరూ దాని విషయంలో సంతోషంగా లేరు.

98వ కథ

ఒలీవ కొండమీద

మన కాలంలో జరిగే విషయాల గురించి యేసు తన నలుగురు అపొస్తలులకు చెప్తాడు.

99వ కథ

మేడ గదిలో

ఈ ప్రత్యేక భోజనాన్ని ప్రతీ సంవత్సరం తినమని యేసు తన శిష్యులకు ఎందుకు చెప్పాడు?

100వ కథ

తోటలో యేసు

యూదా యేసును ముద్దుపెట్టుకుని ఎందుకు అప్పగిస్తాడు?

101వ కథ

యేసు చంపబడడం

మ్రానుపై చనిపోయేముందు యేసు పరదైసు గురించి వాగ్దానం చేశాడు.

102వ కథ

యేసు సజీవుడవడం

ఓ దేవతూత యేసు సమాధికి అడ్డుగా ఉంచిన రాయిని పక్కకు జరిపినప్పుడు, సైనికులు సమాధి లోపల చూసి ఆశ్చర్యపోయారు.

103వ కథ

గడియ వేసివున్న గదిలోకి ప్రవేశించడం

పునరుత్థానమైన యేసును ఆయన శిష్యులు ఎందుకు గుర్తుపట్టలేదు?

104వ కథ

యేసు పరలోకానికి వెళ్లడం

యేసు పరలోకానికి వెళ్లిపోయే ముందు, తన శిష్యులకు చివరి ఆజ్ఞ ఇచ్చాడు.

105వ కథ

యెరూషలేములో కనిపెట్టుకొని ఉండడం

పెంతెకొస్తు రోజున యేసు తన శిష్యుల మీద పరిశుద్ధాత్మ ఎందుకు కుమ్మరించాడు?

106వ కథ

చెరసాలనుండి విడిపించబడడం

అపొస్తలులు చేస్తున్న ప్రకటనా పనిని ఆపుజేయడానికి యూదా మతనాయకులు వాళ్లను చెరసాలలో వేయించారు. కానీ దేవుడు ఆలోచన వేరేలా ఉంది.

107వ కథ

స్తెఫను రాళ్లతో కొట్టబడడం

స్తెఫను హింసించబడుతున్నప్పుడు ఓ అద్భుతమైన ప్రార్థన చేశాడు.

108వ కథ

దమస్కుకు వెళ్లే మార్గంలో

ప్రకాశవంతమైన వెలుగు, పరలోకం నుండి వినబడిన స్వరం సౌలు జీవితాన్ని మార్చేశాయి.

109వ కథ

పేతురు కొర్నేలిని దర్శించడం

ఒక జాతి లేదా ఒక దేశప్రజలు మిగతా వాళ్లకన్నా గొప్పవాళ్లని దేవుడు భావిస్తాడా?

110 వ కథ

తిమోతి—పౌలుకు క్రొత్త సహాయకుడు

పౌలుతో కలిసి ప్రకటించడానికి తిమోతి ఒక ఆసక్తికరమైన యాత్రకు ఇల్లు వదిలి బయల్దేరాడు.

111వ కథ

నిద్రపోయిన బాలుడు

ఐతుకు పౌలు మొదటి ప్రసంగంలో నిద్రపోయాడుగానీ రెండవ ప్రసంగం ఇస్తున్నప్పుడు కాదు. ఆ రెండు ప్రసంగాల మధ్యలో ఓ అద్భుతం జరిగింది.

112వ కథ

ద్వీపం దగ్గర ఓడ బద్దలు కావడం

ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో, దేవుని దగ్గర నుండి వచ్చిన సందేశం పౌలులో నమ్మకాన్ని నింపింది.

113వ కథ

రోమాలో పౌలు

పౌలు ఖైధీగా ఉన్నప్పుడు అపొస్తలునిగా చేయాల్సిన పనిని ఎలా చేయగలిగాడు?

114వ కథ

చెడుతనమంతా అంతం కావడం

హార్‌మెగిద్దోనులో దేవుడు, యేసు నాయకత్వంలో తన సైన్యాన్ని ఎందుకు యుద్ధానికి పంపిస్తాడు?

115వ కథ

భూమిపై ఒక కొత్త పరదైసు

ప్రజలు ఒకప్పుడు పరదైసులా ఉన్న భూమ్మీద జీవించారు, మళ్లీ అలాంటి కాలం వస్తుంది.

116వ కథ

మనమెలా నిరంతరం జీవించవచ్చు

కేవలం యెహోవా, యేసు గురించి తెలుసుకుంటే సరిపోతుందా? దానికి జవాబు కాదు అయితే, మరి ఇంకా ఏం అవసరం?

నా బైబిలు కథల పుస్తకము కోసం అధ్యయన ప్రశ్నలు

పిల్లలు ప్రతీ బైబిలు కథ నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజన పొందేలా లేఖనాలను, అధ్యయన ప్రశ్నలను తయారు చేశాము.