2వ భాగం
జలప్రళయం మొదలుకొని ఐగుప్తు నుండి విడుదల వరకు
జలప్రళయం నుండి కేవలం ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు, కానీ కొంతకాలానికి వారి సంఖ్య అనేక వేలకు పెరిగింది. జలప్రళయం వచ్చిన 352 సంవత్సరాల తర్వాత అబ్రాహాము జన్మించాడు. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడిని ఇచ్చి దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో మనం తెలుసుకుంటాం. తర్వాత ఇస్సాకు ఇద్దరు కుమారులలో దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు.
యాకోబుకు 12 మంది కుమారులు, కొంతమంది కుమార్తెలుగల పెద్ద కుటుంబం ఉండేది. యాకోబు 10 మంది కుమారులు తమ తమ్ముడైన యోసేపును ద్వేషించి ఆయనను ఐగుప్తులో దాసునిగా ఉండడానికి అమ్మేశారు. ఆ తర్వాత, యోసేపు ఐగుప్తులో ఒక ప్రముఖ పాలకుడయ్యాడు. కరవు వచ్చినప్పుడు యోసేపు తన అన్నల హృదయాలలో మార్పేమైనా వచ్చిందేమో పరీక్షించాడు. చివరకు యాకోబు కుటుంబమంతా అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు తరలి వెళ్ళారు. అది అబ్రాహాము పుట్టిన 290 సంవత్సరాల తర్వాత జరిగింది.
ఇశ్రాయేలీయులు తర్వాతి 215 సంవత్సరాలు ఐగుప్తులో నివసించారు. యోసేపు మరణించిన తర్వాత వాళ్ళు అక్కడ దాసులయ్యారు. కొంతకాలానికి మోషే జన్మించాడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించడానికి దేవుడు ఆయనను ఉపయోగించుకున్నాడు. మొత్తం 857 సంవత్సరాల చరిత్ర రెండవ భాగంలో వివరించబడింది.
ఈ భాగంలో
12వ కథ
ప్రజలు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం
దేవునికి నచ్చలేదు, ఆయన ఇచ్చిన శిక్ష ప్రజలు ఇంకా అనుభవిస్తున్నారు.
13వ కథ
అబ్రాహాము—దేవుని స్నేహితుడు
అబ్రాహాము ఎందుకు ఊరులోవున్న సౌకర్యవంతమైన ఇంటిని విడిచిపెట్టి తన మిగిలిన జీవితమంతా గుడారాల్లో నివసించాడు?
14వ కథ
దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
దేవుడు అబ్రాహామును తన కొడుకు ఇస్సాకును బలివ్వమని ఎందుకు అడిగాడు?
16వ కథ
ఇస్సాకుకు మంచి భార్య లభించడం
రిబ్కాను మంచి భార్యగా చేసింది ఏమిటి? ఆమె అందమా లేదా వేరే ఏదైనానా?
17వ కథ
భిన్నమైన కవల పిల్లలు
యాకోబు ఏశావుల నాన్న ఇస్సాకు ఏశావును ఎక్కువ ప్రేమించాడు, కానీ వాళ్ల అమ్మ రిబ్కా యాకోబును ఎక్కువ ప్రేమించింది.
24వ కథ
యోసేపు తన సహోదరులను పరీక్షించడం
ఆయన్ని దాసుడిగా అమ్మేసినప్పటి నుండి వాళ్లు మారారో లేదో ఆయన ఎలా తెలుసుకుంటాడు?
25వ కథ
కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళడం
యాకోబు కుటుంబ సభ్యుల్ని యాకోబీయులు అని పిలవకుండా ఇశ్రాయేలీయులు అని ఎందుకు పిలుస్తున్నారు?
26వ కథ
యోబు దేవునికి నమ్మకంగా ఉండడం
యోబు ఆస్తి, ఆరోగ్యం, పిల్లలు అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడు యోబును శిక్షిస్తున్నాడా?
27 కథ
ఒక చెడ్డరాజు ఐగుప్తును పరిపాలించడం
ఆయన హెబ్రీయుల మగపిల్లలనందరినీ చంపేయమని ఆయన ప్రజలతో ఎందుకు చెప్తాడు?
28వ కథ
పసివాడైన మోషే రక్షించబడడం
అతని తల్లి ఇశ్రాయేలీయుల మగ పిల్లలనందరినీ చంపేయాలనే ఆజ్ఞనుండి తప్పించుకునే మార్గాన్ని చూసుకుంది.
29వ కథ
మోషే పారిపోవడానికిగల కారణం
మోషేకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు అతను ఇశ్రాయేలీయులను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడనుకున్నాడు, కానీ అతను సిద్ధం కాదు.
30వ కథ
మండుతున్న పొద
ఒకదాని తర్వాత ఒకటి చాలా అధ్భుతాలతో, దేవుడు మోషేతో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తునుండి విడిపించడానికి మోషేకు సమయం వచ్చిందని చెప్తాడు.
32వ కథ
పది తెగుళ్ళు
దేవుడు ఐగుప్తు మీదికి పది తెగుళ్ళు తెప్పించాడు, ఇదంతా ఫరో ఇశ్రాయేలీయుల్ని పోనీకుండా ఉన్నందువల్లే ఇలా జరిగింది.
33వ కథ
ఎర్ర సముద్రాన్ని దాటడం
దేవుని శక్తితో మోషే ఎర్ర సముద్రం విడిపోయేలా చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద నడిచి అవతలికి వెళ్తున్నారు.