కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ భాగం

ఇశ్రాయేలు మొదటి రాజునుండి బబులోను చెరవరకు

ఇశ్రాయేలు మొదటి రాజునుండి బబులోను చెరవరకు

సౌలు ఇశ్రాయేలు మొదటి రాజయ్యాడు. కానీ యెహోవా ఆయనను తిరస్కరించి ఆయన స్థానంలో దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. దావీదు యువకునిగా ఉన్నప్పుడు ఎంతో శక్తివంతుడైన గొల్యాతుతో పోరాడాడు. తర్వాత ఆయన అసూయాపరుడైన సౌలునుండి పారిపోయాడు. ఆ తర్వాత అందమైన అబీగయీలు ఆయనను బుద్ధిహీనమైన పని చేయకుండా అడ్డుకుంది.

తర్వాత మనం, దావీదు కుమారుడైన సొలొమోను గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం. ఆయన దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజయ్యాడు. ఇశ్రాయేలు మొదటి ముగ్గురు రాజులు ఒక్కొక్కరు 40 సంవత్సరాలపాటు పాలించారు. సొలొమోను మరణం తర్వాత ఇశ్రాయేలు రెండుగా అంటే ఉత్తర రాజ్యంగాను, దక్షిణ రాజ్యంగాను చీలిపోయింది.

10 గోత్రాలతో రూపొందించబడిన ఉత్తర రాజ్యం 257 సంవత్సరాలపాటు నిలిచి ఆ తర్వాత అష్షూరీయుల చేతిలో నాశనమయ్యింది. తర్వాత 133 సంవత్సరాలకు, రెండు గోత్రాలతో రూపొందించబడిన దక్షిణ రాజ్యం కూడా నాశనమయ్యింది. అప్పుడు ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా తీసుకెళ్ళబడ్డారు. కాబట్టి ఈ నాలుగవ భాగం 510 సంవత్సరాల చరిత్రను వివరిస్తుంది. ఈ కాలంలో జరిగిన అనేక ఉత్తేజభరిత సంఘటనలను మనం గమనించవచ్చు.

 

ఈ భాగంలో

56వ కథ

సౌలు—ఇశ్రాయేలు మొదటి రాజు

దేవుడు, ముందు ఎంచుకొని ఆ తర్వాత తిరస్కరించిన సౌలు నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు?

57వ కథ

దేవుడు దావీదును ఎన్నుకోవడం

దేవుడు దావీదులో చూసిన ఏ విషయాన్ని సమూయేలు ప్రవక్త చూడలేదు?

58వ కథ

దావీదు, గొల్యాతు

కేవలం వడిసెలతో కాదుగానీ అంతకన్నా శక్తిమంతమైన అయుధంతో దావీదు గొల్యాతుతో యుద్ధం చేశాడు.

59వ కథ

దావీదు ఎందుకు పారిపోవలసి వచ్చింది

సౌలు ముందు దావీదును చూసి సంతోషించాడు, కానీ తర్వాత అతన్ని చంపేయాలన్నంత అసూయ అతనిపై పెంచుకున్నాడు. ఎందుకు?

60వ కథ

అబీగయీలు, దావీదు

అబీగయీలు తన భర్తను బుద్ధహీనుడని పిలిచినా అది అతని ప్రాణాన్ని తాత్కాలికంగా కాపాడుతుంది.

61వ కథ

దావీదు రాజుగా చేయబడడం

తాను చేసిన పనిని బట్టి అలాగే తాను చేయడానికి నిరాకరించిన పనిని బట్టి తాను ఇశ్రాయేలుకు రాజు అవ్వడానికి అర్హుడనని దావీదు నిరూపించుకుంటాడు.

62వ కథ

దావీదు ఇంట్లో శ్రమ

ఒక్క చెడ్డ పని చేసి, దావీదు తనూ తన కుటుంబసభ్యలూ కొన్ని సంవత్సరాలు శ్రమ అనుభవించేలా చేసుకున్నాడు

63వ కథ

జ్ఞానియైన సొలొమోను రాజు

అతను నిజంగా బిడ్డను రెండు ముక్కలు చేస్తాడా?

64వ కథ

సొలొమోను ఆలయాన్ని నిర్మించడం

ఎంతో తెలివైనవాడైనప్పటికీ, సొలొమోను తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుని తప్పులు చేశాడు

65వ కథ

రాజ్యం విభాగించబడడం

యరొబాము పరిపాలన మొదలైన వెంటనే, ప్రజలు దేవుని నియమాల్ని మీరేలా చేశాడు.

66వ కథ

యెజెబెలు—ఒక దుష్ట రాణి

తనకు కావాల్సింది దక్కించుకోవడానకి ఆమె ఏమి చేయడానికైనా వెనకాడదు.

67వ కథ

యెహోషాపాతు యెహోవాపై నమ్మకం ఉంచడం

ఆయుధాలు లేని గాయకులను ముందు నిలువబెట్టి యుద్ధానికి ఎందుకు వెళ్తారు?

68వ కథ

తిరిగి బ్రతికిన ఇద్దరు అబ్బాయిలు

చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించడం వీలౌతుందా? కానీ ఒకప్పుడు అది జరిగింది.

69వ కథ

ఒక బాలిక శక్తిమంతుడైన వ్యక్తికి సహాయం చేయడం

ఆ అమ్మాయికి మాట్లాడే ధైర్యం ఉంది. దానివల్ల ఓ అద్భుతం జరిగింది.

70వ కథ

యోనా, పెద్ద చేప

యెహోవా చెప్పిన పని చేయాలనే ఒక ముఖ్యమైన పాఠాన్ని యోనా నేర్చుకున్నాడు.

71వ కథ

దేవుడు ఒక పరదైసును వాగ్దానం చేయడం

మొదట్లో భూమిలో కొంతభాగం మాత్రమే పరదైసుగా ఉండేది. కానీ త్వరలో భూమంతా పరదైసుగా మారుతుంది.

72వ కథ

హిజ్కియా రాజుకు దేవుడు సహయం చేయడం

దేవదూత ఒక్క రాత్రిలోనే 1,85,000 మంది అష్షూరు సైనికులను చంపేశాడు.

73వ కథ

ఇశ్రాయేలీయుల చివరి మంచి రాజు

చిన్నవాడైన యోషీయా ధైర్యంగా ఓ పని చేశాడు.

74వ కథ

భయపడని వ్యక్తి

ప్రవక్తగా ఉండడానికి తాను బాలుడినేనని యిర్మియా అనుకున్నాడు. కానీ ఆయన ఆ పనిని చేయగలడని యెహోవాకు తెలుసు.

75వ కథ

బబులోనులో నలుగురు యువకులు

వాళ్లు కుటుంబం నుంచి వేరుగా ఉన్నప్పటికీ వాళ్ల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు.

76వ కథ

యెరూషలేము నాశనం కావడం

ఇశ్రాయేలీయుల శత్రువులైన బబులోనీయులు, యోరూషలేమును నాశనం చేసేలా ఎందుకు అనుమతించాడు?