6వ భాగం
యేసు జననం నుండి ఆయన మరణం వరకు
గబ్రియేలు దూత మరియ అనే ఒక ఉత్తమురాలైన యువతి దగ్గరకు పంపించబడ్డాడు. ఆమెకు ఒక శిశువు జన్మిస్తాడని, ఆయన రాజై నిత్యం పరిపాలిస్తాడని ఆ దూత ఆమెతో చెప్పాడు. శిశువైన యేసు పశువుల కొట్టంలో జన్మించాడు, గొర్రెల కాపరులు అక్కడకు వెళ్లి ఆయనను దర్శించారు. ఆ తర్వాత, ఒక నక్షత్రం తూర్పునుండి వచ్చిన పురుషులను ఆ పసిబిడ్డ దగ్గరకు నడిపించింది. వాళ్లకు ఆ నక్షత్రం కనిపించేలా ఎవరు చేశారు, యేసును చంపాలని చేసిన ప్రయత్నాలనుండి ఆయన ఎలా రక్షించబడ్డాడు అనే విషయాలను మనం తెలుసుకుంటాం.
తర్వాత, 12 సంవత్సరాల వయస్సులో యేసు దేవాలయంలోని బోధకులతో మాట్లాడడం గురించి మనం చూస్తాం. పద్దెనిమిది సంవత్సరాల తర్వాత యేసు బాప్తిస్మం తీసుకొని, దేవుడు తనను ఏ పని చేయడానికి భూమ్మీదకు పంపించాడో ఆ పనిని అంటే రాజ్యము గురించి ప్రకటించి బోధించే పనిని ప్రారంభించాడు. ఆ పనిలో తనకు సహాయం చేయడానికి యేసు 12 మంది పురుషులను ఎంపిక చేసుకొని వాళ్ళను తన అపొస్తలులుగా చేసుకున్నాడు.
యేసు అనేక అద్భుతాలను కూడా చేశాడు. ఆయన కేవలం కొన్ని చిన్న చేపలతో మరియు కొన్ని రొట్టెలతో వేలాదిమందికి భోజనం పెట్టాడు. ఆయన రోగులను స్వస్థపరచాడు, చనిపోయినవారిని బ్రతికించాడు. చివరకు, యేసు జీవితంలోని చివరి రోజున ఆయనకు జరిగిన అనేక సంగతుల గురించి, ఆయన చంపబడడాన్ని గురించి మనం తెలుసుకుంటాం. యేసు దాదాపు మూడున్నర సంవత్సరాలు ప్రకటించాడు, కాబట్టి 6వ భాగం 34 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ కాలవ్యవధిలో జరిగిన వాటిని వివరిస్తుంది.
ఈ భాగంలో
84వ కథ
ఒక దూత మరియను దర్శించడం
ఆయన దేవుని నుండి ఓ వార్తను తెస్తాడు. యుగయుగాలకు రాజుగా ఉండే ఓ శిశువును మరియ కంటుందనేదే ఆ వార్త.
85వ కథ
యేసు పశువుల కొట్టంలో జన్మించడం
భవిష్యత్తులో రాజు కాబోయే వ్యక్తి పశువుల కొట్టంలో ఎందుకు పుట్టాడు?
86వ కథ
నక్షత్రం ద్వారా నడిపించబడిన మనుష్యులు
జ్యోతిష్కుల్ని యేసు ఉండే చోటుకు ఎవరు నడిపించారు? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.
88వ కథ
యోహాను యేసుకు బాప్తిస్మమివ్వడం
యోహాను బాప్తిస్మం ఇస్తున్నాది పాపులకు? అయితే యేసు ఎప్పుడూ పాపం చేయలేదు. మరి యోహాను ఆయనకు ఎందుకు బాప్తిస్మం ఇచ్చాడు?
91వ కథ
యేసు కొండమీద బోధించడం
యేసు ఇచ్చిన కొండమీద ప్రసంగం విని ఎప్పటికీ ఉపయోగపడే జ్ఞానాన్ని సంపాదించుకోండి.
92వ కథ
యేసు మృతులను లేపడం
దేవుని శక్తిని ఉపయోగిస్తూ, తేలికైన రెండు మాటలు ఉపయోగించి యేసు యాయారు కూతున్ని పునరుత్థానం చేశాడు.
94వ కథ
ఆయన చిన్న పిల్లలను ప్రేమించడం
యేసు అపోస్తలులులకు చిన్నపిల్లలనుంచి మాత్రమే కాదు పిల్లల నుండి కూడా నేర్చుకోవాలని చెప్పాడు.
95వ కథ
యేసు బోధించే విధానం
యేసు ఎక్కువగా ఉపయోగించే బోధనా విధానికి ఆయన చెప్పిన పొరుగువాడైన సమరయుడి ఉపమానం ఒక ఉదాహరణ.