కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులకు చిన్నమాట

తల్లిదండ్రులకు చిన్నమాట

మీ చిన్నారులకు మీరివ్వగల శ్రేష్ఠమైన బహుమతి ఏమిటి? మీ ప్రేమ, మార్గనిర్దేశం, సంరక్షణతోపాటు వాళ్లకు అవసరమైనవి చాలానే ఉన్నాయి. అయితే యెహోవా గురించిన జ్ఞానాన్ని, ఆయన వాక్యంలోని సత్యాలను నేర్పించడమే మీరు మీ పిల్లలకు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి. (యోహాను 17:3) పిల్లలు వాటిని నేర్చుకుంటే, పసివయసు నుండే యెహోవాను ప్రేమించడం, ఆయన్ను మనస్ఫూర్తిగా సేవించడం అలవాటు చేసుకుంటారు.—మత్తయి 21:16.

చిన్నిచిన్ని కథలతో, చిట్టిపొట్టి ఆటలతో నేర్పిస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారని చాలామంది తల్లిదండ్రులు అంటారు. అందుకే, బైబిలు పాఠాలు నేర్చుకుందాం అనే ఈ బ్రోషుర్‌ను మీకు అందిస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. మీ పిల్లలకు సులువుగా నేర్పించేందుకు వీలుగా ఇందులోని ప్రతీ పాఠాన్ని రూపొందించాం. ఈ బ్రోషుర్‌ను ప్రత్యేకించి మూడేళ్లు, అంతకన్నా తక్కువ వయసు చిన్నారుల కోసమే రంగురంగుల బొమ్మలతో, చిన్నిచిన్ని వాక్యాలతో తయారుచేశాం. ప్రతీ పాఠం చివర్లో “ఇలా చేయండి” అనే భాగం ఉంది. దయచేసి ఈ బ్రోషుర్‌ను మీ పిల్లలకు ఆడుకునే వస్తువులా ఇవ్వకండి. మీరు మీ పిల్లలతో కలిసి చదవాలని, మీరూ మీ పిల్లలూ చక్కగా మాట్లాడుకోవాలని దీన్ని తయారుచేశాం.

మీ చిన్నారుల లేత మనసుల్లో బైబిలు సత్యాలు నాటడానికి ఈ బ్రోషుర్‌ ఎంతగానో తోడ్పడుతుందని మేము నమ్ముతున్నాం.—2 తిమోతి 3:14, 15.

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ