కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

మనం సెలవుదినాలను ఆచరించాలా?

మనం సెలవుదినాలను ఆచరించాలా?

ప్రపంచంలో నేడు అనేక ప్రాంతాల్లో ఆచరించబడుతున్న మతపరమైన, లోక సంబంధమైన సెలవుదినాలకు బైబిలు మూలాధారం కాదు. మరి అలాంటి ఆచరణలు ఎక్కడినుండి వచ్చాయి? మీకు ఒక గ్రంథాలయం గనుక అందుబాటులో ఉంటే, మీరు నివసిస్తున్న ప్రాంతంలో ప్రజాదరణ పొందిన సెలవుదినాల గురించి గ్రంథాలు చెప్పే విషయాలు మీకు ఆసక్తిని కలిగించవచ్చు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

ఈస్టర్‌. “కొత్తనిబంధనలో ఈస్టర్‌ పండుగను ఆచరించిన దాఖలాలే లేవు” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. మరి ఈస్టర్‌ పండుగ ఎలా ఆరంభమైంది? అది అన్య ఆరాధనలో వేళ్లూనుకొని ఉంది. ఈ సెలవుదినం యేసు పునరుత్థానాన్ని గుర్తుచేసుకునే పండుగ అని చెప్పబడుతున్నప్పటికీ, ఈస్టర్‌ సంబంధిత ఆచారాలు క్రైస్తవత్వానికి చెందినవి కావు.

నూతన సంవత్సర ఆచరణలు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన తేదీ, ఆచారాలు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. ఈ ఆచరణ పుట్టుక గురించి ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “క్రీ.పూ.46లో రోమా పరిపాలకుడైన జూలియస్‌ సీజర్‌ జనవరి 1ని నూతన సంవత్సర దినంగా స్థిరపరిచాడు. రోమన్లు ఆ రోజును తలుపులకు, ద్వారబంధాలకు, ఆరంభానికి దేవత అయిన జానస్‌కు అంకితం చేశారు. జానస్‌ అనే దేవత పేరు మీదే జనవరి నెల వచ్చింది, ఈ దేవతకు రెండు ముఖాలుంటాయి, ఒకటి ముందుకు రెండవది వెనక్కి ఉంటుంది.” కాబట్టి నూతన సంవత్సర ఆచరణలకు అన్యమత ఆచారాలే ఆధారం.

వాలెంటీన్స్‌ డే. ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “వాలెంటీన్‌ అనే పేరుగల ఇద్దరు క్రైస్తవ హతసాక్షులకు సంబంధించిన పండుగ రోజే వాలెంటీన్స్‌ డే వస్తుంది. అయితే ఆ రోజుకు సంబంధించిన ఆచారాలు . . . బహుశా ప్రతీ ఫిబ్రవరి 15న వచ్చే లూపర్‌కాలియా అనే ప్రాచీన రోమన్‌ పండుగ నుండి వచ్చి ఉంటాయి.” ఆ పండుగ స్త్రీలకు, వివాహానికి దేవత అయిన రోమన్‌ దేవత జూనో, ప్రకృతి దేవత అయిన పాన్‌ గౌరవార్థం జరుపుకునేవారు.

ఇతర పండుగలు. ప్రపంచమంతా జరుపుకునే అన్ని పండుగల గురించి చర్చించడం సాధ్యం కాదు. అయితే మానవులను, మానవ సంస్థలను కొనియాడే సెలవుదినాలు యెహోవాకు అంగీకృతమైనవి కావు. (యిర్మీయా 17:5-7; అపొస్తలుల కార్యములు 10:25, 26) దేవుణ్ణి సంతోషపెట్టడమైనా సంతోషపెట్టకపోవడమైనా మత సంబంధ ఆచరణల పుట్టుకను బట్టి ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి. (యెషయా 52:11; ప్రకటన 18:4) ఈ పుస్తకంలోని 16వ అధ్యాయంలో పేర్కొనబడిన బైబిలు సూత్రాలు లోక సంబంధ సెలవుదినాల్లో పాల్గొనడాన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడో నిర్ణయించుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.