అనుబంధం
షియోల్, హేడిస్ అంటే ఏమిటి?
ఆదిమ భాషల్లో బైబిలు హీబ్రూలో షియోల్ అనే పదాన్ని, గ్రీకులో అదే భావంగల హేడిస్ అనే పదాన్ని 70 కన్నా ఎక్కువసార్లు ఉపయోగిస్తోంది. ఈ రెండు పదాలు మరణానికి సంబంధించినవి. కొన్ని బైబిలు అనువాదాలు వాటిని “సమాధి,” “నరకము” లేదా “అగాధము” అని అనువదిస్తున్నాయి. అయితే అనేక భాషల్లో ఈ హీబ్రూ, గ్రీకు భాషాపదాల ఖచ్చితమైన భావాన్ని అందించే పదాలు లేవు. ఈ పదాల అసలు భావం ఏమిటి? వివిధ బైబిలు భాగాల్లో అవి ఎలా ఉపయోగించబడ్డాయో మనం పరిశీలిద్దాం.
“చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు [షియోల్‌లో] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:10) అంటే షియోల్ మన ప్రియమైనవారినెవరినైనా పాతిపెట్టిన ఒక నిర్దిష్ట స్థలమా? కాదు. బైబిలు ఒక నిర్దిష్టమైన శ్మశానాన్ని లేదా సమాధిని సూచిస్తున్నప్పుడు షియోల్, హేడిస్‌లకు బదులు వేరే హీబ్రూ, గ్రీకు పదాలను ఉపయోగిస్తోంది. (ఆదికాండము 23:7-9; మత్తయి 28:1) అలాగే కుటుంబ సభ్యుల సమాధి లేదా చాలామంది ఒకేచోట సమాధి చేయబడే సామూహిక సమాధి వంటి స్థలాన్ని సూచించడానికి కూడా బైబిలు షియోల్ అనే పదాన్ని ఉపయోగించడం లేదు.—ఆదికాండము 49:30, 31.
అయితే షియోల్ ఎలాంటి స్థలాన్ని సూచిస్తోంది? షియోల్ లేదా హేడిస్ అనే పదాలకు ఓ పెద్ద సామూహిక సమాధి అనే భావం మాత్రమే లేదని దేవుని వాక్యం సూచిస్తోంది. ఉదాహరణకు, షియోల్ లేదా పాతాళము “గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది” అని యెషయా 5:14 చెబుతోంది. షియోల్ ఇప్పటికే చనిపోయిన అసంఖ్యాకులను మ్రింగివేసినా అది ఇంకా ఆకలితోనే ఉన్నదని చెప్పవచ్చు. (సామెతలు 30:15, 16) పరిమిత సంఖ్యలో మాత్రమే సమాధి చేయడానికి వీలయ్యే శ్మశానంలా కాక, ‘పాతాళము [షియోల్] అగాధ కూపము తృప్తి పొందవు.’ (సామెతలు 27:20) అంటే, షియోల్ ఎన్నటికీ నిండదు. దానికి పరిమితులు లేవు. కాబట్టి షియోల్ లేదా హేడిస్ ఒక ప్రత్యేక స్థలంలో ఉన్న అక్షరార్థ స్థలం కాదు. బదులుగా, అది మానవుల్లో అధికశాతం మరణనిద్రలో ఉన్న అలంకారార్థ స్థలమైన మానవజాతి సామాన్య సమాధి.
పునరుత్థానం గురించిన బైబిలు బోధ షియోల్, హేడిస్‌ల భావాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం a (యోబు 14:13; అపొస్తలుల కార్యములు 2:31; ప్రకటన 20:13) యెహోవాను సేవించినవారు మాత్రమే కాక, ఆయనను సేవించని అనేకమంది కూడా షియోల్‌లో లేదా హేడిస్‌లో ఉన్నారని దేవుని వాక్యం వివరిస్తోంది. (ఆదికాండము 37:35; కీర్తన 55:15) కాబట్టే “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది” అని బైబిలు బోధిస్తోంది.—అపొస్తలుల కార్యములు 24:15.
షియోల్ హేడిస్‌లను పునరుత్థానం పొందే అవకాశమున్న మరణంతో ముడిపెడుతోంది.a దీనికి భిన్నంగా, పునరుత్థానం చేయబడని మృతులు షియోల్ లేదా హేడిస్‌లో కాదు, గెహెన్నాలో ఉన్నట్లు వర్ణించబడ్డారు. (తెలుగు బైబిలులో ఈ పదం, మత్తయి 5:30; 10:28; 23:33 వచనాల్లో ‘నరకము’ అని అనువదించబడింది) షియోల్, హేడిస్‌లలాగే గెహెన్నా కూడా అక్షరార్థ స్థలం కాదు.