దుష్టలోకమును దేవుడు నాశనము చేయును
దుష్టలోకమును దేవుడు నాశనము చేయును
18 ఆదాము సంతతి విస్తరించెను. అలాగే వారుచాల దుష్టులునైరి. దేవుడు వారిని నాశనము చేయనిశ్చయించెను.—ఆదికాండము 6:1, 5, 7
19 అయితే నోవహు అను నీతిమంతుడు ఒకడుండెను.—ఆదికాండము 6:8, 9
దుష్టులు నాశనమగునప్పుడు నోవహు అతని కుటుంబము రక్షింపబడునట్లు ఒక పెద్దనావను తయారు చేయుమని యెహోవా దేవుడు ఆయనకు చెప్పెను. ఈ నావ ఒక పెద్దపెట్టె ఆకారమునందుండెను. అది ఓడయని పిలువబడెను.—ఆదికాండము 6:13, 14
20 వారనేక జంతువులను ఓడలోనికి తీసుకొని వెళ్ళిరి.—21 యెహోవా బహువిస్తారముగా వర్షము కురియునట్లు చేసెను. దుష్టులందరు చనిపోయిరి. ఓడలోనున్నవారు మాత్రమే రక్షింపబడిరి. ఎందుకో నీకు తెలియునా?—ఆదికాండము 6:17; 7:11, 12, 21; 1 పేతురు 3:10-12