కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిన్ను సృష్టించిన దెవరు?

నిన్ను సృష్టించిన దెవరు?

నిన్ను సృష్టించిన దెవరు?

1 దేవుడు భూమ్యాకాశములను సృజించెను.—ఆదికాండము 1:1

2 దేవుడు ఒక నామమును కల్గియున్నాడు. ఆయన నామము యెహోవా.—కీర్తన 83:18

యెహోవా పరలోకమందు నివసించును. ఆయన ఆత్మయైయున్నాడు. నీవాయనను చూడలేవు.—యెషయా 66:1; యోహాను 1:18; 4:24

3 యెహోవా దేవుడు పరలోకమందు అనేక దేవదూతలను కలుగజేసెను. వారును ఆత్మీయప్రాణులైయున్నారు. వారందరు మంచివారైయుండిరి. మనుష్యులు చూడగల్గునట్లు, పూర్వకాలమందు వారు కొన్నిసార్లు మానవరూపములను ధరించిరి.—హెబ్రీయులు 1:7

4 మనుష్యుని చేయకముందు చాలాకాలము క్రితమే యెహోవా జంతువులను చేసెను.—ఆదికాండము 1:25

5 యెహోవా ఆదామను పేరుగల మనుష్యుని అతని భార్యయైన హవ్వను కూడా చేసెను.—ఆదికాండము 1:27

దేవుడు వారినొక సుందరమైన ఉద్యానవనములో లేక పరదైసులోనుంచెను. ఆదాము నిమిత్తము ఆయన కేవలము ఒక భార్యను మాత్రమే కలుగజేసెను. ఆ మనుష్యుడు తనకుగల ఒకే ఒక భార్యతో కాపురము చేయవలెను.—ఆదికాండము 2:8, 21, 22, 24

6 మానవుడు ఆత్మయైయున్నాడు.—ఆదికాండము 2:7

7 జంతువులును ఆత్మలే.—ఆదికాండము 1:24