నీవేమి చేయవలెను?
నీవేమి చేయవలెను?
50 అందమైన పరదైసులో నీవు నిత్యము నివసింపగోరెదవా?
అట్లయిన, దేవుడు చెప్పువాటిని అధికముగా నేర్చుకొనుము. బైబిలును చదువనేర్చుకొనుము.—యోహాను 17:3; ప్రకటన 1:3
51 యేసును గూర్చి యింకా తెలుసుకొనుము.—ద్వితీయోపదేశకాండము 18:18, 19; యోహాను 3:16; అ.కార్య. 3:19-23
52 మంచికార్యములు చేయుచు, యెహోవాకు లోబడుటకు ప్రయత్నించుము.—రోమీయులు 6:17, 18, 22
నిర్గమకాండము 20:13; 1 యోహాను 3:11, 12
53 మనము నరహత్య చేయకూడదని యెహోవా సెలవిచ్చుచున్నాడని జ్ఞాపకముంచుకొనుము.—54 మనము పరుల వస్తువులను ఆశించకూడదు.—నిర్గమకాండము 20:15; ఎఫెసీయులు 4:28
55 ఒకడు తన భార్యకాని స్త్రీతో శయనించకూడదు లేక జీవించకూడదు.—నిర్గమకాండము 20:14, 17; 1 థెస్సలొనీకయులు 4:3
56 ఒక భర్తకు ఎందరు భార్యలుండుటకు దేవుడనుమతించెనో నీకు జ్ఞాపకమున్నదా? భర్త తన భార్యతో ఎంతకాలము కాపురము చేయవలెను?—ఆదికాండము 2:22, 24; మత్తయి 19:5, 6; 1 కొరింథీయులు 7:2, 10, 11
మత్తయి 4:10; 1 కొరింథీయులు 8:6
57 మనము యెహోవాను మాత్రమే ఆరాధించవలెనని కూడ జ్ఞాపకము ఉంచుకొనుము.—58 విగ్రహములు, ప్రతిమలు మనకు సహాయము చేయనేరవు. ఎందుకు?—1 కొరింథీయులు 8:4
విగ్రహములు ఉంచుకొనుట సరియేనా?—ద్వితీయోపదేశకాండము 27:15; 1 యోహాను 5:21
59 జూజూ మంత్రశక్తులను కల్గియుండుట ఎందుకు తప్పైయున్నది?—ద్వితీయోపదేశకాండము 18:10-13; ప్రకటన 21:8
60 దుష్టులైన దూతలు లేక దయ్యములు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిరి. మానవులను తప్పుదోవన నడిపించుటకు వారు సోదెచెప్పువారిని ఉపయోగించుదురు.—అ.కార్య. 16:16
61 మనము దేవుని ప్రార్థించవలెను. ప్రార్థనయనగా, ఆయనను సేవింపగోరుచున్నామని, అందుకొరకు సహాయము చేయుమని ఆయనకు చెప్పుటయైయున్నది.—62 మనము యేసునకు విధేయులమైయుండి ఆయన యందు విశ్వాసముంచవలెను.—హెబ్రీయులు 5:9; యోహాను 3:16
63 ఆయన మనలను రక్షించుటకై మరణించెనని జ్ఞాపకముంచుకొనుము. రోమీయులు 5:8
ఫిలిప్పీయులు 2:9-11; ప్రకటన 19:16
64 మన అదృశ్యుడగు రాజు యేసు అని జ్ఞాపకముంచుకొనుము. మనమాయనకు లోబడవలయును.—మత్తయి 28:19, 20; యోహాను 4:7-15
65 నీవు నేర్చుకొనుచున్న మంచివిషయములను గూర్చి ఇతరులకు చెప్పవలెనని, అలాగే దేవుని సేవింపగోరువారు బాప్తిస్మము పొందవలెనని యేసు చెప్పెను.—66 కావున ఈ మంచి విషయములను గూర్చి నీవు నీ స్నేహితులతో మాట్లాడవచ్చును.—మత్తయి 10:32
67 నీవు చదువ నేర్చుకొనినట్లయిన అనేక విషయములను నీవు నేర్చుకొనగలవు. మరియు యితరులకు ఎక్కువగా సహాయపడగలవు.—2 తిమోతి 2:15
68 యేసు దేవునికి విధేయులు కావలెనని చిన్నపిల్లలకు కూడ బోధించెను. ఆయన వారితో మాట్లాడుటకు ఎన్నడును తీరికలేనివాడై యుండలేదు.—69 దేవునికి లోబడి ఆయనను ప్రేమించవలెనని తల్లిదండ్రులు అన్నిసమయములలో పిల్లలకు బోధించవలెను.—ద్వితీయోపదేశకాండము 6:6, 7; సామెతలు 6:20-22; ఎఫెసీయులు 6:4
70 అనేకరకముల చర్చీలు కలవు. వారి బోధలలో అనేకము బైబిలులోనివి కావు. సత్యమును బోధించని మతములను విడువవలెనని యెహోవా మనకు చెప్పుచున్నాడు.—ప్రకటన 18:4; యోహాను 4:23, 24
అ.కార్య. 15:14; రోమీయులు 10:14, 15
71 తననుగురించి ఎక్కువగా నీకు బోధించగల ప్రజలను యెహోవా భూమిమీద కల్గియున్నాడు. వారెవరో నీకు తెలియునా?—72 వారు యెహోవా సాక్షులైయున్నారు. వారు తమయందు సమాధానమును కల్గియున్నారు. ఎందుకో నీకు తెలియునా? ఎందుకనగా, వారు ఒకరినొకరు ప్రేమించుదురు.—యెషయా 43:10-12; యోహాను 13:34, 35
73 వారు యెహోవాను ప్రేమించుటచేత బాప్తిస్మము పొందిరి. తమ దుర్నీతి జీవితమార్గమును విడిచిపెట్టితిమని, దేవుని సేవించుటలో తమ జీవితము గడుపనిచ్ఛయించుచున్నామని వారు ఈ విధముగా బహిరంగముగా చూపుదురు.—అ.కార్య. 2:41
74 సుందరమైన నూతనపరదైసులో జీవించు నిరీక్షణను యెహోవా సాక్షులు కల్గియున్నారు.—వారితో అక్కడ నివసించుటకు నీవేమి చేయగలవు?—యాకోబు 1:22, 25; 2:20-26
75 దేవుని సేవించుటకు నేర్చుకొనుటలో వారితో సమకూడుము. వారు యెహోవాను, యేసుక్రీస్తును ప్రేమించి వారికి లోబడుదురు. నీవు వారిని ప్రేమించుదువా? దేవునిగురించి యితరులు నేర్చుకొనుటకై సహాయపడుటకు నీవు యిష్టపడుదువా?—యోహాను 6:45-47
76 యెహోవా మరియు యేసుక్రీస్తు నిన్ను ప్రేమించుచు నీవు నిత్యము పరదైసులో జీవింపవలెనని కోరుచున్నారు.—ఈ చిన్నపుస్తకములోనున్న చిత్రములు మరియు సమాచారముల పరిశీలన నిశ్చయముగా భూమిపై నిరంతర జీవితమును అనుభవించు కోరికను నీకు కల్గించినది. నీవు దీనిని గురించి ఎక్కువగా నేర్చుకొన యిష్టపడినట్లయితే, స్థానిక యెహోవా సాక్షులలో ఒకరితో నీవు మాట్లాడవలెనని మేము సలహా యిచ్చుచున్నాము. లేదా యీ చిన్న పుస్తకము యొక్క రెండవ పుటలోనున్న చిరునామాలలో నీకు సమీపముగానున్న కార్యాలయమునకు వ్రాయవచ్చును లేదా నీ కొరకు యితరులతో వ్రాయించుము.