పాపమరణముల నుండి మనమెట్లు విడిపింపబడితిమి
పాపమరణముల నుండి మనమెట్లు విడిపింపబడితిమి
35 మొదటి మానవుడైన ఆదాము పాపము చేసెనని నీకు జ్ఞాపకమున్నదా? అతడు జీవమును మరియు పరదైసును పోగొట్టుకొనెను, మరియు మనమంతా అతని సంతానమైనందున మనము కూడ చనిపోవుచున్నాము.—రోమీయులు 5:12; 3:23
36 పరిపూర్ణుడైన మరియొక వ్యక్తి మనకు బదులుగా తన ప్రాణమునర్పించినయెడల, లేక మరణమునుండి విడిపించిన యెడల మనము ఈ సంపూర్ణ జీవమును తిరిగి పొందగలము.—1 కొరింథీయులు 15:45; రోమీయులు 5:19, 21
37 యేసు దేవుని కుమారుడు. ఆయన పరిపూర్ణుడైన మానవుడు. ఆయన పాపము చేయలేదు.—హెబ్రీయులు 5:9; 7:26
38 దేవుని ప్రేమించని ప్రజలచేత చంపబడుటకు ఆయన తననుతాను అనుమంతించుకొనెను.—అ.కార్య. 2:23
ఇది ఆయన మనకొరకు అర్పించిన బలియైయుండెను.—1 తిమోతి 2:6
39 యేసు రాతిగుహ లేక సమాధిలో పెట్టబడెను. ఆయన మూడు దినములు మరణించియుండెను. అప్పుడు దేవుడాయనను లేపెను.—40 ఆయన పరలోకమునకు తిరిగివెళ్ళెను. కాగా దేవునికి విధేయులైన వారికి సహాయము చేయుమని ఇప్పుడాయన దేవుని అడుగగలడు.—హెబ్రీయులు 9:24; 1 యోహాను 2:1, 2