కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!

భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!

భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!

భూమిని అందలి సమస్తమును ఎవరుచేసిరో నీవు తెలిసికొనుటకు సహాయపడుటకే ఈ చిన్నపుస్తకము ముద్రించబడినది. భూమిని కలుగజేసిన ఆ దేవునికి ఒక పేరు కలదని నీవు తెలుసుకొందువు. దేవుడు నరుని ఎందుకు కలుగజేసెనో మరియు నీవు భూమిపై నిరంతర జీవితమును ఎట్లు అనుభవించగలవో కూడా దీనియందు మేము విశదీకరించెదము.

ఈ విషయములను ఊహాచిత్రములుగా చేసుకొనుటకు ఇందలి అనేక చిత్రములు నీకు సహాయము చేయునని మేము ఆశించుచున్నాము. అధిక ప్రయోజనము పొందుటకు, చిత్రముల ప్రక్కన వ్రాయబడియున్న బైబిలు లేఖనములను నీవు చదువవలెను. ఆవిధముగా బైబిలులో వ్రాయబడిన దేవుని వాగ్దానములలో కొన్నింటిని మీరు చదివినవారగుదురు అలాగే ఈ వాగ్దానఫలములను పొందుటకు దేవుడు సెలవిచ్చిన వాటిని నీవు చేయవలెను.

ఇతరులకు సహాయపడుటకు కూడా నీవు ఈ చిన్న పుస్తకమును ఉపయోగించవచ్చును. మీకు పిల్లలున్నయెడల వారు దేవునిగూర్చి నేర్చుకొన సహాయపడుటకు మీరు దీనిని ఉపయోగించవచ్చును. నీవు నివసించుచున్న దేశములో అనేకులు విద్యలేనివారైతే, మరియు నీ పొరుగువారు మరలా ఇతరులకు సహాయపడగలందులకు, వారికి సహాయపడుటకు నీవు ఈ చిత్రములను ఉపయోగించవచ్చును. అప్పుడు వారు తమ పొరుగువారికి సహాయపడగలరు.

ఈ సమాచారమును చదువుట, నీవు అనేక ఆశీర్వాదములు పొందుటకు, అలాగే ఈ భూమిపై ఎల్లప్పుడు ఎట్లు జీవించగలమో ఇతరులకు చూపించుటకు మార్గమేర్పరచునని మేము నమ్మకముగా ఆశించుచున్నాము.