కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనుష్యుడెందుకు మరణించును?

మనుష్యుడెందుకు మరణించును?

మనుష్యుడెందుకు మరణించును?

8 మనుష్యుడు ఈ భూమినంతటిని సుందరమైన దానిగా, అందరు ఆనందించదగు—పరదైసుగా మార్చవలెనని యెహోవా దేవుడు కోరెను.—ఆదికాండము 1:28

ఆదాము, హవ్వలు యెహోవాకు విధేయులైనట్లయితే, మానవులందరు నిత్యము జీవించి యుండెడివారు. మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదని వారికి ఆజ్ఞాపింపబడెను.—ఆదికాండము 2:15-17

9 దుష్టునిగా మారిన ఒకదూత సర్పమునుపయోగించి ఆదాము, హవ్వలు దేవునికి అవిధేయులగునట్లు చేసెను.—ఆదికాండము 3:1-6

10 హవ్వను మోసగించిన దూత ‘ఆదిసర్పమని, అపవాదియని, సాతాను’ అని పిలువబడెను.—ప్రకటన 12:9

11 అవిధేయులైన ఆ జంటను యెహోవా పరదైసునుండి వెళ్ళగొట్టెను.—ఆదికాండము 3:23, 24

12 ఆదాము హవ్వలు పిల్లలను కనిరి, అయినను కుటుంబమంతా సంతోషముగా లేకుండెను.—ఆదికాండము 3:17, 18

13 యెహోవా సెలవిచ్చినట్లు వారు వృద్ధాప్యమునకెదిగి మరణించవలసి యుండెను.—ఆదికాండము 3:19; రోమీయులు 5:12

14 జంతువులవలె వారును చనిపోయిరి.

భూమిమీదనున్న ఆత్మలన్నియు మరణించును.—ప్రసంగి 3:18-20; యెహెజ్కేలు 18:4