యెహోవా మనకు ఒక రక్షకుని అనుగ్రహించెను
యెహోవా మనకు ఒక రక్షకుని అనుగ్రహించెను
29 దేవుడు సృజించిన మొదటి ఆత్మీయవ్యక్తి ఆయన ప్రధమ పుత్రునివంటి వాడాయెను.
దేవుడాయనను అధికముగా ప్రేమించుచున్నాడు మరియు దుష్టులను నాశనముచేసి విధేయులను రక్షించుటకు ఆయనను ఉపయోగించును.—యోహాను 3:16, 36
30 యెహోవా తన కుమారుని భూమిమీద జన్మించుటకు పంపెను. ఆయనకు యేసు అనుపేరు పెట్టబడెను. ఆయన తల్లి పేరు మరియ.—లూక 1:30-35
31 యేసు పెరిగి పెద్దవాడై అనేక మంచివిషయములను బోధించెను. యెహోవాయే నిజమైన దేవుడని ఆయన బోధించెను.—మార్కు 12:29, 30
యెహోవాను మాత్రమే మనము ఆరాధించవలెనని యేసు చెప్పెను.—మత్తయి 4:10; యోహాను 4:23, 24 యెహోవా రాజ్యమునుగూర్చి కూడ ఆయన ప్రజలకు బోధించెను.—లూక 17:20, 21
అ.కార్య. 10:38; 1 పేతురు 2:21, 22
32 యేసు రోగులను స్వస్థపరచి అనేక మంచి కార్యములను చేసెను. చెడుకార్యములను ఆయన చేయలేదు.—అయితే ఆయన పాపమరణములనుండి మనలనెట్లు రక్షించును?
33 మంచివారిని రక్షించుటకు ఆయన దేవునికి బలియర్పించవలసియుండెను.
పూర్వము, ప్రజలు తమ పాపముల నిమిత్తము జంతువులను బలియర్పించవలెనని దేవుడు చెప్పెను.—హెబ్రీయులు 7:25, 27
34 యేసు జంతువులను బలిగా అర్పించలేదు. ఆయనే మనకొరకు బలిగా తననర్పించుకొనెను.—మత్తయి 20:28; హెబ్రీయులు 10:12
ఎందునిమిత్తమో నీకు తెలియునా?