కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రమశిక్షణ

క్రమశిక్షణ

బైబిలు ఆధారంగా క్రమశిక్షణ ఇవ్వడం ఎందుకు మంచిది?

ఎవరైనా మనల్ని సరిదిద్దాల్సిన, నిర్దేశించాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది?

యెహోవా మనకు క్రమశిక్షణ ఇచ్చాడంటే దాని అర్థమేంటి?

సామె 3:11, 12; హెబ్రీ 12:7-9

ద్వితీ 8:5; సామె 13:24; ప్రక 3:19 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2స 12:9-13; 1రా 15:5; అపొ 13:22—రాజైన దావీదు చాలా ఘోరమైన పాపాలు చేసినా యెహోవా అతనికి ప్రేమగా క్రమశిక్షణ ఇచ్చాడు, క్షమించాడు

    • యోనా 1:1-4, 15-17; 3:1-3—యోనా ప్రవక్త తన నియామకం నుండి పారిపోయినప్పుడు యెహోవా అతనికి క్రమశిక్షణ ఇచ్చాడు, కానీ తర్వాత తన నియామకాన్ని పూర్తి చేయడానికి మరో అవకాశాన్ని కూడా ఇచ్చాడు

దేవుడు ఇచ్చే క్రమశిక్షణను మనం ఎందుకు తీసుకోవాలి?

దేవుడు ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించే వాళ్లకు ఏం జరగవచ్చు?

సామె 1:24-26; 13:18; 15:32; 29:1

యిర్మీ 7:27, 28, 32-34 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యిర్మీ 5:3-7—క్రమశిక్షణ ఇచ్చినప్పుడు దేవుని ప్రజలు తమ హృదయాల్ని కఠినం చేసుకొని మారడానికి ఇష్టపడలేదు, దానివల్ల వాళ్లకు ఇంకా గట్టి క్రమశిక్షణ ఇవ్వాల్సివచ్చింది

    • జెఫ 3:1-8—యెరూషలేము ప్రజలు యెహోవా ఇచ్చే క్రమశిక్షణను తీసుకోలేదు కాబట్టి వాళ్ల మీదకు విపత్తు వచ్చింది

యెహోవా ఇచ్చే క్రమశిక్షణ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

సామె 4:13; 1కొ 11:32; తీతు 1:13; హెబ్రీ 12:10, 11

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ద్వితీ 30:1-6—యెహోవా ఇచ్చే క్రమశిక్షణ నుండి నేర్చుకునేవాళ్లు ఎలాంటి దీవెనలు పొందుతారో మోషే ప్రవక్త ముందే చెప్పాడు

    • 2ది 7:13, 14—తను ఇచ్చే క్రమశిక్షణ తీసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి యెహోవా రాజైన సొలొమోనుకు చెప్పాడు

ఇతరులు క్రమశిక్షణ పొందినప్పుడు మనం కూడా దాన్నుండి నేర్చుకోవడం ఎందుకు మంచిది?

ఇతరులు తీవ్రమైన క్రమశిక్షణ పొందినప్పుడు మనం ఎందుకు సంతోషించకూడదు?

దేవుడు ఇచ్చే సలహాలు, క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?

యెహో 1:8; యాకో 1:25

ద్వితీ 17:18, 19; కీర్త 119:97 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1ది 22:11-13—సొలొమోను యెహోవా ఇచ్చే నిర్దేశాల్ని తూ.చా. తప్పకుండా పాటించినంత కాలం దీవెనలు పొందుతాడని రాజైన దావీదు చెప్పాడు

    • కీర్త 1:1-6—ధర్మశాస్త్రాన్ని చదివి, ధ్యానించేవాళ్లను దీవిస్తానని యెహోవా మాటిచ్చాడు

తమ పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు వాళ్లకు ఎందుకు క్రమశిక్షణ ఇస్తారు?

తల్లిదండ్రులు” చూడండి

తల్లిదండ్రులు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు పిల్లలు ఏం చేయాలి?