గౌరవాన్నిస్తూ వాడే బిరుదులు
మనుషుల్ని మహిమపర్చడానికి వాళ్లను మత సంబంధమైన బిరుదులతో పిలవచ్చా?
ఒక బైబిలు ఉదాహరణ:
లూకా 18:18, 19—యేసు మంచివాడే అయినా “మంచి బోధకుడు” అనే బిరుదును స్వీకరించలేదు, అలాగే యెహోవా తప్ప మంచివాళ్లు ఎవ్వరూ లేరని చెప్పాడు
క్రైస్తవులు “తండ్రి” లేదా “నాయకుడు” లాంటి మత సంబంధమైన బిరుదులు ఎందుకు ఉపయోగించరు?
కొన్ని బైబిలు ఉదాహరణలు:
మత్త 23:9-12—గౌరవాన్నిస్తూ వాడే బిరుదుల్ని అంటే “తండ్రి,” “నాయకుడు” లాంటివి మనుషులకు అస్సలు ఉపయోగించకూడదని యేసు చెప్పాడు
1కొ 4:14-17—అపొస్తలుడైన పౌలు చాలామందికి తండ్రి లాంటివాడే అయినా అతన్ని అయ్యగారు అనో, ఫాదర్ అనో పిలిచినట్టు బైబిల్లో ఎక్కడా లేదు
క్రైస్తవులు ఒకరినొకరు సహోదరుడు, సహోదరి అని పిలవడం అలాగే సహోదర సహోదరీల్లా ఉండడం ఎందుకు సరైంది?
అపొ 12:17; 18:18; రోమా 16:1 కూడా చూడండి
ఒక బైబిలు ఉదాహరణ:
మత్త 12:46-50—తోటి ఆరాధకులు తనకు ఆధ్యాత్మిక సహోదర సహోదరీలని యేసు స్పష్టంగా చెప్పాడు
క్రైస్తవులు ప్రభుత్వ అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, న్యాయమూర్తుల్ని, ఇతర అధికారుల్ని బిరుదులు పెట్టి పిలవడం సరైనదే అని ఎందుకు చెప్పవచ్చు?
ఒక బైబిలు ఉదాహరణ:
అపొ 26:1, 2, 25—అగ్రిప్ప, ఫేస్తు లాంటి ప్రభుత్వ అధికారుల్ని అపొస్తలుడైన పౌలు అధికారిక బిరుదుల్ని ఉపయోగించి పిలిచాడు