కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చెడ్డపనులు

చెడ్డపనులు

క్రైస్తవులు ఎలాంటి చెడ్డపనులకు దూరంగా ఉండాలి?

అతిగా పొగడడం

యోబు 32:21, 22; కీర్త 5:9; 12:2, 3; సామె 26:24-28; 29:5

సామె 28:23; 1థె 2:3-6 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 18:18, 19—తనను అతిగా పొగుడుతూ ఇచ్చిన బిరుదును యేసు స్వీకరించలేదు

    • అపొ 12:21-23—ప్రజలు రాజైన హేరోదు అగ్రిప్పను దేవునితో పోలుస్తూ అతిగా పొగిడారు, దాన్ని స్వీకరించినందుకు దేవుడు అతన్ని శిక్షించాడు

అన్యాయంగా లాక్కోవడం

కీర్త 62:10; 1కొ 5:10, 11; 6:9, 10

సామె 1:19; 15:27 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యిర్మీ 22:11-17—ఇతరుల నుండి అన్యాయంగా లాక్కున్నందుకు, వేరే ఘోరమైన పాపాలు చేసినందుకు రాజైన షల్లూమును (యెహోయాహాజును) యెహోవా ఖండించాడు

    • లూకా 19:2, 8—పన్ను వసూలుచేసే ముఖ్య అధికారి జక్కయ్య, ప్రజల దగ్గర అన్యాయంగా లాక్కున్నందుకు పశ్చాత్తాపపడి, వాటిని తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చాడు

    • అపొ 24:26, 27—అపొస్తలుడైన పౌలు అధిపతైన ఫేలిక్సు ఆశించిన డబ్బును ఇవ్వలేదు

అబద్ధాలు ఆడడం; ఇతరులను మోసం చేయడం

అబద్ధాలు” చూడండి

అబద్ధాలు ఆడడం; లేనిపోనివి కల్పించి చెప్పడం

అబద్ధాలు” చూడండి

అశ్లీల పుస్తకాలు, వీడియోలు, చిత్రాలు

అసభ్యకరమైన మాటలు లేదా అసభ్యకరమైన హాస్యం

ఎఫె 5:4; కొలొ 3:8

ఎఫె 4:29, 31 కూడా చూడండి

ఎగతాళి చేయడం

సామె 19:29; 24:9

సామె 17:5; 22:10; 2పే 3:3, 4 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 36:15-21—తను పంపించిన ప్రవక్తల్ని, సందేశకుల్ని తిరుగుబాటుదారులైన తన ప్రజలు ఎగతాళి చేసినప్పుడు యెహోవా వాళ్లను కఠినంగా శిక్షించాడు

    • యోబు 12:4; 17:2; 21:3; 34:7—నీతిమంతుడైన యోబుకు ఒక పెద్ద పరీక్ష వచ్చినప్పుడు అతన్ని ఎగతాళి చేశారు

గొడవ పడడం

గొడవ పడడం” చూడండి

గొడవలు; హింస

కీర్త 11:5; సామె 3:31; 29:22

1తి 3:2, 3; తీతు 1:7 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • నిర్గ 21:22-27—గొడవలు లేదా హింస వల్ల ఎవరికైనా దెబ్బ తగలడం గానీ ఎవరైనా చనిపోవడం గానీ జరిగితే, దానికి కారణమైన వాళ్లు శిక్షించబడాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది

గొప్పలు చెప్పుకోవడం

తాగుబోతుతనం; అతిగా తాగడం

సామె 20:1; 23:20, 29-35; 1కొ 5:11; 6:9, 10

ఎఫె 5:18; 1తి 3:8; తీతు 2:3; 1పే 4:3 కూడా చూడండి

మద్యపానం” కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 9:20-25—నోవహు అతిగా తాగడం వల్ల హాము, అతని కొడుకైన కనాను ఘోరమైన తప్పు చేయడానికి దారితీసింది

    • దాని 5:1-6, 30—బెల్షస్సరు రాజు తాగిన మత్తులో యెహోవాను అవమానించాడు; దానివల్ల తన ప్రాణాన్ని, తన రాజ్యాన్ని కోల్పోయాడు

తిండిబోతుతనం

సామె 23:20, 21; 28:7

లూకా 21:34, 35 కూడా చూడండి

తిట్టడం

మత్త 5:22; 1కొ 6:9, 10; ఎఫె 4:31

నిర్గ 22:28; ప్రస 10:20; యూదా 8 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 2స 16:5-8; 1రా 2:8, 9, 44, 46—యెహోవా ఎంచుకున్న రాజును శపించడం వల్ల షిమీ చెడు పర్యవసానాల్ని అనుభవించాడు

దొంగతనం

దొంగతనం” చూడండి

పోటీతత్వం; శత్రుత్వం

ప్రస 4:4; గల 5:26

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మార్కు 9:33-37; 10:35-45—అపొస్తలులు ముఖ్యమైన స్థానాల కోసం పోటీపడుతున్నారని గమనించి యేసు వాళ్లను పదేపదే సరిదిద్దాడు

    • 3యో 9, 10—దియొత్రెఫే సహోదరులందరిలో “ప్రముఖుడిగా ఉండాలని” కోరుకున్నాడు

బెదిరించడం

ఎఫె 6:9; 1పే 2:23

కీర్త 10:4, 7; 73:3, 8 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 4:15-21—ప్రకటనా పనిని ఆపించాలనే ఉద్దేశంతో మహాసభ సభ్యులు క్రీస్తు శిష్యుల్ని బెదిరించారు

రక్తాన్ని దుర్వినియోగం చేయడం

ఆది 9:4; ద్వితీ 12:16, 23; అపొ 15:28, 29

లేవీ 3:17; 7:26 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 1స 14:32-34—ఇశ్రాయేలీయులు జంతువుల మాంసాన్ని రక్తంతోపాటు తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు

లంచాలు ఇవ్వడం లేదా తీసుకోవడం

నిర్గ 23:8; కీర్త 26:9, 10; సామె 17:23

ద్వితీ 10:17; 16:19; కీర్త 15:1, 5 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 8:1-5—సమూయేలు కుమారులు, తమ తండ్రి మంచి ఆదర్శాన్ని అనుకరించే బదులు లంచాలు తీసుకుని, అన్యాయంగా ప్రవర్తించారు

    • నెహె 6:10-13—అధిపతైన నెహెమ్యాను భయపెట్టి యెహోవా పనిని ఆపించాలని శత్రువులు షెమయాకు డబ్బులిచ్చి అబద్ధ ప్రవచనం చెప్పించారు

లెక్కలేనితనం; అపవిత్రత; లైంగిక పాపం; అక్రమ సంబంధాలు

లైంగిక పాపాలు” చూడండి

విగ్రహపూజ

విగ్రహపూజ” చూడండి

విచ్చలవిడి విందులు

రోమా 13:13; గల 5:19, 21; 1పే 4:3

సామె 20:1; 1కొ 10:31 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • దాని 5:1-4, 30—బెల్షస్సరు రాజు “ఒక గొప్ప విందు” ఏర్పాటు చేశాడు; అప్పుడు అతను అతిగా తాగడం వల్ల, యెహోవాను దూషించడం వల్ల చనిపోయాడు

విభజనలు సృష్టించడం; తెగలను ప్రోత్సహించడం

సణగడం

1కొ 10:10; ఫిలి 2:14; యూదా 16

సం 11:1 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సం 14:1-11, 26-30—ఇశ్రాయేలీయులు మోషే మీద, అహరోను మీద సణిగినప్పుడు ప్రజలు తనమీదే సణిగినట్టు యెహోవా భావించాడు

    • యోహా 6:41-69—యూదులు యేసు మీద సణిగారు; కొంతమంది శిష్యులు ఆయన్ని వదిలేసి వెళ్లిపోయారు

హత్య

నిర్గ 20:13; మత్త 15:19; 1పే 4:15

మత్త 5:21, 22; మార్కు 7:21 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 4:4-16—యెహోవా కయీనుకు ప్రేమగా సలహా ఇచ్చినా, అతను దాన్ని పట్టించుకోకుండా నీతిమంతుడైన తన తమ్ముడు హేబేలును చంపేశాడు

    • 1రా 21:1-26; 2రా 9:26—దుష్టులైన అహాబు రాజు అలాగే యెజెబెలు రాణి అత్యాశతో నాబోతును, అతని కుమారులను చంపించారు

హానికరమైన పుకార్లు చెప్పడం; ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం