డబ్బు
డబ్బును ప్రేమించడం ఎందుకు ప్రమాదకరం?
“డబ్బు మీద, వస్తువుల మీద మోజు” చూడండి
కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించడం తప్పుకాదని బైబిలు ఎలా చూపిస్తుంది?
ప్రస 7:12; 10:19; ఎఫె 4:28; 2థె 3:10; 1తి 5:8, 18
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 31:38-42—తన మామ లాబాను అన్యాయంగా ప్రవర్తించినా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి యాకోబు అతని దగ్గర నిజాయితీగా పని చేశాడు; యెహోవా అతని కష్టాన్ని దీవించాడు
-
లూకా 19:12, 13, 15-23—యేసు చెప్పిన ఉదాహరణను బట్టి ఆ కాలంలో డబ్బులు సంపాదించడం కోసం పెట్టుబడి పెట్టడం మామూలు విషయమే అని అర్థమౌతుంది
-
అప్పు తీసుకునే విషయంలో, అప్పు ఇచ్చే విషయంలో ఎలాంటి బైబిలు సూత్రాలు ఉన్నాయి?
అనవసరమైన అప్పులు చేయకుండా ఉండడం ఎందుకు మంచిది?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
నెహె 5:2-8—నెహెమ్యా కాలంలో కొంతమంది ఇశ్రాయేలీయులు అప్పు తీసుకున్న వాళ్లతో కఠినంగా ఉండేవాళ్లు
-
మత్త 18:23-25—అప్పు తీసుకుని దాన్ని తిరిగి ఇవ్వని వ్యక్తికి శిక్షపడవచ్చని యేసు ఉదాహరణ మనకు గుర్తుచేస్తుంది
-
అవిశ్వాసులతో, సహోదర సహోదరీలతో లేదా బంధువులతో వ్యాపారంలోకి దిగే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఆది 23:14-20—శారాను సమాధి చేయడానికి కావాల్సిన పొలాన్ని, గుహను అబ్రాహాము కొంతమంది సాక్షుల ముందు కొన్నాడు; భవిష్యత్తులో ఎలాంటి గొడవలు, మనస్పర్థలు రాకూడదనే ఉద్దేశంతోనే అలా చేసి ఉంటాడు
-
యిర్మీ 32:9-12—యిర్మీయా ప్రవక్త తన బంధువుల దగ్గర పొలం కొనేటప్పుడు సాక్షుల ముందు క్రయపత్రాన్ని, నకలు పత్రాన్ని రాసి డబ్బులిచ్చాడు
-
డబ్బుల్ని ఎలా ఖర్చుపెట్టాలో ప్లాన్ చేసుకోవడం ఎందుకు మంచిది?
డబ్బుకు సంబంధించిన సమస్యలు సంఘంలో విభజనలు సృష్టించకుండా క్రైస్తవులు ఎందుకు జాగ్రత్తపడాలి?
రోమా 12:18; 2తి 2:24 కూడా చూడండి
డబ్బును ఎలా ఉపయోగిస్తే నిజమైన సంతోషాన్ని పొందుతాం?